
సంగారెడ్డి జోన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరం సమీపంలో శివ పార్వతీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సుడిగాలి’ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకటేష్ గౌడ్, మల్లేష్ బీ అభయ్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పడి వరకు 90 శాతం షూటింగ్ పూర్తి అయిందని, త్వరలో ఆడియో రిలీజ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆదివారం ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాతలే హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి క«థ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రమేష్ అంకం, కోరియోగ్రాఫర్ బాలకృష్ణ, పాటలు శ్రీను, కెమెరా విద్యాసాగర్, సంగీతం రావు రాక్ షఖీల్ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment