ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’కు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘రేపు అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే కరోనా వైరస్ తాలూకు చైన్ కట్ అవుతుందని పెద్దల అభిప్రాయం. కావున దాన్ని గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఇవాళ కరోనే లేని ప్లేస్ లోనికి ఎవరైన వెళ్లాలనుకుంటే.. ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే వుహాన్. చైనాల కరోనా వస్తే కంట్రీ మొత్తం కట్టగట్టుకొని ఆ కరోనాను చావగొట్టారు. మనం కూడా ఆ పని చేయాలనుకుంటే చెప్పిన మాట వినండి.
కొంత మంది ఇంట్లో ఉండలేను అని నెగటీవ్‌గా మాట్లాడే వారికి నా సలహా ఏంటంటే రేపు ఉదయం లేవగానే నాలుగు స్పూన్ల ఆముదం తాగండి. ఆ తర్వాత బిజీగా ఉండటంతో సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి సమయంలో నెగటీవ్‌గా కాకుండా చెప్పిన మాట వినండి. రేపు అందరం ఇంట్లోనే ఉందాం. లవ్ యూ ఆల్’ అంటూ పూరి జగన్నాథ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు జనతా కర్ఫ్యూకు పెద్ద ఎత్తున సంఘీ భావం తెలుపుతున్నారు. కోవిడ్-19 (కరోనా వైరస్) భాతరదేశంలో ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment