aalla nani
-
రెడ్జోన్లలో మిని కోవిడ్-19 సెంటర్లు: ఆళ్ల నాని
-
'ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి'
-
రెడ్ జోన్ పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు
-
రెడ్ జోన్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
-
విశాఖలో మంత్రి ఆళ్ల నాని సమీక్ష
-
సీఎం జగన్ స్ఫూర్తితో నేనున్నానని...
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందక మృతి చెందకూడదు. ప్రతిపేదవాడికీ నాణ్యమైన వైద్యం అందాలి.. అని నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఆ ఉదాత్త ఆశయంతోనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని తన మానస పుత్రికగా భావించి పక్కాగా అమలు చేశారు. పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. నాడు నాన్న వేసిన బాటలోనే.. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనాథగా మారిన ఆరోగ్యశ్రీని పొదివి పట్టుకొని.. మళ్లీ ఆర్తుల చెంతకు చేరుస్తున్నారు. ఇదే ఆశయ స్ఫూర్తిని విశాఖ నుంచే చాటిచెప్పారు. పదిరోజుల కిందట శారదాపీఠం సందర్శనకు వచ్చిన సందర్భంలో విమానాశ్రయంలో బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయంలో ఉన్న తోటి విద్యార్ధి నీరజ్ కోసం స్నేహితులు చేపట్టిన ఆందోళన చూసి చలించిన సీఎం జగన్ వెంటనే తన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వైద్యసాయానికి చర్యలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ బాటలోనే.. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారు.. డిఫ్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). రెండు కిడ్నీలు పాడై ఆర్ధిక బాధలతో చికిత్స కోసం అల్లాడిపోతున్న ధనోజ్‌కు బాసటగా నిలిచారు. ధనోజ్ దయనీయస్థితిపై నాలుగురోజుల కిందట సాక్షిలో వచ్చిన కథనంతో పాటు కుటుంబసభ్యులు పంపిన వాట్సాప్ మెసేజ్‌ను చూసి స్పందించిన ఆయన వారిని తనవద్దకు పిలిపించుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకంతో డబ్బుల కోసం నిన్నటి వరకు దాతల సాయం ఆశించిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఏకంగా సర్కారు అండ దొరికింది. ఎంత ఖర్చయినా సరే మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనని డిఫ్యూటీ సీఎం నాని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం మైక్యూర్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆదరణ చూపిన డిఫ్యూటీ సీఎం నాని రుణం తీర్చలేనిదంటూ ధనోజ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. విశాఖలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోపణల్లో చిక్కుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చూపుతూ, నిబంధనలకు నీళ్లొదులుతూ రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. విశాఖలో ఆర్కే ఓమ్నీలో జరిగిన వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కాంక్షకు దర్పణం పడుతోంది. రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ పేద బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని రూ.70 వేలు వసూలు చేయడం, వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆటో నడుపుకుని బతుకీడుస్తున్న ఆ కుటుంబం అంత సొమ్ము చెల్లించుకోలేక వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వైద్యం అందిస్తోంది. ఇలా విశాఖలో పేద, మధ్య తరగతి రోగుల నుంచి రూ.లక్షల్లో కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి అరుదుగానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనకాపల్లి మండలం రేబాకకు చెందిన ఆటో డ్రైవర్ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్ (9)కు రెండు కిడ్నీలు పాడై పోయాయి. రెండు నెలల క్రితం ధనోజ్తో పాటు అతని సోదరుడు డెంగ్యూ జ్వరం బారినపడ్డారు. తొలుత వీరిని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినా నయం కాకపోవడంతో ఇదే ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అప్పట్లో ఇద్దరికీ రూ.1.50 లక్షలు బిల్లు చెల్లించారు. ఇటీవల ధనోజ్ ఫిట్స్‌తో పడిపోవడంతో తొలుత అనకాపల్లి ఆస్పత్రిలోనే చేర్చారు. అక్కడ వైద్యులు ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాబుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని, బతకాలంటే లక్షల్లో ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆటో నడుపుకుని బతికే తాము అంత ఖర్చును భరించలేమని ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలని కోరారు. ధనుష్ రోగం ఆరోగ్యశ్రీ కిందికి రాదని చెప్పి దశల వారీగా రూ.70 వేలు కట్టించుకున్నారు. వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ కుటుంబ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఈనెల 13న ‘సాక్షి’ ‘పేదింటి బిడ్డకు పెద్ద కష్టం’ శీర్షికతో కథనాన్ని ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న భావనతో కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ధనోజ్ పరిస్థితిని తెలియజేశారు. రూరల్ ఆస్పత్రులతో కార్పొరేట్‌కు లింకులు ఇక నగరంలోని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఆస్పత్రులతో లింకులున్నాయి. తమ వద్దకు వచ్చిన రోగులను నేరుగా విశాఖలోని ఫలానా ఆస్పత్రికి వెళ్లండంటూ పంపిస్తున్నారు. ఈ కేసుల నుంచి వచ్చే సొమ్ములో కొంత సొమ్మును పంపిన ఆస్పత్రులకు ఇస్తుంటారు. ఇదొక వ్యాపారంగా మారింది. ఉదాహరణకు ధనోజ్, అతని సోదరుడు రెండు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో అనకాపల్లిలోని లండన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నయం కాకపోవడంతో ఓమ్నీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇప్పుడు కిడ్నీ జబ్బుతో ఉన్న ధనోజ్‌ను ఓమ్నీకి మళ్లీ రిఫర్ చేసింది కూడా లండన్ ఆస్పత్రే. ఇలా జిల్లాలోను, నగరంలోనూ పలు ఆస్పత్రులకు ఎన్నో వ్యాపార లింకులున్నాయి. ఇదే ఇప్పుడు ఆయా హాస్పిటళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. మంత్రి నాని మానవత్వం తక్షణమే స్పందించిన మంత్రి వైద్య రికార్డులతో తన వద్దకు రమ్మని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అంతేకాదు..ఆరోగ్యశ్రీకి అర్హత ఉన్నా అందులో చేర్చకపోవడంపై ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలని, ఆరోగ్యశ్రీలో ఉచితంగా ధనోజ్‌కు వైద్యం అందించాలని ఆదేశించారు. కార్పొరేట్/ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి చేరుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి సూచనలతో ధనోజ్‌కు మెరుగైన వైద్యం అందించడానికి మంగళవారం ఉదయం నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైద్యం ఖర్చుపై ఆందోళన చెందవద్దని, ఆ సొమ్మును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. రూ. కోట్లలో బకాయిలు ఇన్నాళ్లూ ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కోట్లలో పేరుకుపోయిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించడం మానేసింది. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందజేస్తే బకాయిలు ఆలస్యంగా వస్తాయన్న ఉద్దేశంతో ఆయా ఆస్పత్రులు ఏవేవో వంకలు పెట్టి తిరస్కరిస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న రోగి కుటుంబ సభ్యులు అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని నగదు చెల్లించి వైద్యం చేయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోవడానికి ఇదో కారణమని చెబుతున్నారు. -
ఆరోగ్యశ్రీ వర్తించదని పిండేశారు!
సాక్షి, విశాఖపట్నం : ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయాల్సిన ఓ కార్పొరేట్ ఆస్పత్రి.. రోగి కుటుంబాన్ని పిండేసింది. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించదని.. వైద్యానికి నగదు చెల్లించాల్సిందేననడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి మరీ సదరు ఆస్పత్రికి చెల్లించారు. ఇదే విషయమై బాధితుని కుటుంబ సభ్యులు ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశాలతో ఆస్పత్రి అధికారులు దిగొచ్చి రోగికి అరోగ్యశ్రీ కింద వైద్యం అందించారు. విశాఖలో రెండు కిడ్నీలు చెడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడి విషయంలో అక్కడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రి వైద్యులు వ్యవహరించిన తీరు ఇదిగో ఇలా ఉంది..విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని రేబాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్ (9)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రిలో ఈ బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యానికి నగదు చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో అప్పుచేసి రూ.70 వేలు చెల్లించారు. ఇతర పరీక్షల కోసం మరో రూ.60 వేలు చెల్లించాలన్నారు. ధనోజ్ చికిత్సకు ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని తల్లిదండ్రుల అభ్యర్థనను ఈనెల 13న ‘సాక్షి’ ప్రచురించింది. దీనిని ధనోజ్ కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో మంత్రి ఆళ్ల నానికి 14 రాత్రి పంపించారు. వీటిని చూసిన మంత్రి 16న ఏలూరులో ఉన్న తన ఇంటికి రావాలని ధనోజ్ కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పగా వారు మంత్రి ఇంటికి వెళ్లారు. బాబు పరిస్థితిని వివరించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. దీంతో బాలుడికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించాలని, ఇప్పటికే ఆస్పత్రికి చెల్లించిన సొమ్మును తిరిగిచ్చేయాలని నాని ఆదేశించారు. మరోవైపు.. సోమవారం ఉదయం జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రవిచంద్ర పాడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రిని సందర్శించారు. బాలుడికి డయాలసిస్, చికిత్స కొనసాగించాలని, ఇప్పటికే వసూలుచేసిన రూ.70 వేలను వెనక్కివ్వాలని ఆస్పత్రి ఏజీఎం (ఆపరేషన్స్) గణేష్‌ను ఆదేశించారు. ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి నోటీసులు జారీచేశారు. కాగా, మెరుగైన వైద్యం కోసం ధనోజ్‌ను మంగళవారం మైక్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం ఆశయ స్ఫూర్తితోనే.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందాలి.. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ మేరకే స్పందించి ఆదేశాలిచ్చాను. – ఆళ్ల నాని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
వైద్యం.. దైవాధీనం
శుక్రవారం ఉదయం 8.36 గంటలకు : రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగప్ప సర్జికల్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఇతని కాలుకు సర్జరీ చేయాల్సి ఉంది. పై అంతస్తులోని సర్జికల్ వార్డు నుంచి నల్లప్ప తన భార్య మల్లక్క సాయంతో అతి కష్టం మీద ఆపరేషన్ థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో వేళ్లూనిన నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. అందుబాటులో ఉండాల్సిన ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో నల్లప్పకు కాస్త బీపీ ఎక్కు వైనా పరిస్థితి ఊహించడమే కష్టం. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యం దైవాధీనంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కుగా సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో రోగుల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. పాలనా వైఫల్యం కారణంగా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఈ ఏడాదిలో ఇప్పటికే 170 చిన్నారులు మృత్యువాతపడ్డారు. అదేవిధంగా పలు విభాగాల్లో వైద్యుల ఇష్టారాజ్యం, స్టాఫ్ నర్సులపై పనిభారం.. తరచూ విద్యుత్ సమస్య.. ఏసీలు, ఫ్యాన్లు.. ఇతరత్రా పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగులు ప్రత్యేక్ష నరకం చూస్తున్నారు. దీనికి తోడు ఓ ఉన్నతాధికారి అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 19 మంది సీనియర్ ప్రొఫెసర్లను కాదని సూపరింటెండెంట్‌గా అర్హుడికి పట్టం కట్టింది. గత జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రిపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడా ఆసుపత్రిలో సేవలు అందకపోవడానికి కారణమైంది. గత మూడేళ్లుగా రోగుల అవస్థలు చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిగా పేరున్నా.. ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల బోధనాసుపత్రికి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు మరో 250 పడకలు ఆసుపత్రికి రానున్నాయి. కానీ ఆసుపత్రిలో రోజూ 1,300 అడ్మిషన్, 2వేల మంది ఔట్ పేషెంట్లు ఉంటున్నారు. అయితే కొందరు వైద్యుల ఇష్టారాజ్యం కారణంగా సరైన వైద్య సేవలు అందక ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇకపోతే 2010లో అప్పటి ప్రభుత్వం జీఓ 124ను విడుదల చేసింది. ఆ మేరకు 649 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఆ జీఓ కలగా మారడంతో పోస్టులు భర్తీకాక ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతోంది. పసికందుల ప్రాణాలతో చెలగాటం ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని(ఎస్ఎన్సీయూ) పట్టించుకునే నాథుడే లేరు. హెచ్ఓడీ.. ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఇన్చార్జ్ బాధ్యతలిచ్చినా.. ఆయన పట్టించుకోకపోవడంతో నలుగురు వైద్యులకే యూనిట్ అప్పగించి చేతులు దులుపుకున్నారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు కూడా పసికందులకందించే సేవల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కరువైంది. పాలు పట్టించే సమయంలో తల్లులకు సూచనలివ్వాల్సిన స్టాఫ్‌నర్సులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలు సరిగా పట్టించకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి పసికందులు మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. చిన్నపిల్లల విభాగంలో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఏడాది నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు. ఈయనకు మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించకపోవడం గమనార్హం. ఇక్కడుండే మరో అసోసియేట్ ప్రొఫెసర్ డెప్యూటేషన్‌పై కర్నూలుకు వెళ్లిపోయారు. అర్హత లేకపోయినా అందలం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు ఆర్‌ఎంఓలు తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉంటున్న వీరు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(ఎమర్జెన్సీ వైద్యులు) ఆర్ఎంఓ సీట్లలో కూర్చుని పనులు చేసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా డాక్టర్ జగన్నాథ్‌కి సూపరింటెండెంట్ పోస్టులో కూర్చునేందుకు ఎలాంటి అర్హత లేకున్నా అధికార పార్టీ అండదండలతో ఆయన ఆ సీటులో కొనసాగుతున్నారు. పనులు నత్తనడక.. ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్, బరŠన్స్ వార్డు, 150 సీట్లకు సంబంధించి రూ.70 కోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీట్ల పెంపునకు సంబంధించి పట్టుమని 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఎన్ఏబీహెచ్కి సంబంధించిన కొన్ని పనులు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి చేపడుతుండడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అజెండా: మంత్రి రాక నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ఓ అజెండాను సిద్ధం చేసింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు జీఓ 124, నెల్లూరు ఆస్పత్రి తరహాలో ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ విభాగం, మెడిసిన్, ఈఎన్టీ, గైనిక్, ఆప్తమాలజీ, తదితర విభాగాల్లో యూనిట్ల పెంపు, పరికాల కొనుగోలుకు రూ.2కోట్లు ఇవ్వాలనే అజెండాను యాజమ్యాం సిద్ధం చేసింది. ఈ అజెండాను మంత్రికి అందజేయనున్నారు. అడ్డూఅదుపు లేని అవినీతి ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఓ కీలక అధికారికి కాసులిస్తే ఏ పనైనా ఇట్టే జరిగిపోతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఖైదీని ఎలాంటి రోగం లేకున్నా నెలల తరబడి వార్డులో ఉంచారు. ఓ ఆర్థో వైద్యుడు అడ్మిషన్లో కీలకంగా వ్యవహరించినా సూపరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెడికల్ రికార్డు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఏజెన్సీకి కట్టబెట్టడం, టెండర్లు లేకుండా ఏసీలు కొనుగోలు, ఆఫీస్ కార్యాలయంలో డెప్యూటేషన్, పదోన్నతులు, రాయితీలు కావాలన్నా సిబ్బంది చేయి తడపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్ చేశారు. అంతా ఆ అధికారి కనుసన్నల్లోనే అక్రమాల బాగోతం సాగుతోంది. సూపర్ స్పెషాలిటీకి మోక్షమెప్పుడో? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మోక్షమెప్పుడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైంది. 2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ వాట రూ.30 కోట్లు విడుదల చేయలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. తామే పనులు చేయిస్తున్నామంటూ పాలకులు ప్రజలను మభ్యపెట్టారు. ఆస్పత్రి ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్యం కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర సేవలు అందుబాటులోకి వస్తాయి. నేడు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాక అనంతపురం అర్బన్: ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 6.20 గంటలకు అనంతపురం చేరుకోనున్న ఆయన.. ఆర్అండ్బీ అతిథిగృహంలో విడిది చేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, పోస్ట్‌నేటల్ వార్డు, చిన్నపిల్లల వార్డును సందర్శిస్తారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ధర్మవరం చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో రాత్రి 6 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు. -
‘దాడి జరిగి వారమైనా.. కేసు పురోగతి లేదు’
సాక్షి, ఏలూరు : ఏపీ ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగి వారం రోజులైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రభుత్వం నామమాత్రంగా విచారణ జరపుతూ, హడావుడి చేస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారిని కూడా నియమించకుండా సాధారణ అధికారితో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసును నీరుగార్చి, నిందితులను తప్పించేందుకు చంద్రబాబు రాజీకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో వైఎస్ జగన్‌పై దాడి జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ఆయన హైదరాబాద్‌కు వెళ్లారన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుపట్టడం సరికాదన్నారు. శివాజీ చెప్పిన గరుడ పురాణం వాస్తవమని నమ్ముతున్న చంద్రబాబు ఆయనను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. నిజాలు బయటపడాలంటే తక్షణమే ఉన్నత స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
నిరుద్యోగ ద్రోహి బాబు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగ యువతను ఘోరంగా మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, ఎన్నికల వేళ ఇంటికో ఉద్యోగం, లేకుంటే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నేడు నిరుద్యోగులను రోడ్లపాలు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఏలూరు సమన్వయకర్త ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆ«ధ్వర్యంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని దీక్షా శిబిరాన్ని సందర్శించి నిరుద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో పేరుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు గత ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ నిరుద్యోగులను పట్టించుకున్న పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగ యువత భృతి కోసం దరఖాస్తులు చేసుకుంటే సవాలక్ష ఆంక్షలతో తిరస్కరిస్తూ, తమకు చెందిన వారికి కొందరికి మాత్రమే తూతూమంత్రంగా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆళ్లనాని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో గద్దెనెక్కటం కోసం మోసపు హామీలు గుప్పిస్తూ చివరికి యువత, విద్యార్థులకు సీఎం చంద్రబాబు హ్యాండిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చుకున్నారని, లక్షలాదిమంది నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. జిల్లాలోనే లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే కేవలం 500 మంది దరఖాస్తులు మాత్రమే స్వీకరించి, తీరా చివరికి వచ్చే సరికి కేవలం పదిమందికే నిరుద్యోగ భృతి కల్పిస్తామంటే ఎలా అంటూ చురకంటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాబోయే ఎన్నికల్లో యువత, విద్యార్థులు టీడీపీకి గట్టి బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతు అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు ఆళ్లనాని మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందనీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విబాగం జిల్లా అధ్యక్షుడు కందుల దినేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరంకి సాయి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను, విద్యార్థులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ ఉద్యోగమో, నిరుద్యోగ భృతో ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లు గడిచినా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు అవకాశం కుదరటంలేదని, ఇక టీడీపీని నమ్మే స్థితిలో యువత, విద్యార్థులు లేరని స్పష్టం చేశారు. రూ.2వేలు ఇస్తానని మాయమాటలు చెప్పి, ఇప్పుడు కొంతమందికి మాత్రమే రూ.వెయ్యి ఇస్తానని చెప్పటం దారుణమన్నారు. దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ, ఏలూరు అధ్యక్షులు ఏలూరు అంజి, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సీహెచ్ సందీప్, నాయకులు జక్కంపూడి సత్య, టీ.దిలీప్, బేత లోకేష్, టీ.వినయ్, ఎస్కే.రబ్బానీ, ఏ.రాము, డానియెల్ రాజు తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిదేశి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు మంచెం మైబాబు, పార్టీ నేతలు మున్నులజాన్ గురునాధ్, జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, నెరుసు చిరంజీవి, కైసర్, మహిళా నేతలు మున్నీ, గంపల బ్రహ్మావతి, బాలిన థనలక్ష్మి, బట్టు విజయలక్ష్మి, మోటమర్రి సదానందకుమార్, ఎన్.సుదీర్‌బాబు, సుంకర చంద్రశేఖర్, బాలిన నవహర్ష, శశిధర్‌రెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ శ్రీను, బోడా కిరణ్‌కుమార్, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. -
చింతమనేనికి సీఎం వత్తాసు
పెదపాడు: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం వల్లే ఆయన ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. అప్పనవీడుకు చెందిన గరికపాటి నాగేశ్వరరావును చింతమనేని దౌర్జన్యం చేసి కొట్టడంతో ఆయన్ను గురువారం వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆళ్లనాని మాట్లాడుతూ రక్షించాల్సిన ఎమ్మెల్యేనే దాడులకు పాల్పడితే ఇంకా ప్రజలను ఎవరు కాపాడుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్, చంద్రబాబు చింతమనేని దందాల్లో వచ్చే వాటాలను తీసుకోవడం వల్లే ఆయన ఎన్ని ఆగడాలు చేసినా కాపాడుతూ వస్తున్నారని విమర్శించారు. చింతమనేని కొట్టి గాయపర్చిన ఓ మహిళా తహసీల్దార్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని భయపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ను కొట్టాడన్న కారణంగా ప్రశ్నించిన గరికపాటి నాగేశ్వరరావును కొట్టి 45గంటలు అయినా ఎమ్మెల్యేపై ఇంత వరకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం చూస్తేంటే ప్రభుత్వ యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. తమకు చింతమనేని నుంచి ఎప్పుడు రక్షణ దొరుకుతుందా అని దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు బొమ్మ చిరిగిందని వీరంగం వేసి కొట్టిన వారిపై కేసునమోదు చేయకుండా.. తక్షణమే కేసు నమోదు చేయాలని అడిగారని 32మందిపై కేసు పెట్టడం సబబు కాదన్నారు. ఆ 32మందిపై వెంటనే కేసులు ఉపసంహరించాలని, చింతమనేని అరెస్ట్ చేయాలని ఆళ్లనాని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన బాధితులకు అండగా ఉండాలని తమను ఆదేశించారని చెప్పారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్యయకర్త కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ 40 కేసులున్న చింతమనేని ఎమ్మెల్యే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు 40నుండి 50వరకు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయ కర్త కొఠారు రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ పెదపాడు మండల కన్వీనర్ అప్పన కనక దుర్గా ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండే లాజరు, గారపాటి బాస్కరరావు, కమ్మ శివరామకృష్ణ, ఆళ్ల సతీష్‌చౌదరి, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు చలమల శెట్టి రమేష్, అభయాంజనేయస్వామి దేవాలయ మాజీ చైర్మన్లు కేతినీడి జైనేంద్రకుమార్, బొప్పన కృష్ణ, మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, మధ్యాహ్నపు బలరాం, బేతాళ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలి : ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నానీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నియోజక వర్గాల పెంపుకు కేంద్రం అంగీకరించినా చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటారని విమర్శించారు. జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి చంద్రబాబు ప్రత్యేక హోదాపై మనసు మార్చుకున్నారని ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. -
చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు..
సాక్షి, జంగారెడ్డిగూడెం: తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే పోరాటంలో భాగస్వాములవ్వాలని ఆళ్లనాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఆయన మాటల్ని, చేస్తున్న మోసాలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న వైఎస్సార్సీపీ, వామపక్షాల పార్టీలపై చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా నినాదం చేసిన వారిని అరెస్టులు చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. -
‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లనాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆళ్లనానిని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని, ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.