మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలో విశ్వక్.. లైలా అనే లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్‌లో అమ్మాయిలకే అసూయ పెట్టేంత అందంగా ముస్తాబయ్యాడు.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్‌కు చేదు అనుభవం
శుక్రవారం (జనవరి 24న) ఈ సినిమా నుంచి ఇచ్చుకుందాం బేబీ.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఓ వ్యక్తి విశ్వక్‌ను పిచ్చి ప్రశ్న అడిగాడు. లైలా గెటప్.. ఇండియా అంతటా ట్రెండ్ అవుతున్న మోసాలిసా అంత అందంగా ఉందని కొందరంటున్నారు. కేపీహెచ్‌బీ (కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు) ఆంటీలా ఉందని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించాడు.
ఎంత అన్యాయంరా?
ఈ ప్రశ్న విని షాకైన విశ్వక్ కొద్ది క్షణాలపాటు నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. తర్వాత తేరుకుని.. ఎంత అన్యాయంరా? ఆ పోలికేంటి? అంతర్జాతీయ అందగత్తెను తీసుకొచ్చి కూకట్‌పల్లిలో పెడ్తావా? అని సెటైర్ వేశాడు. హద్దూఅదుపు లేకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎలా అడుగుతారని పలువురూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా
లైలా సినిమా విషయానికి వస్తే.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మించారు. ఈ మూవీ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment