Nagari
-
రోజా ఇంట ఘనంగా భోగి పండుగ సంబరాలు
-
రోజా ఇంటి వద్ద టీడీపీ ఉన్మాదం..
-
నగరిలో పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్.. రోజా సీరియస్
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా నగరిలో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. చిత్తూరులోని నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లైక్సీలని చించేసి పైశాచిక ఆనందం పొందారు. ఇక, ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లైక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాబూ.. అప్పులేనా నీ సంపద సృష్టి: రోజా
సాక్షి, తిరుపతి: సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు.నేడు నగరిలో వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సహా పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం, నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్సీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది. పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్గా చేసింది. వైఎస్ జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు. నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి.. రాబోయేది మన ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరిలో విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అందరికీ తెలియజేయాలన్నారు.భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం ఇది. రోజా నగరికి రాజా లాంటి వ్యక్తి. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు. వైఎస్ జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. అత్యధిక మెజారిటీతో రోజాను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. నగరి అభివృద్ధి చేసిన వ్యక్తి రోజా.. అందుకే గెలిపించాలని కోరుతున్నాను. ప్రపంచంలో వైఎస్ జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనో గొప్ప వ్యక్తి. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే.. ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్సార్సీపీలో ఉండటమే ఎంతో మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్నా తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి.. నెరవేర్చని మోసపు ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. వైఎస్ జగన్ కోసం పోరాడే వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ఒక్కరికి కష్టం ఇచ్చినా కరుణాకర్ రెడ్డి, మేము అండగా ఉంటామన్నారు.మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ..‘భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడు. టీటీడీ చైర్మన్‌గా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రజల అందరు పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈవీఎంల స్కామ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఈవీఎంల స్కామ్ చేశారు. అందుకే వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురైంది. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తోంది. నగరిలో రోజాను గెలిపించండి. మీకు మేము అండగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. -
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
ఘనంగా రోజా పుట్టిన రోజు వేడుకలు
-
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
-
పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...
-
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
-
నగరి గవర్నమెంట్ హాస్పిటల్ పై ఆర్కే రోజా ఎమోషనల్..!
-
నగరి టీడీపీలో అసమ్మతి గళం
-
చంద్రబాబు డర్టీ పొలిటీషియన్: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్ అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ లాంటి నాన్ లోకల్ పొలిటిషియన్లకు ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. సంక్షేమ రాష్ట్రంగా సీఎం జగన్ ఏపీని ముందుకు నడిపిస్తున్నారన్న మంత్రి రోజా. తండ్రి బాటలోనే సీఎం జగన్ మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 80 వేలు అందిస్తున్నారని, మైనారిటీ పక్షపాతిగా వక్ఫ్ బోర్డు స్థిర చర ఆస్తులు రక్షణకు అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్లతోపాటు 2024 ఎన్నికల్లో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తమ నియోజకవర్గంలో కోటి 85లక్షలతో షాది మహల్ నిర్మాణం చేయడంతోపాటు మసీదుల మరమ్మత్తులకు రూ. 2 కోట్లు కేటాయించారని తెలిపారు. మీరా సాహెబ్‌పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. -
షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం: మంత్రి ఆర్కే రోజా
-
సీఎం జగన్ పై పెన్షన్ లబ్ధిదారుల ప్రశంసలు
-
చర్చకు నేను రెడీ టీడీపీ నాయకులకు రోజా ఓపెన్ ఛాలెంజ్
-
దమ్ము లేకనే.. దత్తపుత్రుడు
సాక్షి, తిరుపతి: సొంత బలంపై, సొంత కుమారుడిపై నమ్మకం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాకేజీ చెల్లించి దత్త పుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘ఏ ఇంటికీ, ఏ సామాజిక వర్గానికీ, ఏ ప్రాంతానికీ ఎలాంటి మంచి చేయని గత పాలకులు ఎన్ని దుర్మార్గాలకు దిగుతున్నారో నాలుగు మాటలు మీ ముందుంచుతా. దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఆ పెద్ద మనిషి మూడుసార్లు సీఎంగా ఉన్నాడు. 28 ఏళ్ల క్రితమే ఆయన సీఎం అయ్యాడు. మూడుసార్లు సీఎం అయిన ఆ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా? గత పాలనకు, ఈ నాలుగేళ్ల పాలనకు తేడా ఉందా? లేదా? అనేది ఆలోచన చేయండి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సభలో సీఎం ఏమన్నారంటే.. దత్తపుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నాడు ఆ మనిషి ఎలాంటివాడో అందరికంటే మీకే బాగా తెలుసు. ఆ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయండి. అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడడు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని మనిషి.. ఆ పెద్ద మనిషి!! ఆ పెద్ద మనిషికి సొంత బలం మీద గానీ, సొంత కుమారుడి మీద గానీ నమ్మకం లేదు. కాబట్టే దత్త పుత్రుడిని ప్యాకేజీ ఇచ్చి అద్దెకు తెచ్చుకున్నాడు. ప్రతి అడుగులో కుళ్లు, కుతంత్రాలే! ఈమధ్య కాలంలో ఆయన గానీ, ఆయన కుమారుడు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, వారి భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ రెచ్చగొట్టాలి, కుతంత్రాలు చేయాలి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలనే కుతంత్రాలు ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. వీళ్లతో ఎల్లో మీడియా ప్రయాణం.. టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేనేమో అనుకునే పరిస్థితులు ఇవాళ లేవు. ఆ పాత రోజులు పోయాయి. ఈరోజు ఎల్లో మీడియా చంద్రబాబునాయుడును ఏ రకంగా మోస్తోందో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకునేందుకు గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద ఆధారపడి వాటినే జీవితంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనేదే వారి లక్ష్యం. కుర్చీ లాక్కుని ఫోటోలకు దండేస్తారు ఇదే వ్యక్తి.. ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు కూడా చివరకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గులు మళ్లీ ఎన్టీఆర్ చనిపోగానే ఆయన శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరుతో ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే... ఒకసారి ఆ మనిషి మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నా. రైతులు, అక్కచెల్లెమ్మలకు దగా ఆ పెద్దమనిషి (చంద్రబాబు) రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. ఎన్నికల వేళ రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. రుణాలు కట్టకండి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబుకు ఓటే యాలని చెప్పి రైతులను నిట్ట నిలువునా మోసం చేశాడు. డ్వాక్రా మహిళలు రుణాలు కట్టొద్దు.. బాబు సీఎం అవుతాడు.. వెంటనే తీరుస్తాడని చెప్పి ఆ అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. వాళ్లను వంచించడమే కాకుండా వారి తరపున కడుతున్న సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి నిలువుగా దగా చేశాడు. ఆ పెద్ద మనిషి చివరకు పిల్లలను కూడా వదల్లేదు, నిరుద్యోగులనూ వదల్లేదు. 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి మనస్తత్వం చూస్తే... ఎన్నికలకు ముందు అందంగా ఉండే మేనిఫెస్టో తెస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తికి.. చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉందో? ఆలోచన చేయాలని అడుగుతున్నా. బాబు చేసిన అప్పులున్నా .. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు, సాకులు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. వెనకడుగు వేయలేదు. సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలని ఆలోచన చేయలేదు. నా అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలు బాగుండాలనే తపన, తాపత్రయంతో మీ బిడ్డ బటన్¯ నొక్కుతున్నాడు. నాలుగేళ్లలో రూ.2.33 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష చూపించే వ్యవస్థ లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుడు చేసిన అప్పుల గ్రోత్ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో అనే పాలన సాగింది. ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, దత్తపుత్రుడికి కాస్తంత, మిగిలింది చంద్రబాబునాయుడికి అని డీపీటీ సాగింది. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అడుగులోనూ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు. మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచినే. మీకు ఒక్కటే చెబుతున్నా. వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా? లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి. బాబువి శవ రాజకీయాలు.. పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. అప్పడు పోలీసులు చేసిన తప్పల్లా.. ‘‘బాబు గారూ మీకు పర్మిషన్ ఉన్న రూ ట్లోనే ప్రయాణం చేయండి. మీకు అనుమతున్న రూట్లో కాకుండా వేరే రూట్లో ఎందుకు ప్రయా ణం చేస్తారు? వేరే పార్టీ వాళ్లు అక్కడ ధర్నా చే స్తుంటే అక్కడికి వెళ్తామని ఎందుకు అంటున్నా రు? మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వస్తాయి. ఆ రూట్ వద్దు’’ అని చెప్పటమే!! అలా చెప్పినందుకు పోలీసులపై కర్రలు, బాటిళ్లతో దాడి చేశారు. చివరకి ఓ పోలీసు సోద రుడి కన్ను కూడా పోగొట్టారు. 47 మంది పోలీసులపై దాడి చేశారు. దాడి చేసి రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చే యాలనే దిక్కుమాలిన ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఈ పెద్ద మనిషి ఢిల్లీ వెళ్లా డు. ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్రంలో పోలీ సులు తనమీద హత్యాయత్నం చేశారని ఫిర్యా దు చేయడానికి వెళ్లాడు. దొంగ ఓట్లను వారే చేర్చి మనపై ఫిర్యాదు చేయటానికి బయల్దేరాడు. ఇలా అబద్ధాలు ఆడి, మోసం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచన చేయండి. ఇది అభివృద్ధి కాదా..? అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానం చెప్పండి. మన పాలనలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఇవాళ జరుగుతుంది. స్కూళ్ల పరిస్థితిని చూపించండి. నా డు–నేడుతో రూపురేఖలు మారిపోయి ఇంగ్లీష్ మీడియం, ఐఎఫ్‌పీ ప్యానెళ్లు వచ్చాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. కరిక్యులమ్‌లో మార్పులతోపాటు విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది. మన పిల్లలు చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి? అని ప్రశ్నించండి. నాడు – నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. విలేజ్ క్లినిక్స్, ఫ్యామి లీ డాక్టర్ విధానం మన కళ్లెదుటే కనిపిస్తోంది. 53 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకా రం చుట్టాం. ఎవరైనా అభివృద్ధి గురించి మా ట్లాడితే ఇది అభివృద్ధి కాదా? అని అడగండి. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 6 పోర్టులు మాత్రమే ఉంటే ఈ నాలుగేళ్లలో మరో 4 సీ పోర్టులను కడుతున్నాం. మన రాష్ట్రం వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీలో దేశంలోనే నంబర్ వన్‌గా కొనసాగుతోందని చెప్పండి. -
సొంత కొడుకుపైనే బాబుకు నమ్మకం లేదు: సీఎం జగన్
సాక్షి, నగరి: సొంత కొడుకుపై నమ్మకం లేక దత్త పుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని మండిపడ్డారు. గొడవలు సృష్టించి శవరాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి ‘విద్యాదీవెన’ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. చదవండి: విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్ దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ముఖ్యమంత్రి విమర్శించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచాడని ప్రస్తావించారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ ఫైర్ ►గత పాలకులు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు మీ ముందుంచుతా. ►ఇదే పెద్దమనిషి, ఇదే దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఈ పెద్ద మనిషి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ►28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ► ఈ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా అని అడుగుతున్నా. ► ఈ 4 సంవత్సరాల ఈ పాలనకు తేడా ఉందా తేడా లేదా అనేది ఆలోచన చేయండి. ►ఈ మనిషి ఎలాంటోడో అందరికంటే మీకే బాగా తెలుసు. ► ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? ఆలోచన చేయండి ► సొంత బలం మీద గానీ, సొంత కొడుకు మీద గానీ ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు. ►ఈ మధ్య కాలంలో ఈయన గానీ, కొడుకు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్లు మాట్లాడుతున్న భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ►వీళ్లతో పాటు కలిసి ప్రయాణం చేసే ఎల్లో మీడియా. ►ఏదైనా టీవీలో వార్త వస్తే నిజమేమో అనుకొనే పరిస్థితిలు పోయాయి. ►ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పే గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లందరూ అబద్ధాల మీద, కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్ల మీద జీవిత ఆశయంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ►ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయల్దేరాడు. ఎన్నికల కమిషన్‌ను కలుస్తున్నాడట. ► రాష్ట్రంలో తనమీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడానికి బయల్దేరాడు. ►దొంగ ఓట్లను తామే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నామని చెప్పడానికి ఢిల్లీకి బయల్దేరాడు. ►ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రలకు పాల్పడే వ్యక్తి ఎవరైనా ఉంటారా? చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు మ నుంచి సీఎం కూర్చుని లాగేసుకొని.. ►ఎన్టీ రామారావును సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. ►పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు. ►ఇదే దుర్మార్గుడు ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుకుంటారు. ►ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ►ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు. ►ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా. మాయ మాటలతో రైతులను మోసం ►రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. ►రూ.87,600 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నాడు. ► బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు రావాలని నిట్ట నిలువునా మోసం చేశాడు. ► అక్కచెల్లెమ్మలు రుణాలు కట్టొద్దు, బాబు ముఖ్యమంత్రి అవుతాడు తీరుస్తాడని మోసం చేశాడు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి మోసం చేశారు. ►చివరకు ఈ పెద్ద మనిషి పిల్లలను వదల్లేదు, నిరుద్యోగులను వదల్లేదు. ► 2014కు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ► జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ►ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో మేనిఫెస్టో ►ఎన్నికలకు ముందు ఇదిగో అందంగా మేనిఫెస్టో తెస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తాడు. ►ఆయన వెబ్ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. ►ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు, ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. ► చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉంది ఆలోచన చేయాలని అడుగుతున్నా. ►చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. ► వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్. అయినా వెనకడుగు వేయలేదు. ►సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలనుకోలేదు. ►నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 2.33 లక్షల కోట్లు నేరుగా వెళ్తున్న పరిస్థితి వచ్చింది. ► ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రిమాత్రమే. ►అప్పుడు చేసిన అప్పుల గ్రోత్ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్ రేటు తక్కువ. ► మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు. అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే ►ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, టీవీ5కి ఇంత, దత్తపుత్రుడికి కాస్తింత. చంద్రబాబుకు మిగిలింది ఇంత. ► జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే. ►ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. ► ఎటువంటి లంచాలు, వివక్ష లేదు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ►మనల్ని విమర్శలు చేస్తున్నారో వాళ్లందరికీ సమాధానాలు చెప్పండి. ఎప్పుడూ చూడని అభివృద్ధి, జరుగుతోందని చెప్పండి. ► దేశానికే రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పాలన జరుగుతోంది. ►స్కూళ్ల పరిస్థితి చూపించండి. స్కూళ్లు, కాలేజీలు మారుతున్నాయి. ►స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పనులు, ఐఎఫ్ పీ ప్యానెల్స్ వస్తున్నాయి. ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ►కరికులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్‌గా పనిచేస్తున్నాయి ►చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ► ఇది కాదా అభిృద్ధి అని గట్టిగా ప్రశ్నించండి. ►ఆస్పత్రులు రూపు రేఖలు మారుతున్నాయి. ►విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం కనిపిస్తోంది. ►సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్‌గా ఆస్పత్రులు పని చేస్తున్నాయి. ►50 వేల మందిని హాస్పటల్స్ లో రిక్రూట్ మెంట్ అయ్యారు. ►స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశంలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.98 శాతం మాత్రమే. ►కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అని అడగండి. ►రాష్ట్రంలో ఉన్నమొత్తం పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మరో 4 సీ పోర్టులు వేగంగా కడుతున్నాం. ► 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. వాళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని చెప్పండి. ►ఇది కాదా అభివృద్ధి అని అడగండి. ►మనం చేస్తున్న యుద్ధం మారీచులతో చేస్తున్నాం. ► అబద్ధాల్ని నిజంగా చెబుతారు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు. ►మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచిని. ► వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలు నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. ►మీ ఇంట్లో మీకు మంచిజరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి. ►మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఇవ్వాలని, ఇంకా మంచి చేసే రోజులు రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా’నని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్
సాక్షి, నగరి, చిత్తూరు: విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. సీఎం జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే! ►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం. ► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం. ►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. ►ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. ► భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. 3 నెలలకొసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. ►ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి 15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ►జగనన్న వసతి దీవెన అనే ఒక్క పథకం ద్వారా మాత్రమే రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. ►కేవలం ఈ రెండు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 4 సంవత్సరాల కాలంలోనే రూ.15,600 కోట్లు ఇచ్చాం. ►ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. ►ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి. ► ఆ కాలేజీలో విద్యా బోధన బాగాలేకున్నా, వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నాం. ఫిర్యాదుల కోసం 1902కు కాల్ చేయండి ►ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇవాళ ఇస్తున్న డబ్బు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కాక కాలేజీ యాజమాన్యాలు వేరే రకంగా ఇంకో ఫీజు ఇంకొకటని ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి. ► జగనన్నకు చెబుదాంకు ఫోన్ చేయండి. ► ముఖ్యమంత్రి కార్యాలయం, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది. ► ఇటువంటి తప్పిదాలు జరగకుండా కట్టడి చేస్తుంది. యాక్షన్ తీసుకుంటుంది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ►4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం. ►తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నాం. ►ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నాం. ► స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు తీసుకొచ్చాం. ► గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చాం. ►బైజూస్ కంటెంట్‌తో కూడా పిల్లల కరికులమ్‌ను అనుసంధానం చేశాం. ► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ►మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన వచ్చే ఏడాది నుంచి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. ► సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా మన గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ► ఇంతకు ముందు రాష్ట్రంలో చూడని విధంగా, నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నాం. ►ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ►63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి. ►డిసెంబర్ నాటికల్లా మిగిలిన క్లాస్ రూముల్లో ఏర్పాటవుతాయి. ► 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అనే తాపత్రయపడుతూ ట్యాబ్స్ ఇచ్చేందుకు మొదలుపెట్టాం. స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద ►గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద కింద విపరీతమైన మార్పులు తెచ్చాం. ►పిల్లలు తింటున్న తిండి గురించి ఆలోచించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే అది మీ అన్న పరిపాలనలోనే. ► సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చాం. ► చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధన తీసుకొస్తూ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ►ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం. ► వసతి దీవెన తీసుకొచ్చాం. ► ప్రపంచంతో పోటీ పడుతూ విదేశాల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం కోటీ 25 లక్షల దాకా ఫీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. మన రాష్ట్రంలో తప్ప. ►కరిక్యులమ్‌లో ఆన్ లైన్ వర్టికల్స్ తెచ్చాం. తప్పనిసరి ఇంటర్నషిప్ తెచ్చాం. ►కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,296 కోట్లు. మీ అన్న చదవిస్తాడని చెబుతున్నా ► ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్ రావాలి. ► మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఇబ్బంది పడకుండా పిల్లలను బడులకు, కాలేజీలకు పంపండి. ►విద్యా దీవెన, వసతి దీవెనలో ఎటువంటి కత్తిరింపులు లేవు. ►ప్రతి పిల్లాడికీ మీ అన్న, మీ తమ్ముడు చదివిస్తాడని చెబుతున్నా. ► పిల్లలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులకు ప్రతి సామాజిక వర్గానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రసంగించారు చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు -
విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు
సాక్షి, నగరి: ఇంటర్లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని.. పవన్, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలని చురకలంటించారు.. విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు.. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్‌ను నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళ్తారన్న ఆమె... అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఈ సందర్బంగా వేదికపై మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైందని.. కొర్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు రాలేదని తెలిపారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని.. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారని ప్రస్తావించారు. చదవండి: నగరి: జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ 2024 వైఎస్ జగన్ వన్స్‌మోర్ వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే.. అవతలివైపు జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్ జగన్‌ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా 2024 జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్‌ది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ కుప్పంలో సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజగకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందన్న రోజా... వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిపారు.. వారంటీ లేని చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా? అని మండిపడ్డారు.. మనకు రియల్ హీరో కావాలా? రీల్ హీరో కావాలా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.. ‘ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. కంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్ వల్లే. అన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం. అన్నదానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు. ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్న అది విద్యతోనే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మారు కాబట్టే ప్రతి పేద వాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్ అండగా నిలిచారు’ అని రోజా పేర్కొన్నారు. -
నగరి: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్డేట్స్ ► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. నగరిలో సీఎం జగన్ కామెంట్లు అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు. సీఎం జగన్ ప్రసంగం ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం. మంత్రిరోజా కామెంట్లు ► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు. ► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం ► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం ► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. ► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు. ► రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. 📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. 📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. 📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది. 📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. -
28న చిత్తూరు జిల్లా నగరిలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన నగరి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను జమ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
చైనా అమ్మాయితో నగరి అబ్బాయి ప్రేమ.. హిందూ సంప్రదాయంలో పెళ్లి
నగరి: చిత్తూరు జిల్లా నగరి అబ్బాయికి చైనా దేశానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. నగరి మున్సిపాలిటీ పరిధి కొత్తపేటకు చెందిన వీఎన్ కృష్ణన్, లత దంపతుల కుమారుడు వీకే పురుషోత్తమన్ బీఈ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి చైనాలోని బెల్జింగ్లోని బీఎండబ్ల్యూ గ్రూప్ ఆసియా లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బెల్జింగ్కు చెందిన వాంగ్ డిసెంగ్, యాంగ్ కనియింగ్ దంపతుల కుమార్తె డబ్ల్యూ.మింగ్ మింగ్ అదే కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ యువతితో కృష్ణన్‌కు పరిచయం ఏర్పడి..అది కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. సంప్రదాయ వ్యవహారాల అడ్డు తొలగించుకునే విషయంలో ఇరువురు విజయం సాధించారు. కృష్ణన్ తల్లి, బంధువుల కోరిక మేరకు నగరిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరపడానికి వధువు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో చైనా నుంచి నగరికి వచ్చిన అమ్మాయికి వరుని తరఫు వారు హిందూ సంప్రదాయం ప్రకారం నలుగు పెట్టి, చీరకట్టి పెళ్లికూతురిలా ముస్తాబు చేసి స్థానిక ఏజేఎస్ కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. -
మంత్రి రోజాపై అవమానకరంగా మాట్లాడటంపై నగరి మహిళలు ఆగ్రహం
-
నగరిలో లోకేష్ కి ఘోర అవమానం
-
విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు..
విధి విసిరిన సవాల్‌కు బెదర లేదు.. ప్రకృతి ప్రకోపానికి భయపడలేదు.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా కుంగిపోలేదు. తల్లిదండ్రులు చెంతలేరని చింతించలేదు. కన్నవారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. పట్టుమని పదేళ్లు కూడా లేని తోబుట్టువులకు అన్నీ తానై ఆప్యాయతలు కురిపిస్తోంది. అమ్మలా లాలిస్తూ.. నాన్నలా అనురాగాన్ని పంచుతూ.. తనూ చదువుకుంటూ, పసివాళ్లకు కొండంత అండగా నిలుస్తోంది. అమ్మచేత గోరుముద్దలు తింటూ.. చందమామ కథలు వింటూ హాయిగా గడపాల్సిన వయసులో కుటుంబ బరువు, బాధ్యతలు మోస్తూ శభాష్ అనిపించుకుంటోంది. తల్లిదండ్రులు పక్క రాష్ట్రంలో కూలి పనులు చేస్తుండగా విధిలేని పరిస్థితుల్లో ఏడాదిన్నరగా చెల్లీతమ్ముడితో కలిసి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్న తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ చిట్టితల్లి జీవన స్థితిగతులపై‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు: మండలంలోని ముడిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన సాగర్, సెల్వి దంపతుల కుమార్తె ప్రతిజ్ఞ (12) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బాలిక తమ్ముడు సుదీప్‌కుమార్ (7) 2వ తరగతి, చెల్లెలు మధుర (4) అంగన్వాడీ సెంటర్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు ముగ్గురూ ఏడాదిన్నరగా ముడిపల్లె ఏస్టీ కాలనీలో ఓ గుట్టపై ఉన్న చిన్న ఇంట్లో నివాసముంటున్నారు. అమ్మలాంటి అక్క ప్రస్తుతం ఈ కుటుంబ పెద్ద దిక్కు ప్రతిజ్ఞ. ఉదయం ఐదింటికే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు తమ్ముడు, చెల్లి ఆలనాపాలనా చూస్తోంది. ఇల్లూవాకిలీ శుభ్రం చేయడం.. పాత్రలు కడిగి తెలిసిన వరకు వంట చేయడం.. వేడినీళ్లు కాగబెట్టి తమ్ముడు, చెల్లికి స్నానాలు చేయించడం.. పౌడర్ కొట్టి అందంగా ముస్తాబు చేసి బడికి తీసుకెళుతోంది. సాయంత్రం బడి నుంచి వచ్చిన వెంటనే మళ్లీ ఇంటి పని చేసుకుని.. తోబుట్టువులతో హోంవర్క్ పూర్తి చేయించడమే కాకుండా.. తానూ చక్కగా చదువుకుంటోంది, బాధ్యతలన్నీ తనపైనే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలన్నా.. కొత్తదుస్తులు కొనాలన్నా.. పండుగపబ్బాలకు ఏవైనా తీసుకురావాలన్నా.. అన్నీ తానై వ్యవహరిస్తోంది ప్రతిజ్ఞ. తన అత్తతో కలిసి ఐదు కిలోమీటర్ల దూరంలోని నగరి వారపు సంతకు వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటోంది. తోబుట్టువులకు ఆరోగ్య సమస్యవస్తే ఆస్పత్రికి తీసుకెళ్తూ అమ్మానాన్నలా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తనకు వినికిడి సమస్య ఉన్నా, తోబుట్టువు లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది హైదరాబాద్‌లో తల్లిదండ్రులు ప్రతిజ్ఞ తండ్రి సాగర్ పెయింటర్. అరకొర సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ ఒక కాంట్రాక్టరు వద్ద భార్యతో పాటు పెయింటింగ్ పనుల్లో కూలీగా చేరాడు. అక్కడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరి్పంచాడు. ఇలా సాఫీగా సాగుతున్న వారి సంసారాన్ని కరోనా రక్కసి కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత పనుల్లేక తల్లడిల్లిపోవాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీ స్వగ్రామానికి రావాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టర్ వద్ద అప్పు తీరకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పిల్లలు ముగ్గురినీ సొంత ఊరికి పంపి.. నెలకో, రెండు నెలలకోసారి వచ్చి బియ్యం, పప్పు దినుసులు, కొంత నగదు ఇచ్చి వెళ్లిపోతున్నారు. మరో రెండేళ్లపాటు పనిచేస్తేగానీ అప్పుతీరని పరిస్థితిలో కన్నపేగును దూరం చేసి కుమిలిపోవాల్సి వస్తోంది. చిట్టి చేతులకు కొండంత అండ ఏడాది క్రితం నుంచి స్వగ్రామంలో ఉన్న ఈ చిన్నారులకు పాఠశాలలో ఒకపూట మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇదిగాక యూనిఫాం, పుస్తకాలు, అంగన్వాడీ ద్వారా గుడ్లు, ఇతర సామగ్రి వస్తుండడం కాస్త ఆదరువుగా నిలుస్తోంది. గ్రామ వలంటీర్ వీరిని గుర్తించి ఇప్పటికే ఆధార్ కార్డు ఇప్పించారు. రేషన్ కార్డుకు సైతం దరఖాస్తు చేయించారు. అది వచ్చిన తర్వాత వీరి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. వచ్చే ఏడాది పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అందనుంది. ఇటీవల వచ్చిన తుపానుకు చిన్నారులు ఉన్న ప్రాంతం ముంపునకు గురికావడంతో ప్రభు త్వం తరఫున కూరగాయలు, వంట సామగ్రితోపాటు ఆర్థిక సాయం అందింది. భయపెట్టిన తుపాను గత ఏడాది వచ్చిన మాండూస్ తుపానుతో ముడిపల్లె ఎస్టీ కాలనీ అతలాకుతలమైంది. ఇళ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిజ్ఞ ఉంటున్న ఇంటి పైకప్పు సైతం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా తమ్ముడు, చెల్లిని రెక్కలకింద పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. అప్పుడప్పుడూ ఇంటికి సమీపంలోనే ఉన్న మేనత్త వచ్చి సాయం అందించేది. తిండికూడా సరిగా వండుకునే పరిస్థితి లేకపోవడంతో అర్ధాకలితోనే అలమటించినట్టు ప్రతిజ్ఞ చెబుతోంది. అమ్మలా చూసుకుంటోంది అక్క ప్రతిజ్ఞ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంచేసి నన్ను నిద్ర లేపుతుంది. చదువుకోమని చెప్పి తాను స్నానం చేసి వంట సిద్ధం చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేలోపు అన్నం చేసి తినిపిస్తుంది. తనే దగ్గరుండి పాఠశాలకు తీసుకెళ్లి వదలిపెడుతుంది. మళ్లీ పాఠశాల వదిలే సమయంలో నన్ను ఇంటికి తీసుకువస్తుంది. రాత్రి పూట అన్నం తినిపిస్తుంది. జ్వరం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్తుంది. అప్పుడప్పుడూ అమ్మా, నాన్న వస్తారు. అప్పటి వరకు అక్కే చూసుకుంటుంది. –సుదీప్‌కుమార్ అక్కే స్నానం చేయిస్తుంది నాకు అక్కే స్నానం చేయిస్తుంది. బట్టలు తొడుగుతుంది. అన్నం తినిపిస్తుంది. రాత్రిళ్లు నేను పక్క తడిపేస్తే ఆ దస్తులను కూడా తనే ఉతుకుతుంది. రాత్రిళ్లు భయపడితే పక్కనే పడుకోనిచ్చి నిద్రపుచ్చుతుంది. అక్కే అమ్మలా అన్నీ చూస్తోంది. మాకు అమ్మా నాన్న లేరనే దిగులు లేకుండా చూసుకుంటోంది. – మధుర అమ్మతో ఉంటూ అలా నేర్చుకున్నా.. రోజూ పెయింటింగ్ పనులకు వెళ్లి వచ్చి మణికట్టు, చేతుల నొప్పితో అమ్మ చాలా బాధపడేది. చేతులు ఒత్తుకుంటూ కన్నీరు పెట్టేది. ఆ బాధ చూసి ఆమెకు వంటచేసే సమయంలో, ఇతర పనుల్లో సాయంగా ఉండేదాన్ని. అలా వంటావార్పు నేర్చుకున్నా. ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకున్నా. తమ్ముడు, చెల్లెల్ని నేనే చూసుకుంటా. ఏవైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతుంటా. – ప్రతిజ్ఞ, ముడిపల్లె ఎస్టీ కాలనీ నాలుగు నెలల్లో వచ్చేస్తాం హైదరాబాద్‌లో నేను, నా భర్త పెయింటింగ్ కాంట్రాక్టు వర్కులు తీసుకొని చేస్తున్నాం. కరోనా సమయంలో తీసుకున్న కాంట్రాక్టులు చేయలేక పోయాం. ప్రస్తుతం ఆ పనులు పూర్తి చేస్తున్నాం. నాలుగు నెలల్లో కాంట్రాక్టర్ వద్ద పని అయిపోతుంది. ముడిపల్లెకు వచ్చేస్తాం. పొదుపు చేసిన డబ్బులు కొంత ఇంటి నిర్మాణానికి వాడుకుంటాం. నగరి పరిసర ప్రాంతాల్లో పెయింటింగ్ పనులకు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాం. – సెల్వి, ప్రతిజ్ఞ తల్లి -
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
ఐటీడీపీ అంటే ఇడియట్స్ టీడీపీ : మంత్రి రోజా
-
పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె రోజా " స్ట్రెయిట్ టాక్ "
-
మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్ అలకాటూరు. నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్ గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్‌గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అయితే కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్‌కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్ రాసినా మెయిన్స్ క్లియర్ కాలేదు. లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఫోన్ ద్వారా ఆన్లైన్లోని మెటీరియల్‌నే చదివారు. 2018లో సివిల్స్ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్‌గా ఉన్నారు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) సాధనతోనే సాధ్యం సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్‌లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్లైన్లో ఎన్సీటీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదివారు. అలాగే ఆన్లైన్లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్ సివిల్స్‌లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్ నాకు మెటీరియల్‌గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్‌పై పట్టు పెంచుకుంటే సివిల్స్‌లో రాణించవచ్చు. న్యూస్ రీడింగ్ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది. –మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం. -
తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?
నగరి: తక్కువ ధరకే వివాహాలు, శుభకార్యాలకు ఆర్డర్లు పట్టేశాడు. వ్యాపారంలో తనకు సాటిరారని నిరూపించాడు. ఇదే ఇతని ప్రాణాలమీదికి తెచ్చినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీన అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం.. నగరి మునిసిపల్ పరిధి, కొత్తపేటకు చెందిన విజయ్ (22) స్థానికంగా లక్ష్మీ డెకరేటర్స్, ఈవెంట్స్ పేరిట పూల దుకాణం నడుపుతున్నాడు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు పుష్పాలంకరణ చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన పలు వివాహ వేడుకలకు పుష్పాలంకరణ చేశాడు. అనంతరం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమిళనాడు వేలూరులోని ఒక లాడ్జీ నుంచి బయటకు పరుగులు తీస్తూ వచ్చిన విజయ్ విషం తాగేశానని, కాపాడాలంటూ కేకలు వేశాడు. అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి చేర్చగా నాలుగురోజుల పాటు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసి విషం తాగించారా? విజయ్ తక్కువ ధరకే పూలడెకరేషన్స్ చేస్తుంటాడు. ఈ విషయమై తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులతో వివాదాలు కూడా జరిగినట్టు సమాచారం. ఇదే ఇతని మృతికి పరోక్షంగా కారణమైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడు అవివాహితుడు, కాగా ఈ నెల 20వ తేదీన అతనికి పుట్టిన రోజు అని, అంతలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం) -
Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్
నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌పై జీవిత రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు. తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు హాజరు కాకపోవడంతో ఎన్ఐ యాక్ట్ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్‌పై ఆమె రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: (ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు) -
హీరోయిన్గా ఉన్నప్పుడే చెన్నైలో ఇల్లు కట్టుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా గాలి భానుప్రకాష్‌పై మండిపడ్డారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో తనపై గాలి భానుప్రకాష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. తాను నంబర్‌వన్ హీరోయిన్గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రాకముందు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. నీ కారణంగానే ముద్దుకృష్ణమ మృతి చెందారట! ఈయన కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడన్నారు. రాజీనామా వార్త అవాస్తవం తాను రాజీనామా చేస్తున్నట్లు సోషల్‌మీడియా, మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారన్నారు. తానెందుకు పార్టీ నుంచి వెళతానని ప్రశ్నించారు. తప్పుచేసినవారు వెళ్లాలన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. -
కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ.. క్లిక్ చేసి బుక్కయ్యింది!
నగరి(చిత్తూరు జిల్లా): కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ వచ్చిందంటూ అమాయకులకు వలవేసి రూ.లక్షలకు లక్షలు కాజేసే నైజీరియన్‌ను చిత్తూరు జిల్లా నగరి సీఐ మద్దయ్య ఆచారి శనివారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘమిత్ర రక్షింద (28)కు ఏడు నెలల క్రితం రూ.2.50 కోట్ల ప్రైజ్ తగిలిందని మెసేజ్ వచ్చింది. వివరాలకు క్లిక్ చేయండని ఓ లింక్ వచ్చింది. ఆశతో క్లిక్ చేయగా ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. కోవిడ్ సమయంలో సేవలకు గాను శాంసంగ్ ఎలక్ట్రానిక్ యూకే కంపెనీ ఆమెను ఎంపిక చేసిందని హిందీలో చెప్పాడు. ప్రైజ్ మనీ రావాలంటే.. రూ.3,500 చెల్లించాలన్నాడు. రూ.కోట్లు వస్తాయన్న ఆశతో ఆ మొత్తాన్ని ఆమె చెల్లించింది. రెండు రోజుల తరువాత ఫోన్ చేసిన ప్రైజ్‌మనీ తేవడంలో సమస్యలున్నాయని.. దానిని పరిష్కరించడానికి ఒక రోజులోపు రూ.15,500 చెల్లించాలని.. లేకుంటే డబ్బులు రావన్నాడు. దీంతో రక్షింద ఆ మొత్తం కూడా చెల్లించింది. ఫారిన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీగా మార్చడానికి సొమ్ము చెల్లించాలని, ఆర్బీఐ క్లియరెన్స్ అనీ, కస్టమ్స్ క్లియరెన్స్ అనీ, డబ్బులు తెచ్చే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో సమస్య ఉందని, హైదరాబాద్‌లో సమస్య ఎదురైందని, తిరుపతి ఎయిర్ పోర్టులో అనుమతించలేదని, భాకరాపేటలో పోలీసులు అనుమతించడం లేదని ఇలా పలు కారణాలు చెబుతూ పలు దఫాలుగా వెంటనే డబ్బు పంపాలనడంతో అమాయకత్వం, అత్యాశతో రక్షింద సొమ్ము చెల్లించేది. ఇలా బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి సుమారు రూ.14 లక్షల వరకు చెల్లించింది. డబ్బు చెల్లించినా ప్రైజ్ మనీ రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. సాంకేతికతతో ఛేదించిన పోలీసులు ఆమెకు వచ్చిన మెసేజిలు, ఫోన్‌కాల్స్‌ను ఆధారం చేసుకుని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మోసగాడు ఢిల్లీలో ఉంటున్నట్టు గుర్తించి.. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లింది. నైజీరియన్ నివాసాన్ని కనుగొని అక్కడి పోలీసుల సహకారంతో అతడి ఇంటికి చేరుకున్నారు. నేరస్తుడు ఇనుప గేట్లు వేసుకొని ఇంట్లో దాక్కోవడంతో గ్యాస్ కట్టర్ సాయంతో వాటిని కట్‌చేసి నైజీరియన్‌ను పట్టుకున్నారు. నిందితుడు నైజీరియాకు చెందిన అంతర్జాతీయ నేరస్తుడు నికోలస్ మగ్లర్ అలియాస్ జార్జిగా తేలింది. అతడు 2015లో నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చి.. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఈ విధంగా సుమారు 90 మంది నుంచి నగదు కాజేసినట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుణ్ణి తీసుకుని శనివారం రాత్రి ఢిల్లీ నుంచి నగరికి బయలుదేరారు. -
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా
-
MLA RK Roja: బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా
సాక్షి, నగరి: యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికే గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కేరోజా తెలిపారు. రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా సంబరా ల్లో భాగంగా సోమవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీ లు జరిగాయి. నగరి, పుత్తూరు మండలాలకు సంబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి, సోదరుడు కుమారస్వామిరెడ్డితో బ్యాట్మింటన్ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశం లేక అనేక మంది క్రీడాకారులు మరుగున పడుతున్నారని తెలిపారు. అందువల్లే మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నగరి మండలంలో.. అండర్ 17 విభాగంలో 17 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 48 జట్లు పోటీపడుతున్నాయి. నగరి డిగ్రీ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బీఆర్వీ అయ్యప్పన్, నాయకులు దయానిధి, మురుగ, మునికృష్ణారెడ్డి, అయ్యప్ప, కన్నాయిరం తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు మండలంలో.. అండర్ 17 విభాగంలో 6 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 36 జట్లు పోటీపడుతున్నాయి. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీపీ మునివేలు, మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ జయప్రకాష్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ వీఎం మాహిన్, కౌన్సిలర్లు ఏకాంబరం, వనిత, ఎంఎల్ఓ దిలీప్ మొదలి, నాయకులు కేటీ ప్రసాద్, రవీంద్ర, చక్రి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
MLA Roja: డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని పేర్కొన్నారు. -
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్
MLA Roja Playing Kabaddi Video: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు. చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్ ఈ సందర్భంగా టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. సెల్వమణి, రోజా రెండు జట్లుగా విడిపోయి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించగా విఫలమయ్యారు. అనంతరం సెల్వమణి కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు -
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
-
రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభిలాంటి వ్యక్తులతో ప్రెస్‌మీట్ పెట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై పట్టాభి చేత చంద్రబాబు చెప్పించిన అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు, లోకేష్‌లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ప్రశ్నించారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని మండిపడ్డారు. చదవండి: దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం: పేర్ని నాని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుమల వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు. -
నగరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ముక్కు కొండ ఉంది. హనుమంతుని ముక్కు ఆకారంలో ఉండటంతో కొండకు ముక్కు కొండ అన్నపేరు వచ్చింది. పుత్తూరు, నగరి జాతీయ రహదారిలో వెళ్లే వారికి సుదూర ప్రాంతం వరకు ఈ కొండ కనిపిస్తుంది. పడుకున్న మనిషి ముక్కు ఆకారంలో ఉండటంతో ఈ కొండకు ఈ పేరు వచ్చిందని నానుడి. సముద్ర మట్టానికి 855 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వంద కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది. ట్రెక్కింగ్ ఇలా... నారాయణవనం మండలం, సముదాయం గ్రామంలోని అవనాక్షమ్మ ఆలయ సమీపం నుంచి ముక్కుకొండ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. గైడ్లు లేకుండా కొండపైకి చేరుకోలేము. వారు కూడా వెళ్లే మార్గంలో చెట్లపై గుర్తులు పెట్టుకుంటూ, రాళ్లు పేర్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ ఆ గుర్తుల ఆధారంగా క్రిందకు చేరుస్తారు. ఈ కొండపైకి వెళ్లడం సాహసంతో కూడుకున్న పని. కొండ ఎక్కడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. పైకి వెళ్లేవారు తినడానికి అవసరమైన ఆహారం, నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే దారి పూర్తిగా రాళ్లతోను, ముళ్లకంపలతోను, బోదలతోను నిండి చిట్టడవిలా ఉంటుంది. ప్రాచీన లైట్ హౌస్ మధ్యయుగ కాలంలో ముక్కుకొండ బంగాళాఖాతంలో వచ్చే పడవలకు చెన్నై మార్గం చూపే దిక్సూచిగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థన మేరకు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కార్వేటినగరం రాజుల ఈ కొండ శిఖరంపై అఖండ ధీపం వెలిగించడానికి అంగీకరించారు. కొండశిఖరంపై ఒక అఖండాన్ని ఏర్పాటుచేసి అక్కడ మంటపెట్టడానికి జంగములనే చెంచులను నియమించారు. సూచించిన సమయాల్లో వారు అఖండం వెలిగించే ప్రక్రియను కొనసాగించడానికి కొండ క్రింద వారికి భూములు కేటాయించారు. అఖండంలో ఒక టన్ను కొయ్యలు వేసి నిప్పంటించగా అది సముద్రంలో ప్రయాణించే షిప్పులకు చిన్న దీపంలా కనిపించేది. ఇలా ముక్కుకొండపై వెలిగించే మంటలు సముద్రంలో ప్రయాణించే షిప్పులకు దారిచూపే లైట్హౌస్గా మారింది. ఈ దీపం ఆధారంగా షిప్పులు చెన్నై పోర్టుకు చేరుకునేవి. చెన్నై హార్బరులో లైట్ హౌస్ నిర్మించిన పిదప కొండపై షిప్పులకోసం దీపం వెలిగించడాన్ని ఆపేశారు. ప్రస్తుతం షిప్పులకోసం దీపం వెలిగించక పోయినా ప్రతి చిత్రాపౌర్ణమికి చెంచులు కొండపై అఖండాన్ని వెలిగిస్తారు. ముక్కుకొండ ఊరిపేరుగా మారింది ఈ కొండ కారణంగానే కొండ అంచున ఉన్న ప్రాంతానికి నగరి అనే పేరు వచ్చింది. ముక్కు ఆకారంలో ఉన్న ఈ కొండను ముక్కు కొండ అని నాశికగిరి అని పిలిచే వారు. నాశిక గిరి కాలక్రమేణా నగిరి అని క్రమేణా నగరి అని మారింది. హనుమంతుడు ప్రతిష్ఠించిన గగన వినాయకుడు కొండశిఖరంపై వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉండటంతో ఈ వినాయకుని గగన వినాయకునిగా పిలుస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ చేసే సమయంలో ఢీకొన్న కారణంగా కొండ ఇలా ముక్కు ఆకారంలో మారిందని దీంతో హనుమంతడు అక్కడ ఆగి కొండపై ఆగి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున కొండపై ధీపం వెలిగిస్తే హనుమంతుడు వచ్చి ఆశీర్వదిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. కొండపైకి వెళ్లే వారు గగన వినాయకుని, ఆదిశేషుని ఆకారంలో ఉన్న బండను, అఖండాన్ని చూడవచ్చు. వీటితో పాటు వివిధ ఆకారాలోల్లో ఉన్న రాతి బండలను, చెట్లను చూడవచ్చు. చారిత్రక ప్రసిద్దిగాంచిన ఈ కొండపైకి ఆంద్రప్రదేవ్ టూరిజం వారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొండ విశేషాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి -
కార్యకర్తలతో కలిసి బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
పిల్లలకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన ఎమ్మెల్యే రోజా
-
కళాకారులతో కలిసి డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా
-
కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను అభినందించిన ఎమ్మెల్యే
-
సరదాగా కాసేపు .. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
నిండ్ర: తన చిన్ననాటి ఆటలను గుర్తుతెచ్చు కున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఉప్పొంగిపోయారు. కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు.. ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామ్‌లాల్, మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్ వసంత బాబురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరీ దామోదరం, సింగిల్ విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, స్థానిక నేతలు అనిల్, పరంధామ, దీప పాల్గొన్నారు. చదవండి: వైఎస్ విజయమ్మ సైకత శిల్పం అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం -
ఎమ్మెల్యే రోజాను కలిసిన నటుడు అర్జున్
నగరి : సినీ నటుడు అర్జున్ కుటుంబ సమేతంగా ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆమె నివాసంలో కలిశారు. అర్జున్ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలో స్నేహితురాలు రోజాను, ఆమె భర్త సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్ వెంట ఆయన భార్య నటి నివేదిత, కుమార్తెలు నటి ఐశ్వర్య, అంజనా ఉన్నారు. తిరుమలకు వెళుతూ స్నేహితురాలిని కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అర్జున్ తెలిపారు. నేడు ఎమ్మెల్యే పర్యటన నగరి మునిసిపల్ పరిధిలో శుక్రవారం నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరకంఠాపురంలో నూతనంగా నిర్మించే సిమెంటు రోడ్డుకు ఆమె భూమి పూజ చేస్తారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందికి వ్రస్తాలు పంపిణీ చేస్తారు. హీరో అర్జన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి వారికి తీర్ధప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల అర్జున్ను చూడటానికి, పొటోలు తీసుకోడానికి భక్తులు, అభిమానులు ఉత్సహం చూపారు. -
ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి : రోజా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఆర్కే రోజా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమె జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సినీ పరిశ్రమలోనూ సుధీర్ఘ కాలం కొనసాగిన రోజుకు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందాయి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లోనూ విజయం సాధించి వరుసగా రెండోసారి చట్టసభకు ఎన్నికయ్యారు. అగ్ర కథానాయకుల సరసన రాజకీయాల్లోకి రాకముందు రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కే.సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్, బతుకు జట్కబండి, రంగస్థలం వంటి షోలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ఈ సందర్భంగా మంగళవారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగాను. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకున్నాను. పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. కొత్తలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. విమర్శలను పాజిటివ్‌గా తీసుకున్నాను. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడం ఆనందంగా ఉంది.’ అని సంతోషం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నగరిలో ఆర్కే రోజా పాద్రయాత్ర
సాక్షి, తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అనేక మంది జాతీయ నేతలు సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పుత్తూరులోని నగరి నియోజకవర్గంలో సోమవారం ఆమె పాదయాత్ర చేసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మెరపు వేగంతో నడిపిస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారని, కరోనా కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదని, దేవుళ్ల యజ్ఞాలను రాక్షసులు అడ్డుకున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకోకపోతే ఈసారి 23 సీట్లు కూడా రావని ఆర్కే రోజా పేర్కొన్నారు. కాగా తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. -
తుడా: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడా(టీయూడీఏ)లో విలీనం చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీంతో తుడా పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు చేరింది.(చదవండి: మహిళలూ..! మహరాణులూ..!!) -
అంబులెన్స్ బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
అంబులెన్స్ బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి : ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరిలోస్వయంగా అంబులెన్స్ బైక్ నడిపారు. శ్రీసిటీ హీరో మోటార్ సంస్థ (నగరి).. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్ బైక్‌లను ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతులమీదుగా ఆదివారం అందజేసింది. అనంతరం జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శ్రీసిటీ హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్ దేశానికే ఆదర్శం సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ )లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్ జగన్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ ర్యాంకును కూడా టీడీపీ తమ ఘనతేనని చెప్పుకోవడం వారి చీప్ పాలిటిక్స్‌కు నిదర్శనం అని ఆమె ధ్వజమెత్తారు. (వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు) -
108 వాహానాన్ని అలవోకగా డ్రైవ్ చేసిన రోజా
-
108 వాహనాన్ని స్వయంగా నడిపిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి : నగరి పుత్తూరు పున్నమి సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు
సాక్షి, నగరి(చిత్తూరు) : కుమారుడికి కరోనా వైరస్ సోకిందనే మనోవ్యధతో గుండెపోటుకు గురై 68 ఏళ్ల వృద్ధుడు మరణించగా ఆ తర్వాత కొంతసేపటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు సైతం ప్రాణాలొదిలిన ఘటన నగరి ఏకాంబరకుప్పంలో మంగళవారం చోటుచేసుకుంది. చుట్టుపక్కలే బంధువులున్నా కరోనా భయంతో కనీ సం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులే ముందుకొచ్చి వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. వివరాలివీ.. కో–ఆప్టెక్స్ సంస్థలో పనిచేసి రిటైరైన 68ఏళ్ల వృద్ధుడు ఏకాంబర కుప్పంలో చిన్నపాటి జిరాక్స్ షాపు నడుపుకుంటూ షాపు పైభాగాన గల గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతని భార్య గతంలోనే మరణించగా కుమారుడు, కోడలు పక్క వీధిలో నివాసముంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు చేస్తున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలొదిలాడు. ఆ తరువాత కొంతసేపటికి కుమారుడు కూడా ఆస్పత్రిలో మరణించాడు. కరోనా భయంతో వృద్ధుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా బంధువులెవరూ రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్క డికి చేరుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని వృద్ధుడి బంధువులకు పోలీసులు సూచించగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆత్మబంధువులయ్యారు. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో మృతదేహాన్ని కిందకు దించి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాతో మరణించిన కుమారుడి మృతదేహం రుయా ఆస్ప త్రిలోనే ఉంచారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది. ఈ ఘటనపై సీఐ మద్ద య్య ఆచారి మాట్లాడుతూ కరోనా ఆస్పత్రిలో మృతిచెందిన యువకునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. వారికి కరోనా పరీక్షలు చేయించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం జగన్
-
లోకేష్ సైక్లింగ్ చేసుకుంటున్నాడు: ఎమ్మెల్యే రోజా
-
‘వారి సేవలను ఎంత ప్రశంసించినా తక్కువే’
-
‘వారి సేవలను ఎంత ప్రశంసించినా తక్కువే’
సాక్షి, చిత్తూరు : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలోనూ పగలూ రాత్రీ తేడా తెలియకుండా అత్యవసర సేవలందిస్తోన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను ఎంత ప్రశంసించినా తక్కువేనని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నగరి రూరల్‌లో పలు చోట్ల ప్రతీ ఇంటికీ 5కిలోల బియ్యం, ఐదు రకాల కూరగాయలను ఆమె పంపిణీ చేశారు. తాను చేస్తోన్న సేవలో పాలుపంచుకుంటోన్న నాయకులు, కార్యకర్తలకు రోజా ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం వెనుక అధికారుల కృషి, ప్రజల మద్దతు ఎంతో ఉందన్నారు. -
అంబేద్కర్ వ్యక్తి కాదు.. శక్తి: ఆర్కే రోజా
సాక్షి, నగరి(చిత్తూరు): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి, మతానికీ చెందిన వారు కాదని ఆయన ఓ శక్తి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరులోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. సమ సమాజ శ్రేయస్సు కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత, నిగర్వి, శ్రేయోభిలాషి ఆయన అన్నారు. ఇక కొంతమంది ఆయనను తమ సమూహానికి సంబంధించిన వ్యక్తిగా ఆపాదించడం సబబు కాదన్నారు. (అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి) యావత్ భారతదేశానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు. పేద, దళితులకు రెండు పురపాలక సంఘం పరిధిలో నిత్యావసర సరుకలతో పాటు మూడు రకాల కూరగాయలను రెండు వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ సమాజ స్థాపనకోసం అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు అన్నింటిలోను 50 శాతం స్థానాన్ని కల్పించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం జగన్ క్యాబినెట్లో పార్టీలో ఒక ఎమ్మెల్యేగా తాను ఉండటం చాలా గర్వంగా ఉందని రోజా పేర్కొన్నారు. (మరణం లేని మహా శక్తి ఆయన : సీఎం జగన్) -
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి: రోజా
-
రెడ్ జోన్‌గా వడమాలపేట
సాక్షి, వడమాలపేట(చిత్తూరు జిల్లా): వడమాల గ్రామంలో ఓ యువకుడికి ఆదివారం కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు సోమవారం ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకురా వద్దంటూ వడమాల పేట పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వసతి గృహాల వద్ద నున్న మురికి కాలువలు శుభ్రపరుస్తూ పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం మేరకు సమస్యల పరిష్కారానికి అనుమతి వెసులుబాటు కల్పిస్తామని, వడమాలపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. అధికారులతో కలిసి వడమాల గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కూరగాయల పంపిణీ నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ 18,19 వార్డుల్లోని 500 కుటుంబాలకు ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా కూరగాయలు అందజేశారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, దాతలు వీఎం రామచంద్రన్, ఈవీ బాలకృష్ణన్, బీఆర్వీ అయ్యప్పన్ పాల్గొన్నారు. అబ్దుల్ కలాం షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోజా చారిటబుల్ ట్రస్టుకు రూ.10 వేలు ఇచ్చారు. విజయపురం మండలంలోని 500 మంది అధికారులకు ఎమ్మెల్యే అన్నదానం చేశారు. మల్లారెడ్డి కండ్రిగ ప్రజలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. ఓజీ కుప్పానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బాబు రూ.10 వేలు అందించారు. హైపోక్లోరైట్ పిచికారీ చేస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజా అప్డేట్: ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు -
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం : ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ గాలికబుర్లు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు బాబు గెలిచిన కుప్పంలో, లోకేష్ ఓడిపోయిన మంగళగిరిలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలే అండగా ఉంటున్నారని రోజా తెలిపారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా ఉచితంగా రేషన్ ఇచ్చి పేదలను ఆదుకున్నామని చెప్పారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీకి తెచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వైఎస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. -
భయపడొద్దు.. మీకు మేమున్నాం
-
భయపడొద్దు.. మీకు మేమున్నాం : రోజా
సాక్షి, చిత్తూరు : కరోనా మహమ్మారికి నగరి ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదని, మీకు అండగా మేమున్నామంటూ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ వీడియో ద్వారా భరోసానిచ్చారు. రోజా వీడియోలో మాట్లాడుతూ.. 'నగరిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటిలోనే ఉండండి.. సరైన జాగ్రత్తలు పాటించండి.. కరోనాను పారద్రోలండి. లాక్డౌన్ సందర్భంగా నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవారు అధికంగా ఉన్నారని, వారికి నిత్యావసర సరుకులు సమకూర్చడంలో వైఎస్ఆర్ కార్యకర్తలు ముందుండి సహాయ సహకారాలు అందించండి' అంటూ పిలుపు నిచ్చారు. ఎమ్యెల్యేగా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని రోజా పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు అందవలసిన నిత్యావసరాల సరుకులను వలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు రోజా తెలిపారు. ('నేను క్వారంటైన్లో ఉన్నా.. మరి మీరు') -
అందరూ స్వీయ నిర్భంధం పాటించాలి: ఎమ్మెల్యే రోజా
-
వంటింట్లో గరిటె తిప్పుతూ
-
మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను..
-
‘వలంటీర్ల సత్తా ఏమిటో తెలిసింది’
సాక్షి, చిత్తూరు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. శుభ్రత పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజలందరూ కర్ఫ్యూలో పాల్గొన్నారని తెలిపారు. (కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష) గతంలో వలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కించపరిచారని.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన వలంటీర్ల సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసిందన్నారు. ప్రజల ప్రాణాలను సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లే కాపాడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్య, ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. (ఈ రోజుతో అయిపోయిందని అనుకోవద్దు) -
గంజాయి, సారా స్వాధీనం
నగరి : మండలంలోని ఓజీకుప్పం గ్రామాన్ని ఆదివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్ (సమస్యాత్మక పల్లెల్ని చుట్టుముట్టి తనికీ చేయడం)లో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, చిత్తూరు అడిషనల్ ఎస్పీ కృష్ణార్జునరావు, చిత్తూరు ఎస్బీ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నగరి, నగరి రూరల్, పుత్తూరు సీఐలు మద్దయ్య ఆచారి, రాజశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీ చేశారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి అనుమానిత వ్యక్తులు ఉన్నారా అని ఆరాతీశారు. ఇళ్ల వద్ద ఉన్న వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఊహించని పలు అంశాలు వెలుగుచూశాయి. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పళని(48), మునస్వామి(28), మురళి (32), సంపూర్ణమ్మ(70) పట్టుపడగా, వారి వద్ద నుంచి 12.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా సారా, మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న దొరై(60), మునిలక్ష్మి (56)ని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 114 సారాపాకెట్లు, 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 11 ద్విచక్రవాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి నిల్వ ఉంచుకున్న వారిపై ఎన్ఈబీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై ఏపీ ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. -
వలస బతుక్కి ఊతం..
నగరి: ఈ ఫొటోలోని వలస కుటుంబానిది.. శ్రీకాళహస్తి. బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కుంటూ.. ఐదేళ్ల కిందట నగరి మండలం మాంగాడుకి చేరింది. ఇద్దరు పిల్లలున్న వీరు బుక్కెడు బువ్వ కోసం దినదిన గండం ఎదుర్కొంటున్నారంటే అతిశయోక్తి కాదు. కుటుంబ యజమాని సుబ్రమణ్యం మేస్త్రి పని చేస్తున్న సమయంలో ఎడమ కాలికి తీవ్రగాయమైంది. వైద్యులు పరీక్షించి కాలు తీసేయకపోతే ప్రాణానికే ముప్పని తేల్చేశారు. చివరికి కాలు తొలగించి జైపూర్ (కృత్రిమ) కాలు అమర్చారు. అప్పటి నుంచి పని చేసే శక్తిని కోల్పోయి నిస్సహాయంగా మిగిలాడు. అడపాదడపా పనికి పిలిచేవారు సైతం ‘నువ్వేం పనిచేయగలవు..బరువు కూడా ఎత్తలేవు కదా..’ అంటూ చీత్కరించుకునేవారు. దీంతో బతుకు బండిని లాగేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కూర్చుని వ్యాపారం చేసుకునేంత ఆర్థిక స్తోమత వీరికి లేదు. వీరి దుర్భర జీవితానికి తోడు సొంత ఇల్లు కూడా లేక అద్దె గృహంలో ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఊరు మారడంతో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు లేక దివ్యాంగ పింఛన్ కూడా వీరికి మంజూరు కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులకు తోడున్నట్లుగా సుబ్రమణ్యం భార్య అరుణకు మాటలు రావు. దీంతో ఈమెను కూడా కూలిపనులకు పిలిచే దిక్కులేదు. ఇలాంటి సమయంలో తమ ఇద్దరు పిల్లలు (పెద్దబ్బాయి అఖిల్ 1వ తరగతి చదువుతున్నాడు. పాపకు మూడేళ్లు)కు చదువు చెప్పించడం వీరికి అసాధ్యమైంది. ఇదే తరుణంలో అమ్మఒడి తమ జీవితానికి ఆసరాగా కనిపించిందని, భగవంతుడి ఆశీర్వాదం, జగనన్న తోడ్పాటు వల్ల పిల్లలను బడికి పంపే అవకాశం కలిగిందని సుబ్రమణ్యం, అరుణ దంపతులు ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో ‘సాక్షి’కి తెలిపారు. తమ వలస జీవితాలకు అమ్మఒడి చుక్కానిలాంటిదని హర్షం వ్యక్తం చేశారు. -
నగరిలో ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు వేడుకలు
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా నగరి దేశమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరి బస్టాండ్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం దగ్గర పుట్టినరోజు కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రై సైకిల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. నగరి పీసీఎన్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్త దాన శిబిరాలను సందర్శించారు. 40 ఏళ్లు పైబడిన మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు పింక్ బస్‌ను ప్రారంభించారు. అనంతరం తన నివాసం వద్ద ‘న్యూ నగరి-నో ప్లాస్టిక్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పంపిణీ చేస్తారు. -
గల్ఫ్ వల.. యువత విలవిల
సాక్షి, నగరి: ఉపాధి కోసం కన్న ఊరిని వదలి వెళుతున్న యువత విదేశాల్లో నరకయాతన అనుభవిస్తోంది. అత్యధిక జీతం, ఉచిత వసతి, ఇతర ఆదాయం పేరిట ఏజెంట్ల వలలో చిక్కి అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది. స్థానికంగా రోజువారీ కూలి పనులు చేసుకుని సంతోషంగా జీవించే అవకాశం ఉన్నా.. ఆశలవలలో చిక్కుకుని అల్లాడుతోంది. రెండు మూడేళ్లు పనిచేస్తే రూ.లక్షలు సంపాదించవచ్చనే ఏజెంట్ల మాటలు నమ్మి అప్పు చేసి అరబ్ దేశాలకు వెళ్లి చిత్ర హింసలకు గురవుతోంది. జిల్లా యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు తరచూ వెలుగులోకి వస్తున్నా అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదు. నగరి, పుత్తూరు ఏజెంట్ల వలలో చిక్కి కువైట్, దుబాయ్‌కి వెళ్లి నానా తిప్పలుపడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్త చేతులతో ఇటీవల స్వదేశానికి చేరుకుని పలువురు బోరున విలపిస్తున్నారు. తాజాగా కలకడ మండలం తూర్పువడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర కువైట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. ఇతను అక్కడ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఉద్యోగాల కోసం ఆరాటపడేవారు.. కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఆదాయ మార్గాలు అన్వేషించే వారు.. పేదరికాన్ని జయించి అభివృద్ధి పథంలో నడవాలని ఆరాటపడేవారు కువైట్, దుబా య్‌లో ఉద్యోగాల పేరిట నగరి, పుత్తూరులోని ఏజెంట్లు విసిరే వలలో చిక్కుకుంటున్నారు. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలిక ఊడిం దన్న చందాన కువైట్ ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి మారింది. ఆదాయం ఎక్కువగా సంపాదించవచ్చని చేతిలో ఉన్న డబ్బుల్ని ఏజెంట్లకు అప్పజెప్పి కువైట్‌కు వెళ్లి నానా తిప్పలు పడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్తచేతులతో స్వదేశాలకు చేరుకొని బోరున విలపిస్తున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోయారు. నిరుద్యోగులకు ఆశచూపి మోసం చేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మహిళలనైతే ఉచితంగానే తీసుకెళుతు న్నారు. వారికి ఏపనిలో తర్ఫీదులేకున్నా పంపిస్తున్నారు. బ్యూటీపార్లర్‌లో ఉద్యోగమని, జిమ్‌లో ఉద్యోగమని కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ ఇంటి పనులకు వారిని వేలంలో విక్రయిస్తున్నారు. ఇంటిపనుల్లో వారికి యజమానులు నరకయాతన చూపుతున్నారు. కొందరు ధైర్యం చేసి బయటపడి మరో ప్రాంతంలో ఉద్యోగం వెతుక్కొని పోతుంటే, కొందరు తమ విధి అంటూ కష్టాలు అనుభవిస్తున్నారు. ఇటీవల కొందరు కువైట్ నుంచి ఎలాగో వచ్చేశారు. నరకం చూపెట్టారు నా పేరు వడివేలు. చింతలపట్టెడలో నివాసం. నాపై ఆధారపడి ఐదుగురు జీవిస్తున్నారు. కూలిపని చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. పుత్తూరుకు చెందిన ఏజెంట్ తనకు తెలిసిన వారు కువైట్‌లో ఉన్నారని, అక్కడికి వెళితే నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు. వీసా, మెడికల్ సర్టిఫికెట్‌కు రూ.2.5 లక్షలు అవుతుందన్నాడు. అన్నీ మేమే సిద్ధం చేస్తామని తెలిపాడు. అప్పు చేసి డబ్బులు కట్టాను. పుత్తూరుఏజెంట్ నగరి ఏజెంట్ ద్వారా నన్ను చెన్నై ఎయిర్‌పోర్టుకు పంపాడు. అక్కడ నంచి కువైట్‌కు పంపారు. వీరికి సంబంధించిన కువైట్ ఏజెంట్ నన్ను పుత్తూరు ఏజెంట్ బంధువు నడిపే ఒక హోటల్లో పడేశాడు. ఇక్కడే పనిచేయాలి అంటూ రెండు నెలలు పనిచేయించుకున్నారు. జీతం కోసం పోరు పెడితే రూ.20వేలు ఇచ్చారు. నెలకు యాభైవేలు ఇస్తామని చెప్పారుకదా అంటేæ నీ పాస్‌పోర్టు, వీసా మా దగ్గర ఉంది ఎక్కడికీ వెళ్లలేవుఅంటూ బెదిరించారు. పరిచయమైన తమిళనాడు వారి సహకారంతో తప్పించుకొన్నాను. ఇండియన్ ఎంబసీని సంప్రదించి, జైలులో కఠినమైన శిక్షలు అనుభవించి ఫైన్లు,ఫ్లైట్ చార్జీలు కట్టి భారతదేశానికి చేరుకున్నా. నాలా ఎవ్వరూ బాధపడకూడదని నగరి, పుత్తూరు పోలీస్ స్టేషన్లతో పాటు చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదుచేశా, స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించాను. 5 సంవత్సరాల్లో 150 మంది వెళ్లారు ఐదేళ్లలో నగరి, పుత్తూరు నుంచి కువైట్‌కు సుమారు 150 మంది వెళ్లారు. కొందరిని సూన్‌వీసాతో, మరికొందరిని ఖాదీ వీసాలతో పంపితే, పలువురిని విజిటింగ్ వీసాలతో పంపారు. వీరిలో పలువురు అక్కడ అవస్థలు పడుతున్నారు. ఎక్కువగా సంపాదించి కుటుంబానికి అన్ని సమకూర్చాలని కోరుకునే ఎందరో కుటుంబ యజమానులు ఇలా విష వలయంలో చిక్కుకుంటున్నారు. నీచమైన పదజాలం వాడుతూ పనిచేయిస్తున్నారు. భార్యాపిల్లలను చూస్తామన్నా నమ్మకం కూడా లేనివారు అక్కడ పరిచయమయ్యే భారతీయుల సలహాల మేరకు ఇండియన్ ఎంబసీని సంప్రదించి, శిక్షలు అనుభవించి అవుట్‌పాస్‌తో స్వదేశానికి చేరుకుంటున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిరుద్యోగులకు ఆశచూపి మోసంచేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అంటూ ఇంటి పనికి పెట్టారు కుటుంబ పోషణకోసం బ్యూటీ పార్లర్ నడుపుతుండేదాన్ని. నగరికి చెందిన ఒక ఏజెంట్ కువైట్‌లో బ్యూటీ పార్లర్లో జీతం ఎక్కువగా వస్తుందని, ఇక్కడచేసే పనే అక్కడా ఉం టుందన్నాడు. అక్కడి నుంచే వీసా పంపుతారు వెళ్లి రావచ్చని నమ్మబలికాడు. కుటుంబ కష్టాలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగానికి వెళ్లాను. నాలా పలువురు అక్కడకు వచ్చి ఉన్నారు. కువైట్‌లో మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఏజెంట్ ఇంటి పనులకంటూ వేలంలో కాంట్రాక్టుపై నన్ను విక్రయించాడు. వారు నన్ను చిత్రహింసలు పెట్టారు. జ్వరంతో ఉన్నా పనిచేయాల్సిందే.. లేకుంటే కొట్టేవారు. నన్ను విడిచిపెట్టండి నేను వెళ్లిపోతాను అంటే చంపేస్తామని భయపెట్టేవారు. అక్కడ పరిచయమైన భారతీయుల ద్వారా పనిచేస్తున్న చోటి నుంచి ఎలాగోలా బయటపడి మరో ప్రాంతంలో పనిలో చేరాను. కుటుంబాన్ని కాపాడుతుందని తల్లిదండ్రులు ఆశ నెరవేర్చేందుకు కువైట్‌లోనే పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి నిద్రపోతే కొట్టారు.. కువైట్‌లో ఇంటి పని ఉంది, జీతం ఎక్కువగా ఇస్తారంటూ నన్ను పంపించారు. అక్కడికి తీసుకెళ్లిన రెండేళ్లకు అగ్రిమెంట్ అంటూ ఒక ఇంటిలో పనికిపెట్టారు. వారు చిత్రహింసలు పెట్టారు. జ్వరం వచ్చి నిద్రపోయినా కొయ్యతో కొట్టేవారు. అగ్రిమెంటు ముగిసేంతవరకు జీతం ఇవ్వలేదు. మళ్లీ కూడా సగం డబ్బులు మాత్రమే ఇచ్చారు. అవస్థలు పడి ఇండియాకు చేరుకున్నాను. ప్రస్తుతం తమిళనాడులో వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి కష్టాలకు కేరాఫ్ కువైట్ కష్టాలు తీరుతాయని కువైట్‌కు వెళితే.. అది కష్టాలకు కేరాఫ్‌గా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళితే సంతలో పశువుల్లా వేలంలో వేసి అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఆ ఇళ్లలో వారు మాట్లాడే భాష మనకు అర్థమై ఆ పనిచేసేలోపు కొడతారు. మహిళ అన్న గౌరవం ఏ కోశానా∙ఉండదు. మన ఆరోగ్యంపై వారికి శ్రద్ధ ఉండదు. ఏ పరిస్థితిలో ఉన్నా పనిచేసి తీరాల్సిందే. అమాయకులు నకిలీ ఏజెంట్ల కారణంగా మోసపోతున్నారు. అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బాధిత మహిళ, నగరి -
నా పదవి మీ సేవకే : రోజా
నగరి : ‘నా పదవి మీ సేవకే.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రగతిపథంలో నడిపిస్తా.. అదే సమయంలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తా..’ అని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.20.39 కోట్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలా రుణమాఫీ పేరుతో అందలమెక్కి మోసం చేసే నైజం వైఎస్.జగన్మోహన్రెడ్డిది కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మహిళాభివృద్ధిని ఆకాంక్షించే నేతల్లో సీఎం ముందుంటారని, నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహిళా సంఘాల ద్వారా వైఎస్సార్ బీమా కింద ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు సహజ మరణం పొందితే 50 సంవత్సరాల లోపు వారికి రూ.2 లక్షలు అందించనున్నారన్నారు. నియోజకవర్గంలోని పాదిరేడు, విజయపురం కోశల నగరంలో రెండువేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించామని తెలిపారు. ఆయా ప్రాం తాల్లో 300 కంపెనీలు నిర్మిస్తారని, తద్వారా పలువురికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంతకుముందు ధరల స్థిరీకరణ నిధితో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులతో ఆమె చర్చించారు. రూ.5 కోట్లతో రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. డీపీఎం లోకనాథం, తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ రామచంద్రయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి టి.కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతిరాజు, బూత్ కమిటీ ఇన్చార్జి చంద్రారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్ తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసాయమే నాకు సన్మానం : రోజా
సాక్షి, విజయపురం(చిత్తూరు) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. బుధవారం నగరి రూరల్ మండలం దామరపాకంలో రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం దామరపాకం దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దామరపాకం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని, ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇచ్చే విద్యాసామగ్రి పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమలరెడ్డి, వేలాయుధం, ధర్మలింగం, చంద్రారెడ్డి, గణపతిశెట్టి, విజయబాబు, సోమశేఖర్, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు. -
నింద శరాఘాతమై.. మనసు వికలమై..
సాక్షి, నగరి : మనవడు జులాయిగా తిరగడానికి కారణం మీరేనంటూ కుమారుడు తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరి కీళపట్టు కువస్థలీ నది వంతెన వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శివశంకర్ కథనం..తమిళనాడు తిరుత్తణి సమీపంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన దంపతులు ఇ.ఏలుమలై (79), సులోచన (56) చాలా కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు బాబు, గోపి, కుమార్తె సరళ ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు గోపి కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. అతని కుమారుడు వినోద్‌కుమార్‌ను తాత ఏలుమలై, పెదనాన్న బాబు పోషిస్తున్నారు. వినోద్‌కుమార్ జులాయిగా మారడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు బుధవారం ఎక్కువయ్యాయి, వినోద్‌కుమార్ జులాయిగా మారడానికి మీరే కారణమంటూ తల్లిదండ్రులను బాబు గట్టిగా నిందించాడు. దీంతో మనస్తాపానికి గురైనవారు గురువారం గుడికి వెళ్లి వస్తామని చెప్పి స్వగృహం నుంచి బయలుదేరారు. తమ వద్ద ఉన్న డబ్బులతో పురుగుల మందు కొన్నారు. గురువారం రాత్రి నగరి మున్సిపాలిటీ కీళపట్టు వద్ద కుశస్థలి నది వంతెన కిందకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన స్థానికులు వారి మృతదేహాల ను గమనించి సమాచారం చేరవేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన రోజా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వుల జారీ చేసింది. ఆమె రెండేళ్ల పాటు ఆ పదవికిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల నగరి నియోజకవర్గం ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే ఆర్కే రోజాను కలిసిన స్విమ్స్ డైరెక్టర్
చిత్తూరు ,నగరి: స్విమ్స్ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ టీఎస్ రవికుమార్, స్విమ్స్ డీడీ డాక్టర్ వెంకటరమణారెడ్డి బుధవారం నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజాను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేన్సర్ నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఉమన్ కేన్సర్ ఇనిషియేటివ్ ప్రొగ్రాం, ‘ఇంటిగ్రేటెడ్ ట్రామాకేర్ ఫర్ రాయలసీమ’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుండెపోటుకు గురైతే తీసుకోవాల్సిన చికిత్సపై ఆదిత్య హృదయం పేరుతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. -
నగరిలో రోజా వికాసం
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ దిశగా వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. సగానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 150కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రాలు సత్తా చాటుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీల తప్పుడు అంచనాలు, లెక్కలకు ధీటుగా ఆమె దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా మెజారిటీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్ హవాతో ఎంపీల పరంగా దేశంలోనే అదిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించనుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఇక జనసేన ప్రభావమే లేకుండా పోయింది. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చిత్తూరు : నగరిలో దారుణం చోటుచేసుకుంది. తిరుత్తణి రహదారిలో రామకృష్ణ కాటన్ మిల్లు సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. నగరి నుండి చెన్నైకి వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరంతా కారులో విహార యాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తిరువళ్లూర్‌లోని పోరూర్‌కు చెందినవారుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఏంజిల్(24) మృతి చెందగా..నగరి ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రేమ్ (25), ప్రితీక్ రాజు (19) మృతి చెందారు. గాయపడిన ధీరజ్ రాజ్ (19), చర్య (23) జనిల్ (22) ముగ్గురు తిరుత్తణి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీకి అనుకూలంగా ప్రచారం.. మాజీమంత్రికి నోటీసులు
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చెంగారెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లను బెదిరింపులకు దిగినందుకు ఈ మేరకు నోటీసులను జారీచేసింది. టీడీపీకి ఓటువేయకపోతే సంగతి తేలుస్తా అని ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగిన ఆయన ఆడియోలు ఇటీవల బయటకు రావడంతో పార్టీ నేతలు ఈ విధంగా స్పందించారు. చెంగారెడ్డితో పాటు ఆయన కుమార్తె ఇందిర కూడా టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఆమెకు కుడా నోటీసులు పంపినట్లు కమిటీ తెలిపింది. పుత్తూరు,నగరి నియోజకవర్గాల్లో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని తన కను సన్నల్లో నడిపిన రెడ్డివారి చెంగారెడ్డి ఇటీవల కాలంలో టీడీపీ అనుకూలంగా వ్యవహరించడంపై పార్టీ అధిష్టానం ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. కాగా ఎన్నికల్లో తన కుమార్తెకు నగరి టికెట్ కావాలని చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని కోరిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంగా దానికి పార్టీ నిరాకరించింది. దీంతో పార్టీపై చెంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాకు తీరని అన్యాయం చేసిందని, చివరికి నా కుమార్తెకు సీటు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నమ్మించి మొండి చెయ్యి చూపించదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు చేసిన అన్యాయానికి బదులుగా మేము మమ్మల్ని సాయం అడిగిన తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ విజయానికి సహకరించేందుకు నిర్ణయించుకున్నామని ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అండగా ఉంటా
‘మీ అండదండలతోనే సుదీర్ఘ పాదయాత్ర చేశా. నేను వెళ్తున్న దారిపొడవునా ఎంతో మందిని కలిశా. వారి సాధకబాధకాలు విన్నా. ఈ ఐదేళ్ల పాలనలో వారు పడుతున్న ఇబ్బందులు చూశా. జన్మభూమి కమిటీల పేరుతో పేదలను హింసించిన తీరును చూశా. సంక్షేమ పథకాలకు దూరమైన అభాగ్యులను చూశా. చదువులకు దూరమైన పేద పిల్లలను చూశా. వారి కష్టాలు విన్నా. మీకందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని చెబుతున్నా. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. మీ కన్నీళ్లు తుడిచే అన్నగా ఉంటా..’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం నగరి నియోజకవర్గం పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పుత్తూరు: పుత్తూరు జనసంద్రమైంది. జనహృదయ నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రాకతో పుత్తూరు వీధులు పోటెత్తాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్.జగన్మోహన్రెడ్డి పుత్తూరుకు వచ్చారు. పట్టణంలోని కేఎన్ రోడ్డు మండపం వద్ద ఏర్పాటు చేసిన బస్సు నుంచి ప్రసంగించారు. ఐదేళ్లలో సీఎం చంద్రబాబు అసమర్థపాలన, అవినీతి, దౌర్జన్యాలు, హత్యలపై ఆయన చేసిన ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. చేనేత కార్మికుల కష్టాలను గుర్తు చేస్తూ, అధికార పార్టీ నాయకులకు చెందిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ పరిశ్రమల వల్ల మామిడి రైతులు మోసపోతున్న వైనాన్ని వివరించారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి, షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కారణమైన చంద్రబాబు దమననీతిని ఎండగట్టారు. హెరిటేజ్ డెయిరీ కోసం పాడిరైతుల కడుపుకొడుతున్న సీఎం చంద్రబాబు నీచబుద్ధిని ఎండగట్టారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల జీవనాడి గాలేరు–నగరి సుజల–స్రవంతి ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఇందుకు సీఎం విధానాలే కారణం అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలను దుర్వినియోగం చేసిన చంద్రబాబు సర్కార్ తీరును తూర్పారబట్టారు. సర్కార్ హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల దాష్టీకాలతో అర్హులైన పేదలకు అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో పెరిగిన ఇంటి పన్నులు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుపై ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి వీలుగా పేదలకు నవరత్న పథకాలతో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ ఎలా అండగా ఉంటానో భరోసా ఇస్తూ.. చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. మరో సారి చంద్రబాబునాయుడు చేతిలో మోసపోవద్దని గణాంకాలతో సహా వివరిస్తూ సుమారు గంట సేపు పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యం తం ప్రజలను ఆకట్టుకుంది. ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రజ లు కేరింతలు కొట్టారు. ఈ సభ పుత్తూరు చరిత్రలో నిలిచిపోతుందనే మాటలు వినబడ్డాయి. రోడ్ షో సూపర్ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. పుత్తూ రు జన సమ్మోహనమైంది. -
‘ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్’
సాక్షి, చిత్తూరు: అలుపెరగని నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రోజాతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్వేటినగర్ కూడలిలో వైఎస్సార్ క్యాంటీన్‌ను వారు ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రకు ఊహించని మద్దతు లభిస్తోందని, పాదయాత్ర అనంతరం ఢిల్లీలో జగన్‌తో సభ నిర్వహిస్తామని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ ఆశాజ్యోతి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుంట్ను గుంటనక్కలు ఉన్నారని, వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న వారి పాలన త్వరలోనే అంతమవుతుందని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
అధికారంలోకి రాగానే గాలేరు–నగరి పూర్తి
నగరి: తాము అధికారంలోకి రాగానే గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని, నగరి అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా వేధిస్తోందని అన్నారు. శనివారం నగరిలో జరిగిన రోజా పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా సమస్యలపై ఎమ్మెల్యే రోజా చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. సర్కారు నిధుల కోసం వేచి చూడకుండా రోజా సొంత నిధులతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తోందన్నారు. పథకాల కోసం ఖర్చు ఎక్కువవుతున్నా వెనకడుగు వేయలేదని చెప్పారు. వచ్చే పుట్టిన రోజుకు ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్టులో ఆమెను చూడాలని ఉందని ఆకాంక్షించారు. నగరి నియోజకవర్గం తల్లిలాంటిది: రోజా తన చిరకాల వాంఛను నెరవేర్చిన నగరి నియోజకవర్గం కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి ప్రజలు ఏ సమయంలో అయినా తనను కలిసి కష్టాలు చెప్పుకోవచ్చని తెలిపారు. సర్కారు నిధులు ఇవ్వకపోయినా సొంత డబ్బుతో అయినా మేలు చేసేం దుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మంచినీళ్ల ప్లాంట్లు, ఫ్యాన్లు, పండ్లు అమ్ముకునే వారికి తోపుడు బండ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం పేదలకు సంక్షేమ ఫలాలు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజలు సంక్షేమ ఫలాలు పొందాలంటే జన్మభూమి కమిటీల వద్ద చేతులు కట్టుకొని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని వాపోయారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలు, గూండాలు ఉన్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని చంద్రబాబు రౌడీల చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. నగరిలో ఎమ్మెల్సీ ఉన్నా గాలేరు–నగరి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై ప్రేమలేదు కాబట్టే ప్రాజెక్టు పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేసిన పాపానపోలేదన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రోజా పుట్టిన రోజు వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుత్తూరు నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కువైట్‌లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి. యాప్‌తో ప్రజలకు మరింత చేరువ.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యే ఆర్కే.రోజా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు ‘మై ఎమ్మెల్యే’ యాప్‌ను శనివారం అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కస్తానని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రారంభించారు. -
చంద్రబాబుపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త సెల్వమణి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ శనివారం నగరిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా.. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. సభలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. తాను చేసిన అభివృద్ధి ఏంటో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చని రోజా తెలిపారు. -
ప్రైవేట్ షుగర్స్ దోచుకుంటున్నాయ్
చిత్తూరు, నగరి : ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు రైతులను దోచుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. మంగళవారం నగరిలో పలు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి దృష్టికి సమస్యలను తీసుకువచ్చారు. ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు రైతులను దోచుకుంటున్నాయని, ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడమే ఇందుకు కారణమన్నారు. అనకాపల్లె షుగర్ ఫ్యాక్టరీకి రూ.30 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోని గాజులమండ్యం చెరుకు ఫ్యాక్టరీకి కూడా నిధులు మంజూరు చేసి, జిల్లా చెరుకు రైతులను ఆదుకోవడం లేదన్నారు. అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతం బకాయిలు కూడా ఇవ్వలేదని వాటిని అందించాలన్నారు. చెరుకు రైతుకు కోస్తాలో టన్నుకు రూ.3500 వస్తుంటే ఇక్కడ రూ.2500 మాత్రమే ఇస్తున్నారన్నారు. పంట కాలిపోతే నష్టపరిహారం రావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారని వారికి ప్రోత్సాహం లేదన్నారు. వడమాలపేటకు చెందిన బాడీ బిల్డర్ హరికృష్ణకు తాను రూ.లక్ష ఇచ్చానని చెప్పారు. దీంతో అతను గోల్డ్‌మెడల్ సాధించాడన్నారు. ఇలా క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరెన్నో పథకాలు వస్తాయన్నారు. ఆ క్రెడిట్ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. కళాకారుడైన ఎన్టీఆర్ పేరు మీద స్టేడియం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడే 8 రోజుల పాటు వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి పలువురు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. పలుచోట్ల మైదానాలు లేవని, నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు అందించాలని ఎంపీ శివప్రసాద్‌ను కోరారు. అర్ధాంతరంగా వెనుదిరిగిన ఎమ్మెల్సీ నగరి పట్టణంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అర్బన్ హౌసింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తరువాత జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సీఎం చంద్రబాబు నగరి నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరినీ ప్రకటించకపోయినా, గాలి భాను ప్రకాష్ ఇన్చార్జిగా చెప్పుకుని తిరుగుతున్నాడని మంత్రి అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. గాలి భాను ప్రకాష్ వ్యవహారశైలి నచ్చకపోవడంతోనే ఎమ్మెల్సీ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు -
నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా
-
నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా
సాక్షి, చిత్తూరు : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రోటోకాల్‌ను పక్కదారి పట్టిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కే రోజా విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని రోజా ఆరోపించారు. భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని దీనిపై స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలోని వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆమె కల్టెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం ద్వారా నగరి నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచారని ప్రజలంతా అనుకుంటున్నారని, తమ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా చంద్రబాబు నాయుడు కుట్ర పూరింతంగా వ్యవహరించినా.. తన వంతు సహాయం ప్రజలకు అందిస్తున్నానని రోజా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని.. వెంటనే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి
పుత్తూరు: నగరి టీడీపీ ఇన్చార్జి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో సమావేశమయ్యారు. ఇన్చార్జి పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకుండానే వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆధిపత్యపోరుతో టీడీపీ కేడర్ వర్గాలుగా చీలిపోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు శనివారం సమావేశానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముద్దు కుటుంబానికి క్లాస్ అభిప్రాయ సేకరణ అనంతరం నాయకులతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ముద్దుక్రిష్ణమనాయుడి కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముద్దు పెద్ద కుమారుడు భానుప్రకాష్, తల్లి గాలి సరస్వతమ్మ మధ్య విభేదా లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇద్దరి కుమారుల మధ్య ఉన్న విభేదాలపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు వేర్వేరుగా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై పార్టీ మండల అధ్యక్షులను నిలదీశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కఠినంగా చెప్పారు. కుటుంబం ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు. అందుకుగాను ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ కలుగజేసుకుని ఏకాభిప్రాయంతో వస్తే పార్టీ అభ్యర్థిత్వం ముద్దు కుటుంబానికే కేటాయిస్తారా..? అని అన్నట్టు తెలిసింది. కలిసి వస్తే పరిశీలిస్తానని సర్ది చెప్పినట్లు సమాచారం. ముఖ్య నాయకులతో సమావేశం ముగించుకున్న అధినేత బయట ఉన్న కేడర్‌తో మాట్లాడిన సమయంలోనూ ఇన్చార్జి విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా గెలిపించి ముద్దుకృష్ణమకు ఘనంగా నివాళులర్పించాలని ముక్తాయించి నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి సమావేశం నిర్వహించడం ఎందుకని టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆదివారం సాయంత్రంలోపు సయోధ్య కుదిరినప్పటికీ అభ్యర్థిత్వంపై అధినేత తేల్చడనే మాటలు టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది. అభిప్రాయ సేకరణ టీడీపీ అధినేత తన సహజ వైఖరి నాన్చుడు దోరణిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులతో ఉండవల్లిలో శనివారం అధినేత సమావేశం కానున్నట్లు ముందురోజు సమాచారం అందింది. నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై విస్పష్ట ప్రకటన ఉంటుందని భావించిన ముద్దుక్రిష్ణమనాయుడి ఇద్దరు కుమారులు సమావేశానికి మందీమార్బలంతో హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర నాయకుడు టీడీ జనార్దన్ అభిప్రాయ సేకరణ జరిపారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, రెండు మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్‌తోపాటు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్‌చంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి విజయబాబు తదితరులతో అభిప్రాయాలు సేకరించారు. -
నగరిలో పెద్ద ఎత్తున మద్యం పట్టివేత
-
రోడ్డు మీద నాట్లేసిన రోజా
చిత్తూరు : రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్ బంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మీ అందరికీ తోడుగా ఉంటా
చిత్తూరు, విజయపురం: ‘ మీ ఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను ? ఎప్పటికీ మీ వెంటే ఉంటా. మీ కష్టాలను తీర్చే ప్రతినిధిని అవుతా. నిత్యం అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నా రు. గురువారం నగరి పట్టణం సమీపంలోని మం డపం వద్ద నూతన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, నారాయణస్వామి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, మాజీ మంత్రి చెంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నగరి ప్రాంతంలో కరుణానిధి జ్ఞాపకాలు
చిత్తూరు, పుత్తూరు/విజయపురం: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు అన్న వార్త వినగానే నగరి ప్రాంతంలోని డీఎంకే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే తమిళనాట నాస్తికుడిగా, అభ్యుదయ భావాలకు నిలువెత్తు రూపంగా రాజకీయ అరంగేట్రం చేసిన కరుణకు రాష్ట్ర సరిహద్దులోని నగరి ప్రాంతంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నగరితో ప్రత్యేక అనుబంధం.. 1949వ సంవత్సరంలో పార్టీ పెట్టినప్పుడే నగరిలో డీఎంకే జెండా ఎగిరింది. ఏకాంబరకుప్పంకు చెందిన మునస్వామి నగరిలో డీఎంకే పార్టీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి మునస్వామి మృతి చెందే వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్ డీఎంకే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. కరుణానిధి నాలుగుసార్లు నగరిలో పర్యటించారు. తొలిసారి 1952వ సంవత్సరంలో నగరిలో డీఎంకే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. 1972లో సీఎస్ఐ ఆసుపత్రి వర్గాల ఆహ్వానం మేరకు నగరికి వచ్చారు. 1986లో తన రాజకీయ గురువు అన్నాదొరై విగ్రహావిష్కరణ కోసం నగరికి వచ్చారు. చివరగా 1994లో నగరి పట్టణంలోని సత్రవాడలో ఏర్పాటు చేసిన డీఎంకే పార్టీ సమావేశానికి హాజరయ్యారు. 1970లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి జ్ఞానప్రకాష్ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు డీఎంకే నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆర్థిక సాయం అందించిన కరుణానిధి.. నగరి ప్రాంతానికి చెందిన సుమారు 50 మందికి కరుణానిధి ఆర్థిక సహాయాన్ని అందించారు. నగరి ప్రాంతానికి చెందిన మునస్వామి కుటుంబంతో కరుణకు విడదీయరాని అనుబంధం ఉంది. మునస్వామి బతికి ఉన్నంత వరకు ఆయన్నే రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగించారు. గత ఏడాది మునస్వామి మృతి చెందితే కరుణానిధి కుమారుడు స్టాలిన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రస్తుతం మునస్వామి కుమారుడు మూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి వారి కుటుంబం పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. నగరి ప్రాంతానికి చెందిన కార్యకర్తలు కరుణను కలిసిన ప్రతిసారీ ఆప్యాయంగా పలకరించేవారని వారు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కరుణానిధి మేరుపర్వతం అని ఆయన అభిమానులు పోలుస్తుంటారు. కరుణ అస్తమించడం డీఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు బంద్ తిరుపతి సిటీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత డాక్టర్ కరుణానిధి మృతితో తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అవాంఛనీయ సంఘటనలతో ఆర్టీసీకి నష్టం కలిగిస్తారనే ఉద్దేశంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. అదే విధంగా తమిళనాడు నుంచి ఏపీలోని పలు జిల్లాలకు వ చ్చే తమిళనాడు ఆర్టీసీ బస్సులను కూడా సాయంత్రం 6గంటల నుంచే నిలిపివేశారు. తిరుపతి నుంచి వేలూరు, తిరుత్తణి, తిరువణ్ణామలై, కోయంబత్తూరు, సేలం, చెన్నై, పాండిచ్చేరీ, మధురై, కాంచీపురం తదితర పట్టణాలకు వెళ్లే బస్సులన్నింటిని పూర్తిగా రద్దు చేసినట్లు తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బస్సులు నడుపుతామని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ఊతుకోట, నగరి, నరహరిపేట, కుప్పం వరకు బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అవస్థలు పడ్డ ప్రయాణికులు.. తమిళనాడుకు ఆర్టీసీ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన తమిళనాడు భక్తులు బస్సులు రద్దు కావడంతో ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలను మాట్లాడుకుని వెళ్లారు. దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన ఏకైక వ్యక్తి– వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి తిరుపతి అన్నమ య్య సర్కిల్ : తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి 14వ ఏట నుంచి రాజకీయాల్లోకి ప్రవేశిం చారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. దేశానికి దక్షిణ భారతీయం గురించి తెలియజేసిన రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి. కేంద్ర ప్రభుత్వం ఉత్తర దేశ సంప్రదాయాలను దక్షిణ భారతీయులకు అంటగట్టాలని ప్రయత్నించినప్పుడు దరిచేరనివ్వకుండా కాపాడారు. దక్షిణ భారత సంప్రదాయాలను కాపాడిన వ్యక్తి కరుణానిధి. సరిహద్దుల్లో అలెర్ట్ చిత్తూరు అర్బన్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి మృతి పట్ల జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాలు తమిళనాడుకు సరిహద్దులో ఉండటం వల్ల డీఎంకేకు చెందిన కార్యకర్తలు, మద్దతు దారుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని చిత్తూరు, తిరుపతి ఎస్పీలు రాజశేఖర్‌బాబు, అభిషేక్ మొహంతిలు ఆయా సబ్ డివిజన్ల డీఎస్పీలను ఆదేశించారు. -
నగరిలో ముగిసిన క్రీడాసంబరం
నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నమెంటు శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో నిర్వహిం చిన ఈ పోటీల్లో 220 టీములు పాల్గొన్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన పోటీల్లో 2400 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు రోజూ ఇందులో పాల్గొని క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. విజయపురం(నగరి): నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో 8రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నీ శుక్రవారం ముగిసింది. 8 రోజులపాటు 220 జట్లు,2400 మంది క్రీడాకారులతో నగరి ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో సంబరంలా సాగిన టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్స్‌లో నగరి డేంజర్ ఎలెవన్ ఏ జట్టు విజేతగా నిలిచింది. పుత్తూరు ఎంజీ ఫైర్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలకు ము ఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రోజా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధన కోసం, జగనన్న ఆశయాల కోసం పోరాడుతూ మహానేత పేరుతో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన ఎమ్మెల్యే రోజా అభినందనీయురాలని కొనియాడారు. టోర్నీ నిర్వహించడం ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన పని అని అన్నారు. ఎమ్మెల్యే రోజా విజన్ ఉన్న నాయకురాలు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మా ట్లాడుతూ గ్రామీణ యువతకోసం ఎమ్మెల్యే రోజా ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి అవకా శాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. గ్రామీ ణ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది ఒక వేదికగా నిలిచిందని తెలిపారు. అందరి ఆశీస్సులతోనే తనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రొత్సహిస్తున్న పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నగరి ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసంతోనే ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించగలిగానని తెలిపా రు. మొదట్లో 100 జట్లు అనుకుంటే 220 జట్లు వచ్చాయని పేర్కొన్నారు. టోర్నీ నిర్వహణకు సహాయ, సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగరి డిగ్రీ, జూని యర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఆమె వెంటబడి పోలీసులు కేసులు పెడుతున్నారు
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా ఉపయోగించుకుని వైఎస్సార్ సీపీ నాయకులను అణిచి వేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ క్రికేట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని, నిలదీస్తోందనే ఉద్దేశంతో కుట్రచేసి ఒక సంవత్సరం పాటు శాసనసభకు రాకుండా సస్పెండ్ చేశారని తెలిపారు. రోజా వెంట పోలీసులుపడి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక మహిళకు ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రశ్నించారు. గ్రామ దర్శిని పేరిట ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ప్రజలతో బహిరంగ సభలు పెడుతున్నారని, అందులో గ్రామాలకు అవసరమైన అభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న పాదయాత్ర గురించి కించపరుస్తూ మాట్లాడటం చౌకబారు తనమన్నారు. చంద్రబాబు అంత నేరస్తుడు ఈ దేశంలోనే ఎవడూ లేడని.. వేల, లక్షల కోట్ల రూపాయలు కాజేశాడని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించారని అన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు చూస్తే ఏ తెలుగువాడైనా బాధ పడవల్సిందేనన్నారు. -
ఏయ్.. పక్క గ్రామాల్లో తిరగొద్దు
చిత్తూరు, నిండ్ర:‘ఏయ్.. ఎక్కడికెళ్లి వస్తున్నారు? ఒక గ్రా మం వాళ్లు ఇంకో గ్రామంలో తిరగద్దండి. వేరే గ్రామాల్లోకి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అంటూ నగరి సీఐ మల్లికార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొప్పేడు దళితవాడలో ఎమ్మెల్యే రోజా బుధవారం వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు వెళ్లారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్న వారి వాహనాలను నగరి సీఐ మల్లికార్జున గుప్తా మార్గమధ్యలో నిలిపారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారని బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే రోజా కార్యక్రమానికి వెళ్లినట్టు చెప్పడంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మీ గ్రామంలోనే ఉండాలి. మరో గ్రామానికి వెళ్తే కేసులు నమోదు చేస్తా’ అని హెచ్చరించారు. వేరే గ్రామాల్లో తిరగవద్దని చెప్పే హక్కు సీఐకి ఎవరిచ్చారని నేతలు మండిపడుతున్నారు. -
క్రికెట్ టోర్నీని భగ్నం చేసేందుకు బాబు సర్కారు కుట్ర
-
టోర్నీని అడ్డుకునేందుకు కుట్ర: రోజా
తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో ఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆర్కే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ డ్రిల్ మాస్టర్లను పంపాలని తాను ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని..ఇందుకు వారు పంపుతానని కూడా తెలిపారని అన్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు డ్రిల్ మాస్టర్లను రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ఇది తన మీద కక్ష సాధింపేనని పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవని, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తారని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వైఎస్సార్సీపీ బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబుది గోబెల్ ప్రచారం: పార్థసారథి రాష్ట్ర ప్రయోజనాల మీద చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని,ప్రజలను తప్పుదోవ పట్టించ దానికే ప్రధాని మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్సీపీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేస్తాయని చంద్రబాబు గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికే వైఎస్సార్సీపీ, బీజేపీతో కలసి పోటీ చేయదని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేక సార్లు చెప్పాడని గుర్తు చేశారు.నేను చంద్రబాబుకు సవాల్ విసురుతున్నావచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి వైఎస్సార్సీపీ పోటీ చేస్తే నేను రాజకీయాలనుంచి విరమించుకొంటా.. కలసి పోటీ చేయకపోతే చంద్రబాబు తప్పుకుంటాడా అని పార్ధసారథి ప్రశ్నించారు. -
నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు
తిరుపతి: గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. సోమవారం రోజా తన సొంత నిధులతో నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రతిపక్షం మీద కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఏపీ సీఎం కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. అప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. -
టీడీపీ దాదాగిరి: రోజాపై దాడికి యత్నం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం. అంతకు మందు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డుపాలు అయ్యారన్నారు. మామాడికి గిట్టుబాటు లేక రైతులు రోడ్లెక్కారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గు కాదా అన్నారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు. -
బూత్ కమిటీలతోనే పార్టీ పటిష్టం
నగరి (నిండ్ర) : పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజూ దిశానిర్దేశం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నగరి రూరల్ మండల బూత్ కమిటీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియెజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ పటిష్టతకు కమిటీలు సమన్వయంతో వ్యవహరించడం వల్ల పట్టు సాధించామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఆ విషయాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కొత్తగా ఓటర్లను నమోదు చేయించడానికి కూడా మరింత చురుగ్గా వ్యవహరించాలని, దీనివల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ఈ బాధ్యతలు తీసుకోవడంలో బూత్‌కమిటీలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అమలుకాని వాగ్దానాలతో మోసం చేసిన ప్రభుత్వ పెద్దల తీరుపై ప్రజలను మరింత చైతన్యం చేయడంతో పాటు, అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ అమలు చేయనున్న నవరత్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల అభిమానం చూరగొనాలన్నారు. ఆ ప్రచారం నమ్మవద్దు.. నగరి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా తనకు టికెట్ లేదని కొందరు సాగిస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను కోరారు. నేను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, శ్రేణులు పార్టీని మరింత పటిష్టం చేయాలనే తపనతోనే ఉన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో అధికార పార్టీని సూటిగా నిలదీసే వారిలో నేను కూడా ఒకరినని రోజా తెలిపారు. దీంతో తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. నా జీవితం పార్టీకే అంకితం. జగన్ అన్నకు తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. గెలుపే ధ్యేయం కావాలి.. నగరి నియోజగవర్గంలో పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కేజే.కుమార్ కోరారు. నగరి బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కమిటీ సభ్యులు పార్టీ విజయానికి మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలను ప్రజలకు వివరించి మరింత చైతన్యం చేయాలన్నారు. నగరిలో ఇసుక మాఫియా, ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుజ్జిరెడ్డి, చంద్రారెడ్డి, హరిహరన్, సుధాకర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగయ్యనాయుడు, కృష్ణమూర్తి, పరుశురామ్, ప్రతీప్లు పాల్గొన్నారు. -
పాదిరేడు నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారానికి 64వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం ఆయన నగరి నియోజకవర్గం పాదిరేడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తాడ్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం, ఆర్వీ కండ్రిగ, పెనుమల్లం, పాపనాయుడుపేట, మర్రిమండ బీసీ కాలనీ మీదగా వికృతమల వరకు యాత్ర కొనసాగనుంది. పాపానాయుడు పేటలో బీసీలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. -
షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనను మంగళవారం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు కలిశారు. చెరకు ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పోయామని, 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూతపడిన ఈ ఫ్యాక్టరీలను వైఎస్ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
నవరత్నాలపై హర్షాతిరేకాలు: రోజా
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. ‘బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకు మాత్రమే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైఎస్ జగన్ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరని ప్రజలు విశ్వసిస్తున్నారు. పిల్లలను చదవించే బాధ్యత వైఎస్ జగన్ తీసుకుంటున్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి.ఇ ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.’ అని విమర్శించారు. -
జరిమానాగా హెల్మెట్!
తప్పు చేస్తే జరిమానా విధించడం పరిపాటి. కానీ నగరి పోలీసులు మాత్రం జరిమానా బదులు హెల్మెట్ అందజేస్తున్నారు. ఊరికే కాదండోయ్.. జరిమానాగా విధించిన మొత్తానికే.. నగరి: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎన్నిసార్లు పోలీసులు చెబుతున్నా కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు. దీంతో జరిమానాలు భారీగా పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే పట్టుబడ్డప్పుడు చూసుకోవచ్చులే అనే నిర్లక్ష్యంతో కొందరు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా నగరి పట్టణ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ఆదివారం పోలీసులు దృష్టి సారించారు. ఓంశక్తి ఆలయం సమీపంలోని బైపాస్ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని ఆపి జరిమానా కింద హెల్మెట్‌ను అందజేశారు. రూ.500 జరిమానాకు బదులుగా రూ.535కే హెల్మెట్ ఇవ్వడంతో వాహనదారులు జరిమానాకు బదులుగా హెల్మెట్లను కొనుగోలు చేసుకున్నారు. వాహనాలపై సుదూరం ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ విక్రమ్ తెలిపారు. -
నగరి కళాశాలకు ఎమ్యెల్యే వాటర్ ప్లాంట్
నగరి: పట్ణణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లక్ష రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె ఆ ప్లాంటును ప్రారంభించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన సమయంలో తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రిన్సిపాల్ రఘుపతి, మునిసిపల్ చైర్పర్సన్ కే.శాంతి, మాజీ చైర్మన్ కేజే కుమార్ పాల్గొన్నారు. -
మద్యం ‘రాజా’ ఎవరు?
- నీళ్లు నములుతున్న అధికారులు - దర్యాప్తు పేరిట నాన్చుడు వైఖరి - చక్రం తిప్పుతున్న నియోజకవర్గ టీడీపీ నేత - సంచలన మద్యం కేసు పక్కదారికి అధికార పార్టీ ఒత్తిళ్లు నగరి: పట్టణంలో సంచలనం రేపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడి కేసును అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌లో అధికార పార్టీకి చెందిన నాయకుని గోడౌన్‌పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం రాత్రి దాడి చేసి అధిక సంఖ్యలో మద్యం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటి విలువ లెక్కించాక అధికారులే విస్తుపోయారు. దీని విలువ సుమారు కోటి రూపాయలని అంచనా. నిందితుడి పేరు వెల్ల డించడానికి మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార టీడీపీ నేత ఒత్తిళ్లతోనే పేరు వెల్లడికి వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. అన్ని రకాల మద్యం బాక్సులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్యాప్తు ఆలస్యమౌతోందని,క్షుణ్ణంగా పరిశీలించాక ఎవరికి సంబంధం ఉందో చెబుతామన్న అధికారులు సోమవారం రాత్రి వరకు వెల్లడించలేదు. సరకులను లెక్కిండానికి మూడు రోజులు పడుతుందా? ఇన్ని రోజులుగా లెక్కిస్తున్నారంటే ఎంత మద్యం ఉండాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినా వివరాలు తెలపకపోవడంతో అధికార పార్టీకి చెందిన వారు కనుక అధికారులు దర్యాప్తును పక్కదోవ పట్టిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్సైజ్ అధికార సిబ్బంది 1050 కేసులు మద్యం సీసాలు, 1250 కేసులు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మద్యం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తుండటంతో దొరికింది పాత మద్యమా లేక సెకండ్స్ మద్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మద్యం కేసులో పట్టుబడిన వారు సొంత పార్టీకి చెందిన వారైనా వదలిపెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుంటే అదే పార్టీ నాయకులు ఇలాంటి కేసుల్లో వత్తాసు పలకడం కలకలం రేపుతోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఈ విషయంలో తెరవెనుక రాజకీయం చేస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతోనే అధి కారులు వివరాలు వెల్లడించడం లేదని సమాచారం. -
ఇదేం.. సం‘దేశం’
►సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్సీపీ ►టీడీపీకి చెందిన వార్డు ఉప ఎన్నికలకు దూరం ►ఫలితంగా రెండు చోట్ల ఏకగ్రీవం ►కానీ వైఎస్సార్సీపీ వార్డుల్లో టీడీపీ పోటీ ►సంప్రదాయాన్ని కాదన్న అధికార పార్టీ ►ఏప్రిల్ 9న ఎన్నికలు అనివార్యం సంస్కృతి సంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ కొత్త నిర్వచనం చెప్పింది. సభ్యుడు చనిపోయిన చోట ఉప ఎన్నికలో ఏపార్టీ అయినా ఆ కుటుంబానికే తిరిగి అవకాశమివ్వాలనేది రాజకీయ సంప్రదాయం. అదే విధానాన్ని గౌరవించి జిల్లాలోని రెండు వార్డు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వైఎస్సార్సీపీ బరిలో నిలవలేదు. కానీ ఇందుకు భిన్నంగా టీడీపీ వ్యవహరించింది. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు చనిపోయిన వార్డులో తమ అభ్యర్థులను పోటీకి నిలిపి రాజకీయమే ముక్కున వేలేసుకునేలా చేసింది. చిత్తూరు (అర్బన్): జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు మునిసిపాలిటీల్లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరులోని 33వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొంది న కటారి అనురాధ నగర తొలి మహిళా మేయర్‌గా ఎన్నికయ్యారు. 2015 నవంబరులో ఈమె హత్యకు గురవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అలాగే 38వ డివిజన్లో శివప్రసాద్‌రెడ్డి 2015 డిసెంబరులో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్థానానికి సైతం ఉప ఎన్నికలు వచ్చాయి. 33వ డివిజన్లో అనురాధ కోడలు కటారి హేమలత టీడీపీ నుంచి బరిలోకి దిగడంతో సంప్రదాయాలను గౌరవిస్తూ వైఎస్సార్సీపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. 38వ వార్డులో శివప్రసాద్‌రెడ్డి సోదరి జ్యోతి వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ వేశారు. అయినా టీడీపీ నాయకులు సానుభూతి చూపకుండా వసంతకుమార్ నాయుడు అనే వ్యక్తిని పార్టీ తరపున బరిలోకి దింపి బీ–ఫామ్ కూడా అందచేసింది. నగరిలో 26వ వార్డులో టీడీపీ తరపున గెలిచిన సెల్వం గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఇక్కడ ఆయన సతీమణి జీవ నామినేషన్ వేయడంతో వైఎస్సార్సీపీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఎవరినీ పోటీకి ఉంచలేదు. పలమనేరులో 23వ వార్డులో హరికృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ తరపున కౌన్సిలర్‌గా గెలిచి గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మహ్మద్ నియాజ్‌ను వ్యక్తిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఈ వార్డులో టీడీపీ మదన్మోహన్ను పోటీకి పెట్టింది. మరోపార్టీకి చెందిన సభ్యులు చనిపోయిన చోట ఎన్నికల్లో పోటీ పెట్టరాదనే విధానానికి వైఎస్సార్సీపీ రెండుచోట్ల నామినేషన్లు వేయలేదు. ఫలితంగా చిత్తూరు 33వ డివిజన్లో కటారి హేమలత (మేయర్ అభ్యర్థి), పలనమేరులో ఆర్ఎస్.జీవ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. చిత్తూరులోని 38వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జ్యోతిపై, పలమనేరులోని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహ్మద్నియాజ్లపై టీడీపీ నుంచి అభ్యర్థుల్ని పోటీలోకి దింపారు. దీంతో ఈ రెండు వార్డులకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. -
నగరిలో భారీ వర్షం
పిడుగుపడి రెండు పశువుల మృతి నగరి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగుపడటంతో కృష్ణరామాపురం గ్రామంలో లక్ష్మీదేవికి చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి. మేతకు వాటిని చెరువు గట్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆకస్మికంగా పిడుగుపడింది. ఆ సమయంలో లక్ష్మీదేవి దూరంగా ఉండటంతో ఆమెకు ప్రమాదం తప్పింది. మృతి చెందిన ఆవు, ఎద్దు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపింది. వీఆర్వో నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తహసీల్దార్‌కు నివేదిక సమర్పించారు. గంట సేపటికిపైగా భారీగా వర్షం కురవడంతో పట్టణ పరిధిలో జనజీవనం స్తంభించింది. వాహనాలు కూడా రోడ్లపై కాసేపు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆకస్మికంగా వర్షం పడటంతో ఇటుకల తయారీదారులు నష్టపోయారు. పాలసముద్రం మండలంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
నేటి సాయంత్రం నగరికి రానున్న స్టాలిన్
నగరి: డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎం.కె. స్టాలిన్ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఆదివారం సాయంత్రం నగరి మున్సిపల్ పరిధి ఏకాంబరకుప్పంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇటీవల మృతి చెందిన డీఎంకే పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కేఏ మునస్వామి సంతాప సభకు స్టాలిన్ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర నేత కార్మిక సంఘం వ్యవస్థాపకులు వీఈ గంగాధరం తెలిపారు. (35 ఏళ్ల తర్వాత స్టాలిన్ తప్పుకున్నారు!) ఈ సభకు డీఎంకే ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు నందగోపాల్ అధ్యక్షత వహిస్తారన్నారు. ఎమ్మెల్యేలు పొన్ముడి, వేణు, వేలు, గాంధీ, రాజేంద్రన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భారతి, నేత విభాగం ఉపాధ్యక్షులు నాగలింగం తదితరులు పాల్గొంటారన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత స్టాలిన్ మొదటి రాష్ట్రేతర పర్యటన ఇదేకావడం గమనార్హం. (వారసుడొచ్చాడు) -
వాళ్లు ముందే సర్దుకున్నారు
బాబు, అంబానీలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా విమర్శ పుత్తూరు రూరల్ : పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందే తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, అంబానీ లాంటి వాళ్లు జాగ్రత్త పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఆదివారం ఆమె తన నియోజకవర్గంలోని పుత్తూరులో స్టేట్ బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు లేకపోవడంపై మేనేజర్, సిబ్బందిని నిలదీశారు. ఆదివారం సెలవు కనుక సామాన్య, మధ్య తరగతివారు, ఉద్యోగులు అధిక సంఖ్యలో బ్యాంకుల వద్ద బారులు తీరారని.. తీరా బ్యాంకుల్లో డబ్బులు లేవంటే వారు ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి నేడు డబ్బులులేని పరిస్థితి ఎదురైందన్నారు. -
వైభవంగా ద్రౌపదమ్మ తిరునాళ్లు
నగరి: పట్టణ పరిధి చింతలపట్టెడలో నిర్వహిస్తున్న ద్రౌపదమ్మ తిరునాళ్లలో భాగంగా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించా. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటా పండుగ వాతావరణం కనిపించింది. వీధులకు వేపాకు తోరణాలు కట్టారు. ద్రౌపదమ్మ ఆలయం వద్ద అమ్మవారి పాటలు మార్మోగాయి. ఆలయ ఆవరణలో దుర్యోధన వధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 40 అడుగుల పొడవుతో తయారు చేసిన దుర్యోధన, దుశ్శాశన ప్రతిమలు భక్తులను అలరించాయి. మహిళలు ఆ ప్రతిమల వద్ద పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ద్రౌపదీ, ధర్మరాజ దేవుళ్లను, అలుగును దర్శించుకున్నారు. నిర్వాహకులు నటరాజన్ భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. చెన్నై నుంచి తెప్పించిన వివిధ రకాల భారీ రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలు చిన్నారులను, మహిళలను అలరించాయి. కేరింతలు కొడుతూ వారు ఆనందంతో గడిపారు. రాత్రి ఆలయ సమీపంలో కంకణాలు ధరించిన భక్తులు పసుపు దుస్తులు ధరించి మంగళస్నానాలు చేసి అగ్నిగుండ ప్రవేశం చేశారు. చైర్పర్సన్ కె.శాంతి, మాజీ చైర్మన్ కే.జే.కుమార్, వైస్‌చైర్‌పర్సన్ పీజీ నీలమేఘం తదితరులు అమ్మ వారిని దర్శించుకున్నారు. తిరనాళ్లకు వేలసంఖ్యలో జనం హాజరవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు, చోరీలు జరగకుండా సీఐ మల్లికార్జున గుప్తా, ఎస్ఐ విక్రమ్ భద్రతా చర్యలు చేపట్టారు. చెల్లియమ్మ ఆలయంలో పాలకుండల ఉత్సవాలు మున్సిపల్ పరిధి కరకంఠాపురం గ్రామంలోని చెల్లియమ్మ ఆలయంలో ఆదివారం పాలకుండల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గ్రామస్తులు పాలకుండలతో ఊరేగింపుగా వచ్చి గ్రామ దేవత చెల్లియమ్మకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దేశం పాలనలో రక్షణ కరువు
తమిళనాడు క్రిమినల్స్‌తో ముద్దుకృష్ణమనాయుడు దాడులు శాంతి భర్త కేజే కుమార్ ఆరోపణ చెన్నై: టీడీపీ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో తన సతీమణిపై జరిగిన దాడి ఉదంతమే నిదర్శనమని చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ చైర్పర్సన్ కె.శాంతి భర్త కేజే కుమార్ అన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన శాంతిని సోమవారం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శాంతి భర్తకేజే కుమార్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు చైర్‌పర్సన్‌కు ఉంటుందనే విచక్షణను మరిచిన ముద్దు కృష్ణమనాయుడు తమపై దాష్టీకానికి పూనుకున్నారన్నారు. దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన అమృత్‌రాజ్ తమిళనాడుకు చెందిన నేరస్తుడన్నారు. బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ తమిళనాడు పోలీసుల రికార్డుల్లో పీడీ యాక్టుకు గురై ఏడాదిపాటూ అమృతరాజ్ పుళల్‌లో జైలు జీవితం గడిపాడని చెప్పారు. అతని సోదరుడు మైఖేల్‌రాజ్ నకిలీ మద్యం తయారీలో నిందితుడని చెప్పారు. అమృత్‌రాజ్ ఏడాదిపాటూ పుళల్‌లో జైలు జీవితం గడిపి బయటకు రాగా ఇంకా కేసు విచారణలో ఉందని అన్నారు. తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని ఉన్న నేరస్తులను గాలి ముద్దుకృష్ణమనాయుడు చేరదీశారని ఆరోపించారు. స్థానిక ప్రజల్లోనే కాదు, ప్రతిపక్షాల్లో సైతం తమకు మంచిపేరున్న కారణంగా దాడుల కోసం తమిళనాడు గూండాలపై ఆయన ఆధారపడాల్సి వచ్చిందని విమర్శించారు. ఫోన్ ద్వారా పరామర్శించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్?
నగరి (చిత్తూరు) : పరీక్ష ఏదైనా లీకేజీ బాధ తప్పడం లేదు. తాజాగా శుక్రవారం పదో తరగతి సామాన్యశాస్త్రం-2 పేపర్ లీక్ అయిందనే వార్త హల్ చల్ చేసింది. చిత్తూరు జిల్లా నగరిలోని సరస్వతి పాఠశాల ఎదుట పదో తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నాపత్రం జిరాక్స్ తీస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. శుక్రవారం పదో తరగతి జీవశాస్త్రం పరీక్ష జరుగుతున్న సమయంలో కొందరు అదే ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్ తీస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విషమంగా వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ఆరోగ్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా నగరిలో సమస్యల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ గౌరీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఆమె బుధవారం సాయంత్రం ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. దీంతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈటీటీ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తక్షణమే సమస్యలు పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
-
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
చిత్తూరుజిల్లా: నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
బెయిల్‌పై విడుదలయిన కేజే కుమార్
చిత్తూరు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేజే కుమార్ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో కమిషనర్‌పై దాడి చేశారని పోలీసులు తప్పుడు ఫిర్యాదుతో కేజే కుమార్‌ను, ఆయన కుమారుడు కేజే సురేష్, పార్టీ కార్యకర్తలు ముగ్గురిని గత నెలలో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వీరితో పాటు నగరి మునిసిపల్ చైర్పర్సన్ కేజే శాంతిపై కూడా కేసు బనాయించారు. వీరందరికీ బుధవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులతో నాయకులు చిత్తూరులోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కుమార్ తదితరులు చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో షరతుల మేరకు సంతకం చేశారు. అక్కడి నుంచి డీసీసీబీ బ్యాంకు ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేజే కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు, టీడీపీ నాయకులు ఒక్కటై తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కేజే కుమార్ అభిప్రాయపడ్డారు. -
ముద్దుకృష్ణమా.. జాగ్రత్త...
తిరుపతి : ''ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతున్నందుకు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు ఏదైనా ఉంటే నాతో ఢీ కొట్టాలి. అలా కాకుండా నా అనుచరులను, అమాయకులను వేధిస్తూ, కేసులో బెదిరించాలని చూస్తే వదిలేది లేదు. ముద్దుకృష్ణమా.. జాగ్రత్త. మళ్లీ ఇలాంటివి పునరావృతం చేస్తే ఊరుకోం...'' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా హెచ్చారించారు. జిల్లా జైలులో ఉన్న నగరి వైఎస్ఆర్ సీపీ నాయకులు కేజే.కుమార్ తదితరులను ఆమె నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అనుచరులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా పక్కదారి పట్టాయని విమర్శించారు. పోలీసులను గుప్పెట్లో ఉంచుకుంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. నగరి కమిషనర్ అవినీతికి పరాకాష్టని, ఆయన ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పై దాడి చేసిన పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని రోజా మండిపడ్డారు. -
పార్టీ మీకు అండగా ఉంటుంది: వైఎస్ జగన్
తిరుపతి: నగరి మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేయడాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై శాంతకుమారితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్.. పోలీసుల దాడులను ఎదుర్కొందామని, ధైర్యంగా ఉండాలని ఆమెకు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు దౌర్జన్యాలు శృతిమించుతున్నాయని, వాటిని తిప్పికొడదామని ఆమెకు ధైర్యం చెప్పారు. 'మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు నేను అండగా ఉంటా. భయపడాల్సిన అవసరం లేదు' అని శాంతకుమారికి వైఎస్ భరోసా ఇచ్చారు. -
నగరిలో పోలీస్ జులుం
-
నగరిలో పోలీస్ జులుం
నగరి: చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పోలీసులు జులం ప్రదర్శించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతా కుమారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. శాంతాకుమారి ఇంటి గేటుకు వేసిఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు. ఒక పాత కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు.. మున్సిపల్ చైర్ పర్సన్ శాంతా కుమారిని, భర్తను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నించారు. కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం వివాదాలకు దారి తీస్తోంది. ఒక ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన శాంతకుమారి కుమారుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
మొన్న రోజా - నేడు శాంతి!
-
మొన్న రోజా - నేడు శాంతి!
నగరి(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేదని చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ శాంతిపై సోమవారం దాడి జరిగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కె. శాంతిపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత ముద్దు కృష్ణమ నాయుడు వర్గీయులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. కుడి చేతికి గాయమైంది. గతంలో జాతర సమయంలో తనపై దాడి జరిగితే, ఇప్పుడు చైర్‌పర్సన్‌పై దాడి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకష్ణమ నాయుడు దిగజారుడు రాజకీయాలే ఈ దాడులకు కారణమన్నారు. స్మగ్లర్లను ఆయన తన అదుపులో ఉంచుకుని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు. -
నగరిలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి తొమ్మిది మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారు ప్రయాణిస్తున్న కార్లతోపాటు ఎర్రచందనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళలకు రక్షణ అనేదే లేదా ?
-
నగరిలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత
నగరి : చిత్తూరు జిల్లా నగరిలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాపై దాడికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ నేతలు శనివారం నగరి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే రోజా, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణస్వామి, అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో నగరి పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మహిళా శాసనసభ్యురాలు అని చూడకుండా దాడికి దిగటం దారుణమని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆ బాధ్యతను విస్మరించటం దురదృష్టకరమన్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ఆందోళన నేపథ్యంలో మరోవైపు నగరిలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. -
ఎమ్మెల్యేను లేపేయండిరా అంటారా?: రోజా
నగరి : ఒక ఎమ్మెల్యేగా, మహిళగా దేవతకు హారతి ఇవ్వడానికి వెళ్తే దారుణంగా దాడి చేయటంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఈ దాడిని ఖండిస్తూ రోజాతో పాటు ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు దాడి చేసిన వారిని పట్టుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ జాతర జరుగుతోందని, ఎమ్మెల్యే కాక ముందు నుంచి నగరి నియోజకవర్గ ఆడబిడ్డగా ప్రతి సంవత్సరం వచ్చి జాతర చేస్తున్నామన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచి... టీడీపీ ఓడిపోయిందన్న కసితో ముద్దుకృష్ణమ నాయుడు, ఆయన కుమారుడు భాను స్థానికుల్ని రెచ్చగొట్టారన్నారు. ప్రతి విషయాన్ని వారు సమస్య చేస్తున్నారని రోజా అన్నారు. ముద్దు కృష్ణమనాయుడు అండతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారన్నారు. అ నేపథ్యంలో తాము శుక్రవారం జాతర చేసుకుంటామని ముందుగా కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. టీడీపీ నేతలు వస్తే గొడవలు జరుగుతాయని తాము వారిని రావద్దన్ని చెప్పామన్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని, కోర్టు ఆర్డర్లో ఎవరు ఎవరూ రాకూడదనే వివరాలు స్పష్టంగా ఉన్నా. వారందర్నీ డీఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి అనుమతి ఇచ్చారన్నారు. వాళ్లకు ఎందుకు డీఎస్పీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. హారతి ఇస్తుంటే తన చేతిలో హారతి పళ్ళాన్ని వీఆర్వో జ్యోతిరెడ్డి అలియాస్ సదాశివరెడ్డి లాక్కున్నారని, కింద పడేశారన్నారు. అదే సమయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడుగా ఉన్న కొడిబాబు అలియాస్ బాబురెడ్డి అమ్మవారి పైకి ఎక్కేసి, తన చేతిని విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడని... అతని చేతిలో కత్తి ఉందో, బ్లేడ్ ఉందో తెలియలేదని, ఆ సమయంలోనే తన చెయ్యి తెగిందన్నారు. అయినా కూడా అతడిని కిందకు దిగమని బతిమలాడుతున్నారే కానీ, ఒక ఎమ్మెల్యేకు ప్రాణ హాని ఉందన్నా రక్షణ కల్పించలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎమ్మెల్యేను లేపేయండిరా తర్వాత మనకు అడ్డం ఉండదు' అని వీఆర్వో వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థం అవుతుందన్నారు. -
హారతి ఇస్తుండగా రోజా పై దాడి
-
ఎమ్మెల్యే రోజాపై దాడి, చేతికి తీవ్ర గాయం
నగరి : చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను లక్ష్యంగా చేసుకుని నానా రభస సృష్టించారు. నగరిలో ఏటా అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. చివరి రోజు ప్రోటో కాల్ ప్రకారం దేవతలకు ఎమ్మెల్యే ప్రధాన హారతి ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇందుకు విరుద్ధంగా టిడిపి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జాతర పెద్ద కుమరేశన్ మొదలియార్ ప్రధాన హారతి ఇవ్వకూడదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ తోపులాటలో రోజా చేతిలోని హారతిపళ్లెంను మరోవర్గం వారు లాగేయటంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేతలకు పోలీసులు కూడా సహకరించటం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. (ఇంగ్లీష్ కథనం) -
అధికారంలో ఉంటే వీరంగం సృష్టిస్తారా?
-
ముద్దుకష్ణమ పార్టీ మారితే తప్పు కాదా ?
నగరి : టీడీపీ కౌన్సిలర్ హరి హరన్ పార్టీ మార్చి ఓటేశార ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు ముద్దుకృష్ణమ నాయు డు పార్టీ మారింది తప్పు కాదా ? అని ఎమ్మెల్యే ఆర్కేరోజా ప్రశ్నించారు. శనివారం ఆమె ఫోన్లో విలేకరితో మాట్లాడుతూ పార్టీ మార్చి ఓటు వేశారంటూ హరిహరన్ ఇంటి ముందు టీడీపీ నాయకులు ధర్నా చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పలుప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను రాబట్టుకొని మున్సిపల్ కుర్చీలను చేజిక్కించుకుందన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్లలేదా ? అని ప్రశ్నించారు. నేడు టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఉసిగొల్పి హరిహరన్ ఇంటి ముందు ధర్నా చేయించారని ఆరోపించారు. ధర్నా చేస్తున్న వారిలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనకు ద్రోహం చేసి మరో పార్టికి పనిచేసిన వారు ఎందరున్నారో తనకు తెలుసన్నారు. ధర్నాచేస్తున్న వారిని అక్కడి నుంచి పంపకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. -
చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం
మదనపల్లి మునిసిపల్ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మునిసిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నా.. తమ వద్ద ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారంటూ టీడీపీ ప్రగల్భాలు పలుకుతోంది. విజయం తమదేనని చెబుతోంది. ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇదే జిల్లా నగరి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్ సభ్యులను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. పుత్తూరు, నగరి చైర్మన్ ఎన్నికల్లో అభ్యర్థులను తాను పంపే కవర్లో సూచించినవారినే ఎన్నుకోవాలంటూ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మెలిక పెట్టారు. అయితే అందుకు టీడీపీలోని కొన్ని వర్గాలు ససేమిరా అంటున్నాయి. దాంతో ఇక్కడ టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. -
రైల్వే జనరల్ మేనేజర్‌ను కలసిన రోజా
-
నగరి ప్రజల రుణం తీర్చుకోలేనిది
నగరి, న్యూస్‌లైన్ : నగరి ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన అనంతరం చిత్తూరు నుంచి ఆమె నగరికి విచ్చేశారు. విజయానందంతో విచ్చేసిన ఆమెకు మున్సిపల్ పరిధి సత్రవాడ నుంచి నగరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా హారతులు, దుశ్శాలువలు, పూలహారాలతో స్వాగతం పలికారు. టపాకాయలు, బాణాసంచాలు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె గెలుపొందడం పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. చిత్తూరు నుంచి నగరి పట్టణానికి చేరుకునే మార్గంలో సత్రవాడ దుర్గాదేవి ఆలయం, తిరవళ్లువర్ విగ్రహం సమీపం, కరివరదరాజ ఆలయ సమీపం, పాత పంచాయతీ భవనం సమీపం, కరకంఠాపురం, కేవీపీఆర్‌పేట, ఏకాంబరకుప్పం, రైల్వేగేటు, కొత్తపేట, ఆనంద థియేటర్ సమీపం, బస్టాండు, చావడి వద్ద నాయకులు కార్యకర్తలు వేచి ఉండి ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పార్టీలోని నాయకులు ఓడించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు తన వెన్నంటి ఉండి విజయపథంలో నడి పించారని తెలిపారు. నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరి ప్రజలు చూపిన ఆదరణ జీవితాంతం మరవలేనిదన్నారు. ఇది నగరి నియోజకవర్గ ప్రజల విజయమన్నారు. వారి తరపున అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం తన గొంతు వినిపిస్తానన్నారు. ఆర్కేరోజా భర్త ఆర్కేసెల్వమణి, మున్సిపల్ మాజీచైర్మన్ కేజేకుమార్, రూరల్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుబ్రమణ్యం, మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్వీ అయ్యప్పన్, నీలమేఘం, కె.శాంతి, ఎంపీటీసీ సభ్యులు కౌసల్య, పాల్గొన్నారు. విజయపురంలో నగరి ఎమ్మెల్యేగా ఆర్కే రోజా గెలుపొందడంతో విజయపురంలో మండల నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. ప్రతి గ్రామంలో టపాకాయలు పేల్చి రంగులు చల్లుకున్నారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నగరిలో ఆర్కే రోజాకు ఘనంగా స్వాగతం పలికారు. శాలవలు కప్పి గజ మాలతో ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, పరందామన్, ఆనంద్, గుణశేఖర్రెడ్డి, రమేష్, అయ్యప్ప, మధు, విమల్, చక్రవర్తిరాజు, సుధాకర్‌రాజు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
'యుద్ధంలో నేనే గెలిచాను'
-
పైనుంచి వైఎస్ఆర్ ఆశీర్వదించారు: రోజా
నగరి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన రోజా హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపుకు కృషి చేసిన అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పైనుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఆశీర్వదించారని, ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని రోజా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్ని ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేశాయని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనను రెండుసార్లు మోసం చేశారని రోజా అన్నారు. మీడియాతో మాట్లాడిన రోజా ఉద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు. -
నగరిలో వికసించిన రోజా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఆర్ కే రోజా విజయం సాధించారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా దాదాపు తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణుమ నాయుడుపై గెలుపొందారు. గతgలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలై.. మూడో ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన రోజాకు విజయం వరించింది. రోజా సొంత జిల్లా చిత్తూరే. సినీ నటిగా అగ్రస్థానానికి చేరుకున్న రోజా దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. దేశం, కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసినా తగిన గుర్తింపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లభించింది. -
నగరిలో రోజా ఆధిక్యం
నగరి : చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రోజా ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఆమె ముందంజలో కొనసాగుతున్నారు. -
నగరిలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలతో పాటు మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అప్పలాయగుంట వద్ద 102 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
ప్రచారంలో సొమ్మసిల్లి పడిపోయిన రోజా
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా వడదెబ్బ తగిలింది. శుక్రవారం ఏకాంబరకుప్పంలో ఎన్నికల ప్రచారం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రచారంలోనే సొమ్మసిల్లిపోవటంతో రోజాను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. -
సైకిల్‌కు ఓటేయాలంటూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు
చిత్తూరు: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫిక్సింగ్ భాగోతం మరోసారి బయటపడింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు పరస్పరం సహకరించుకున్న ఇరు పార్టీలు మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అదే పంథాలో నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఏకమయ్యారు. టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు రోజా, కాంగ్రెస్ నేత చెంగారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనుచర వర్గాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
వడివేలు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను ముసలయ్యాగారి పల్లె నుంచి ప్రారంభించారు. అభిమానుల కోలాహలం మధ్య మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పల్లెప్రజలు చూపించిన ప్రేమానురాగాలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ్టి యాత్ర గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగనుంది. వీర్లగుడి ఎస్సీ కాలనీలో శిఖామణి సుగానందం కుటుంబాన్ని జగన్ ఓదారుస్తారు. నగరిలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్న అక్కడే రాత్రి బస చేస్తారు. -
కుట్ర రాజకీయాలు మానుకోండి
నగరి, న్యూస్‌లైన్: కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడికి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు రోజా హితవు పలికారు. నగరిలో ఏర్పాటు చేసిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆమె ఆదివారం నివాళులర్పించారు. రోజా మాట్లాడుతూ మహానేతపై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండు ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎవరికీ పోటీగా విగ్రహ స్థాపన చేయలేదన్నా రు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తాము బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తే పోటీగా కొన్ని పార్టీలకు చెందినవారు బోరు వేశారన్నారు. ప్రస్తుతం తాము విగ్రహాన్ని ప్రతిష్టిస్తే పోటీగా వారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్తో కలిసి తిరుగు తూ చంద్రబాబు నాయుడును, టీడీపీని ఆయన విమర్శించలేదా అన్నారు. నేడు వైఎస్ఆర్ విగ్రహం పెట్టిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహం పెట్టించాలని ఆయనకు ఆలోచన రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, పార్టీ రూరల్ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేజేసురేష్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రహమాన్, స్థానిక నాయకులు బీఆర్వీ అయ్యప్పన్, రామ్మూర్తి, తిరుమలరెడ్డి, శరత్‌బాబు, జవహర్ రెడ్డి, బిలాల్, చంద్ర, సుబ్రమణ్యం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కొలిక్కి వచ్చిన విగ్రహాల వివాదం నగరి పట్టణంలో విగ్రహాల ఏర్పాటు వివాదం ఆదివారం సాయంత్రం కొలిక్కి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శేఖర్, ట్రైనింగ్ డీఎస్పీ చంద్ర, సీఐ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, ఎంపీడీవో సీతమ్మ చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విగ్రహాలను బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకోవడానికి నాయకులు అంగీకరించారు. ఈ మేరకు అనువైన స్థలాలను ఇరు పార్టీల వారికి బస్టాండు ప్రాంగణంలో కేటాయించారు.