Sudigali
-
‘కాలింగ్ సహస్ర’ మూవీ గురించి సరదా సరదాగా
-
డిసెంబర్ 1st థియేటర్ కి వస్తున్నాము సపోర్ట్ చేయండి
-
సుధీర్ తో నటించాలని నా కోరిక..!
-
మరో చిత్రంతో వస్తున్న 'గాలోడు'.. షూటింగ్ ప్రారంభం!
సుడిగాలి సుధీర్ మరో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్గా దివ్య భారతి నటించనుంది. తాత్కాలికంగా ఎస్ఎస్4తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా.. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) హీరో సుధీర్ మాట్లాడుతూ..'ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం' అని అన్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. 'సుధీర్‌కు ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు.' అని అన్నారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) -
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్ (ఫొటోలు)
-
జబర్దస్త్ నుంచి అందుకే బయటకు వచ్చాను : సుడిగాలి సుధీర్
-
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాలోడు’.. రిలీజ్‌కు రెడీ
సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుధీర్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేసి, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ తర్వాత నాకు మరో అవకాశం ఇచ్చిన రాజశేఖర్‌గారికి ధన్యవాదాలు. ‘గాలోడు’ ట్రైలర్‌కు మంచి స్పందన రావడం హ్యాపీ. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కమర్షియల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్‌రెడ్డి. ‘‘కాలేజ్ యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు గెహ్నా సిప్పి. -
సుధీర్ తో కలిసి మూవీ చేయకపోవడానికి కారణం అదే : రష్మీ
-
త్రీ మంకీస్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
సుడిగాలి వస్తోంది
వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత ముఖ్య తారలుగా రమేష్ అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘సుడిగాలి’. శివపార్వతి క్రియేషన్స్‌పై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. రాప్ రాక్ షకీల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎమ్మెల్సీ రాములు నాయక్, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ‘సుడిగాలి’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు రాములు నాయక్. ‘‘యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రంలో సుమన్‌గారు మంచి పాత్ర చేశారు. సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు’’ అన్నారు రమేష్ అంకం. ‘‘సుడిగాలి’తో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకటేశ్. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సమర్పణ: చెట్టుపల్లి లక్ష్మి. -
రొమాంటిక్ థ్రిల్లర్
వెంకటేశ్ గౌడ్, మల్లేష్ బి. అభయ్, మమతా కులకర్ణి, ప్రాచీ అధికారి ముఖ్య పాత్రల్లో రమేష్ అంక రూపొందించిన చిత్రం ‘సుడిగాలి’. చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్ పతాకంపై చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సుడిగాలి’. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియోను ఈ నెలలో, సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా కంప్లీట్ చేయడానికి నిర్మాతల సహకారం మరువలేనిది’’ అన్నారు దర్శకుడు రమేష్. ఈ సినిమాకు కెమెరా: విద్యాసాగర్. -
పట్టణంలో సినిమా షూటింగ్
సంగారెడ్డి జోన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరం సమీపంలో శివ పార్వతీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సుడిగాలి’ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకటేష్ గౌడ్, మల్లేష్ బీ అభయ్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పడి వరకు 90 శాతం షూటింగ్ పూర్తి అయిందని, త్వరలో ఆడియో రిలీజ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆదివారం ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాతలే హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి క«థ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రమేష్ అంకం, కోరియోగ్రాఫర్ బాలకృష్ణ, పాటలు శ్రీను, కెమెరా విద్యాసాగర్, సంగీతం రావు రాక్ షఖీల్ అందిస్తున్నారు. -
సుడిగాలి దెయ్యమా?
‘సుడిగాలి’ అనగానే చాలామందిలో దెయ్యం అనే భావన ఉంది. మరి సుడిగాలి నిజంగా దెయ్యమా? కాదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సుడిగాలి’. వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచి అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రల్లో రమేశ్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధార్ మల్లేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లయన్ సాయి వెంకట్ కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు. రంగ రవీందర్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ-‘‘చాలామంచి కథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుడిగాలిని కథాంశంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రమిది. హారర్‌తో పాటు వినోద అంశాలన్నీ ఉంటాయి. ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలను’’ అని దర్శకుడు తెలిపారు. నరసింహ వర్మ, సుహాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, సమర్పణ: చెట్టిపల్లి లక్ష్మి.