‘కడుపుకి అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా’ | MLA Roja Fires On TDP And Chandrababu Naidu | Sakshi

కడుపుకి అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా : రోజా

Published Mon, Oct 29 2018 6:30 PM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

MLA Roja Fires On TDP And Chandrababu Naidu - Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం టీడీపీ చేస్తున విమర్శలపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. విజయపురం మండలం విద్య వనరుల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 70 సీలింగ్‌ ఫ్యాన్లను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, క్యాబినేట్‌ మంత్రులు కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఎంత వెటకారంగా, స్టుపిడ్‌గా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు వెనకున్న నేరస్థుడిని పట్టుకుని శిక్షించకుండా.. ఆ తప్పు ఎవరి మీద నెట్టేయాలని, ఎలా తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ ప్రెసెమీట్లను చూస్తుంటే అధికారులను ఏవిధంగా వాడుకుంటున్నాడో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చెబుతున్న ప్రతిమాట అబద్దమని నిరూపితమవుతూనే ఉందన్నారు. కత్తి జనవరి నుంచి హోటల్లోని ఉందని, అప్పటి నుంచి హోటల్‌ యజమాని హర్షవర్దన్‌ చౌదరి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయన లోకేష్‌కు , చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ను అంతమొందించడానికి ఇది టీడీపీ చేసిన కుట్రేనని విమర్శించారు. ఆపరేషన్‌ గరుడ గురించి సిగ్గులేకుండా మాట్లాడుతన్న చంద్రబాబు.. శివాజీని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టాలన్నారు. ఆపరేషన్‌ గరుడ వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకి తీయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement