Venkatesh Goud
-
దివ్య మరెవరికీ దక్కకూడదనే..
గజ్వేల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత గురువారం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 18న గజ్వేల్‌లో హత్యకు గురైన దివ్య తండ్రి లక్ష్మీరాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రాత్రి వేములవాడలో ప్రత్యేక బృందం పోలీసులు వెంకటేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్ళాడని, ఆ తర్వాత రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా బుధవారం రాత్రి వేములవాడకు వచ్చాడని పోలీసులు తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెంకటేశ్ చెప్పాడని, నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఇన్చార్జి సీపీ పేర్కొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. నిందితునికి వైద్య పరీక్షలు అరెస్టు అనంతరం నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద విలేకరులు వెంకటేశ్‌గౌడ్‌ను సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రశ్నించగా.. అతను నోరు విప్పలేదు. సుమారు 15 నిమిషాలపాటు వైద్య పరీక్షలు సాగాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని గట్టి బందోబస్తు మధ్య గజ్వేల్‌లోని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. -
సేవకుడిలా పని చేస్తా..
సాక్షి, పలమనేరు : మంత్రి నియోజకవర్గమని పేరేగానీ గ్రామాల్లో కాని, పట్టణంలో కానీ తాగేందుకు నీళ్లులేవు. అందుకే పలమనేరులో ఇంటింటికీ నళ్లా, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే తన ధ్యేయమని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్.వెంకటేశగౌడ తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అమరనాథ రెడ్డి నియోజకవర్గంలో చేసిందేమీలేదన్నారు. రూ.900 కోట్లతో అభివృద్ది చేశామంటూ గొప్పలు చెబుతున్నారేగానీ దాంట్లో రూ.300 కోట్లదాకా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో కనీసం కుటీర పరిశ్రమైనా కల్పించారా అని సూటిగా ప్రశ్నించారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి, పెద్దిరెడ్డి అండతో తాను రాజీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే పేదల కష్టాలు తెలిసినా వానిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రశ్న: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? జవాబు: నేను ఏడేళ్లుగా నియోజకవర్గంలో ఎన్వీజీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నా. పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించడం నుంచి స్థానికంగానే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందాను. నాయకుడు అంటే అలానే ఉండాలనుకున్నా. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నా. ప్రశ్న: కుటుంబ నేపథ్యం గురించి జవాబు:మాది పలమనేరు నియోజకవర్గంలోని వీకోటమండలం తోటకనుమ . తండ్రిపేరు చెంగేగౌడ. నా సతీమణి పావణి గృహిణి. నాకు ఇద్దరు సంతానం. నా విద్యాభ్యాసం పక్కనే ఉన్న వీ.కోటలో సాగింది. 9వతరగతి దాకా చదువుకున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగళూరుకు వెళ్లా. అక్కడ తాపీ పనులు చేశా. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన కూలీలను గ్రూపుగా చేసి చిన్నచిన్న పనులు ఒప్పుకున్నాను. అదే రంగంలో అంచలంచెలుగా ఎదిగి బిల్డర్‌గా స్థిరపడ్డాను. ప్ర: ఐదేళ్ల టీడీపీ పాలనపై ఏమంటారు జ: టీడీపీ నాయకులు నిధులు దోచుకోవడానికే సరిపోయింది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. మంత్రి లేనిపోని మాటలు, ప్రజలను ఏమార్చేందుకు శిలాఫలకాలు తప్పా ఇక్కడ చేసిందేమీ లేదు. ప్ర:నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు... జ: నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఇది మెట్టప్రాంతం కాబట్టి రైతుల సాగునీటికి ఇబ్బందులున్నాయి. పెండింగ్‌లోని గంగన్న శిరస్సు, కైగల్ ఎత్తిపోతల, హంద్రీనీవాతో చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఏనుగుల సమస్య, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ఇలా చాలా సమస్యలున్నాయి. ప్ర: ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు? జ: నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇంతవరకు మా సొంత మండలానికి ఏ రాజకీయపార్టీలోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నా ద్వారా ఆ అవకాశం కల్పించింది. వెంకటగౌడ ఎమ్మెల్యేగా బాగా పనిచేశాడబ్బా అని జనం చెప్పుకుంటే చాలు. ఏడాదికి ఒక్కసారి .. ఐదేళ్లలో కనీసం ఐదుసార్లు ఇంటింటికీ వెళతాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
సుడిగాలి వస్తోంది
వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత ముఖ్య తారలుగా రమేష్ అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘సుడిగాలి’. శివపార్వతి క్రియేషన్స్‌పై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. రాప్ రాక్ షకీల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎమ్మెల్సీ రాములు నాయక్, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ‘సుడిగాలి’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు రాములు నాయక్. ‘‘యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రంలో సుమన్‌గారు మంచి పాత్ర చేశారు. సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు’’ అన్నారు రమేష్ అంకం. ‘‘సుడిగాలి’తో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకటేశ్. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సమర్పణ: చెట్టుపల్లి లక్ష్మి. -
మీ గెలుపు పెద్దిరెడ్డి భిక్షకాదా?
పలమనేరు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పలమనేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేవా ? ఆయన భిక్షతో గెలిచి నేడు అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం మంత్రి అమరనాథరెడ్డికి తగదని వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాడు మీరు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తే మన పార్టీని నమ్ముకుని వచ్చారు.. పలమమేరులో మిమ్మల్ని గెలిపిం చాలని పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన విషయ మై ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని మరిచి పెద్దిరెడ్డిని విమర్శించడం మంచిది కాదు. దీన్నీ ప్రజలు గమనిస్తున్నార’ని తెలిపారు. సీనియర్ నాయకుడు సీవీ కుమార్ మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమరనాథరెడ్డికి లేదని చెప్పారు. మంత్రి అనే ధైర్యంతో ఎక్కడైనా పోటీచేయండిగానీ అధికారం ఉందని విలువలు లేని రాజకీయాలు చేయడం మంచిదికాదన్నారు. పట్టణ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఒక విమర్శచేస్తే తాము వంద చేస్తామని, గతాన్ని మరిచి మాట్లాడడం బాధాకరమని చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బీఫామ్ ఇస్తే ఫ్యాను గుర్తుపై గెలిచి నేడు తమరు మంత్రి అయ్యారని, ఓడివుంటే ఆ పదవి దక్కేదా ? అని ప్రశ్నించారు. ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద మాట్లాడుతూ గెలిపించినవారినే విమర్శించడం తగదన్నారు. కౌన్సిలర్లు కమాల్, మూర్తి, మున్నా, గోవిందప్ప, షబ్బీర్, నాయకులు నయాజ్, నాగరాజు, రాజారెడ్డి, శశిధర్, జావీద్, సోమశేఖర్ రెడ్డి,అక్బర్, ముజ్జు, సేటు తదితరులు పాల్గొన్నారు. -
రొమాంటిక్ థ్రిల్లర్
వెంకటేశ్ గౌడ్, మల్లేష్ బి. అభయ్, మమతా కులకర్ణి, ప్రాచీ అధికారి ముఖ్య పాత్రల్లో రమేష్ అంక రూపొందించిన చిత్రం ‘సుడిగాలి’. చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సుడిగాలి’. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియోను ఈ నెలలో, సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా కంప్లీట్ చేయడానికి నిర్మాతల సహకారం మరువలేనిది’’ అన్నారు దర్శకుడు రమేష్. ఈ సినిమాకు కెమెరా: విద్యాసాగర్. -
పట్టణంలో సినిమా షూటింగ్
సంగారెడ్డి జోన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరం సమీపంలో శివ పార్వతీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సుడిగాలి’ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకటేష్ గౌడ్, మల్లేష్ బీ అభయ్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పడి వరకు 90 శాతం షూటింగ్ పూర్తి అయిందని, త్వరలో ఆడియో రిలీజ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆదివారం ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాతలే హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి క«థ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రమేష్ అంకం, కోరియోగ్రాఫర్ బాలకృష్ణ, పాటలు శ్రీను, కెమెరా విద్యాసాగర్, సంగీతం రావు రాక్ షఖీల్ అందిస్తున్నారు. -
ఎంపీ జన్మదినం తెచ్చిన తంటా
ఎంపీపీ సహా నలుగురి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సస్పెన్షన్ వేములవాడ: కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్కు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధుల సస్పెన్షన్‌కు దారి తీశాయి. వేములవాడ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు శని వారం ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదిన వేడుకలను భారీఎత్తున నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. తన ఇలాఖాలో ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఏమిటంటూ స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు కోపోద్రిక్తులయ్యారు. వేడుకలు నిర్వహించినందుకు వివిధ కారణాలు చూపుతూ ఎంపీపీ రంగు వెంకటేశ్గౌడ్తోపాటు నాయకులు చిలుక పెంటయ్య, పూడూరి రాజిరెడ్డి, రాజాగౌడ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. వీరికి టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చర్య గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. -
సుడిగాలి దెయ్యమా?
‘సుడిగాలి’ అనగానే చాలామందిలో దెయ్యం అనే భావన ఉంది. మరి సుడిగాలి నిజంగా దెయ్యమా? కాదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సుడిగాలి’. వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచి అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రల్లో రమేశ్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధార్ మల్లేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లయన్ సాయి వెంకట్ కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు. రంగ రవీందర్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ-‘‘చాలామంచి కథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుడిగాలిని కథాంశంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రమిది. హారర్‌తో పాటు వినోద అంశాలన్నీ ఉంటాయి. ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలను’’ అని దర్శకుడు తెలిపారు. నరసింహ వర్మ, సుహాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, సమర్పణ: చెట్టిపల్లి లక్ష్మి. -
సమ్మె చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
రేషన్ డీలర్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక దేవర పల్లి : రేషన్ డీలర్లు ఈ నెల 21 నుంచి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు డీలర్ల సంఘం నేతలను హెచ్చరించారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవనంలో కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ వివరాలను వెంకటేష్ గౌడ్ ఫోన్లో స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ పాస్ విధానం వల్ల జీవనోపాధి కోల్పోయామని, డీలర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లను ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ డీలర్ల సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని, బంద్‌లు, ధర్నాలు వంటివి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు. అయితే డీలర్లు కాని వ్యక్తులు రాష్ట్రంలో నాయకులుగా చెప్పుకొంటూ డీలర్లను తప్పుదారి పట్టిస్తున్నారని, సమ్మె ప్రకటనకు సంఘానికి సంబంధం లేదని సీఎం చంద్రబాబుకు తాము వివరించినట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు. చంద్రన్న కానుకలు, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి ప్రభుత్వానికి సహకరిస్తామని ముఖ్యమంత్రికి హమీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి గిరి రాజా, కోశాధికారి టీఏవీవీఎల్ నరసింహమూర్తి, నాయకులు యు. అప్పలరాజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారన్నారు. వెల్లడించిన డీలర్ల సంఘం రాష్ర్ట నేతలు -
సస్పెన్స్‌తో ప్రేమ
శివ, దివ్యా గౌడ్ జంటగా బేబి స్ఫూర్తి సమర్పణలో శ్రీ రాధ చంద్రీశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. బోయినిపల్లి వెంకటేశ్ గౌడ్ దర్శకుడు. లవ్, సెంటిమెంట్, సస్పెన్స్, కామెడీ మేళవించిన ప్రేమకథా చిత్రం ఇదని సహనిర్మాతలు గున్న మల్లేశ్ యాదవ్, మహ్మద్ గౌస్ చెప్పారు. -
శబరిమలలో భక్తుడికి బ్రెయిన్ స్ట్రోక్
పట్టించుకోని కేరళ ప్రభుత్వం భాష రాకపోవడంతో ఇబ్బందులకు గురైన సహచరులు నాగోలు: శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు సహచరులు అష్టకష్టాలుపడ్డారు. వివరాలు.. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటకు చెందిన భీమగాని సోషలిజం అలియాస్ వెంకటేష్‌గౌడ్ ఆటోనగర్‌లో రేడియం ఆర్టిస్ట్. ఈనెల 9న అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల వెళ్లాడు. 11న ఉదయం పంబానదిలో స్నానం చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా వెంకటేష్‌గౌడ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే సహచరులు అతడిని కొట్టాయం గాంధీనగర్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి భాష రాక.. డాక్టర్లు చెప్పేది అర్థం కాకవారు ఇబ్బందులుపడ్డారు. కొట్టాయం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆస్పత్రి వర్గాలు సరైన చికిత్సను అందించలేకపోయాయి. మరోవైపు వెంకటేష్‌గౌడ్ కుటుంబీకులకు కేరళ వెళ్లే వీలు లేకపోవడం వారు మానసిక వేదనకు గురయ్యారు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నించారు. కొచ్చిన్ నుంచి విమానంలో తీసుకొద్దామని టికెట్ బుక్ చేసినా ఫలితం లేదు. చివరికి అంబులెన్స్‌లో నగరానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.