‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’ | we will face ap governement hurdles: gangula prabhakar reddy, aalla nani | Sakshi
Sakshi News home page

‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’

Published Thu, Mar 2 2017 6:14 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’ - Sakshi

‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్లనాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్‌​ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్‌ నేతలతో విస్తృతంగా చర్చించారు.

పార్టీ సీనియర్‌ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆళ్లనానిని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంగుల ప్రభాకర్‌ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని, ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement