
పంజగుట్ట వద్ద ఫ్లకార్డులతో యువకులు..
బంజారాహిల్స్: ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న యువకులతో ట్రాఫిక్ పోలీసులు సామాజిక సేవ చేయించారు. దేశం అంతా జనతా కర్ఫ్యూ పాటిస్తూ కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ఆదివారం స్వీయ నిర్బంధం పాటిస్తే కొంత మంది ఆకతాయిలు మాత్రం బాధ్యతా రాహిత్యంగా రోడ్లపై తిరిగారు. వీరికి పోలీసులు కరోనా అవగాహన ఫ్లకార్డులు ఇచ్చి ఆయా జంక్షన్లలో నిలబెట్టారు.