Shivaraj Singh Chauhan
-
మాజీ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన బీజేపీ.. పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపీక చేసిన విషయం తెలిసిందే. మరోసారి సీఎం పదవి దక్కుతుందని ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వేదికలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం బీజేపీ నేత శివరాజ్ సింగ్ పూణెలోని ఎంఐటీ ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించారు. తాను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా పిలువబడుతున్నా, కానీ తిరస్కరణ సీఎం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిక కాలం పని చేసిన నేతపై ప్రజలు కొంత అసహం వ్యక్తం చేస్తారని తెలిపారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసి.. ప్రస్తుతం పదవిలో లేకున్నా ప్రజలు తన పట్ల ప్రేమను చూపుతున్నారని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ‘మామా’ అని ప్రేమగా పిలుస్తున్నారని అన్నారు. ప్రజల ప్రేమే తనకు అసలైన ఆస్తి అని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో లేనంత మాత్రానా తాను క్రీయాశీలక రాజకీయాల్లో లేనట్టు కాదని తెలిపారు. పదవులకు ఆశపడి తాను రాజకీయాల్లో ఉండటం లేదని.. ప్రజలకు సేవ చేయటమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. తాను అహంకారపూరితంగా మాట్లాడనని.. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. కానీ తనకోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని అన్నారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫలితాలు విడుదలైన అనంతరం కూడా శివరాజ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర బీజేపీ నేతల వలే తాను పదవుల కోసం ఢిల్లీకి వెళ్లనని అన్నారు. తాను ఇప్పటి వరకు పదవుల కోసం ఢిల్లీకి వెళ్లలేదని చెప్పారు. పదువుల కోసం ఢిల్లీ వెళ్లటం కంటే ప్రజల కోసం మరణించడానికైనా తాను సిద్ధపడతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: మావోయిస్ట్ కీలక నేత బెంగాల్లో అరెస్ట్ -
మీతోనే ఉంటానంటూ శివరాజ్ సింగ్ భావోద్వేగం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు పదవిని పొందడానికి వేచి చూస్తూ ఉంటాం..మళ్లీ వెంటనే పదవి చేపట్టడానికి తిరస్కరణకు గురవుతామని ఒకింత భావోద్వేగంతో అన్నారు. మంగళవారం తన సొంద నియోజకవర్గం బధ్నిలో నిర్వహించిన ఓ సభలో శివరాజ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ముఖ్యంగా తన సోదరీమణుల కోసం ఎప్పడూ అండగా ఉంటానని భావోద్వేగంతో అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని. ఇక్కడే జీవిస్తూ.. ఇక్కడే చనిపోతానని శివరాజ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మహిళలంతా ‘అన్నా’.. మమ్మల్ని విడిచి.. మీరు ఎక్కడికీ వెళొద్దని పెద్దగా అరుస్తూ కోరారు. కొత్త ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. అయితే కొన్ని పదవుల కోసం వేచి ఉంటామని.. తర్వత మళ్లీ వాటికి తిరస్కరించబడతామని తెలిపారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ మరోసారి బీజేపీ అధిస్టానం మరో అవకాశం ఇస్తుందని పార్టీలో చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు బీజేపీ 163 స్థానాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే. చదవండి: Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు -
Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనాగరిక ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా .. అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. Dear CM @ChouhanShivraj sir @MPPoliceDeptt @JM_Scindia ji -- This is a revolting & barbaric video involving cruelty by a man on a puppy that has shocked collective conscience Incident took place in Guna. Sacred texts say dogs have souls of God. 🙏💔pic.twitter.com/RCJ2CM7sO3 — Rohan Dua (@rohanduaT02) December 9, 2023 దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని సీఎం చౌహాన్‌ను ఎక్స్( ట్విటర్) ద్వారా కోరారు. Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64 — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023 దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ‘అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసిది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు’అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. -
బీజేపీకి ఓటేసినందుకు దాడి.. భద్రతకు సీఎం భరోసా
భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు. దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. -
గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఇండోర్ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్‌పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. -
పెగాసస్ మీ మైండ్‌లో ఉంది! ఫోన్లో కాదు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసం.. రాజకీయ విమర్శలకు దారి తీసింది. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాహుల్‌కి కౌంటరిచ్చారు. పెగాసస్ అనేది రాహుల్ గాంధీ ఫోన్లో లేదని, ఆయన మైండ్‌లోనే ఉందని ఎద్దేవా చేశారు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్. ‘‘పెగాసస్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోకి ప్రవేశించింది. రాహుల్ తెలివితేటలు చూసి జాలిపడుతున్నా. ఆయన విదేశాలకు వెళ్తాడు. దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వచ్చేస్తాడు. విదేశీ రాయబార కార్యాలయాలకు వెళ్లి భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడి.. దేశ పరువు తీయడమేనా? కాంగ్రెస్ ఎజెండా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. విదేశాల్లో దేశాన్ని విమర్శించడం దేశ వ్యతిరేక చర్య. దేశం గానీ, ప్రజలు గానీ మిమ్మల్ని(రాహుల్‌ను ఉద్దేశించి) ఎప్పటికీ క్షమించరు. కాగా, ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ..ఇజ్రాయిల్ స్పైవేర్ అయిన పెగాసన్ గురించి ప్రస్తావించారు. ఈ పెగాసస్ ద్వారా తన ఫోన్ గూఢచర్యం జరుగుతోందని, కాల్స్ మాట్లాడటం గురించి జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్లో పెగాసస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై తప్పుడూ అభియోగాలు మోపి కేసులు పెట్టారన్నారు. అలాగే కేంద్రం ఇంటెలిజెన్సినీ దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై కేసులు పెడుతోందన్నారు. ప్రజాస్వామ్య నిర్మిత దేశంలో ఇలాంటి చర్యలు సరికాదని, తాను అందుకోసమే పోరాడుతున్నాని చెప్పుకొచ్చారు రాహుల్. -
మందుల చీటీపై ‘శ్రీహరి’.. హిందీ ప్రిస్క్రిప్షన్ ఫోటోలు వైరల్
సాత్నా: మందుల చీటిపై (ప్రిస్క్రిప్షన్) ‘శ్రీహరి’ అంటూ మొదలుపెట్టాలని, ఔషధాల పేర్లను హిందీ భాషలో రాయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు డాక్టర్లు స్పందిస్తున్నట్లే కనిపిస్తోంది. సాత్నా జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు మందుల చీటిపై శ్రీహరి అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ చీటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొటార్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో పనిచేస్తున్న సర్వేష్ సింగ్ అనే డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రాశారు. సాధారణంగా ‘ఆర్ఎక్స్’ అనే లాటిన్ పదాన్నిమందుల చీటిపై మనం చూస్తుంటాం. ఆర్ఎక్స్ అంటే ‘ఔషధం తీసుకోండి’ అని అర్థం. సర్వేష్ సింగ్ 2017లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం సాధించారు. లౌలాచ్కు చెందిన రోగి రష్మీ సింగ్ కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించిన వైద్యుడు.. హిందీలో చీటీ రాసి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మందుల చీటిలో ‘ఆర్ఎక్స్’కు బదులుగా ‘శ్రీ హరి’ అని రాస్తున్నారు. प्रदेश के मुख्यमंत्री श्री @ChouhanShivraj द्वारा #MP_में_हिंदी_में_MBBS की पढ़ाई कराने की निर्णय के बाद #सतना में एक चिकित्सक ने किया अमल। मरीजों को हिंदी में दवाई लिखना किया शुरू। प्राथमिक स्वास्थ्य केंद्र कोटर में चिकित्सा अधिकारी हैं डॉ सर्वेश सिंह। pic.twitter.com/aX6Ddr1Vrx — Chetan Tiwari (@Chetantiwaribjp) October 16, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.. వైన్ షాపుపై రాళ్లతో దాడి.. వీడియో వైరల్
భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోలో హల్ చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మద్యం నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేసింది. జనవరి 15వ తేదీ నాటికి రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. లేని పక్షంలో రోడ్ల మీదకు వచ్చి నిరసలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో మద్యంపై నిషేధం విధించకపోవడంతో ఆమె రంగంలోకి దిగింది. అన్న మాట నిలుబెట్టుకుంది. భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో ఆమె దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం. బీజేపీ ప్రభుత్వంపైనే ఇలా నిరసనకు దిగి మరోసారి ఆమె ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Senior #BJP leader #UmaBharti in action at a #Liquor vend in #Bhopal, she has been batting for #LiquorBan in the state. What is called LAW & ORDER? Is this the way to protest?#MadhyaPradesh pic.twitter.com/hvHLCjmtOr — Safa 🇮🇳 (@safaperaje) March 13, 2022 అయితే, ఉమా భారతి ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అంతకు ముందు భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేదీ మేమే, వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే.. వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాలకు వారిని మేము వాడుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. -
ట్వీట్‌తో గాలం వేస్తున్నారు.. మొన్న కేటీఆర్.. నిన్న శివరాజ్‌సింగ్ చౌహాన్..
ఉపాధి కల్పన ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాల్. పెట్టుబడులు రాబట్టేందుకు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటాయి. కానీ సోషల్ మీడియా విస్తృతం అయ్యాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మంచి సందర్భం చిక్కితే చాలు రంగంలోకి దిగిపోతున్నారు ప్రభుత్వాధినేతలు. ఇటీవల ఆనంద్ మహీంద్రా తనకు సినిమా రంగంపై ఉన్న మక్కువను చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. తాజాగా కెమెరాతో షూటింగ్లో బిజీగా ఉన్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ ఫోటోకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ విధి రాతను ఎవరూ మార్చలేరు. మీరు కెమెరా వెనకాల ఉండాలని అనుకున్నారు.. కానీ మేము మీరు మహీంద్రా రైజ్ వెనుక ఉండాలని మేం భావించాం. చివరకు అదే జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు మహీంద్రాను ఆహ్వానిస్తున్నాం అంటూ శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి ఆనంద్ మహీంద్రా బదులిస్తూ మీ ఆహ్వానాన్ని తప్పకుండా పరిశీలిస్తానంటూ చెప్పారు. 😊 🙏🏽🙏🏽🙏🏽 I may take you up on that offer @ChouhanShivraj ji! https://t.co/Tu0iGjDh8D — anand mahindra (@anandmahindra) January 23, 2022 గత వారం టెస్లా కార్ల ఫ్యాక్టరీని తెలంగాణలో నెలకొల్పాలంటూ ఎలన్ మస్క్‌ను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కోరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేటీఆర్ ట్వీట్ వచ్చిన 24 గంటల్లోనే మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు ఎలన్‌మస్క్‌కు ఇదే విషయంలో రిక్వెస్ట్ చేశారు. ఈ పరంపరలో తాజాగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పారిశ్రామికంగా వెనుకబడిన మధ్యప్రదేశ్ఖి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. చదవండి:ఎలాన్.. మా రాష్ట్రంలో కంపెనీ పెట్టండి -
Let's have a race: సీఎం చౌహాన్‌కు కమల్‌నాథ్ చాలెంజ్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ (74)ఆరోగ్యంపై పదేపదే కామెంట్లు చేస్తున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(62)కు కమల్‌నాథ్ ఓ చాలెంజ్ విసిరారు. ‘నా ఆరోగ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్ అనారోగ్యంతో ఉన్నారు, వృద్ధుడయ్యాడని చౌహాన్ అంటున్నారు. మీకు నేను చాలెంజ్ విసురుతున్నాను. ఇద్దరం కలసి పరుగుపందెంలో పాల్గొందాం. చదవండి: రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి నాకు న్యూమోనియా ఉంది. అది తప్ప మిగిలిన రిపోర్టులు అన్ని సాధారణంగానే ఉన్నాయి. న్యూమోనియా ఉన్నందునే పోస్ట్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కాంగ్రెస్ పార్టీతో ఉన్న బాధ్యతల రీత్యా ఢిల్లీలో ఉన్నాను తప్ప ఆరోగ్యం గురించి కాదు’ అని పేర్కొన్నారు. కమల్ అనారోగ్యంతో ఉన్నారని చౌహాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత సోమవారం ‘జన దర్శన్ యాత్ర’ చేపట్టారు. దీంతో ఖార్గోన్ జిల్లాలోని స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ స్టేజ్ మీద నుంచి ఓ కార్యకర్త కిందపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం శివరాజ్ సింగ్ ‘జన దర్శన్ యాత్ర’లో భాగంగా ఖార్గోన్ జిల్లాలో పర్యటించారు. ఖార్గోన్ జిల్లాలోని జిరన్య ప్రాంతం నుంచి భికంగావ్ ప్రాంతం వరకు ఈ యాత్ర కొనసాగింది. అయితే యాత్ర మధ్యలో ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ పాల్గొన్నారు. సీఎం శివరాజ్ సింగ్ స్టేజ్‌మీదకు ప్రవేశించి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే ఆ బీజేపీ కార్యకర్త సీఎంకు ప్రజలంతా తిరిగి అభివాదం చేయాలంటూ మైక్‌లో మాట్లాడుతూ.. ఒక్కసారిగా స్టేజ్‌పై నుంచి కిందపడిపోయాడు. బీజేపీ కార్యకర్త స్టేజ్‌పై నుంచి కిందపడ్డ సమయంలో సీఎం శివరాజ్ స్టేజ్ మీద అభివాదం చేస్తూ కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. #WATCH | Madhya Pradesh: A local BJP leader falls off the stage of an event which was organised for CM Shivraj Singh Chouhan in Khargone, following his 'Jandarshan yatra' from Jhiranya to Bhikangaon in Khargone district. CM Chouhan was also present on the stage. (27.09.2021) pic.twitter.com/GXQYNciWjC — ANI (@ANI) September 29, 2021 -
ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
భోపాల్/ తిరువనంతపురం: కరోనా వ్యాప్తి కల్లోలం రేపుతుండగా రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నా అదుపులోకి రాకపోవడంతో కేరళ గురువారం ఉదయం లాక్డౌన్ ప్రకటించగా తాజాగా మధ్యప్రదేశ్ కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ తప్పక విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా కట్టడి చర్యలు ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రాలు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘కరోనా చెయిన్ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. చాలా రోజులు లాక్డౌన్ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత -
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
కుప్పకూలిన లిఫ్ట్.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు
భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిప్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొన్ని అడుగుల కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలు.. కమల్ నాథ్ ఆదివారం ఇండోర్‌లోని డీఎన్ఎస్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు ఆయనతో పాటు జితు పట్వారీ, సజ్జన్ సింగ్ వర్మ, విశాల్ పటేల్, వినయ్ బకాలివాల్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా ఆస్పత్రిలోని లిఫ్ట్ ఎక్కారు. కాసేపటికే లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయింది. దాంతో లిఫ్ట్ డోర్స్ జామ్ అయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. వారిని బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఇక ప్రమాదంపై డీఎన్ఎస్ ఆస్పత్రి హెడ్ మాట్లాడుతూ ‘‘కమల్ నాథ్ తన బృందంతో కలిసి లిఫ్ట్ ఎక్కే సమయానికే దానిలో 10 మంది ఉన్నారు. ఆ తర్వాత కమల్ నాథ్‌తో పాటు మరి కొందరు లిఫ్ట్ ఎక్కారు. ఓవర్‌లోడ్ కావడంతో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పడిపోయింది’’ అని తెలిపారు. అనంతరం కమల్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఆంజనేయుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. హనుమంతుడి దయ నా మీద ఎప్పుడు ఉంటుంది’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారజ్సింగ్ చౌహాన్ ఆయనకు ఫోన్ చేసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. చదవండి: ఆమె ఓ ఐటెం..! సిగ్నల్స్ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్ -
అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి
భోపాల్: వారంతా వయసు పైబడిన వృద్ధులు.. సంతానానికి బరువయ్యారో.. లేక నా అన్న వారు ఎవరు లేరో తెలియదు.. ఉండటానికి ఇళ్లు లేదు. పొద్దంతా వీధుల వెంట తిరుగుతూ.. రాత్రికి షాపుల ముందు.. రోడ్డు పక్కన తల దాచుకుటారు. వారి పట్ల దయ చూపాల్సిన ప్రభుత్వం కళ్లెర్ర చేసింది. ఇలాంటి వారి వల్ల నగర ప్రతిష్ట దెబ్బ తింటుందని భావించి.. అత్యంత అమానవీయ రీతిలో వారిని ఓ మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లి ఊరి బయట వదిలేశారు. చలిలో ఆ ముసలి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఏటు వెళ్లలేక అవస్థపడ్డ తీరు వర్ణానాతీతం. వీరి అవస్థ చూసిన గ్రామస్తులు సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో వారిని తిరిగి నగరంలోకి తీసుకెళ్లారు. ఇక ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ప్రభుత్వ అధికారిపై దుమ్మెత్తిపోశారు నెటిజనులు. దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం ఆ ఉన్నతాధికారిని సస్పెండ్ చేసింది. గుండెతరుక్కుపోయే ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. (చదవండి: కూతురి కోసం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో) ఆ వివరాలు.. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతాప్ సోలంకి డిప్యూటి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సోలంకి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది నగరంలో ఇళ్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వారిని గుర్తించి నగర శివార్లలోని గ్రామం సమీపంలో విడిచిపెట్టారు. ఇలా తరలించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది వీరందరిని ఓ ట్రక్కులో ఎక్కించి.. గ్రామం సరిహద్దులో వదిలేశారు. పాపం చలిలో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక, దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక అధికారుల చర్యలను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దాంతో మున్సిపల్ అధికారులు వారిని తిరిగి సిటీలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మున్సిపల్ సిబ్బంది తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతాప్ సోలంకితో సహా ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్ ఆ వృద్ధుల బాగోగులను చూసుకోవాల్సిందిగా సూచించారు. ఈలాంటి చర్యలను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు. आज इंदौर में नगर निगम कर्मचारियों द्वारा वृद्धजनों के साथ अमानवीय व्यवहार के संबंध में मुझे जानकारी मिली। इस मामले में जिम्मेदार नगर निगम उपायुक्त सहित दो कर्मचारियों को तत्काल प्रभाव से निलंबित करने और कलेक्टर इंदौर को बुजुर्गों की समुचित देखभाल करने का निर्देश दिया है। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 29, 2021 -
‘15 ఏళ్లకే జన్మనివ్వగలరు.. మరి 21 ఎందుకు?’
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. పార్టీకి చెందిన ఓ సీనియర్, మాజీ మినిస్టర్ ఆడపిల్లల కనీస వివాహ వయసుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీతో పాటు మహిళా సంఘాలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంతకు వివాదం ఏంటంటే సజ్జన్ సింగ్ వర్మ అనే మాజీ కాంగ్రెస్ మినిస్టర్ ఆడపిల్లలు 15వ ఏట నుంచే పునరుత్పత్తి చేయగలిగినప్పుడు.. వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ వివాదం రాజుకుంది. బీజేపీ, మహిళా సంఘాలు ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘సమ్మన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్షం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ మహిళ కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని సూచించారు. దీనిపై స్పందిస్తూ.. 15 సంవత్సరాల వయస్సులో మహిళలు పునరుత్పత్తి చేయగలరని వాదించిన మిస్టర్ వర్మ, "ఇది నా అన్వేషణ కాదు. వైద్యుల నివేదిక ప్రకారం, 15 సంవత్సరాల వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా ఉంటారు. అయితే 18 ఏళ్ల తర్వాతనే వారు వివాహం చేసుకోవడానికి తగినంతగా పరిణీతి చెందుతారు. అందుకే వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు. మరి వారి వివాహ వయసును 18 నుంచి 21కి పెంచడానికి ముఖ్యమంత్రి ఏమైనా డాక్టరా.. శాస్త్రవేత్తనా’ అని వర్మ ప్రశ్నించారు. "బాలికలు 18 ఏళ్లు దాటిన తర్వాత తమ అత్తమామల ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండాలి" అని మాజీ మంత్రి అన్నారు. ఇక సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి మాట్లాడుతూ.. ‘‘సజ్జన్ సింగ్ కేవలం మధ్యప్రదేశ్ కుమార్తెలనే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలని తన మాటలతో అవమానించాడు. తన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యంగ్ నేషనల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇద్దరు మహిళలనే విషయం బహుశా సజ్జన్ సింగ్ మర్చిపోయినట్లున్నాడు. తన వ్యాఖ్యలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని సోనియా గాంధీ సజ్జన్ సింగ్‌ని ఆదేశించాలి. ఆయనను పార్టీ నుంచి తొలగించాలి’’ అని డిమాండ్ చేశారు. -
శభాష్ సేన్..!
భోపాల్: పోలీసులు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఖాకీ డ్రస్సు.. ముఖంలో కాఠిన్యం.. మాటల్లో మొరటుదనం. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. కానీ వారిలో కూడా మంచితనం, మానవత్వం ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు బోలేడు జరిగాయి. తాజాగా అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ ఓ మహిళను భుజాల మీద మోసుకుని వెళ్లాడు ఓ పోలీసు అధికారి. వివరాలు.. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్, జబల్పూర్లో 35 మందితో వెళ్తున్న ఓ మినిట్రక్కుకు యాక్సిడెంట్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను తమ వాహనంలో ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరిపడా స్ట్రెచర్లు లేకపోవడంతో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ సంతోష్ సేన్, ఎల్ ఆర్ పటేల్, కానిస్టేబుల్స్ అశోక్, రాజేష్, అంకిత్‌లు స్థానికుల సాయంతో క్షతగాత్రులను తమ భుజాల మీద మోసుకెళ్లారు. (చదవండి: తను అలా పిలవగానే షాకయ్యాం: డీఎస్పీలు) వీరిలో 57 ఏళ్ల సంతోష్ సేన్ గాయపడిన ఓ పెద్దావిడను తన వీపు మీద మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరో అధికారి సాయంతో ఆమెను లోపలికి తీసుకెళ్లారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే 14 ఏళ్ల క్రితం పరారీలో ఉన్న ఓ క్రిమినల్ని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుండగా.. జరిగిన కాల్పుల్లో సేన్ కుడి భుజానికి బుల్లెట్ తగిలింది. అప్పటి నుంచి ఆయన కుడి చేయి సరిగా పని చేయడం లేదు. అయినప్పటికి దాన్ని లెక్కచేయకుండా సదరు సీనియర్ అధికారి, మహిళకు సాయం చేశాడు. సేన్, మహిళను తన వీపు మీద మోసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సేన్‌ని ప్రశంసించారు. -
భారీగా ఓటింగ్.. విజయం మాదే
భోపాల్: ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మంగళవారం 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఓటింగ్ జరిగిందని, బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వెంటాడుతున్నా మధ్యప్రదేశ్ ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఇది మన ప్రజాస్వామ్యం గొప్పదనమని చౌహాన్ తెలిపారు. ఓటర్లు అందరూ తమ ఓటును ఉత్సాహంగా బీజేపీకే వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి 22 మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటితో పాటు ఇది వరకు ఖాళీగా ఉన్న సీట్లను కలిపి 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభత్వం కూలిపోయి, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, నిరుద్యోగులను, మహిళలను, కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో 57.09 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా అగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 80.46 శాతం ఓటింగ్ నమోదైంది. సుమవలి నియోజకవర్గంలో అత్యల్పంగా 41.79 శాతంగా ఓటింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. బిహార్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలతో పాటు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెల్లడించనున్నారు. వీటిలో కనీసం తొమ్మిది స్థానాలు గెలిస్తేనే శివరాజ్ సింగ్ ప్రభుత్వం నిలువనుంది. మెజారిటీ కొంచెం అటు ఇటు అయితే మళ్లీ కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టొచ్చు. -
కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. (చదవండి: ‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ) అలానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక ఇప్పటి నుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వలో స్పష్టం చేసింది. అలానే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హుందాగా, గౌరవప్రదంగా మెలగడం కోసం అందరి ఏకాభిప్రాయంతో ప్రవర్తనా నియమావళిని రూపొందించారని.. ఇది అనేక దశాబ్దాలుగా అమలులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. -
గత 500 సంవత్సరాల్లో ఆ ఘనత మాత్రం మోదీకే
భోపాల్ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన వెబినార్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. లక్షలాదిమంది రామ భక్తుల 500 ఏళ్లనాటి సుదీర్ఘ పోరాటం సాకారమయ్యిందన్నారు. 1990లో ఎల్ కె అద్వానీ నాయకత్వంలో రథయాత్ర జరిగినప్పుడు తాను ఎమ్మెల్యేనని, కరసేవ కోసం అయోధ్యకు తరలివెళ్లామన్నారు. తమను అరెస్ట్ చేసి జౌన్పూర్ జైలులో ఉంచారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. మత సామరస్యం కోసం ప్రధాని చూపిన సంకల్ప బలం ఈరోజు సాక్షాత్కరమవుతుందన్నారు. గత 500 సంత్సరాలలో భారతదేశపు అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా మోదీ నిలిచారని సీఎం శివరాజ్ సింగ్ కొనియాడారు. (28 ఏళ్ల ఉపవాసం ముగించనున్న ‘కలియుగ ఊర్మిళ’) ఇక కరోనానుంచి కోలుకున్న సీఎం శివరాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గతనెల 25న సీఎంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక చిరాయు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. మరో 7 రోజలు పాటు ఇంట్లోనే క్వారంటైర్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించినట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత) Madhya Pradesh CM Shivraj Singh Chouhan discharged from Bhopal's Chirayu Hospital after recovering from #COVID19. He had tested positive for the disease on 25th July. The hospital has advised him to isolate himself at home and self monitor his health for a further 7 days. pic.twitter.com/quacfT4f3g — ANI (@ANI) August 5, 2020 -
బట్టలు ఉతుక్కుంటున్నాను: సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి గురించి జనాలు ఎవరూ ఆందోళన చెందకుండా ఉండటం కోసం తన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటున్నారు చౌహాన్. వైరస్ బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన పనులు తానే చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వైరస్ వల్ల తాను స్వయం సమృద్ధి గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో తనే సొంతంగా టీ పెట్టుకోవడమే కాక తన బట్టలు తానే ఉతుక్కుంటున్నట్లు వెల్లడించారు. (ఐసోలేషన్ వార్డులో డాక్టర్ దుర్బుద్ధి) ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను బాగున్నాను. నిత్యం ఏదో ఓ పని చేస్తూనే ఉన్నాను. దగ్గు కూడా తక్కువయ్యింది. మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆస్పత్రిలో టీ చేసుకుంటున్నాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను. కాబట్టి జనాలు ఎవరు కరోనా గురించి భయపడవద్దు. ఇది మనకు స్వయం సమృద్ధి గురించి బోధిస్తుంది. కొన్నేళ్ల క్రితం నా చెయ్యి ప్రాక్షర్ అయ్యింది. ఫిజియోథెరపి అవసరం ఎంతో ఉంది. కానీ ఇక్కడ ఆస్పత్రిలో నా చేతులు నిరంతరం ఏదో ఒక పని చూస్తూనే ఉన్నాయి. దాంతో నా చేతల పని తీరు కూడా బాగా మెరుగుపడింది’ అని తెలిపారు. గత వారం చౌహాన్ తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న అజాగ్రత్త వల్ల తనకు కరోనా సోకిందని తెలిపారు. ఆదివారం చౌహాన్ 75 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో ఆయన తన ఆరోగ్యం ఎంతో బాగుందని తెలిపారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిలో ఆయన బ్లూ కలర్ ఆస్పత్రి గౌన్ ధరించి కన్పించారు. (అనుమానంగా ఉంది.. ఎక్కడికెళ్లాలి?) -
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్‌చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్‌స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
‘కొడుకు కోసం ఐదుగురు కూతుళ్లను కన్నారు’
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు భారతీయ జనతా పార్టీని విమర్శించబోయి తానే స్వయంగా చిక్కుల్లో పడ్డారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ ఆయన మీద కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీతు పట్వారీ బుధవారం 2014,19 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించిన ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదాన్ని విమర్శించే ఉద్దేశంతో.. ‘ప్రజలు ఒక కొడుకు కోసం ఆశతో ఉన్నారు. కాని వారికి లభించింది ఐదుగురు కుమార్తెలు. కూతుళ్లందరూ జన్మించారు కాని వికాస్ అనే కుమారుడు ఇంకా పుట్టలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ వికాస్(అభివృద్ధి)ని కుమారుడితో పోల్చగా.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పథకాలను కుమార్తెలుగా పోల్చారు. దాంతో నెటిజనులు జీతు పట్వారీని విపరీతంగా ట్రోల్ చేశారు. (‘విపత్తు వేళ చౌకబారు రాజకీయాలు’) అయితే జరగాల్సిన నష్టం అంతా జరిగాక మేల్కొన్న జీతు పట్వారీ.. కుమార్తెలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే అందుకు తాను చింతిస్తున్నానని క్షమించమని కోరారు. కుమార్తెలను తాను దైవంగా భావిస్తానని తెలిపారు. అంతేకాక మోదీ నోట్లరద్దు, జీఎస్టి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మాంద్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచారన్నారు. ప్రజలు వీటన్నింటిని అభివృద్ధి ఆశతో మాత్రమే భరించారని తెలిపారు. బీజేపీ బలహీనతలను ఎత్తి చూడమే తన ఉద్దేశమని.. బీజేపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని జీతు పట్వారీ ఆరోపించారు. జీతు పట్వారీపై విరుచుకుపడిన వారిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు మహిళలను దారుణంగా అవమానించారని.. దీనికి సోనియా గాంధీ ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ప్రజలు రాణి దుర్గావతి త్యాగాన్ని స్మరించుకుంటున్నారని.. ఇలాంటి సమయంలో ‘కొడుకు కోసం ఎదురు చూస్తే.. ఐదుగురు కుమార్తెలు జన్మించారు’ అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నాయకుల నీచ మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. కుమార్తెలు పుట్టడం నేరమా అని చౌహాన్ ప్రశ్నించారు. సోనియా గాంధీ.. జీతు పట్వారీకి ఆడవారిని అవమానించే పని అప్పగించారా ఏంటి అని ఆయన విమర్శించారు. (కొత్త సారథి కావలెను) జీతు పట్వారీ ట్వీట్ పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఇందుకు అతను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన మనస్సు ఉన్న వారు తమను తాము నాయకులుగా భావించుకోవడం విచారకరమన్నారు. ఇలాంటి మనస్తత్వంతో వారు తమ అనుచరులకు ఏం బోధిస్తున్నారు అని ప్రశ్నించారు. -
చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి: సీఎం
భోపాల్: భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గాల్వన్‌లో లోయలో ఇరు దేశాల రక్షణ దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత సైనికులు మరణించారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం మార్మోగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘బాయ్‌కాట్ చైనా’కు మద్దతిచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైనాలో తయారయిన వస్తువులను బహిష్కరించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. మన సైన్యం వారికి తగిన సమాధానం చెప్పింది. అలానే మనం కూడా వారిని ఆర్థికంగా దెబ్బతీయాలి’ అని చౌహాన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చైనా దురాక్రమణకు నిరసనగా ప్రజలు తమ ఫ్లాట్ టీవీలను బాల్కనీల నుంచి బయటకు విసిరేయడం.. చైనాలో తయారయిన ఎలక్ట్రానిక్స్‌ను దహనం చేస్తున్న దృశ్యాలు తెగ వైరలవుతున్నాయి. (చైనా 'బే'జార్) मैं प्रदेशवासियों से अपील करता हूं कि देशभक्ति के भाव से भरकर चीन में बने सभी सामानों का बहिष्कार करें। अपने यहां निर्मित सामानों को प्राथमिकता दें। हमारी सेना भी चीन को जवाब देगी, लेकिन आर्थिक रूप से भी हम उसको तोड़ेंगे। भारत चीन को मुंहतोड़ जवाब देगा। pic.twitter.com/saaqQd2Z7F — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 19, 2020 సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. (బాయ్‌కాట్ చైనా)