Janata Curfew
-
ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
భోపాల్/ తిరువనంతపురం: కరోనా వ్యాప్తి కల్లోలం రేపుతుండగా రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నా అదుపులోకి రాకపోవడంతో కేరళ గురువారం ఉదయం లాక్డౌన్ ప్రకటించగా తాజాగా మధ్యప్రదేశ్ కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ తప్పక విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా కట్టడి చర్యలు ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రాలు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘కరోనా చెయిన్ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. చాలా రోజులు లాక్డౌన్ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత -
‘జనతా కర్ఫ్యూ’కు ఏడాది: గాయపడిన పులిలా కరోనా
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య.. పరిస్థితులు చక్కబడ్డాయి.. అని సంతోష పడుతున్న వేళ మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మొదలుపెట్టింది. కరోనా దేశంలోకి ప్రవేశించడంతో 2020 మార్చి 22వ తేదీన భారత ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. ఆ రోజు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కడ చూసినా నిర్మానుష్యం. అసలు భారతదేశంలో జనాభా ఉందా అనేంత రీతిలో ‘జనతా కర్ఫ్యూ ’ విజయవంతమైంది. ఆ రెండు రోజులకే మార్చి 25వ తేదీన లాక్డౌన్ పరంపర మొదలైన తెలిసిందే. అయితే జనతా కర్ఫ్యూకు విధించి ఏడాదయ్యింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. కరోనా వైరస్ ఇంకా దేశంలో కల్లోలం రేపుతూనే ఉంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంపై మహమ్మారి చావుదెబ్బ కొట్టింది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాక్సిన్ రావడంతో దాని పీడ విరగడ అయ్యిందని భావించి భారతదేశం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ మహమ్మారి దాడి మొదలుపెట్టింది. అప్పటి మాదిరి రోజుకు 50 వేలకు చేరువలో దేశంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అప్పటి ఆందోళనకర పరిస్థితులు ఇంకా తొలగిపోలేదు. కరోనా రెండోసారి తీవ్ర స్థాయిలో దాడి చేస్తోంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతున్నా కూడా వైరస్ అదుపులోకి రావడం లేదు. అదుపులోకి వచ్చినట్టు వచ్చి గాయపడిన పులి మాదిరి పంజా విసురుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే అంశం. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే పలు రాష్రా్టల్లో పాక్షిక లాక్డౌన్, కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. తెలుగు రాష్రా్టల్లోనూ త్వరలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఏడాది ముగిసినా కూడా మహమ్మారి పీడ అంతం కాకపోవడం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. మళ్లీ లాక్డౌన్ అనేది విధిస్తే ఇక భారతదేశం కోలుకోలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. చదవండి: ప్రధాని మోదీతో భేటీకి సిద్ధం.. ఈలోపే కరోనా! చదవండి: కరోనా వచ్చింది.. ప్రార్థించండి : బాలీవుడ్ హీరో -
జనతా కర్ఫ్యూ కు ఏడాది పూర్తి
-
జనతా కర్ఫ్యూకి ఏడాది
న్యూఢిల్లీ: ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం జనతా కర్ఫ్యూ పాటించి నేటికి సరిగ్గా సంవత్సరం. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం మార్చి 19న ప్రకటించారు. ఆ రోజు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని, ఇది రానున్న రోజులకు సిద్ధమవడం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం వంటిదని పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇంటి ముందుకు లేదా బాల్కనీల్లోకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం కానీ, పళ్లేలపై శబ్దం చేయడం కానీ చేసి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర ఫ్రంట్‌లైన్ వారియర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని పిలుపునకు దేశమంతా స్పందించింది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. దాదాపు అదే సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చైనాలోని వుహాన్ నుంచి ప్రారంభమైందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్పటికే లాక్డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అప్పటికి, భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. పరిస్థితి చాలావరకు మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24 రాత్రి ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలివిడత లాక్డౌన్ ప్రకటించారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా జనజీవితం అస్తవ్యస్తమైంది. ఒకవైపు వైరస్ భయం, మరోవైపు, నిలిచిపోయిన జీవనోపాధితో ఆదాయం కోల్పోయి లక్షలాది కుటుంబాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఉపాధి సహా వివిధ కారణాలతో స్వస్థలం విడిచినవారు అనూహ్యంగా ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. పేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా పలు కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధి ‘కోవిడ్ 19’ బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతులను కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు, ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వచ్చిన వలస కూలీలు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లడం ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు కష్టనష్టాలను ఓర్చుకుని వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలి నడకన పయనమయ్యారు. ఆ క్రమంలో ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాదన ప్రారంభమైంది. ముఖ్యంగా, ఆరోగ్య వసతులు అరకొరగా ఉన్న భారత్‌లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగితే.. దేశంలోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్పనిసరి అని భావించారు. లాక్డౌన్ ప్రకటించేనాటికి భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 536. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 10. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కరోనా విలయ తాండవాన్ని చూస్తున్న వారు.. భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని భయపడ్డారు. కానీ ఇప్పుడు, సంవత్సరం తరువాత, ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా కరోనాను భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, భారతీయుల్లోని సహజసిద్ధ రోగ నిరోధక శక్తి అందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు భారత్ కరోనా వ్యాక్సీన్‌ను పంపిస్తోంది. లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానంలో, వారి ఆలోచన విధానంలో గణనీయ మార్పు వచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ, ఆర్థిక ప్రణాళిక అలవాటయ్యాయి. దీంతోపాటు లాక్‌డౌన్‌తో కుదేలయిన భారత ఆర్థిక రంగం.. లాక్డౌన్ ముగిసిన తరువాత, అదే స్థాయిలో పునరుజ్జీవనం దిశగా వేగంగా పరుగులు తీయడం ప్రారంభించింది. -
బెస్ట్ పోలీస్ మనమే!
హిమాయత్‌నగర్: ‘జనతా కర్ఫ్యూ, నైట్ టైం కర్ఫ్యూ, లాక్డౌన్, ప్రైమరీ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ వెరిఫికేషన్, గాంధీ, కింగ్‌కోఠి, వివిధ చెక్‌పోస్టుల వద్ద విధులు, పోలీసు స్టేషన్ నిర్వహణ’లో మన హైదరాబాదీ పోలీసు దేశవ్యాప్తంగా ది బెస్ట్ అనిపించుకుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. లాక్డౌన్ ప్రారంభమైప్పటి నుంచి పురుషులతో సమానంగా మహిళా పోలీసులు సైతం అన్ని విధులను నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నారని సీపీ కితాబిచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్స్‌తో ‘చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలుపకురా’ అనే పాటకు నృత్యం చేయిచి తీసిన వీడియో ద్వారా అవగాహన కల్పించారు. నూతనంగా రూపొందించిన వీడియోను మంగళవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో అంజనీకుమార్ అడిషినల్ సీపీలు (క్రైం) షికా గోయల్, అడిషినల్ సీపీ (లా అండ్ ఆర్డర్) చౌహాన్, ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్‌జోషిలతో కలసి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... కోవిడ్–19ను నియంత్రించే పనిలో మన పోలీసు నూటికి నూరుశాతం విధులు నిర్వర్తించడాన్ని అభినందిస్తున్నామన్నారు. ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే వంటి నగరాల కంటే మన హైదరాబాద్‌లోనే లాక్డౌన్ సక్రమంగా, విజయంతంగా అమలవడానికి కారణంగా పోలీసులేనన్నారు. కంటైన్మెంట్ జోన్లలో సైతం ఉమెన్ పోలీస్ బాధ్యతగా విధులు చేయడం గర్వంగా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్ మొత్తాన్ని ఒక ఉమెన్ కానిస్టేబుల్ రన్ చేయడం అత్యంత ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి ఉమెన్ పోలీస్‌ను సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. షికా గోయల్ మాట్లాడుతూ... జండర్ అనేది ప్రాముఖ్యం కాదనే విషయం మా ఉమెన్ స్టాఫ్‌ని చూస్తుంటే అర్థం అవుతుందన్నారు. మెన్‌కు పోటీగా గంటల కొద్దీ విధులు నిర్వర్తిస్తూ ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తుండటం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ‘వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ ఇన్ ది కంట్రీ’ అంటూ కొనియాడారు. అనంతరం సాంగ్‌ని రూపొందించిన డైరెక్టర్ అరుణ్ విక్కిరాల, ప్రోగ్రాం డిజైనర్ రవీంద్రారెడ్డి మేడపాటి, కొరియోగ్రఫర్ విశ్వారఘు, డ్యాన్స్ అసిస్టెంట్ విశాల్, సినీమాటోగ్రఫీ నిశాంత్ గోపిశెట్టి, అసోసియేట్ కెమెరామెన్ ఫణీంద్ర, వీడియోలో డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్స్, కమిషనరేట్ పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్స్‌కి సీపీ మొమెంటోలు, బ్యాగులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ (ఈస్ట్ జోన్) రమేష్‌రెడ్డి, డీసీపీ (హెడ్ ఆఫీస్)గజరావు భోపాల్, అడిషినల్ డీసీపీ సునితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది చరిత్రలో మళ్లీ ఈ లాక్డౌన్ పరిస్థితి మళ్లీ రాకపోవచ్చు. కోవిడ్–19 నివారణలో ఒక లేడీ కానిస్టేబుల్‌గా బాధ్యతగా విధులు నిర్వర్తించడం మాకు గర్వకారణమనే చెప్పొచ్చు. రోజూ పీఎస్ నుంచే కాకుండా డయల్–100 నుంచే వచ్చే కాల్స్‌ని సైతం రిసీవ్ చేసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించడం కొత్త అనుభూతినిస్తుంది. హెల్మెట్ లేని వారిని, త్రిబుల్ డ్రైవింగ్, మాస్క్‌లేని వారిని, ఫిజికిల్ డిస్టెన్స్ పాటించని వారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా గుర్తించి మా ఎస్ఐలను అలర్ట్ చేస్తూ.. పాటించని వారికి అవగాహన కల్పించడం ఆనందంగా ఉంది. ఇదంతా మా సీపీ సర్ వల్లనే సాధ్యమవుతోందని చెప్పేందుకు ఎంతో గర్వంగా ఉంది. – ప్రీతి, కానిస్టేబుల్, కర్మన్‌ఘాట్ పీఎస్ వలస కార్మికులను తరలించడం ఆనందంగా ఉంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి లాక్డౌన్ కారణంగా ఉండిపోయిన వలస కార్మికులను గుర్తించి తిరిగి వారి స్వస్థలాలను పంపిస్తుండటం ఆనందంగా అనిపిస్తుంది. వారికి ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటీ అనేది వివరిస్తూ.. వారు పాటించేలా చేస్తున్నా. దూరంగా ఉండి మాట్లాడమంటుంటూ తెలియక వాళ్లు బాధ పడుతున్నారు. ఆ సమయంలో దూరం ఎందుకు ఉండాలి అనే విషయాన్ని వివరిస్తూ.. వారికి అవగాహన కల్పిస్తున్నా. – నిఖిత, కానిస్టేబుల్, అఫ్జల్‌గంజ్ పీస్ అనుమానం వస్తే కాల్ చేస్తున్నారు ఎవరైనా కాస్త నీరసంగా కనిపిస్తే చాలు పీఎస్‌కు లేదా డయల్–100కు ఫిర్యాదు చేస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వారిని చూసి వారి వద్దకు వెళ్లి భరోసా ఇస్తున్నాం. కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించడాన్ని నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. సీపీ, డీసీపీల నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ.. కోన్ని సందర్భాల్లో పీస్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌తో లీడ్ చేయడం గర్వంగా అనిపిస్తుంది.– కె.అనూష, కానిస్టేబుల్, కాచిగూడ -
తొలుత ఎన్నారై.. ఆ తర్వాత మర్కజ్ లింక్‌లే..
గ్రేటర్లో లాక్డౌన్ ప్రకటించి సరిగ్గా నెల రోజులు అవుతోంది. మరి ఇది సత్ఫలితాలు ఇస్తుందా..? వైరస్ పెద్ద ఎత్తున విస్తరించకుండా అడ్డుకట్ట వేయగలిగిందా..? ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్రపోషిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రభుత్వం సకాలంలో ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కోవిడ్ మహమ్మారి మరింత వేగంగా విస్తరించి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకునేదని అభిప్రాయపడుతున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు లాక్డౌన్ కొనసాగిస్తోంది. లాక్డౌన్ ప్రకటించి నెల రోజులు దాటింది. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలనుకంటైన్మెంట్ జోన్లుగా విభజించి వైరస్‌ను మరింత కట్టడి చేసింది. ఫలితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైరస్ విస్తరించకుండా (చైన్ ఆఫ్ ట్రాన్మిషన్ బ్రేక్) చేయడంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చాలా బెటర్‌గా ఉన్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: చైనాలోని వూహాన్ నగరంలోని గత ఏడాది డిసెంబర్ 31న తొలిసారిగి కరోనా వైరస్ వెలుగు చూసింది. అనతి కాలంలోనే ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికా, ఇండోనేషియా తదితర దేశాలకు విస్తరించింది. 2020 ఫిబ్రవరిలో కేరళలో తొలి కరోనా కేసు నమోదు కాగా, మార్చి 2న హైదరాబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. తొలుత కేవలం విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వైరస్ విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం భావించింది. ఆమేరకు అప్రమత్తమైంది. మార్చి 18 వరకు వివిధ దేశాల నుంచి సుమారు 70545 మంది శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరందరినీ క్వారంటైన్లో ఉంచింది. వీరిలో 447 మందికి వైద్య పరీక్షలు చేయగా, వీరిలో కేవలం ఆరు పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇండోనేషియా నుంచి డిల్లీ మర్కజ్ సభలకు హాజరై..తెలంగాణలోని రామగుండం, కరీంనగర్లో పర్యటించిన పది మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, వీరు అప్పటికే వివిధ ప్రాంతాల్లో పర్యటించడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. జనతా కర్ఫ్యూతో మొదలై...ప్రస్తుత లాక్డౌన్ వరకు.. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సంఘీభావంగా మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాతి రోజు నుంచి మార్చి 31 వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ ప్రారంభానికి ముందు రోజు వరకు తెలంగాణ వ్యాప్తంగా 27 పాజిటివ్ కేసులు నమోదైతే..వీటిలో 13 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గక పోగా మరింత పెరిగాయి. దీంతో లాక్డౌన్ కాలాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మూడో తేదీనాటికి విదేశీయులు, ఏడో తేదీ నాటికి మర్కజ్ నుంచి వచ్చిన వారు.. 14 వరకు వారికి సన్నిహితుల క్వారంటైన్ గడువు ముగుస్తుందని భావించి ఆ మేరకు లాక్డౌన్ కాలాన్ని ఏప్రిల్ 15 వరకు పొడగించింది. అయినా కేసుల సంఖ్య తగ్గక పోగా మరింత ఎక్కువ నమోదవుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించగా, మే 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు లాక్డౌన్ కాలాన్ని పొడగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. కంటైన్మెంట్లలో ‘కట్టు’దిట్టం ఇప్పటి వరకు తెలంగాణలో 943 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే సగానికిపైగా(550) కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ 12 నాటికి నగరంలో 273 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం పది రోజుల్లోనే 253పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు మరింత విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించాలంటే లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావించి ంది. చైన్ ఆఫ్ ట్రాన్మిషన్ బ్రేక్ చేయాలంటే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించింది. పరిపాలనా సౌలభ్యం కోసం వాటిని 152 కంటైన్మెంట్ జోన్లుగా విభజించింది. వాటిని రెడ్ జోన్లుగా ప్రకటించి, లోపలివారిని బయటికి..బయటి వారిని లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టం చేసింది. స్ప్రెడ్ జరగకుండా అడ్డుకట్ట ఒక వైపు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తూనే మరో వైపు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డోర్ టు డోర్ పర్యటించి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. తద్వారా ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే కాకుండా వారి ఇంటికి ఇటు, అటుగా ఉన్న అనుమానితులను గుర్తించి వారిని ఐసోలేషన్‌కు తరలించడమే కాకుండా ప్రైమరీ కాంటాక్ట్‌ల నుంచి ఇతరులకు విస్తరించకుండా నివారించగలిగారు. 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిలోనూ ఆ తర్వాత వైరస్ వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులకు సన్నిహితంగా ఉన్న వారితో పాటు ఇతర అనుమానితుల కార్వంటైన్ టైమ్‌ను 28 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేయడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ లేకుండా చేయగలిగింది. -
మరోసారి ‘జనతా’ స్ఫూర్తి కావాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలిపిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. దేశమంతా కరోనాకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేస్తోందని, ఇది చారిత్రాత్మకమైందని కొనియాడారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని శుక్రవారం ఉదయం ఆయన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సందేశం ఆయన మాటల్లోనే.. (చదవండి: దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత) నా ప్రియమైన సోదర పౌరులారా! ప్రపంచ మహమ్మరి కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించి ఇవాళ్టికి 9 రోజులు గడిచాయి. ఈ తొమ్మిది రోజులలో మీరు ప్రదర్శించిన క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి అపూర్వమైనవేగాక రెండింటి వాస్తవ సమ్మేళన స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రభుత్వం, పాలన యంత్రాంగంతోపాటు ముఖ్యంగా ప్రజానీకం విశేష సంయుక్త కృషితో పరిస్థితిని చక్కదిద్దడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో అహర్నిశలూ శక్తియుక్తులను ధారబోస్తున్నవారికి మార్చి 22, ఆదివారం నాడు మీరంతా కృతజ్ఞత చూపిన విధానమే నేడు అన్ని దేశాలకూ ఆదర్శప్రాయమైంది. ఆ మేరకు అనేక దేశాలు మనల్ని అనుసరిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ.. గంట కొట్టడం.. చప్పట్లు చరచడం.. పళ్లాలు మోగించడం... వంటిది ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఈ పరీక్షా సమయంలో జాతి సమష్టి శక్తిని నలుదిక్కులకూ చాటాయి. కరోనాపై యుద్ధంలో దేశం మొత్తం ఏకం కాగలదన్న విశ్వాసాన్ని మరింత లోతుగా పాదుకొల్పడానికి బాటలు వేసింది ఇదే. మీతోపాటు దేశవాసులంతా ప్రదర్శిస్తున్న ఈ సమష్టి స్ఫూర్తి ప్రస్తుత దిగ్బంధ సమయంలోనూ ప్రస్ఫుటమవుతోంది. మిత్రులారా! దేశంలోని కోట్లాది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో- తామొక్కరమే ఏం చేయగలమన్న ప్రశ్న తలెత్తడం సహజం. అంతేకాదు.. ఒంటరిగా ఇంతటి మహా యుద్ధం చేయడం ఎలాగని కూడా కొందరు మదనపడుతుండొచ్చు. ఈ విధంగా ఇంకా ఎన్ని రోజులు కాలం గడపాలన్న ఆందోళన అనేకమందిలో ఉండొచ్చు... మిత్రులారా! ఇది కచ్చితంగా దిగ్బంధ సమయమే.. మనమంతా తప్పనిసరిగా ఇళ్లకు పరిమితం కావాల్సిందే.. కానీ, మనమెవరూ ఒంటరివాళ్లం కాదు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయుల సమష్టి శక్తి మనకు తోడుగా ఉంది. అది మనలో ప్రతి ఒక్కరి బలానికి ప్రతిరూపమే. ఈ సామూహిక శక్తి గొప్పతనం, ఘనత, దివ్యత్వాలను ఎప్పటికప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవడం దేశవాసులందరికి అవసరం. మిత్రులారా! మన దేశంలో ‘అహం బ్రహ్మస్మి’ అనే భావన అనాదిగా ఉన్నదే. అందువల్ల దేశం ఇంత భారీ యుద్ధం చేస్తున్నవేళ, ఎప్పటికప్పుడు ఈ అద్భుత సమైక్య శక్తి ప్రజల రూపంలో ప్రస్ఫుటం అవుతున్నదిగా అనుభూతి చెందాలి. ఈ భావనే మనలో ఆత్మస్థైరాన్ని ప్రోదిచేస్తుంది... మనకు మరింత స్పష్టతనిస్తూ ఒక ఉమ్మడి శక్తితో సామూహిక లక్ష్యంవైపు దిశానిర్దేశం చేస్తుంది. మిత్రులారా! కరోనా మహమ్మారి వ్యాప్తి సృష్టించిన అంధకారం నుంచి కాంతివైపు ఆశాభావంతో మనమంతా నిరంతరం ముందుకు సాగాలి. ముఖ్యంగా దీనివల్ల తీవ్ర బాధితులైనవారిని, పేద సోదరీసోదరులను నిరాశానిస్పృహల నుంచి బయటకు తేవాలి. ఈ సంక్షోభంతో అలముకున్న చీకటిని, అనిశ్చితిని తుత్తునియలు చేస్తూ ప్రకాశంవైపు, సుస్థిరత దిశగా సాగుతూ ఈ అంధకారాన్ని ఛేదించి తీరాలి. అద్భుతమైన ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపజేస్తూ ఈ సంక్షోభంవల్ల చుట్టుముట్టిన చీకటిని మనం చిత్తుగా ఓడించాల్సిందే! అందుకే... ఈ ఆదివారం అంటే ఏప్రిల్ 5 వ తేదీన కరోనా వైరస్ సంక్షోభం సృష్టించిన అంధకారాన్ని సామూహికంగా సవాల్ చేస్తూ మనమంతా వెలుగుకుగల శక్తిని ప్రజ్వలింపచేద్దాం. ఆ మేరకు ఈ ఏప్రిల్ 5న 130 కోట్లమంది భారతీయుల అమేయశక్తిని మనం మేల్కొలుపాలి. మనమంతా 130 కోట్ల మంది భారతీయుల అమేయ సంకల్పాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఈ దిశగా ఏప్రిల్ 5న, ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుంచీ మీ అందరి సమయంలో 9 నిమిషాలను నాకివ్వండి. జాగ్రత్తగా వినండి.. ఏప్రిల్ 5వ తేదీ.. ఆదివారం.. రాత్రి 9 గంటలకు.. మీ ఇళ్లలో ప్రవేశద్వారాలవద్ద, బాల్కనీలలో వెలిగించిన కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లను చేతబట్టి 9 నిమిషాలపాటు నిలబడండి. ఆ సమయంలో మీ ఇళ్లలోని అన్ని విద్యుద్దీపాలనూ ఆర్పివేయండి. అలా మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో ఆ దిశగా వెలుగుకుగల అద్భుత శక్తిని మనం అనుభూతి చెందగలం. ఆ వెలుగులో.. ఆ మెరుపులో.. ఆ ప్రకాశంలో... మనం ఒంటరులం కాదని, మనలో ఎవరూ ఒంటరిగా లేరని, 130 కోట్లమంది భారతీయులమైన మనమంతా ఓ సామూహిక లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని దృఢంగా సంకల్పం చెప్పుకుందాం! మిత్రులారా! ఈ సందర్భంగా మరొక మనవి... వెలుగును ప్రసరింపజేసే ఈ కార్యక్రమంలో అందరూ ఒక్కటిగా ఉండటం లేదా ఒకచోట గుమికూడటం తగదు. దయచేసి రోడ్లమీదకు, మీ వీధులు, నివాస ప్రాంతాల్లోకి వెళ్లకండి. మీరు నివసించే ఇళ్లలో ద్వారాలు లేదా బాల్కనీలలో మాత్రమే నిలబడండి. సామాజిక దూరం అనే ‘లక్ష్మణ రేఖ’ను ఎట్టి పరిస్థితిలోనూ.. ఏ ఒక్కరూ అతిక్రమించరాదు. ఏ పరిస్థితిలోనూ సామాజిక దూరం నిబంధనకు భంగం వాటిల్లకూడదు. కరోనా వైరస్ గొలుసుకట్టు సంక్రమణను విచ్ఛిన్నం చేయగల పాశుపతాస్త్రం ఇదే. కాబట్టి ఏప్రిల్ 5వ తేదీన... రాత్రి 9 గంటలకు... కాసేపు ఏకాంతంగా కూర్చుని భరతమాతను స్మరించుకోండి... 130 కోట్లమంది భారతీయుల వదనాలను మదిలో చిత్రించుకోండి... అలాగే మన అద్భుత సామూహిక శక్తిని, ఉమ్మడి సంకల్పాన్ని అనుభూతి చెందండి. ఈ సంక్షోభ సమయాన్ని అధిగమించగల బలాన్ని, విశ్వాసాన్ని మనకిచ్చేది ఇదే! మన ఇతిహాసాలు ప్రబోధిస్తున్నట్లు... “ఉత్సాహో బల్వాన్ ఆర్య న అస్తి ఉత్సాహ్ పరం బలం! సహ్ ఉత్సాహస్య లోకేషు, న కించిత్ అపి దుర్లభం!” అంటే.. “మన సంకల్పం, ఆత్మశక్తిని మించిన గొప్ప శక్తి లోకంలో మరేదీ లేదు. ఈ శక్తి తోడ్పాటు ఉన్నందువల్ల ప్రపంచంలో మనకు సాధ్యంకానిదేదీ లేదు.” అందుకే... రండి- మనమంతా సమష్టిగా ఈ కరోనా వైరస్‌ను పారదోలి, భరతమాతను విజయపథంలో నిలుపుదాం! మీకందరికీ ధన్యవాదాలు! (చదవండి: ‘లాక్డౌన్ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం) -
ఆ ప్రాంతంలో 500కు పైగా..
-
భారీగా పడిపోయిన చికెన్ ధరలు
-
ప్రజల కోసం రంగంలోకి..
-
రైతు బజార్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు
-
కాశీలో చిక్కుకున్న నెల్లూరు వాసులు
-
అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన వేళ..
-
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా లాక్ డౌన్
-
హాస్టళ్లను ఖాళీ చేయాలని...
-
బాధ్యత మరిచి... బలాదూర్‌గా తిరిగేసి...
అధికారులు ఆంక్షలు విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. పాలకులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా పాటించడం లేదు. పక్క దేశాల్లో విపత్తును చూసి కూడా భయపడటం లేదు. ఎవరికి వారే తమకుతామే రక్షణలో ఉంటున్నామనుకుని వ్యవహరిస్తు న్నారు. సరకులు కొనుగోలు... అత్యవసర పనులంటూ వాహనాలేసుకుని బలాదూర్‌గా తిరుగుతున్నారు. లేనిపోని తలనొప్పులు సృష్టిస్తున్నారు.వారిని పోలీసులు కట్టడిచేస్తున్నారు. కౌన్సెలింగ్ఇచ్చి సున్నితంగానే హెచ్చరిస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మా రి వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి జన తా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలు లాక్డౌన్, 144 సెక్షన్లను మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎంతగా చెబుతునప్పటికీ లెక్క చేయకుండా వివిధ కారణాలతోఇంటి నుంచి బయటకు వస్తున్నారు. రోడ్లమీదకు వస్తే కరోనా వైరస్ అంటుకుంటుందనే భయం లేకుండా వాహనాలెక్కి షికార్లు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అప్పటికీ మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తూ,తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు హౌస్ అరెస్ట్ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే స్థానికులకు కరోనా వ్యాధి సంక్రమిస్తున్నందున జిల్లాలోని పలు ప్రాంతాలకు విదేశాల నుంచి తమ సొంత ఇళ్లకు ఇటీవలి కాలంలో వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం ఆదేశించారు. కరోనా వైరస్ జిల్లాలో వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను తెలియజేస్తూ మండల, మునిసిపాలిటీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లకు మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అధికారులకు ప్రత్యేక బాధ్యతలు విదేశాల నుంచి వచ్చిన ఒక్కో వ్యక్తి కదలికలను నియంత్రించేందుకు ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వారు తమ ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా చూసే బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాకు 321 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు తెలుస్తోందనీ, ఆయా మండలాలు, పట్టణాల్లో ఎంత మంది వాస్తవంగా ఉన్నదీ అధికారులు మరోసారి మండలం, పట్టణం, గ్రామాల వారీగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఏ వ్యక్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏ అధికారికి అప్పగించారో వివరాలతో సహా జిల్లా కేంద్రంలోని కరోనా మానిటరింగ్ సెల్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒకరు, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి ఒకరిని నియమిస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించనప్పటికీ 14 రోజుల పాటు వారు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. అధికారుల మాటను బేఖాతరు చేస్తే వారిని జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించి అక్కడే నిర్బంధిస్తామని హెచ్చరించారు. రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయనగరం డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాలలోను, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలిలో మంగళవారం సాయంత్రానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రాలకు అవసరమైన బెడ్లు, మంచాలు, ఇతర సామగ్రిని, సిబ్బందిని సమకూరుస్తున్నారు. అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చింది. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ శాఖలు సంయుక్తంగా ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గంటస్తంభం, మార్కెట్, రైతు బజార్ల ప్రాంతంలో నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలు నిమిత్తం ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా ఒకే చోటకు చేరడం పట్టణ వాసులను కలవరపరిచింది. దీనికి పరిష్కారంగా ఇకపై వార్డుల వారీగా మొబైల్ వ్యాన్ల ద్వారా తీసుకువెళ్లి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి, గుంపులుగా చేరకుండా ఉండాల్సిన ఆవశ్యకతపై, నగరంలోని ఏయే ప్రాంతాల్లో సరకులు, కూరగాయలు విక్రయిస్తారో లౌడ్ స్పీకర్ల ద్వారా వివరిస్తున్నారు. ప్రజాసమూహాల్లో ఉగాది వేడుకలు నిషిద్ధం జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి సొంత నిధులతో జి ల్లా కేంద్రంలోని 50 వార్డుల్లో మందు స్ప్రే చేసేందుకు మెషీన్లు సమకూర్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దుకాణాలు తెరిచే ఉంటాయి జిల్లాలో నిత్యావసర సరకుల దుకాణాలు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 8 గంటలవరకూ తెరిచే ఉంటాయని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోల్‌సేల్ దుకాణాలు, పాలకేంద్రాలు, కూరగాయల దుకాణాలు కూడా తెరిచే ఉంటాయని, విజయనగరం గంటస్తంభం ప్రాంతంలోని కూరగాయల దుకాణాలను మాత్రం బుధవారం నిలుపుదల చేసి, గురువారం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. -
ఇలా ఉందాం.. ఇది మానేద్దాం
కరోనా విజృంభిస్తోంది. ప్రమాదం ముంచుకొస్తోంది. నగరంలో మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జనంలో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మరో 21 రోజులు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాల్సిందే. ఇంటికే పరిమితం కావాల్సిందే. స్వీయ నియంత్రణకు సిద్ధం కావాల్సిందే. లేకుంటే కరోనా కాటేయక మానదు. జనతా కర్ఫ్యూ రోజు ఇంటికే పరిమితమైన సిటీజనులు...లాక్డౌన్ ప్రారంభమయ్యాక మాత్రం నిబంధనలు పాటించడం లేదు. రహదారులపైకి యథేచ్ఛగా వస్తున్నారు. ఇచ్చిన రిలీఫ్‌ను సద్వినియోగం చేసుకోకుండా..పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేస్తూ..గుంపులు గుంపులుగా వస్తూ కరోనా వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉగాది పండగ కొనుగోళ్ల పేరిట భారీగా జనం మార్కెట్లకు తరలిరావడం ఆందోళన కలిగించింది. గుడిమల్కాపూర్, కొత్తపేట, మెహిదీపట్నం రైతుబజార్లు, మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ఇది ఏమాత్రం సబబు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రానికి పోలీసులుకఠిన చర్యలకు దిగడంతో పరిస్థితి కొంత మారింది. ఇక కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్స్ తప్పనిసరని, పరిస్థితిలో మార్పు రాకుంటే 24 గంటలు కర్ఫ్యూ అమలు చేస్తామని పీఎం, సీఎం హెచ్చరించిన నేపథ్యంలో జనంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సాక్షి, సిటీబ్యూరో: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం నగరంతో పాటు శివారు ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నియంత్రించేందుకు మూడు కమిషనరేట్ల పరిధిలో 180 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టారు. అన్ని ప్రాంతాల్లో మెడికల్ షాప్‌లు, వైద్య సేవలు, బ్యాంక్ ఏటీఎంలు మినహా అన్నింటిని మూసివేయించారు. బృందాల వారీగా ప్రధాన ప్రాంతాలు, గల్లీల్లో పర్యటించి రహదారులపై ఉన్న అందరినీ ఇళ్లలోకి పంపారు. సోమ, మంగళవారాల్లో లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించిన ఐదువేల మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చాలామటుకు కేసులు నమోదుచేశారు. అలాగే ‘కర్ఫ్యూ’ సమయమైన రాత్రి ఏడు గంటలు ప్రారంభం కాగానే.. రహదారులపై రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఇళ్లలోంచి బయటకు వచ్చేవారు ప్రధాన రహదారులపైకి రాకుండా, ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించకుండా అంతర్గత రహదారులపై చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ హైటెక్‌సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సోమవారం రాత్రి రెండు గంటల వరకు పర్యటించి లాక్డౌన్ పర్యవేక్షించారు. బయోడైవర్సిటీ, హైటెక్‌సిటీ ఫ్లైఓవర్లను మూసివేశారు. అలాగే ఐటీ కారిడార్‌లో అత్యవసర సేవలైన కంపెనీ సిబ్బందికి పోలీసులు పాస్‌లు జారీ చేశారు. అలాగే ఐటీ, ఫార్మా కంపెనీ ప్రతినిధులకు పాస్‌లు జారీచేశామని, అవసరం లేని వారికి సెలువులు ఇచ్చారని సీపీ సజ్జనార్ అన్నారు. అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడెక్కడ ఎలా అంటే... ♦ పాతబస్తీలో మంగళవారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఖరీదు చేశారు. దీంతో ఎక్కడ చూసినా రోడ్లపై జనం రద్దీ కనిపించింది. కొంత మంది ఇష్టానుసారంగా వాహనాలతో రోడ్లపైకి రావడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ మండలం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. చార్మినార్, బహదూర్‌పురా, మీర్‌చౌక్, ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో పాటు దక్షిణ మండలంలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ ప్రారంభించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ♦ కూకట్‌పల్లిలో హైటెక్ సిటీ రోడ్డు, జేఎన్టీయూ చౌరస్తా, కూకట్పల్లి రహదారి, ఆల్విన్‌కాలనీ చౌరస్తా, వై జంక్షన్, మూసాపేట జంక్షన్, బాలానగర్ చౌరస్తాలతో పాటు వివిధ కూడళ్లలో పోలీసులు పహరా కాశారు. రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ వారి అవసరాలను బట్టి వాహనాలకు అనుమతి ఇచ్చారు. కొంతమంది ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వారిపై జరిమానాలు విధించారు. యువకులు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు ఉంటే లాఠీచార్జి చేశారు. ♦ దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, కొత్తపేట్, సరూర్‌నగర్, సైదాబాద్, మీర్పేట్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలలో రోడ్లపై వాహనాల సందడి ఎక్కువగా కనిపించింది. ఆయా ప్రాంతాలలో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని హెచ్చరించి పంపారు. ♦ గోల్కొండ, హుమాయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్ పోలీస్స్టేషన్ల సిబ్బంది మంగళవారం ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. లాక్‌డౌన్‌ను పాటించకుండా బైక్‌లపై, కార్లల్లో వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి చేతుల్లో ‘ఐ సపోర్ట్ లాక్డౌన్’ అనే ప్లకార్డులు ఉంచి రోడ్డు పక్కన నిలబెట్టారు. ♦ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ ఆలీ మంగళవారం పర్యటించారు. ♦ బాలానగర్ డీసీపీ పీవీ పద్మజారెడ్డి జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ముంబై జాతీయ రహదారి మియాపూర్ బొల్లారం చౌరస్తాలో వాహనదారులను ఆపి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరావు తనిఖీ చేశారు. అవసరం లేకుండా బయటకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని హెచ్చరించారు. ఆర్టీఏ కొరడా! ఒకవైపు లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ లెక్కచేయకుండా రోడ్డెక్కుతున్న వాహనదారులపై రవాణాశాఖ కొరడా ఝళిపించింది. నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. అత్యవసర వాహనాలు మినహాయించి రోడ్డెక్కిన ఇతర వాహనాలను అధికారులు జప్తు చేశారు. భారీ ఎత్తున కేసులు నమోదు చేశారు. గత రెండు రోజులుగా సుమారు 500 వాహనాలపైన కేసులు నమోదు చేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 150కి పైగా వాహనాలను జప్తు చేశారు. ఆటోలు, వస్తురవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాలు కూడా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నట్లు రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్ట్‌మెంట్ విభాగం డిఫ్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు. అనవసరంగా తిరిగే వాహనాలపైన మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఒకవైపు కరోనా పట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా బారి నుంచి కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ సూచనలు,సలహాలకు అనుగుణంగా వ్యవహరిస్తే కరోనాను అధిగమించగలమన్నారు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో ప్రాంతీయ రవాణా అధికారులు దుర్గాప్రసాద్, రాంచందర్, పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు. నిలిచిన పౌరసేవలు.... మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో అన్ని రకాల ఆర్టీఏ పౌరసేవలకు బ్రేక్ పడింది. లెర్నింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, తదితర సేవల కోసం నిర్దేశించిన స్లాట్లను కూడా నిలిపివేశారు. కొత్త వాహనాల నమోదుకు షోరూమ్‌లలోనే వెసులుబాటు కల్పించినప్పటికీ లాక్డౌన్ దృష్ట్యా ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం వచ్చే వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే నాగోల్, ఉప్పల్, మేడ్చల్, కొండాపూర్, తదితర డ్రైవింగ్ టెస్ట్‌ట్రాక్‌లు దాదాపు నిర్మానుష్యంగా కనిపించాయి. అలాగే ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌తో పాటు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ పౌరసేవలు నిలిచిపోయాయి. బీఎస్–4 పై ప్రతిష్టంభన... ఈ నెల 31వ తేదీతో ముగియనున్న భారత్స్టేజ్ (బీఎస్)–4 వాహనాల రిజిస్ట్రేషన్‌పైన ప్రతిష్టంభన నెలకొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలను మాత్రమే నమోదు చేయనున్నారు. ఇప్పటికే బీఎస్–4 వాహనాలను కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా ఉన్న వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు పౌరసేవలు నిలిచిపోవడం, మరోవైపు బీఎస్–4 వాహనాల గడువు సమీపిస్తుండడంతో సందిగ్ధం నెలకొంది. ఈ వాహనాల నమోదుకు గడువు పెంచితే తప్ప పరిష్కారం లభించదు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 50 వేల బీఎస్–4 వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు అంచనా. ఇళ్లలో ఉండడం లేదు... ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చి నగరంలో హోమ్ క్వారంటైన్లో ఉంటున్నవారు క్వారంటైన్ నిబంధనల్ని పాటించడం లేదని, అలాంటి వారి వల్ల తమకు వ్యాధి ప్రమాదం పొంచి ఉందని సంబంధిత అపార్ట్మెంట్ల లోని వారు, పరిసరాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిలో కొందరు ఉన్నతాధికారులకు, సంబంధిత కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటించని వారి వివరాలను చిరునామాలతో సహ జీహెచ్ఎంసీ పరిధిలోని వారు జీహెచ్ఎంసీకి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖకు తెలియజేయాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విట్టర్ వేదికగా సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వారు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మెయిల్ ద్వారా కూడా తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోని వారైనా 9154686549, 9154686552, 9154686558, 9154686557 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారమివ్వవచ్చునని సూచించారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు తమ అపార్ట్‌మెంట్స్‌లో మూడు రోజుల క్రితం యూఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నందున తమకు తీవ్ర ఆందోళనగా ఉందని, అపార్ట్మెంట్స్లోని 39 ఫ్లాట్లలో దాదాపు 300 మందికి వారి నుంచి ప్రమాదం ఉందని సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన పౌరుడొకరు అర్వింద్‌కుమార్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అపార్ట్‌మెంట్స్‌లో చిన్నపిల్లలు, వృద్ధులతోపాటు గర్భిణులున్నారని, హోమ్ క్వారంటైన్‌లోని వ్యక్తి నలుగురు కుటుంబసభ్యులతో సహ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్‌చేసినా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు. సదరు వివరాలను మరోమారు పంపించడంతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కూడా ట్యాగ్ చేయాలని ఆయనకు సూచించారు. వారి ఫ్లాట్‌కు వచ్చిన ప్రభుత్వోద్యోగుల బృందం ఎలా ఉన్నారని ఆరా తీశారు తప్ప ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. వారికి కూడా కనీస రక్షణ సామాగ్రి లేదన్నారు. శానిటైజేషన్ కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగడం లేదని, ఆ కుటుంబం హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. సెంట్రల్ కమాండ్ సెంటర్‌కు కూడా కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. వారికి వైద్యశాఖ రెండు సార్లు కౌన్నెలింగ్ ఇచ్చిందని, మరోమారు హెల్త్, పోలీసుశాఖలు కౌన్సిలింగ్ ఇస్తాయని పేర్కొందన్నారు. -
కరోనా: అన్ని జిల్లాల్లోనూ విస్తృత చర్యలు
సాక్షి, అమరావతి: కోవిడ్ -19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అన్ని రకాల రవాణా వ్యవస్థల్ని రద్దు చేసిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. తాజాగా అంతర్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు పౌరుల కదిలికలపై పూర్తి స్ధాయిలో ఆంక్షలు విధించింది. కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’) ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లతోపాటు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు కరోనా వైరస్‌పై నిరంతరం క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసు యంత్రాంగం పక్కాగా అమలు చేయడంతోపాటు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌర సంచారాన్ని నియంత్రించింది. ఈ సంందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఓ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలి’ విజయనగరం జిల్లా: భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్ధంలోని సీతారామస్వామి ఆలయంలో యథావిధిగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. రామతీర్ధం ఆలయంలో వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే, ఆలయ అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ వేడుకలకు భక్తులకు ప్రవేశం లేదని.. అయితే యథావిధిగా ఆలయ పూజారులు, ముఖ్యుల మధ్య ఉగాది వేడుకలు, శ్రీరామనవమి కల్యాణం జరుగుతాయని వారు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు నేటి నుంచి జిల్లాలో 144 వ సెక్షన్ అమల్లో ఉంటుందని, అలాగే వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి నుండే స్థానికులకు కరోనా వ్యాధి సంక్రమిస్తున్నందున వారిపై ప్రత్యెక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. వారు తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లో ఉంచాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎంవో నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లాకు 321 మంది వివిధ దేశాల నుండి వచ్చారు. వారిలో ఆయా మండలాలు, పట్టణాల్లో ఎంత మంది వాస్తవంగా ఉన్నదీ మండల అధికారులు, మునిసిపల్ అధికారులు మరో సారి మండలం, పట్టణం, గ్రామం వారీగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని.. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామన్నారు. పోలీస్, రెవిన్యూ, మునిసిపల్ శాఖలు సంయుక్తంగా ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ప్రజలు సామూహికంగా.. పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేసారు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పశ్చిమ గోదావరి లాక్డౌన్ కరానోపై పోరాటంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన కూరగాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పారు. రేపటి నుంచి ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. (పాలకుల నిర్లక్ష్యం ఖరీదు కరోనా!) నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు సమయంలో ప్రజలు ఒకరి నుంచి మరొకరు వీలైనంత సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి షాపులోనూ, రైతు బజార్లలోనూ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల వాహనాలకు ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి ఉంటేనే జిల్లాలోకి అనుమతిస్తామని చెప్పారు. రైతు బజార్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని, పెట్రోల్ బంకుల్లో ఉదయం11 గంటల వరకూ విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్లతో జేసీ వెంకట్రామిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 29న రేషన్ సరుకుల పంపిణీకి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులతోనూ, డిస్ట్రిక్ రెస్పాన్స్ టీమ్తోనూ జేసీ-2 తేజ్ భరత్ సమావేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరు కావొద్దని వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని జిల్లా వాసులకు జేసీ -2 సూచించారు. ఏలూరులో తెరిచి వున్న షాపులను మూయించిన కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా అంతా లాక్ డౌన్ • వెలవెలబోయిన ఏలూరు, భీమరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం బస్టాండ్లు • ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యం • తెరుచుకోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు • జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చల్లించిన అధికారులు వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్యాంశాలు కడప రైతు బజార్లో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమిలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల పట్టీలను పరిశీలించి, నిర్ణీత ధరలకే వినియోగదారులకు అమ్మాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ధరలను పెంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించారు. మధ్యాహ్నం కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఐసోలేషన్ కొత్త వార్డుల ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ఐపిలో ఉన్న ఐసోలేషన్ వార్డులను, త్రోట్ స్వాబ్ శాంపిల్స్ తీసే రూములను పరిశీలించారు. అనుమానిత కేసులకు ఎలాంటి సర్వీసులను నిర్వహిస్తున్నారో.. కరోనా నోడల్ అధికారి డా.సురేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే సర్జికల్ ఐసియు విభాగంలో సర్జికల్, పోస్ట్ ఆపరేటీవ్, పోస్ట్ ఆపరేటీవ్ ఆర్థ్రో యూనిట్లను పరిశీలించి అక్కడి పరిస్థితులను జీజీహెచ్ పర్యవేక్షకులు డా.గిరిధర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప జడ్పీ కార్యాలయం వద్ద కరోనా నియంత్రణ పై నగర ప్రజలకు కడప డీఎస్పీ సూర్యనారాయణ అవగాహన కల్పించారు. "జనతా కర్ఫ్యూ" కొనసాగింపు వల్ల, సామాజిక దూరం, స్వచ్చంద గృహ నిర్బంధం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. నగరంలో పలు చోట్ల పోలీసు అధికారులు రోడ్లపైనే అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్లో భాగంగా.. జిల్లాలో మూడవ రోజు "జనతా కర్ఫ్యూ" ఆశించిన మేరకు జరుగుతోంది. రెండవ రోజుతో పోలిస్తే మంగళవారం రోడ్డుపై జన సంచారం చాలా తక్కువగా కనిపిస్తోంది. కర్ఫ్యూ నిర్వహణ పోలీసుల కనుసన్నల్లో నిక్కచ్చిగా సాగుతోంది. చెక్ పోస్టుల్లో వాహనాల తనికీలు విస్తృతంగా జరుగుతున్నాయి. మార్కెట్లు షాపింగ్ కాంప్లెక్సులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల అంగళ్ళు తప్ప ఉదయం 9 గంటల తర్వాత మూతపడ్డాయి. మద్యం, మాంసం దుకాణాలు రెండురోజులుగా పూర్తిగా మూతపడ్డాయి. నగరంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల కలాపాలు స్తంభించాయి. కీలకమైన శాఖల్లో షిఫ్టు విధానంలో విధులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా.. అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. గ్రామ స్థాయిలో వైద్యాధికారులు పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన వారి వివరాలను క్షుణ్నంగా జల్లెడ పడుతున్నారు. శ్రీకాకుళం: • కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక బాధ్యతతో దాతలు విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. ఆర్ట్స్ స్వచ్చంధ సంస్ధ, పి.వి.రామ్మోహన్ ఫౌండేషన్, డా.దానేటి శ్రీధర్, లయన్స్ శ్రీకాకుళం సెంట్రల్ శాఖ మంగళ వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సామాజిక బాధ్యత క్రింద విరాళాలు అందజేసారు. జిల్లాలో స్వీయ గృహనిర్భందంలో ఉన్నవారికి 14 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయుటకు, కరోనా బాధితులకు ఇతర సహాయ చర్యలు చేపట్టుటకు ఈ నిధులను ఉపయోగించుట జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. • కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్వీయ నిర్భంద గదులు (క్వారంటైన్) సిద్ధం చేసామని కలెక్టర్ జె నివాస్ చెప్పారు. విదేశాల నుండి 13 మంది సోమవారం జిల్లాకు రాగా, వారందరిని నిర్భంద గదులలో పెట్టామని తెలిపారు. వారితోపాటు ఈ నెల 21 తరువాత వచ్చిన మరో ఐదుగురిని ..మొత్తంగా 18 మందిని నిర్భంద గదుల్లో పెట్టామని పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు జిల్లాకు 859 మంది విదేశాల నుండి రాగా.. వారిలో ఇంకా 14 రోజుల గడువు పూర్తి కాని వారు 259 మంది వరకు మాత్రమే ఉన్నారని అన్నారు. • జిల్లా వ్యాప్తంగా రాకపోకలు నిషేధించామని, 144వ సెక్షన్ అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం, పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 52 మందిపై సోమ వారం కేసులు నమోదు చేసారని ఆయన తెలిపారు. • కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడా 5 గురు కంటే ఎక్కువ మంది గమిగూడరాదని.. అలాగే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దంటూ జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. • కరోనా వార్తలు కవరేజ్ చేయునపుడు వైరస్ సోకకుండా వ్యక్తి గత ముందుజాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద కేసులు ఉన్నట్లు గుర్తించినా హడావిడిగా కవరేజికి వెళ్లవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కవరేజిలో ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా .... • నెల్లూరు టౌన్ లో పాజిటివ్ కేసు కల్గిన వ్యక్తిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపారు • జిల్లా లో లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఇళ్లలోనే ఉంటూ సహకరిస్తున్నారు • జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది • జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రజలు సకాలంలో పనులు ముగించుకుని త్వరగానే ఇళ్లకు • జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో నిత్యవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో సరుకులు • అధికారుల సూచన మేరకు ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు • ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఎవరూ లేరు • ముందస్తుగా స్వీయ గృహ నిర్భంధంలో ముగ్గురు (3) ఉన్నారు • హోం ఐసోలేషన్ లో 760 మంది ఉన్నారు • జిల్లాలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు • జిల్లా కలెక్టర్ వి.శేషగిరిబాబు ఆదేశాలతో నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి లో 40 బెడ్స్ తో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు • అత్యవసర సమయంలో వినియోగించుకోవడానికి వెంటిలేషన్ సౌకర్యం కల్పించారు • అత్యవసరాల కోసం, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్...0861 2326755,744,776,766,772 • కరోనా హెల్ప్ లైన్ నంబర్, 9618232115..టోల్ ఫ్రీ నెంబర్,1800 425 6773, 0861 2349991 కృష్ణాజిల్లా కరోనా నేపథ్యంలో కృష్ణ జిల్లా మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి.సోమవారం కొంతమంది ప్రజలు రోడ్లపైకి రాగా మంగళవారం మాత్రం పోలీసుల హెచ్చరికలతో రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం మాత్రం నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నగరాలకు వచ్చారు. కలెక్టర్ గారు కంట్రోల్ రూంలో ఉంటూ పరిస్థితులను సమీక్షించారు. మొత్తం 1153 మంది విదేశాల నుంచి జిల్లాకు రాగా, ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. 1092 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా,14 మంది అనుమానితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 6 మంది ఆసుపత్రి నుంచి డిచార్జ్ అయ్యారు. విజయవాడ డివిజన్ విజయవాడలో ఉదయం మినహాయిస్తే 9 గంటల తరువాత పోలీసులు నగరంలోకి వచ్చే దారులన్నీ దిగ్బంధం చేశారు. దీంతో బయటి నుంచి ఎవరూ నగరంలోకి వచ్చే అవకాశం లేకుండాపోయింది. వన్ టౌన్లో పాజిటివ్ కేసు నమోదు కావడంతో మొత్తం 30 వార్డులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా వార్డులలో ఉన్న వారు అవసరానికి ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని మిగిలిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని ఆదేశాలిచ్చారు. ఆయా వార్డుల్లో వాలెంటరీలు, వైద్య సిబ్బంది వార్డు వాసులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడ డివిజన్ మొత్తం 16 క్వారైంటిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ సెంటర్, ఈస్ట్, వెస్ట్ లలో వంద పడకల చోప్పన ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్: పోలీసులు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. అత్యవసరమైన వారిని మినహా ఎవరినీ రోడ్లపైకి రానివ్వలేదు. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు బయకు వచ్చేందుకు అవకాశం ఇవ్వడంతో కూరగాయల కొనుగోలు కోసం రైతు బజారులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. డిఎస్పి సత్యానందం, ఆర్డివో జి శ్రీనివాసులు డివిజన్ ప్రాంతాలలో పర్యటించి 144 సెక్షన్ అమలను పర్యవేక్షించారు. మంత్రి శ్రీ కొడాలి నానీ డిఎస్పి, ఆర్డివోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం రైతుబజారు వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతు బజారును ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడంతో పాటు వీలైనన్ని మొబైల్ రైతుబజార్లను ఏర్లాటు చేయాలని మంత్రి ఆదేశించారు. గుడివాడకు చెందిన ఒక కుటుంబం తమ కుమారుడు లండన్‌లోనే ఉండిపోయాడని, భారత్‌కు రప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని, భయపడకుండా ఉండాలని ధైర్యం చెప్పారు. ఇక144 సెక్షన్ అతిక్రమణకు సంబంధించి 1 కేసులు నమోదు అయిందని, గుడివాడ డివిజన్లో మొత్తం 202 మంది విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. గుడివాడ పట్టణంలో 29 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. వీరందరికీ ప్రతిరోజు వైద్య సిబ్బంది పరీక్షలు వారి ఇంటివద్దకే వెళ్లి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గుడివాడ ఏరియా హస్పటల్ లో 10 పడకల ఐసోలేషన్ వార్డు ఉండగా గుడివాడలోనే హోమియో హాస్పిటల్ లో 100 పడకల ఐసోలేషన్ వార్డు, కైకలూరు లో చైతన్య టెక్నో స్కూల్ లో 100 పడకలు, పామర్రు సమీపంలోని కూచిపూడి వద్ద వరస సంజీవనీ ఆసుపత్రిలో 100 పడకల వార్డులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేగాక ఆయా వార్డుల్లో వైద్య సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్లు చెప్పారు. న్యూజివీడు డివిజన్... న్యూజివీడు డివిజన్ లో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేస్తున్నారు. ఉదయం నిత్యావసర వస్తువుల కోనుగోలు కోసం ప్రజలు బయటకు వచ్చారు. 10 గంటల తరువాత రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తిరువూరు సమీపంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు. . అనంతరం మండల కార్యాలయంలో పోలీసులు, వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించారు. . డివిజన్లో మొత్తం 301 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. . న్యూజివీడు, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కాగా మచిలీపట్నం డివిజన్లో ఉదయం 6 నుంచి 9 వరకు బయటకు వచ్చేందుకు అనుమతి ఉండడంతో ప్రజలు భారీ సంఖ్యలో రైతు బజారు వద్దకు చేరారు. దీంతో ఎస్పీ రవీంద్ర బాబు గారు ఏఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఆర్డివలతో సమావేశమై రైతు బజారును ప్రజలకు అందుబాటులో ఉండేలా పది ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఏఎస్పి, ఆర్డివోలతో కలిసి నగరంలో పర్యటించి లాక్ డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో వీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. డివిజన్లో విదేశాల నుంచి మొత్తం 72 మంది వచ్చారు. వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల ఐసోలేషన్ సెంటర్‌ను పెడన నియోజకవర్గంలో 18 పడకల ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా.. 1. కరోనా గురించి తాజా అప్ డేట్ : ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు..మొతం 21 మంది అనుమానుతుల్లో 5గురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది..మిగితా 16 మందికి రిపోర్టు రావాల్సి ఉంది..జిల్లా అంతటా అధికారులు కరోనా వ్యాధి ప్రభలకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.. ప్రజలని అప్రమత్తం చేస్తూ కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు 2. పాజిటివ్ కేసుల సంఖ్య: 0 3. నెగెటివ్ కేసుల సంఖ్య : 5 4. ఐసోలేటెడ్ వార్డుల సంఖ్య: 05 5. ఈ వార్డుల్లో దాదాపు 200 బెడ్స్‌ను ABCలుగా వర్గీకరించారు.. దాదాపు 2500 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు సమాచారం.. వీరిలో 100మందిని B కేటగిరిలో, మరో 53 మందిని C కేటగిరీలో మిగితా వారిని A కేటగిరీ గృహ నిర్బంధ రక్షణ లో ఉంచినట్లు సమాచారం. 6. రవాణా వ్యవస్థ పనితీరు: జిల్లాలో 100శాతం లాక్ డౌన్ అమలౌతుంది..ఎక్కడిక్కడ చెక్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. 7. నిత్యవసర రేట్ల గురించి: సాధారణంగా నే ఉన్నాయి. 8. ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు: రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు.. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 9. పోలీసుల పనితీరు: స్ట్రాంగ్ ఉంది. ద్విచక్ర వాహనాలను కూడా కట్టడి చేస్తూ ఎక్కువ మంది గుమి కూడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 10. కలెక్టర్ సమీక్షలు ( డివిజన్ వైజ్) : జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చ్ ల వద్ద ఉండే బిచ్చగాళ్ల బాగోగులు, ఆరోగ్యం గురించి వాళ్లని స్వచ్ఛంద సేవా సంస్థలు (NGOs)కి అప్పగించే విధంగా ఈరోజు వాళ్లతో సమావేశమై తగిన చర్యలు తీసుకటున్నారు.. జిల్లాలో 16 కరోనా మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కమ్యూనికేషన్, రవాణా, శానిటేషన్, ఆర్ధికపరమైన అంశాలు,నిత్యవసత సరుకులు వంటి వాటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కరోనా మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఆధికారులకు తగిన విధంగా సూచనలిస్తూ కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నంజిల్లా • విశాఖలో హైఅలెర్ట్ ప్రకటించిన జిల్లా యంత్రాంగం • జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ • అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి • నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు • హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు వస్తే కేసులు • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా విశాఖ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు :08912590102 • అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయం నంబర్లు (విశాఖ DM & HO ఆఫీస్) : 9949379394, 9666556597 విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టిలో కి వచ్చిన కరోనా బాధితులు • కరోనా పాజిటివ్ కేసులు : 3 • ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య : 31 • ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల సంఖ్య : 12 కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన మంత్రులు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్‌లో కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంను మంగళవారం తనిఖీ చేసిన AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య, శాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖపట్నం ఇంచార్జి మంత్రి కె కన్నబాబు, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, కంట్రోల్ రూమ్ పని తీరు... విశాఖపట్నం జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కరోనా అనుమానితులు కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నుంచి మంత్రి ఆళ్ల నాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా రానున్న రోజులు చాలా కీలకమని, ఎప్పటికప్పుడు, కరోనా వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అదేశించారు. మంత్రుల సమీక్ష... విశాఖ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదు, కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విశాఖ కరోనా నియంత్రణ సోమవారం ఆయన అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, కరోనా నియంత్రణకు ప్రజలు సామజిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు విశాఖలో 20 కమిటీలు నియమించామని, విదేశాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని చెప్పారు. నిబంధనలను పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రైతు బజార్లలో అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కరోనాను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారు మండిపడ్డారు. చంద్రబాబు ధోరణి ఆక్షేపణీయమని, కరోనాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి 2 గంటల కోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని తాము ప్రచారం కంటే పని చేయడానికే ప్రాధాన్యతనిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ ప్రజలకు నిత్యావసర వస్తువులు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. పేదలకు ఎలాంటి మేలు చేయాలో ప్రతిదీ చేస్తామని, పేదలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని, అవసరం లేకుండా ప్రజలు రోడ్ల పైకి రావొద్దని సూచించారు. ఇక కరోనాపై మీడియా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా విలయం : చైనాపై భారీ పరిహారం కోరుతూ కేసు ప్రకాశం జిల్లా కరోనా వైరస్‌ను ఎదుర్కొవటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ప్రకాశంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒంగోలులోని భాగ్యనగర్‌కు చెందిన మహిళా సాధికారిత భవనాన్ని క్యారంటైన్ కేంద్రంగా మార్చారమని చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలన్నారు. నిత్యవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్లను ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని పిలుపు నిచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని కలెక్టర్ సూచించారు. జనతా కర్ఫూ స్ఫ్యూర్తితో జిల్లా ప్రజలు మార్చి 31 వరకు స్శచ్ఛంధ ఈ కర్ఫ్యూ పాటించాలని కోరారు. నిత్యవసరాల కోసం ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే వచ్చి సరుకులు కొనుగోలు చేయాలన్నారు. ఈ రోజు నుంచి మంగళవారం వరకు జిల్లాలో 144 వ సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. జనసంచారాన్ని, వాహనాల నియంత్రణను పూర్తిగా అరికడతామన్నారు. విదేశీ ప్రాంతాల నుంచి 576 మంది వ్యక్తులు జిల్లాకు వచ్చారని వారందర్నీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. జిల్లాను ఏడు జోన్లుగా విభజించి ఉప కలెక్టర్లతో ఏడు బృందాలను నియమించామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను జిల్లా నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు
-
టీటీడీ కీలక నిర్ణయం
-
కూరగాయలకు పోటెత్తిన ప్రజలు
-
బైకుపై ఇద్దరు వెళ్లిన...
-
రోడ్లపై వస్తే లాఠీ దెబ్బలు
-
రోడ్లపై భారీగా బారికేడ్లు
-
ఇంట్లోనే ఉందాం క్షేమంగా ఉందాం..
-
ఏపీలో 3వ రోజు లాక్ డౌన్
-
జనతా కర్ఫ్యూ
-
‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’
పెరంబూరు: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. కరోనా వైరస్ గురించి గత శనివారం ఆయన ట్వీట్ చేసిన తెలిసిందే. అయితే కొద్ది గంటల్లోనే రజనీ ట్వీట్‌ను.. ఏకంగా ట్విటరే తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు రావడం వల్లే ఆయన ట్వీట్‌ను తొలగించినట్లు ట్విటర్ వివరణ ఇచ్చింది. దీంతో నటుడు రజనీకాంత్ ఈ విషయమై సోమవారం స్పందించారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు 12 నుంచి 14 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉంటే దాన్ని మూడో స్టేజ్‌కు వెళ్లకుండా అడ్డుకోవచ్చుననే తాను చెప్పానన్నారు. అయితే తన వ్యాఖ్యలను ఆ రోజు మాత్రమే చాలు అన్నట్లు తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు. అందుకే ట్విటర్ తన వ్యాఖ్యలను తొలగించిందని వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా కరోనా వైరస్ బారి నుంచి బయట పడటానికి తగిన జాగ్రత్తలను పాటిద్దామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి మాదిరిగానే ప్రజలందరూ తమకు తాముగా నిర్బంధాన్ని విధించుకుని కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అదే విధంగా తన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
లాక్డౌన్ ఫెయిల్!
ప్రధాని చెప్పారని చప్పట్లు కొట్టారు...జనతా కర్ఫ్యూకి జైకొట్టారు.మరుసటి రోజే అన్నీ మర్చిపోయి మళ్లీ రోడ్డెక్కారు...సాయంత్రానికి పోలీసులు ఆపుతున్నారని తెలిసి మళ్లీ ఇంటిబాట పట్టారు...కోవిడ్ కట్టడిపై... ఇదీ మన సిటీజనుల సీరియస్‌నెస్. గ్రేటర్ వాసులు కరోనా తీవ్రతను లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతగా విన్నవిస్తున్నా...ప్రపంచం ఎంత భయపడుతున్నా...పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా మనోళ్లు పట్టించుకోవడం లేదు. కేవలం ఆదివారం ఒక్కరోజే జనతా కర్ఫ్యూ సక్సెస్ చేశామంటూ చప్పట్లు కొట్టేసి..అసలు స్ఫూర్తినిచుట్టేశారు. జాతి యావత్తునూ గడగడలాడిస్తోన్న కోవిడ్ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కాదని..సోమవారం ఒక్కసారిగా జనాలు తమ వ్యక్తిగత వాహనాలతో రహదారులను ముంచెత్తారు. ఒకటి కాదు.. రెండు కాదు లక్షలాది వాహనాలు యథావిధిగా రోడ్లపైకి రావడంతో లాక్డౌన్తుస్సుమనిపించింది. వెంటనే కళ్లు తెరచిన సర్కారు..పోలీసు యంత్రాంగం...మధ్యాహ్నం నుంచి నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. పలు ఫ్లైఓవర్లనుమూసివేశారు. అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించినఅనంతరమే రాకపోకలకు అనుమతించారు. నిత్యావసరాల కోసమో..కూరగాయల కోసమో..ఎమర్జెన్సీ పనులపైనే బయటకు వస్తున్నామని కొందరంటున్నా..దానికొక పద్ధతుంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ...గుంపులుగా రాకుండా ఉండాలి. కోవిడ్నియంత్రణపై ప్రభుత్వం చెబితేనో...పోలీసులు హెచ్చరిస్తేనో కాకుండా...ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజలంతా కరోనా వైరస్ వ్యాప్తి..దాని పర్యవసానాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలుసుకుంటూనే..తమ దాకా వస్తే మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తే కోవిడ్ రక్కసి విజృంభించి..మన సిటీ ఇటలీగా మారుతుందేమో..సిటీజనులారా ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా మారండి.ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ లాక్‌డౌన్‌తో కరోనాను తరిమికొట్టండి. సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపైకి ఎక్కే క్యాబ్‌లు, ఆటోల యజమానులతో పాటు వినియోగదారులపైనా కూడా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. లాక్డౌన్ అంటేనే ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఆ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు అనుసరించాల్సిన విధానాలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావులతో కలిసి సీపీ సజ్జనార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ప్రజలు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్నారన్న సమాచారం ఉందని, అందుకే తొమ్మిది చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవరైనా ఇతరప్రాంతం నుంచి మరోచోటకు వెళుతున్నారని తేలితేమాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓలా, ఉబర్, ర్యాపిడ్ వాహనాల తదితర అద్దె సంస్థలుకూడా మూసివేయాలన్నారు. లాక్‌డౌన్‌ను సీరియస్ గా తీసుకోవాలని, ఐదుగురు మించి గుమిగూడవద్దన్నారు. ‘ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పరిస్థితిని చేయిదాటనియవద్దు. సాయంత్రం ఆరు తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థలు ఆర్డర్ తీసుకోవద్దు. ప్రయాణాల విషయంలో ఎలాంటి కారణాలు చెప్పినా ఉపేక్షించేది లేదు. సమీపంలో ఉన్న కిరాణా దుకాణాల్లో సరుకులు కొనుక్కొని వెంటనే వెళ్లాలని సూచించారు. ఏమైనా సందేహలు, సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ1800 4250817కు, 23230811, 23230 813, 23230 814, 23230 817 ల్యాండ్లైన్లకు కాల్ చేయచ్చన్నారు. లాక్డౌన్ ఫెయిల్! సాక్షి, సిటీబ్యూరో: జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని సిటీజనులు ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఆదివారం పూర్తిగా ఇళ్లకై పరిమితమైనా...సోమవారం మాత్రం వారు సిటీ లాక్‌డౌన్‌ను పట్టించుకోలేదు. కరోనా నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను స్వయంగా సీఎం వివరించి...జనం బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసినా...ఎవ్వరూ పట్టించుకున్నట్లు లేదు. సోమవారం ఉదయం క్యాబ్‌లు..ఆటోలు..ఇతర ట్యాక్సీలు సిటీరోడ్లను ముంచెత్తడంతో ట్రాఫిక్ జాంఝాటం కనిపించింది. నిత్యావసర వస్తువుల రవాణా...కొనుగోలుకు అనుమతించడంతో కృత్రిమ కొరతను సృష్టించిన పలువురు రిటెయిల్ వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. రెట్టింపు ధరలకు విక్రయించడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ నేపథ్యంలో పాలు, పండ్లు, ఇతర నిత్యావసరాల కొనుగోలు జనం ఎగబడడంతో పలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కొన్ని చోట్ల వ్యాపారులు ధరలను పెంచినట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరచిన వారిని పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి వాటిని మూసివేయించారు. పనిచేయని కాలానికి సైతం తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని స్పష్టంచేశారు. మంగళవారం నుంచి లాక్డౌన్ ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు. 90 శాతం ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఐటీకి రాజధానిగా మారిన గ్రేటర్ సిటీలో మంగళవారం నుంచి చిన్న, మధ్యతరహా, బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీచేశాయి. వారికి అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ తదితర ప్రక్రియలను పూర్తిచేసినట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు పదిశాతం కంపెనీలు అత్యవసర సమావేశాలు, ఇతర ముఖ్యమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు పోలీసుల అనుమతితో కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించాయి. కోవిడ్ కలకలం నేపథ్యంలో మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లోని సుమారు 600 ఐటీ కంపెనీల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు అమలు చేయాల్సిన ప్రోటోకాల్‌ను అమలుచేస్తున్నట్లు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జీఓ జారీతో మారిన సీన్ లాక్డౌన్ విఫలమవడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం సోమవారం సాయంత్రం జి.ఓ.నెం.46జారీచేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగాఅమలుచేశారు. సాయంత్రం 6.30 గంటల తరవాత అత్యవసర పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారినే రాకపోకలకు అనుమతించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేశారు. పలు ఫార్మసీ,ఆస్పత్రులు మినహా నిత్యావసరాలు విక్రయించే దుకాణాలను సైతం సాయంత్రం 6.30 గంటల తర్వాత మూయించారు. మంగళవారం నుంచి ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా అయితే కష్టమే! సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విజ్ఞప్తులను, పోలీసుల ఆదేశాలను బేఖాతార్ చేస్తూ గుంపులు.. గుంపులుగా జనం రోడ్లపైకి వస్తున్నారు. రద్దీతో మార్కెట్లు, మాల్స్ కిక్కిరిసి పోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను నియంత్రించడం కష్టమేనని అంటున్నారు వైద్య నిపుణులు. చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా దేశాలను కుదిపేసిన ఈ వైరస్ ప్రస్తుతం మన గ్రేటర్ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఆదివారం అర్థరాత్రి నాటికి 27 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. మరో 250 మంది వరకు గాంధీ కరోనా ఐసోలేషన్ వార్డుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోజు రోజుకు అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏమీ చేయలేక రోగులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి.... ప్రస్తుతం కరోనా వైరస్ రెండో దశలో ఉంది. ఇప్పటికే నగరంలో రెండు థర్డ్‌కాంటాక్ట్ కేసులు కూడా నమోదయ్యాయి. మూడో దశకు చేరుకుంటే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టం. ఒక్కసారిగా వచ్చిపడే మాస్ క్యాజువాలిటినీ ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సిబ్బంది కూడా మన వద్ద లేదు. ఆస్పత్రులు, పడకలు, ఇతర మౌలిక సదుపాయాలు చాలా తక్కువ. ఇదే జరిగితే చికిత్సల విషయంలో వైద్యులు కూడా చేతులెత్తేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తక ముందే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమని వైద్యులు సూచిస్తున్నారు. ‘మేం మీ కోసం ఆస్పత్రిలో ఉంటాం... మీరు మీ ఇంట్లో ఉండండి’ అంటూ పిలుపునిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలు చేస్తుంటే..సిటీజనులు మాత్రం తమకేమాత్రం బాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తుండటం ఎంత వరకు సబబని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పటికీ మనిషికి..మనిషికి కొంత దూరం పాటించాలనే నియమాన్ని కూడా కనీసం పాటించడం లేదంటే వైరస్ పట్ల ప్రజలకు ఎంత చిన్న చూపు ఉందో ఇట్టే అర్థం అవుతుంది. కరోనా వైరస్‌కు మందు లేదు. స్వీయ నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కారమని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి, ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి నుంచి ఓపీ సేవలు బంద్ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను రద్దు చేసింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్, ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. గాంధీ, ఛాతి ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో ప్రస్తుతం 33 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతుండగా, మరో వంద మందికిపైగా అనుమానితులు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌వచ్చిన వారిని వెంటనే హోం ఐసోలేషన్‌కు పంపుతున్నారు. క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారితో పాటు వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మాత్రం ఆయా ఆస్పత్రుల ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేసిన ప్రభుత్వం...తాజాగా గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను కూడా తాత్కాలి కంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓపీకి బాధితులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉండటం, వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే వారి నుంచి ఇతర రోగులను విస్తరించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నీ వాయిదా వేయాల్సిందిగా సూచించడంతో ఆయా ఆస్పత్రులన్నీ సర్జరీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. రోగులను ఖాళీ చేయిస్తున్న అధికారులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ విస్తరించే ప్రమాదం ఉండటంతో..దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతూ గత కొంత కాలంగా ఆయా ఆస్పత్రుల్లోని ఇన్‌పేషంట్ వార్డుల్లో వైద్య సేవలు పొందుతున్న రోగులతో పాటు డెలివరి కోసం ఆస్పత్రుల్లో చేరినప్పటికీ..ప్రసవానికి ఇంకొంత సమయం ఉన్న గర్భిణులను ఆయా ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి పంపుతున్నారు. అత్యవసర రోగులు మినహా ఇతరులెవరూ ఆస్పత్రిలో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సాధారణ రోగులను ఖాళీ చేయించడంతో ఖాళీగా ఉన్న పడకలను కరోనా బాధితుల కోసం కేటాయించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా పడకలన్నీ కరోనా బాధితులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా గాంధీ ఐసోలేషన్ వార్డులో 201 మంది విడతల వారిగా పని చేస్తున్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో 50 మంది, ఛాతి ఆస్పత్రిలో వంద మందికిపైగా పని చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు చికిత్స అందించి, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వారిని చూసి కుటుంబ సభ్యులే కాదు ఇరుగు, పొరుగు వారు కూడా భయపడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1306 వాహనాలు సీజ్ సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్డెక్కిన 1306 వాహనాలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి రోడ్డెక్కినందుకు ఈ వాహనాల్లో దాదాపు సగానిపైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఐపీసీసెక్షన్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 948, సైబరాబాద్‌లో 244, రాచకొండలో 114 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయా కమిషనరేట్ల అధికారులు తెలిపారు. కూకట్‌పల్లిలో అత్యధికంగా 100 ఆటోలు సీజ్ ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అత్యధికంగా 948 ఆటోలు సీజ్ చేస్తే, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక్క కూకట్‌పల్లిలో 100 ఆటోలు సీజ్ చేశారు. మొత్తంగా సైబరాబాద్‌లో చూసుకుంటే 182 ఆటోలు సీజ్ చేశారు. వీటితో పాటు 29 ఎంసీ, తొమ్మిది కార్లు, నాలుగు తూఫాన్లు, 20 ద్విచక్ర వాహనాలను సైబరాబాద్ కమిషనరేట్‌లో సీజ్ చేశారు. ఇక రాచకొండ విషయానికొస్తే 66 ఆటోలు, 34 ద్విచక్ర వాహనాలు, 14 ఫోర్‌వీలర్లను సీజ్ చేశారు. ఇక నుంచి ఆటోలతో పాటు కార్లు, బైక్‌లు ఏవైనా రోడ్డు మీద కనిపిస్తే సీజ్ చేస్తామని మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
‘జనతా’ బాగా జరిగింది!
సాక్షి, న్యూఢిల్లీ: వైరస్‌ను ఎదుర్కునే ప్రయత్నంలో భాగంగా ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూలో భారతజాతి యావత్తూ ఒకేతాటిపైకి వచ్చి ఐకమత్యాన్ని ప్రదర్శించిందని, అదే స్ఫూర్తిని లాక్డౌన్ సమయంలోనూ ప్రదర్శించి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడంలో సహకరించాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ‘జనతా కర్ఫ్యూకు వచ్చిన ప్రజాస్పందన అద్భుతం. విపత్కర పరిస్థితుల్లో.. దేశమంతా ఒకతాటిపైకి వస్తుందని ప్రజలు సుస్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునే విషయంలో.. దేశ ప్రజలు సహకరించిన తీరును రాజ్యసభ అభినందిస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతోంది’అని అన్నారు. రాజ్యసభ చైర్మన్ ప్రకటనను సభ్యులు బల్లలు చరిచి స్వాగతించారు. 14 గంటలపాటు భారతీయులంతా జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనా వైరస్ వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే తదుపరి నియంత్రణ చర్యలకు కూడా సహకరించాలన్నారు. ఈ చర్యలను ఇబ్బందిగా భావించకుండా.. రానున్న కొద్దివారాలు మరింత అప్రమత్తంగా ఉండటం, స్వీయ నియంత్రణ పాటించడం అత్యంత అవసరమన్నారు. మనదేశంలో అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా.. సూక్ష్మమైన అంశాల్లోనూ జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని రాజ్యసభ ముక్తకంఠంతో పేర్కొంది. ప్రజలు సహకరిస్తేనే ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. లోక్‌సభ అభినందనలు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం, అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు పాటుపడుతున్న వైద్య సిబ్బంది, ఇతర రంగాలకు యావత్ దేశం ఆదివారం సాయంత్రం అభినందించడం వంటి అంశాలను లోక్‌సభ సోమవారం అభినందించింది. సభ్యులంతా లేచి చప్పట్లతో అభినందనలు తెలిపారు. -
పెట్రోల్, డీజిల్‌పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
జీతాలను ముందుగానే చెల్లించేశా!
కరోనా వైరస్ జనజీవనాన్ని తారుమారు చేసింది. ముఖ్యంగా దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంది. కొందరు సినిమా తారలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించానని పేర్కొన్నారు నటుడు ప్రకాష్‌రాజ్. ‘‘జనతా కర్ఫ్యూ రోజు నా మనసులో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. నా నగదు నిల్వను ఓసారి పరిశీలించుకున్నాను. నా ఇల్లు, ఫార్మ్‌హౌస్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారితో పాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహ మ్మా రితో పాటిస్తున్న సామాజిక దూరం మూలంగా చిత్రీకరణలు అన్ని నిలిచిపోయాయి. నా సినిమాల దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇంకా నా శక్తి మేరకు చేస్తాను. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ సహాయం అవసరమైన వారిని ఆదుకోండి. ఒకరి జీవితాన్ని మీరు నిలపగలిగే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. -
ఇది పరీక్షాసమయం !
దేశం నలుమూలలా వేగంగా విస్తరించజూస్తున్న మృత్యు వైరస్‌ను అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే స్ఫూర్తిగా సమస్త భారతావని ఆదివారం నాడు సమరభేరి మోగించింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా... చిన్నా పెద్దా, ఆడా మగా, ధనిక బీద తారతమ్యం పాటించకుండా అందరికందరూ ఆసేతు హిమాచలం జనతా కర్ఫ్యూను జయప్రదం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక అత్యవసర సేవల్లో నిమగ్నులైన వారందరికీ ఇళ్ల ముందు, బాల్కనీల్లో నిలబడి కోట్లాదిమంది తమ కృతజ్ఞతాపూర్వక చప్పట్లతో జేజేలు పలికారు. జనసమ్మర్ధంతో నిరంతరం కిటకిటలాడే ప్రదేశాలు సైతం ఒక్కరంటే ఒక్కరు కనబడక బోసిపోయాయి. ఇప్పటికే కోవిద్–19 కొన్ని దేశాల్లో వేస్తున్న వీరంగం గమనిస్తే ఇప్పుడున్న బాధితుల సంఖ్య అచిరకాలంలోనే ఇంతింతై పెరుగుతుందన్న సూచనలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్న చర్యలు గమనిస్తుంటే ఈ రాకాసి వైరస్‌తో మరింతకాలం పోరాడక తప్పదన్న సంకేతాలు కనబడుతున్నాయి. దేశంలోని 17 రాష్ట్రాలూ, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో, పలు నగరాల్లో ‘లాక్డౌన్’ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, నగరాలు కూడా ఉన్నాయి. దురదృష్టమేమంటే ఇంకా చాలామంది ప్రభుత్వాలు చేస్తున్న సూచనల్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తమకేం కాదులే అన్న ధీమాతో ఇష్టానుసారం సంచరిస్తున్నారు. తోటివారి ప్రాణాలను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారు. దేశంలో సోమవారం కొత్తగా 37 కేసులు కనబడటం గమనిస్తే ఈ మహమ్మారి అంతకంతకూ ఎలా తీవ్ర రూపం దాలుస్తున్నదో తెలుస్తుంది. వీటితో కలుపుకుంటే ఇంతవరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 433కి చేరుకుంది. 130 కోట్లమంది జనాభాలో వీటి శాతం ఎంత అని తేలిగ్గా తీసిపారేయకూడదన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట. మూడోవారానికల్లా ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని, ఆ తర్వాత నియంత్రణకు సైతం లొంగదని అంటున్నారు. అన్నిటికన్నా ఆందోళనకరమైన విషయం– విదేశాలకు వెళ్లడంగానీ, అలా వెళ్లినవారికి సన్నిహితంగా మెలిగిన చరిత్రగానీ లేని వారికి సైతం ఈ మహమ్మారి అంటుకోవడం. తెలంగాణలో ఇలాంటి ఒక కేసు బయటపడగా, కోల్‌కతాలో ఇదే తరహా వ్యక్తి కరోనా బారినపడి కన్నుమూశాడు. అంటే వేరే దేశాలకు పోయి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా జనం మధ్యన కొందరు సంచరిస్తున్నారని అనుకోవాలి. అలాంటి ఒకరిద్దరు పట్టుబడ్డారు కూడా. అందువల్లే లాక్డౌన్ ప్రకటనను తీవ్రంగా తీసుకుని అమలు చేయని వారికి గట్టి హెచ్చరికలు చేయడం మొదలైంది. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం నరేంద్ర మోదీయే స్వయంగా హెచ్చరించారు. కేంద్రం ప్రకటించిన జిల్లాలు, నగరాలు మాత్రమే కాదు... మిగిలిన ప్రాంతాలను సైతం ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పరిధిలోకి తెస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ ఇదే పని చేస్తున్నాయి. ఎక్కడినుంచైనా పనిచేసే వెసులుబాటు అందరికీ ఉండదు. సాధారణ కాలంలోనే అర్ధాకలితో బతుకులు వెళ్లదీయక తప్పని స్థితిలోవుండే బడుగు జీవుల్ని అసలు గడప దాటొద్దంటే సమస్యే. కనుకనే ఆ వర్గాలవారికి రేషన్ సరుకులు అందించడం, ఇతర ఖర్చుల కోసం నగదు అందించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికలు గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ఈ కష్టకాలంలో అద్భుతంగా పని చేస్తూ ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి చేయూతనీయడం ఊరటనిస్తుంది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కరోనా గురించి సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేయడం, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వారికి తగిన సూచనలీయడం, ఈ సమాచారాన్నంతటినీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఆరోగ్యశాఖకు అందించడం ఏపీ ప్రజలకు భరోసానిస్తోంది. సామాజిక దూరం పాటించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమని వైద్య నిపుణులు చేస్తున్న సూచనల్ని పాటిస్తూ చాలా రాష్ట్రాలు సరిహద్దులు మూసేశాయి. ప్రజా రవాణా వ్యవస్థల్ని ఆపేశాయి. తప్పనిసరి కాని దుకాణాలు సైతం తెరవొద్దని తాఖీదులిచ్చాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి గట్టెక్కిన చైనాగానీ, ఇప్పటికీ సంక్షోభంలోనే వుంటూ బయటపడే మార్గం తోచక కొట్టుమిట్టాడుతున్న ఇటలీగానీ చెబుతున్న అనుభవాలు మనం పరిగణనలోకి తీసుకోనట్టయితే మున్ముందు పెను ముప్పు తప్పదు. సంక్షోభ కాలాన్ని చూసి మనం నిరాశానిస్పృహల్లోకి కూరుకుపోనవసరం లేదు. ‘ఏ పారడైజ్ బిల్ట్ ఇన్ హెల్’ అనే గ్రంథంలో రచయిత్రి రెబెకా సోల్నిట్ చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, తెలియని భూతమేదో మనల్ని మింగేస్తున్న భావన కలిగినప్పుడు మనుషుల్లోని మానవీయత మేల్కొంటుందని, వారిలోని ధైర్యసాహసాలు, చొరవ, తాము బతుకుతూ అందరినీ బతికించాలన్న తపన హృదయపు లోలోతుల్లోంచి పెల్లుబికి వస్తాయని ఆమె అంటారు. అందుకామె అమెరికా అంతర్యుద్ధం మొదలుకొని ఆ దేశాన్ని ఊపేసిన ఎన్నో ఉత్పాతాలను ఉదహరించారు. అయితే అందరినీ ఇబ్బందులపాలు చేసే ఆపదల్ని తమకనుకూలంగా మలుచుకోవాలని దిగజారేవారూ, లాభార్జన తప్ప మరేదీ పట్టనివారూ అక్కడక్కడ ఉంటారు. కానీ సకాలంలో అటువంటి చీడపురుగుల్ని గుర్తించి ఏకాకుల్ని చేయడమే అసలైన మందు. అది సమాజంలోని అందరి కర్తవ్యం కావాలి. ఆదివారం జనపదాలన్నిటా మార్మోగిన సమైక్యత నిరంతరమై ప్రవహించాలి. ఈ మహమ్మారిని దుంపనాశనం చేయడంలో నేను సైతం ఉన్నానన్న సంతృప్తి ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి. -
జనతా కర్ఫ్యూ: ఆత్మతో అక్కడ ఉన్నాను
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ కు సంఘీభావం తెలిపారు. కాగా అమెరికాలో తన భర్త నిక్ జోనస్‌తో కలిసి క్వారంటైన్లో ఉన్న ప్రియాంక... ‘జనత కర్ఫ్యూ’లో భాగంగా ఇంటి బాల్కానీలో నిల్చుని చప్పట్లు కొడుతున్న వీడియోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘భారత ప్రజలంతా ప్రధాని మోదీ పిలుపు మేరకు కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లను, నర్సులను చప్పట్లతో అభినందించారు. అయితే ఈ కర్ఫ్యూలో భాగమవ్వడానికి నేను ఈ రోజు(ఆదివారం) భౌతికంగా అక్కడ లేకపోవచ్చు కానీ.. నా ఆత్మతో అక్కడ ఉన్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్ ఖాన్) కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మోదీ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాల్గొనాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూలో భాగంగా మహమ్మారి కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ దేశ రక్షణలో భాగమైన డాక్టర్లను, నర్సులను సాయంత్ర 5 గంటల ప్రాంతంలో చప్పట్లతో అభినందించాలని సూచించారు. ఇక మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ప్రముఖులు చప్పట్లు కొట్టి కర్ఫ్యూకు మద్దతు నిచ్చారు. అంతేగాక చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఈ కర్ఫ్యూలో భాగమయ్యారు. ఇక బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్లతో పాటు హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా చప్పట్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. View this post on Instagram Priyanka supporting #JantaCurfewPledge and clapping for all the doctors and nurses. ❤ A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on Mar 22, 2020 at 8:29pm PDT -
విశాఖలో బ్యాంకులు అప్రమత్తం
-
నిబంధనలు ఉల్లంగిస్తే...
-
ప్రజల సహకారం అవసరం
-
కరోనాతో జాగ్రత్త...
-
దొంగచాటుగా ప్రయాణికుల తరలింపు
-
మార్చి 31 వరకు ఆంక్షలు ఉంటాయి
-
ప్రతి ఒక్కరు సామాజిక దూరం..
-
కలెక్టర్ ఆగ్రహం
-
కరోనా నివారణకు ఐసొలేషన్ ఉత్తమ మార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కరోనా నివారణకు ఐసొలేషన్ ఉత్తమ మార్గమని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలో తాజా పరిస్థితులపై కలెక్టరేట్లో ఆదివారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ వైరస్ వ్యాప్తికి విదేశాల నుంచి వచ్చిన వారే ప్రధాన కారణమని, అటువంటి వారిని ప్రత్యేకంగా ఉంచడంతోపాటు చుట్టు పక్కల ప్రదేశాల్లో నివసించే వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. కరోనాపై జిల్లా ప్రజల రక్షణకు అన్ని చర్యలూ తీసకుంటున్నామని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతమైందన్నారు. జిల్లాలో ఎక్కడా రద్దీ లేకుండా జనసంచారం తక్కువగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం ఒక్కరోజుతో అయ్యే పని కాదని, కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకూ ఇది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే విధంగా వెసులుబాటు కల్పించిందన్నారు. సీఎం సూచన మేరకు దుకాణాలు మూయవద్దన్నారు. దుకాణాలు మూసివేస్తే ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సినిమాహాళ్లు, మాల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలు మూతవేయాలన్నారు. జిల్లాలో 500 ప్రత్యేక గదులు ఏర్పాటు ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అనుమానం కేసులపై ఉంచేందుకుగాను జిల్లాలో 500 ప్రత్యేక గదులు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేరుగా విమానాశ్రయం నుంచి ప్రత్యేక గదులకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటింటా సర్వే పూర్తయినందున సులువుగా ఇటువంటి వారిని గుర్తించడం వీలువుతుందన్నారు. తద్వారా వారికి తగు చర్యలు తీసుకోవడం, వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో రెండు సర్వేలియన్ల బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కోబృందంలో ఐదు బ్యాచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలు ర్యాపిడ్ టీంలుగా విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఒక్కో టీంలో ఫల్మనాలజిస్ట్, ఎనస్థీషియా, జనరల్ మెడిసిన్ డ్యూటీ డాక్టర్లు ఉంటున్నారని తెలిపారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వేలియన్స్ ప్రోగ్రాం కింద ఒక్కో డివిజన్‌కు 40 బృందాలు, ఒక్కో బృందంలో పురుష, మహిళ ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారని వివరించారు. 10 బృందాలకు ఒక వైద్యాధికారి నేతృత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ కేసులను ఈ బృందాలు గుర్తించి ఆ తీవ్రత ఆధారంగా వారు రిపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. 108 వాహనాలను కొన్నింటిని ప్రత్యేకంగా కరోనా కేసుల కోసం కేటాయించామని, వీటిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బెడ్లను సిద్ధం చేస్తున్నాం... జిల్లాలో ఇంతవరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కలెక్టర్ వెల్లడించారు. మున్ముందు నమోదైతే ప్రభావిత ప్రాంతం మూడు కిలోమీటర్ల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. 10 కిలోమీటర్ల వరకూ బఫర్ జోన్ కింద పరిగణనలోకి తెచ్చి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 40 బెడ్ల ఏర్పాటు ఉందని, మరో 50 బెడ్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. టెక్కలి, పాలకొండ, రాజాం ప్రభుత్వాస్పత్రుల్లో ఐదేసి వంతున, సీతంపేటలో 1, బారువలో 4, రణస్థలంలో 3, బుడితిలో 3, కవిటిలో 2, పాతపట్నంలో 2, నరసన్నపేటలో 4, హరిపురంలో 6, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం, సోంపేట, పలాసలలో రెండేసి వంతున ఐసొలేషన్ సదుపాయంతో బెడ్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జెమ్స్ వైద్య కళాశాలలో 15, రాజాం జీఎంఆర్‌లో 16, కిమ్స్‌లో 10, గొలివి, సిందూర, అమృత, పీవీఆర్ ఆస్పత్రుల్లో రెండేసి వంతున ప్రత్యేక బెడ్లను సిద్ధం చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంచామని సూచించారు. కరోనా అనుమానిత కేసు రిపోర్టు రావాలి... వైద్యులకు పర్సనల్ పాజిటివ్ ప్రొటెక్షన్ ఎన్–95 మాస్క్‌లు సరఫరా చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వరకూ జిల్లాకు 259 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, 14 రోజులు పూర్తయినవారు కూడా ఇందులో ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఒక్క కేసుకు సంబంధించి పరీక్షల నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.శ్రీనివాసులు, జేసీ–2 ఆర్.గున్నయ్య, డీఆర్వో బి.దయానిధి, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, బీసీ కార్పోరేషన్ ఈడీ రాజారావు, మత్స్యశాఖ ఏడీ కృష్ణమూర్తి, పంచాయితీ ఏడీ రవికుమార్, జెడ్పీ సీఈవో చక్రధరరావు, డీఎంహెచ్‌వో ఎం.చెంచయ్య, డీసీహెచ్ఎస్ సూర్యరావు, కరోనా ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
జనతా కర్ఫ్యూ; నడిరోడ్డుపైనే కాన్పు
కర్నూలు,కౌతాళం: కౌతాళంలో ఆదివారం సాయంత్రం ఓ మహిళ నడిరోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు స్థానికంగా ఉన్న మహిళలు సహాయం చేశారు. బాపురం గ్రామానికి చెందిన ఉసేనమ్మ ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆటోలో మండల కేంద్రమైన కౌతాళం ప్రాథమిక వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అక్కడున్న వైద్య సిబ్బంది పరీక్షించి కాన్పు కష్టంగా ఉందని, వెంటనే ఆదోనికి తీసుకుపోవాలని సూచించారు. జనతా కర్ఫ్యూతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అది ఎంతసేపటికీ రాకపోవడంతో తాము వచ్చిన ఆటోలోనే ఆదోనికి తరలిస్తుండగా.. వైద్యశాల నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లకుండానే నొప్పులు అధికమయ్యాయి. ఆటోను అక్కడే నిలిపివేయగా స్థానిక మహిళలు వచ్చి ఉసేనమ్మకు సహాయం చేశారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో అధికంగా రక్తస్రావం జరగడంతో ఉసేనమ్మను చికిత్స కోసం ఆదోనికి తరలించారు. -
ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరణను అరికట్టడంలో భాగంగా జనతా కర్ఫ్యూను పాటించాల్సిందిగా అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ఆదివారం అక్షరాల అమలు చేసిన ప్రజలు సోమవారం నాడు అదే స్ఫూర్తిని కొనసాగించలేక పోతున్నారు. దీనిపై నరేంద్ర మోదీ అసంతప్తి వ్యక్తం చేయగా, జనతా కర్ఫ్యూను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారం నాటి కర్ఫ్యూను ఈ నెల 31వ వరకు పొడిగిస్తున్నామని, దీన్ని కచ్చితంగా అమలు చేయడం కోసం ఈ ఉత్తర్వులను ‘ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్ ఆఫ్ 1897’ కింద నోటీఫై చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. (లాక్డౌన్ : ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి) కరోనా వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో భాగంగా ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ను ప్రయోగించాల్సిందిగా మార్చి 11వ తేదీన కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలోని రెండవ సెక్షన్ కింద ప్రభుత్వాధికారులకు ప్రత్యేక అధికారాలు సిద్దిస్తాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రేవులు, విమానాశ్రయాలు, రైల్వే, బస్సు స్టేషన్లలోనే కాకుండా ఆయా ప్రయాణ సాధనాల్లో ప్రయాణికులను తనిఖీ చేయవచ్చు, రోడ్లపై తిరక్కుండా నియంత్రించవచ్చు. ఆంక్షలు విధించవచ్చు. అనుమానితులను నిర్బంధంగా వైద్య పరీక్షలకు, ఆ తర్వాత వైరస్ నిర్ధారితులను నిర్బంధ వైద్య శిబిరాలకు తరలించవచ్చు. వైరస్ బాధితుల చికిత్స విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవచ్చు. (కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ) అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తులపై, సంస్థలపై ఐపీసీ (1860)లోని 188వ సెక్షన్ కింద శిక్షలు విధించవచ్చు. ఆరు నెలల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇతన సముచిత శిక్షలు విధించే హక్కు సంబంధిత మేజిస్ట్రేట్లకు ఉంటుంది. ‘ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ఆఫ్ 1897’ కింద అధికారాలకు లభించే ప్రత్యేక అధికారాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. ఈ విషయంలో న్యాయ విచారణ నుంచి అధికారులకు చట్టం పూర్తి మినహాయింపు ఇస్తోంది. దీనిర్థం అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఐపీసీలోని 188వ సెక్షన్ కింద శిక్షార్హులవుతారు. (భారత్‌లో 8కి చేరిన కరోనా మరణాలు) ‘ఎపిడమిక్ డిసీసెస్ ఆఫ్ 1897’ను గుజరాత్లో కలరా నియంత్రణకు 1918లో, చత్తీస్‌గఢ్‌లో మలేరియా, డెంగ్యూ నియంత్రణకు 2015లో, పుణేలో స్వైన్ ఫ్లూ నియంత్రణకు 2009 ప్రయోగించారు. ఈ చట్టం స్వాతంత్య్రానికి పూర్వందైనా పటిష్టంగా పనికొస్తుందికనుక దీన్ని సవరించాల్సిన అవసరం రాలేదని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయపడ్డారు. (కరోనాపై చైనా గెలిచిందిలా..!) -
కరోనా: ధనిక, పేద తేడా లేదు.. అంతా ఏకమై!
-
కరోనా: థాంక్స్ చెప్పిన ముఖేష్ అంబానీ!
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌కు కుల, మత, ప్రాంతీయ, వర్గ, ధనిక, పేద తారతమ్యాలు ఉండవు.. దానికి అందరూ సమానమే. ఈ మహమ్మారి పేరు చెబితే అంతా భయపడిపోవాల్సిందే. అదే విధంగా దానిని ఎదుర్కొనేందుకు, ఆ ప్రాణాంతక వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ‘యుద్ధరంగం’లోకి దిగిన ప్రతీ ఒక్కరికీ తప్పక సెల్యూట్ చేయాల్సిందే. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. స్వచ్ఛంద కర్ఫ్యూను విజయవంతం చేయడంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్య, వియానయాన, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సాయంత్రం ఐదు గంటలకు ధన్యవాదాలు తెలిపారు. (భారత్‌లో 8కి చేరిన కరోనా మరణాలు) ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, పూరి గుడిసెల్లో నివసించే పేదల నుంచి ఆంటిల్లాలో నివసించే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సహా ప్రతీ ఒక్కరూ చప్పట్లు, గంటలు మోగిస్తూ వారికి సంఘీభావం తెలిపారు. భారత ప్రజల ఐక్యతారాగాన్ని ప్రతిధ్వనింపజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్త్రృతంగా వైరల్ అవుతున్నాయి. కాగా ప్రాణాంతక కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ పకడ్బందీగా అమలైంది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.(తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు) -
ఇళ్లకే పరిమితమైన జన‘కోటి’
-
పోలో నుంచి కరోనా వరకు..
సాక్షి సిటీబ్యూరో: నగరానికి కర్ఫ్యూలు కొత్తేమీ కాదు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన నాటి నుంచి నేటి వరకు పలు దఫాలుగా కర్ఫ్యూలు అమలయ్యాయి. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా జనతా కర్ఫ్యూను విధించారు. సుమారు మూడు రోజుల పాటు ప్రజలు కర్ఫ్యూ వాతావారణంలో గడిపారని పలు చరిత్రకారులు తెలిపారు. ఆపరేషన్ పోలో అనంతరం నిజాం సైన్యాధికారి ఈఐ. ఇద్రూస్ భారత సైన్యాధికారి జె.నాత్ ముందు లొంగిపోయారు. దీంతో రజాకార్లు ప్రజలపై ప్రతీకారం తీసుకుంటారనే అనుమానంతో తెలంగాణ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటి జనతా కర్ఫ్యూ మాదిరిగా అత్యవసర సేవలు తప్ప అన్ని కార్యకపాలు ఒక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇలా నగరంలో ఇప్పటి వరకు రెండుసార్లు జనతా కర్ఫ్యూ అమలైంది. కర్ఫ్యూలు కొత్త కాదు 1969 నుంచి 2014 వరకు కలహాలతో నగరంలో పలు దఫాలుగా కర్ఫ్యూను విధించారు. కొన్ని సార్ల కలహాలు తీవ్ర స్థాయిలో జరగడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు 15 నుంచి 20 రోజులు నగరంలో కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. ప్రతిసారీ నగరంలో కలహాలు జరిగడం.. ప్రభుత్వం కర్ఫ్యూలు విధించడంతో నగరాన్ని కర్ఫ్యూ నగరంగా పిలిచారని సీజియర్ సిటిజన్స్ వెల్లడించారు. దక్షిణ భాతరదేశంలో హైదరాబాద్‌లో విధించిన కర్ఫ్యూల సంఖ్య ఇతర దక్షిణాది ప్రదేశాలతో పోలిస్తే ఎక్కువే. 1969, 1974–75, 1979, 1982, 1986, 1990, 1992, 1996, 1998, 2002, 2009, 2011 వరకు నగరంలో పలు దఫాలుగా కర్ఫ్యూలు అమలయ్యాయి. 1979లో రమీజా బీ, 1992 బాబ్రీ విధ్వంసంతో పాటు పలు కలహాల సందర్భాల్లో రోజుల తరపడి కర్ఫ్యూ కొనసాగింది. రమీజా బీ, బాబ్రీ విధ్వంసం సమయంలో నగరంలో అత్యధిక రోజులు కర్ఫ్యూ కొనసాగింది. 2009, 2011, 2014లో కర్ఫ్యూ కేవలం కొన్ని ప్రాంతాల పరిధిలోనే విధించారు. నార్త్, వెస్టు జోన్లలో నో కర్ఫ్యూ.. నగరంలో ఎన్నో దఫాలుగా కర్ఫ్యూ అమలైంది. ప్రతిసారీ కర్ఫ్యూను ఈస్ట్, సౌత్ జోన్ పరిధిలోనే విధించారు. ఎప్పడు నార్త్, వెస్టు జోన్లలో కర్ఫ్యూ అమలైన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కర్ఫ్యూ అమలైనవి అన్ని ఈస్ట్, సౌత్ జోన్లలోనే ఉన్నాయి. అందులో కూడా అత్యధికంగా కర్ఫ్యూలు సౌత్‌జోన్ పరిధిలోనే అని లెక్కలు చెబుతున్నాయి. నగరంలో అమలైన కర్ఫ్యూల గురించి తెలసుకుంటే నగర ప్రజలు కర్ఫ్యూ రోజుల్లో భయాందోళనతో క్షణ, క్షణం గడిపేవారు. ఎప్పుడు ఏమైతుందో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రింభవళ్లు నిద్రాహారాలు మాని రోజులు గడిపేవారు. భద్రతా సిబ్బందికి తలనొప్పులు లేవు అదివారం అమలైన జనతా కర్ఫ్యూలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కర్ఫ్యూ అనగానే మత, వర్గ కలహాలు జరిగి ధన, ప్రాణ నష్టం సంభవించడంతో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తుంది. ఇలాంటి కర్ఫ్యూ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకొని ప్రాణాలకు లెక్క చేయకుండా తమ విధులు నిర్వహిస్తారు. కానీ జనతా కర్ఫ్యూతో నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కరోనా వైరస్ నుంచి తమకు తాము రక్షణ పొందడానికి, ఇతరుకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఇళ్లకే పరిమితమయ్యారు.నగరంలో కర్ఫ్యూల సందర్భంగా రహదారులు, గల్లీలో తీగ కంచెలు పెట్టి జనాన్ని కంట్రోల్ చేసేవారు. గతంలో కర్ఫ్యూ సందర్భంగా జనాన్ని ఇంటి నుంచి బయటకి రాకుండా నివారించడానికి పోలీసులకు ఎన్నో కష్టాలు ఉండేవి. కానీ జనతా కర్ఫ్యూతో ప్రజలే కుల, మత, వర్గాల బేధం లేకుండా పోలీసులకు సహకరించారు. -
బాధ్యతలేని యువకులతో సామాజిక సేవ
బంజారాహిల్స్: ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న యువకులతో ట్రాఫిక్ పోలీసులు సామాజిక సేవ చేయించారు. దేశం అంతా జనతా కర్ఫ్యూ పాటిస్తూ కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ఆదివారం స్వీయ నిర్బంధం పాటిస్తే కొంత మంది ఆకతాయిలు మాత్రం బాధ్యతా రాహిత్యంగా రోడ్లపై తిరిగారు. వీరికి పోలీసులు కరోనా అవగాహన ఫ్లకార్డులు ఇచ్చి ఆయా జంక్షన్లలో నిలబెట్టారు. -
72 ఏళ్ల తర్వాత.. మళ్లీ నిర్మానుష్యం
భాగ్యనగరం విశ్రమించింది. ప్రశాంత వాతావరణంలో సేదతీరింది. కరోనా కట్టడికి పోరాటంలో ముందు నిలిచింది. ఆదివారం అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్,ఎల్బీనగర్, మాదాపూర్ ఇలా..వీధులన్నీ ఖాళీ అయ్యాయి. ఐటీ సిటీలో ‘మౌస్’ మూలన పడింది. చార్మినార్ ప్రాంతం కామ్ అయింది. జూపార్కులో జంతువులన్నీ విశ్రాంతి తీసుకున్నాయి.ట్యాంక్‌బండ్ పర్యాటకులు లేక మూగబోయింది. పార్కులు ప్రశాంతంగా ఉండిపోయాయి. ప్రజలకు కాలుష్యం లేని స్వచ్ఛమైన ‘ఊపిరి’ అందింది. వాహనాల రణగొణ ధ్వనులు..హారన్లు..సైరన్లు లేకరహదారులు, ఫ్లైఓవర్లు బోసిపోయాయి. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. వారి సేవలకు సలాం చేశారు. సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారిపై ‘మహా’యుద్ధం తొలి రోజే గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. మెట్రోకు తోడు బస్సులు, ప్రైవేటు వాహనాల బంద్ పాటించారు. అత్యవసర పనుల మీద వెళ్లే వారిని సైతం పోలీస్‌లు పలు చోట్ల నిలిపేసి విచారించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిని సంజాయిషీ అడగడటంతో పాటు పలు చోట్ల కోవిడ్ వైరస్ వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞలు చేయించారు. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూలో సుమారు కోటి మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారని అధికారులు అంచనాకు వచ్చారు. చప్పట్లతో సంఘీభావం ఆదివారం రోజంతా వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో, పోలీస్‌లు రహదారులపై విధులు నిర్వహించారు. కోవిడ్‌పై యుద్ధానికి తామంతా సమైక్యంగా ఉన్నామన్న సంకేతంతో పాటు వ్యాధి నియంత్రణలో నిర్విరామంగా పనిచేస్తున్న శ్రేణులను అభినందిస్తూ ఆదివారం సాయంత్రం మహానగరం చప్పట్లతో అభినందించింది. ప్రజాప్రతినిధులు తమ నివాసాల్లో చప్పట్ల కార్యక్రమంలో పాల్గొనగా కాలనీ, అపార్ట్మెంట్లు, బస్తీలు ఎవరికీ వారు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లుమోగించారు. 72 ఏళ్ల తర్వాత..మళ్లీ నిర్మానుష్యం కోవిడ్ నివారణ కోసం ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ..72 ఏళ్ల నాటి పరిస్థితిని తలపించిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. 1948 సెప్టెంబర్ 15,16,17 తేదీల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరిన సందర్భంలో చూసిన నిర్మానుష్యం మళ్లీ ఆదివారం సాక్షాత్కరించిందని పలువురు పేర్కొన్నారు. అప్పట్లో మిలటరీ భయంతో ఎవరూ బయటకు వెళ్లకపోగా, ఇప్పుడు ఎవరికి వారు స్వీయ నియంత్రణ వల్లేనని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డిపేర్కొన్నారు. -
సిటీకి ‘స్వచ్ఛ ఊపిరి’
సాక్షి, సిటీబ్యూరో: జనతా కర్ఫ్యూతో గ్రేటర్ సిటీజనులకు ఆదివారం స్వచ్ఛ ఊపిరి సాకారమైంది. నిత్యం రణగొణ ధ్వనులు..ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడే మహా నగర రహదారులు వాహనాల రాకపోకలు లేక బోసిపోయాయి. వాయు కాలుష్యం కనిష్ట స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ, స్థూల ధూళి కణాల మోతాదు 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ ఆదివారం ఆబిడ్స్, పంజాగుట్ట, ప్యారడైస్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,గచ్చిబౌలి, మాదాపూర్, ఎల్బీనగర్, మలక్‌పేట్, కూకట్పల్లి, ఉప్పల్ తదితర అత్యంత రద్దీ ప్రాంతాల్లో ధూళి కణాల మోతాదు 30 నుంచి 40 మైక్రో గ్రాముల మేర మాత్రమే నమోదవడం విశేషం. సాధారణ రోజుల్లో ఈ ప్రాంతాల్లో ధూళి కణాల మోతాదు 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుండడం గమనార్హం. నిత్యం ఆయా ప్రాంతాల్లో లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో మోటారు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలు మోతాదు కూడా అనూహ్యంగా కనిష్ట స్థాయికి తగ్గడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏడాదికి 183 రోజులపాటు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రాంతాలు... ఆదివారం స్వచ్ఛ గాలి సాకారమైందని పలువురు అభిప్రాయపడ్డారు.కాగా సంక్రాంతి, దసరా పర్వదినాల సందర్భంగా మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టిన సమయంలోనూ వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం మరీ కనిష్ట స్థాయికి చేరుకోవడం ఓ రికార్డని పీసీబీ శాస్త్రవేత్తలు తెలపడం విశేషం. ఆదివారం ఆయా ప్రాంతాల్లో నమోదైన వాయు కాలుష్యం వివరాలను పీసీబీ నమోదు చేసింది.. సాధారణ రోజుల్లో కాలుష్యం ఇలా.. గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 50 లక్షలు కాగా.. ఇందులో కాలం చెల్లిన వాహనాలు 15 లక్షల వరకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగ లో ఉండే పలు కాలుష్య ఉద్గారాలు సిటీజనుల ఊపిరితిత్తులు పొగచూరుతున్నాయి. వీటికి తోడు నగరానికి ఆనుకొని ఉన్న 500 వరకు ఉన్న బల్క్‌డ్రగ్,ఫార్మా,ఇంటర్మీడియట్ పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్య ఉద్గారాలతో నగర పర్యావరణంహననమౌతోంది. -
నిలిచిపోయిన వాహనాలు
-
‘‘మమ’’ అనిపించారు
వేద మంత్రాలు, మంగల వాయిద్యాల నడుమ బంధు జనం సమక్షంలో అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయించి వధూవరులను మాంగళ్యధారణతో ఏకం చేసే వేడుక వివాహం. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు జీవిత పయనం సాగిస్తామని∙అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడంతోపాటు జీలకర్ర, బెల్లం నెత్తిన పెట్టి, తలంబరాలు పోసి ఎంతో ఆనందోత్సాహాలతో వివాహ వేడుకలు జరగడం చూశాం. అయితే, తాజాగా ఆ పరిస్థితి అన్నది కాన రాలేదు. కరోనా పుణ్యమా వేడుకను హడావుడిగా ముగించుకోవాల్సిన పరిస్థితి. ఆనందంతో, చిరునవ్వులతో బంధు మిత్రుల్ని ఆహ్వానిస్తూ, వేదిక మీద నిలబడి ఆహ్వానించాల్సిన కొత్త జంటల ముఖాల్లో వాటిని ఈ కరోనా దూరం చేసింది. అనేక పెళ్లిల్లు వాయిదా పడగా, మరికొన్ని ఏదో మమా అనిపించే రీతిలో ఆదివారం జరిగాయి. సాక్షి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అందుకే తమ పిల్లల వివాహాలను కుటుంబాలు, ఆప్తులు, బంధుమిత్రులు అంటూ అందర్నీ ఆహ్వానించి అత్యంత ఘనంగా తల్లిదండ్రులు నిర్వహించడం జరుగుతున్నాయి. అయితే, కరోనా రూపంలో హఠాత్తుగా వచ్చిపడ్డ జనతా కర్ఫ్యూ రూపంలో హడావుడిగా మమా అనిపించే రీతిలో ఆదివారం అనేక వివాహాలు రాష్ట్రంలో జరిగాయి. సందడి లేని పెళ్లిల్లు వందకు పైగా జరిగినా, కొన్ని ఆలయాల ముందు మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలు అన్నది కూడా లేకుండా నిమిషాల వ్యవధిలో ముగించేశారు. రాష్ట్రంలో నాలుగు నెలల క్రితమే అనేక కుటుంబాలు తమ పిల్లలకు వివాహ ముహూర్తాల్ని కుదుర్చుకున్నాయి. కల్యాణ మండపాలకు, కేటరింగ్లు, అలంకరణలు, హంగామా, సంగీత విభావరి సందడి వాతావరణం అన్నట్టుగా అన్ని ఏర్పాట్లకు అడ్వాన్స్‌లను ఇచ్చుకున్న వాళ్లు ఎక్కువే. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికల్ని పంచి పెట్టే చేశారు. ఈ సమయంలో కరోనా రూపంలో పెళ్లి వేడుకలకు ఆటంకాలు తప్పలేదు. ముందుగా రిజర్వు చేసుకున్న వాళ్లకు తప్పా, కొత్తగా బుకింగ్‌లు చేయవద్దని కల్యాణ మండపాలకు ఆదేశాలు సైతం ప్రభుత్వం నుంచి వెళ్లాయి. అలాగే, ఆయా కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట జనాన్ని చేర్చవద్దని వేడుకున్నారు. అలాగే, వివాహ వేడుకకు ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో అనేక కుటుంబాలు వివాహాల్ని వాయిదా వేసుకోగా, ముందుగా నిర్ణయం తీసుకున్న కుటుంబాలు మాత్రం ఆదివారం సందడి అన్నది లేకుండా తమ పిల్లల వివాహాలు జరుపుకోవాల్సి వచ్చింది. ఆలయాల ముందు.. తమిళనాట గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు అత్యధికంగా తమ కులదేవతల ఆలయాల్లో వివాహం జరపడం, తమ గ్రామల్లో విందు వేడుక ఏర్పాటు చేసుకోవడం సహజం. అయితే, తాజాగా ఆ పరిస్థితి అన్నది కనిపించలేదు. ఆదివారం శుభ ముహూర్త వేళ కావడంతో వంద మేరకు జంటల వివాహాలకు ముందుగానే నిర్ణయం జరిగింది. దీంతో ఆయా కుటుంబాల వివాహ వేడుకలు ఏదో జరిగింది అన్నట్టుగా జరుపుకోవాల్సి వచ్చింది. వధువరులు మాస్క్‌ల ధరించడం, వారి చుట్టు ఉన్న వాళ్లు మాస్క్‌లు వేసుకోవడం, ఏదో పది, పదిహేను మంది అత్యంత సన్నిహితుల్ని ఆహ్వానించి శానిటైజర్లు, క్రిమి సంహారక మందుల వాసనల నడుమ అతి పెద్ద కల్యాణ మండపాల్లో వివాహాలు నిర్వహించారు. పన్నీరు ఉండాల్సిన చోట, శానిటైజర్లను ఉంచి, చేతులు శుభ్రం చేసుకుని లోనికి వెళ్లక తప్పలేదు. ఇక, ఇదే రోజున సుశీంద్రం ఆలయంలో 110 జంటలకు వివాహాలు జరగాల్సి ఉండగా, అవి రద్దయ్యాయి. అయితే, కొన్ని జంటలు ఆలయం ముందు నిలబడి కనీసం మాంగల్యం తంతునామేనా...నవజీవన హేతున...అన్న మంత్రం కూడా లేకుండా అటు వచ్చి...ఇటు నిమిషాల వ్యవధిలో మాంగల్యధారణను ముగించి వెళ్లిపోయారు. తిరునల్వేలిలోని కుమారస్వామి ఆలయంలో పదిహేనుజంటలు వివాహం నిమిత్తం సిద్ధమయ్యారు. అయితే, ఆలయం మూతతో అక్కడి మండపంలో వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఆలయ అర్చకుడు స్పందించి, ఒక్కో జంటను ఆలయంలోకి తీసుకెళ్లి వివాహం జరిపించారు. పదిహేను నిమిషాలకు ఓ వివాహం అన్నట్టుగా ఇక్కడ తంతు సాగింది. ఈ పదిహేను నిమిషాల వ్యవధిలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, ఓక్కో జంటను, వారి తల్లిదండ్రులను మాత్రం ఆలయంలోకి అనుమతించడం గమనార్హం. తిరువారూర్ తిరుత్తురై పూండిలోని మారియమ్మ ఆలయం , కడలూరు జిల్లా విరుదాచలం మైలం మురుగన్ ఆలయం, ధర్మపురి, కృష్ణగిరిల్లో కొన్ని జంటలు ఆలయాల ముందు నిలబడి మాంగల్య ధారణతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. కల్యాణ మండపాలను బుక్ చేసుకుని ఆనందోత్సాహాలు వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డ వారు, రోడ్డు మీద నిలబడి, ఆలయాల ముందు, చిన్నచిన్న ఆలయాల్లో వివాహాలు జరుపుకున్న జంటల ముఖాల్లో కరోనా రూపంలో చిరునవ్వు కూడా కరువు కావడం గమనార్హం. ఇక, వీరాభిమాని ఒకరు ఏకంగా విరుగ్గంబాక్కంలోని డీఎండీకే అధినేత విజయకాంత్ ఇంటికి తనకు కాబోయే భార్య, కుటుంబీకులతో వచ్చేశాడు. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సమక్షంలో పూలమాలలు మార్చుకుని, వివాహం చేసుకున్నాడు. వీరికి తన వంతుగా ఆశీర్వచనాలతో పాటు కానుకను విజయకాంత్ అందజేశారు. కంచిలోని ఓ కల్యాణ మండపంలో కేవలం కుటుంబానికి చెందిన పదిమందితో పెళ్లి తంతును ఓ జంటకు ముగించారు. ఈరోడ్డు, పుదుకోట్టై, కోయంబత్తూరులలో కొన్ని వివాహాలు అతి పెద్ద కల్యాణ మండపాల్లో జరిగినా, అసలు వివాహం జరిగినట్టుగా సందడి అన్నది లేదు. కొన్ని వివాహాలు ఉదయం ఆరుగంటలలోపే ముగియగా, మరికొన్ని ఏడెనిమిది గంటలకు ముగించేశారు. ఇక, మైనారిటీ కుటుంబాల పిల్లల వివాహాలు కూడా జరగ్గా, బిర్యానీ విందును స్వీకరించిన వాళ్లు మరీ తక్కువే. అలాగే, నాగపట్నం ఎస్పీ రోడ్డులోని ఓ కుటుంబం మాత్రం కరోనాతో తమకేంటి అన్నట్టుగా హంగామాతో ముందుకు సాగింది. భాజాభజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాలు అంటూ ఊరేగింపుగా వివాహ వేడుక జరగడం గమనార్హం. ఇక, వివాహ వేడుకలు జరిగిన కల్యాణ మండపాల వద్ద కరోనాను తరిమికొట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. -
తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు
సాక్షి, సూర్యాపేట: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్లో పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనెల 31 వరకు లాకౌడౌన్ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. (తెలంగాణ@31 దాకా లాక్ డౌన్) -
బాధ్యత లేని మనుషులు
రోజులు ఎంత గంభీరంగా మారినా కొన్ని దుర్గుణాలు మనం వదులుకోలేకపోతున్నాం. మన అంతరాత్మ ముందుమనల్ని మనం నిలబెట్టుకోవడం ఇప్పుడు కావాలి. గమనించి చూడండి. రైల్వే గేటు పడి ఉంటుంది. రైలు మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నదని మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాని ఒకడెవడో, మనలో ఒకడెవతో బైక్‌ను గేటు కింద నుంచి దూర్చి హడావిడిగా అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయాస పడుతుంటాడు. వాడికి అర్జెంట్ పని ఏమీ ఉండదు. మహా ఉంటే అది అయిదు నిమిషాలపాటు ఆగేదే అయి ఉంటుంది. కాని వాడు గేటు దాటాల్సిందే. అలా దాటి వెళితే, కొంత మంది దాటలేక అటువైపే ఉండిపోతే వాడికి అదొక తృప్తి. ‘బయట పడేయ్... బయట పడేయ్’ అంటుంటారు తల్లిదండ్రులు. కారులో ఉన్న పిల్లలు ఏదో ఒకటి తిని, ఆ రేపర్ని చేతిలో పట్టుకుని ఉంటే తల్లిదండ్రులకు ఏమీ తోచదు. దానిని బయట పడేయాలి. కారు ఎక్కడ ఉన్నా.. గుడి ముందు ఉన్నా బడి ముందు ఉన్నా నడి రోడ్డులో ఉన్నా డోర్ దించి ఆ చెత్తను బయట పడేయాలి. కారు శుభ్రంగా ఉంచాలి. చెత్త జనానికి పంచాలి. ఎవరూ ఏమీ అడగరని అలాంటి తల్లిదండ్రులకు అదొక ధైర్యం. ‘చూచూ వస్తోంది’ అంటే ‘ఎక్కడో ఒక చోట పోసెయ్రా’ అనే పెద్దలు తప్ప, ఇల్లు వచ్చే వరకూ ఆగు, బయలు దేరే ముందు పోసుకో అని చెప్తున్నారా ఎక్కడైనా? నలభై ఏళ్లు వచ్చినా, యాభై ఏళ్లు వచ్చి జుట్టు తెల్లబడినా ఖాళీ చోటు కనిపిస్తే చాలు దానిని పాడు చేసే హక్కు ఉన్నట్టుగా బయల్దేరే, చెట్టు కనిపిస్తే దానిని టాయిలెట్ కమోడ్గా భావించే పుణ్యపురుషులు భయంకరమైన శిక్ష పడుతుందని చెప్తేనో ప్రాణాంతకమైన క్రిమి సోకుతుందని నిర్థారిస్తేనో మాత్రమే మారుతారా? మామూలు సమయాలలో మామూలు మర్యాదలను పాటించలేరా? భారతీయులు నింపాదిగా జీవనం సాగించే మనుషులు. కాని నింపాదితనం పోయింది. సమయం అంటే అదేదో జేబు నుంచి కారిపోతున్న అతి విలువైన మారకంగా మారిపోయింది. ఏ పనికీ ఒక్క గంట ఓపిక పట్టలేకపోతున్నాము. కరెంటు బిల్లు కట్టడానికి అంత సేపా? డాక్టర్ కోసం వెయింటింగ్‌కి అంత సేపా? సినిమా బుకింగ్ దగ్గర అంత సేపా? ఇలా అనేవారిలో 99 శాతం దేశాన్ని ఏలరు. కనీసం ఒక వార్డును కూడా ఏలరు. కాని త్వరత్వరగా తెమిలిపోవాలి. త్వరత్వరగా ఎక్కడికో వెళ్లిపోవాలి. ఎక్కడికి? ఇవాళ కరోనా అంటువ్యాధి మన దేశంలో ప్రబలడంలో ఆ వ్యాధికి ఉన్న శక్తి కంటే మన దుర్గుణాలకు ఉన్న శక్తి ఎక్కువ ప్రమాదకరంగా మారేలా ఉంది. గేటు కింద దూరి త్వరగా అవతలికి పోవాలి అనుకునేలాంటి వాడే ఫ్లయిట్ దిగిన వెంటనే పారాసిటిమాల్ వేసుకొని త్వరగా ఇల్లు చేరుకోవాలి అని అనుకుంటాడు. తనకు ఆరోగ్యం బాగలేదని, ఇది ప్రమాదమని, వైద్యులకు సరెండర్ కావాలని అనుకోనివాడు ఏ అదను చూసుకొనో ఫేస్బుక్లో దేశభక్తి మీద ఉపన్యాసాలు దంచుతుంటాడు. చదువుకు, ఇంగితజ్ఞానానికి సంబంధం లేకపోతే ఎంత చదువుకున్నా అతడు అక్షరాస్యుడు కాగలడా? స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పినా బయట తిరిగి, మాల్స్‌కు తిరిగి, పార్టీలు ఇచ్చి, పార్టీలకు వెళ్లి ఏం చేద్దామని మన ప్రవర్తన? నీ కోసం నువ్వు 14 రోజులు ఇచ్చుకోలేనివాడివి కుటుంబం కోసం దేశం కోసం ఏదో ఒకటి ఇస్తావని ఆశించడం చాలా అసంబద్ధం. చాలా వీడియోలలో కల్వర్టు మీద వాగు పొంగి ప్రవహిస్తున్నా బైక్ వేసుకు వెళ్లి మునిగిపోయేవాళ్లు కనిపిస్తుంటారు. మనలో చాలామంది స్వభావం అదే. మనకేం కాదని మనదాకా రాదని. అంత మునిగిపోయేది వచ్చినప్పుడు చూద్దాం అని. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అనంటే నిజంగా ఇవాళ మన రోడ్ల మీద అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేవారి శాతమెంత? వృథాగా తిరిగేవారి శాతమెంత? ఒక వేయిమందికి ప్రాణహాని కలిగితేనే మనకు సీరియస్. ఒకరూ ఇద్దరుగా చనిపోతూ ఉంటే ‘మామూలు విషయం’. ఇప్పుడు వచ్చిన అంటువ్యాధి ఇంకా సమగ్ర సమాచారం, అంచనా ఇవ్వని వ్యాధి. అది ఏమిటో అర్థమయ్యేలోపే ఎంతో ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో రాబోయే రోజులను అంచనా కట్టుకుని, పరిసరాలలో ఉన్న వారితో మాట్లాడుకుని, పని చోట ఉన్నవారితో చర్చించుకుని క్రమశిక్షణతో, బాధ్యతతో పాడు రోజులను ఎదుర్కొనడానికి సిద్ధమవుతారు.ఇప్పుడు కావలసింది రెండు నెలల పాటు అవసరమయ్యే సరుకులను కొనుక్కుని దాచుకునేవారు కాదు. కనీసం ఇద్దరికైనా జాగ్రత్తలు చెప్పి వారు క్రమశిక్షణ పాటించేలా చూసి తాము క్రమశిక్షణ పాటించేవారు.ఒక మనిషికి ఈ వ్యాధి వస్తే ఆ మనిషికి మాత్రమే నష్టం జరిగే ‘పరిమిత నష్టకారి’ కాదు ఇది. కుటుంబం దాని బారిన పడుతుంది. ఇరుగుపొరుగు దాని బారిన పడతారు. ఒక సమూహమే దాని బారిన పడుతుంది.నిద్ర లేచి కృష్ణ, రామ, అల్లా, జీసస్‌ను తలుచుకోవడం అవసరమే కావచ్చు. కాని స్వీయ క్రమశిక్షణ గురించి సంకల్పం చెప్పుకోవడం కూడా అవసరం.ఎవరు చూడొచ్చారులే నుంచి మన అంతరాత్మ మనల్ని గమనిస్తోంది అనే వరకు ఎదుగుదల అవసరం. అదే ఇప్పుడు దేశానికి శ్రీరామరక్ష. – కె.సువర్చల -
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
-
మేము సైతం..
కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి జనతా కర్ఫ్యూనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు సైతం తమవంతు బాధ్యతగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఆదివారం కాలక్షేపాలతో గడిపారు. తమకిష్టమైన వంటకాలను ఆరగించారు. పుస్తక పఠనంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. మొత్తానికి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంలో స్ఫూర్తిమంతంగా నిలిచారు. పుస్తక పఠనంలో మునిగి.. కుత్బుల్లాపూర్: జనతా కరŠూయ్వలో భాగంగా ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం పత్రిక పఠనం పూర్తి చేసిన ఆయన టిఫిన్ అనంతరం పలువురువు మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలను చదువుతూ కాలక్షేపం చేశారు. ఇంట్లో పిల్లలు అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కరే ఉన్న వివేకానంద్ పుస్తక పఠనంలో మునిగిపోయారు. కరోనా బారి నుంచి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఇదే తరహాలో ప్రజలు మద్దతు తెలిపితే తప్పకుండా కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడతామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది అరుదైన రోజు ఎల్బీనగర్: తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇతరులెవరూ లేకుండా కుటుంబంతో ఉండటం ఇదే ప్రథమమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో తాను మొదటిసారిగా కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలను కలువకుండా.. వ్యక్తిగత సహాయకులు, గన్మెన్లు లేకుండా.. బంధువులను, స్నేహితులు లేకుండా ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. గతంలో కర్ఫ్యూ విధిస్తే పాస్‌ల సహాయంతో బయటకు వచ్చేవారు. ఇప్పుడు ప్రజలే తామంతట తామే కర్ఫ్యూ విధించుకున్న రోజు. కరోనా వైరస్ నియంత్రనకు దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం పట్ల దేశం మొత్తం జనతా కర్ఫ్యూలో పాల్గొని ప్రజలు సహకరించారు. మా ఇంట్లో పనిమనుషులు కూడా సెలవు తీసుకున్నారు. నా డ్రైవర్ కూడా లేరు. ఇంట్లో మేమే టీ చేసుకోడం, వంట చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేయడం భోజనం చేయడం అంత కుటుంబ సభ్యులతో కలిసి గడపడం నా రాజకీయ జీవితంలో మొదటిసారి. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజానీకానికి జై కొడుతున్నాను. ఇంట్లోనే ఉండి.. పొంగల్ వండి.. అల్వాల్: నిరంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన నివాసానికే పరిమితమయ్యారు. తనకు ఇష్టమైన పొంగల్ వంటకాన్ని చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. సాయంత్రం చప్పట్లతో వైద్యులకు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. మనవలతో మల్లారెడ్డి.. కుటుంబంతో తలసాని కంటోన్మెంట్: జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఆదివారం కంటోన్మెంట్‌లోని తమ నివాసాలకే పరిమితమియ్యారు. బోయిన్పల్లి జయనగర్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఇంటికి పరిమితమయ్యారు. మనవలతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి 5 గంటల సమయంలో కరోనాపై పోరాడుతున్న వైద్య, పోలీసులు, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. తనయుడు సాయికిరణ్ కుమారులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అత్యవసరమైతేనే బయటకు రండి: మల్లారెడ్డి ప్రజలు అత్యవసరమైతే మినహా కాలక్షేపానికి బయటికి రావొద్దని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూలో భాగంగా స్వీయ నియంత్రణలో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వం అందించే సూచనలు పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అప్రమత్తతతోనే కరోనాను సమర్ధంగా ఎదుర్కోవచ్చన్నారు. -
పెట్రో అమ్మకాల్లేవ్
సాక్షి,సిటీబ్యూరో: పెట్రోల్ బంకులు తెరిచే ఉన్నా.. వాహనదారుల తాకిడి మాత్రం కనిపించలేదు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర సేవల్లో భాగంగా నగరంలోని పెట్రోల్ బంకులు తెరిచే ఉంచినప్పటికీ వినియోగదారుల సందడి మాత్రం కనిపించ లేదు. వాస్తవంగా పెట్రోల్ బంకుల ముందు బారికేడ్లను ఏర్పాటు చేసి ఒకరిద్దరు సిబ్బందితో మొక్కుబడిగా తెరిచి ఉంచారు. దీంతో అత్యవసర అవసరాల కోసం రోడ్డెక్కిన వాహనాలు సైతం బారికేడ్ల కారణంగా ఇంధనం కోసం బంకుల్లోకి వెళ్లలేకపోయారు. సాయంత్రం ఐదు గంటల వరకు లక్డీకాపూల్‌లో పెట్రోల్ బంకు తప్ప మిగితా పెట్రోల్ బంకులకు కనీస వాహనాల తాకిడి లేకుండా పోయింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత స్పల్పంగా వాహనాలు రోడ్లపై రావడంతో కొన్ని పెట్రోల్ బంకుల్లో స్వల్పంగా రద్దీ కనిపించింది. వాస్తవంగా మహా నగరంలో ప్రతి నిత్యం సగటున 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. కరోనా వైరస్ విస్తరించకుండా విద్యా సంస్థలకు సెలవులు, సినిమా హాల్స్, పర్యాటక ప్రాంతాలు మూసివేత, ప్రైవేటు సంస్థలు హోం టూ వర్క్ ప్రకటించడంతో గత వారం రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సగానికి పైగా అమ్మకాలు పడిపోయాయి. తాజాగా ఆదివారం జనతా కరŠూప్యతో అమ్మకాలు కనీసం ఒక శాతం కూడా జరగలేదని సమాచారం. ప్రజారవాణా ఆగిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. -
‘టోక్యో’ వాయిదా తప్పదేమో !
ఇప్పుడు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో భారత్‌లో ఐపీఎల్ దారి దాదాపు మూసుకుపోయింది! అలాగే ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలపైగా దాటిన కరోనా బాధితులతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), నిర్వాహక దేశం జపాన్ ఆలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా తప్ప వేరే మార్గమే లేదని అంచనాకు వచ్చిన ఐఓసీ తెరవెనుక అదే పనిచేస్తున్నా... బయటికి మాత్రం చెప్పలేకపోతోంది. దీంతో జులై 24న టోక్యోలో ఒలింపిక్స్ జే గంట మోగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో: కరోనా ఎంత పనిచేసింది. వుహాన్‌లో మొదలుపెట్టిన మృత్యు ఘంటికల్ని ప్రపంచమంతా మోగిస్తున్న ఈ ‘కోవిడ్–19’.... ఇటు వైరస్ బారిన పడిన బాధితుల్నే కాదు చాన్నాళ్లుగా జపాన్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిపి తీరుతామన్న ఐఓసీ ఇప్పుడు వాయిదా వేసే పనిలో పడింది. ఎన్నో ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి, చివరకు ప్లాన్ ‘బి’ కూడా సాధ్యం కాదనే అంచనాకు వచ్చింది. వాయిదా ఖాయమైనా అధికారికంగా ఇప్పుడప్పుడే వెల్లడించడం లేదు. కానీ పాత షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ జరిగే అవకాశం కూడా లేదు. ఎక్కడికక్కడ అన్నీ స్తంభించాయి. దేశ సరిహద్దులన్నీ మూతపడుతున్నాయి. చిన్న, పెద్ద పట్టణాలే కాదు... 24 గంటలు గడియారం ముల్లులా మెలకువగా ఉండే విశ్వనగరాలే లాక్డౌన్ అయ్యాయి. ప్రజారవాణా లేనే లేదు. ఐదు, పది మందికి మించి గుమిగూడే పరిస్థితులేవీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ లక్ష్యంగా శిబిరాలు నిర్వహించే అవకాశాల్లేవు. మిగతా క్వాలిఫయింగ్ ఈవెంట్లు జరగనే జరగవు. ఇవన్నీ క్షుణ్నంగా పరిశీలించిన ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. రేపో మాపో కచ్చితంగా వెల్లడిస్తుంది. అదే టోక్యో ఒలింపిక్స్ ‘వాయిదా’ అని! ప్రపంచం ‘వాచ్’ ఆగిపోతే... ఆటలా! సెల్ఫోన్లు లేని రోజుల్లో మన చేతికున్న రిస్ట్ వాచ్ ఆగిపోతే ఎంత ఇబ్బంది అయ్యేదో అందరికీ తెలుసు. సమయపాలన అంతా చిన్నాభిన్నమయ్యేది. అలాంటిది ఇప్పుడు భూగోళం (గ్లోబ్) గడియారమే ఆగిపోయింది. కాసేపు ‘ప్రతిష్టంభన’ తట్టుకుంటామేమో కానీ ఈ ‘ప్రతిస్తంభన’ (అంటే రోజులపాటు ప్రతీది స్తంభించిపోవడం) ఎవరి తరం కాదు. ప్రపంచ వ్యవస్థే మూతపడిన ఈ వేళలో ఆటలెలా ఆడించేది అని ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. జపాన్ ప్రజల్లోనూ వైరస్ భయాందోళనలున్నాయి. ఇవన్నీ అక్కడి ప్రభుత్వానికీ తెలుసు. అందుకే ఐఓసీతో కలిసిపోయింది. ఏం చెబితే అదే అన్న ధోరణిలో ఉంది. కానీ పైకి మాత్రం నిర్వహణకే ఏర్పాట్లు అంటూ ఇప్పటికీ బీరాలు పలుకుతుంది. ఎందుకంటే జపాన్ దేశం టోక్యో విశ్వక్రీడలకు వేల కోట్ల డబ్బులను ఖర్చు చేసింది. స్పాన్సర్‌షిప్‌ల రూపేణా కోట్లకొద్దీ డబ్బులు పోగేసుకుంది. కోట్ల మొత్తంలో ఆర్థిక వ్యవహరాలు ముడిపడి ఉండటంతో ఆటలు సాగుతాయనే అంటుంది. కానీ బయట జరిగేది మాత్రం ‘వాయిదా’ ప్రక్రియే! ఐఓసీ అధికారిక వర్గాల సమాచారం మేరకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోటీలు జరిపి తీరే అవకాశాలే లేవని తెలుస్తోంది. రేపోమాపో చెప్పక తప్పదు ఇప్పటికైతే ప్లాన్ ‘బి’, ‘సి’, ‘డి’... ఇతరత్రా ప్రత్యామ్నాయాలున్నాయని చెబుతున్నా... చిట్టచివరికి ఆటలు నిర్దేశిత సమయంలో జరగవని, కాస్త ఆలస్యమవుతాయని ఐఓసీ రేపోమాపో చెప్పనుంది. లోగడ ఆయా దేశాల్లో కరోనా విలయం ఎలా ఉంది? ఆటగాళ్ల ప్రాక్టీసు సాగుతుందా ఆగిందా? అని ఆరా తీసింది. మిగిలున్న క్వాలిఫయింగ్ ఈవెంట్లు పూర్తి చేయడం, ప్రత్యామ్నాయ అర్హత అవకాశాలు కూడా లేకపోవడంతో సభ్య దేశాలకు చెందిన క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సమాఖ్యలు, సంఘాలు, అంతర్జాతీయ క్రీడా పాలక మండలిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. టోక్యో ఈవెంట్‌కు 60 కంపెనీలు, సంస్థలు స్పాన్సర్ చేస్తున్నప్పటికీ ప్రధాన స్పాన్సర్లయిన టయోటా మోటార్ కార్ప్, ప్యానసోనిక్ కార్ప్ సంస్థలకు సమస్య అర్థమై ఆందోళన చెందుతున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కూడా షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిగే అవకాశమే లేదని తెగేసి చెప్పింది. వాయిదా సరే... రద్దయితే? జపాన్ ప్రభుత్వం ఎన్ని చెప్పినా... ఒలింపిక్స్ వాయిదా దాదాపు ఖాయమైనట్లేనని ఐఓసీ వర్గాలే చెబుతున్నాయి. కానీ మరో రెండేళ్ల వరకు అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్ బిజీబిజీగా ఉంది. 2021 సమ్మర్ సీజన్ ఏమాత్రం ఖాళీ లేదు. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ , బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లతో నిండిపోయింది. మరి వాయిదా కొన్ని నెలలపాటే అయితే కుదరొచ్చు కానీ వచ్చే ఏడాది అంటే మాత్రం మొదటికే మోసమొస్తుంది. పైగా ‘టోక్యో’ను ప్రతీ 40 ఏళ్ల ఒలింపిక్స్ భయాలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 ఒలింపిక్స్ రద్దుకాగా... మరో 40 ఏళ్లకు మాస్కోలో జరిగిన 1980 ఒలింపిక్స్‌ను జపాన్ బహిష్కరించింది. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్లకు జపానే ఆతిథ్యమివ్వనున్న క్రీడలకు కూడా అదేగతి పడుతుందా అనే ఆందోళనలో జపాన్ విలవిలలాడుతోంది. -
కరోనాకు మరో ముగ్గురి బలి
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో ముగ్గురు కోవిడ్–19 (కరోనా వైరస్) బారిన పడి చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరింది. బిహార్, గుజరాత్లో తొలి మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 360కి చేరినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 67 కరోనా కేసులను గుర్తించగా కేరళలో 52, ఢిల్లీలో 29 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17 రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్’కు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు అనుమతిస్తారని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ నెల 31 వరకు లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు సంఘీభావంగా జనతా కర్ఫ్యూ సాయంత్రం చప్పట్లు కొడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా 31 వరకు రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులు బంద్ కరోనా మహమ్మారి విస్తరించకుండా మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 22వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బయల్దేరిన రైళ్లను మాత్రం గమ్యస్థానం చేరేందుకు అనుమతిస్తారు. ప్రయాణాలను రద్దు చేసుకునే వారికి డబ్బులు పూర్తిగా వెనక్కి చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ► ఇటీవల కతార్ నుంచి తిరిగి వచ్చిన 38 ఏళ్ల కిడ్నీ బాధితుడు కరోనా లక్షణాలతో ఆదివారం చనిపోయినట్లు పట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. కరోనాతో ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా సూరత్‌లో 67 ఏళ్ల వృద్ధుడు కూడా దీని బారిన పడి మృత్యువాత పడ్డారు. ► యూపీలో 27, రాజస్తాన్‌లో 24, హరియాణాలో 21, కర్ణాటకలో 26 కరోనా కేసులు నమోదు కాగా పంజాబ్‌లో 21, గుజరాత్లో 18, లడఖ్‌లో 13 కేసులు గుర్తించారు. తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ► అనుమానితుల నమూనాలు పరీక్షించేందుకు ల్యాబ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌కు కేంద్రం ఆదేశించింది. ► జమ్మూ కశ్మీర్‌లోనూ ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌కు ఆదేశించారు. ► ఢిల్లీలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ ఆదేశిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడటంపై నిషేధాజ్ఞలు విధించారు. ► సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మార్చి 27 వరకు కోల్‌కతాతోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ► పారా మిలటరీ బలగాల కదలికలపై కూడా నియంత్రణ విధించిన కేంద్రం ఏప్రిల్ 5 వరకు ఎక్కడి సిబ్బంది అక్కడే ఉండాలని ఆదేశించింది. ∙13,523 ప్యాసింజర్ రైళ్లు మార్చి 31 అర్ధరాత్రి వరకు రద్దయ్యాయి. కరోనా వైరస్ లక్షణాలు కలిగిన కొందరు వ్యక్తులు రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినందున ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ► ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు నాగాలాండ్ తెలిపింది. ► మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్ల కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీని నిలిపివేయాలని నిర్ణయించాయి. ► ఫియట్ కంపెనీ కూడా ఈ నెలాఖరు వరకు తయారీని నిలిపివేసింది. ► హీరో మోటో కార్ప్, హోండా కూడా బైక్‌ల తయారీని నిలిపివేశాయి. సుదీర్ఘ సంగ్రామానికి ఆరంభం: ప్రధాని మోదీ కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలిపిన దేశ ప్రజలకు ధన్యవాదాలు కరోనాపై దీర్ఘకాలిక యుద్ధానికి 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’ఆరంభం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం యావత్తూ ఏకమై ఏ సవాల్‌నైనా ఎదుర్కోగలమని రుజువు చేసిందని చెప్పారు. ‘జనతా కర్ఫ్యూ ఈరోజు రాత్రి 9 గంటలకు ముగియవచ్చు కానీ దీని అర్థం మనం సంబరాలు చేసుకోవాలని కాదు. స్వయం ప్రకటిత కర్ఫ్యూను విజయంగా భావించకూడదు. సుదీర్ఘ సంగ్రామానికి ఇది ఆరంభం మాత్రమే. గంటలు, వాయిద్యాలు మోగించడం ద్వారా కరోనాపై పోరాడుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన దేశ ప్రజలను అభినందిస్తున్నా’అని ట్విట్టర్లో ప్రధాని పేర్కొన్నారు. అంతా ఇళ్లలోనే.. మార్మోగిన చప్పట్లు ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’పాటించిన ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో బాల్కనీల వద్దకు చేరుకుని గంటలు మోగించి వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు. – ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్, బాంద్రా–వర్లీ సీ లింక్ జనతా కర్ఫ్యూతో జనసంచారం లేక బోసిపోయాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), ఇతర సబర్బన్ రైల్వే స్టేషన్లు ఖాళీగా కనిపించాయి. గోవా చర్చి, ఇతర చోట్ల ఆదివారం ప్రార్థనలు రద్దయ్యాయి. కోల్‌కతాలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎస్ల్పనేడ్, డల్హౌసీ హౌస్ ఏరియా ప్రాంతాలతోపాటు ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు జనం లేక వెలవెలపోయాయి. గుజరాత్‌లోని ప్రధాన నగరాలు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లో చాలా స్పల్ప సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పక్షుల కిలకిలా రావాలు వింటున్నారా? జనతా కర్ఫ్యూ సందర్భంగా ట్విట్టర్ వినియోగదారులు.. న్యూఢిల్లీ: కొందరు ఇళ్లలో గరిటె తిప్పగా.. మరికొందరు ఉదయం నుంచే పుస్తకాలు చేత పట్టారు. ఇంకొందరైతే చెట్లపై నుంచి వినిపించే పక్షుల కిలకిలా రావాలు వింటూ గడిపారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా జనాలు ట్విట్టర్లో పంచుకున్న అనుభవాలివీ... ఎప్పుడూ రణగొణ ధ్వనులతో బిజీగా ఉండే ముంబై నగరానికి చెందిన ట్విట్టర్ యూజర్ వందన కుమార్ ‘ప్రకృతి పిలుపు’అని ట్వీట్ చేయగా.. రచయిత స్మిత బరూహ్ ‘నెమలి పిలుపుతో మేల్కొన్నా..’అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ‘నా ఇంటి పరిసరాల్లో ఒక్క వ్యక్తి కానీ, కారు కానీ కదలడం చూడలేదు. మీరు కోకిల ఇతర పక్షుల గొంతును వినగలుగుతున్నారా? నేను నెమలి పిలుపుతో మేల్కొన్నాను..’బరూహ్ పేర్కొన్నారు. పక్షుల కిలకిల రావాలకు సంబంధించి 6,400 ట్వీట్లతో ట్రెండింగ్ టాపిక్‌గా ‘బర్డ్’నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్మానుష్య రోడ్ల ఫొటోలు షేర్ చేస్తూ 3.4 లక్షల మంది ట్వీట్లతో ‘జనతా కర్ఫ్యూ’ట్రెండింగ్‌లో నిలిచింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు వెళ్లే పవర్ రైసినా హిల్ ప్రాంతం ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా నిర్మానుష్యంగా మారిన దృశ్యం. ముంబైలోని చావల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లోకి వచ్చి సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న స్థానికులు -
జనతా కర్ఫ్యూపై జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 (కరోనా వైరస్) వ్యాప్తిని నియంత్రించడం కోసం పాటుపడుతున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చప్పట్లు కొట్టి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తాడేపల్లిలోని తన నివాసం వద్ద మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలసి చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జవాన్లు, పోలీసులతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నవారికి రుణపడి ఉంటామని చెప్పారు. జయహో ‘జనతా’! ప్రమాదకర కోవిడ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రజలు పాటించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలంతా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేశాయి. అన్ని దుకాణాలు, రెస్టారెంట్లు, షాపులు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, మార్కెట్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, బార్లు, మద్యం షాపులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులతోపాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్ మూతపడ్డాయి. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ కార్మికులు శానిటైజేషన్ చేశారు. వైద్యులు, పోలీసులు తమ విధులను చక్కగా నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తక్షణ సహాయ చర్యల కోసం పలు ప్రాంతాల్లో పర్యటించారు. - విజయవాడలో ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగమయ్యారు. ఎప్పుడూ మార్నింగ్ వాక్ చేసే వారితో నిండి ఉండే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనతా కర్ఫ్యూతో బోసిపోయింది. అనాథలు, యాచకులకు పోలీసులు ఆహార పొట్లాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. - విజయవాడలో కోవిడ్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హైఅలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 14 వరకు విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. - బెంగళూరు నుంచి వస్తున్న రైలులో కోవిడ్ సోకిన వారున్నారనే అనుమానంతో ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో బిహార్‌కు చెందిన ఆరుగురిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. - అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. చిన్నారులు, గర్భిణులకు ఇళ్లకే పోషకాహారం పంపిణీ చేస్తున్నారు. - ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజలు కోవిడ్ నిర్మూలనకు విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, వైద్యులకు, పోలీసులకు, కార్మిక వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. కొందరు ప్లేటుపై గరిటెతో చప్పుడు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల్లో ఇలా.. - కర్నూలు జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రులకు, మెడికల్ షాపులకు మాత్రమే జనం బయటకు వచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూకు సహకరించారు. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం తదితర ఆలయాలను మూసివేశారు. - అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసేశారు. అనంతపురం సర్వజనాస్పత్రిలోని కోవిడ్ ఐసోలేటెడ్ వార్డులో ఏడుగురు అనుమానితులున్నారు. ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. - చిత్తూరు జిల్లాలో రేణిగుంట విమానాశ్రయం నుంచి వెళ్లి వచ్చే 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. తిరుమలతోపాటు కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, నాగలాపురంలోని ప్రముఖ ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించలేదు. తిరుపతిలోని జూపార్క్, సైన్స్ సెంటర్, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులను మూసేశారు. - శ్రీకాకుళం జిల్లాలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వైద్యసేవలు పొందే రోగులు మినహా ఆస్పత్రులు కూడా ఖాళీగానే దర్శనమిచ్చాయి. నిత్యావసర సరుకుల దుకాణాలు సైతం మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కోవిడ్ నిరోధానికి హోమాలను జరిపించారు. - తూర్పుగోదావరిలో ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు గుమ్మం దాటి బయటకు రాలేదు. కోల్‌కతా – చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారి నిర్మానుష్యంగా కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే కొవ్వూరు – రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన, గోదావరిపై ఉన్న నాలుగో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయాలు మూతపడ్డాయి. - ప్రకాశం జిల్లాలో జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. అనాథలకు భోజనం, వాటర్ బాటిళ్లు అందించి పోలీసు అధికారులు ఔదార్యాన్ని చాటుకున్నారు. - విశాఖ తూర్పు నౌకాదళంలో సేవలన్నీ నిలుపుదల చేశారు. అత్యవసర సేవలు, భద్రతా అంశాల్లో సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఇక విశాఖ జిల్లాలో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల ముందు నుంచే ప్రజల్లో అవగాహన కల్పించడంతో విజయవంతమైంది. - గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్దే ఉండి స్వీయ నిర్బంధం పాటించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి జిల్లాకు మొత్తం 1138 మంది వచ్చినట్లు గుర్తించారు. ఆదివారం వీరి ఇళ్లకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు, వైద్యాధికారుల బృందం వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం వీరంతా హోం ఐసోలేషన్‌లో కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. ఇంతకుముందు సేకరించిన ఐదుగురి నమూనాలకు సంబంధించి పరీక్ష ఫలితాల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. - విజయనగరం జిల్లాలో ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. ఏడుగంటల తరువాత ప్రజలెవరూ బయటకు రాలేదు. పారిశుధ్ధ్య కార్మికులు మాత్రమే ఉదయం తమ విధుల నిర్వహణకు బయటకు వచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారులు వీధుల్లో క్లోరిన్ వాటర్, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దాదాపు 875 బస్సులు బయటకు రాకుండా డిపోలకే పరిమితమయ్యాయి. - శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యవసరమైన వారు మినహా మిగతా ఎవరూ వీధుల్లోకి రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. హౌరా నుంచి యశ్వంతపూర్ వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఎస్–5 కోచ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీ ప్రయాణికులు కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో సహచర ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలును బిట్రగుంట స్టేషన్లో 30 నిమిషాలకు పైగా నిలిపి వారికి చికిత్స చేయించారు. - పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఉదయం ఏడుగంటల నుంచి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రజలు బయటకు రాలేదు. రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులు, అసుపత్రి సిబ్బంది, వైద్యులు, పోలీసులు, మీడియా మాత్రమే తమ విధులలో భాగంగా బయటకు వచ్చారు. విదేశాల నుంచి జిల్లాకు 2,900 మందికిపైగా వచ్చినట్లు గుర్తించారు. వీరందరినీ ఇళ్లవద్దే ఐసొలేషన్‌లో ఉంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. - జనతా కర్ఫ్యూ వైఎస్సార్ జిల్లాలో విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలు, పార్కులు, కార్యాలయాలు మూతబడ్డాయి. -
పల్లె గప్‌చుప్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ కు తెలంగాణ పల్లెవాసులు సంపూర్ణ మద్దతు పలికారు. గ్రామీణ ప్రజానీకం దృఢ సంకల్పంతో కర్ఫ్యూలో పాల్గొని ఐక్యతను చాటింది. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తం గా అన్ని గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించారు. గ్రామాల్లో చిన్న దుకాణాలు, బడ్డీకొట్లు మొదలు అన్నీ మూతబడ్డాయి. రైతులు సైతం సాగు పనులు నిలిపివేసి ఇంటిపట్టునే ఉన్నారు. అన్ని వర్గాలు జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. ముందస్తు ప్రణాళికతో... జనతా కర్ఫ్యూపై గ్రామ పంచాయతీలు ముందస్తు చర్యలు చేపట్టాయి. గ్రామ సచివాలయం ఆధ్యర్యంలో రెండ్రోజుల ముందు నుంచే కర్ఫ్యూపై దండోరా వేయించారు. సామాజిక మాధ్యమాలు, మీడియాలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు సైతం ముందస్తుగా సూచనలు చేశారు. దేశభక్తి, ఐక్యతపై సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు, చిత్రాలు వైరల్ కావడంతో కర్ఫ్యూపై లోతుగా ప్రచారం జరిగింది. దీంతో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ముందస్తుగా సిద్ధమయ్యారు. ఇంటికి కావాల్సిన సరుకులను ముందురోజే సమకూర్చుకున్నారు. ముందు రోజు చేసే కార్యక్రమాలను వీలైనంత మేర ముందస్తుగా ముగించుకోవడం, లేదా తర్వాతి రోజుకు వాయిదా వేసుకోవడం లాంటివి చేసుకున్నారు. సాధారణంగా గ్రామాల్లో సెలవు వాతావరణం ఉంటే ఇంటి బయట అరుగులపైనో, రోడ్డు పక్కన ముచ్చట్లు పెట్టుకోవడం కనిపించేది. కర్ఫ్యూతో అలాంటివేవీ కనిపించలేదు. మెజార్టీ ప్రజలు తలుపుదాటి బయటకు రాలేదు. కొన్నిచోట్ల అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అరగంట, గంటకోసారి పోలీసు వాహ నాలు సైరన్‌తో వెళ్లడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. దీంతో మెజార్టీ ప్రాంతా ల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. -
పోలీసుల వ్యూహం.. జనతా కర్ఫ్యూ జయప్రదం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ అమలుకు పోలీసులు తమదైన వ్యూహంతో ముందుకు సాగారు. ఓవైపు కేంద్రం పధ్నాలుగు గంటలు, రాష్ట్రం 24 గంటల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో రెండింటిని ఒకేసారి విజయవంతంగా అమలు చేశారు. శనివారం రాత్రి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి ఎలాంటి వాహనాలను రానీయకుండా చెక్‌పోస్టుల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వ్యవహరించి విజయవంతమయ్యారు. పట్టణాల్లో, జిల్లాల్లో జనతా కర్ఫ్యూకు పెద్దఎత్తున ఆదరణ లభించింది. పోలీసుల పనితీరుపట్ల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. -
ఎస్పీఎంలో ‘కర్ఫ్యూ’ బేఖాతర్
సాక్షి, ఆసిఫాబాద్: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించగా.. సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను బేఖాతరు చేసింది. ఆదివారం కార్మికులు యథావిధిగా విధులకు హాజరుకావడం స్థానికంగా వివాదాస్పదమైంది. ఉదయం 6 గంటల షిఫ్టులో పేపర్ మిల్లులోకి దాదాపు 300 మంది కార్మికులు పనులకు వెళ్లారు. దీనిపై కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మ ధ్యాహ్నం 2 గంటల షిఫ్టు కార్మికులు విధుల్లోకి వెళ్లలేదు. జనతా కర్ఫ్యూ పాటించకపోవడంపై కంపెనీ జీఎం (ఐఆర్) అలోక్ శ్రీవాత్సవ స్పందిస్తూ అత్యవసర విభాగాలైన విద్యుత్, నీటి సరఫరా, బాయిలర్ కొనసాగింపు పనుల్లో కొంత మంది కార్మికులు హాజరయ్యారని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేక ప్రచారం సంగారెడ్డి అర్బన్: జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి రావాలని ప్రధాన మంత్రిపై తీవ్ర పదజాలంతో ప్రజలను రెచ్చగొట్టిన సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదైంది. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ప్రధాని మోదీపై అసభ్య పదజాలంతో ఈ నెల 21న సాయంత్రం మహ్మద్ షమీ(34వ వార్డు కౌన్సిలర్), మహ్మద్ ఆర్ఫాత్, వాహిద్‌బీన్ అహ్మద్‌లు కలసి వీడియో రికార్డింగ్ చేసి వాట్సాప్‌లో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా, ప్రజల మధ్య విదేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ షమీపై గతంలో మత అల్లర్లలో నేర చరిత్ర ఉంది. -
జయహో జనతా..
సాక్షి, హైదరాబాద్ : పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకుంది. కులం, మతం, ప్రాంతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు జనతా కర్ఫ్యూ ను పాటించారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రోజంతా ఎవరూ బయటకు రాలేదు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలు, పల్లెల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముందే ఖరారైన పెళ్లిళ్లు మినహా అన్ని శుభకార్యాలను రద్దు చేసుకున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకపోవడంతో రాష్ట్రంలోని అన్ని రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. రోజూ కిటకిటలాడే ప్రాంతాలు, మార్కెట్లు, రైతు బజార్లు, బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ఎవరూ కనిపించలేదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో ప్రజా రవాణా కోసం వాహనాలను నడపాల్సిన అవసరం కూడా రాలేదు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని రంగాలు లాక్డౌన్ కావడంతో ఆదివారం రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. అంతటా అద్భుత స్పందన... ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపులకు రాష్ట్రంలో అద్భుత స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాల వరకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆదివారం సెలవు కావడం, స్వచ్ఛం దంగా ప్రజలు కరోనాపై యుద్ధం ప్రకటించడంతో రాష్ట్రమంతా 144 సెక్షన్ తలపించింది. వ్యాపార వర్గాలు కూడా సహకరించడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని దుకా ణాలు బందయ్యాయి. నిత్యపూజలు మినహా ప్రార్థన మందిరాల్లో కూడా జనసంచారం కనిపించలేదు. నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు, మార్కెట్లకు కూడా ప్రజలు వెళ్లలేదు. ఆదివారం బంద్ ఉంటుందనే ఉద్దేశంతో శనివారమే నిత్యావసరాలు, పాలు, కూరగాయలు తెచ్చుకున్న ప్రజానీకం రోజంతా ఇళ్లలోనే ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క వాహనం కూడా మన రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. (మరో ఆరుగురికి కరోనా పాజిటివ్..) మన రాష్ట్రంలో కూడా రోడ్లపై వాహనాలు కనిపించలేదు. ఒకటో, రెండో వాహనాలు తిరిగినా హైదరాబాద్‌లో రోడ్లన్నీ బోసిపోయాయి. శనివారమే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ గురించి ప్రచారం చేయడంతో ఎవరూ బయటకు వచ్చేందుకు సాహసించలేదు. కొందరు బయటకు వచ్చినా వారికి పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అనవసరంగా బయటకు వచ్చిన వారితో సామాజిక సేవ చేయించారు. కరోనా విస్తరించకుండా అనుసరించాల్సిన పద్ధతులతో కూడిన పోస్టర్లను రోడ్లపై వారితో ప్రదర్శింపజేశారు. కాగా, మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొనడం విశేషం. పల్లెల్లోనూ ఎవరూ ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రాలేదు. అత్యవసరమైతే తప్ప వ్యవసాయ పనులకు కూడా వెళ్లకపోవడం గమనార్హం. ఇక, పట్టణాలు, నగరాల్లో యథావిధిగా కర్ఫ్యూ పాటించారు. ఉదయం నుంచే గల్లీల్లో నిర్మానుష్య వాతావరణం కనిపించింది. చిన్న చిన్న సందుల్లో ఉండే దుకాణాలు సైతం బంద్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంమీద ఆదివారమంతా రాష్ట్రంలో అనవసర సంచారం లేకుండా ప్రజలు సామాజిక స్ఫూర్తిని చాటి చెప్పారు. (మీ స్ఫూర్తి.. స్వీయ నియంత్రణకు థ్యాంక్స్..) రాజకీయులకు ‘రిలీఫ్’.. బంద్లయినా, కర్ఫ్యూలయినా ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం రిలాక్స్ అయ్యారు. చాలాకాలం తర్వాత తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపారు. సీఎం కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాల్లో బిజీగా ఉండగా, రాష్ట్ర మంత్రులు ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొందరు మంత్రులు కూడా ప్రగతి భవన్లో సమీక్షలకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు. చప్పట్లకు జన నీరాజనం.. ఇక సాయంత్రం 5 గంటలకు బాల్కనీలు, కూడళ్లలోకి వచ్చి చప్పట్లు కొట్టడం ద్వారా ఐక్యతా సంకేతాన్ని చాటి చెప్పడం రాష్ట్ర ప్రజల నిబద్ధతను చాటిచెప్పింది. కేసీఆర్ ప్రగతిభవన్‌లో తన కుటుంబ సభ్యులు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, తన కార్యాలయ అధికారులతో కలసి చప్పట్లు కొట్టి... వైద్య, శానిటేషన్, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ తమిళిసై కూడా రాజ్‌భవన్‌లో తన సిబ్బందితో కలసి చప్పట్లు కొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార, సినీ ప్రముఖులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తమ కృతజ్ఞతలు పెద్ద ఎత్తున తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్ వరకు సాయంత్రం ఐదు గంటల సమయంలో మారుమోగిపోయింది. -
9 రోజులు పాటు రైళ్లు, బస్సులు బంద్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ప్రజా రవాణా వ్యవస్థ అధికారికంగా స్తంభించింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 రోజులు ప్రజా రవాణాకు బ్రేక్ పడింది. ఇటు రైళ్లు, అటు బస్సులు.. ఇన్ని రోజులపాటు ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఇదే తొలిసారి. రైల్వే వ్యవస్థ ప్రారంభమైన ఈ 174 ఏళ్లలో, రాష్ట్రంలో బస్సు రవాణా మొదలైన 8 దశాబ్దాల్లో పాలక వ్యవస్థనే స్తంభింపచేయటం తొలిసారి చోటు చేసుకుంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం రైళ్లు, బస్సులు నిలిచిపోగా, దాన్ని కొనసాగిస్తూ ఈనెల 31 వరకు లాక్డౌన్ చేయటంతో వచ్చే 9 రోజులు కూడా రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండవు. సాధారణంగా సమ్మెలు, హర్తాళ్లు, బంద్‌ల సమయంలో వీటిని నిలిపేయటం సహజం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగొద్దన్న ముందు జాగ్రత్త చర్యలతో అధికారులు వాటిని పాక్షికంగా నిలిపేస్తారు. ఇక సమ్మెల సమయంలో ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరిస్తే వాటిని నడిపే అవకాశం లేక నిలిపేస్తారు. కానీ ప్రభుత్వమే నిలిపేయటం, అది పది రోజులపాటు కొనసాగటం తొలిసారి. దేశ చరిత్రలో మహమ్మారులు ప్రబలటం గతంలోనూ చోటు చేసుకుంది. కానీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ప్రజా రవాణా వల్ల ఆ వ్యాధులు ప్రబలుతున్నాయన్న కారణంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. (కరోనాకు మరో ముగ్గురి బలి) నిపుణుల హెచ్చరికలతో.. రైళ్లలో వేల మంది ప్రయాణికులు అతి సమీపంలో ఉంటూ ప్రయాణించటం పెను విపత్తుకు కారణమవుతుందంటూ గత వారం రోజులుగా నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చటంతో మన దేశంలో కూడా ప్రమాద ఘంటికలు మోగాయి. ఇతర కొన్ని ప్రభావిత దేశాలతో పోలిస్తే మన దేశం కొంత సురక్షితంగానే అనిపించటంతో, ప్రమాదం పెరిగే లోపు మేల్కొనటం ఉత్తమమని నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. రైళ్లను నిలిపేస్తే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జన ప్రవాహం బాగా తగ్గి వైరస్ విస్తరించే అవకాశం అంతమేర తగ్గిపోతుందని వారు పేర్కొంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రైల్వే అధికారులు కూడా రైల్వే బోర్డు, రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (జయహో జనతా..) కానీ ఒకేసారి రైళ్లను ఆపితే ప్రజా రవాణా స్తంభించి తీవ్ర ఇబ్బందులు వస్తాయని కేంద్రం తటపటాయించింది. కానీ గత నాలుగు రోజులుగా సంభవిస్తున్న పరిణామాలు కేంద్రాన్ని ఆలోచించేలా చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటిలో స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉన్నప్పటికీ, విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తుండటం, నిత్యం రైళ్లలో అలాంటి వారిని తోటి ప్రయాణికులు గుర్తించి ఫిర్యాదు చేయటంలాంటివి దీనికి కారణం. పరిస్థితి ఇలాగే ఉంటే చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు వరస సమావేశాలు నిర్వహించిన రైల్వే శాఖ చివరకు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన పచ్చజెండా ఊపారు. ఇటు హైదరాబాద్‌లో ఉన్న 121 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా 31 వరకు నిలిపేయాలని నిర్ణయించారు. అన్ని బస్సులూ బంద్ అన్ని రైళ్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే రాష్ట్రం పరిధిలో ఆర్టీసీ బస్సులన్నింటిని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సమ్మె సమయంలో 52 రోజుల పాటు బస్సులు స్తంభించినా, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలతో కొన్నింటిని నడిపింది. ఇప్పుడు ఏకంగా 10 రోజులు పాటు వాటికి పూర్తి విరామం ఇచ్చింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం బస్సులన్నింటినీ డిపోలకే పరిమితం చేయగా, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ నెలాఖరు వరకు డిపోలకే పరిమితం చేయనున్నారు. రైల్వే సర్వీస్ : దేశ వ్యాప్తంగా : 13వేల రైళ్లు ద.మ.రై. పరిధిలో : 744 రైళ్లు రోజువారీ ప్రయాణికులు : 2.5 కోట్లు టీఎస్ఆర్టీసీ : మొత్తం బస్సులు : 9,600 రోజువారీ ప్రయాణికులు : 87 లక్షలు -
మీ స్ఫూర్తి.. స్వీయ నియంత్రణకు థ్యాంక్స్
♦కూరగాయలు, పాలు, కిరాణా షాపులు, ఎల్పీజీ, పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయి ♦తెల్లకార్డుదారులకు ఒక్కొక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం ♦వైన్ షాపులు మాత్రం మూసి ఉంటాయి ♦సరుకుల కోసం కుటుంబానికి రూ. 1,500 చొప్పున పంపిణీ సాక్షి, హైదరాబాద్ : ‘అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం–1897ను రాష్ట్రంలో ప్రయోగించాం. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం లాక్డౌన్లో ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దు. ఐదుగురికి మించి బయట గూమికూడొద్దు. ఈ నిబంధన చాలా సీరియస్‌గా ఉంటది. బయట కొచ్చిన వ్యక్తుల మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. ఇంటి కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసర, అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే బయటకు అనుమతిస్తారు. బయటకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు 2–3 రోజుల వస్తువులు తెచ్చుకోవాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రధాని పిలుపు మేరకు అత్యవసర సేవల సిబ్బందికి మద్దతు తెలుపుతూ ప్రగతి భవన్లో చప్పట్లు కొడుతున్న సీఎం కేసీఆర్ కోవిడ్–19 నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సమావేశమై చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. దయచేసి ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా చూపిన క్రమశిక్షణ, పట్టుదలను కచ్చితంగా మార్చి 31 వరకు చూపాలి. అప్పటివరకు ఎవరి ఇళ్లకే వారు పరిమితమై ఉంటే కరోనాను తరిమి కొట్టొచ్చు. మనం, మన కుటుంబాలు, మన పిల్లలు కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండొచ్చు. ఇవి సర్వజనుల హితం కోరి చెప్పే మాట కాబట్టి అందరూ తు.చ. తప్పకుండా పాటించాలి’అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారం రోజులపాటు ఎవరి ఇళ్లలో వారు ఉండి ఇళ్లలో చేసుకోవాల్సిన మొక్కలు నాటడం వంటి పనులు చక్కబెట్టుకుంటూ గడిపితే ఈ మహమ్మారి బాధ నుంచి తప్పించుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. అద్భుత దృశ్యం ఆవిష్కరణ.. ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా స్పందించి ఇళ్లకే పరిమితమయ్యారు. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఏదైతే నేను కోరానో దాన్ని గౌరవించారు. వ్యక్తుల మధ్య దూరాన్ని పాటిస్తూ ఇళ్లకే పరిమితమై వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రపంచ మానవాళికే తెలంగాణ అద్భుతమైన కంట్రిబ్యూషన్ చేసింది. మేమంతా ఒకటే. దేన్నైనా ఎదుర్కోగలమని సంఘీభావ సంకేతమిచ్చేందుకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలన్న పిలుపునకు సైతం ప్రజలు అద్భుతంగా స్పందించారు. బాల్కనీల్లో, రోడ్లపై, ఇళ్ల ముందుకు వచ్చి ప్రజలు అద్భుతంగా ఇందులో పాల్గొన్నారు. ఇంత సంఘీభావ ప్రదర్శన, ఐక్యత, విజ్ఞతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు పేరు పేరునా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. హైదరాబాద్, ముంబై నంబర్ వన్ స్థానంలో లాక్డౌన్ అయ్యాయని జాతీయ వార్తా చానళ్లు పేర్కొన్నాయి. (చదవండి : మరో ఆరుగురికి కరోనా పాజిటివ్..) జనతా కర్ఫ్యూతో ఆదివారం నిర్మానుష్యంగా మారిన అసెంబ్లీ పరిసర ప్రాంతం.. ప్రభుత్వ ఉద్యోగులకు... ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. విద్యుత్, వైద్య వంటి కొన్ని అత్యవసర శాఖల సిబ్బంది విధిగా 100 శాతం రావాల్సి ఉంటుంది. మిగిలిన శాఖల వారు 20 శాతం రొటేషన్ పద్ధతిలో హాజరు కావాలి. విద్యాశాఖకు సంబంధించి అన్ని కార్యకలాపాలను మూసేస్తున్నం. పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఉండదు. మార్చి 31 వరకు అన్నీ మూసివేతే. ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. ఇళ్లకే పౌష్టికాహారం.. అంగన్వాడీ కేంద్రాల్లో జనం గూమికూడితే సమస్య అని మూసేస్తున్నం. మహిళలు, చిన్న పిల్లలకు పోషకాహార లోపం రావొద్దని ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ చేస్తాం. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల వివరాలు సిద్ధం చేస్తున్నం. వారి కోసం ప్రత్యేకంగా అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేస్తున్నం. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను నెల వాయిదా వేయాలి. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో ఆరోగ్య స్థితిగతులపై ఆరోగ్యశాఖ మంత్రి బులెటిన్ విడుదల చేస్తరు. బీమారీ దిగుమతి బంద్... దేశీయ, అంతర్జాతీయంగా ఈ వైరస్ ద్వారా సంభవిస్తున్న పరిణామాలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సమావేశమై చర్చించింది. విదేశాల నుంచి ప్రయాణికుల రాక బంద్ కావడంతో ఆదివారం నుంచి ఓ ప్రమాదం తప్పిపోతోంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు బంద్ అయ్యాయి. షికాగో నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఒక విమానం ఇప్పటికే ఢిల్లీలో ల్యాండ్ అయింది. వస్తే ఒక ఫ్లైట్ శంషాబాద్‌కు వస్తది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బీమారీ అవస్థ ఈ రోజు నుంచి తప్పింది. అయితే దురదృష్టవశాత్తూ ఆదివారం కూడా ఐదు కోవిడ్–19 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 26కు (అప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సీఎం ఆ వివరాలు చెప్పారు. అధికారికంగా 6 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 27 మంది వైరస్ బారినపడ్డారు) చేరింది. వారందరూ కోలుకొని ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటున్నా. జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్: హైదరాబాద్ నాగార్జున సర్కిల్ అదృష్టవశాత్తూ స్థానికవ్యాప్తి లేదు రాష్ట్రంలో స్థానికంగా ఒకే వ్యక్తికి కరోనా సోకింది. అదృష్టవశాత్తూ రాష్ట్రంలో స్థానిక వ్యక్తులకు వ్యాధి వ్యాప్తి చెందడం లేదు. విదేశాల నుంచి వ్యక్తుల రాక నిలిచిపోయింది కాబట్టి ఇక్కడ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలపాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. మనకు ఎవరో వచ్చి సాయం చేసే సమయం కాదిది. మన కోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం అందరం పరితపించి పట్టుదలతో పని చేసుకోవాల్సిన పరిస్థితి. పాలు, కూరగాయలు ఓకే.. కూరగాయలు, పాలు, కిరాణా షాపులు తెరిచి ఉంటాయి. అయితే ఇంటికో వ్యక్తి మాత్రమే బయటకు వెళ్లి అవసరమైనవి కొనుగోలు చేయాలి. పాసులేవీ ఉండవు. ఇది కర్ఫ్యూ లాంటి పరిస్థితి కాదు. మద్యం దుకాణాలు మాత్రం బంద్ చేస్తరు. ఐటీ ఉద్యోగులకు ఇళ్ల నుంచి పనిచేసుకోవడానికి కంపెనీలు అనుమతించాయి. ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఐటీ కంపెనీలతో మాట్లాడి ఒప్పించారు. కలెక్టర్లకు విశేష అధికారాలు.. అంటురోగాల నియంత్రణ చట్టం కింద కలెక్టర్లు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లకు విశేష అధికారాలు కట్టబెట్టుతున్నం. ఏ జిల్లాలో ఏ వాహనాన్ని అయినా అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు. నా కారును సైతం ఆపి అత్యవసర పరిస్థితి ఉందని తీసుకెళ్లొచ్చు. మనకు ఇటలీ దుర్గతి రావొద్దు.. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,08,047 మందికి కరోనా వచ్చింది. కొత్తగా 3,557 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు కరోనాతో 13,069 మంది మరణించారు. ప్రధానంగా ఇటలీ దెబ్బతింటున్నది. వారంతట వారే చెడగొట్టుకున్నరు. రోజుకు ఐదారొందల మంది చనిపోతున్నరు. ఆ దుర్గతి మనకు రావొద్దంటే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష. ఇళ్లలోనే ఉండండి.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డాక్టర్లు, మున్సిపల్ అధికారులకు స్వయంగా రిపోర్టు చేయాలి. మీకు వ్యాధి ఉంటే తక్షణమే చికిత్స ప్రారంభిస్తరు. మీకు, సమాజానికి క్షేమం. మన దగ్గర 800 మంది హోం క్వారెంటైన్లో ఉన్నరు. వారందరికీ స్టాంప్ వేసి పంపాం. వారిలో కొందరు దుర్మార్గులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నరు. వారిని పట్టుకొని ప్రజలు రైళ్ల నుంచి దించేస్తున్నరు. ఒకాయనను ఆలేరు దగ్గర రైలులోంచి దించేశారు. రాష్ట్రమే లాక్డౌన్ అయింది.. ఎక్కడికీ వెళ్లలేరు. ఇది వినోద సమయం కాదు. దుఃఖ సమయం. దయచేసి ఆషామాషీగా తీసుకోకుండా అందరూ ఇళ్లలోనే ఉండాలి. ఒక వారం నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. భవిష్యత్తు తరాలను, భారత దేశాన్ని కాపాడుతుంది. మనలో ఎవరు బాగున్నరో తెలియదు. జగిత్యాల తల్లిదండ్రుల వల్లే కొడుక్కి రోగం సికింద్రాబాద్‌లో ఫస్ట్ లోకల్ ట్రాన్స్మిషన్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు క్వారంటైన్లో ఉండకుండా ఇంటికి వెళ్లి కొడుక్కి తగిలించారు. ఈరోజు కొడుక్కి ఆ బీమారీ అంటించింది వారే. కనీసం కన్నబిడ్డల మీద ప్రేమ ఉండకపోతే ఎలా? మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుంటామా? విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు ఇళ్లకు వెళ్లకుండా క్వారంటైన్‌కు వెళ్లండి. మిమ్మల్ని వైద్యులు పరీక్షించి స్టాంప్ వేసి ఇళ్లకు పంపిస్తరు. మీకోసం వందల కోట్లు ఖర్చు చేసి చికిత్స అందిస్తుంటే మీరు ఇలా చేస్తే ఎలా? విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు 6 వేల బృందాలు పనిచేస్తున్నాయి. కుక్కలు జోక్ చేసుకుంటున్నయి... బల్దియా సిబ్బంది సాధారణంగా కుక్కలను పట్టుకొని పోతారు. జనతా కర్ఫ్యూ రోజున రోడ్ల మీద మనుషులు కనబడలేదు. ‘మనుషులు ఏమయ్యారు. మునిసిపాలిటీవాళ్లు పట్టుకొనిపోయారా? అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో జోకులు వినిపిస్తున్నాయి. రవాణా బంద్... ప్రజారవాణా 100 శాతం మూసివేతే. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు రోడ్లపైకి రావొద్దు. రైళ్లను కూడా ఇప్పటికే బంద్ చేశారు. ప్రజలు గూమికూడొద్దనే ఈ నిర్ణయాలు. ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలి. అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నాం. కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే రవాణా వాహనాలను అనుమతిస్తరు. అన్ని ప్రజారవాణా వాహనాలపై నిషేధం. అత్యవసర వస్తువులు తప్ప రాష్ట్రంలో చీమ,దోమను కూడా రానీయం. అన్ని అత్యవసర వైద్య సేవలు ఉంటాయి. విద్యుత్, వాటర్ సప్లై, సివరేజీ సేవలు, ఎల్పీజీ, పెట్రోల్ బంకులకు అనుమతి ఉంటది. ఉచితంగా బియ్యం.. రూ. 1,500 కూలి పనులకు వెళ్లే నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నరు. సంక్షేమంలో మనం నంబర్ వన్‌లో ఉన్నం. బడ్జెట్లో సంక్షేమానికి రూ. 40 వేల కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నం. కాబట్టి నిరుపేదలు ఎట్టిపరిస్థితుల్లో ఆకలికి గురికాకూడదు. వారం రోజులకు సరిపడే సరుకులు మాత్రమే మనం ఇవ్వడం లేదు. వారంపాటు పనులు ఆగిపోతే మళ్లీ సాధారణ పరిస్థితికి రావాలంటే మరో 15 రోజులు పడుతుంది. కాబట్టి నెల రోజులకు సరిపడే రేషన్ బియ్యం మార్చి నెల బియ్యానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో కోటీ మూడు లక్షల కుటుంబాలుంటయి. 87.59 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులున్నయి. అందులో ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నం. తెల్ల కార్డుదారులకు ప్రతి నెలా లక్షా 50 వేల టన్నుల బియ్యం ఇస్తాం. ఇప్పుడు డబుల్ చేసి 12 కేజీలిస్తున్నం కాబట్టి 3 లక్షల 36 వేల టన్నులకుపైగా బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నం. దాని విలువ రూ. 1,103 కోట్లు. పప్పు, ఉప్పు, చింతపండు, నూనె వంటి సరుకులు కొనుక్కోవడానికి ప్రతి రేషన్‌కార్డుగల కుటుంబానికి రూ. 1,500 ఇస్తున్నాం. దీనికి రూ. 1,314 కోట్లు ఖర్చు అవుతున్నది. రెండింటికి కలిపి రూ. 2,417 కోట్లు విడుదల చేస్తున్నం. ప్రైవేటు ఉద్యోగులకు వారం జీతం ఎపిడమిక్ యాక్ట్–1897 ప్రకారం వారం రోజులు టోటల్ లాక్డౌన్ చేస్తున్న సందర్భంగా నిర్మాణ కార్మికులు, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లకు కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు ఈ కాలానికి సంబంధించిన వేతనాలను విధిగా చెల్లించాలి. ప్రభుత్వం సైతం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు విధిగా జీతాలు చెల్లిస్తుంది. ఒక విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు అందరూ బాధ్యత తీసుకోవాలి. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి. ప్రైవేటు ఉద్యోగులకూ యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి. మీ వ్యాపారానికే సహకరించే వారు కాబట్టి యాజమాన్యాలు వారిని ఆదుకోవాలి. ఈ చట్టం ప్రభుత్వానికి ఈ మేరకు అధికారం కల్పిస్తున్నది. రాజ్‌భవన్‌లో మార్మోగిన చప్పట్లు ఆదివారం వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలుపుతున్న గవర్నర్ తమిళిసై తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్–19 రోగులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజ్‌భవన్ పోర్టికో ముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ అనుమానిత రోగులు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అందరూ ఇళ్లకే పరిమితమై ఉండాలని పిలుపునిచ్చారు. -
మేము సైతం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు మేముసైతం అంటూ సినీ సెలబ్రిటీలు తమ మద్దతు తెలిపారు. ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు.. సాయంత్రం 5గంటలకు ఇంటి ఆవరణ ల్లోకి విచ్చేసి అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, వెంకటేష్, అల్లు అరవింద్, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు, మనోజ్, గోపీచంద్, రాజశేఖర్, వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, నాగబాబు, తమన్నా, చార్మీ, పూజా హెగ్డే, జీవిత, మంచు లక్ష్మి వంటి వారు చప్పట్లు కొడుతున్న, గంటలు మోగిస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులతో అల్లు అరవింద్, అల్లు అర్జున్ చార్మి, పూరి జగన్నాథ్ -
కరోనా ఎఫెక్ట్ : బాలీవుడ్ తారలు ఏం చేస్తున్నారంటే
రేపటి సీన్ పేపర్ ఎక్కడ? లొకేషన్ ఏమిటి? కాల్షీట్ ఎన్నింటికి? ఈ హడావిడిలో ఉండే బాలీవుడ్ తారలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. కరోనాతో కలత పడ్డారు. షూటింగ్‌లకు ఫుల్స్టాప్ పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు. భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ఒకరి స్పర్శతో మరొకరికి వ్యాపిస్తుందని, నలుగురిలో కలవడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తుండటంతో చాలామంది నటీనటులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నవారు ఊరికే ఉంటారా? ఏదో ఒక వ్యాపకంలో పడతారు. కొందరు బొమ్మలు వేస్తున్నారు. కొందరు పుస్తకాలు చదువుతున్నారు. కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. మరికొందరు పిల్లలతో గడుపుతున్నారు. కుటుంబంతో ఉండటం కూడా బాగుంది అని భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ తారలు తమ ‘నిర్బంధ వ్యాపకాలను’ అభిమానులతో పంచుకుంటున్నారు. కరిష్మా కపూర్ తన ఇంటి బాల్కనీలో చక్కటి ఫోజ్‌లో ఫొటో దిగి పోస్ట్ చేసింది. ‘ఈ సమయంలో మీరంతా ఆందోళన చెందుతూ ఉంటారు. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చికాకు పడుతుంటారు. అయితే ఇలా ఉన్నది మీరొక్కరే కాదు. ప్రపంచంలో అందరం ఉన్నాం. అందుకే ధైర్యంగా ఉందాం. ఆశావహంగా ఉందాం’ అని ఆమె రాసింది. ఇక ఆమె సోదరి కరీనా కపూర్ తన పాత అల్బమ్స్ తిరగేసే పనిలో పడింది. బుజ్జాయిగా ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ ‘ఎవరో దగ్గరికొస్తుంటే వద్దన్నట్టున్నా కదూ. ఈ కరోనా టైమ్‌కు సరిగ్గా సరిపోయే ఫోటో ఇది’ అని రాసింది. అలాగే ఆమె తన భర్త సైఫ్ అలీ ఖాన్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ‘ఒక వారం పాటు ‘బుక్’ అయ్యాడు’ అని కామెంట్ పెట్టింది. క్యాండిల్ లైట్ల వెలుతురులో పుస్తకాలు చదువుకుంటున్న సైఫ్ ఫొటోను చూసి చాలా మంది ముచ్చటపడుతున్నారు. బాల్కనీ నుంచి బయటకు మలైకా అరోరా తన పెంపుడు కుక్కతో కలిసి బాల్కనీలో కూచుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ‘ఇంట్లో ఉన్నాను. నా కొడుకు అర్హాన్ ఈ ఫొటో తీశాడు’ అని రాసుకుంది ఆమె. ఇక టాప్‌స్టార్ ఆలియా భట్ అయితే తాను చదువుతున్న పుస్తకం ఫొటో పెట్టి ‘స్టే హోమ్. ఫినిష్ ఏ బుక్’ అని రాసింది. ఆలియా భట్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఆమె తండ్రి మహేశ్ భట్ నుంచి వచ్చింది. మహేష్ భట్ ఎప్పుడు ఏ పుస్తకం కొన్నా దాని బిల్లు ఆలియా భట్టే చెల్లించాలని ఒక ఒప్పందం వారిద్దరి మధ్య ఉంది. మరోవైపు బొమ్మలు గీసే వాళ్లకు కూడా కొదవ లేదు. ‘అంధాధున్’, ‘డ్రీమ్‌గర్ల్’, ‘బాలా’ సినిమాలతో మంచి ఊపు మీదున్న ఆయుష్మాన్ ఖురానా తోచిన బొమ్మలు వేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ‘ఇంట్లో ఉండి మన టాలెంట్ అంతా చూపుదాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొందాం’ అని రాశాడతను. తండ్రీ కూతుళ్ల అల్లరి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంట్లో ఉండిపోయిన అక్షయ్ కుమార్ తన కూతురు నితారతో కలిసి అల్లరి చేస్తుంటే తాను రాయవలసిన పుస్తకం రాయలేకపోతున్నానని అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ఒక సరదా ఫొటో పోస్ట్ చేసింది. ఫొటోలో ఆమె ల్యాప్‌టాప్ కనిపిస్తూ ఉండగా దూరంగా లాన్లో అక్షయ్ కుమార్ తన కుమార్తెతో ఆటలాడుతున్నాడు. దీపికా పడుకోన్ మాత్రం ఈ ఊహించని ఖాళీ సమయాన్ని తన దేహ సంరక్షణ కోసం కేటాయిస్తోంది. ‘సెల్ఫ్ కేరింగ్‌లో ఉన్నాను’ అంటూ ఆమె ఒక ఫొటో పోస్ట్ చేసింది. ‘వార్డ్రోబ్లను కూడా క్లియర్ చేస్తున్నాను’ అని మరో ఫొటో పెట్టింది. ప్రియాంక చోప్రా మాత్రం తన కుక్క జినోతో గడుపుతోంది. ‘ఇంట్లో ఉండటానికి మించిన క్షేమం ఇప్పుడు లేదు. నా కుక్క ‘జినో’తో ముద్దుముచ్చట్లు సాగుతున్నాయి. సంతోషంగా ఉంది’ అని రాసిందామె. జినో జర్మన్ షపర్డ్ అట. తొలి వివాహ దినోత్సవం సందర్భంగా భర్తకు ఆ కుక్కను కానుకగా ఇచ్చిందట. కత్రినా కైఫ్ ఈ ఖాళీ సమయాలలో గిటార్ మీటే పనిలో పడితే, యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా పుస్తకాల పురుగుగా మారాడు. సల్మాన్ ఖాన్ బొమ్మలు వేసి వేళ్లకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు. మొత్తం మీద బాలీవుడ్ స్టార్లందరూ క్రమశిక్షణతో ఉంటూ తాము కరోనాను అంటించుకోకుండా, తమ వల్ల అది పది మందికి అంటకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మనందరం కూడా అత్యవసరం అనుకుంటే తప్ప కొన్నాళ్లు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉంటూనే పని చేస్తూ కాస్త సరదా సమయాలను కూడా దొంగిలించుకుందాం. బుక్ రీడింగ్ – సిద్దార్థ్ మల్హోత్రా గిటార్ ప్లే – కత్రినా కైఫ్ పెట్‌తో – ప్రియాంకా చోప్రా ఎండ వేళ – మలైకా అరోరా జాన్వీ కపూర్ సైఫ్ పుస్తక పఠనం బాల్కనీలో కరిష్మా దీపికా పదుకోన్ ఫేస్ మసాజ్ పాత ఆల్బమ్‌లో... కరీనా కపూర్ కంగనా రనౌత్ -
‘కరోనా’ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..
సాక్షి, విజయవాడ: ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ విజయవంతం చేశారని పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల కృషికి చప్పట్లతో అభినందనలు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. (తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు లాక్డౌన్) కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రాష్ట్రంలో పటిష్ట చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని సూచించారు. మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. విజయవాడలో ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు. (ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్డౌన్ : సీఎం జగన్) -
చప్పట్లతో మార్మోగిన యావత్ భారత్
-
మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్
-
మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర అవసరాల వస్తువుల కోసం బయటకు వెళ్లేందుకు కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించనున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే పట్టుదల చూపెట్టాలి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా స్పందించారని తెలిపారు. ప్రపంచ మానవాళికి తెలంగాణ ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచిందన్నారు. చప్పట్లతో అద్భుతంగా సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణలో ఆదివారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరందరు విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 26కు చేరిందన్నారు. స్థానికంగా ఒక్కరికే కరోనా సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం అందరు క్షేమంగా ఉన్నారని.. చికిత్స కొనసాగుతోందని తెలిపారు. హై లెవల్ కమిటీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిందన్నారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో.. విదేశాల నుంచి తెలంగాణకు ఎవరూ వచ్చే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఉన్నవారి నుంచి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోని స్థానికుల మధ్య వైరస్ వేగంగా వ్యాపించడం లేదని తెలిపారు. మనం కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం ఈరోజు చూపెట్టిన పట్టుదలనే మార్చి 31వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రేషన్‌కార్డుపై ఉచిత బియ్యం, రూ. 1500 అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం పాటించాలన్నారు. నెల రోజులకు సరిపడేలా తెల్లరేషన్ కార్డుదారులకు ఒకరికి 12 కిలోల బియ్యం చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా అందజేస్తామన్నారు. ఇతర సరుకులు కొనుగోలు కోసం తెల్లరేషన్‌కార్డుపై రూ. 1500 ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రానవసరం లేదన్నారు. అయితే అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు 100 శాతం విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన విభాగాలకు చెందిన 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ కూడా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్లు కూడా స్కూళ్లకు రానవసరం లేదన్నారు. మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.. కార్మికులు ఈ వారం రోజులు పాటు పనిచేయకున్నా యాజమాన్యం వేతనం ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేస్తునట్టు చెప్పారు. గర్భిణీల జాబితాను సిద్ధం చేస్తున్నామని.. వారి డెలివరీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయని చెప్పారు. అత్యవసరం కానీ శస్త్ర చికిత్సలు వాయిదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. మార్చి 31వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్నీ బంద్ చేస్తున్నట్టు చెప్పారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎవరూ రోడ్డు మీదకు రావొద్దన్నారు. తెలంగాణకు ఉన్న అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని ప్రకటించారు. కేవలం అత్యవసర సరుకులు తెచ్చే గూడ్స్ వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని తెలిపారు. ఆషామాషీగా తీసుకోవద్దు.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మాత్రమే బయట తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిబ్బందికి కూడా సేవలు అందించడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇటలీలో కరోనా మహమ్మారి బారినపడి ప్రతి రోజు వందల మంది ప్రజలు చనిపోతున్నారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు రావొద్దంటే మనకు మనమే నియంత్రణ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇది దు:ఖ సమయమని.. ఎవరూ దీనిని ఆషామాషీగా తీసుకుని బయట తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. విదేశాల నుంచి వచ్చినవాళ్ల ఇంటికి వెళొద్దని ప్రజలకు సూచించారు. మీ పిల్లలను వైరస్ బారినపడకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. క్వారంటైన్లో ఉన్నవారిని ప్రత్యేక బృందాలు ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. కరోనా నియంత్రణకు కేంద్రం, రాష్ట్రం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తప్పులు జరిగితే మీడియా కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. అత్యవసరాల చట్టం 1987 ప్రకారం అధికారులకు మెజిస్ట్రీరియల్ అధికారాలు కల్పిస్టున్నామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా అధికారులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇది పౌర బాధ్యతకు సంబంధించిన విషయమని అన్నారు. -
జనతా కర్ఫ్యూ : వారికి టాలీవుడ్ సలాం..
హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు మోదీ పిలుపు మద్దతుగా నిలిచి.. ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లతో అభినందనలు తెలిపిన వీడియోను కొందరు తెలుగు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనందరి కోసం పనిచేస్తున్నవారికి ప్రజలు బాల్కనీలో నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలుపడం గౌరవంగా ఉందని హీరో రామ్‌చరణ్ అన్నారు. మరో హీరో ఎన్టీఆర్ వైద్య, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి తన కుమారుడితో కలిసి చప్పట్లు, గంట కొట్టి అభినందనలు తెలిపారు. చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపిన మంచు మనోజ్.. వందేమాతరం అంటూ నినదించారు. మెగా ఫ్యామిలీ, మోహన్‌బాబు కుటుంబం, అల్లు ఫ్యామిలీ, రాజశేఖర్ -జీవిత ఫ్యామిలీ, శ్రీకాంత్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం, సుకుమార్ ఫామిలీ లు కూడా తమ చప్పట్లతో ప్రజల కోసం సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, అత్యవసర విభాగాల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఇంకా సినీ ప్రముఖులు చార్మి, శ్రీకాంత్, గుణశేఖర్, పూజా హెగ్డే, గోపిచంద్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, పవన్ కల్యాణ్, రమ్యకృష్ణ, కృష్ణవంశీ, నిఖిల్, విశ్వక్‌సేన్‌లు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. Spl thanks to all the Doctors,Nurses,Police,Army and many more serving the society. Gratitude. #jantacurfew pic.twitter.com/XhLW9jJ5Pc — Allu Arjun (@alluarjun) March 22, 2020 Anjana Devi garu, Chiranjeevi garu and family showing their appreciation and respect towards all the authorities and people in the medical field.#JanataCurfew #clapforourcarers pic.twitter.com/ET8fG6mpAa — Konidela Pro Company (@KonidelaPro) March 22, 2020 Grateful for all the healthworkers🙌🙏 pic.twitter.com/8OJCDJP9SF — Dr.Rajasekhar (@ActorRajasekhar) March 22, 2020 -
జనతా కర్ఫ్యూ : వారికి టాలీవుడ్ సలాం..
-
కరోనా ఎఫెక్ట్ : పలు రాష్ట్రాల్లో లాక్డౌన్!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు సిద్ధంకాగా, మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ మార్చి 27, మధ్యప్రదేశ్ మార్చి 24, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్లు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, యూపీ ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూను రేపటి వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి రెండో దశకు చేరుకోవటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నియంత్రణా చర్యలను వేగవంతం చేశాయి. ఈ నేఫథ్యంలోనే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు నిచ్చారు. చదవండి : చప్పట్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల సంఘీభావం కరోనాకు బలైన హీరోయిన్ తండ్రి -
చప్పట్లతో మార్మోగిన యావత్ భారత్
-
చప్పట్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల సంఘీభావం
-
చప్పట్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల సంఘీభావం
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. యావత్ భారతదేశం నిబద్ధతతో జనతా కర్ఫ్యూ పాటించింది.సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అత్యవసర సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఇళ్ల లోగిళ్లలో నిలబడి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి...వారందరికి సంఘీభావం ప్రకటించారు. వారికి నా సెల్యూట్ : సీఎం జగన్ అంకుఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జవాన్లు, పోలీసుతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నవారికి రుణపడి ఉంటామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. -
చప్పట్లతో మార్మోగిన యావత్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఇంటి బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు, గిన్నెలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం చప్పట్లు కొట్టి తమ దేశభక్తి చాటుకున్నారు. -
ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్డౌన్..?
-
ముందు జాగ్రత్తే అన్నింటికంటే ముఖ్యం
-
‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడం సంతోషం
సాక్షి, తిరుపతి: కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం కావడం సంతోషంగా ఉందని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి అన్నారు. ఆయన తిరుపతి నగర వీధుల్లో పర్యటించి ‘జనతా కర్ఫ్యూ’ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను దాచడం మంచిది కాదన్నారు. సోషల్ మీడియాలో వైరస్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలతో పాటు చట్టాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. బయట ప్రదేశాల నుంచి వచ్చిన వారిని రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ డేటాబేస్ ఆధారంగా విచారణ చేపడతామని ఆయన అన్నారు. విదేశాల నుంచి వస్తున్నవారు పారాసిటమాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల థర్మో స్కానర్‌లో టెంపరేచర్ తెలియక ఎయిర్‌పోర్టు తనిఖీల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారు బయటపడటం లేదన్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి చేస్తున్న ప్రచారంలో మీడియా పాత్ర చాలా బాగుందని ఆయన అభినందించారు. -
రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటాం
-
వ్యక్తిగత పరిశుభ్రతే రక్షణ కవచం
-
కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
సీఎం కీలక నిర్ణయం.. జనతా కర్ఫ్యూ కొనసాగింపు
సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూను రేపటి(సోమవారం) ఉదయం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. అంతేకాకుండా కరోనా కట్టడి అయ్యేవరకు రాష్ట్రంలోకి విదేశీ విమానాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 75కు పెరిగింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా స్టేజ్ 3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది? రెండో దశలో కరోనా: ఈ దశ దాటితే నియంత్రణ కష్టం -
‘వలంటీర్ల సత్తా ఏమిటో తెలిసింది’
సాక్షి, చిత్తూరు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. శుభ్రత పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజలందరూ కర్ఫ్యూలో పాల్గొన్నారని తెలిపారు. (కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష) గతంలో వలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కించపరిచారని.. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన వలంటీర్ల సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసిందన్నారు. ప్రజల ప్రాణాలను సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లే కాపాడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్య, ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. (ఈ రోజుతో అయిపోయిందని అనుకోవద్దు) -
కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై ఈ సాయంత్రం 5 గంటలకు మీడియాతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. జనతా కర్ఫ్యూ పై ప్రజల అపూర్వ స్పందన, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడతారు. చదవండి : అప్రమత్తంగా ఉందాం -
జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్ ఖాన్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్-19 (కరోనా వైరస్) నివారణకు పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన అభిమానులకు తెలిపారు. ఈ మేరకు సల్మాన్.. తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘బస్సులు, రైళ్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దు. ‘జనతా కర్ఫ్యూ’ అనేది ప్రభుత్వం సెలవు కాదు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. బయటకు తిరగకుండా స్వియ నియంత్రణ కలిగి ఉండాలి’ అని సల్మాన్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘మాస్కులు ధరించాలి. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచు చేతులు శుభ్రపరుచుకోవాలి. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. స్వియ నియంత్రణతో వైరస్ వ్యాప్తి నుంచి రక్షించుకోవడంతోపాటు అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు’ అని సల్మాన్ ట్విటర్లో తెలిపారు. (దేశంలో 324కి చేరిన కరోనా కేసులు) కంటికి కనిపించని మహమ్మారిపై యుద్ధానికి కేంద్రం నడుం బిగించింది. ప్రజల సంపూర్ణ సహకారంతో చికిత్స లేని కరోనా వైరస్‌ను తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు అయ్యాయి. ఇప్పటికే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. -
ఈ రోజుతో అయిపోయిందని అనుకోవద్దు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ విషయంలో ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ సూచనలు, వ్యక్తిగత పరిశుభ్రత పాఠించాలి. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ ఒక్క రోజుతో అయిపోయిందని అనుకోవద్దు. రేపటి నుండి కూడా ముందు జాగ్రత్తలు అందరూ పాటించాలి. ప్రభుత్వం అండగా ఉంది.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. -
విశాఖలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
-
గుంటూరులో జనతా కర్ఫ్యూ
-
కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా...
-
కర్ఫ్యూ తెలిసి కూడా బయటకు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో రహదారులన్నీ బోసిపోయాయి. అయితే, కొన్ని చోట్ల ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈనేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా బయటకు ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. వారిని తిరిగి వెనక్కి పంపేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యూ. ప్రజలందరూ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలి. అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావద్దు. సైబరాబాద్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రోడ్లపైకి ఎవరు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేస్తున్నాం. రేపు ఆరు గంటల వరకు ప్రజలు ఇదే రీతిలో సహకరించాలి’అని పేర్కొన్నారు. -
ఏపీలో 3 జిల్లాల లాక్‌డౌన్‌కు కేంద్రం సూచన
కోవిడ్-19 (కరోనా వైరస్) నివారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. సామాజిక దూరం పాటిస్తేనే భారత్ కోవిడ్ పోరులో విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని ప్రధాని మోదీ కోరారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జనతా కర్ఫ్యూపై లైవ్ అప్డేట్స్.. జయహో జనతా : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏపీలో మూడు జిల్లాలను లాక్డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లాక్డౌన్ జాబితాలో ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో 75 జిల్లాలో కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. మార్చి 31 వరకు ఈ లాక్డౌన్ కొనసాగనున్నట్టు తెలిపింది. విజయవాడ ప్రజలంతా జనతా కర్ఫ్యూ భాగమయ్యారు. అపార్ట్మెంట్లలోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ మార్నింగ్ వాక్ చేసేవారితో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జనతా కర్ఫ్యూతో బోసిపోయింది. ప్రకాశం వాసులు జనతా కర్ఫ్యూకు జైకొట్టారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ఏపీలో ‘జనతా కర్ఫ్యూ’ ఏపీలో సమన్వయంతో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చందంగా సేవలు నిలిపివేసిన పెట్రోల్ బంకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్టాండ్లలో నిలిచిపోయిన బస్సు సర్వీసులు విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు నగరాలతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్ మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచారం అధికంగా వున్న ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్, పంచాయతీ కార్మికులు విజయవాడలోని ఆర్టీఏ అధికారులు తాత్కాలికంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను నిలిపివేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పిల్లలు, గర్భిణీలకు ఇళ్ళకే పోషకాహారం పంపిణీ చేస్తున్నారు. ‘జనతా కర్ఫ్యూ’ కారణంగా ఎక్సైజ్ శాఖ డ్రై డేగా ప్రకటించింది. ఎక్సైజ్ శాఖ.. ఎక్సైజ్ చట్టం 20(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూత పడ్డాయి. పర్యాటక ప్రాంతాలను తాత్కలికంగా అధికారులు మూసివేశారు. బొర్రా గుహలు, శ్రీశైలం రోప్‌వే, విజయవాడ భవానీద్వీపం తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పర్యాటకులకు అనుమతిని అధికారులు నిరాకరించారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులకు అనుమతి రద్దు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులను స్వచ్చందంగా రద్దు చేశాయి. ‘జనతా కర్ఫ్యూ’ కు మద్దతుగా హోల్ సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. విజయవాడలోని వస్త్రలత మార్కెట్‌ను 31వరకు మూసి వేయనున్నట్లు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్లలో స్వచ్చందంగా రైతులు, వ్యాపారులు ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. రాష్ట్రం వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నీలం సాహ్ని పేర్కొన్నారు. వైద్య శాఖ నిరంతరం పనిచేస్తోందని ఆమె తెలిపారు. జనవరి 17 నుంచి కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామని నీలం సాహ్ని చెప్పారు. ప్రజలందరూ ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు కూడా సహకరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం అదేశాలిస్తున్నారని నీలం సాహ్ని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని సచివాలయాల, వాలంటీర్ల ద్వారా గుర్తించామని ఆమె పేర్కొన్నారు. ప్రతి విదేశి ప్రయనికుడిని ఐసోలాషన్‌లో ఉంచుతున్నామని చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఆసుపత్రులలో ఐసోలాషన్ వార్డులను ఇంకా పెంచుతామని ఆమె చెప్పారు. ప్రజలు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీలం సాహ్ని తెలిపారు. విజయవాడ నగరంలో కోవిడ్-19( కరోనా వైరస్) పాజిటివ్ కేసు నమోదుకావడంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజవాడలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైదని తెలిపారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్లలో మెడికల్ చెకప్‌లు చేశామని ఆయన చెప్పారు. అనుమానం ఉన్నవారు కంట్రోల్ రూంకి కాల్ చేయాలని ఆయన సూచించారు. కంట్రోల్ రూం నంబర్ 7995244260ను విడుదల చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్చందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై ఈ సాయంత్రం 5 గంటలకు మీడియాతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. జనతా కర్ఫ్యూ పై ప్రజల అపూర్వ స్పందన, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడతారు. -
బోసిపోయిన పట్టణ ప్రధాన కూడళ్లు
-
జయహో జనతా
-
హైదరాబాద్ ప్రధాన రోడ్లన్నీ ఖాళీ
-
జనతా కర్ఫ్యూ పాట
-
అలా కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది?
-
ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!
సాక్షి, చెన్నై: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు. అలా కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లల పరీక్షలకు ఫీజులు కట్టాలి. దానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది అని ప్రజలు బాధపడుతున్నారా, అవన్నీ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యం అని నటుడు కమలహాసన్ ప్రజల నుద్దేశించి కరోనాపై అవగాహన కలిగించేలా వీడియోను విడుదల చేశారు. కరోనా ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఇదే మాట. ప్రజలను భయకంపితం చేస్తున్న కరోనాను అధికమించడానికి కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా ప్రజలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. అందులో కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన 22న జనతా కర్ఫ్యూను విధించారు. ప్రజలెవరూ బయటకు రావద్దని, ఇంట్లోనే గడపాలని చెప్పారు. అయితే ప్రధాని జనతా కర్ఫూకు సర్వత్రా స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు కమలహాసన్ కరోనాపై అవగాహన కలిగించి, వారి భయాన్ని పోగొట్టే విధంగా ఒక వీడియోను శనివారం విడుదల చేశారు. చదవండి: కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అందులో ఏమిటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు? ఊరికే కూర్చుంటే పూట ఎలా గడుస్తుంది? మార్చి, ఏప్రిల్‌లో పిల్లల పరీక్షలకు ఫీజు ఎలా కట్టాలి? దుకాణాలు కూడా బంద్ అంటున్నారు. చేతిలో డబ్బు కూడా లేదు ఏం చేయాలని అని చాలా మంది అనుకోవచ్చు. అయితే అవన్నీ చేయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి, అందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇంట్లోనే ఉండండి. ఈ రెండు వారాలు కుటుంబసభ్యులతో గడపండి. పుస్తకాలు చదువుకోండి, ఇంట్లో వంటలు కూడా చేయవచ్చు. ఇష్టమైన చిత్రాలను ఇంట్లోనే చూడండి, సంగీతంపై మక్కువ ఉంటే దాన్ని వినండి. ఇంట్లోని పెద్దలతో గడపండి. పిల్లల్ని చదివించుకోండి అని కమలహాసన్ ఆ వీడియోలో ప్రజలకు హితవుపలికారు. చదవండి: కరోనా: పారాసిట్మాల్తో అద్భుత ఫలితం -
ఆ పాపకు కరోనా టెస్ట్ నెగెటివ్..
గౌహతి : అసోంలో అనుమానిత కోవిడ్-19 కేసుగా నమోదైన నాలుగేళ్ల చిన్నారికి రెండో సారి నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌గా తేలడంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తల్లి, సోదరితో కలిసి గురువారం రైలులో గురువారం అసోంకు వచ్చిన పాపకు జోర్హాత్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే దిబ్రూగర్ జిల్లాలోని లహోవల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు చెందిన ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రానికి పాప శాంపిల్స్ పంపగా అక్కడ నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. పాపకు ఐసీఎంఆర్ ప్రాంతీయ కేంద్రంలో నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 నెగెటివ్‌గా వచ్చిందని జోహ్రాత్ డిప్యూటీ కమిషనర్ రోష్నీ అపరంజి కొరాటి తెలిపారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 315కు చేరినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతవరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు. చదవండి : తినడం కంటే కొనడం ఎక్కువైంది -
రద్దైన 2,400 రైల్వే సర్వీసులు
-
పోర్టులో నిలిచిపోయిన సేవలు
-
జనతా కర్ఫ్యూ: నీ సేవలకు సలాం!
కంటికి కనిపించని మహమ్మారిపై యుద్ధానికి కేంద్రం నడుం బిగించింది. ప్రజల సంపూర్ణ సహకారంతో చికిత్స లేని కరోనా వైరస్‌ను తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తేనే భారత్ కోవిడ్‌పై పోరులో విజయవంతమవుందని ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని కోరారు. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు చేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో జాతీయ స్థాయిలో జనతా కర్ఫ్యూపై లైవ్ అప్డేట్స్.. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, మిగతా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది. దేశంలో కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో నిత్యావసర వస్తువులు మినహా అన్ని సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే అంతరాష్ట్ర సర్వీసులను మార్చి 31 వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పంజాబ్‌లో ఆదివారం మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పంజాబ్‌లో మొత్తంగా కరోనా సోకినవారి సంఖ్య 21కి చేరింది. కరోనా కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఇక ప్రధాని పిలుపు మేరకు నేడు (జనతా కర్ఫ్యూ) మెట్రో సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ రైల్వే కూడా అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జనతా కర్ఫ్యూ పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అడ్డుకున్నారు. దయచేసి ఇళ్లళ్లలోని వెళ్లిపోండని పూలు అందించి విజ్ఞప్తి చేశారు. జయహో జనతా : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కరోనా భయాల నేపథ్యంలో షహీన్‌బాగ్‌లో పౌరసత్వ నిరసనకారులు చాలా మంది స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఇక జనతా కర్ఫ్యూ నేపథ్యంలో షహీన్‌బాగ్ వద్ద నిరసన కార్యక్రమాలకు ఐదుగురిని మాత్రమే అనుమతించారు. అయితే, నిరసనకారులు చేరుకునేలోపే కొందరు దుండగులు అక్కడ పెట్రోల్ బాంబు వేసి పారిపోయారు. స్థానికులు మంటల్ని ఆర్పివేశారు. నిర్మానుష్యంగా ముంబైలోని మహాత్మా ఫూలే బజార్.. పరిసర ప్రాంతాలు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెడిటేషన్ చేయాలని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. మెడిటేషన్‌కు ఇదే సరైన సమయమని, ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఇంగ్లిష్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో ఆన్లైన్ మెడిటేషన్ క్లాస్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. జనతా కర్ఫ్యూతో పాఠశాలలో మాదిరిగా దేశమంతా పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉందని తెలిపాడు. వచ్చే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ప్రజలంతా సామాజిక దూరాల్ని పాటించాలని సూచించారు. ఇటలీలోని రోమ్ నగరంలో చిక్కుకున్న 263 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. (చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!) పట్నాలో డ్యూటీలో ఉన్న పోలీసులు, మీడియా సిబ్బందికి రాకేశ్ చౌదరీ అనే వ్యక్తి శానిటైజర్ ఇచ్చి మద్దతుగా నిలిచాడు. దేశమంతా కరోనాపై పోరాటం చేస్తోందని, స్వచ్ఛదంగా ఈ పోరులో భాగమయ్యాయని రాకేశ్ తెలిపాడు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మహా నగరాల్లో అన్ని సబర్బన్ రైలు సర్వీసుల్ని ఆదివారం నిలిపివేశారు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. మార్చి 21 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్యాసింజర్ సర్వీసుల్ని నిలిపివేసింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచిమెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా రాత్రి 10 గంటలవరకు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 3,700 రైళ్లను రద్దు చేశారు. గో ఎయిర్ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా ఆదివారం అన్ని విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. భారత్‌లో అత్యధిక విమాన సర్వీసుల్ని నడిపే ఇండిగో 60% వరకు డొమెస్టిక్ సర్వీసుల్నినడుపుతోంది. ఎయిర్ విస్తా తన సర్వీసుల్ని బాగా కుదించింది. ఢిల్లీలో 15 లక్షల మంది వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేశారు. వారిలో కొందరు మార్చి 21 నుంచి 23 వరకు బంద్ పాటిస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు మద్దతుగా బస్సు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. -
కరోనా ఎఫెక్ట్: ఓ రాష్ట్రం పూర్తిగా షట్‌డౌన్
-
కరోనా ఎఫెక్ట్: దేశంలో తొలిసారి ఓ రాష్ట్రం షట్‌డౌన్
జైపూర్: కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం పూర్తిగా షట్ డౌన్ అయింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు షట్ డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. శనివారం అర్ధరాత్రి నుంచి రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రకటించారు. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్ అవుతాయని స్పష్టం చేశారు. పేదలకు ఆహార పొట్లాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం అర్హులైన వారందరికీ గోధుమలను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మహమ్మారిని నివారించే క్రమంలో తీసుకున్న చర్యలకు మీ అందరి సహకారం కావాలి. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉండటం కరోనా వైరస్ నియంత్రణలో అతి ముఖ్యమైన చర్య’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు. కాగా.. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా 6 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23కు పెరిగింది. చదవండి: తెలంగాణలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ -
తెలుగు రాష్ట్రాల జనజీవనం స్తంభించింది
-
విశాఖలో జనతా కర్ఫ్యూ
-
మహమ్మారిపై యుద్ధం
-
జనతా కర్ఫ్యూతో ముందే పెళ్లి
సాక్షి, శాంతినగర్ (అలంపూర్): ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. ఆదివారం జరగాల్సిన పెళ్లిని ఒక రోజు ముందుగానే చేసేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ రామచంద్రానగర్‌కు చెందిన యూసు చెల్లెలు నిఖా ఆదివారం జరగాల్సి వుంది. జనతాకర్ఫ్యూ దృష్ట్యా తనవంతు బాధ్యతగా యూసుఫ్ శనివారం సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తరువాత నిఖా చేశారు. దీంతో స్థానిక ముస్లింలతోపాటు ప్రజలు యూసుఫ్‌ను అభినందించారు. జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే కరోనా మహమ్మారిని దేశంలో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు. -
ఏపీ, తెలంగాణ సరిహద్దు మూసివేత
సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు. మహారాష్ట్ర సరిహద్దు బంద్.. మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. -
న్యూఢిల్లీలో స్తంభించిన రవాణా వ్యవస్థ
-
అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్
-
జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?
సాక్షి, చిత్తూరు: కరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినోటా ఇప్పుడు వినిపిస్తున్న పదం. ఈ వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఇంత వరకు టీకాలు కనిపెట్టలేదు. ఇలాంటి తరుణంలో కరోనాను నిలవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలు ఆదివారం పూర్తిగా జనతా కర్ఫ్యూలోకి వెళ్లడానికి అన్నివిధాలుగా సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకూ ఆ 14 గంటలు ఏం జరగబోతుంది..? బయటకొస్తే ఏమవుతుంది..? ఎందుకు 14 గంటలు ఇంట్లోనే ఉండాలి..? అందరూ అనుకుంటున్నట్లు హెలికాప్టర్ల ద్వారా ఆకాశంలో క్రిమిసంహార మందులు చల్లుతున్నారా..? అందుకే బయటకు రావొద్దంటున్నారా..? అబ్బో అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు కూడా ఉన్నాయి. మీరే చదవండి... ఆ 14 గంటలు ఎందుకంటే... మనిషి సగటు జీవితకాం 80 ఏళ్లు. ఏనుగు 70 ఏళ్లు. ఒంటె 50 ఏళ్లు. గుర్రం 40 ఏళ్లు. సింహం, జింక 35 ఏళ్లు. గాలాఫాగస్ తాబేలు జీవితకాలం 193 ఏళ్లు. చీమ మూడేళ్లు బతుకుతుంది. తేనెటీగ సంవత్సరం జీవిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు సైతం అంతం ఉంది. పుట్టిన ప్రతీజీవి గిట్టక తప్పదన్నట్లు ఎవ్వరికీ అంటుకోకుండా గాల్లో ఉండే కరోనా వైరస్ జీవితకాలం 12 గంటలు. ఈ కాలంలో దీన్ని ఎవ్వరూ ముట్టుకోకుంటే అక్కడికక్కడే చనిపోతుంది. అంటే ఓ 14 గంటల పాటు ప్రజలు ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల కరోనా వైరస్ దానికదే నశిస్తుంది. అందుకే ఆదివారం 14 గంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వాలు, అధికారులు ఆదేశాలు జారీచేశారు. చదవండి: తెలంగాణలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ అపోహలు.. వైరస్‌ను నిర్మూలించడానికి హెలికాప్టర్ల ద్వారా రసాయనాలు చల్లుతున్నారనేది వట్టి పుకార్లు మాత్రమే. మునిసిపాలిటీ వాళ్లు రాత్రుల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారని, ఇది శరీరంపై పడితే వ్యాధులు వస్తాయని చెప్పడం నిజంకాదు. జనతాకర్ఫ్యూను పాటించకుండా బయటకు వస్తే మాత్రం.. ఒకవేళ ఎక్కడైరా కరోనా వైరస్ ఉంటే అంటువ్యాధిలా వ్యాపించే అవకాశం ఉంది. ఇది గంటల వ్యవధిలో వేలాది మందికి పాకే ప్రమాదం ఉంది. అందకే అందరూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటే మంచిదని జనతా కర్ఫ్యూను విధించారు. అసలు ఉద్దేశం కరోనా వైరస్ ప్రస్తుతం మనదేశంలో రెండో దశలో ఉంది. మొదటి దశ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఈ వైరస్ బారినపడడం.. రెండో దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు తిరిగిన ప్రాంతాల్లో వైరస్ గాల్లోనే ఉంటుంది. ఈ దశలో వైరస్‌ను చంపగలిగితే పెద్ద ముప్పు తప్పినట్టు అవుతుంది. కానీ రెండో దశలో కరోనాను చంపకపోతే మూడో దశకు చేరుకుంటుంది. గాల్లో ఉన్న వైరస్ మనుషుల్లోకి చేరడం.. వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినపుడు, చేతులు కలిపినపుడు అంటువ్యాధిలా అందరికీ వైరస్ పాకడం జరగుతుంది. ఫలితంగా నాలుగో దశలో ఊహించని విధంగా ప్రాణనష్టం జరుగుతుంది. అందకే జనతా కర్ఫ్యూ ద్వారా 14 గంటల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్‌కు ఉన్న చైనులింకు లాంటి బంధం తెగిపోతుంది. ఎక్కడికక్కడే అది తుడిచిపెట్టుకునిపోతుంది. ఇదే జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం. -
తెలంగాణలో 5 జిల్లాల్లో లాక్డౌన్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో చేపట్టిన జనతా కర్ఫ్యూకు సానుకూలంగా స్పందన రావడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్య నగరం బోసిపోయింది. నిత్యం జనాలతో ఉండే ప్రధాన కూడళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లు అన్నీ ఖాళీగా, నిర్మానుష్యంగా మారాయి. ప్రజల నిబద్ధతతకు ఇదే తార్కాణమంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆ దృశ్యాలను ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో జనతా కర్ఫ్యూ లైవ్ అప్డేట్స్ ► తెలంగాణలో 5 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు కేంద్రం సూచన. మార్చి 31వరకూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో లాక్డౌన్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ►బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఆదివారం జింఖానా గ్రౌండ్ లో రెగ్యులర్ గా పిల్లలు ఆటలాడేవాళ్లు.. అయితే కర్ఫ్యూ నేపథ్యంలో జేబీఎస్, ప్యాట్నీ, పరేడ్ గ్రౌండ్, పారడైస్, కార్ఖానా, బోయిన్పల్లి రోడ్లు, ట్యాంక్ బండ్ అంతా వెలవెలబోతోంది. ►తెలంగాణలో 6 గంటలకే జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పూట ఎల్లప్పుడూ రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అతి తక్కువ వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నాయి. ఇక బస్సులు, మెట్రో రైళ్లు ఇప్పటికే డిపోలకు పరిమితమయ్యాయి. ► జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడూ జనాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతాలు కర్ఫ్యూ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారాయి. ►తెలంగాణలో ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయాలు, పెట్రోల్ బంకులకు మినహాయింపునిచ్చారు. మీడియాకు ఈ మినహాయింపు వర్తించనుంది. అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సీవరేజీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అత్యవసర సేవల కోసం ప్రతి ఆర్టీసీ డిపోలో 5 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మెట్రో స్టేషన్లలో 5 మెట్రో రైళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. -
ఇంట్లోనే ఉందాం
కోవిడ్ 19 (కరోనా వైరస్)ను అధిగమించడానికి ప్రధాని మోదీ నేడు (ఆదివారం) జనతా కర్ఫ్యూ (ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటిలోపలే ఉండటం)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పౌరులందరూ ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్‌ను అధిగమించాలని కొందరు స్టార్స్ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్ చేశారు. ఇటలీ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అక్కడ మరణాల సంఖ్య మెండుగా ఉంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకూడదు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో పాల్గొందాం. స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం పాటిద్దాం. – రజనీకాంత్ ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు కట్టుబడి ఉందాం. ఈ అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణ రీతిలో జాగ్రత్తులు తీసుకుందాం – కమల్ హాసన్ మోదీగారు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగస్వాములం అవుదాం. కరోనా విపత్కర పరిస్థితులను కట్టడి చేసేందుకు సామాజిక దూరాన్ని పాటిద్దాం – నాగార్జున ఈ ఆదివారం మార్చి 22 ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటిద్దాం – వెంకటేశ్ జనతా కర్ఫ్యూకు అందరం సపోర్ట్ చేద్దాం. కరోనా వైరస్‌పై సమిష్టిగా పోరాడదాం – మహేశ్‌బాబు కరోనా వైరస్‌పై పోరాడటానికి స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం.. ఈ రెండూ బలమైన ఆయుధాలు. కరోనాని జయించాలంటే అందరం మన వంతు కృషి చేయాలి. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. – ఎన్టీఆర్ జనతా కర్ఫ్యూలో భాగంగా పౌరులందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సమిష్టిగా పోరాడి కరోనాను అధిగమిద్దాం – రాజమౌళి మన ఇంట్లోకి ఎవరైనా వస్తే చెంబుతో నీళ్లిచ్చి, కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రమ్మంటాం, అలాంటి సంప్రదాయం మనది. అలాంటిది ఈ మహమ్మారి కరోనా వస్తానంటే రానిస్తామా? అందుకే మన దేశం కోసం, మనందరి ఆరోగ్యం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు చెప్పిన జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఈ రోజు ఉదయం 7గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లల్లో మనమే ఉంటూ బయటివారిని ఎవరినీ రానివ్వకుండా వీలైనంత పరిశుభ్రతను పాటించడం ఈ రోజు ముఖ్యోద్దేశ్యం. అలా ఇంట్లో ఉండి మన వంటలను మనమే చేసుకుని మనమే తింటూ ఇంట్లో ఉందాం. మనందరం ఒకటే అని నిరూపించటం కోసం సాయంకాలం 5 గంటలకు మన ఆనంద హర్హాతిరేకానికి గుర్తుగా మన దేశ పౌరులందరూ ఒక్కటే అనుకుని చేతులన్నీ శుభ్రం చేసుకొని ఒక్కసారి చప్పట్లు కొడదాం. అలా చేసి, మనందరం ఒకటే అని నిరూపిద్దాం. జైహింద్. – రాజేంద్రప్రసాద్ -
అన్నీ కిటకిటే!
సాక్షి నెట్వర్క్: దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించనున్న నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతుబజార్లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు. కరోనా భయాందోళనలతో వివిధ రాష్ట్రాల సరిహద్దులు మూసేస్తుండటం.. ఈ ప్రభావం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల కొరత ఏర్పడడమే కాక ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో నెల రోజులకు సరిపడా ఇంటి సామాన్లను కొనుగోలు చేసేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో కిటకిటలాడుతున్న విజయవాడలోని రైతుబజార్ - కర్నూలు జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూకు ఒకరోజు ముందే అన్ని నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని దుకాణాలు, సూపర్మార్కెట్లు కిటకిటలాడాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో రైతుబజార్లు కిక్కిరిసిపోయాయి. - శ్రీకాకుళం జిల్లాలో.. సరుకుల కొరత ఏర్పడుతుందన్న ప్రచారం జరగడంతో ప్రజలు కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల ముందు తండోపతండాలుగా జనం కనిపించారు. రైతుబజార్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. నెలకు సరిపడా సరుకులు కొంటున్న వారు కనిపించారు. దీంతో కొన్ని దుకాణాలు ఖాళీ అయిపోయాయి. - నిత్యావసరాల కొనుగోలుదారులతో అనంతపురం మార్కెట్ కూడా కిటకిటలాడింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. - నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ రద్దీగా మారింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరారు. - చిత్తూరు జిల్లాలోని ప్రధాన మార్కెట్లు, షాపింగ్ మాళ్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు కూడా జిల్లాలోని అన్ని పట్టణాల్లోని కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. కొందరు మాంసం ప్రియులు తమకు అవసరమైన వాటిని ఒకరోజు ముందే కొనుగోలు చేసి ఫ్రిజ్‌లలో భద్రపరుచుకున్నారు. - విశాఖ జిల్లాలోని అన్ని రైతుబజార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 31 వరకూ పలు దుకాణాలు, మాల్స్ మూసెయ్యాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. నిత్యావసరాల్ని నిల్వ చేసుకునేందుకు జనం ఎగబడ్డారు. నగరంలోని అన్ని సూపర్మార్కెట్లు మధ్యాహ్నం 12 కల్లా ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల వైన్ షాపుల వద్ద కూడా మద్యం ప్రియులు బారులుతీరారు. - తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కూడా రైతుబజార్లలో జనం పోటెత్తారు. వారం, పది రోజులకు సరిపడా కాయగూరలు కొనుగోలు చేశారు. నిత్యావసరాల కొనుగోళ్లకు జనం పోటెత్తడంతో అన్ని రకాల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డెట్టాల్, శానిటైజర్లనూ బాగా కొనుగోలుచేశారు. -
ఎగబాకుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఒకే రోజు భారత్ మొత్తమ్మీద 60 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 283కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వీరిలో వ్యాధి కారణంగా మరణించిన ఐదుగురితోపాటు 39 మంది విదేశీయులు (ఇటలీ 17, ఫిలిప్పీన్స్ 3, యూకే 2, కెనడా, ఇండోనేసియా, సింగపూర్ల నుంచి ఒక్కొక్కరు) కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరుకోగా ఇందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులతో కలిపి 40 మంది వ్యాధి బారిన పడ్డారు. ఢిల్లీలో ఒక విదేశీయుడితో కలిపి 26 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఒక విదేశీయుడు, 24 మంది, తెలంగాణలో 11 మంది విదేశీయులతో కలిపి 21 మంది, రాజస్తాన్‌లో ఇద్దరు విదేశీయులతో కలిపి 17 మంది హరియాణాలో 14 మంది విదేశీయులు, ముగ్గురు భారతీయులు వ్యాధి బారిన పడినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలో మొత్తం 15 మంది కోవిడ్ బాధితులు ఉండగా, పంజాబ్, లడాఖ్‌లలో 13 మంది చొప్పున, గుజరాత్లో ఏడుగురు, కశ్మీర్లో నలుగురు ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున వ్యాధి బారిన పడ్డారు. పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. విద్యా సంస్థల హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను అక్కడే ఉండనివ్వాలని, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలోని విద్యా సంస్థలకు సూచించింది. యూపీ మంత్రికి నెగెటివ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనిక కపూర్‌తో ఒక పార్టీలో గడిపిన ఉత్తరప్రదేశ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ కోవిడ్ బారిన పడలేదని శనివారం స్పష్టమైంది. కనిక కపూర్ పార్టీలో గడిపిన తర్వాత జై ప్రతాప్ ఇంటికే పరిమితం కాగా.. ఆయన రక్త నమూనాల్లో వైరస్ లేనట్లు పరీక్షలు స్పష్టం చేశాయి. జై ప్రతాప్‌తో సన్నిహితంగా మెలిగిన 28 మందికీ వ్యాధి సోకనట్లు స్పష్టమైందని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు. తనకు కరోనా సోకినట్లు కనిక కపూర్ ప్రకటించిన తరువాత ఆ గాయనితో సన్నిహితంగా మెలిగిన రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, కుమారుడు దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లడం తెల్సిందే. ఆన్లైన్లో విలేకరుల సమావేశం కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇకపై విలేకరుల సమావేశాలన్నింటినీ ఆన్లైన్ మార్గంలో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విలేకరులు వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. ‘కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న విలేకరులు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇకపై ఢిల్లీ ప్రభుత్వపు అన్ని విలేకరుల సమావేశాలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. ఢిల్లీలో పేదలను ఆదుకునేందుకు వచ్చే నెల యాభై శాతం రేషన్ సరుకులు ఎక్కువగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వితంతు, దివ్యాంగుల, వృద్ధాప్య పింఛన్లను రెట్టింపు చేశారు పలు రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో మార్చి 31వరకు నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు తెలపగా గోవా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో స్టార్హోటళ్లతోపాటు అన్నిచోట్ల మద్యం అమ్మకాలను నిలిపివేశారు. బెంగాల్లో అన్ని బార్లు, పబ్‌లు, హోటళ్లను బంద్ చేశారు. అత్యవసర వైద్యం కోసం శిక్షణ కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రతరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వ్యాధిపీడితులకు తగిన చికిత్స అందించేందుకు దేశంలోని వెయ్యి ప్రాంతాల్లో కొంతమందికి వీడియో ద్వారా శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశంపై ఆదివారం ఒక డమ్మీ డ్రిల్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయని, లక్షణాలు లేకున్నా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి ఐదు, 14వ రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని, డియోడరెంట్లు తయారు చేసే కంపెనీలు శానిటైజర్లు తయారు చేసేందుకు రాష్ట్రాలు అనుమతివ్వాలని సూచించారు. మాస్కుల వాడకంపై చాలా అపోహలు ఉన్నాయని, ఇవి అందరికీ అవసరం లేదని మనుషులకు కొంచెం దూరంగా ఉండటం వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమని వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 1700 మంది భారతీయులను తిరిగి తెచ్చిందని తెలిపారు. సామూహిక వ్యాప్తి జరుగుతోందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అలా జరిగినప్పుడు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కోవిడ్ బారిన పడ్డ వారికి సన్నిహితంగా ఉన్న స్ముఆరు 7000 మందిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణాలు వద్దు: మోదీ వలసదారులు సహా ప్రజలంతా ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని, కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేయవద్దని ప్రధాని కోరారు. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు చేసే వారు, తమతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని హెచ్చరించారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని కోరారు. నగరాల్లో కరోనా కేసులు బయటపడటంతో జనం భయంతో సొంతూళ్లకు వెళుతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మోదీ మాట్లాడారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లడం వల్ల వైరస్ ముప్పు మరింత పెరుగుతుందన్నారు. అలాగే, సొంతూళ్లకు వెళితే అక్కడి వారికి కూడా ఈ వ్యాప్తి విస్తరించే ప్రమాదముందని పేర్కొన్నారు. అందుకే, అత్యవసరమైతేనే బయటకు అడుగుపెట్టాలని దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
సామాజిక దూరం పాటిద్దాం
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజలను కోరారు. కోవిడ్ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో గవర్నర్ ఏం తెలిపారంటే.. - ఎవరికి వారు తమ దాకా రాదులే అనే భావనలో ఉండొద్దు. బయట ఎంత ఎక్కువగా తిరిగితే అంత నష్టం వాటిల్లుతుంది. మనతోపాటు కుటుంబీకులు, ఇరుగు పొరుగువారు వైరస్ బారిన పడే ప్రమాదముంది. - ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అందరూ ఇళ్లలోనే ఉండాలి. - ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి ఈ సందేశాన్ని చేరవేసి చైతన్యవంతం చేయాలి. - జనతా కర్ఫ్యూ ఆవశ్యకతను స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటివి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. - ప్రతి చోటా సామాజిక దూరం పాటించాలి. కొన్ని వారాల పాటు ఇంటి నుంచే పనిచేయాలి. - మానవాళి మనుగడ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఉన్నతాధికారులతో సమీక్ష కాగా, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాగలమని చెప్పారు. రాజ్‌భవన్‌లో శనివారం కోవిడ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కోవిడ్‌పై రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం ప్రత్యేకంగా నియమించిన అధికారి సురేష్‌కుమార్‌తో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. -
దయచేసి వినండి
కంటికి కనిపించని శత్రువుపై సమర శంఖం.. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్‌పై సర్కార్ యుద్ధం.. సమూహాల నుంచి సమూహాలకు విస్తరించకుండా క్రిమి సంహారం.. కేంద్రం ఇచ్చిన పిలుపు విందాం. ప్రజల కోసం ప్రజలే నిర్వహించే జనతా కర్ఫ్యూ పాటిద్దాం. కరోనా నుంచి మనల్ని కాపాడుకుందాం. ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ప్యూ కొనసాగుతోంది. న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారికి చికిత్స లేదు. నివారణే మార్గం. ఇందుకు సామాజిక దూరం పాటించడానికి మించిన దారి లేదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యపరంగా అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాలకు రాకుండా సమూహాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పాటించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతీ ఒక్క పౌరుడి మీద ఉంది. ప్రతీ ఒక్కరిలోనూ ప్రభుత్వం ఎందుకింత కఠినమైన ఆంక్షలు విధిస్తోందో అవగాహన రావాలి. కేవలం ప్రజలే కాదు నాయకులు, సెలబ్రిటీలు కూడా జనతా కర్ఫ్యూ పాటించడానికి సిద్ధమయ్యారు. అత్యవసర సేవలు అందించే వైద్యులు, పోలీసులు, మీడియా ఈ కర్ఫ్యూ పరిధిలోకి రావు. వీరు మినహా యావత్ భారతావని స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతోంది. కరోనా వంటి మహమ్మారి సోకితే సొంత కుటుంబ సభ్యులే దూర దూరంగా ఉండే వేళ ఓర్పుతో, సహనంతో తమ ప్రియమైన వాళ్లని వదిలి వచ్చి మరీ రేయింబవళ్లు సేవలు చేస్తున్న వివిధ వర్గాలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. ప్రధాని పిలుపు మేరకు సరిగ్గా సాయంత్రం అయిదు గంటలకి అందరం వారి వారి ఇంటి బాల్కనీ నుంచి లేదంటే, ఇంటి బయట గుమ్మం దగ్గరకు వచ్చి అయిదు నిమిషాల సేపు గట్టిగా చప్పట్లు కొడదాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారికి ధన్యవాదాలు చెబుదాం. జనతా కర్ఫ్యూపై దృష్టి పెట్టండి.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా తమంతట తాముగా జనతా కర్ఫ్యూను పాటించాలని అజయ్ భల్లా శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి గుండె నిబ్బరంతో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, విమానయాన సిబ్బంది, మీడియా ప్రతినిధులు, బస్సు, రైలు, ఆటో డ్రైవర్లు, హోం డెలివరీ బాయ్స్‌కి తమ కృతజ్ఞతలు తెలుపుతూ సాయంత్రం అయిదు గంటలకి ప్రజలందరూ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లో నిల్చొని అయిదు నిమిషాల సేపు చప్పట్లు కొట్టాలని, లేదంటే ఇంట్లో ఉన్న బెల్స్ మోగించాలన్నారు. సమాచారం అందరికీ చేరేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భల్లా రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం అయిదు గంటలకి చప్పట్లు కొట్టాలన్న విషయాన్ని గుర్తు చేయడానికి స్థానిక సంస్థలు, అగ్నిమాపక సర్వీసులు, రక్షణ సిబ్బంది అదే సమయంలో సైరన్ మోగించాలని భల్లా ఆ లేఖలో కోరారు. ఎక్కడివన్నీ అక్కడే ► మార్చి 21 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్యాసింజర్ సర్వీసుల్ని నిలిపివేసింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా రాత్రి 10 గంటలవరకు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా 3,700 రైళ్లను రద్దు చేశారు. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మహా నగరాల్లో అన్ని సబర్బన్ రైలు సర్వీసుల్ని ఆదివారం నిలిపివేశారు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ► గో ఎయిర్ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా ఆదివారం అన్ని విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. భారత్‌లో అత్యధిక విమాన సర్వీసుల్ని నడిపే ఇండిగో 60% వరకు డొమెస్టిక్ సర్వీసుల్ని నడుపుతోంది. ఎయిర్ విస్తా తన సర్వీసుల్ని బాగా కుదించింది. ► ఉబెర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు కూడా ఎమర్జెన్సీ ఉన్నవారికే అందుబాటులో ఉంటాయి ► రాజధాని ఢిల్లీలో 95 వేల ఆటోరిక్షాలు ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించాయి. ► ఢిల్లీలో 15 లక్షల మంది వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. వారిలో కొందరు మార్చి 21 నుంచి 23 వరకు బంద్ పాటిస్తున్నారు. ► గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు మద్దతుగా బస్సు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. -
కలి‘విడి’గా కరోనాపై యుద్ధం
స్వచ్ఛందంగా పాల్గొందాం జనతా కర్ఫ్యూ ద్వారా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం. ప్రజలు ఎవరూ బయటకు రావద్దు. ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోండి. సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలు బయటకు వచ్చి కోవిడ్ నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి మద్దతుగా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలుపుదాం. – సీఎం వైఎస్ జగన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకుఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బయటకు రావద్దని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో శనివారం ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను కర్ఫ్యూ సమయంలో తిరగకుండా రద్దు చేసింది. మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా ఆదివారం మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్రోల్ బంకులు కూడా మూసివేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి/సాక్షి, మచిలీపట్నం /విమానాశ్రయం (గన్నవరం): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు అత్యవసర సేవలు మినహా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎటువంటి సంస్థలైనా ఆదివారం తెరవరాదని జిల్లా యంత్రాంగాలు ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బయటకు రావద్దని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో శనివారం ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది. అత్యవసర సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ నిలిపివేసి జనతా కర్ఫ్యూలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దు చేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను శనివారమే నిలిపివేశారు. సిటీ సర్వీసులను కూడా రద్దు చేశారు. పోలీసు, వైద్య సిబ్బంది, మెడికల్ సర్వీసులు, విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది, పాలు వంటి నిత్యావసర వస్తువులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా సర్వీసులన్నింటినీ నిలిపివేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంది. మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా ఆదివారం మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్రోల్ బంకులు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు. ఇంటికే పరిమితమైతే.. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం 14 గంటల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. దీనివల్ల స్వీయ రక్షణ పొందడమే కాకుండా వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి సోకకుండా కాపాడిన వారు అవుతారని చెబుతున్నారు. కరోనా మహమ్మారిని పారదోలడానికి ప్రతీ ఒక్కరు జనతా కర్ఫ్యూలో పాల్గొని భారతదేశం ఐక్యతను చాటిచెప్పాలి. ప్రధాని పిలుపు మేరకు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలు తమ ఇళ్ల ముంగిటకు వచ్చి 5 నిముషాల పాటు నిలబడి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి, ప్రజలకు, ఎమర్జెన్సీ సేవలందిస్తున్న వారికి మద్దతుగా చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ కృతజ్ఞతలు తెలియజేయాలి. సాయంత్రం ఐదు గంటలకు స్థానిక అధికారులు సైరన్ మోగిస్తారు. అప్పుడే ప్రజలు 5 నిముషాల పాటు బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మళ్లీ ఇళ్లలోకి వెళ్లిపోవాలి. ప్రధాన మంత్రి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు బస్సులన్నీ బంద్ జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. శనివారం సాయంత్రం నుంచే దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నాని చెప్పిన వివరాలు.. - ఆదివారం పల్లె వెలుగుతో సహా రాష్ట్రంలో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు తిరగదు. రాత్రి నుంచి దూర ప్రాంత సర్వీసులను పునరుద్ధరిస్తాం. - ప్రైవేటు సర్వీస్‌లను కూడా నిలిపేయాలని సంబంధిత ప్రైవేటు ఆపరేటర్లను కోరాం. - ఆటోలు, టెంపోల్లో ఇష్టమొచ్చినట్టుగా ప్రయాణికులను ఎక్కించుకుంటే చూస్తూ ఊరుకోం. - కరోనా కట్టడికి రూ. 200 కోట్లు కేటాయించాం. వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. - మీ ఇళ్లకు, ఇరుగుపొరుగు ఇళ్లకు విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే డయల్ 100కు లేదా సమీప సచివాలయ సిబ్బందికి లేదా వలంటీర్‌కు సమాచారం ఇవ్వాలి. స్తంభించనున్న రవాణా.. ‘జనతా కర్ఫ్యూ’ కారణంగా రాష్ట్రంలో రవాణా సేవలు మొత్తం స్తంభించిపోనున్నాయి. ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీలో 11 వేలకు పైగా బస్సులు డిపోలకు పరిమితం కానున్నాయి. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు కూడా టికెట్ బుకింగ్‌లు నిలిపేశారు. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కూడా ఏసీ సర్వీసుల్ని రద్దు చేసింది. వయో వృద్ధులకు ఇచ్చే 25% రాయితీని తాత్కాలికంగా రద్దు చేసింది. కొన్ని జాగ్రత్తలు.. - బస్సుల్లో ప్రయాణించే వారి మధ్య దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. - షేరింగ్ ఆటోలను తిప్పకుండా రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల్ని చేరవేసే వాహనాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేసేలా చర్యలు చేపట్టారు. - శనివారం మధ్యాహ్నం నుంచే రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద వాహనాలను అధికారులు నిలిపేస్తున్నారు. ఈ నెల 31వరకు తమ రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. - రాష్ట్రంలో ఓలా, ఉబెర్ వంటి షేరింగ్ సర్వీసులు కూడా నిలిపివేస్తున్నారు. తమిళనాడుకు నో ఎంట్రీ తడ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో ఇరురాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తడ, తమిళనాడు సరిహద్దులోని ఆరంబాకం పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆంధ్రా నుంచి తమిళనాడు వైపు వెళ్లే ప్రయాణికుల వాహనాలను జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. అత్యవసర సేవల వాహనాలను మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రా పోలీసులు బీవీ పాళెం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్టు వద్ద వైద్య సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేశారు. అనుమానితులకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, తమిళనాడు వైపు వెళ్లే వారు ప్రయాణాలను విరమించుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సూచించారు. ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతిస్తున్నారని, ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వారిని తమిళనాడు ప్రభుత్వం అనుమతించటం లేదన్నారు. 15 విమాన సర్వీసులు రద్దు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు నగరాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి నడిచే 15 విమాన సర్వీస్‌లను రద్దు చేశారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్‌జెట్‌కు చెందిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, వైజాగ్, తిరుపతి విమాన సర్వీస్‌లను ఆదివారం రద్దు చేసినట్లు తెలిపారు. ఎనిమిది విమాన సర్వీస్‌లు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. అందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
స్ట్రెస్ వద్దు... సినిమా చూడండి
కరోనా వార్తలు బెంబేలెత్తించవచ్చు. జనతా కర్ఫ్యూ మనం ఇంట్లోనే ఉండవలసిన బాధ్యతను గుర్తు చేయవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టవుతుంది. ఇలాంటి టైములో స్ట్రెస్‌ను పక్కన పెట్టండి. హాయిగా కుటుంబంతో కామెడీ సినిమాలు చూడండి. కామెడీ సీన్లు ప్లే చేసి హాయిగా నవ్వుకోండి. ‘కరోనా’కు రోగ నిరోధక శక్తిని చూస్తే భయం. హాస్యం అత్యంత పెద్ద రోగనిరోధక శక్తి. గొప్ప హెల్త్ టానిక్. ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదోయ్’ అంటాడు శకుని ‘మాయాబజార్’లో శర్మ, శాస్త్రిలను ఉద్దేశించి. వారు చేసిన బుద్ధిమాలిన పని ఏమిటి? యాదవుల విడిదికి వచ్చి, మగపెళ్లివారమన్న సంగతిని మరచి, సాక్షాత్తు సుయోధనుని ముందే ఆడపెళ్లివాళ్లను పొగడటం... వాళ్ల ఏర్పాట్లను చూసి నోరు వెళ్లబెట్టడం. పండితులంటే గొప్పవారని మన ఉద్దేశం. కాని పాండిత్యం వేరు, బుద్ధి వేరు అని ఈ సినిమాలో నవ్వు వచ్చేలా నీతి చెబుతాడు దర్శకుడు కె.వి.రెడ్డి. కొంచెం స్ట్రెస్ వదిలించుకోవడానికి ఆ సినిమాయో సీనో చూసేయండి. బాగుంటుంది. ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ సింపుల్ జస్టిస్’ అంటుంటాడు రమణారెడ్డి ‘మిస్సమ్మ’ సినిమాలో. సావిత్రి మీద కన్నేసిన ఈ మాయలమరాఠి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇచ్చిన అప్పును అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అతడో పెద్ద ఫోర్ట్వంటి. కానీ నోరు తెరిస్తే ‘జస్టిస్’ అని న్యాయం మాట్లాడుతుంటాడు. లోకంలో నిండా ఉన్నది ఇలాంటి మనుషులే అని రచయిత చక్రపాణి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నవ్విస్తూ చూపుతారు ‘మిస్సమ్మ’లో. చూడండి బాగుంటుంది. ‘బ్రేకులా... మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం... దొరకలేదు’ అంటాడు అక్కినేని సరాసరి తన డొక్కు కారుతో కాంచన, రాజశ్రీల కారును డాష్ కొట్టి. ‘ప్రేమించి చూడు’లో రెండు జంటలు, నాలుగు నవ్వులు ఉంటాయి. ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద... సాయము వలదా’ వంటి రసగుల్లాలు, ‘అందాలు తొంగి చూసే హా..హా..హా..’ వంటి పాల తాలికలు ఉంటాయి. ఈ సినిమాలోనే సినిమా పిచ్చోడు చలం వాళ్ల నాన్న రేలంగికి వల్లకాడు కథ చెప్పి భయపెడుతుంటాడు. రావికొండల రావు ‘తెలుగు మాష్టారు’ హాస్యం ఉంటుంది. సరదా సినిమా. ఇది ఖాళీ సమయం. చూసేయండి. భానుమతిని చాలా సినిమాల్లో ఇష్టంగా చూడొచ్చుగాని ‘మట్టిలో మాణిక్యం’లో ఇంకా ఇష్టంగా చూడొచ్చు. ఆమె వ్యంగ్యం అంతా ఆ సినిమాలో ఉంటుంది. మరిది చలంను కన్నబిడ్డలాగా కాపాడుకోవడంలో ఆమె చూపించే ఆరిందాతనం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంతో అమాయకంగా ఉండే చలం నటన, అతని స్నేహితుడిగా పద్మనాభం హాస్యం సినిమాను పరుగులెత్తిస్తాయి. జమున ఒక జాంపండులా ఉంటుంది. ‘నా మాటే నీ మాటై చదవాలి’ అని పాట కూడా పాడుతుంది. ఇంట్లోనే ఉండి హైదరాబాద్ చుట్టేయాలంటే ఈ సినిమా చూడొచ్చు. ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ పాడేయొచ్చు. రేడియో ప్రోగ్రామ్ వింటూ వంకాయ కూర చేద్దామనుకుంటాడు సీతాపతి. కానీ పక్క స్టేషన్లో యోగా క్లాస్ కూడా వస్తుంటుంది. రెండు స్టేషన్లూ జామ్ అవుతుంటాయి. దాంతో యోగా చేస్తూ వంకాయ కూర చేస్తూ నవ్విస్తాడు మనల్ని. ‘సీతాపతి సంసారం’ సినిమా మధ్యతరగతి గుమాస్తా బతుకులో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ఉన్న కంప్లయింట్లను లైటర్ వెయిన్‌లో చూపిస్తుంది. సంసారం పెద్ద కష్టం కాదు అని భార్య రోల్‌లోకి వచ్చిన సీతాపతి చాలా కామెడీ చేస్తాడు. చంద్రమోహన్, ప్రభ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త తీరుబడిగా ఉండే సమయం. చాలా కంప్లయింట్లు చేసుకునే మూడ్ కూడా వస్తుంది. ఆ మూడ్ వద్దు. అడ్జ్‌స్ట్ అవుతూ బతకడమే ముద్దు అని ‘సీతాపతి సంసారం’ చూసేయండి. అతనికి ఆరుగురు పిల్లలు. ఆమెకు అరడజను సంతానం. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. అతని పిల్లలు రౌడీ మూక. ఆమె పిల్లలు కిష్కింధ ఇలాక. ఈ పన్నెండు మంది కలిస్తే ఆ పెళ్లి ఎంత అల్లరిగిల్లరిగా, ఆ కాపురం ఎంత నవ్వులుపువ్వులుగా ఉంటుందో చెప్ప లేం. ‘రామదండు’ సినిమా ఇది. మురళీమోహన్, సరిత నటించారు. కె.బాలచందర్ దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ‘బండి కాదు మొండి ఇది సాయం పట్టండి’ పాట ఇందులోదే. ఇంట్లో పిల్లలు ఇప్పుడేం చేయాలో తెలియక కోతి పనులు చేస్తుంటారు. వారికి ఈ కోతి సినిమా చూపించండి. బుద్ధిగుంటారు. భలే నవ్వుకుంటారు. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ, పి.ఎన్.రామచంద్రరావు, శివ నాగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, విజయ భాస్కర్... వీరంతా తీసిన సినిమాలు తెలుగులో ఎన్నో స్ట్రెస్ బస్టర్స్‌గా ఉన్నాయి. ఎన్నో పాత్రలు నవ్వించి మనల్ని కాసేపు టెన్షన్స్ మర్చిపోయేలా చేస్తాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో కోపం వస్తే తల గోడలకేసి బాది క్రాకులు సృష్టించే సుత్తి వీరభద్రరావు, ‘ఆనందభైరవి’లో నవ్వొచ్చినా ఏడుపొచ్చినా కయ్యిన విజిల్ వేసే శ్రీలక్ష్మి, ‘ఎదురింటి మొగుడు–పక్కింటి పెళ్లాం’లో స్టాంపు అంటించడానికి కూడా సొంత ఉమ్మును వాడటానికి వెనుకాడే పిసినారి రాజేంద్రప్రసాద్, వాళ్లకూ వీళ్లకూ ఠస్సా ఇచ్చి వీడియోలైబ్రరీ పెట్టే ‘ఏప్రిల్ 1 విడుదల’ దివాకరం, ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడు రావు గోపాలరావు, అద్దె ఇంటి కోసం ఆడవేషం కట్టే ‘చిత్రం భళారే విచిత్రం’ నరేష్, ‘మనీ’లో ఖాన్‌దాదా, ‘శుభాకాంక్షలు’లో ‘చరణకింకిణులు గొల్లుగొల్లుమన’ పాడే గాయకుడు ఏ.వి.ఎస్, ‘నువ్వు నాకు నచ్చావ్’లో తల్లి మీద కవిత్వం చెప్పే ఎమోషనల్ కొడుకు ప్రకాష్ రాజ్... వీరంతా ఈ కరోనా కాలంలో కాసింత దృష్టి మళ్లించే ఔషధాలు... మందులు. కనుక స్ట్రెస్ మానండి. సినిమా చూడండి. – సాక్షి ఫ్యామిలీ -
జనతా కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో అమలు చేయనున్న 24 గంటల జనతా కర్ఫ్యూ సందర్భంగా ఈ కింది చర్యలను తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. - 22న ఉదయం 6 గంటల నుంచి 23న ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలు అవుతుంది. - జనతా కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని స్థానిక కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ ఎస్పీలు అప్పీల్ చేయాలి. - వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసు తదితర అత్యవసర సేవల సిబ్బంది బయట తిరగడానికి అనుమతిస్తారు. - అత్యవసర వైద్య సేవలకోసం పౌరులను బయటకు అనుమతిస్తారు. ఈ వ్యవధిలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవు. - బయటి రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు - మందులు, నిత్యావసరాలు, ఆహార పదార్థాల రవాణాకు అనుమతిస్తారు. అన్ని మాల్స్, షాపులు మూసివేయాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సహకరించాలి. - కోవిడ్–19కి వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి సంఘీభావంగా 22న సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగేలా కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ఎస్పీలు చర్యలు తీసుకోవాలి. - ప్రతి 4 గంటలకోసారి పరిస్థితులపై కలెక్టర్లు నివేదిక పంపాలి. కోవిడ్–19పై నిపుణుల కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్ కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలతో పాటు చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ కె.రాకేశ్ మిశ్రా, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి.గంగాధర్, హెచ్ఎంఆర్ఐ సీఈఓ బాలాజీ ఉట్ల ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
బయటకు వస్తే రూ. 1,000 జరిమానా
పెర్కిట్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథనిలో గ్రామస్తులు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ ప్రకటించింది. కరోనా వైరస్ నివారణకు అరికట్టడానికి ఆదివారం చేపట్టబోయే జనత కర్ఫ్యూకు గ్రామస్తులకు సహకరించాలని కమిటీ సూచించింది. -
ఎక్కడి రైళ్లు, బస్సులు అక్కడే
సాక్షి, హైదరాబాద్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి మోదీ పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది మధ్య బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేసింది. జనతా కర్ఫ్యూ మొదలయ్యే ముందు బయలుదేరిన రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక నగర పరిధిలో మా త్రం ప్రజల అత్యవసర ప్రయాణాల దృ ష్ట్యా 12 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం నడుపుతోంది. ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్ –ఫలక్‌నుమా రైలు, ఉ.6.50, 9.55, 1.00, 5.10Sకు ఫలక్ను మా–లింగంపల్లి మధ్య, 8.23, 11.30, 3.30, రాత్రి 8.45లకు లింగంపల్లి–ఫలక్‌నుమా, సాయంత్రం 6.50కి లింగంపల్లి–హైదరాబాద్, 7.35కి హైదరాబాద్–లింగంపల్లి, రాత్రి 10.30కి ఫలక్‌నుమా–సి కింద్రాబాద్ సర్వీసులు బయల్దేరతాయి. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవా రం ఉదయం 6 వరకు అన్ని బస్సులు ని లిచిపోనున్నాయి. అత్యవసరాలకు కొన్ని బస్సులు మాత్రం సిద్ధంగా ఉంటాయి. -
ఎక్కడచూసినా అవే బారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో 24 గంటల జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతు బజార్లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్లు, మాల్స్‌కు పరుగులు తీశారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా వివిధ రాష్ట్రా ల సరిహద్దులు మూసేస్తుండటం, ఈ ప్రభా వం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కూరగాయలతోపాటు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు ప్రభుత్వం అత్యవసర సేవలను దృష్టిలో పెట్టు కొని పెట్రోల్‌బంక్‌లకు మినహాయింపు ఇచ్చింది. అంబులెన్స్‌లు, పోలీసు, రెవెన్యూ వాహ నాలతో క్వారంటైన్ సేవలను దృష్టిలో పెట్టుకొ ని పెట్రోల్ బంకులను తెరిచే ఉంచనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషన ర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోసే యూనిట్లు 3–4 ఉంటే సిబ్బంది సంఖ్యను తగ్గించి ఒక్కో యూనిట్ మాత్రమే అందుబాటులో ఉం టుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 వేల పెట్రోల్ బంకుల్లో ఇదే విధానం ఉంటుందని పెట్రోల్ బంకు డీలర్ల సంఘం నేత దినేశ్‌రెడ్డి తెలిపారు. అయితే పెట్రోల్ ట్యాంకర్లు మా త్రం ఆదివారం ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో రోజూ 10 లక్షల లీటర్ల మేర పెట్రోల్, డీజిల్ అవసరాలు ఉంటాయని, ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన 3 వేల ట్యాంకర్లు, 12 వేల ఇతర రాష్ట్రాల ట్యాంకర్లు సరఫరా చేస్తుంటాయని, ఆదివారం వాటిని ఎక్కడికక్కడే నిలిపివేస్తామని ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్ వెల్లడించారు. ఇతరత్రా ఇబ్బందు లెదురైనా.. రాష్ట్రంలో వారానికి సరిపడా నిల్వలున్నాయని తెలిపారు. -
5 గంటలకు నేనూ చప్పట్లు కొడ్త...
సాక్షి, హైదరాబాద్ : ‘జనతా కర్ఫ్యూలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలె. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి శనివారం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు. అత్యవసర సేవలను మినహాయించి ఆదివారం టోటల్ షట్‌డౌన్ చేస్తున్నామన్నారు. జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని, 24 గంటలపాటు నియంత్రణ పాటించకపోతే ఏమీ సాధించలేమని చెప్పారు. 60 ఏళ్లు పోరాడి కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి సాధించుకున్న తెలంగాణ జాతి స్ఫూర్తిని చాటాలని, కరోనా వైరస్ తెలంగాణ వారిని ఏం చేయలేకపోయిందనే పేరు తెచ్చుకోవాలన్నారు. అందరం కలిస్తే తప్ప కోవిడ్–19 నివారణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటికి మనం ఇలా ఉన్నం. రేపు ఏమైతదో చెప్పలేం. రేపు విజృంభించవచ్చు కూడా. విజృంభించకూడదంటే నియంత్రణ పాటించడమే శ్రీరామరక్ష’అని కేసీఆర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే... చీమ చిటుక్కు మనకూడదు.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో చీమ చిటుక్కుమనకూడదు. 100 శాతం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు మూసేస్తున్నం. ఒక్క బస్సూ నడవదు. ముందుజాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితిలో వాడుకోవడానికి ప్రతి డిపోలో 5 బస్సులు, 10 మంది సిబ్బందితోపాటు హైదరాబాద్‌లో 5 మెట్రో రైళ్లను సిద్ధంగా ఉంచుతాం. వాటిని వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిని తరలించడానికి వాడుకుంటం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులనూ అనుమతించం. సరిహద్దుల్లోనే ఆపేస్తాం. ఎవరైనా వస్తే పోలీసులు పట్టుకుంటరు. కఠిన సమయంలో కఠినంగా ఉండాలి. సంకట పరిస్థితిలో స్వీయ నియంత్రణే కాపాడుతది. వర్తక, వాణిజ్య వర్గాలు దుకాణలు, మాల్స్‌ను స్వచ్ఛందంగా మూసేయాలి. నిత్యవసర వస్తువుల కొరత రాకూదని, చిన్న వ్యాపారాలు దెబ్బతిన వద్దని, మాంసం, చేపలు, కూరగాయాల దుకాణాల వంటి అసంఘటితరంగ వ్యాపారాలు దెబ్బతినవద్దని వాటిని బ్యాన్ చేస్తలేం. ఆదివారం ఒక్క రోజు మాత్రం అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలి. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయాలు, పెట్రోల్ బంకులు నడుపుకోవచ్చు. మీడియా మిత్రులు తిరగవచ్చు. అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సీవరేజీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేస్తరు. మిగిలిన వారందరూ స్వచ్ఛందంగా ఎవరికి వారే మూసేయాలి. మనం, మన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రపంచం, యావత్ మానవాళి కోసం 24 గంటలు ఏ వ్యక్తికావ్యక్తి కచ్చితంగా నియంత్రణ పాటించి ఇంట్లోనే ఉండాలి. ఇంటికి పనిమనుషులు, సేవకులు రావాలని అనుకోకండి. ఒక రోజు మీ పనులు మీరే చేసుకోండి. కూలీలు, కార్మికూలూ 24 గంటలు ఇళ్లకే పరిమితం కండి. ఇవన్నీ పాటిస్తే కరోనా ప్రమాదం మనకు రాదు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా ఈ పని చేయాలి. నియంత్రణ పాటించని దేశాలు చాలా ఇబ్బందికి గురయ్యాయి. 60 ఏళ్లు పైబడినవారు, 10 ఏళ్లలోపు పిల్లలు దయచేసి 2–3 వారాలు బయటకు రాకండి. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా చనిపోతున్నరు. 30, 40, 50 ఏళ్ల వారు, యువకుల మరణాలు లేవు. 5 గంటలకు నేనూ చప్పట్లు కొడ్త.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చిన ప్రధానిని అవహేళన చేసేలా కొందరు పనికిమాలిన వెధవలు వక్రబుద్దీతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిని అరెస్టు చేయాలి. ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదు. ఆయన మన ప్రధాని.. గౌరవించాలి. నేను కూడా 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడ్తా. మా కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తరు. ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ 2 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. మన ఐక్యతతో ఈ మహమ్మారి పారిపోవాలి. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సైరన్లు మోగించే ఏర్పాట్లు చేశాం. రాష్ట్రం నలుమాలలా ప్రజలు బయటకు వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు బంద్.. మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. (‘చెప్పిన మాట వినండి.. రేపు ఇంట్లోనే ఉందాం’) సీసీఎంబీలో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు.. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కోవిడ్–19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నేను చేసిన విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. రోగుల సంఖ్య పెరిగితే సీసీఎంబీ సేవలను వినియోగించుకుంటాం. ఆ సందర్భాలు ఏర్పడితే ఇళ్లకే రేషన్.. ప్రజలు బయటకు రాకూడని సందర్భాలు ఏర్పడితే ఇంటింటికీ రేషన్ మనమే వాహనాలు పెట్టి పంపాలి. ఎన్ని వాహనాలు అవసరమవుతాయి? ఎన్ని ఇళ్లకు పంపాలి అన్ని ఆలోచిస్తున్నం. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసయినా రేషన్ అందిస్తాం. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా తెలంగాణ బిడ్డలను కాపాడుకుంటాం. ప్రజలకు నయా పైసా కష్టం రానివ్వం. మందులు, నిత్యావసరాలు తదితరాలకు కేసీఆర్ బతికి ఉన్నంత వరకు 100 శాతం భరిస్తాం. రూ. 5 వేలు కోట్లు, రూ. 10 వేల కోట్లు ఖర్చయినా ప్రభుత్వమే ఆదుకుంటుంది. వైద్యులు, వైద్య సిబ్బందిని కాపాడుకోవాలి.. వైద్యులు, వైద్య సిబ్బందిని ఆరునూరైనా కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న వారికి అభినందిస్తున్నం. వైద్యులకు ఇన్ఫక్షన్ వస్తే మన పనైపోయినట్టే. ఇతర రాష్ట్రాల నుంచి మనకు వైద్యులు రమ్మంటే రారు. అందుకే వైద్యులకు అవసరమైన పీపీ యూనిట్లు తెప్పించాం. ఇంకా తెప్పిస్తున్నాం. ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నం. -
ఈ గృహనిర్బంధం సమాజహితానికి అవసరం
ప్రపంచ మహమ్మారిగా మారి విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పరిష్కార మార్గంగా నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 వరకు దేశమంతటా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని, ఆ విధంగా కరోనా వైరస్‌పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ప్రయోగశాలలు, పారిశుధ్య సిబ్బంది తదితరులకు కృతజ్ఞత తెల్పుకోవడానికి ఇదే చక్కటి మార్గమని ప్రధాని భావోద్వేగంతో చేసిన ప్రసంగం దేశ ప్రజ లను కదిలించింది. సాధారణ ప్రజానీకం ప్రధాని మాటను నూటికి నూరుపాళ్లు స్వీకరించి స్వచ్ఛందంగా ఇళ్లలోనే క్వారంటైన్ కావాలని నిర్ణయించుకున్నారు కూడా. కానీ మరోవైవు ముఖచిత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వారి కంటే అనుమానితులుగా ఏకాంతవాసానికి పరి మితం కావల్సి వస్తున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో 14 రోజుల పాటు ఇళ్లలో, క్వారంటైన్ కేంద్రాల్లో ఏకాంతవాసంలో ఉండటం అంటేనే వీరు ఊహించలేకపోతున్నారు. కరోనా అనుమానితుల జాబితాకు ఎక్కిన వారు, అక్కడ పరీక్షలో ఏమీ లేదని తేలి ఇళ్లకు వచ్చిన తర్వాత కరోనా వైరస్ లక్షణాలు సోకినవారు కూడా ఈ స్వయం ఏకాంతవాసం పట్ల బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టిన వారిలో కొందరు చెప్పాపెట్టకుండా పారిపోయారు. కుమారుడికి వైరస్ సోకిన విషయం తెలిసి కూడా ఇంటిలో క్వారంటైన్ చేయకుండా రైల్వే గెస్ట్ హౌస్‌లో ఉంచి మొత్తం సిబ్బందికి ప్రమాదాన్ని కలిగించిన రైల్వే అధికారిణి గురించి కూడా ఇటీవలే చదువుకున్నాం. ఢిల్లీలో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన కరోనా వైరస్ పీడితుడు తన ఒంటరితనాన్ని భరించలేకో, అవమానంగా భావించో తాను ఉంటున్న భవంతి పైనుంచి దుమికి చనిపోయాడు. ఇక విదేశాలనుంచి అడుగుపెట్టి ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నవారు కరీం నగర్ జిల్లాకేంద్రంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో నిర్బంధ ఏకాంతవాసం వల్ల మనుషుల్లో కలుగుతున్న మానసిక ప్రభావాలను సరిగా అంచనా వేయాల్సి ఉంటోంది. సమాజంతో బలీయమైన సంబంధాలు కలిగినవారు, నిత్యం సామాజిక సంబంధాల్లో ఉంటున్న వారు కరోనా నేపథ్యంలో తప్పనిసరై ఒంటరిగా ఉండాల్సి రావడం అనే భావననే తట్టుకోలేకపోతున్నారు. ఇది స్పష్టంగా గృహనిర్బంధమే. లేక ఐసోలేషన్ కేంద్రాల్లో తప్పనిసరి నిర్బంధమే. తాము నేరస్తులం కాకపోయినా, ఏ తప్పూ చేయకపోయినా ఈ కృత్రిమ జైలు జీవితం ఏమిటన్నది ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంటున్నవారిని కుంగదీస్తోంది. కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న వారి మానసిక ఆందోళనలు, ప్రతిఫలనాలను సానుభూతితో అర్థం చేసుకోవలసిందే. ఎందుకంటే మనిషి ప్రాథమికంగా సంఘజీవి. సోషల్‌గా ఉండటం, అందరితో కలివిడిగా ఉండటం తెలీకపోతే సమాజంలోనే జీవించడం రాదు. తనకు ఎవరూ లేరనుకోవడం ఒంటరితనం అయితే అందరూ ఉన్నా, తాత్కాలికంగా వారందరికీ దూరంగా పెట్టడం నిర్బంధ ఒంటరితనం. అందరూ ఉన్నా ఈ క్షణం నాకెవ్వరూ లేరు అనే నిరాశతోకూడిన ఒంటరితనం మరీ ప్రమాదకరం. ఒక మనిషిని ఒంటరిగా ఉంచ డం అంటే అతని స్వేచ్ఛను హరించడమే. అది మానసిక ఒత్తిడి కూడా. జైళ్లలో ఖైదీలు ఆచరించే కారాగార శిక్ష ఈ కోవకు చెందిందే. జైల్లో అయితే తప్పు చేసిన మని షికి ఏకాంతం కల్పించి, అతడి మానసిక పరివర్తనకు చేయూతనివ్వడం ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురాగలమన్న విశ్వాసం ఉంటుంది. ఈ ప్రవర్తనలో మార్పు వారు భావి జీవి తంలో మరింత ఎదగడానికి ఉపయోగపడుతుంది కానీ ఆ ఒంటరితనం అనుభవించే వ్యక్తి తానెందుకు ఇలా ఉండవలసి వస్తోంది అన్న ఆలోచనలోనే ఉంటారు. ముఖ్యంగా జీవితంపై ఆసక్తి తగ్గి, మెల్లిగా స్తబ్దత వైపు జరిగి నిర్మానుష్యమైపోతారు. కరోనా వైరస్ బాధితులనే తీసుకుందాం. విదేశాల నుంచి వచ్చినవారికి మొదటిరోజు జెట్ లాగ్ ఉంటుంది కాబట్టి, పూర్తిగా విశ్రాంతి అవసరం కాబట్టి క్వారంటైన్ చేసినా ఏమీ అనిపించదు. కానీ మర్నాటి నుంచి ఎలా అన్నదే సమస్య. స్వదేశంలో స్వజనానికి చేరువలో ఉండీ, కలవకుండా ఉండటం ఒక రకమైన ఒత్తిడి. పైగా కరోనా నుంచి తప్పించుకుని దేశాలు దాటి సొంత ఊరికి వస్తే అక్కడ వారిని గృహనిర్బంధంలో ఉంచడం, ఆ ఏకాంతవాస కేంద్రాల్లో వారిని మనుషులుగా గుర్తించకుండా వివక్ష ప్రదర్శించడం, కనీస సౌకర్యాలను కూడా అందించకపోవడం, సరైన వేళకు తిండి, నీరు కూడా అందించకపోవడం.. ఇవన్నీ జైల్లో ఖైదీలకంటే తమ పరిస్థితి ఘోరంగా ఉంది అనే మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది. రోజువారీ జీవితంలో 24 గంటలూ నాలుగు గోడలకే పరిమితమై ఉండటమనే ఆలోచనే మని షికి సరిపడదు. అందుకే ఒక ఆరోగ్యసమస్య తగ్గాలని ప్రయత్నించడంలో మొట్టమొదట చేపట్టాల్సిన ప్రక్రియ ఏమిటంటే ఆ అనారోగ్యం లేక వైరస్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం, ఇతరులకు తమ నుంచి అనారోగ్యం సోకకుండా నివారించడమే. కరోనా కారణంగా తప్పనిసరిగా ఇప్పుడు అమలవుతున్న ఒంటరితనానికి గురవుతున్నవారు ఇంట్లో ఉన్న అందరితో మాట్లాడాలి. బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు కనుక ప్రశాంతంగా కూర్చోవడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజుతో గాలి గట్టిగా పీల్చి కాసేపు అలాగే ఉంచుకుని వదలడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇష్టమైన సంగీతం వింటే ట్రాయిటోఫన్ రసాయనం ప్రేరేపితమై రక్తపోటును తగ్గిస్తుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒంటరితనం తాత్కాలిక సమస్య మాత్రమే. దీంతో పోలిస్తే మీ జీవితం శాశ్వతం కాబట్టి ప్రస్తుత సమస్యను, మీకు కలిగిన వ్యక్తిగత సంక్షోభాన్ని తట్టుకోగలమని విశ్వసించండి. చివరగా ఇతరులకు మేలు చేయడం ఒక కళ, అది సంతోషం కూడా. అదే వ్యక్తి ఆరోగ్యం. సమాజ ఆరోగ్యం కూడా. వ్యాసకర్త : జవహర్లాల్ నెహ్రూ . పి క్లినికల్ సైకాలజిస్టు మొబైల్ : 98480 36040 -
ఇరుగు వైరస్... పొరుగు వైరస్!
ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవకోటిలో మానవుడే మొనగాడని మనకొక గట్టి నమ్మకం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించామనీ, సమస్త విశ్వాన్ని పాదాక్రాంతం చేసుకోగల తెలివి తేటలు మానవజాతికి ఉన్నాయనుకునే వెర్రి విశ్వాసాన్ని కరోనా వైరస్ వెక్కిరిస్తున్నది. కంటికి కనిపించని ఒక సూక్ష్మప్రాణి. పూర్తి ప్రాణి కూడా కాదు. సగం ప్రాణే. ఒక డీఎన్ఏ పోగు. మనిషి జీవకణాల్లోకి దూరి, వాటిని నిర్వీర్యం చేస్తూ తనలాంటి పోగుల్ని వేల సంఖ్యలో పునరుత్పత్తి చేసుకుంటూ కబళించేస్తున్నది. ‘నా ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి వేలమంది పుట్టుకొస్తారన్న’ డైలాగ్ చందంగా మానవ శరీరాల్లో కరోనా చెలరేగిపోతున్నది. ఈ వైరస్ చైనా సరిహద్దులు దాటి గ్లోబలైజేషన్ ప్రారం భించగానే ఇరవయ్యేళ్ల సిరియా అంతర్యుద్ధం ఖామోష్ అన్నట్టుగా ఆగిపోయింది. అమెరికాతో ఒప్పందం కుదు ర్చుకొని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి సన్నద్ధమైన తాలిబాన్లు మంత్రించినట్టుగా స్తంభించిపోయారు. ట్రంప్ ఎన్నికల సన్నాహాలు ఆపేసి ‘ఐసోలేషన్’ను ఆశ్ర యించాడు. అలవికాని అహంకారంతో ఆకాశం వైపు మాత్రమే చూసే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు గజగజ వణికి పోతూ మోకాళ్లపై వంగి కూర్చొని చేతులు జోడించి కరోనాను ప్రాధేయపడుతున్నాయి. జెఫ్ బిజోస్, బిల్ గేట్స్, అంబానీ, జుకర్ బర్గ్‌లు కూడా ఒక రిక్షావాలా, గని కార్మికుడూ, వ్యవసాయ కూలీలాగానే కరోనాను చూసి ఝడుసుకుంటున్నారు. సర్వత్రా షట్‌డౌన్, లాక్డౌన్. కాలిఫోర్నియాకు తాళం, ఊపిరి స్తంభించిన యూరప్, ఇండియాలో జనతా కర్ఫ్యూ. ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెదొక దారి. ఆంధ్రప్రదే శ్లో ఎల్లో వైరస్‌గా ఇప్పటికే అపఖ్యాతిపాలై వున్న పొలిటికల్ వైరస్ కరోనాకు సమాంతరంగా చురుగ్గా కదులు తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా కరోనా వ్యాప్తిని బాగానే నియంత్రించగలిగింది కానీ, ఏపీ ఎల్లో వైరస్ మాత్రం హైదరాబాద్ మీదుగా ఢిల్లీ దాకా పాకింది. ప్రాథమికంగా ఇది పొలిటికల్ వైరస్ గానే ప్రారంభ మైనా, క్రమంగా రాజకీయ పార్టీలతో పాటు, మీడియా రంగంలోకి, రాజ్యాంగ వ్యవస్థల్లోకి చొరబడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి ప్రమాదకరంగా పరిణమిస్తు న్నది. ఎల్లో వైరస్ లక్షణాలున్న వారిని కూడా జనజీవన స్రవంతి నుంచి ఇప్పటికే ప్రజలు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచారు. అయినా సత్ఫలితాలు కనిపించడం లేదు. త్వరలో కొందరిని క్వారంటైన్ చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఎల్లో వైరస్ పాత నిర్వాకాలను కాస్సేపు పక్కనబెట్టి తాజాగా తలకెత్తుకున్న అఘాయిత్యాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి బాగా వివాదాస్పదమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేంత వరకు అంతా బాగానే వుంది. మార్చి 9వ తేదీ నాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు ప్రారంభ మయ్యాయి. 11 నుంచి 13 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నడిచింది. 11 నాడు ఎంపీటీసీ, జెడ్పీ టీసీలకు, 13వ తేదీ నాడు మునిసిపాలిటీలకు నామినే షన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరునెలలు ముందుగానే ఈ ఉగాది రోజున మహిళల పేరుతో దాదాపు 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం గడిచిన కొన్ని నెల లుగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అదికూడా బహిరంగంగా, పారదర్శకంగా జరిగింది. లబ్ధిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో నోటీస్ బోర్డుపై ఉంచారు. ఎంపిక కానివారు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి, అందులో అర్హతలున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించి, మరోసారి నోటీసు బోర్డుల్లోకి ఎక్కించారు. ఈరకంగా లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన వారెవరో ఊరందరికీ తెలుసు. కేవలం లాంఛనంగా ఉగాదినాడు వారికి పట్టాల ప్రదానం చేయవలసి ఉన్నది. తర్వాత వచ్చే నాలుగేళ్లలో వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించి ఇవ్వవలసి ఉన్నది. తీరా 14వ తేదీనాడు ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన తాఖీదు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తయిన తర్వాత ఎన్ని స్థానాలు ఏకగ్రీవమైనాయో కూడా తెలిసి పోయిన తర్వాత హఠాత్తుగా పదిహేనో తేదీ ఆదివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ముందుగానే సిద్ధం చేసుకున్న నోట్‌ను చదివి వినిపించారు. ఇందులో మొదటి అంశం కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తేదీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ యథాతథంగా వుంటుందన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో వుంటుందన్నారు. నామి నేషన్ల సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా రెండు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, మరికొందరు అధికారు లనూ బదిలీ చేయడం రెండో అంశం. ఈ ఆదేశాలను చూసిన వారికి సహజంగానే కొన్ని అనుమానాలు కలుగుతాయి. 1) కరోనా వైరస్ కారణంగానే ఎన్నికల వాయి దాకు నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే, ఆ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారు లతో గానీ, ఆరోగ్య శాఖ అధికారులతో గానీ ఎందుకు సమీక్షా సమావేశం నిర్వహించలేదు?. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్నను సంధించింది. 2) కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ మాత్రం కొనసాగుతుందని చెప్పడమేమిటి?. ప్రజాభి మానంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఎటు వంటి నిర్ణయమూ తీసుకోనీయకుండా నిరవధికంగా ఎలా నిరోధిస్తారు?. దీనివెనుక రాజకీయ కుట్ర దాగుం దని అధికార పక్షం ఆరోపిస్తున్నది. కుట్ర లేదని ఏ రకంగా సమర్థించగలరు? ఈ చర్యను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి కోడ్ ఎత్తి వేయాలని ఆదేశించిందంటే అర్థం ఏమిటి?. సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా అల్లర్లు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తే ఎన్నికల సంఘం అదే రోజు ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే మరుసటి రోజు. పైగా ఏ ఎన్నికల్లోనైనా సర్వసాధారణంగానే జరిగే చెదురు మదురు ఘటనల కంటే తక్కువగా ఈసారి గొడవలు రికార్డయ్యాయి. అయినా కేవలం తెలుగుదేశం పార్టీ ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకొని ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసిన తర్వాత అధికారుల బదిలీకి ఆదేశించడం వెనుక కూడా ఏదో ‘రాజకీయం’ వుందని వైఎస్సార్సీపీ ఆరోపణ. కరోనా విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహ రించింది. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున విస్తరించిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన 12 వేల మందిని గుర్తించగలిగారు. వీరిలో 90 శాతం మందికి వైద్య పరీ క్షలను కూడా పూర్తి చేయించారు. అనుమానిత కేసులను వైద్యుల పర్యవేక్షణలో వుంచారు. మిగతా వారిని ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. ఎన్నికల కమిషనర్ వివాదాస్పద వాయిదా నిర్ణయం తర్వాత మూడు రోజులకు అంటే 18వ తేదీనాడు ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఎన్నడూ ఎక్కడా కనీవినీ ఎరు గని హైడ్రామా చోటు చేసుకున్నది. కేంద్రం హోంశాఖ కార్యదర్శిని సంబోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మెయిల్ పంపించారనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన తీవ్ర ఆరోపణలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్‌లుగా వ్యవహరించే ఒక ఐదు చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లతో హడావుడి చేశాయి. టీడీపీకి తలగా, తోకగా వ్యవహరించే రెండు ప్రధాన పత్రికలు ఆ లేఖాంశాలను సంపూర్ణంగా కవర్ చేస్తూ బ్యానర్ స్టోరీగా వేశాయి. తల పత్రిక వార్త తోకలో ఈ వార్తను సదరు ఎన్నికల కమిషనర్ ధ్రువీకరించనే లేదని ఏకవాక్యాన్ని మురిపెంగా రాసుకు న్నది. ఆ రోజున ధ్రువీకరించని కమిషనర్ ఈరోజు దాకా ఖండించనూ లేదు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవీ, బాధ్యతా రహితమైనవి కూడా. వాడిన భాష అభ్యంతకరమైనదీ, జుగుప్సాకరమై నది కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి కలలోనైనా ఊహించలేని లేఖ అది. రాష్ట్ర నాయకత్వానికి ఫ్యాక్షన్ నేపథ్యం వుందనీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అలవాటు వుందనీ, తనకు కేంద్రం రక్షణ కల్పించాలని ఆ లేఖలో రాశారు. దీనిపై కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరణ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక ప్రజాదరణతో ఎన్నికైన ముఖ్యమంత్రిపై నిరాధారంగా చేసిన ఈ ఆరోపణ ఆయన పరువుప్రతిష్టలకు భంగకర మైనది. ఆయన వ్యక్తిత్వంపై జరిగిన ఘోరమైన హత్యా ప్రయత్నం లాంటిది. పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నిక కావడంపై ఆయన ఆశ్చర్యాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు వీలైనంతవరకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితేనే మంచిదన్న ఉద్దేశంతో 73, 74 రాజ్యాంగ సవరణల్లోనే ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రత్యేకంగా చేర్చారు. ఇక రాజకీయంగా చూస్తే జెడ్పీ టీసీలు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం కావడం కూడా అంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. 1972 అసెంబ్లీ ఎన్నికలో మన రాష్ట్రంలోనే 17 శాసనసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరా గాంధీ ప్రభ వెలిగిపోతున్న తరుణంలో ఆ ఎన్నికలు జరిగాయి. బలహీన ప్రతిపక్షం చేతులెత్తేయ డంతో సహజంగానే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఏకగ్రీవ మయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా డ్రాకో నియన్ ఆర్డినెన్స్‌గా అభివర్ణించడాన్ని ఎలా అర్థం చేసు కోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇలా రెండు మూడు అంశాలే కాదు. లేఖ మొత్తం ఒక రాజకీయ పార్టీ చౌకబారు ఆరోపణలు చేసిన చందంగానే సాగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో నంబర్ టూగా చలామణి అవుతున్న యువనేత ఆధ్వ ర్యంలోనే ఆ లేఖ తయారైందని, ఆయన ఆదేశాల ప్రకా రమే ఆ లేఖను ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారంలో పెట్టిందని తెలుస్తున్నది. ఇటువంటి రాజకీయ జిత్తులకు రాజ్యాంగబద్ధ సంస్థ వేదిక కావడం అత్యంత ప్రమాద కరమైన పరిణామం. ఐఏఎస్ అధికారిగా పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ పదవిని తనకిచ్చిన చంద్రబాబు పట్ల కృతజ్ఞతతోనే ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహ రిస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది. అంతే కాకుండా ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో ఒక కీలక పదవిని కూడా కట్టబెట్టారని తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా అమరావతి ప్రాంతంలోని ఐనవోలులో 500 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించిందట. గత ఏడాది మార్చి 13న ఆయన తన పేరు మీదనే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ ట్రిపుల్ బొనాంజా ఫలితంగానే ఇలాంటి అనారోగ్యకర సంప్రదాయం తలె త్తిందా? స్వయంగా ఆయన వివరణ ఇవ్వకపోతే జనం తప్పనిసరిగా ఔననే అనుకుంటారు. దేశ ప్రజలందరికీ కలవరం కలిగిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులకు, నర్సులకు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ సిబ్బందికి జేజేలు చెప్పాల్సిందే. విదేశాల్లో చిక్కుకొనిపోయిన వారిని చేరవేయడానికి శ్రమిస్తున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికీ అభినందనలు. సవాల్‌ను ఎదు ర్కొని తెగించి పోరాడుతున్న ప్రభుత్వ పారిశుద్ధ్య సిబ్బం దికి ప్రణామాలు. సంక్షోభ సమయంలో నిద్రాహారాలు మాని పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులకు, అధికారులకు, పోలీసులకు వందనం. ప్రభుత్వరంగ సంస్థలను కించప రిచే వారికీ, ప్రైవేటీకరణ ప్రవక్తలకూ ఈ సందర్భం ఓ గుణపాఠం కావాలి. సమాజ సమష్టి ప్రయోజనం కోసం పనిచేస్తున్న కర్మవీరుల సేవలకు కృతజ్ఞతగా ఈ రోజు సాయంత్రం చప్పట్లు కొడదామని ప్రధాని పిలుపుని చ్చారు. కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్ర పాపులర్ డైలాగ్ ‘ఆ చప్పట్లే కదరా... ఆకలిగొన్న కళాజీవికి పంచ భక్ష పరమాన్నాలు.’ ఆ విధంగానే ఆ చప్పట్లే అలసిపో యిన మన సేవా జీవులను సేదదీర్చేవి. చప్పట్లు కొడితే పోయేదేమీ లేదు మన చేతులకున్న ధూళి తప్ప. ఇరుగు వైరస్, పొరుగు వైరస్, ఇంట్లో వైరస్, కంట్లో వైరస్ పారి పోయేలా కొడదాం చప్పట్లు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘చెప్పిన మాట వినండి.. రేపు ఇంట్లోను ఉందాం’
-
‘చెప్పిన మాట వినండి.. రేపు ఇంట్లోనే ఉందాం’
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’కు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘రేపు అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే కరోనా వైరస్ తాలూకు చైన్ కట్ అవుతుందని పెద్దల అభిప్రాయం. కావున దాన్ని గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఇవాళ కరోనే లేని ప్లేస్ లోనికి ఎవరైన వెళ్లాలనుకుంటే.. ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే వుహాన్. చైనాల కరోనా వస్తే కంట్రీ మొత్తం కట్టగట్టుకొని ఆ కరోనాను చావగొట్టారు. మనం కూడా ఆ పని చేయాలనుకుంటే చెప్పిన మాట వినండి. కొంత మంది ఇంట్లో ఉండలేను అని నెగటీవ్‌గా మాట్లాడే వారికి నా సలహా ఏంటంటే రేపు ఉదయం లేవగానే నాలుగు స్పూన్ల ఆముదం తాగండి. ఆ తర్వాత బిజీగా ఉండటంతో సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి సమయంలో నెగటీవ్‌గా కాకుండా చెప్పిన మాట వినండి. రేపు అందరం ఇంట్లోనే ఉందాం. లవ్ యూ ఆల్’ అంటూ పూరి జగన్నాథ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు జనతా కర్ఫ్యూకు పెద్ద ఎత్తున సంఘీ భావం తెలుపుతున్నారు. కోవిడ్-19 (కరోనా వైరస్) భాతరదేశంలో ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
సీఎం ఆదేశాలతో కదంతొక్కిన అధికారులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం కదంతొక్కింది. గత కొన్నిరోజులగా అప్రమత్తంగానే ఉంటూ చర్యలు చేపట్టిన ప్రభుత్వం, మరింత వేగంగా ముందుకు కదిలింది. కోవిడ్ –19 (కరోనా వైరస్) నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులు వైరస్ వ్యాప్తి నివారణపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామస్థాయి వరకూ కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధం చేశారు. ప్రతి ఇంటికీ సర్వే చేయడం, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో పెట్టడం, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించడం, విదేశాలనుంచి వచ్చిన వారిపై పర్యవేక్షణ, రోజూ వారి ఆరోగ్య వివరాలను నమోదు, వివరాల ప్రకారం వైద్యాధికారులు ఇచ్చిన సూచనలను అమలు చేయడం, అవగాహన కలిగించేలా ప్రచారం నిర్వహించడం అనే కోణాల్లో గ్రామస్థాయి వరకూ యంత్రాంగం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా 50 ఇళ్లకో వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఇంటినీ సర్వే చేయడం, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఒకవేళ ఉంటే వారిని గుర్తించడంలో, వారికి వైద్య సూచనలు అందించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నారు. (కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం) విశాఖలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి కోలుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన ఉన్న ఇంటికి 3 కిలోమీటర్ల పరిధిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. 335 బృందాలతో 25,950 ఇళ్లు సర్వే చేశారు. కరోనా లక్షణాలతో ఎవరూ లేరని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ఆ ప్రాంతంపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తి పర్యవేక్షణ ఉంచింది. నెల్లూరులో కరోనా పాజిటివ్‌గా తేలినవ్యక్తి.. పూర్తిగా కోలుకున్నాడు. శాంపిల్స్ పంపించామని, పరీక్ష పలితాలు రాగానే ఇంటికి పంపిస్తామని అధికారులు ప్రకటించారు. ఒంగోలులో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు. రేపటి జనతా కర్ఫ్యూ పాటించడంపైనా కలెక్టర్లు అన్ని రకాల సంస్థలతో సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించడానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యం కల్పించారు. (ఇంటి నుంచి వర్క్ చేసే వారికి ఇంటర్నెట్) -
ఆలోచన చిన్నదే అయినా ఫలితం మాత్రం పెద్దది
-
ఏపీ: ‘రాజధాని’ దీక్షా శిబిరాలకు నోటీసులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో చేస్తున్న దీక్షలను విరమించాలని అధికారులు కోరారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించకుండా చేపడుతున్న ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా వైద్య శాఖ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రైతుల జేఏసీ పేరుతో జరుగుతున్న ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాలను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రహదారి డి–జంక్షన్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరాలను కూడా ఖాళీ చేయాలని వైద్య శాఖ అధికారులు కోరారు. కాగా, వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన దీక్షలు శనివారానికి 13వ రోజుకు చేరాయి. (కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం) కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈరోజు (శనివారం) రాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. (జనతా కర్ఫ్యూకు ఇలా సిద్ధమవుదాం) -
మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధారణ మాస్కును ఎనిమిది రూపాయల ధరకు మించి అమ్మకూడదని పేర్కొంది. అదే విధంగా 200 మిల్లీ లీటర్ల శానిటైజర్ ధర వంద రూపాయలకు మించి అమ్మవద్దని.. అంతకు తక్కువ పరిమాణం ఉన్న బాటిల్‌ను సైతం అదే నిష్పత్తిలో అమ్మాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 నాటికి ఉన్న ధర మించకూడదని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది.(ఆ రాష్ట్రం దాదాపు 40శాతం మూతపడినట్లే!) ఐక్యంగా ఉన్నామని చాటేందుకే.. ప్రజల కోసమే ఆదివారం జనతా కర్ఫ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మనమంతా ఐక్యంగా ఉన్నామని చాటడానికి ఇది ఉపయోగపడుతుందని.. అంతా కలిసి మహమ్మారి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల ఆరోగ్యశాఖల కార్యదర్శులకు సూచనలు చేసినట్లు వెల్లడించింది. అయితే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించి.. తమను తాము కాపాడుకోవాలని కోరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 111 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్న ఆరోగ్యశాఖ... ప్రైవేట్ రంగంలోని ల్యాబ్‌లకు అనుమతిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్‌ల పెంపుపై పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (కరోనా: 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత) అదే విధంగా కరోనా వ్యాప్తి గురించి వదంతులు నమ్మి భయాందోళనకు గురికావద్దని కేంద్ర ఆర్థికశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని.. అయితే అందరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్ 95 మాస్కులు ఆస్పత్రుల్లోనే ఉపయోగిస్తారని.. మాస్క్‌లకు సంబంధించి మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. సాధారణ మాస్కులు ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా... విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. (కరోనా అలర్ట్: ఆ రాష్ట్రంలో 65 కేసులు) -
కరోనాను ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా?
-
జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అనేక మంది సెలబ్రెటీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. హ్యాండ్ వాష్ చాలెంజ్, సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ గృహ నిర్భంధం) వంటి కార్యక్రమాలను తాము పాటిస్తూ ప్రజలు పాటించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించబోయే ‘జనతా కర్ఫ్యూ’ కు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ జనతా కర్ఫ్యూలో తాము భాగం అవుతున్నామని ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు పలువురు నటీనటులు జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం జనతా కర్ఫ్యూపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కరోనాని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ చరణ్ తో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని మరియు సురక్షితంగా ఉండాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ఆ వీడియోలో ఎన్టీఆర్ కోరిన సంగతి తెలిసిందే. #covid19 ని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. — Jr NTR (@tarak9999) March 21, 2020 The world is going through one of its hardest times. The only way to get past #COVID19 is not panicking and spreading awareness. Stay Hygienic. Stay Safe! pic.twitter.com/UMHnLmdkA8 — RRR Movie (@RRRMovie) March 16, 2020 చదవండి: జనతా కర్ఫ్యూకు మెగాస్టార్ మద్దతు నమస్కారం చేద్దాం: చిరంజీవి -
24 గంటలు బంద్
-
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
-
జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ (ఏపీఎఫ్పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5 వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు రద్దు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా శాఖ ఏప్రిల్ 5వ తేదీ వరకు లెర్నింగ్ లైసెన్సు పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రద్దు నిర్ణయాన్ని పొడిగించాలా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు. 31 వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బంద్ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అన్ని విభాగాల కార్యకలాపాలు రద్దు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఎప్పుడంటే అప్పుడు యూనివర్సిటీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు సెలవులు ప్రకటించే విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, సమాచారం కోసం వస్తుండడంతో మెడికల్ కౌన్సిల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ మూల్యాంకనం వాయిదా సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. స్పాట్ వాల్యుయేషన్ తేదీలను తరువాత వెల్లడిస్తామన్నారు. శారదాపీఠం తాత్కాలికంగా మూసివేత పెందుర్తి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విశాఖ జిల్లా చినముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని తాత్కాలికంగా మూసివేస్తు న్నట్లు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఓ ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లో సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. -
జనతా కర్ఫ్యూకు మద్దతుగా లారీలు ఆపేస్తాం..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 (కరోనా వైరస్) భాతరదేశంలో ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన విషషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ పిలుపుకు సర్వత్రా మద్దుతు తెలుపుతోంది. తాజాగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోషియేషన్ రేపు జరగబోయే ‘జనతా కర్ఫ్యూ’కి తమ మద్దతు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా లారీలను ఆపేస్తామని లారీ ఓనర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి ప్రకటించారు. సుమారు పదిహేను లక్షల లారీలు ఈ ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతు తెలిపాయని నందారెడ్డి అన్నారు. (జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్!) ఎల్బీనగర్: హైదరాబాద్ నగర వాసుల్లో కోవిడ్-19(కరోనా వైరస్) భయం పట్టుకుంది. దీంతో నగరవాసులు స్వస్థలాలకు భారీగా వెళ్తున్నారు. ఎల్బీనగర్ స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల భారీ రద్దీతో కిటకిటలాడుతోంది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను అధిక చార్జీలతో దోచుకుంటున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ రోడ్లపైనే వాహనాలు అడ్డంపెట్టి మరీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నా ఆర్టీసీ సిబ్బంది మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. (నిలిచిపోనున్న రైళ్లు, మెట్రో, బస్సు సర్వీసులు) -
విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ : విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రైతు బజార్లకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. రేపు(ఆదివారం) జనతా కర్ఫ్యూకి ముందస్తుగా కూరగాయల కొనుగోళ్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు రావటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. థర్మల్ సెన్సార్‌తో వినియోగదారులకు పరీక్షలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. రేపు పెట్రోల్ బంకులు కూడా మూతపడుతుండటంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కొత్తపేట గడ్డి అన్నారం కూరగాయల మార్కెట్‌కు ప్రజలు భారీగా వస్తున్నారు. భారీ స్థాయిలో ప్రజలు రావడంతో కొద్ది రోజులతో పోల్చుకుంటే వ్యాపారం బాగా జరిగిందంటూ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. (‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’) కృష్ణా జిల్లా : కరోనాను నివారించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 15 రోజులపాటుగా స్వీయ నిర్బందనలో ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ప్రజల క్షేమం కోసమేనని, పోలీస్ వారి నుంచి ఎలాంటి బలవంతపు నిర్బంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్! -
‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛంగా పాల్గోనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐటి కంపెనీలకు, మతపెద్దలకు, ట్రాన్స్ పోర్టు వ్యాపారులకు తగుసూచనలు ఇచ్చామని వెల్లడించారు. రేపు(ఆదివారం) పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని, కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా ఉండాలంటే జనతా కర్ఫ్యూను అందరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేశామని, ఇమిగ్రేషన్ సమాచారంతో గుర్తించిన 1300 మంది క్వారంటైన్‌లోనే ఉన్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. (విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా..) మరోవైపు కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని, నగరంలో 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారైంటెన్ స్టాంప్స్ వేస్తామని, క్వారంటెన్ ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఏరియాలో శానిటేషన్ ఎక్కువ చేస్తున్నామని వెల్లడించారు. రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తారన్నారు. నగర ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోడియం, పైతో క్లోరైడ్‌తో స్ప్రేయింగ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే 108 కాల్ చేయాలని, ప్రత్యేకంగా 108 వాహనాలతో వారిని ఆసుపత్రికి తరలిస్తామని లోకేష్ కుమార్ తెలిపారు. (హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు..!) కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్ గేట్స్! -
జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటలు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన రేపటి( ఆదివారం) జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోతాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు, పాలు, కూరగాయలు, పండు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి ఇందులోనుండి మినహాయింపు ఉందన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ రెండురోజుల తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తున్నాం. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టాం. 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయి. అంతరాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. 78 మంది జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్‌లు పని చేస్తున్నాయి. మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారు. 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నాం. 700 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారే. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం. ఇది మీ సామాజిక బాధ్యతగా గుర్తించాల’ని విజ్ఞప్తి చేశారు. -
ఒంగోలు: నిలకడగా కరోనా బాధితుడి ఆరోగ్యం
సాక్షి, ప్రకాశం: కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ప్రజల సహకారంతో కరోనాను పారదోలుదామని పేర్కొన్నారు. మంత్రి ఆళ్ల నాని ప్రకాశం జిల్లాలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష చేశామని తెలిపారు. ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. (సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: పేర్ని నాని) అతనితో సంబంధం ఉన్న అందరినీ గుర్తించామన్నారు. వాళ్లని కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నామన్నారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు రద్దీ మాల్స్, దేవాలయాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు మూసివేశామన్నారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనాను సంకల్పం, జాగ్రత్తలతో కచ్చితంగా పారదోలుదామని అన్నారు. మాస్కులు వాడటమే కాదు. వాటిని సరిగా డిస్పోజ్ చేయకపోతే కొత్త సమస్యలు వస్తాయని మంత్రి వెల్లడించారు. ‘ప్రకాశం జిల్లా వైద్యుల పరిశీలనలో 18 కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో 28 రోజులు దాటినవి 10 కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేసులు వైద్యుల పరిశీలనలో ఉన్నాయి. అందులో 250 కేసులు 28 రోజులు దాటినవి. శాంపిళ్లు పంపినవి 130 కేసులు, ఇందులో 3 కేసులు పాజిటివ్ వచ్చాయి’ అని మంత్రి పేర్కొన్నారు. -
మీరు ఇంట్లోనే.. మీ కోసం మేం బయట
సాక్షి, విజయవాడ: ‘‘ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపునకు స్పందిద్దాం.. కరోనా వైరస్(కోవిడ్-19)ను జయిద్దాం’’ అని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ప్యూ పాటించాలన్నారు. ‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసులు అప్రమత్తతో ఉంటారని... కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. (‘జనతా కర్ఫ్యూ’కు సంఘీభావం) ఇక ఇది ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనని.. డయల్ 100 ద్వారా విస్త్రృతంగా.. నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. కాగా కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ప్రకారం ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’కు సంఘీభావం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎందుకీ జనతా కర్ఫ్యూ? కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు. తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం. కావున జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదాం.