
సాక్షి, చిత్తూరు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. శుభ్రత పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలందరూ కర్ఫ్యూలో పాల్గొన్నారని తెలిపారు.
(కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష)
గతంలో వలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కించపరిచారని.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన వలంటీర్ల సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసిందన్నారు. ప్రజల ప్రాణాలను సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లే కాపాడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్య, ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.