mamata kulakarni
-
25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్
సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.అందుకోసమైతే రాలేదు25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.డ్రగ్స్ కేసులో క్లీన్చిట్కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
రొమాంటిక్ థ్రిల్లర్
వెంకటేశ్ గౌడ్, మల్లేష్ బి. అభయ్, మమతా కులకర్ణి, ప్రాచీ అధికారి ముఖ్య పాత్రల్లో రమేష్ అంక రూపొందించిన చిత్రం ‘సుడిగాలి’. చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సుడిగాలి’. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియోను ఈ నెలలో, సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా కంప్లీట్ చేయడానికి నిర్మాతల సహకారం మరువలేనిది’’ అన్నారు దర్శకుడు రమేష్. ఈ సినిమాకు కెమెరా: విద్యాసాగర్. -
హీరోయిన్ పై పోలీసు నిఘా
ముంబై: రూ. 2 వేల కోట్ల మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త వికీ గోస్వామిల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. గతవారం థానే పోలీసులు షోలాపూర్ ఔషధ తయారీ కర్మాగారం, థానేలోని వివిధ ప్రాంతాల నుంచి 18.50 టన్నుల ఎఫెడ్రై న్, 2.5 టన్నుల ఎసిటిక్ ఎన్హైడ్రై డ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి థానే పోలీసు కమిషనర్ పరాంబిర్ సింగ్ మాట్లాడుతూ... నైజీరియాకు చెందిన సిప్రెన్ చినాస్సాతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. మరో నలుగురి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. కెన్యాలో గోస్వామిని కలిసి ఆ దేశంలో మాదకద్రవ్యాల కర్మాగారం ఏర్పాటుపై చర్చించామంటూ నిందితులు విచారణలో వెల్లడించారని కమిషనర్ తెలిపారు. 2014లో వికీ, మమతలను మాదకద్రవ్యాల సరఫరా నేరంపై కెన్యా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరు బెయిల్‌పై ఉన్నారు.