Actor Arjun Sarja And His Family Met YSRCP MLA Roja At Nagari | స్నేహితురాలు రోజాను కలిసిన నటుడు అర్జున్‌ - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రోజాను కలిసిన నటుడు అర్జున్‌ 

Published Fri, Jan 29 2021 11:04 AM | Last Updated on Fri, Jan 29 2021 12:39 PM

Actor Arjun Met Nagari Mla RK RoJA Along With His Family - Sakshi

ఎమ్మెల్యే రోజాతో నటుడు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు

నగరి : సినీ నటుడు అర్జున్‌ కుటుంబ సమేతంగా ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆమె నివాసంలో కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలో స్నేహితురాలు రోజాను, ఆమె భర్త సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్‌ వెంట ఆయన భార్య నటి నివేదిత, కుమార్తెలు నటి ఐశ్వర్య, అంజనా ఉన్నారు. తిరుమలకు వెళుతూ స్నేహితురాలిని కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అర్జున్‌ తెలిపారు. 

నేడు ఎమ్మెల్యే పర్యటన 
నగరి మునిసిపల్‌ పరిధిలో శుక్రవారం నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరకంఠాపురంలో నూతనంగా నిర్మించే సిమెంటు రోడ్డుకు ఆమె భూమి పూజ చేస్తారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో సిబ్బందికి వ్రస్తాలు పంపిణీ చేస్తారు. 

హీరో అర్జన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి వారికి తీర్ధప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల అర్జున్‌ను చూడటానికి, పొటోలు తీసుకోడానికి భక్తులు, అభిమానులు ఉత్సహం చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement