
వెంకటేశ్, మమత
వెంకటేశ్ గౌడ్, మల్లేష్ బి. అభయ్, మమతా కులకర్ణి, ప్రాచీ అధికారి ముఖ్య పాత్రల్లో రమేష్ అంక రూపొందించిన చిత్రం ‘సుడిగాలి’. చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సుడిగాలి’. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియోను ఈ నెలలో, సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా కంప్లీట్ చేయడానికి నిర్మాతల సహకారం మరువలేనిది’’ అన్నారు దర్శకుడు రమేష్. ఈ సినిమాకు కెమెరా: విద్యాసాగర్.
Comments
Please login to add a commentAdd a comment