సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
అందుకోసమైతే రాలేదు
25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.
డ్రగ్స్ కేసులో క్లీన్‌చిట్
కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్‌బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment