![ఇరానీ మౌనం](/styles/webp/s3/article_images/2017/09/2/41403903136_625x300.jpg.webp?itok=-rCNRPVJ)
ఇరానీ మౌనం
న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు వివాదంపై మాట్లాడేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిరాకరించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సమావేశం అనంతరం ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగపరమైన అభ్యంతరాలను ఇందుకు సాకుగా చూపారు. ‘రాజ్యాంగం పరిధిలోని ఈ అంశంపై మాట్లాడాలంటూ నన్ను అనేకసార్లు మీడియా వెంట పడింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా దయచేసి నాపై ఒత్తిడి చేయకండి’ అని అన్నారు.