
సాక్షి, సూర్యాపేట: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్‌లో పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనెల 31 వరకు లాకౌడౌన్ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. (తెలంగాణ@31 దాకా లాక్ డౌన్)
Comments
Please login to add a commentAdd a comment