
సాక్షి, విజయవాడ : విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రైతు బజార్లకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. రేపు(ఆదివారం) జనతా కర్ఫ్యూకి ముందస్తుగా కూరగాయల కొనుగోళ్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు రావటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. థర్మల్ సెన్సార్‌తో వినియోగదారులకు పరీక్షలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. రేపు పెట్రోల్ బంకులు కూడా మూతపడుతుండటంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కొత్తపేట గడ్డి అన్నారం కూరగాయల మార్కెట్‌కు ప్రజలు భారీగా వస్తున్నారు. భారీ స్థాయిలో ప్రజలు రావడంతో కొద్ది రోజులతో పోల్చుకుంటే వ్యాపారం బాగా జరిగిందంటూ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. (‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’)
కృష్ణా జిల్లా : కరోనాను నివారించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 15 రోజులపాటుగా స్వీయ నిర్బందనలో ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ప్రజల క్షేమం కోసమేనని, పోలీస్ వారి నుంచి ఎలాంటి బలవంతపు నిర్బంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!)
Comments
Please login to add a commentAdd a comment