
ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నానీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
నియోజక వర్గాల పెంపుకు కేంద్రం అంగీకరించినా చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటారని విమర్శించారు. జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి చంద్రబాబు ప్రత్యేక హోదాపై మనసు మార్చుకున్నారని ఆళ్ల నాని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment