Amarnath Reddy
-
ఆరు నెలల్లో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: అమర్నాథ్రెడ్డి
సాక్షి,అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం(డిసెంబర్24) రాజంపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది.ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. -
కదిరి మండలానికి చెందిన అమర్నాథ్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు
-
పవన్ ఫ్యాన్స్ కూడా అమర్ నాథ్ వైపు..
-
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
పచ్చ కుట్ర భగ్నం.. టీడీపీ నేతలే చంపారు
-
‘శవా’లెత్తిపోతున్న టీడీపీ
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్సీపీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ నేతలు శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్యలు జరిగినా రాజకీయ రంగు పులుముతున్నారు. టీడీపీలో ఏనాడూ తిరగని వ్యక్తిని కూడా తమ కార్యకర్తగా చెప్పుకుంటూ శవ రాజకీయాలకు తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలం కుటాలపల్లిలో అమరనాథ్‌రెడ్డి అనే వ్యక్తి సోమవారం వేకువజామున హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతడిని చంపారు. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎవరిపైనా అనుమానం లేదని అమర్నాథ్రెడ్డి భార్య సుధమ్మ చెబుతోంది. ఎవరితోనూ భూ సమస్యలు, ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు లేవని, ఎందుకు చంపారో పోలీసులే తేల్చి చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం రాత్రి పొలానికి వెళ్లిన తన భర్త ఉదయం ఇంటికి రాలేదని, ఆరా తీయగా హత్యకు గురైనట్టు తేలిందని ఆమె చెప్పారు. ‘పల్లె’ రాద్ధాంతం హతుడు అమరనాథ్‌రెడ్డి ఏనాడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించలేదు. అయినప్పటికీ ఈ హత్యకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు టీడీపీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. పల్లె చెప్పిన వెంటనే నిజానిజాలు కూడా తెలుసుకోకుండా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని పోలీసులు చెబుతున్నా.. వినకుండా అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. డీఎస్పీ ఏమంటున్నారంటే.. అమరనాథ్‌రెడ్డి కేవలం వ్యక్తిగత కారణాలతోనే హత్యకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామన్నారు. హత్య వెనుక ఎవరు ఉన్నా.. చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అమరనాథ్‌రెడ్డి హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణమూ లేదని ఆయన స్పష్టం చేశారు. -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్‌రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్‌రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
విశాఖలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ
-
రాజంపేటలో వాల్మికి విగ్రహావిష్కరణ
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ వాల్మీకి సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిలు ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ వాల్మికుల సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. వాల్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన వాల్మికి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి సీతారామ,లక్ష్మణ, ఆంజనేయులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, రామాయణం సృష్టికర్త వాల్మీకి మహర్షి అని కొనియాడారు. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
పవన్‌వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్) గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్నాథ్, ఐటీశాఖ మంత్రి దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..' ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. -
మానవ జనాభా విస్ఫోటాననికి సైన్స్ కారణమా..?
1950 - 2020 యుద్ధాలు , కరువు కాటకాలు , అంటు రోగాలు - మానవ జాతి చరిత్ర లో అది ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా మరణాలు ఎక్కువగా సంభవించేవి . ఒకప్పుడైతే వైద్య సదుపాయాలు కూడా పెద్దగా ఉండేవి కావు . గర్భస్థ దశలోనే మరణించే శిశువులు , పుట్టినా అంటు రోగాలతో , పోషకాహార లోపాలతో మరణించే వారు .... ప్లేగు , కలరా లాంటి అంటు రోగాలు కరువులు , యుద్ధాలు ..... వెరసి మరణాలు నిత్యకృత్యాలు. సగటు జీవనాయుర్దాయం 40 - 50. అరవై ఏళ్ళు బతికితే అదో పండుగ . పుట్టిన పది మందిలో తొమ్మిది మంది ఆ లోపే పోయేవారు . 20 వ శతాబ్దంలో సైన్స్ అభివృద్ధి చెందింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం యుద్ధం లాంటి చిన్న యుద్ధాలు జరిగిన మాట వాస్తవం. కానీ గతం తో పోలిస్తే యుద్ధాల సంఖ్య , మరణాలు రెండూ తక్కువే . బహుశా మానవ జాతి చరిత్ర లో 1950 - 2020 కాలం అత్యంత శాంతియుత కాలం . మరణాలు తక్కువ . హరిత విప్లవం లాంటి వాటి వల్ల తిండికి కొరత లేకుండా పోయింది . ప్రపంచం లోని వివిధ దేశాలు సంక్షేమ పథకాలు అమలు చేసి తిండికి పెద్దగా కొరత లేకుండా చేసాయి (కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం... పాపం .. ఇంకా అదే స్థితి ) 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లు . ఇప్పుడు 800 కోట్లు . అంటే 70 ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు దాటి పెరిగింది . అటుపై గేట్ల తాత రంగంలోకి దిగాడు . మానవ జనాభా విస్ఫోటాననికి కారణం సైన్స్ . ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది అతని పద్దతి ... మరో వందేళ్లకు మన వారసులు చరిత్ర పుస్తకాల్లో (పుస్తకాలూ ఉండవు.. క్లౌడ్స్ .. వెబ్ పేజీ లు .. ఇంకా ఇలాంటివి) ఇలాంటి పాఠాన్ని చదువుతారేమో . అన్నట్టు ఇప్పుడు అన్ని వేరియెంట్లకు కలిపి ఒక కొత్త బూస్టర్ వస్తోంది . అంటే నిన్నటి దాకా ఇచ్చిన బూస్టర్ పనికిరానిదా ? టీకాలపైనా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక సంఘం కోర్ట్ ను ఆశ్రయించింది . గత వారం రోజుల్లో నేను కనీసం మూడు వీడియో లు / పోస్ట్ లు చూసాను . డాక్టర్లే టీకాల అసలు బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు . మరి ఎవరి పై కేసులు పెడుతుందో ఆ సంఘం ! సైన్స్ అంటే ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి . పరీక్షకు నిలవాలి . అంతే కానీ మేము ఏమి చెప్పినా ఎవరూ ప్రశ్నించకూడదు .. గుడ్డిగా మేము చెప్పిందే వినాలి అంటే ? ఇది సైన్స్ కాదు . మధ్య యుగం నాటి మతం . పోనీ ఒక పని చెయ్యండి . ఊరూరా ఉచిత టెస్టింగ్ కేంద్రాలు పెట్టండి . ఇంటింటికి తిరిగి బలవంతంగా సూదులు పొడిచినట్టే అందరికీ టెస్ట్ చేయండి . సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బాధ్యత వహించాలి . లేదని గ్యారంటీ ఇవ్వాలి . దాన్ని తయారు చేసినవాడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడు. ఎవడో వచ్చి పొడిచిపోతాడు . ఎవడైనా పొతే దానికి గాలి నీరు నిప్పు కారణం అని బొంకులాట. జనాల అజ్ఞానికి అంతం లేదు . ప్రపంచం మరో వందేళ్లల్లో ఎంత జనాభా భారాన్ని తగ్గించుకోనుందో . - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
అమ్మ ‘అమరనాథా’.. మాజీ మంత్రి ప్రాపకంలోనే ‘పుష్ప’రాజులు
ఎల్లో గ్యాంగ్ ... అదేనండి ‘పచ్చ’ నేతలు.. ఇంకా చెప్పాలంటే వాస్తవాలను తొక్కిపెట్టి విష ప్రచారం చేసే టీడీపీ నాయకులు... అందుకు వత్తాసు పలికే మీడియాలు తిమ్మని బమ్మిని చేసి... తప్పుడు ప్రచారాలకు పాల్పడే టీడీపీ నేతలు కొంతకాలంగా పెద్దాయన, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పట్టుబడిన ఎర్రచందనం కేసు నిందితుల్లో ఏ-4 అభినవ్... మంత్రి పెద్దిరెడ్డితో దిగిన ఫొటోను ప్రచురించి తమదైనశైలిలో విషపు బుద్ధిని బయట పెట్టుకున్నారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ-4 అభినవ్ మాత్రమే కాదు ఆ కేసులోని ఏ–3 అనిల్ కుడా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమరనాథరెడ్డి శిష్యులుగా తేలింది. ఆయనతో నిందితులిద్దరూ దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్వపరాలిలా ఉన్నాయి. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం సాక్షి ప్రతినిధి, తిరుపతి: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండల సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని బేటనూరు వద్ద ఇటీవల ఆ రాష్ట్ర పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు యువకులను పట్టుకున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అనుమానం రాకుండా ఖరీదైన కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.50 లక్షల విలువైన దుంగలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పట్టుబడిన వారిలో ఏ–4గా ఉన్న అభినవ్‌ది బైరెడ్డిపల్లి మండలం, గొల్లచీమనపల్లి గ్రామం. ఇతను ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యునిగా ఉన్నాడు. కొన్నాళ్లు వైఎస్సార్సీపీలో తిరిగినప్పటికీ అతని చెడు ప్రవర్తన ముందే పసిగట్టిన జిల్లా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి అతను ముందు నుంచీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శిష్యుడిగానే పేరొందాడు. టీడీపీ నేతలతోనే సన్నిహితంగా మెలిగేవాడు. గతంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి గొల్లచీమనపల్లిలోని అభినవ్ ఇంటికి సైతం వెళ్లినట్టు టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ముందుగానే సోషల్ మీడియాలో పోస్టింగులు గుమ్మడికాయల దొంగ ఎవరంటే ముందుగానే భుజాలు తడుముకున్నట్టు మాజీ మంత్రి అమరనాథరెడ్డి అభినవ్ వైఎస్సార్సీపీ నాయకులతో ఉన్న ఫొటోలను సంఘటన జరిగిన వెంటనే తన ఫేస్బుక్లో అప్డేట్ చేశారు. ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డ నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి దీనివెనుక ఎవరున్నారని కూడా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఈ నెపాన్ని అధికారపార్టీ మీదకు నెట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులతో అభినవ్ దిగిన ఫొటోలను పోస్టింగులు చేశారు. అభినవ్‌కు తనతో సంబంధాలున్నాయని తెలిసిపోతుందనే భయంతోనే ఇలా చేసి దీన్ని కూడా రాజకీయలబ్ధి కోసం వాడుకునేందుకు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ఇటీవలే అమరనాథరెడ్డిని కలిసిన ఏ–3 అనిల్ ఇక ఇదే కేసులో ఏ–3గా ఉన్న అనిల్‌కుమార్‌ది పలమనేరు పట్టణంలోని బజారువీధి. ఇతను మూడేళ్లుగా బెంగళూరుకు చెందిన గణేష్ యాదవ్ అనే వ్యక్తి వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంటున్నాడు. అయన స్థానికంగా చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో కీలకంగా ఉంటున్నాడు. తాజాగా కర్ణాటక పోలీసులకు చిక్కకముందు కూడా అనిల్‌కుమార్ మాజీ మంత్రి అమరనాథరెడ్డి స్వగృహంలో కలసి ఆయన్ను ఓ శుభకార్యక్రమానికి ఆహా్వనించాడు. ఇవన్నీ చూస్తుంటే ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ నిందితులు మాజీ మంత్రికి బాగా పరిచయస్తులేననే విషయం స్పష్టమవుతోంది. వారం ముందే అభినవ్ని సస్పెండ్ చేశాం ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఎంపీటీసీ అభినవ్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా సదరు ఎంపీటీసీపై ఆరోపణలు రావడంతో విచారించిన నేపథ్యంలో అనుమానాలు తలెత్తాయని, సంజాయిషీ ఇవ్వాలని నోటీసు జారీచేశామని వివరించారు. కానీ అతను స్పందించకపోవడంతో ఏప్రిల్ 23న అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు అతనితో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు కూడా అందించామని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజూ వందల సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫొటోలు దిగుతారని, దానిని పట్టుకుని ఎల్లో మీడియా, టీడీపీ విష ప్రచారాలు చేయడం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాళ్లు టీడీపీ నేత అమరనాథరెడ్డి శిష్యులే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నలుగురు నిందితుల్లో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులు ఉండటం, వారిద్దరూ టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథరెడ్డి శిష్యులు కావడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాజుపల్లి క్రాస్ వద్ద కర్ణాటక సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేసి.. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు యువకులను పట్టుకున్నారు. ఆ కేసులో ఏ–4గా ఉన్న ఎంపీటీసీ అభినవ్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దిగిన ఫొటోను టీడీపీ మీడియాతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ వాస్తవమేంటంటే ఏ–4 అభినవ్‌తో పాటు.. ఏ–3 అనిల్ కూడా అమరనాథరెడ్డి శిష్యులుగా తేలింది. అమరనాథరెడ్డితో నిందితులిద్దరూ దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఏ–4గా ఉన్న అభినవ్‌ది బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి. కొన్నాళ్లు వైఎస్సార్సీపీలో ఉన్నా అతని చెడు ప్రవర్తన ముందే పసిగట్టిన జిల్లా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాస్తవానికి అతను ముందు నుంచీ అమరనాథరెడ్డి శిష్యుడిగానే పేరొందాడు. టీడీపీ నేతలతోనే సన్నిహితంగా మెలిగేవాడు. ఇక ఇదే కేసులో ఏ–3గా ఉన్న అనిల్‌కుమార్‌ది పలమనేరు పట్టణంలోని బజారువీధి. తాజాగా కర్ణాటక పోలీసులకు చిక్కక ముందు కూడా అమరనాథరెడ్డిని ఆయన గృహంలో కలసి ఆయన్ను ఓ కార్యక్రమానికి ఆహ్వానించాడు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ముందుగానే భుజాలు తడుముకున్న చందాన వైఎస్సార్సీపీ నాయకులతో అభినవ్ ఉన్న ఫొటోలను అమరనాథరెడ్డి తన ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అభినవ్‌కు తనతో సంబంధాలున్నాయని తెలిసిపోతుందనే భయంతోనే ముందుగానే పచ్చ మీడియాలో హోరెత్తించారని చెప్పుకొంటున్నారు. ఇక ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఎంపీటీసీ అభినవ్‌కు, వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా సదరు ఎంపీటీసీపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. -
డెత్ గేమ్ టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున
అమర్నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్ హీరో హీరోయిన్లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డెత్ గేమ్’. కేసీ సూరి, రాజశేఖర్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను నాగార్జున విడుదల చేశారు. టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం. కేవలం మ్యూజిక్‌తోనే టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అమర్నాథ్. ‘‘టాకీ పార్ట్ పూర్తయింది. మార్చిలో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చేరన్. ఈ సినిమాకు మాటలు: శ్రీనివాస్ చింత, పాటలు: వరికుప్పల యాదగిరి, సంగీతం: ఎమ్.ఎమ్ మహి. -
ఐడీ కార్డులు చూపించాలంటూ మాజీ మంత్రి దాదాగిరి
-
విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం
-
అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే..
వి.కోట(చిత్తూరు జిల్లా): పార్టీలకు రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను టీడీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. పార్టీ రంగులతో కూడిన కండువాలు ధరించి, పార్టీ పతాకాలను చేతబట్టి ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో వి.కోట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య పేరు ఖరారైంది. దీంతో గురువారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ మండల నేతలు టీడీపీ రంగుతో కూడిన కండువాలు ధరించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో బాధ్యతాయుత పదవి చేపట్టిన ఓ మాజీ మంత్రి ఇలా రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడాన్ని చూసి ప్రజలు విస్తుబోతున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!) -
ఇంకా రావాలా?..రాలేం బాబూ!
నిన్న మొన్నటి దాకా ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు డీలా పడిపోయింది. పార్టీలో కీలకంగా రాణించిన నేతలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోతున్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని వణికిపోతున్నారు. మరోపక్క పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించే అంతర్గత సమావేశాలకూ డుమ్మాకొడుతున్నారు. తాము రాలేం.. బాబూ..! అంటూ చేతులెత్తేస్తుండడం గమనార్హం. సాక్షి, తిరుపతి : ఐదేళ్ల టీడీపీ పాలన.. అధినాయకత్వం తీరు.. స్వయంకృతాపరాధం.. వెరసి జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి దక్కింది ఒక్క కుప్పం మాత్రమే. అందులోనూ చంద్రబాబు మొదటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసిన విషయం తెల్సిందే. జిల్లాలోని మిగిలిన 13 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఊహించని విధంగా ప్రజలు తీర్పు చెప్పడంతో టీడీపీ షాక్‌కు గురైంది. దాని నుంచి తేరుకోకముందే టీడీపీ నేతలు ఒక్కొక్కరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. అవినీతి, అక్రమాల నిగ్గుతేల్చేందుకు జగన్ ప్రభుత్వం సన్నద్ధం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. సమావేశాలకు రాం..రాం! ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం అక్రమం అని తేలడం, ఆ పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చివేయడం తదితర పరిణామాలపై టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఎదురు దాడి చెయ్యాలని నిశ్చయించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలనే విషయంపైనా చంద్రబాబు ఆ పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాలకు చాలా మంది నాయకులు ముఖం చాటేస్తున్నారు. మేం రాలేం రాలేం.. అంటూ చేతులెత్తేస్తున్నారు. అజ్ఞాతంలో టీడీపీ నేతలు అమరావతిలో పలుమార్లు చంద్రబాబు ఆ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రతి జిల్లా నుంచి ముఖ్యనాయకులను రమ్మని సమాచారం ఇస్తున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన సత్యప్రభ, సుగుణమ్మ, శంకర్‌యాదవ్, గాలి భానుప్రకాష్, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జిల్లా నాయకులు మాత్రం తాము రాలేమని చెప్పినట్లు సమాచారం. కొందరు బెంగళూరులో ఉన్నామని, మరికొందరు ఆరోగ్యం సరిగా లేదంటూ రకరకాల సమాధానాలు ఇచ్చారు. తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులంతా అమరావతికి రావాలని కబురు పంపారు. అమరావతికి వెళ్లడానికి ఇష్టం లేని జిల్లా నాయకులంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలిసింది. ఉండవల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశలో ఆయా జిల్లా నాయకులకు ఫోన్లు చెయ్యమని చంద్రబాబు అనుచరులకు చెప్పినట్లు సమాచారం. అయితే వారు ఫోన్లు చేస్తే కొందరు ఫోన్లు తియ్యకపోగా.. మరికొందరు స్విచ్ ఆఫ్. నాయకుల కదలికలపై చంద్రబాబు జిల్లాలో ఉన్న అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది అజ్ఞాతంలో ఉంటే.. మరి కొందరు ఉన్నా.. ఫోన్లు తియ్యడానికి ఇష్టపడలేదని తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో చేరాలని ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తుండగా.. మరి కొందరు బీజేపీలో చేరేందుకు మంతనాలు చేస్తుండడం గమనార్హం. -
చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రలోభాల పర్వం
-
తాగినోళ్లకు తాగినంత..
సాక్షి, చిత్తూరు : గ్రామాల వారీగా టీడీపీ నాయకులు మద్యం పంపిణీ చేస్తున్నారు. కుప్పం, మదనపల్లి, చంద్రగిరి, పీలేరు, పలమనేరుల్లో మందు పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. కుప్పంలో అయితే ఎన్నికల వరకు వలసలకు అడ్డుకట్ట వేసి మందు ఏరులైపారిస్తున్నారు. ప్రతి రోజూ రూ.500 చొప్పున పంచుతున్నారు. డబ్బుతో పాటు బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. అక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం టీడీపీకి బానిసగా మారిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. పంపిణీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన శాంతిపురం వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. పోలీసులు వైఎస్సార్సీపీ పైనే కేసు నమోదు చేశారు. పలమనేరులో మంత్రికి సంబంధించిన వాహనాల్లో యథేచ్ఛగా మందు పంపిణీ జరుగుతోంది. పోలీసుల కళ్లెదుటే పంపిణీ జరుగుతున్నా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటి రూ.1 కోటి విలువైన మద్యం పంపిణీ చేశామని మంత్రి అమర్నాథ్ రెడ్డి తన సహచరులతో వాఖ్యానించారంటేనే టీడీపీ నాయకులు ఎంత బరితెగించారనేది అర్థమవుతుంది. చంద్రగిరిలో నానికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. దీంతో ఓటర్లను పెద్దఎత్తున ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ నాయకులు విందు ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లనే వినియోగిస్తున్నారు. నిన్నటికి నిన్న మదనపల్లి నియోజకవర్గంలో కొనేటిపాళ్యంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ స్కూల్లో విందు ఏర్పాటుచేసి, మందు పంపిణీ చేస్తూ దొరికిపోయినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. పంపిణీ చేసిన వారిపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోడ్లపైనే డబ్బు వెదజల్లుతున్నారు గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేం దుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం అభ్యర్థి కనీసం రూ.45 నుంచి రూ.50 కోట్లు వరకు ఖర్చు చేయాలని అధిష్టానం నుంచే ఆదేశాలు రావడంతో పంపిణీ మొదలుపెట్టారు. పబ్లిగ్గానే డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కుప్పంలో అయితే ఇంటికి రూ.20 వేల చొప్పున ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలయితే నాలుగు ఓట్లున్న కుటుంబానికి కనీసం రూ.35 వేల చొప్పున పంచుతున్నారు. పలమనేరులో మంత్రి అమర్నాథ రెడ్డి ఓటుకు రూ.2000 పంపిణీ చేస్తున్నారు. పీలేరులో కిశోర్ కుమార్ రెడ్డి అనుచరుల ద్వారా రాత్రికి రాత్రి పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి గ్రామానికీ ఇంత అని చెప్పి పంపిణీ చేస్తున్నారు. సత్యవేడులో డబ్బు పంపిణీ చేయలేదని జెడ్డా రాజశేఖర్‌పై అధిష్టానం సీరియస్ అయింది. దీంతో ఆయన కూడా మొదలుపెట్టారు. గంగాధర నెల్లూరులో హరిక్రిష్ణ అనుచరులు స్లిప్‌లు పంపిణీ చేస్తూ డబ్బులు ఇస్తున్నారు. -
మంత్రి అమర్నాథ్కు షాక్
పలమనేరు: పలమనేరులో టీడీపీ రాజకీయాలు రసపట్టుగా మారాయి. మంత్రి అమరనాథరెడ్డితో విభేదించి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న పార్టీ నాయకులు సుభాష్ చంద్రబోస్ ఎట్టకేలకు తాను టీడీపీ రెబల్‌గా పోటీలో కొనసాగుతానని సృష్టం చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులతో కలసి గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈయన పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలోకి వస్తాడంటూ ప్రచారం కూడా సాగింది. అయితే తన ఎదుగుదలకు అడ్డుకుని తనకు పార్టీలో గౌరవం లేకుండా పోయిన చోటే మళ్లీ తన సత్తా ఏంటో చూపుతానంటూ ఆయన టీడీపీలోనే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. నేడు ఓ సెట్ నామినేషన్ ఈనెల 25న నాయకులు, అభిమానుల మధ్య మరో సెట్ నామినేషన్ వేసి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఎన్టీఆర్ బొమ్మతో జనం ముందుకు వెళతానని తేల్చి చెప్పారు. రెండు రోజుల కిందట పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ హేమంత్‌కుమార్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంతో మంత్రి అమరనాథ్‌కు షాక్ తగిలింది. ఈ నేథప్యంలో రెబల్çగా బరిలో దిగుతానని బోస్ తేల్చి చెప్పడంతో మంత్రికి మరో గట్టి షాక్ తగిలినట్టయింది. మొత్తం మీద పలమనేరు టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. -
నా భార్యకైనా ఇవ్వండి
జిల్లా మంత్రి దారెటో తెలియడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రి పదవి కోసం టీడీపీ కండువా కప్పుకున్న మంత్రి అమరనాథరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఈసారి పలమనేరు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత విముఖత చూపుతున్నట్లు సమాచారం. కంగుతిన్న మంత్రి తన భార్యకైనా టికెట్ ఇవ్వమని అభ్యర్థించినట్లు సమాచారం. అధినేత నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో అమాత్యుడు ఆందోళనలో పడ్డట్టు సమాచారం. సాక్షి, చిత్తూరు, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన అమరనాథ రెడ్డికి టీడీపీ అధినేత గుణపాఠం చెప్పారని పలమనేరులో చర్చసాగుతోంది. వైఎస్సార్సీపీ పలమనేరు అభ్యర్థిగా గెలుపొందిన అమరనాథ రెడ్డి మంత్రి పదవి కోసం టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మంత్రితో పాటు 2019 ఎన్నికల్లో పుంగనూరు లేదా పలమనేరు టికెట్ అడిగి మాట తీసుకున్నారు. కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నా మంత్రి అమరనాథ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. ఈసారి ఎన్నికల్లో పుంగనూరు టికెట్ అమర్కేనని గతంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అనూహ్యంగా తన సోదరుని భార్య అనీషారెడ్డి పేరు ప్రకటించి షాక్‌కు గురిచేశారు. పలమనేరు కూడా లేదా? పుంగనూరు పోయినా పలమనేరైనా ఇస్తారని అమరనాథరెడ్డి భావించారు. చివరకు పలమనేరు కూడా లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తవారికి అవకాశం ఇద్దామని చెప్పడంతో తన భార్య రేణుకారెడ్డిని అమర్ తెరపైకి తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా పలమనేరులో జరిగే ప్రతి కార్యక్రమానికీ తన భార్యను వెంటబెట్టుకుని పర్యటిస్తున్నారు. తాను మాట్లాడిన తరువాత భార్య రేణుకారెడ్డిని ప్రసంగించమని చెబుతున్నారు. కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాల్సి వస్తే తన భార్యకు అవకాశం ఇవ్వమని అధినేత చంద్రబాబును కోరినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం అమర్ సతీమణికి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదని విశ్వసనీయ సమాచారం. పలమనేరు లేదు.. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటుకు పోటీచెయ్యలేను రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చెయ్యలేనని అమరనాథరెడ్డి అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే స్థానం నుంచి పోటీ చెయ్యమనడం వెనుక అంతరార్థం ఏమిటని అమర్ మంత్రి లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్సీపీ అధినేతను, పలమనేరు ప్రజలను కాదని టీడీపీలోకి వచ్చినందుకు తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించినట్లు సమాచారం. మంత్రి లోకేష్ నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో అమర్ ఎటు వెళ్లాలో? ఎవరికి చెప్పుకోవాలో? అర్థం కాక తన అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఏ ఒక్క రోజైనా కేంద్రాన్ని నిలదీశారా?
-
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా
సాక్షి, హైదరాబాద్: రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలు పలువురు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం ఆకేపాటి జగన్ నివాసం బయట మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తామంతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరమని అమరనాథరెడ్డి అన్నారు. జగన్ వద్ద టికెట్ల విషయం చర్చించలేదని ఈ విషయమై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ మేడాకు టికెట్ ఇస్తే మీరు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా..‘ఒకరికి మద్దతు అనేది ఇక్కడ అంశం కాదు.. నామద్దతు ఎల్లప్పుడూ జగన్‌కే..’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్‌బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్‌కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
మీ గెలుపు పెద్దిరెడ్డి భిక్షకాదా?
పలమనేరు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పలమనేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేవా ? ఆయన భిక్షతో గెలిచి నేడు అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం మంత్రి అమరనాథరెడ్డికి తగదని వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాడు మీరు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తే మన పార్టీని నమ్ముకుని వచ్చారు.. పలమమేరులో మిమ్మల్ని గెలిపిం చాలని పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన విషయ మై ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని మరిచి పెద్దిరెడ్డిని విమర్శించడం మంచిది కాదు. దీన్నీ ప్రజలు గమనిస్తున్నార’ని తెలిపారు. సీనియర్ నాయకుడు సీవీ కుమార్ మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమరనాథరెడ్డికి లేదని చెప్పారు. మంత్రి అనే ధైర్యంతో ఎక్కడైనా పోటీచేయండిగానీ అధికారం ఉందని విలువలు లేని రాజకీయాలు చేయడం మంచిదికాదన్నారు. పట్టణ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఒక విమర్శచేస్తే తాము వంద చేస్తామని, గతాన్ని మరిచి మాట్లాడడం బాధాకరమని చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బీఫామ్ ఇస్తే ఫ్యాను గుర్తుపై గెలిచి నేడు తమరు మంత్రి అయ్యారని, ఓడివుంటే ఆ పదవి దక్కేదా ? అని ప్రశ్నించారు. ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద మాట్లాడుతూ గెలిపించినవారినే విమర్శించడం తగదన్నారు. కౌన్సిలర్లు కమాల్, మూర్తి, మున్నా, గోవిందప్ప, షబ్బీర్, నాయకులు నయాజ్, నాగరాజు, రాజారెడ్డి, శశిధర్, జావీద్, సోమశేఖర్ రెడ్డి,అక్బర్, ముజ్జు, సేటు తదితరులు పాల్గొన్నారు. -
అయ్యా.. మీరైనా కనికరించండి
తిరుపతి తుడా: ‘‘అయ్యా మీరైనా కనికరించండి.. రోడ్డు ప్రమాదంలో నా భర్తకు రెండు కాళ్లూ పోయా యి.. నడవలేని స్థితిలోనూ నాలుగేళ్లుగా కాళ్లరిగేలా అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.. ఇప్పటి వరకు పింఛను ఇవ్వలేదు.. నాకు వేరే దిక్కులేదు.. ఆధారమూలేదు.. తిరిగే ఓపిక లేదు.. ఇప్పటికైనా పింఛను ఇప్పించండి’’ అంటూ ఎస్టీవీ నగర్‌కు చెందిన అంబిక అనే వృద్ధురాలు మంత్రి అమర్నాథరెడ్డి ముందు కన్నీరుపెట్టుకున్నారు. తిరుపతిలో గురువారం నగరదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 30వ వార్డు నెహ్రూనగర్‌లో పర్యటించారు. పలువురు రేషన్‌కార్డు, పింఛను, పక్కాగృహం కోసం ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంలో వృద్ధురాలు అంబిక తన గోడు వెళ్లబోసుకుని భోరున విలపించడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా ఇల్లు వచ్చిందని, రూ.40 వేలు కట్టమంటున్నారని వాపోయింది. కట్టే పరిస్థితిలో లేమని, ఏదైనా ఆర్థికం అందిస్తే రుణం తీర్చుకుంటామంటూ వేడుకుంది. మంత్రి స్పందిస్తూ, అన్నీ పరిశీలించి పింఛను వచ్చేలా చూడండని అక్కడున్న వారికి సూచించారు. ఎమ్మెల్యే అల్లుడు సంజయ్ ఆమె వివరాలను తెలుసుకుని, ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా అడుగడుగునా మంత్రికి వినతులు వచ్చాయి. అనంతరం మంత్రి స్థానిక మున్సిపల్ పాఠశాలలో పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వచ్చినట్టు చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని తెలుసుకునేందుకు నగరదర్శిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఎమ్మెల్సీ పోతుల సునీత, దొరబాబు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, డీసీసీబీ చైర్మన్ ఆమాస రాజశేఖర్‌రెడ్డి, శాప్ డైరెక్టర్ శ్రీధర్‌వర్మ, గంగమ్మగుడి ఆలయ చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, నీలం బాలాజి, డీఈఈ రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ కంటే కాంగ్రెస్సే మంచిది’
సాక్షి, చిత్తూరు : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ చేస్తామని వెంట ఉండి.. నాలుగేళ్ల పాటు నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ కంటే.. ముందే మాట చెప్పి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొచ్చని అన్నారు. మరో వైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆయన వ్యక్తిగతమన్నారు. అదేవిధంగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతారని, రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో వనం- మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో మామిడి రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలను అధిగమించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని వెల్లడించారు. -
టీడీపీ దాదాగిరి: రోజాపై దాడికి యత్నం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం. అంతకు మందు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డుపాలు అయ్యారన్నారు. మామాడికి గిట్టుబాటు లేక రైతులు రోడ్లెక్కారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గు కాదా అన్నారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు. -
మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టరు?
సాక్షి, అమరావతి : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో సెయిల్ అందించిన పాత నివేదికను సమర్పించడం ద్వారా కేంద్రం మరోసారి తన నైజాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండబట్టే కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. అనంతపురం జిల్లాలో 135 మిలియన్ టన్నులు ఐరన్ ఉండగా.. ప్రకాశం జిల్లాలో మరికొన్ని గనులు ఉన్నాయని.. వీటన్నింటిని కడప స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తామని ఇదివరకే మెకాన్ సంస్థకు, టాస్క్ ఫోర్స్‌కు తెలియజేసామని ఆయన స్పష్టం చేశారు. మికాన్ సంస్థకు రాష్ట్రం అందిస్తోన్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేశామన్నారు. అయినప్పటికీ కేంద్ర మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో తగినంత ఐరన్ ఉండగా.. ఉక్కు పరిశ్రమ విషయంలో తెలంగాణతో ఆంధ్రను ముడిపెడుతూ.. కుంటి సాకులు చెప్పడం అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు.. ఉక్కు పరిశ్రమ సాధించుకోవడం కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. -
కన్నీటి పర్యంతమైన దొంతు శారద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్ పర్సన్లుగా ఉన్న మహిళలకు కనీస గౌరవంతో పాటు పదవి ద్వారా సంక్రమించిన హక్కులను కూడా కాలరాసేలా విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పర్యవసనంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని ఇంటికే పరిమితం అనే చందంగా అధికార పార్టీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిణమాల క్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారద బుధవారం కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా కు సిద్ధపడ్డారు. చివరకు జిల్లా ఇన్చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి ఫోన్‌చేసి బుజ్జగించటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలిలో అధికార పార్టీ మహిళలు మున్సిపల్ చైర్పర్సన్లుగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పార్టీలో మహిళా నేతల పరిస్థితి దయనీయం. పట్టణాలకు ప్రథమ మహిళలే అయినా పార్టీలోనూ, పాలనలోనూ చివరి మహిళలుగా మిగులుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సొంత జిల్లాలోనే పట్టణాల ప్రథమ మహిళలకు కనీస ప్రాధాన్యం లేకపోవటంతో పార్టీలో పరిస్థితికి నిదర్శనం. గతంలో కావలిలో పార్టీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య మధ్య ఇదే తరహలో అధిపత్య పోరు సాగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి కాగానే అలేఖ్యను పదవి నుంచి తప్పుకోవాలని బీద ఒత్తిడి తేవటం, ఒప్పందంలోని అంశాలను మీరు ఏమీ పాటించకుండా ఇప్పుడు రాజీనామా చేయమని కోరటం సరికాదని ఆమె సామాజిక వర్గ మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారటంతో ఆమెనే కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గూడూరు మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మున్సిపల్ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుని మున్సిపల్ చైర్పర్సన్ ప్రా«ధాన్యం తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణమాల క్రమంలో ముగ్గురు మున్సిపల్ చైర్పర్సన్లు మంత్రి నారాయణకు మొర పెట్టుకున్నా తమకు ఎమ్మెల్యేలే ముఖ్యమని మంత్రి సృష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా మున్సిపల్ చైర్‌పర్సన్స్ వరెస్స్ ఎమ్మెల్యేలుగా వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వెంకటగిరిలో ముసలం మొదలై తారా స్థాయికి చేరింది. బీసీ మహిళ కావటం వల్లే వేధింపులు గురువారం వెంకటగిరి పట్టణంలో జరిగే మినీ మహానాడు వంటి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లుపై తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై ఆమె మనస్థాపం చెందారు. దీంతో అమె తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అమరనాథ్‌రెడ్డి నేరుగా ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు భరించామని, ఇక తన వల్ల కావడం లేదంటూ ఆమె మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటున్నానని అయినా తనను అడుగు అడుగునా అవమానిస్తున్నారంటూ వాపోయారు. తన మాట వినాల్సిన అవసరం లేదని అధికారులు, సిబ్బందికి చెబుతుంటే ఎలా చైర్‌పర్సన్‌గా కొనసాగాలో అర్థం కావడం లేదని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అండతో ఆయన ముందే తనపై దూషణలకు దిగుతున్నా వారిని వారించకపోవడం వారిని పరోక్షంగా ప్రోత్సహించడం కాదా అంటూ మంత్రితో ఆమె ఫోన్లో కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి అమరనాథ్‌రెడ్డి తనే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
మంగళగిరిలో మంత్రి అమర్నాథ్రెడ్డి కారు బీభత్సం
-
అలా కలెక్టర్ చెప్పడం దారుణం : వైఎస్సార్సీపీ
సాక్షి, కడప: పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది జన్మభూమి నుంచి ఇప్పటి వరకు ఒక్క అర్జీని కూడా టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసుల రక్షణ కావాలని అంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డుకానీ, ఇళ్ల స్థలాలు, ఫించన్లు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జననేత జగన్ చేస్తున్న పాదయాత్రను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రతో టీడీపీ పునాదులు కదలడం ఖాయమన్నారు. -
బోసూ.. ఏదీ నీ ప్లేసు
జిల్లా టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రి అమరనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో ఇవి బహిర్గతమయ్యే స్థాయికి చేరాయి. మొదటి నుంచి అష్టకష్టాలకోర్చి టీడీపీకి జవసత్వాలు నింపినా.. పార్టీలు మారిన వారికే ప్రాధాన్యం దక్కుతుండడంపై బోస్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా మంత్రి నిర్వహించిన బహిరంగ సభకు బోస్ డుమ్మా కొట్టడంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. పలమనేరు: కష్టకాలంలో క్యాడర్‌ను కాపాడుకుని పార్టీని బలోపేతం చేసిన పలమనేరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి సుభాష్‌చంద్ర బోస్ మంత్రి అమనాథరెడ్డి తీరుపై అంతర్మథంలో పడ్డారా..? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పలమనేరులో శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి, ఆపై జరిగిన ర్యాలీ, బహిరంగ సభకు స్థానిక నేత బోస్ హాజరు కాకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం ముగ్గురు మంత్రులు హాజరైన జిల్లా సమన్వయ కమిటీలోనూ చర్చించినట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న వ్యక్తికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బోస్‌ను కుంగదీసినట్టు సమాచారం. దీంతో ఆయన అనుచరులు మంత్రి తీరుపై లోలోన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో బోస్ పరిస్థితి పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఉందంటూ ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో తెలియడం లేదని అంటున్నారు. అమర్ రాక.. బోస్‌కు కాక గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అప్పటినుంచే బోస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో అమర్నాథరెడ్డిపై తృటిలో ఓటమిపాలైన బోస్ వచ్చే ఎన్నికల్లోనైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమర్ పార్టీ ఫిరాయించడంతో బోస్ డైలామోలో పడ్డారు. అయితే చంద్రబాబు తనకు అన్యాయం చేయరనుక్ను బోస్ సీఎం మాట ప్రకారం మంత్రితో ఇన్నాళ్లూ కలసిమెలసి ఉండేవారు. అయితే బోస్‌కు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిపోవడం మొదటి దెబ్బ. అనంతరం బోస్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో నమ్ముకున్న పార్టీ ఇలా చేసేందేమిటనే ప్రశ్న ఆయన్ను వేధించింది. ఫలితంగా పార్టీకి కాస్త దూరంగానే గడిపారు. దీంతో పార్టీని సైతం వీడతారనే ఊహాగానాలు అప్పట్లో మొదలయ్యాయి. ఈ విషయం కాస్తా అధిష్టానానికి తెలసి ఆయన్ని ప్రసన్నం చేసేందుకు రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన కోశాధికారి పదవిని కట్టబెట్టారు. అప్పటికే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవిని పొందిన అమర్ మెల్లమెల్లగా తనప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ప్రభుత్వ పథకాలను మంత్రి మనుషులకు ఇవ్వడం, బోస్ వర్గాన్ని పక్కన పెట్టడం మళ్లీ వర్గపోరుకు ఆజ్యం పోసింది. పట్టణంలో రెండు పార్టీ కార్యాలయాలు, కొన్ని కార్యక్రమాలకు బోస్ వెళ్లకపోవడం తదితర పరిణామాలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో బోస్ గత మూడునెలలుగా పార్టీలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. అసలు రహస్యం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టేనా? అంసతృప్తితో ఉన్న బోస్‌కు అధిష్టానం రాష్ట్ర కోశాధికారి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో పలమనేరు టిక్కెట్టు కూడా ఇస్తామని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రెండోసారి పార్టీలో చేరినప్పటి నుంచి అభివృద్ధి చేసి ఇక్కడే బరిలో ఉంటానని తరచూ సభలు, సమావేశాల్లో బోస్ సమక్షంలోనే అమర్నాథరెడ్డి ప్రస్తావించేవారు. ఆ మాటలు బోస్‌కు తెగ ఇబ్బందికరంగా మారాయి. గత కొన్నాళ్లుగా పుంగనూరుకు మంత్రి, పలమనేరుకు బోస్ అభ్యర్థులనే మాటలు స్థానికంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చూపెట్టాలనే మంత్రి మొన్న జరిగిన బహిరంగసభను, ర్యాలీని ఏర్పాటు చేసినట్టు బోస్ అనుచరుల వాదన. ఈ విషయం ముందుగానే గ్రహించిన బోస్ అందుకే మంత్రి సభకు డుమ్మాకొట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 93 వేల ఓట్లను సాధించిన బోస్‌కు పార్టీలో గుర్తింపు తగ్గడాన్ని ఆయన, అతని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న పరిణామాలతో బోస్ త్వరలోనే కీలకనిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. ఈ టాపిక్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
‘వైఎస్ జగన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు’
సాక్షి, ఇడుపులపాయ : ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. జనసంద్రమైన ఇడుపులపాయ బహిరంగసభలో అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ప్రజల నేత వైఎస్ జగన్ తలపెట్టిన పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన అందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘పాదయాత్ర చేపట్టి ప్రతిపక్షనేతగా ప్రజల సమస్యల్ని తెలుసుకున్న మహానేత వైఎస్ఆర్ సీఎం కాగానే ఆ మాట నెలబెట్టుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించే ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేసిన గొప్పవ్యక్తి వైఎస్ఆర్. ప్రస్తుతం ఏపీలో ఏం జరగుతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు ఇచ్చారు. కానీ సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. తమ సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయనదే విజయమని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఈ ప్రజా సంకల్ప పాదయాత్రకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. మీ తరఫున పోరాటం చేసేందుకు ప్రతిష్టాత్మక పాదయాత్రతో నడుం బిగించి, కోట్లాది ప్రజలతో మాట్లాడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తానన్న వైఎస్ జగన్‌కు మద్ధతు తెలపాలని’ ఏపీ ప్రజలకు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. -
‘వైఎస్ జగన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు’
-
ఆ మంత్రులు చాలా డేంజర్: అంబటి
గుంటూరు: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు గౌరవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం చేస్తే తప్పేంటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వయసులో పెద్దవారికి నమస్కరించడం మన సంప్రదాయమని, దీనిపై రాద్ధాంతం చేయడం దారుణమని పేర్కొన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. కోవింద్‌కు జగన్ నమస్కారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తమ మద్దతు రాష్ట్రపతి ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుండగులు పట్టుబడిన వ్యవహారంపై మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆ వ్యాన్‌ను పట్టుకుంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కాదని, టాస్క్‌ఫోర్స్ పోలీసులే పట్టుకున్నారన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. పట్టుకున్న వ్యాన్ తమది కాకుంటే ఆ విషయాన్ని చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ వెల్లడించాలి. టీడీపీకి అమ్ముడుపోయి మంత్రులుగా చెలామణి అవుతూ జగన్‌ను విమర్శించే హక్కు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డికి లేదని అన్నారు. రాజకీయాన్ని అమ్ముకునే దొంగలు మీరు, స్మగ్లింగ్ చేసే వారికంటే మీరే ప్రమాదకరమ’ ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
త్యాగానికి ప్రతిఫలం ఇదేనా!
- వ్యవసాయానికి అధికారులు అడ్డుపడితే సహించేది లేదు - సోమశిల ముంపువాసులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, బోనస్ ఇవ్వాలి - ఉద్యోగావకాశాలు, పునరావాసం కల్పించాలి - పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ కడప కార్పొరేషన్: సోమశిల ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులను సాగు చేయనీయకుండా అడ్డుకోవడం దారుణమని, రైతుల త్యాగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రశ్నించారు. సోమశిల ముంపు వాసులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజీవ్ స్మృతివనం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సెంట్రల్ జైలు, వైఎస్ఆర్ సర్కిల్, మినీబైపాస్, అంబేడ్కర్ కూడలి మీదుగా కొత్త కలెక్టరేట్‌కు చేరింది. ఈ సందర్భంగా అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలని రైతులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. సోమశిల ప్రాజెక్టు కారణంగా 120 గ్రామాల్లోని 20వేల కుటుంబాల ప్రజలు ఆశ్రయం కోల్పోయి, పంటభూములను వదులుకొని నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇచ్చారని తెలిపారు. ఇంతటి త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదని, బోనస్ అసలే లేదన్నారు. ఎకరాకు రూ.2లక్షలివ్వాలని రైతులు అడిగితే దివంగత సీఎం వైఎస్సార్ రూ.2.50లక్షలు ఇచ్చారని, ఆయన ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జారీ చేసిన జీఓను ప్రస్తుత ప్రభుత్వం మూలనపడేసిందన్నారు. రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఒక మహిళా అధికారిణి అడ్డుకుంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించడం దారుణమని మండిపడ్డారు. ఆమె వైఖరి మారకపోతే అలాంటి కేసులనే ఆమె కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం పూర్తిగా పరిహారం అందించి, పునరావాసం కల్పించేవరకూ రైతులను వ్యవసాయం చేసుకోనివ్వాలని కోరారు. 78 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి జిల్లా రైతులు కన్నీళ్లు పెట్టుకొని భూములను త్యాగం చేశారన్నారు. అదే సోమశిల నీటిని ఒంటిమిట్ట, కడపలకు తాగునీటి కోసం 2 టీఎంసీలు తెచ్చుకుంటుంటే ప్రస్తుత టీడీపీ నేత సోమిరెడ్డి ఆనాడు నెల్లూరులో ధర్నా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆ పెద్దమనిషి మనకు న్యాయం చేస్తారా... అని అయన అనుమానం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ సోమశిల ముంపు బాధితుల సమస్యలను జిల్లా పరిషత్ సమావేశంలో చర్చించి, వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం, పునరావాసం అందించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా ముంపుబాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పదిహేను రోజులుగా అటవీశాఖ అధికారులు రైతులను సాగు చేసుకోనివ్వకుండా కేసులు పెట్టడం దారుణమన్నారు. కదంతొక్కిన శ్రేణులు, ముంపువాసులు ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో పార్టీశ్రేణులు, ముంపువాసులు కదం తొక్కారు. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రగా వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి బైపాస్ సర్కిల్లో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం బైపాస్‌లో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటునుంచి అందరూ పాదయాత్రలో కలిసి నడిచి కొత్త కలెక్టరేట్ చేరుకున్నారు. అనంతరం ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ–2 శివారెడ్డికి అందజేశారు. పోలవరం రైతులకు ఇచ్చిన పరిహారం తరహాలో ఇవ్వాలి: పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరాకు రూ.50లక్షల పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, బోనస్ ఇచ్చిం ది. సోమశిల ముంపువాసులకు కూ డా అదే తరహా పరిహారం ఇవ్వాలి. రైతులు పంటలు పండించుకోకుండా అధికారులు అడ్డుపడటం దారుణం. సోమశిల ముంపువాసుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం. – పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే ఎకరాకు ఐదారు లక్షలు ఇవ్వడం అన్యాయం: నష్టపరిహారం రాక ఐదేళ్లుగా ముంపువాసులు ఇబ్బందులు పడుతున్నా రు. భూములను సాగు చేసుకుందామంటే అధికారులు ఆటంకా లు కల్పిస్తున్నారు. సోమశిల ముంపువాసుల సమస్యలను ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకుపోయారు. గండికోట ప్రాజెక్టు వల్ల మునకకు గురైన చౌటపల్లివాసులకు ఎకరాకు రూ.7లక్షలు ఇస్తే సోమశిల కింద భూములు కోల్పోయిన వారికి ఐదువేలు, పదివేలు ఇవ్వడం అన్యాయం. – కె. సురేష్‌బాబు, కడప మేయర్ రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి అలుసు సోమశిల కింద భూములు కోల్పోయి న వారికి నష్టరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జీఓ ఇస్తే ఆయన తర్వాత సీఎం అయిన చంద్రబాబు దాన్ని పక్కనబెట్టారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాకే ముంపువాసులకు నష్టపరిహారం అందించారు. బద్వేల్, రాజంపేట, పెనగలూరు రైతులు నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇవ్వడానికి సహకరిస్తే, ప్రభుత్వం వారికి చిప్పచేతికిచ్చింది. 9900 ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులు నోటిఫై చేశారు. ఆ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆదుకుంటాం. – కొరముట్ల శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే రైతులకు అన్యాయం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 80శాతం మం ది రైతులకు నష్టపరిహారం ఇచ్చారు. మిగిలిన 20 శాతం మందికి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా జారీ చేసిన జీవోను తుంగలో తొక్కారు. నష్టపరిహారం చెల్లించేవరకూ పంటలు పండించుకోనివ్వాలి. – ఎస్బి అంజద్‌బాషా, కడప ఎమ్మెల్యే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి అన్ని ప్రాజెక్టులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తున్నారు. సోమశిలకు మాత్రమే లేదు. రైతులు ఎకరాకు రూ.2లక్షలు కావాలంటే రూ.2.50లక్షలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దే. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన జీఓ జారీ చేసి 82మందికి ఉద్యోగాలిచ్చారు. పూర్తి స్థాయిలో పరిహారం, బోనస్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. – ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ పారించుకొనేది నెల్లూరులో, తాగేది చెన్నైలో... నష్టపోయేది మేమా..! సోమశిల ప్రాజెక్టు వల్ల నెల్లూరులో సాగునీరు పారించుకుంటున్నారు. చెన్నైకి తాగునీరు అందిస్తున్నారు, వారికోసం మేము నష్టపోవాలా...! ఎకరాకు రూ.5వేలు చొప్పున అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చిన ప్రాజెక్టు సోమశిలే. అది కూడా పొలానికిస్తే ఇంటికివ్వలేదు, ఇంటికిస్తే పొలానికి ఇవ్వలేదు. – ఏ. రామక్రిష్ణారెడ్డి, అట్లూరు రైతు నాయకుడు పైర్లు పెట్టవద్దని అటవీ అధికారులు భయపెడుతున్నారు.. అక్రమార్కులు అడవులు, కొండలను ఆక్రమించి దున్నుతుంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకుంది. పేద ఎస్సీలు, బీసీలు పైర్లు పెట్టుకుంటుంటే మాత్రం ఫారెస్ట్ అధికారులు కేసులు పెడతామని భయపెడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పెంచిన సామాజిక అడవులను నరికితే పట్టించుకొనే వారు లేరుగానీ, రైతులు ఒకటి, అర ఎకరాల్లో పైరు పెట్టుకుంటే తప్పేంటి..? – గోపిరెడ్డి, నందలూరు రైతు -
మంత్రి లోకేశ్ కు చేదు అనుభవం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లోకేశ్ సమక్షంలోనే బొజ్జలపై బాధిత మహిళ విరుచుకుపడింది. ‘మీ వెనుకున్నవారే ఇదంతా చేశారు. బొజ్జల అనుచరుల వల్లే ఊరు వల్లకాడుగా మారింది. పది లక్షలిస్తా నా భర్తను తీసుకొస్తారా’ అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడ నుంచి బొజ్జల వెనుదిరిగారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు. -
శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా
⇒శ్రీకాళహస్తిలో దేశం కనుమరుగే అంటున్న నేతలు ⇒ ప్రస్తుతం 300 మంది..రేపటికల్లా 100 శాతం మంది రాజీనామాలు ⇒ఆలయ కమిటీ చైర్మన్ గురవయ్యనాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ పార్థసారథి వెల్లడి శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీశాఖ మంత్రి పదవి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చంద్రబాబు తొలగించడంతో ఆదివారం శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు, నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు చంద్రబాబునాయుడు గొప్ప నాయకుడు అని పొగిడిన వాళ్లే ఆదివారం వెన్నుపోటుదారుడు అంటూ అరిచి గగ్గోలు పెడుతున్నారు. మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని అలాంటి వ్యక్తికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన సేవలు గుర్తుకు రావంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ప్రయాణం చేస్తు అలిపిరి ఘాట్ వద్ద బాంబు ప్రమాదంలో బొజ్జల తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నాడు ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు నడిచిన విషయం ఆయన గుర్తుంచుకోకపోవడం దారుణమని పలువురు నాయకులు బహిరంగంగానే సీఎంను దుమ్మెత్తి పోస్తున్నారు. తిరిగి బొజ్జలను మంత్రివర్గంలో తీసుకోకపోతే శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి నామరూపాలు ఉండవంటూ నేతలు హెచ్చరించారు. 5 సార్లు ఎమ్మెల్యే.. 3 సార్లు మంత్రి..అయినా పక్కన పెట్టేశారు.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల 2004లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇంత సీనియర్ నేతను మంత్రి పదవి నుంచి తొలగించడం పార్టీకే చేటుగా టీడీపీ సీనియర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బొజ్జలతోనే తామంతా.. నియోజకవర్గంలో కేవలం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషితో వచ్చిన పదవులే తప్ప.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చినవి కాదని దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు అన్నారు. శనివారం రాత్రి ఆరోసారి టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. దాంతోనే వరుసగా నియోజకవర్గంలో అందరు రాజీనామాలు చేస్తున్నారని.. ఇప్పటికే 300 మందికి పైగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని తెలిపారు. మరోసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చర్చించి అవసరమైతే తానూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తొట్టంబేడు మండలంలో జెడ్పీటీసీ అనçసూయమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు గాలి అనసూయమ్మ, ఎంపీపీ పోలమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామాంజులు నాయుడు, సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు తదితరులు రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి మాట్లాడుతూ దశాద్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి పదవులు తొలగించి.. వైఎస్సార్సీపీలో గెలుపొంది పార్టీ ఫిరాయించి వచ్చిన నలుగురుకి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న 80 శాతం మంది రాజీనామా చేశారని.. రేపటికల్లా 100 శాతం రాజీనామాలు చేస్తారని ఆయన వెల్లడించారు. సింగల్‌విండో చైర్మన్ తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్యనాయుడు, టౌన్‌బ్యాంక్, పాలసోసైటీ తదితర అన్ని కమిటీల వారు మూకుమ్మడిగా రాజీనామా చేశారని తెలిపారు. సమావేశంలో ముఖ్యమైన పార్టీ నేతలు కొండుగారి శ్రీరామమూర్తి, తాటిపర్తి ఈశ్వర్‌రెడ్డి, దందోలు భక్తవత్సలరెడ్డి, ఆలయ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తి సెగ
⇒అమర్‌కు అందలం, బొజ్జలకు పరాభవం ⇒ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోపాలకృష్ణా రెడ్డి ⇒అంతర్మథనంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ⇒అలకపాన్పెక్కిన తంబళ్లపల్లె, చిత్తూరు శాసనసభ్యులు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జిల్లా టీడీపీలో అసంతృప్తులకు ఆజ్యం పోసింది. రాష్ట్ర మంత్రివర్గంలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి చోటు దక్కడంపై ఆ పార్టీ జిల్లా నేతలు రగిలిపోతున్నారు. సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు ముక్తకంఠంతో సమర్థిస్తున్నారు. మీ వెంటే మేమంటూ రాజీనామాల పర్వానికి పూనుకోవడం కలకలం రేపింది. పలమనేరు: జిల్లా టీడీపీలో అసంతృప్తులు, అలకపాన్పులు మొదలయ్యాయి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీనామా బాట పట్టారు. చివరిదాకా రేసులో ఉన్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం మంత్రి పదవి దక్కకపోవడంతో అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద అమరనాథరెడ్డికి మంత్రి పదవిని కట్టబెడ్డం జిల్లాలోని ఆపార్టీలో చిచ్చును రేపి వర్గపోరుకు ఆజ్యం పోసింది. వైశ్రాయ్ హోటల్నుంచి బాబు వెంటే.. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తొలినుంచి చంద్రబాబు వెంటే ఉన్నారు. నాడు ఎన్టీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన వైశ్రాయ్ హోటల్ వ్యవహారం నుంచి బాబుతో జతకట్టిన బొజ్జల ఇంతవరకు సొంత జిల్లావాసిగా ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలోనూ ఆయనతోపాటు గాయడ్డారు. చివరకు అనారోగ్య కారణం చూపి తనను మంత్రి పదవినుంచి తొలగించడాన్ని బొజ్జల జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం తనను పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన అమర్నాథ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో మనస్థాపానికి గురైన బొజ్జల తాను అనారోగ్యంతో మంత్రి పదవికి పనికిరానప్పుడు ఎమ్మెల్యే పదవికి మాత్రం ఎందుకంటూ తన రాజీనామాను స్పీకర్‌కు పంపారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలు పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. ధర్నాలకు దిగారు. సోమవారం మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆ ముగ్గురి తీవ్ర నిరాశ కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్ టీడీపీ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మంత్రిపదవిని ఆశించారు. అయితే జిల్లాకే చెందిన లోకేష్‌కు మంత్రి పదవిని ఇచ్చి మళ్లీ అదే సామాజికవర్గానికి కుదరదనే తలంపుతో తనను పక్కన పెట్టడంతో ఆయన రగిలిపోతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో బాధను వెలగక్కినట్టు సమాచారం. మరోవైపు గత కొన్నాళ్లుగా మంత్రి పదవి రేసులో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం ముఖ్యమంత్రిపై లోలోపల అసంతృప్తితో ఉన్నారు. కాపు సామాజిక వర్గంనుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని పడమటి ప్రాంతానికి చెందిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారు. చివరికి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని పార్టీ ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా టీడీపీలో వర్గపోరు మంత్రి పదవి విషయంలో రేగిన మంటలు జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోశాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రికి వ్యతిరేకంగా మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు జతకట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్ చంద్రబోస్‌కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. ఆది నుంచి తన వర్గానికి ప్రాముఖ్యతనిచ్చే అమర్ మనస్తత్వం జిల్లాలోనూ వర్గపోరుకు బీజం వేయడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అంతర్గత వర్గపోరుతో భవిష్యత్తులో కొందరు టీడీపీని వీడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణలో పడిన బాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా సొంత జిల్లాలో టీడీపీకి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు దక్కనేలేదు. దీనికితోడు ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతోనే బాబు ఆత్మరక్షణలో పడి అమర్నాథ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ పాదయాత్ర
విశాఖపట్టణం: విశాఖపట్టణం రైల్వే జోన్ డిమాండ్‌తో మరో ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. విశాఖకు రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలంటూ విశాఖపట్టణం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకుడు అమర్నాథ్ రెడ్డి అనకాపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనకాపల్లి నుంచి భీమిలి వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. అంతకుముందు అనకాపల్లిలో బహిరంగ సభను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. -
'స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'
వైఎస్ఆర్ జిల్లా: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్నిస్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని అన్నారు. -
'చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోవాలి'
-
'చంద్రబాబుపై ఈసీ చర్యలు తీసుకోవాలి'
కడప: ఎమ్మెల్సీ ఎన్నికల నియమామళి అమలులో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారికి పలు హామీలు గుప్పిండచంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, శ్రీనివాసులు ఆదివారం మధ్యాహ్నం కడపలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని, కనుక తక్షణమే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'
చిత్తూరు : టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వీ. కోట మండల కేంద్రంలో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ బ్యానర్‌ను పార్టీ కార్యకర్తలు శుక్రవారం ప్రదర్శించారు. ఆ బ్యానర్లో ఏముందంటే... ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు... అలాగే ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదని.. కానీ మిమ్మల్ని మేము ఓట్లు వేసి గెలిపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండన్నారు. అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మీ ఇష్టం... కానీ మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి... ఓటర్లుగా మాకు విలువ వుంది. ఓటుకు కూడా ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా ? అని బ్యానర్ ద్వారా ప్రశ్నించారు. సిగ్గు... సిగ్గు.. అని బ్యానర్లో రాసి ఉంది. -
ఆదినారాయణకు ఎమ్మెల్యే పదవి వైఎస్ఆర్ భిక్షే
కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భిక్షతోనే ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప కార్పొరేషన్ మేయర్ సురేష్‌బాబుతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ఆర్ బొమ్మపై గెలిచి రాజీనామా చేయకుండా ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం దారుణమని ఆరోపించారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమరనాథ్‌రెడ్డిని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆదినారాయణ కుటుంబం కష్టాల్లో ఉంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదుకుని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఆదినారాయణకు లేదని వారు అన్నారు. -
అందరికీ విప్ జారీ చేశాం.. పాటించాలి
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ విప్ ఎన్. అమర్నాథ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినరోజే దానిపై చర్చ చేపట్టడం జరగదు. అయినా, అధికార పక్షం మాత్రం తమ విచక్షణాధికారంతో సోమవారమే దీనిపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. దాంతో, అందరికీ విప్ జారీ చేశామని అమర్నాథ రెడ్డి చెప్పారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేశామని, అది కాక ఇంకా ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలోను విప్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అందులో తెలిపామన్నారు. విప్ జారీచేసిన దానికి అనుకూలంగా సభ్యులు ఉండాలని తెలిపామని, దానికి ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
‘మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు’
తామంతా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, ఇతర పార్టీలోకి వెళ్లేది లేదని కడప నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ నేత లోకేష్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వలస వెళ్లనున్నారని ఓ వర్గం మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావవంటిదని వారు పేర్కొన్నారు. వైఎస్సార్కాంగ్రెస్ను తాము వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తులు శివ శంకర్ రావు, సీతారామారావు, దుర్గాప్రసాద్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. వీరితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా ఐటీ ప్రొఫెసర్ కె. నర్సింహారావు, రాయలసీమ ఐజీ గోపాలక్రిష్ణ, గుజరాత్ రాష్ట్ర డీజీపీ పాండ్యన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఉడిపి కి చెందిన పుత్తిగ మఠ పీఠాధిపతి సుగునేంద్రస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జే. చైదరి స్వామివారిని దర్శించుకున్నారు. -
చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి
-
డీసీసీబీ చైర్మన్ పీఠం మాదే:అమర్నాథ్ రెడ్డి
కడప : ఎర్రచందనం కేసులు పెడతామంటూ డీసీసీబీ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లను టీడీపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న సొసైటీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ చైర్మన్ పీఠం తామే దక్కించుకుంటామని అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. కాగా కోరం లేక డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక ఆదివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఆపేస్తే ఒప్పుకోం.. వారంలో మొదలు పెట్టండి
చిత్తూరు: టీడీపీ వల్లే పలమనేరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి అన్నారు. టీడీపీ నేతల ప్రోద్భలంతోనే జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులు నిలిపేశారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరాలు కోరారు. వారంలోగా పనులు చేపట్టకపోతే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పట్టి సీమ వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఎక్కడా చెప్పలేదని అన్నారు. పోలవరం కడితేనే రాయలసీమలోని హంద్రీనీవాకు నీళ్లొస్తాయని చెప్పారు. -
ప్రభుత్వంపై ప్రజాగ్రహం
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 5వ తేదీ నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, బాధతో ఉన్నారన్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఈ ధర్నా ద్వారా తెలియజెప్పాలన్నారు. అనంతరం మేయర్ కే. సురేష్‌బాబు మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. వీటిని ప్రజలకు తెలియజెప్పి ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక లోటు బడ్జెట్ ఉంటుందని తెలిసీ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారన్నారు. రైతులకు, డ్వాక్రామహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని అనేక హామీలిచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరునెలలుగా రుణమాఫీ చేయలేక కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్ ఖాన్, మాసీమ బాబు, ఎంపీ సురేష్, అనుబంధ విభాగాల సభ్యులు జీఎన్ఎస్ మూర్తి, పులిసునీల్‌కుమార్, నిత్యానందరెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి, కరిముల్లా, బంగారు నాగయ్య, ఎస్ఎండీ షఫీ, బి. అమర్నాథ్రెడ్డి, పత్తి రాజేశ్వరి, టిపి వెంకట సుబ్బమ్మ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. -
అందమైన ప్రేమకథ
ఓ పల్లెటూరిలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఎన్. రామవర్థన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుప్పెడు గుండెను తడితే..’. బసవన్, మైనా జంటగా ఏపీ హనుమంతరెడ్డి నిర్మించారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తూదొడ్డి గ్రామంలో ఈ చిత్రం షూటింగ్ చేశామనీ, ఇది మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని నిర్మాత తెలిపారు. ఇదొక అందమైన ప్రేమకథ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనమ్ వెంకట్, సమర్పణ: పంచలింగాల అమర్నాథ్రెడ్డి. -
బిట్స్‌లో కోలాహలంగా ‘వేద’
బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన ‘వేద’ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి 11 కళాశాలలకు చెందిన 950 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్లపై అవగాహన కల్పించారు. శామీర్‌పేట్ రూరల్: బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన ‘వేద’ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి 11 కళాశాలలకు చెందిన 950 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్లపై అవగాహన కల్పించారు. గౌరవ అతిథులుగా ఐటీ శాఖ చీఫ్ రిలేషన్, స్టార్టజీ అధికారి అమర్నాథ్రెడ్డి, నిసా డీఐజీ విక్రమ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, దాన్ని చేరుకునేందుకు శ్రమించాలని అన్నారు. విద్యార్థులు పదిమందికి ఉపాధి కల్పించేవిధంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారు భవిష్యత్తులో రాణిస్తారని ఆకాంక్షించారు. 20 యేళ్ల క్రితం ఇలాంటి అవకాశాలు ఉండేవి కావన్నారు. అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్లపై అవగాహన కల్పించడం బాగుందన్నారు. ఐఐటి, ఐఐఐటీ, బిట్స్ లాంటి ఉన్నతమైన విద్యాసంస్థల గురించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. బిట్స్‌లో చదివి సివిల్స్‌లో 280వ స్థానం దక్కించుకున్న అలంకృత అనే విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్, కృష్ణమూర్తి ఐఐటీ అకాడమీ, సెయింట్ పాట్రిక్స్, నారాయణ, శ్రీచైతన్య, నానో, ఐఐటీ రామయ్య, శరత్, సంజీవని ఐఐటీ అకాడమీ, డెల్టా జూనియర్ కళాశాల, ఫిడ్జ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
పార్టీ నాయకులతో కమిటీలా?
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, అన్నింటికీ పార్టీ నాయకులతో కమిటీలు వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా మహిళలు, రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫించన్లు బాగా తగ్గించి లబ్దిదారులను ఇబ్బందుల పాల్జేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇన్ని సమస్యలతో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి వెళ్తే ప్రజలే తిరస్కరిస్తారని అమర్నాథరెడ్డి హెచ్చరించారు. -
జేసీ దివాకర్ రెడ్డి వల్లే అనంత హత్యలు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో తమ పార్టీ కార్యకర్తల హత్యకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డే కారణమని వైఎస్ఆర్ సీపీ నాయకులు గుర్నాథ్రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. హత్యకు గరైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మల్లికార్జున మృతదేహంతో శనివారం అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే వారి ఆందోళనకు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ నేతలతోపాటు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఎస్పీ కార్యాలయం ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
రాజంపేట, న్యూస్‌లైన్: ‘ప్రస్తుత ఎన్నికల్లో మాకు పోటీగా ధనికులు, కేంద్ర మాజీ మంత్రులు బరిలో ఉన్నారు.. అయితే మాకు రెండు కవచాలు ఉన్నాయని.. అవి జగన్ ఓదార్పు యాత్ర.. షర్మిల పాదయాత్ర అని’ వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. సోమవారం రాజంపేటలోని వైఎస్సార్ సర్కిల్ (పాత బస్టాండు)లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలతో పాటు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డిలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్నపాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పేద ప్రజలను ఆలోచింపచేసేలా వైఎస్సార్ పాలన ఉందన్నారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ గొప్పతనం గురించి లబ్ధిదారులు చెపుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు అందుతున్న పింఛన్‌ను జగన్ సీఎం అయితే పెంచుతారన్న ఆశతో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలుమాఫీ చేస్తామన్నారు. ఆకేపాటి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిపథంలో నడిపించారన్నారు. ై వెఎస్సార్ను పొగిడిన నేతలే ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసి కష్టాలపాలు చేశారన్నారు. ఎన్నికల సమయంలో న్యాయం కోసం వైఎస్సార్సీపీ ఓటు అనే ఆయుధంతో న్యాయం చేయాలని కోరుతుందన్నారు. కిరణ్, చంద్రబాబుపాలనలో ప్రజలు అనేక కష్టాలు చవిచూశారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ మాటలను ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో తీగలపై దుస్తులు ఆరేసుకుంటారని చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు. పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రులు పోటీ చేస్తున్నారని, వారు ధనబలంతో ముందుకొస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో 39వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు రుణపడి ఉంటానని అన్నారు. రాజంపేట ఆర్ఓబీని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారని, దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి తాను చేసినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి సోదరులు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డి, మాజీ ఎంపీపీ కడవకూటి సాయిబాబా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డి, ప్రముఖ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, రాజం పేట మార్కెట్ కమిటీ మాజీ చెర్మైన్లు చొప్పా యల్లారెడ్డి, పోలి సుబ్బారెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ చెర్మైన్ రామప్రసాద్‌రెడ్డి, మైనార్టీ నేతలు మసూద్అలీఖాన్, జాహిద్‌అలీ పాల్గొన్నారు. -
టీడీపీ భూస్థాపితం ఖాయం
పలమనేరు, న్యూస్‌లైన్: మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కొండంత బలం వచ్చిందని పలువు రు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద సోమవారం సుబ్బయ్యకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ సుబ్బయ్య లాంటి సీనియర్ నాయకులు తమ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఆయన రాకతో పార్టీకి మరింత బలం పెరిగిం దన్నారు. ఇదే సమయంలో పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు దళిత నేతలంతా ఏకతాటిపైకి రావడం, ముస్లిం మైనారిటీలు అండగా నిలవడం, బడుగు బలహీన వర్గాలు తమ పార్టీని అక్కున చేర్చుకోవడం పార్టీకి ఎంతగానో మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు కుమ్మక్కు, కుట్ర లు నచ్చక ఎంతోమంది సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఇప్పటిదాకా టీడీపీ ఈ ప్రాం తంలో సజీవంగా ఉందంటే దానికి కారణం సుబ్బయ్య కృషేనన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం తన కు ఎంతగానో మేలు చేకూరుస్తుందన్నారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ సుబ్బయ్య రాకతో పలమనేరు అసెంబ్లీ ఎన్నికల్లో అమరనాథరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నా రు. టీడీపీ డబ్బున్న వారితో నిండిపోయిందని విమర్శించారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందు కే ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. సుబ్బ య్య పార్టీలోకి రావడం తమకందరికీ సంతోషాన్ని కలిగించిందన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమన్నారు.అనంతరం మాజీమంత్రి సుబ్బయ్య మాట్లాడారు. ఇంతమంది మిత్రుల మధ్య తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ.కుమార్, ఖాజా, రవీంద్ర, శ్యామ్, మూర్తి, కమాల్, ఖాజా, ఎలి జర్,మోహన్ రెడ్డి, ఏకే.మూర్తి, కిషోర్, షబ్బీర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
కథ అడ్డం తిరిగింది
సాక్షి ప్రతినిధి, కడప: ‘విధేయతే మార్గం -పదవే లక్ష్యం’ అన్న సూక్తి ఆయనకు అతికినట్లు సరిపోతుంది. పదవి కోసం అధినేతల వద్ద విధేయత చూపడం ఆతర్వాత వారిని విస్మరిస్తుండటం అనవాయితీగా వస్తోంది. గడిచిన ఐదేళ్లకాలంలో ఎవరు పదవిలో ఉంటే వారికి విధేయత చూపిన ఘనత జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లాకే దక్కుతోంది. కొత్త మంత్రి వర్గం ఏర్పడి మరో ఛాన్స్ దక్కుతుందని భావించగా రాష్ట్రపతిపాలన దిశగా అధిష్టానం అడుగులు పడుతుండటంతో నిరాశే మిగులుతోంది. రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్న అహ్మదుల్లా అనతి కాలంలోనే రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఐదేళ్ల పదవీకాలాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. నాలుగవసారి కూడా అవకాశం దక్కుతుందేమోనని ఎదురు చూస్తుండగా కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గుచూపుతుండటంతో మరో ఛాన్సుకు బ్రేకు పడనున్నట్లు సమాచారం. వైఎస్ విధేయుడిని అంటూనే... కడప నియోజకవర్గానికి 2004లో అహమ్మదుల్లా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ చలువతోనే రాజకీయాల్లో వచ్చానని, ఆయన పెట్టిన భిక్షతోనే పదవి దక్కిందని ప్రకటించారు. 2009లో మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్మదుల్లాకు వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. వైఎస్ రుణం తీర్చుకోలేనిదని మరోమారు అహ్మదుల్లా స్పష్టం చేశారు. వైఎస్ అకాలమరణం చెందడం, కొన్ని కారణాలతో వైఎస్కుటుంబం కాంగ్రెస్‌పార్టీని వీడింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, దేవగుడి ఆదినారాయణరెడ్డి వైఎస్ కుటుంబం వెన్నంటే నడిచారు. అహ్మదుల్లా కూడా అదేబాటలో నడుస్తారని భావించారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రి పదవి పదిలం కావడంతో వైఎస్ కుటుంబాన్ని విస్మరించారు. కిరణ్ వెంబడి ఉంటూనే.. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం ఆయనకు విధేయుడుగా అహ్మదుల్లా కొనసాగారు. పదవికి కిరణ్ దూరం కాగానే అయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అహ్మదుల్లా వంటి నేతలను చూసి కిరణ్ బలుపుగా భావించారని ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కాగానే పరిస్థితి అర్థమయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, కొత్త ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండాలని అహ్మదుల్లా అలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలనవైపు అడుగులు పడుతుండటంతో అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. -
`2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు`
తిరుపతి: రానున్న 2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 50 శాతం ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారని, కానీ ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని 18 శాతం ఓట్లతో దివాలా దిశకు తీసుకెళ్లారని వారు విమర్శించారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాల వ్యవస్థాపకుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒక విధానం అంటూ లేదని వారు చెప్పారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారని అన్నారు. అప్పటినుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
అరుణమ్మా.. మీ పార్టీలో చేరితే ఎంత ప్యాకేజీ ?
పలమనేరు,న్యూస్‌లైన్ : ‘మా పార్టీలో ఎవరు చేరినా ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఆరోపణలు చేసే మీరు రేపు గల్లా అరుణమ్మ మీ పార్టీలో చేరితే ఆమెకు మీరు ప్యాకేజీ ఇస్తున్నారా..? లేదా మీరే తీసుకుం టున్నారా..? అనే విషయం చెప్పాలని చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి సూటిగా ప్రశ్నించారు. పలమనేరులోని పార్టీ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, పూతలపట్టు నాయకులు కేశవులుతో కలసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తెలుగుదేశానికి చిత్తశుద్ధితో పనిచేసే ముఖ్య నాయకులంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో బాబు తెలుసుకోవాలన్నారు. రెండ్రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పలమనేరు సమీపంలోని కుష్ఠు రోగుల ఆస్పత్రి వద్ద ఓ కుష్ఠు రోగిని పలకరించి అప్యాయంగా దగ్గరకు చేర్చుకున్నారన్నారు. అదే పని మీరు చేయగలరా..? అని బాబును ప్రశ్నించారు. మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి వారిని విడదీసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నాడు బీజేపీని అస్యహించుకొని నేడు వారి మద్దతు కోసం ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ఏమార్చే గర్జనలు వద్దని హితవు పలికారు. మీకంటే సీనియారిటీ ఉన్న అమరనాథ రెడ్డి కుటుంబం పార్టీని ఎందుకు వీడిందో మీకు తెలుసా అని ప్రశ్నించారు. జిల్లాలో హంగామా చేస్తున్న మీ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నాయకుల కుమారులు త్వరలోనే మా పార్టీలోకి వస్తారన్నారు. మీకు దాడి వీరభద్రరావులాంటి నమ్మకస్తులు అవసరం లేదని సుజనా చౌదరో లేక రమేష్ చౌదరి మాత్రమే చాలని ఎద్దేవా చేశారు. నిన్న నేను, నేడు గాంధీ, రేపు మరొకరు.. తెలుగుదేశం పార్టీని గతంలో నేను వీడితే, నేడు గాంధీ వీడారని, రేపు మరొకరు బయటకొస్తారని పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా ఖాళీ అయ్యిందని, చివరకు చంద్రబాబు మాత్రమే మిగులుతారన్నారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన గాంధీనే బయటకొచ్చేశాడంటే చంద్రబాబు తీరు ఎలా ఉంటుం దో తెలుసుకోవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో మనోహర్, చింతల, ఆదిమూలం, గాంధీ, రోజా, మునిరామయ్య, ప్రవీణ్ ఇంతమంది చిత్తశుద్ధితో పనిచేసే వారు ఎందుకు పార్టీని వీడారన్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి కుటుంబానికి గల విశ్వసనీయతతోనే అంద రూ ఆ పార్టీలోకి వస్తున్నారన్నారు. మా వ్యక్తిత్వాలను మసక బారే విధంగా తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నేడు ఆ పార్టీలో మాకు జరిగింది రేపు ఇంకొక్కరికి జరగదని ఏం గ్యారంటీ అన్నారు. కుమ్మక్కు రాజకీయాలను వివరించడానికి జనగర్జన పెట్టడం దేనికని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎఫ్‌డీఐ బిల్లు, ఎమ్మెల్సీ, సొసైటీ ఎన్నికలు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల దాకా ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడారు. నాడు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చి నేడు గర్జనలు చేస్తే ఏం ప్రయోజనమన్నారు. ఇంత అధ్వానమైన ప్రతిపక్ష నేత ఈ దేశంలోనే లేరన్నారు. సత్యవేడు ఇన్చార్జ్ ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతను కాపాడేది జగన్ మాత్రమేనని, దీనిని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పూతలపట్టు నాయకులు కేశవులు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లిందన్నారు. ఈ సమావేశంలో సునీల్, వంగపండు ఉషా, వినయ్ రెడ్డి, సీవీ కుమార్, హేమంత్‌కుమార్ రెడ్డి, మండీసుధా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మేమంతా జగన్ వెంటే...
బెంగళూరు, న్యూస్‌లైన్ :వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తామంతా ఉంటామని ఆ పార్టీ స్థానిక ఐటీ విభాగం ప్రతిన బూనింది. ఆదివారం కుందనహళ్లిలో గేట్ సమీపంలోని గోవిందరెడ్డి కల్యాణమంటపంలో ఐటీ విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ... రెండు కళ్ల సిద్ధాంతంతో కోస్తా, రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని సోనియాగాంధీ చేయలేకపోయిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సైకం శ్రీనివాసులు రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం కన్వీనర్ వీరభద్రరావు, శ్రీనివాసులు రెడ్డి, నవీన్, పీసీ రెడ్డి, ప్రతాపరెడ్డి, వైఎస్ఆర్ కర్ణాటక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, భక్తవత్సలరెడ్డి పాల్గొన్నారు. -
భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ తల్లి కట్టెలమ్మి చదివించింది. బీఈడీ వరకు చదివిన ఆ యువతి గ్రామానికి చెందిన ఓ అగ్రవర్ణానికి చెందిన యువకుడి ప్రేమలో పడింది. బాగా చూసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకుని బిడ్డను కన్న తర్వాత అతనికి కులం అడ్డొచ్చింది. భార్యాబిడ్డను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఊరువదిలి వెళ్లిపోతున్న భార్య, అత్తను అంతమొందించేందుకు యత్నించాడు. బాధితులు ఆదివారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన అలివేలమ్మ కుమార్తె విజయలక్ష్మి(23). బీఈడీ వరకు చదివింది. ఏడాదిన్నర క్రితం గ్రామానికి చెందిన అమరనాథ్‌రెడ్డి ప్రేమిస్తున్నానని వెంటపడడంతో అతన్ని నమ్మి ప్రేమవివాహం చేసుకుంది. ఇద్దరూ హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డారు. పెళ్లి అయిన అయిదు నెలలకు విజయలక్ష్మి గర్భవతి అయింది. అదే సమయంలో భర్త అమరనాథ్‌రెడ్డి తన పది ఎకరాల ఆస్తికి తల్లీ,బిడ్డ అడ్డొస్తారని భావించాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించాడు. తలచిందే తడువుగా ఆమెను హైదరాబాద్‌లోనే వదిలి స్వగ్రామానికి వచ్చేశాడు. బాధితురాలు మోసపోయానని భావించి పుట్టింటికి చేరింది. గ్రామంలో ఉన్న భర్తను నిలదీసింది. అతను చేరదీయకపోవడంతో ఎస్పీకి మొరపెట్టుకుంది. పోలీసుల జోక్యంతో ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. మదనపల్లెలోని బాలాజీనగర్‌లో కాపురం పెట్టారు. వీరికి కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నాడు. బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ అతని ఆందోళన పెరిగింది. తల్లీబిడ్డను వదిలించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. తరచూ కొట్టడం, ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటూ వేధింపులకు గురిచేయడం తీవ్రతరం చేశాడు. రెండు రోజుల క్రితం భార్యాబిడ్డపై హత్యాయత్నానికి యత్నించాడు. భర్త వికృతచేష్టలు చూసి ఏ క్షణంలో ఏమిచేస్తాడోనని భయపడిన విజయలక్షి బిడ్డను తీసుకుని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంది. బతకాలంటే ఈ ఊరు వదిలివెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. తల్లి అలివేలమ్మ(45) బాలాజీనగర్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లి ఇంట్లోని బట్టలు, కొన్ని పాత్రలను మూటగట్టుకుంటుని బయల్దేరేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అమరనాథ్‌రెడ్డి అత్తపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగాడు. గాయపడిన బాధితురాలిని స్థాని కులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లిని చూసిన విజయలక్ష్మి ఆవేదనకు లోనైంది. భర్త వేధింపులపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
'సీఎం సీట్లో కూర్చొని విభజనకు సూచనలు ఇస్తున్న కిరణ్'
రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్, అమర్నాథ్రెడ్డిలు ఆరోపించారు. బుధవారం కడపలో వారు మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని విభజనకు సూచనలు ఇస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు తన కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి యూటర్న్ తీసుకున్నట్లు చంద్రబాబు, కిరణ్‌లు నటిస్తున్నారని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఒక్కరే పోరాడుతున్నారని వారు ఈ సందర్బంగా స్పష్టం చేశారు. సమైక్యవాదానికి లేక విభజనవాదానికి అనుకూలమో వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని కిరణ్, చంద్రబాబులను ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. -
కడపలో అమర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
-
'జగన్‌ను చూసి కాంగ్రెస్, టీడీపీలకు నిద్రపట్టడం లేదు'
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు నిద్రపట్టడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. ఆదివారం రాజంపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్లారు. ఆ పర్యటనను అడ్డుకోవడం వెనక కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు విజయమ్మ పర్యటనను ఆడ్డుకోవడమే అత్యుత్తమమైన ఉదాహరణ అని ఆయన అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. -
మా రాజీనామాలు ఆమోదించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్య రాష్ట్రం డివూండ్‌తో స్పీకర్ ఫారాట్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. నెలరోజుల క్రితమే సమర్పించిన రాజీనావూలేఖలపై, స్పీకర్ తక్షణమే నిర్ణయుం తీసుకుని వాటిని ఆమోదించాలని విన్నవించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాధ్రెడ్డి బుధవారం అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఆయన చాంబర్లో కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ రాజీనామాలను పరిశీలిస్తునట్టుగా స్పీకర్ చెప్పారన్నారు. రాజీనామాల ఆమోదంలో వురింత జాప్యం జరిగిన పక్షంలో పార్టీ ఎమ్మెల్యేలందరం మరోసారి స్పీకర్‌ను కలసి ఒత్తిడిచేస్తామన్నారు. విభజన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలియగానే తాము రాజీనామా లేఖలు ఇచ్చామన్నారు. అన్నిప్రాంతాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమవుతోంది కనుకనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. -
నీరో కంటే దుర్మార్గుడు బాబు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి ప్రజల కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్సే తెలంగాణ ఇవ్వాలని మేమెలాంటి లేఖ ఇవ్వలేదు ఒక తండ్రిలా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందున సమైక్య శంఖారావం పూరించాం విభజనకు అనుకూలంగా బాబు లేఖలిచ్చారు ఇప్పుడు సీమాంధ్ర ఎలా తగలబడుతుందో చూడ్డానికి యాత్ర చేస్తున్నాడు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోమ్ చక్రవర్తి కంటే దుర్మార్గుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీలేని చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలని సూచించారు. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్సేనని, ప్రజలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్‌కు చేతగాని తేలిపోయినందునే రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతున్నామని తెలిపారు. అందుకోసం ప్రజల ఆకాంక్షల మేరకు చిత్తశుద్ధితో రాజీనామా చేశామని, వాటిని ఆమోదింపజేసుకునేందుకే శాసనసభ స్పీకర్‌ను కలిసేందుకు వచ్చామని చెప్పారు. స్పీకర్‌కు ఫోన్‌చేస్తే అందుబాటులో లేనని చెప్పారని, మళ్లీ అందరం కలిసి వచ్చి రాజీనామాలను ఆమోదించుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని కొందరు నేతలు దుష్ర్పచారం చేస్తున్నారనీ.. తమ పార్టీ అలాంటి లేఖ ఏదీ ఇవ్వలేదని వారు స్పష్టంచేశారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక తండ్రిలా ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరామే తప్ప తెలంగాణ ఇచ్చేయాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నిర్ణయాలపై యూ టర్న్ తీసుకోవడంగానీ, మాట మార్చడంగానీ వైఎస్సార్ కాంగ్రెస్ చేయలేదని చెప్పారు. సీమాంధ్రులను మోసం చేసేందుకే బాబు యాత్ర నీరో చక్రవర్తికంటే చంద్రబాబు పెద్ద దుర్మార్గుడని గడికోట, ఆకేపాటి మండిపడ్డారు. ‘‘ఇటలీ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించుకుంటూ ఉన్నాడని ఇప్పటివరకు ఆయనే పెద్ద విలన్ అని అనుకున్నాం. అంతకంటే దుర్మార్గుడు చంద్రబాబు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర తగలబడుతుంటే... ఎలా కాలుతుందో చూద్దామని యాత్ర చేస్తున్నాడు’’ అని విమర్శించారు. నిన్నటివరకు రాష్ట్రాన్ని విభజించాలని లేఖలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, కూలీలు, కార్మికులంతా సమైక్యరాష్ట్రం కోసం రోడ్లపైకి వస్తుంటే వారిని మోసం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబు ఏయే సందర్భాల్లో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారనేవిషయాలను వివరించారు. ‘‘2012 డిసెంబర్ 26న రాష్ట్రాన్ని విభజించాలని ప్రధానమంత్రికి లేఖ ఇచ్చి తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచలేదా? 2008లో తెలంగాణ ఇవ్వాలని ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ తరువాత పొలిట్‌బ్యూరోలో తెలంగాణ తీర్మానం చేయలేదా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధికారంలోకొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పలేదా? ఇప్పుడేమో సీమాంధ్ర ప్రజల ఉద్యమంలో న్యాయముందని తిరుగుతున్నావ్? ఎవరిని మభ్యపెట్టడానికి బాబూ... ఈ మాటలు? సీమాంధ్రలో 35 రోజులుగా ప్రజలు పస్తులుండి ఉద్యమిస్తుంటే నువ్విచ్చే బహుమతి ఇదేనా? కుట్రలకు అల వాటుపడి రాజకీయం చేయడం నీకు అల వాటే. అధికారం కోసం మహానుభావుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడివి నీవు. మళ్లీ సరిగ్గా అదేరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవమంటూ యాత్ర చేస్తున్నావు నీలో అసలు నిజాయితీ ఎక్కడుంది? ఏ రోజు నిజం మాట్లాడవు? ఇకనైనా నీవు చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలందరినీ క్షమాపణ కోరి రాజకీయాల నుంచి తప్పుకో’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని బాబు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఈరోజు (మంగళవారం) దిగ్విజయ్‌సింగ్ గారు... చంద్రబాబు నాకు మంచి మిత్రుడు. నన్ను ఏమైనా అనే అర్హత ఆయనకుందని అనలేదా? మీ బంధం వెనుక మతలబు ఏమిటి?’’అని వారు ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సమన్యాయం అంటే ఏమిటో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారని... నీళ్లు, ఉద్యోగాలు, హైదరాబాద్ వంటి అంశాలపై ఇరు ప్రాంతాలకు తండ్రి మాదిరిగా న్యాయం చేయడమే సమన్యాయమని ఎమ్మెల్యేలు చెప్పారు. -
'బాబు సీమాంధ్రలో ఎలా పర్యటిస్తారు'
చిత్తూరు:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సీమాంధ్రలో పర్యటించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు..ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని మంచి చేసుకోవడానికే చంద్రబాబు యాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో ఆత్మగౌరవ పేరుతో బాబు బస్సుయాత్ర చేయడాన్ని ఖండించారు. తెలుగు ప్రజలకు స్పష్టమైన వైఖరి వెల్లడించాకే యాత్ర చేయాలన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని మరోసారి మోసగించేందుకు యాత్రకు సిద్ధమయ్యారంటూ పలువురు నేతలు మండిపడుతున్నారు. -
ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి ధీక్ష భగ్నం
-
ఆరో రోజుకు చేరిన అమరనాథ రెడ్డి దీక్ష
-
కాంగ్రెస్,టీడీపీలపై శ్రీనివాసులు,అమర్నాధరెడ్డి ఫైర్
-
ఆమర్నాత్ రెడ్డి మీడియా సమావేశం