
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం.
అంతకు మందు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డుపాలు అయ్యారన్నారు. మామాడికి గిట్టుబాటు లేక రైతులు రోడ్లెక్కారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గు కాదా అన్నారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment