సాక్షి, ఏలూరు : ఏపీ ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి జరిగి వారం రోజులైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రభుత్వం నామమాత్రంగా విచారణ జరపుతూ, హడావుడి చేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారిని కూడా నియమించకుండా సాధారణ అధికారితో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసును నీరుగార్చి, నిందితులను తప్పించేందుకు చంద్రబాబు రాజీకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
విశాఖలో వైఎస్ జగన్‌పై దాడి జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ఆయన హైదరాబాద్‌కు వెళ్లారన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుపట్టడం సరికాదన్నారు. శివాజీ చెప్పిన గరుడ పురాణం వాస్తవమని నమ్ముతున్న చంద్రబాబు ఆయనను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. నిజాలు బయటపడాలంటే తక్షణమే ఉన్నత స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment