జీవితంపై విరక్తి చెందినవారు, ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని కొనసాగించాలనుకునేవారు సన్యాసం బాట పడుతుంటారు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni) కూడా అదే దారిలోకి వెళ్లాలని ఆశపడింది. ఇందుకోసం రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుంది.
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్
కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్‌జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమను మహామండలేశ్వర్‌గా ప్రకటించడాన్ని తప్పుపట్టారు.
ఏం చెప్పాలనుకుంటున్నారు?
హిమాంగి సఖి మాట్లాడుతూ.. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే మహామండలేశ్వర్‌గా మారింది. తన గతమేంటో అందరికీ తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. సడన్‌గా భారత్‌కు రావడం.. మహాకుంభమేళాకు హాజరవడం.. ఏకంగా సన్యాసిగా మారిపోవడం ఏంటో.. దీనిపై కచ్చితంగా విచారణ జరపాలి. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వర్ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్హత లేని మనిషికి గురువు హోదా ఎందుకిచ్చారు? ఇది అనైతికం అని మండిపడింది.
(చదవండి: మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్‌సేన్)
ఎవరీ మమతా కులకర్ణి?
1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మమతా కులకర్ణి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్‌బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్‌తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.
వివాదం
మమతా 2016లో ప్రియుడితో కలిసి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. ఏళ్ల తరబడి విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతేడాది ఆగస్టులో మమతకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అప్పట్లో టాప్‌లెస్ ఫోటోషూట్‌తోనూ వివాదాల్లోకెక్కింది.
చదవండి: మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?
Comments
Please login to add a commentAdd a comment