
సాక్షి, చిత్తూరు : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలోనూ పగలూ రాత్రీ తేడా తెలియకుండా అత్యవసర సేవలందిస్తోన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను ఎంత ప్రశంసించినా తక్కువేనని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వ్యాఖ్యానించారు. నగరి రూరల్‌లో పలు చోట్ల ప్రతీ ఇంటికీ 5కిలోల బియ్యం, ఐదు రకాల కూరగాయలను ఆమె పంపిణీ చేశారు.
తాను చేస్తోన్న సేవలో పాలుపంచుకుంటోన్న నాయకులు, కార్యకర్తలకు రోజా ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం వెనుక అధికారుల కృషి, ప్రజల మద్దతు ఎంతో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment