
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు సిద్ధంకాగా, మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ మార్చి 27, మధ్యప్రదేశ్ మార్చి 24, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్‌లు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, యూపీ ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూను రేపటి వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి రెండో దశకు చేరుకోవటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నియంత్రణా చర్యలను వేగవంతం చేశాయి. ఈ నేఫథ్యంలోనే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు నిచ్చారు.