
భోపాల్ : లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా వలస కూలీల బాధలు వర్ణణాతీతం. సొంతూళ్లకు వెళ్లలేక, తినడానికి తిండి లేక నానా అవస్తలు పడుతున్నారు. ఊరికి చేరుకుంటూమో లేదో తెలియని పరిస్థితుల్లోనూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణిస్తూ అలసి సొలసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వారికి తీపి కబురు అందించాయి. వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న తమ రాష్ర్ట వలస కార్మికులను తీసుకురావడానికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇతర రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వారిని బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ప్రకటించాయి. దీనికి సంబందించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆయా రాష్ర్ట సీఎంలతో మాట్లాడినట్లు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా చిక్కుకున్న తమ ప్రాంత వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తామంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ శివరాజ్ సింగ్ చౌహన్ కు సహకారమందించేందుకు హామీ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఇండోర్ జిల్లాలో చిక్కుకున్న చిక్కుకున్న కార్మికులకు ఉపశమనం లభించదు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ఎక్కడివాళ్లు అక్కడే ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మధ్యప్రదేశ్ కార్మికులను కూడా వెనక్కి పంపేది లేదని తేల్చి చెప్పింది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున ఇతర రాష్ర్టా నుంచి వచ్చేవారిని సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment