
సాక్షి, తిరుపతి : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ గాలికబుర్లు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు.
చంద్రబాబు బాబు గెలిచిన కుప్పంలో, లోకేష్ ఓడిపోయిన మంగళగిరిలో ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ నేతలే అండగా ఉంటున్నారని రోజా తెలిపారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా ఉచితంగా రేషన్ ఇచ్చి పేదలను ఆదుకున్నామని చెప్పారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీకి తెచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వైఎస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment