ప్రేమించుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, తర్వాత మళ్లీ ప్రేమలో పడటం.. ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. బాలీవుడ్ నటి సుష్మితా సేన్ కూడా ఎందరితోనో ప్రేమాయణం నడిపింది. కానీ ఏదీ పెళ్లిదాకా రాలేదు. ఆమె ప్రేమించినవారిలో మోడల్, నటుడు రోహ్మన్ షాల్ కూడా ఒకరు. అయితే మూడేళ్ల క్రితం వీళ్లు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ తర్వాత కూడా ఎన్నోసార్లు కలిసి కనిపించారు.
జనాలేమనునుకున్నా ఓకే
ఇకపోతే రోహ్మన్ ఇటీవలే అమరన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోహ్మన్ షాల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. 'జనాలేమనుకున్నా నేను పెద్దగా పెట్టించుకోను. వాళ్ల మాటలు నన్ను బాధించలేవు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నాతో నేను ఎంత నిజాయితీగా ఉంటున్నానో తెలుసు. జనాలు నా గురించి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా.. ఎలా మాట్లాడుకున్నా ఓకే..
మేమంతా ఒకే కుటుంబం
నేను ఏం ఆలోచిస్తున్నాను.. ఇప్పుడేం చేస్తున్నాను అనేదానిపైనే నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. నా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను, అనుభవాలను గౌరవిస్తాను. సుష్మితా సేన్, నేను కలిసి ఉండకపోయినా, నెలల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనుంటాను. మేమంతా ఒక కుటుంబంలాగే ఉంటాము. వారికోసం నేనున్నాను. కాబట్టి దీని గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment