
సరదాగా కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే రోజా
నిండ్ర: తన చిన్ననాటి ఆటలను గుర్తుతెచ్చు కున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఉప్పొంగిపోయారు. కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు.. ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామ్‌లాల్, మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్ వసంత బాబురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరీ దామోదరం, సింగిల్ విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, స్థానిక నేతలు అనిల్, పరంధామ, దీప పాల్గొన్నారు.
చదవండి:
వైఎస్ విజయమ్మ సైకత శిల్పం
అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం
Comments
Please login to add a commentAdd a comment