సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో రహదారులన్నీ బోసిపోయాయి. అయితే, కొన్ని చోట్ల ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈనేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు.
కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా బయటకు ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. వారిని తిరిగి వెనక్కి పంపేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యూ. ప్రజలందరూ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలి. అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావద్దు. సైబరాబాద్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రోడ్లపైకి ఎవరు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేస్తున్నాం. రేపు ఆరు గంటల వరకు ప్రజలు ఇదే రీతిలో సహకరించాలి’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment