మాట్లాడుతున్న వెంకటేగౌడ, నేతలు
పలమనేరు: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పలమనేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేవా ? ఆయన భిక్షతో గెలిచి నేడు అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం మంత్రి అమరనాథరెడ్డికి తగదని వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాడు మీరు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తే మన పార్టీని నమ్ముకుని వచ్చారు.. పలమమేరులో మిమ్మల్ని గెలిపిం చాలని పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు వైఎస్సార్‌సీపీ ఓట్లతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన విషయ మై ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని మరిచి పెద్దిరెడ్డిని విమర్శించడం మంచిది కాదు. దీన్నీ ప్రజలు గమనిస్తున్నార’ని తెలిపారు.
సీనియర్ నాయకుడు సీవీ కుమార్ మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమరనాథరెడ్డికి లేదని చెప్పారు. మంత్రి అనే ధైర్యంతో ఎక్కడైనా పోటీచేయండిగానీ అధికారం ఉందని విలువలు లేని రాజకీయాలు చేయడం మంచిదికాదన్నారు. పట్టణ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఒక విమర్శచేస్తే తాము వంద చేస్తామని, గతాన్ని మరిచి మాట్లాడడం బాధాకరమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి బీఫామ్ ఇస్తే ఫ్యాను గుర్తుపై గెలిచి నేడు తమరు మంత్రి అయ్యారని, ఓడివుంటే ఆ పదవి దక్కేదా ? అని ప్రశ్నించారు. ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద మాట్లాడుతూ గెలిపించినవారినే విమర్శించడం తగదన్నారు. కౌన్సిలర్లు కమాల్, మూర్తి, మున్నా, గోవిందప్ప, షబ్బీర్, నాయకులు నయాజ్, నాగరాజు, రాజారెడ్డి, శశిధర్, జావీద్, సోమశేఖర్ రెడ్డి,అక్బర్, ముజ్జు, సేటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment