
భోపాల్/ తిరువనంతపురం: కరోనా వ్యాప్తి కల్లోలం రేపుతుండగా రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నా అదుపులోకి రాకపోవడంతో కేరళ గురువారం ఉదయం లాక్‌డౌన్ ప్రకటించగా తాజాగా మధ్యప్రదేశ్ కూడా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ తప్పక విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా కట్టడి చర్యలు ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రాలు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
‘కరోనా చెయిన్ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. చాలా రోజులు లాక్‌డౌన్ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు
చదవండి: పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment