సాక్షి, హైదరాబాద్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి మోదీ పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది మధ్య బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేసింది. జనతా కర్ఫ్యూ మొదలయ్యే ముందు బయలుదేరిన రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక నగర పరిధిలో మా త్రం ప్రజల అత్యవసర ప్రయాణాల దృ ష్ట్యా 12 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం నడుపుతోంది. ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్ –ఫలక్‌నుమా రైలు, ఉ.6.50, 9.55, 1.00, 5.10Sకు ఫలక్‌ను మా–లింగంపల్లి మధ్య, 8.23, 11.30, 3.30, రాత్రి 8.45లకు లింగంపల్లి–ఫలక్‌నుమా, సాయంత్రం 6.50కి లింగంపల్లి–హైదరాబాద్, 7.35కి హైదరాబాద్–లింగంపల్లి, రాత్రి 10.30కి ఫలక్‌నుమా–సి కింద్రాబాద్ సర్వీసులు బయల్దేరతాయి. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవా రం ఉదయం 6 వరకు అన్ని బస్సులు ని లిచిపోనున్నాయి. అత్యవసరాలకు కొన్ని బస్సులు మాత్రం సిద్ధంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment