labour
-
నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్‌గా..!
ఏ కలలకు ఆస్కారం లేని కరుకు జీవితాన్ని చిన్న వయసులోనే అనుభవించిన సజ్దా పఠాన్ పేరు ఆస్కార్ విశేషాల్లో భాగంగా తరచు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా గునీత్ మోంగా షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ 97వ ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా నామినేట్ అయిన ‘అనూజ’పై బజ్ వేడెక్కడంతో అందరి దృష్టి ఆ చిత్రంలో నటించిన తొమ్మిదేళ్ల లీడ్‌స్టార్ సజ్దా పఠాన్‌పై పడింది.ఢిల్లీ మురికివాడల్లోని బాల కార్మికురాలైన సజ్దాను ‘సలాం బాలక్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ కాపాడింది. సజ్దాకు సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ సినిమాలకు బొత్తిగా కొత్త కాదు. ఇంతకుముందు లాటిటియా కొలోంబానీ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ చిత్రం ‘ది బ్రైడ్’లో సజ్దా నటించింది. ఆ సినిమాలో మియా మేల్జర్తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. మీరా నాయర్ ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘సలాం బాంబే’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏర్పాటైన ‘సలాం బాలక్ ట్రస్ట్ కృష్ణన్ నాయక్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో ‘ది బ్రైడ్’ను నిర్మించింది. ఊహించని నాటకీయ పరిణామాలు వెండితెరకే పరిమితం కాదు అని నిజజీవితంలో కూడా ఉంటాయని మరోసారి బలంగా చెప్పడానికి సజ్దా పఠాన్ బలమైన ఉదాహరణ. (చదవండి: ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడు..!) -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్‌కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. -
గుడారాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు కూలీలు మృతి
పనాజీ: గోవాలో బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న గుడారాల్లోకి దూసుకెళ్లింది. శనివారం(మే25) రాత్రి పనాజీకి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుడారాల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు నలుగురు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం మూడు గుడారాల్లో తొమ్మిది మంది ఉన్నారు. రోడ్డు పనులు చేయడం కోసం కూలీలు బీహార్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒక కంపెనీ ఉద్యోగులకు చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం కారణంగా బస్సులో ఉన్నవారెవరికీ ఏమీ కాలేదు. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు..!
ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ ఉపాధ్యక్షుడు, బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. దశాబ్దం క్రితం భారత్ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్లబింగ్, మెకానిక్, ఆతిథ్యం, సేల్స్ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..? భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూఎస్ఏ, జపాన్, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఒకప్పుడు రోజు కూలీ..నేడు యూట్యూబ్ స్టార్‌గా..!
నాడు ఆ వ్యక్తి రోజు కూలీగా కటిక దారిద్య్రం అనుభవించేవాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి స్థితోలో అనుకోని అతిథిలా వచ్చిపడినా కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కనీసం కుటుంబాన్ని పోషించలేని దారుణమైన స్థితిలోకి వచ్చేశాడు. అయిపోంది జీవితం అనుకునే టైంలో "యూట్యూబ్" ఓ ఆశా కిరణంలా అతడి లైఫ్‌లోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఈ రోజు ఏకంగా నెలకు రెండు లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతని యూట్యూబ్ ప్రస్థానం ఎలా సాగిందంటే..? ఒడిశాకు చెందిన ఇశాక్ రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ చాలీచాలని సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రోజుకి అతికష్టం మీద 250 రూపాయలు సంపాదించేవాడు. ఇంతలో కరోనా మహమ్మారి కారణం ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. ఏంచేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో యూట్యూబ్ ఓ వరంలా అతడి జీవితంలోకి వచ్చింది. యూట్యూబ్ ఛానెల్‌తో డబ్బులు సంపాదించొచ్చు అనే విషయం తెలుసుకుని వీడియోల చేయడంపై దృష్టి సారించాడు. ఒడియా వంటకాలతో అలరించాలనుకున్నాడు. తమ సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. అయితే మొదట్లో అతడి వీడియోలు ఎవ్వరూ చూసేవారు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒడిశాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం అయిన బాసి పఖాలా వీడియో బాగా ప్రేక్షకాధరణ పొంది వైరల్ అయ్యింది. అంతే అక్కడ నుంచి అతని వీడియోలు బాగా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగి అతని ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు చేరింది. ఇక యూఎస్, బ్రెజిల్, మంగోలియా దేశాల వాళ్లు కూడా ఇతని వీడియోలను ఆదరించడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్ అయ్యిపోయాడు. ది బెటర్ ఇండియా వంటి ప్రముఖ వెబ్సైట్లు మీడియా అతడి గురించి రాయడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ రేడియో షోలో అతడి గురించి ప్రస్తావించడమే గాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆ యూట్యూబ్ స్టార్ ఇశాక్ మాట్లాడుతూ..ఈ రోజు నా వీడియోలు బాగా వెళ్తే గనుకు నెలకు దాదాపు రూ. 3 లక్షల దాక సంపాదించగలనని దీమాగా చెబుతున్నాడు. దీనివల్ల వీడియో ఎడిట్ చేసేందుకు ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను, ఉపయోగించడం తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే ఓ సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొనుక్కోగలిగానని ఆనందంగా చెప్పాడు. అలాగే నా కుటుంబాన్ని ఈ రేంజ్లో చూసుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదంటూ బావోద్వేగంగా మాట్లాడాడు ఇసాక్. (చదవండి: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!) -
‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు!
పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సంస్థలో ఏడోసారి జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,983 ఓట్ల మెజారిటీతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరకు విజయాన్ని ౖకైవసం చేసుకుంది. సంస్థ వ్యాప్తంగా ఆరు ఏరియాల్లో ఐఎన్టీయూసీ, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచాయి. ఈక్రమంలో ప్రధాన డిమాండ్ల సాధన బాధ్యత గెలిచిన యూనియన్‌పై సవాల్ విసురుతోంది. సొంతింటి పథకం, మారుపేర్ల మార్పు, నూతన భూగర్భగనుల తవ్వకం తదితర డిమాండ్ల సాధన అంతసులువు కానప్పటికీ.. పోరాటాల చరిత్ర కలిగిన గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగుతుందోనని సింగరేణి కార్మికులను ఆలోచింపజేస్తోంది. ఏఐటీయూసీ ఎన్నికల మెనిఫెస్టో ఇదీ.. సింగరేణిలో రాజకీయ జోక్యం నియంత్రిస్తాం. ఆర్థిక దుబారాను అరికడతాం. కోలిండియా మాదిరిగా పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. కార్మికుల పిల్లల ఉద్యోగ వయోపరిమితి 35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతాం. సొంతింటి పథకం కింద 250గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేయిస్తాం. నూతన భూగర్భగనులు తవ్వించి ఉద్యోగాలు పెంచడం బొగ్గు వెలికితీసే ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించి పర్మినెంట్ కార్మికులను నియమించడం. మైనింగ్‌స్టాఫ్, ట్రేడ్స్‌మెన్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు, ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్‌లో అదే హోదా కల్పన. ప్లేడే, పీహెచ్‌డీలకు ఎన్–వన్ విధానం తొలగించి పాత పద్ధతి కొనసాగిస్తాం. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు డబ్బులు లేకుండా అందరికీ అన్‌ఫిట్ చేయిస్తాం సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా కృషి చేస్తాం. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా బోధన అందుబాటులోకి తెస్తాం. సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు డస్ట్ అలవెన్స్ ఇప్పిస్తాం. రిటైర్డ్ రోజునే కార్మికులకు టర్మినల్ బెనిఫిట్స్ అందేలా చూస్తాం. చదువుకున్న కార్మికులకు సూటబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మహిళా కార్మికులను భూగర్బగనుల్లోకి దింపకుండా చూస్తాం. అన్నిఏరియాల్లో కార్మికులకు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేలా చూస్తాం. క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్ అందించేలా చూస్తాం. గని ప్రమాదాల్లో ఇంక్రిమెంట్లు కోల్పోయిన వారికి వన్‌టైం సెటిల్మెంట్కింద ఇంక్రిమెంట్ ఇప్పిస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ బేసిక్‌లో కల్పించేలా చూస్తాం. సింగరేణి డీఎంఎఫ్ఐటీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసేలా చూస్తాం. మారుపేర్ల కార్మికులను సొంత పేర్లపై రెగ్యులరైజ్ చేసేలా చూస్తాం. 2022లో జరిగిన 9డిమాండ్ల ఒప్పందం అమలయ్యేలా చూస్తాం. కార్మికుల పక్షాన పోరు! మాపై నమ్మకంలో ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు. వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతాం. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ, సొంతింటి కల నెర వేర్చుతాం. మారుపేర్లతో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను వన్‌టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేసేలా చూస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా దృష్టి సారిస్తాం. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు?
పెద్దపల్లి, గోదావరిఖని: రామయ్య(పేరు మార్చబడింది)అనే కార్మికుడికి కంటిచూపు మందగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే కళ్లు పరీక్షించి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. అతడి సొంత కుమారుడికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఊర్లో ఒకపేరు, గనిపై మరోపేరు ఉండటంతో ఇలా నాలుగేళ్లుగా సతాయిస్తోంది. ఆ యువకుడికి ఉద్యోగం లేక, పట్టుపైసా(గ్రాట్యుటీ) రాక ఆ కుటుంబం అప్పులపాలైంది. ఈచిక్కుముడి విప్పేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కార్మికుల సభ సాక్షిగా మారుపేర్ల మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి రామయ్యలు సింగరేణిలో 600మందికిపైగా ఉన్నారు. నిరక్షరాస్యులు కావడంతో.. సుమారు 40ఏళ్ల క్రితం ఊళ్లో ఏ పేరు ఉందో, బొగ్గు గనిపై ఏ పేరు ఉందో కార్మికులకు ఎవరికీ తెలియదు. నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. ఇలా కాలం గడిచి పోయింది. ఇప్పుడు సింగరేణిలో కంప్యూటర్ యుగం వచ్చింది. ఆ నాటి పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా తన తండ్రి పేరులో అక్షరదోషం ఉందనేసాకుతో తమ పిల్లలకు ఉద్యోగాలివ్వడం అంశాన్ని పక్కన బెట్టారు. ఇలా ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా కేసులు పేరుకుపోయాయి. గత గుర్తింపు యూనియన్ ఈవిషయంపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. భవిష్యత్‌పై హామీ ఇవ్వాలి.. మెడికల్ ఇన్వాలిడేషన్‌లో విజిలెన్స్ విచారణ పేరుతో నిలిచిపోయిన సింగరేణి సంస్థలోని సుమారు 600మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మారుపేర్ల మార్పు అంశం తెరపైకి వచ్చినా ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు, అధికార పార్టీ నేతలు.. కార్మికులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఎయిమ్స్‌కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్‌లు, వీల్చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు. వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది. ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు. శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
హెలికాఫ్టర్లతో మోరంచవాగులో రెస్క్యూ ఆపరేషన్
జయశంకర్ భూపాలపల్లి: చిట్యాల మండలంలోని నైన్పాక శివారు మోరంచవాగు బ్రిడ్జి నిర్మాణానికి కూలీలుగా పని చేస్తున్న ఆరుగురు కార్మికులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి స్థానిక జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎస్సై రమేష్‌లు ఎమ్మెల్యే, కలెక్టర్లకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన వారు రెండు హెలికాప్టర్లను పంపించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదల్లో చిక్కుకున్న బీకే ఆరుంగ్, బీపిన్ అరుణ్, గానో, ఉత్తమ్, మున్న, రోహిత్‌లు అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన కార్మికులు బ్రిడ్జి పనులు చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వారితోపాటు మరో 20 మంది కార్మికులు రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పడుకున్నారు. ఈక్రమంలో తెల్లవారు జామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొంత మంది అప్రమత్తమై పరుగులు తీసుకుంటూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఆరుగురు మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో వరద పెరగడంతో జేసీబీపై కూర్కొని ఆర్తనాదాలు పెట్టారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. -
కార్మికుల్లో నైపుణ్యాలు పెంచాలి
ఇండోర్: అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో ఉద్యోగులకు, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొత్త తరం కార్మికులకు కొత్త తరం విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జి–20 దేశాల కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మొబైల్ వర్క్‌ఫోర్స్ అనేది వాస్తవ రూపం దాల్చబోతోందని ఉద్ఘాటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో పారిశ్రామిక విప్లవ హయాంలో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీకి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని గుర్తుచేశారు. నూతన ఉద్యోగాల కల్పనలో ఇకపైకూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు, కార్మికులకు స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అనేది కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతల వినియోగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు. వర్క్‌ఫోర్స్‌ను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో ‘స్కిల్ ఇండియా మిషన్’ ప్రారంభించామని తెలియజేశారు. నైపుణ్యాలను పంచుకోవాలి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలతో పంచుకొనే విషయంలో జి–20 దేశాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నైపుణ్యాల సమాచారం ఇచి్చపుచ్చుకోవాలన్నారు. భారత్‌లో కోవిడ్–19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులు ఎనలేని సేవలు అందించారని, వారు తమ నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. సేవా సంస్కృతిని చాటిచెప్పారని, సాటి మనుషుల పట్ల కరుణ కురిపించారని ప్రశంసించారు. నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రపంచానికి అందించగల అతిపెద్ద దేశంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను సృష్టించడంలో భారత్‌కు అపార అనుభవం ఉందని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కౌశల్ వికాస్ యోజన కింద కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో 21.8 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారని మోదీ తెలిపారు. -
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
తండ్రి మృతిని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి..
ఆ చిన్నారి తన ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి వలస కూలీ. ఆ బాలికకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తన తండ్రి సమాధి దగ్గర కూర్చుని తండ్రికి కథలు వినిపిస్తోంది. ఈ ఉదంతం చైనాలోని హెనాన్ ప్రాంతానికి చెందినది. ఆ బాలిక పేరు లిన్ లీ. ఆ బాలిక తండ్రి గత ఏడాది చేపలు పడుతూ నీట మునిగి మరణించాడు. తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి.. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు అందించిన రిపోర్టులోని వివరాల ప్రకారం.. ఆ బాలిక తన అత్తతో గత రాత్రి తనకు తండ్రి కనిపించాడని తెలిపింది. తరువాత తనను తండ్రి సమాధి దగ్గరకు తీసుకువెళ్లాలని మొండిపట్టు పట్టింది. ఆ బాలిక తండ్రి వారి ఇంటికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పనిచేస్తుండేవాడు. అతను ఇంటికి వచ్చినప్పడు పుస్తకాలు చదువుతూ, తన కుమార్తెకు కథలు చెప్పేవాడు. తండ్రి చనిపోయిన తరువాత ఆ చిన్నారి మామ్మతో ఉంటోంది. ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె తల్లి ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ తల్లి దూరమై, తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. ఆ చిన్నారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే ఆ బాలిక అత్త ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసి, ఆ చిన్నారికి ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆమె భావిస్తోంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. అంత చిన్నపిల్ల మదిలో అంత వేదన ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు!
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుంచి కోత వరకు రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు చెక్ పెట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో (సీహెచ్‌సీ) అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. నూరు శాతం ఆర్బీకేల్లో సీహెచ్‌సీల ఏర్పాటు లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి రాగా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఖర్చులు తగ్గించి రాబడి పెరిగేలా.. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మెరుగైన ఆదాయం పొందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల స్థాయిలో 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను నెలకొల్పగా రైతుల వినతి మేరకు రూ.175 కోట్ల వ్యయంతో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. సీహెచ్‌సీల కోసం 40 శాతం సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ఖర్చు చేసింది. పంటల సరళి, స్థానిక డిమాండ్ బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ బాధ్యతలను రైతు గ్రూపులకే అప్పగించింది. పరికరాలు, అద్దె, వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా సత్వరమే యంత్రసేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లు ఆర్బీకేల స్థాయిలో 2 వేల కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తేవడంలో భాగంగా జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లతో పాటు వ్యక్తిగతంగా 7 లక్షల మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3,594 ఆర్బీకేల్లో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇప్పటి వరకు 1,532 గ్రూపులు ట్రాక్టర్లు కావాలని ప్రతిపాదించడంతో కోరుకున్న కంపెనీలకు చెందినవి సమకూర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి మే మొదటి వారంలో నూరు శాతం యూనిట్లు గ్రౌండింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయగా మిగిలిన జిల్లాల పరిధిలో జిల్లాకు కనీసం ఐదు కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన సీహెచ్‌సీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. కూలీల వెతలు తీరాయి.. మా గ్రామం మండల కేంద్రానికి 13 కి.మీ. దూరంలో ఉంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. యంత్రాల కోసం సీజన్లో ముందే బయానా ఇచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అడిగినంతా ఇస్తే కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఆర్బీకే ద్వారా రైతుగ్రూపుగా ఏర్పడి రూ.2.17 లక్షల విలువైన యంత్రాలను తీసుకున్నాం. మా వ్యవసాయ అవసరాలకు వాడుకోవడంతోపాటు మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. – జి.రాఘవకుమారి, కన్వి నర్, శ్రీలక్ష్మీనరసింహ సీహెచ్‌సీ గ్రూపు, దేవవరం, అనకాపల్లి జిల్లా మిగిలిన చోట్ల వచ్చే నెలే గ్రౌండింగ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అన్ని ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను సీఎం జగన్ చేతుల మీదుగా గ్రౌండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
ఇటీవలే పెళ్లి, అంతలోనే ..
సాక్షి, హోసూరు: ఇటీవలే పెళ్లయింది, కానీ అనారోగ్యంతో బాధపడుతూ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని కూస్తనపల్లి గ్రామానికి చెందిన అశోక్ (38). ఇతనికి గత ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అశోక్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..) -
పని చేయాలన్నా బలం ఏది?
కార్మిక శక్తి నుంచి చాలామంది భారతీయులు వైదొలుగుతున్నారు. పని చేయగల వయసు వారిలో 46 శాతం మాత్రమే పనిచేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. కారణం ఏమిటి? పేదలకు అందుబాటులో ఉన్న పనులను వారు శారీరకంగా చేయగల స్థితిలో లేరు. నాలుగింట మూడొంతుల ఉపాధి వ్యవసాయం, నిర్మాణ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లించడం లేదు. పైగా రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచేస్తున్నాయి. దాంతో కఠిన శ్రమ చేయడానికి అవసరమైన పోషణ వీరికి అందడం లేదు. కాబట్టి వీరు పని నుండి తప్పుకొంటున్నారు. మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. ఇదొక విష వలయం! పేద దేశాల ప్రజలు వేతన శ్రమ కోసం వేసారి పోతున్నారు. చట్టబద్ధంగా పనిచేయ గల 15 సంవత్సరాల వయసు రాకముందే వారు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. తక్కువ ఆదాయాలు గల దేశాల్లోని పని చేయగల జనాభాలో సగటున 66 శాతం మంది పనిచేస్తున్నారనీ, లేదా పని చేయాలని అనుకుంటున్నారనీ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చెప్పింది. అధికాదాయ దేశాల్లో ఈ నిష్పత్తి 60 శాతం ఉంది. పేద ప్రజలు ఏ వయసులో ఉన్నా వారు పనిచేయాల్సి ఉంటుందనేది అర్థం చేసుకోదగినదే. అదే సంపన్నుల విషయానికి వస్తే వయసు మీరగానే శ్రామిక శక్తి నుంచి తప్పుకోగలరు. భారత్ విషయానికి వస్తే ఈ తర్కం మారిపోతుంది. భారతీయ శ్రామిక జనాభాలోని 46 శాతం మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారు. ఇవి ఐఎల్ఓ గణాంకాలు. అదే సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నుంచి మీరు గణాం కాలు తీసుకున్నట్లయితే, అవి షాక్ కలిగిస్తాయి. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్–19 మహమ్మారి మనపై దాడి చేయకముందు భార తీయ శ్రామిక జనాభాలో 44 శాతం మాత్రమే పని చేయాలను కుంటున్నారని ఈ డేటా చెప్పింది. 2022 అక్టోబర్ నాటికి ఇది 40 శాతానికి పడిపోయింది. అంటే పనిచేసే వయసు విభాగంలోకి వచ్చిన భారతీయుల్లో 60 శాతం మందికి పనిలేదు లేదా వారు పనిచేయాలని కోరుకోవడం లేదు. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, పని చేయగల వయసులో ఉన్న భారతీయ మహిళల్లో కొద్దిమంది మాత్రమే డబ్బు వచ్చే పని చేయగలుగుతున్నారు. 1990 నుంచి 2006 మధ్య కాలంలోని ఐఎల్ఓ డేటా 32 శాతం మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో పాల్గొంటున్నా రనీ, వీరు డబ్బు వచ్చే పని చేస్తుండటం లేదా అలాంటి పని చేయాలనుకుంటున్నారనీ చెబుతోంది. అదే 2019 నాటికి ఇది 22 శాతానికి పడిపోయింది. ఇక సిఎంఐఈ డేటా మరింత నిరాశాజనక మైన విషయాన్ని బయటపెట్టింది. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్ లాక్డౌన్లు రాకముందు పనిచేయగల వయసులో ఉన్న 12 శాతం మహిళలు మాత్రమే దేశంలో పనిచేస్తున్నారు లేదా పని చేయాలను కుంటున్నారు. 2022 అక్టోబర్ నాటికి ఇలాంటి వారి సంఖ్య 10 శాతానికి పడిపోయింది. అదే చైనాతో పోల్చి చూసినట్లయితే పనిచేసే వయసు ఉన్న 69 శాతం మంది మహిళలు అక్కడ కార్మిక శక్తిలో పాల్గొంటున్నారు. భారతదేశంలో అధోగతిలో ఉన్న మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేటు, పెరుగుతున్న మన ఐశ్వర్యంతో పోలిస్తే అనుషంగిక నష్టంలా కనిపిస్తోందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ఇంటి బయట మహిళలు పనిచేయడం అంటేనే భారతీయులు మొహం చిట్లించుకుంటారు. కానీ డబ్బుకు కటకట అవుతున్న పరిస్థితుల్లో వారికి అంతకు మించిన అవకాశం మరొకటి లేదు. భారతీయులు రానురానూ దారిద్య్రం నుంచి బయటపడుతున్న కొద్దీ వారి మహిళలు పనిచేయడం ఆపివేసి ఇళ్లకు మరలిపోతున్నారు. ఐశ్వర్యం అనేది పేదలను కూడా సంస్కృతీ కరణ ప్రభావానికి గురి చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పేదలు కూడా ఆదాయ నిచ్చెన పైకి ఎక్కుతున్న కొద్దీ మహిళల పట్ల సాంప్రదాయిక భావజాలం వైపు వెళ్లిపోతున్నారు. సౌకర్యంగానే ఉందనిపిస్తున్న ఈ ధోరణిలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి: 2005–06లో కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం గుర్తించదగినంత అధికంగా ఉన్నప్పుడు కూడా పిరమిడ్ దిగువ భాగంలో ఉన్న భారతీయ గృహాలు సంపన్నంగా మారాయనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. రెండు: కొద్దిమంది మహిళలు మాత్రమే వేతనం వచ్చే పనిని కోరుకుంటున్నారని అనుకుంటే, వారు సుల భంగా ఉద్యోగం సంపాదించగలగాలి. కానీ వాస్తవం దానికి వ్యతి రేకంగా ఉంది. దేశంలో పురుషుల నిరుద్యోగితా రేటు 8.6 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగితా రేటు మూడు రెట్లకంటే ఎక్కువగా 30 శాతం ఉందని సీఎంఐఈ అక్టోబర్ నెలకు ప్రకటించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీని అర్థమేమిటంటే, భారత దేశంలో ప్రతి 100 మంది శ్రామిక మహిళల్లో 10 మంది మాత్రమే పనికోసం చూస్తున్నారు. ఇందులోనూ ఏడుగురికి మాత్రమే డబ్బు వచ్చే పని దొరుకుతోందన్నమాట. మరి 2019లో మగవారి పరిస్థితి ఏమిటి? కోవిడ్‌కి ముందు, పనిచేసే వయసులోని భారతీయ పురుషుల్లో 73 శాతం మంది కార్మిక శక్తిలో పాల్గొనేవారని అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కలు సూచిం చాయి. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోని 74 శాతంతో పోలిస్తే ఇది కాసింత తక్కువే. 2019 మధ్యలో పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గురించిన సీఎంఐఈ డేటా ప్రకారం కూడా ఇది 72 నుంచి 73 శాతం మధ్య ఉంటోంది. ఇది 2022 అక్టోబర్ నాటికి 66 శాతానికి పడిపోయింది. 2020 ఫిబ్రవరి నుంచి (కోవిడ్ లాక్డౌన్లకు ముందు) 2022 అక్టోబర్ మధ్యనాటికి భారత్‌లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అదే స్థాయిలో ఉండివుంటే, మరో 3.3 కోట్లమంది పురుషులు కొత్తగా పని కోసం వెదుకుతూ ఉండాలి. కానీ ఈ సంఖ్య 13 లక్షలకు మాత్రమే పెరిగింది. ఫలితంగా 3.2 కోట్లమంది పనేచేసే వయసులోని పురు షులు కార్మిక శక్తి నుంచి వైదొలిగారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఏదంటే, భారతదేశంలోని పేదలకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల తీరు చూస్తే వారు శారీరకంగా పనిచేయగల స్థితిలో లేరు. దేశంలోని అన్ని ఉద్యోగాల్లో నాలుగింట మూడొంతులు వ్యవసాయం, నిర్మాణరంగ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లిం చడం లేదు. వీటిలో రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచే స్తున్నాయి. ఎనిమిది గంటలు పనిచేసే రైతు 4,500 కేలరీలను నష్ట పోతుంటారనీ, అదే సమయం పనిచేసే నిర్మాణ కార్మికుడు 4,000 కేలరీలను కోల్పోతుంటాడనీ యూరప్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో నిర్మాణ రంగం మరింత తీవ్ర శ్రమతో కూడుకున్నది కాబట్టి దీనికి మరింత శక్తి అవసరం. దాదాపు 16 శాతం భారతీయులు పోషకాహార లేమితో ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనా. అంటే పని చేయగలిగే జనాభాలోని పేద ప్రజల్లో అధిక భాగం కఠిన శ్రమ చేయడానికి అవస రమైన కేలరీలలో సగం కూడా పొందలేదని దీని అర్థం. వారు రేషన్లు, ప్రభుత్వం అందించే ఉచితాలు, తమ గ్రామ కమ్యూనిటీ అందించే మద్దతుతో మనగలుగుతున్నారు. ఇదొక విష వలయం. ప్రభుత్వ రేషన్లు నిశ్చల జీవితానికి మద్దతు ఇచ్చేంతగా మాత్రమే పనికొస్తాయి. పేదలు తమ ప్రస్తుత పోషకాహార స్థాయికి తగిన పనులు పొందలేరు. కాబట్టి వారికి మరొక దారి లేదు. అందుకే మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. మనం స్వాతంత్య్రం పొందినప్పుడు భారత్ ఊహించిన పంథాకు ఇది పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. కఠిన శ్రమ నుంచి పరిశ్ర మల్లోని యాంత్రిక శ్రమ వైపు కార్మికులను తరలించడానికి బదులుగా ఈరోజు అత్యంత కఠినమైన పనితో కూడిన ఉపాధి అవకాశాలు మాత్రమే దొరుకుతున్నాయి. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏదంటే– ప్రభుత్వం తక్షణ లాభాలను త్యాగం చేసి అధిక ఉద్యోగావకాశాలు, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధిని కల్పించే యాంత్రీకరణ వైపు మరలడమే. ఇది జరగనంతవరకూ భారత్ తన ప్రజల్లో మెజారిటీకి కేవలం జీవనాధార ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోతుంది. అనింద్యో చక్రవర్తి, వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దొంగతనం చేశాడని చెట్టుకు కట్టేసి మరీ..
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మణికందంలో ఒక కోత మిల్లులో దొంగతనం చేశాడనే ఆరోపణలపై చక్రవర్తి అనే వ్యక్తిని చెట్టుకు కట్టి చచ్చేదాకా కొట్టారు. మర్మాంగాల మీద బలంగా తన్నడంతో అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మిల్లు యజమాని, ఇద్దరు కార్మికులపై పోలీసులు హత్య కేసు నమోదుచేశారు. త్రిచీ-మధురై హైవేలో మణికందం వద్ద ఆశాపుర రంపపు మిల్లు ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన కలపతో.. ఇంటి ఫర్నీచర్ తయారు చేస్తుంటారు వాళ్లు. ఈ క్రమంలో.. శనివారం ఓ వ్యక్తి దొంగతనంగా మిల్లులోకి చొరబడినట్లు అసోంకు చెందిన ముగ్గురు కూలీలు చెప్పారు. దీంతో.. తువకుడికి చెందిన చక్రవర్తి అనే వ్యక్తిని బంధించి చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. మెడ, ఛాతీ, కుడి మోచేయి.. భుజం, మర్మాంగాలపై తీవ్రగాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మర్మాంగాలపై బలంగా తన్నడంతోనే అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలిపారు. దొంగతనం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే.. చెట్టుకు కట్టేసి ప్రాణం లేని చక్రవర్తి కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి.. అసోంకు చెందిన ఫైజల్ షేక్, ముజ్ఫల్ హుక్తో పాటు మిల్లు ఓనర్ ధీరేంద్రపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
రాష్ట్రంలో 2019–20లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6.46%
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి 6.46 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వార్షిక సర్వే నివేదిక వెల్లడించింది. 2018–19లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.3,76,143.34 కోట్లు కాగా 2019–20లో రూ.4,00,462.83 కోట్లుగా తెలిపింది. అంటే 2018–19తో పోలిస్తే 2019–20లో పారిశ్రామికోత్పత్తి విలువ రూ.24,319.49 కోట్లు (6.46 శాతం) పెరిగినట్లు సర్వే పేర్కొంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్ నేపథ్యంలో 2019–20కి సంబంధించిన పారిశ్రామిక సర్వేని ఆలస్యంగా.. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. ఈ సర్వే నివేదికను కేంద్ర కార్యక్రమాలు అమలు గణాంకాలశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్రంలో కొత్తగా 185 ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 2018–19లో రాష్ట్రంలో 16,739 ఫ్యాక్టరీలుండగా 2019–20లో ఆ సంఖ్య 16,924కు పెరిగింది. 2019–20లో రాష్ట్రంలో మొత్తం 6.63 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 2018–19తో పోలిస్తే 2019–20లో ఉపాధి కల్పించిన వారిసంఖ్య 30,432 పెరిగింది. 2018–19లో 6.33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 2018–19తో పోలిస్తే 2019–20లో 29,105 పెరిగింది. 2018–19లో 5.12 లక్షలమంది కార్మికులు పనిచేస్తుండగా 2019–20లో వారిసంఖ్య 5.41 లక్షలకు చేరింది. 2018–19లో కార్మికులకు వేతనాల రూపంలో రూ.8,954.25 కోట్లు చెల్లించగా 2019–20లో రూ.10,243.15 కోట్లు చెల్లించారు. 2019–20లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.29,921 కోట్లు కాగా నికరలాభం రూ.9,584 కోట్లు. 2018–19లో ఫ్యాక్టరీల ఆదాయం రూ.23,406 కోట్లు కాగా నికరలాభం రూ.5,562 కోట్లు. 1948 ఫ్యాక్టరీల చట్టం కింద ఏర్పాటైన పదిమందికి మించి కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. రక్షణసంస్థలు, చమురు నిల్వ, పంపిణీ డిపోలు, రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్, కంప్యూటర్ సేవలు, రైల్వే వంటి డిపార్ట్మెంటల్ యూనిట్లు, వర్క్‌షాప్‌లు, ప్రభుత్వ మింట్లు, శానిటరీ, నీటిసరఫరా, గ్యాస్ నిల్వ మొదలైనవాటిని సర్వే పరిధి నుంచి మినహాయించారు. -
Crime News: ఏలూరులో పెను విషాదం
సాక్షి, ఏలూరు: జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. జామాయిల్ తోటలో పనికి వచ్చారు ఆ కూలీలంతా. ఈ క్రమంలో.. సుమారు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్లిక్: గుడ్ న్యూస్.. కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్ -
పాణాలు తీసిన ప్రహరీ
కృష్ణరాజపురం: భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలి నలుగురు కూలీ కార్మికులు మరణించారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి హోబళి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ వద్ద జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గోడ పక్కనే వేసుకున్న తాత్కాలిక షెడ్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గోడ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ (35), రామ్‌కుమార్ (25), నితీశ్ కుమార్ (22), మణితన్ దాస్ అనే నలుగురు తీవ్రగాయాలతో మరణించారు. నాసిరకం నిర్మాణం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో కూలీ కార్మికులు పనిచేస్తున్నారు. కారి్మకులు ఉండేందుకు తాత్కాలికంగా షెడ్‌ను నిర్మించారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం, అలాగే పక్కనే ఉన్న రాజకాలువ పొంగడంతో ప్రమాదం జరిగింది. ప్రహరీని రాజకాలువను ఆక్రమించి, నాసిరకంగా కట్టినట్లు సమాచారం. ఎలాంటి పునాది లేకుండా ఆ కాంపౌండ్‌కు ఆనుకుని షెడ్‌ను నిర్మించారు. దీంతో వర్షానికి తడిసిన ఆ కాంపౌండ్ గోడ పేకమేడలా షెడ్డుమీద కూలి పోయింది. నలుగురికి తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో సునీల్ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేశ్ అనే నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైట్‌ఫీల్డ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎంటీబీ నాగరాజు, ఎస్పీ పురుషోత్తమ్, డీఎస్పీ పి.ఉమాశంకర్ పరిశీలించారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
Telangana Rains: 11 గంటల ఉత్కంఠకు తెర.. హమ్మయ్య! ఆ తొమ్మిది మంది సేఫ్
సాక్షి, రాయికల్(జగిత్యాల): ఎప్పటిలాగానే చేనులో పత్తి పనులు చేసేందుకు వారం క్రితం 9మంది కౌలు రైతులు కుర్రులోకి వెళ్లారు.. పనులు ముగించుకుని మరో రెండుమూడ్రోరోజుల్లో తిరిగి రావాల్సి ఉంది.. కానీ, గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. నురగలు కక్కుతూ వరద పోటెత్తింది. అప్పటిదాకా ఎంతోనిబ్బరంగా ఉన్న రైతుల్లో ఒక్కసారిగా భయం చోటుచేసుకుంది.. ఇక తాము బతుకుతామో, లేక వరదలో చిక్కుకుని చనిపోతామోననే ఆందోళన మొదలైంది.. వెంటనే మొబైల్ఫోన్ల ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు.. కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ఆగమేఘాలపై ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షితంగా కుర్రులోంచి బయటకు తీసుకురావడంతో 11గంటల ఉత్కంఠకు తెరపడింది. బాలుడిని కుర్రులోంచి బయటకు తీసుకొస్తున్న సహాయక సిబ్బంది అందరూ కౌలురైతులే.. రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మూడు గిరిజన కుటుంబాలకు చెందిన 9మంది కౌలు రైతులు సమీప గోదావరి నదిలోని కుర్రు(పాయ)లో పత్తి చేనులో పనులు చేసేందుకు వెళ్లారు. ఇందులో వల్లె రఘునాథ్, రంగారావు, దేవిదాస్, సహేబ్రావు, కొమ్రె విజయ్, డొక్కె కార్తీక్, సత్యబామ, విజయ, సునీత తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే.. మంత్రి కొప్పుల చొరవ.. ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిస్థితిని సమీక్షిస్తూ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. తొలుత బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించదనే సూచనతో నిజామబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బందాలకు రంగంలోకి దించారు. వారు బోర్నపల్లి ప్రాంతానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రెండు బోట్ల సాయంతో రైతులు ఉన్న కుర్రు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బోట్లలో బాధితులను గోదావరి తీరానికి సురక్షితంగా చేర్చారు. సుమారు రెండు గంటలపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించాయి. గోదావరి ఉధృతి.. బోర్నపల్లికి చెందిన రవీందర్రావు అనే యజమానికి చెందిన కుర్రులోని వ్యవసాయ భూమిని తొమ్మిది మంది రైతులు కౌ లుకు తీసుకుని పత్తి పంట వేస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల పరిధిలోకి వస్తుంది. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రైతులు పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు ఫలించిన అధికారుల కృషి.. ఉదయం 11గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ రవి, ఎస్పీ సిందూశర్మ అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. చివరకు రాత్రి 7గంటలకు రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు అందరిలో ఆనందం.. వరద ఉధృతికి ఇక తాము బతకలేమనే అభిప్రాయానికి వచ్చిన కౌలురైతులను 21 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో ఆనందం వ్యక్తమైంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కసారిగా ఉప్పొంగింది దాదాపు పదిరోజులుగా కుర్రు ప్రాంతంలో సాగు పనులు చేసుకుంటున్నాం. గోదావరి నది ఒక్కసారిగా పొంగింది. ప్రాణాలు పోతాయనుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాయి. – రఘునాథ్, కౌలురైతు భయమేసింది వ్యవసాయం కోసం కుర్రులోకి పోయినం. ఒక్కసారిగా గంగ పొంగడంతో భయపడ్డాం. అధికారుల కృషితో సురక్షితంగా బయటకు వచ్చాం. పడవలో మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చారు. అధికారులకు ధన్యవాదాలు. -జయంత, కౌలురైతు చలికి వణికినం వర్షానికి విపరీతమైన చలివేసింది. భయమైంది. అమ్మనాన్న దగ్గర ఉన్నా. గంగలోకి వరదనీరు బాగా వచ్చింది. చనిపోతనని భయమైంది. అమ్మనాన్న ఉండటంతో ధైర్యంగా ఉన్నా. సార్లు వచ్చి మమ్మల్ని బోటులో తీసుకొచ్చిండ్రు. – కార్తీక్, బాలుడు మాటలు రావడం లేదు వర్షం తీవ్రం కావడం, గోదావరి నది ఉప్పొంగడంతో ఏం చేయాలో మాటలు రాలేదు. అధికారుల కృషితో ప్రాణాలతో బయటపడ్డాం. అధికారులు అందరు కలిసి మమ్మల్ని రక్షించారు. అందరికీ పదివేల దండాలు. – దేవదాసు, కౌలురైతు రెండు గంటలు శ్రమించాం కౌలురైతులను కుర్రు నుంచి బయటకు తీసుకురావడానికి రెండుగంటల పాటు శ్రమించాం. మాది విజయవాడ బెటాలియన్. రెండుబోట్ల సాయంతో 21 మందిమి ఘటన స్థలానికి వెళ్లాం. రైతులను సురక్షితంగా తీసుకువచ్చాం. – ఉపేందర్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్కుర్రు ఆపరేషన్ ఇలా.. ►వారం క్రితం బోర్నపల్లి శివారులోని గోదావరి మధ్యలో గల కుర్రులోకి 9మంది రైతులు వెళ్లారు. ►మంగళవారం ఉదయం 9 గంటలు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ►10.00 : భయంతో వణికిపోయిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ►10.30 : గ్రామస్తులకు తొలుత కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మకు సమాచారం చేరవేశారు. ►11.00 : స్పందించిన కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి సమీపంలోని గోదావరి తీరంలోకి చేరుకున్నారు. ►11.30 : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కలెక్టర్ సమాచారం ఇచ్చారు. ►మధ్యాహ్నం 12.00 : మంత్రి కొప్పుల ఈశ్వర్.. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ►12.30 : హెలికాప్టర్ పంపించి బాధితులను రక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► 01.00 : వాతావరణం అనుకూలించకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ► 01.15 : ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని నిర్ణయం ►మధ్యాహ్నం 2.30 : నిజామాబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం చేరవేత. ► 03.00 : నిజామాబాద్ నుంచి వాహనంలో బయలు దేరిన 21మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ►రాత్రి 07.00 : సంఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు ►08.15 : అన్నీ సిద్ధం చేసుకుని రెండు బోట్లతో గోదావరిలోని కుర్రులోకి బయలు దేరిన సహాయక బృందాలు ►రాత్రి 09.51 గంటలు : 9మంది కౌలురైతులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా నదీతారానికి చేరుకున్నారు. -
పాపం..వీరి నెల జీతం రూ.15వేల కంటే తక్కువే!
భారత్‌లో మూడింట 2 వంతుల మంది బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే పొలం పనిచేసేవాళ్లు, మైనింగ్ వర్కర్లు, కనస్ట్రక్షన్,మ్యానిఫ్యాక్చరింగ్ ఉద్యోగులు నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. పేరోల్ మేనేజ్మెంట్ యాప్ శాలరీబాక్స్ నివేదిక ప్రకారం..పని ప్రాంతాల్లో మహిళలు నెలకు సగటున రూ.12,398 సంపాదిస్తుండగా..వారి సహోద్యోగులైన పురుషుల కంటే 19 శాతం తక్కువ వేతనం తీసుకుంటున్నట్లు తేలింది. ఉద్యోగుల్లో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ.20,000-40,000 (సగటున రూ.25,000) వరకు సంపాదిస్తున్నారని డేటా హైలైట్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెజారిటీ సంస్థలు కేంద్ర వేతన సంఘం (సిపిసి) నిర్ణయించిన కనీస వేతనం (అంటే నెలకు రూ.18,000.)కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తాయని శాలరీ బాక్స్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఆ రంగాల్లో మహిళలకు అత్యధిక వేతనాలు దేశవ్యాప్తంగా 850కి పైగా జిల్లాల నుండి వన్ మిలియన్‌కు పైగా శ్రామికులు డేటాబేస్ ఆధారంగా శాలరీ బాక్స్ ఈ నివేదికను రూపొందించినట్లు శాలరీబాక్స్ సీఈఓ , కో ఫౌండర్ నిఖిల్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సర్వేలో శ్రామిక శక్తిలో కేవలం 27 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, 73 శాతం మంది శ్రామిక శక్తి పురుషులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సూపర్ మార్కెట్లు,కిరాణా స్టోర్ , జనరల్ స్టోర్లతో పాటు గార్మెంట్స్ టెక్స్టైల్ వంటి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు సగటున రూ.8,300 వేతనం తీసుకుంటున్నారని నిఖిల్ గోయల్ వెల్లడించారు. లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ఐటి సాఫ్ట్ వేర్,టైలరింగ్, బొటిక్‌లలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఉందని, జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. -
కార్మికుల సంక్షేమానికి ఈ–శ్రమ్
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు. బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఈ శ్రమ్ కార్డు అంటే... ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది. కార్డుతో ప్రయోజనాలు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది. నమోదు కావాలంటే... ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అసంఘటిత కార్మికులంటే ఎవరు? ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు. (చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్) -
కూలీల సమస్యకి చెక్ పెట్టిన దంపతులు.. రూ.20 వేలు ఆదా!
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: సాగులో కూలీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వ్యవసాయ పనులు చేయలేక, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక పలువురు రైతులు మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలూర్‌కు చెందిన మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి దంపతులు (9666002222) మల్చింగ్ పేపర్‌తో కూలీల సమస్యకు చెక్‌పెట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీలతో ఇబ్బందులు రాంరెడ్డి–లక్ష్మి దంపతులకు ఐదెకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. అయితే, ప్రతీ సీజన్లో కూలీలు సకాలంలో దొరక్కపోవడం, దొరికినా డబ్బులు ఎక్కువగా తీసుకుంటుండటంతో ఖర్చు పెరిగేది. దీనికి తోడు వారానికోసారి పంటలకు నీరు అందించినా నీరంతా ఆవిరి అయ్యేది. రసాయన ఎరువులు వేసినా పెద్దగా ఉపయోగంలోకి రాకపోయేది. దీంతో, పంటకు పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయానికి పొంతనలేకుండా పోయింది. ఎకరంలో మల్చింగ్ పేపర్‌తో.. మల్చింగ్ పేపర్ వల్ల కూలీల సమస్యకు చెక్ పెట్టవచ్చని తెలుసుకున్న దంపతులు, తొలుత ఎకరంలో రూ.8వేలతో మల్చింగ్ పేపర్ వేశారు. ఇందుకోసం భూమిలో రసాయన, సేంద్రియ ఎరువులు వేశారు. రోటోవేటర్‌తో దున్ని, మట్టిపెళ్లలు లేకుండా చేసి గట్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి కోసం గట్లపై ముందుగా డ్రిప్ పైపులు అమర్చి అనంతరం మల్చింగ్ పేపర్ వేశారు. ఖర్భూజ, బీర సాగు మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత గట్టుపై అవసరమున్న చోట రంధ్రాలు చేసి ఖర్భూజ, బీర విత్తనాలు వేశారు. మల్చింగ్ వేయకముందు ఎకరంలో మూడుసార్లు కలుపు తీసేందుకు కనీసం 30 మంది కూలీలకు రూ.15 వేలు ఖర్చయ్యేవి. ప్రస్తుతం కూలీల అవసరం లేకుండా పోయింది. రెండుమూడు పంటలకు వాడుకునేలా మల్చింగ్ను ఏర్పాటు చేశారు. కాగా, మల్చింగ్‌పై సిల్వర్ కోటింగ్ ఉండటంతో సూర్యరశ్మి తగిలి పంటలకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించలేదు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో దిగుబడులు సైతం రెట్టింపు అయ్యాయని రైతులు దంపతులు పేర్కొన్నారు. ఒక్కో పంటకు కూలీలకు అయ్యే రూ.20 వేల ఖర్చును తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం మల్చింగ్ కింద వేసిన పంటల ద్వారా దాదాపు లక్ష వరకు ఆదాయం రావచ్చని సదరు దంపతులు చెప్పారు. నూతన పద్ధతులతోనే ఆదాయం సంప్రదాయ, నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్‌తో ఒక్క పంటకు రూ.20 వేల వరకు ఆదా అవుతాయి. ప్రస్తుతం పంటలపై ఒకరిని చూసి మరొకరు పెడుతున్న పెట్టుబడులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతాయన్న విషయాలను గ్రహించాలి. – మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి -
వజ్రాల గాజు మిస్సింగ్.. వెలకట్టలేని నిజాయతీ
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది. అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు. -
గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి!
యడ్లపాడు: సినీఫక్కిలో రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పొలంలోకి దూసుకెళ్లి తోటలో పూలు కోస్తున్న కూలీ మృత్యువాత పడిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్యకళాశాల విద్యార్థులు ఏడుగురు కొండవీడు సందర్శనకు శనివారం ఉదయం బయలుదేరారు. రెండు బైకులపై నలుగురు విద్యార్థులు, మరో ముగ్గురు వారి వెనుక కారులో ప్రయాణిస్తున్నారు. మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు ఘాట్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో వేగంలో ఉన్న కారు అదుపుతప్పింది. బీటీరోడ్డు పక్కనే ఉన్న మట్టికట్టపై ఎక్కడంతో కారు పైకెగిరి గాల్లోనే 20 మీటర్ల దూరాన లోతట్టుగా ఉన్న రాట్నాల యలమంద సాగు చేస్తున్న కనకాంబరం తోటలోకి వెళ్లి పడింది. సరిగ్గా ఆ సమయంలో పూలు కోస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన మలమంటి శివకుమారి (42)ని కారు ఢీకొనడంతో పాటు ఆమెను ఈడ్చుకువెళ్లింది. కారు ముందుటైరుపేలిపోవడంతో కొద్దిదూరం వెళ్లి పూలతోటలోనే ఆగిపోయింది. దీంతో కూలీ శివకుమారి తలకు బలంగానూ, అలాగే కారులోని ముగ్గురిలో ఓ విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. అప్పటి వరకు శివకుమారితో పాటు పని చేసి పక్కనే ఉన్న మరో తోటలో పూలు కోస్తున్న ఆమె కుమార్తె శిరీష, కూలీలు పరుగున వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శివకుమారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అందరూ చూస్తుండగానే ఊహించని విధంగా రోడ్డుపై వెళ్లే వాహనం గాల్లోంచి వచ్చి పూలతోట లో పనిచేస్తున్న మహిళను ఢీకొని మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించు కోలేకపోతున్నారు. కుమార్తెతో పాటు తోట సీతమ్మ, రాట్నాల మంగమ్మలు శివకుమారిని పక్కతోటలో పూలు కోసేందుకు పిలిచినా, అక్కడి మొక్కలు ఎత్తుతక్కువలో ఉన్నాయని తాను ఒంగి పనిచేయలేనంటూ అక్కడే ఉండటంతో కారు రూపంలో మృత్యువు వెంటాడిందని చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పైడి రాంబాబు తెలిపారు. మృతురాలికి భర్త ఆదినారాయణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధాకరమైన సంఘటన! పూలతోటలోకి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మాధవరావు సోదరి శివకుమారి మృతి బాధాకరమని ఎమ్మెల్యే విడదల రజిని చెప్పారు. శనివారం కొత్తపాలెం గ్రామంలోని శివకుమారి భౌతికకాయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు, గ్రామపెద్దలు ఉన్నారు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు! -
నేరాలు చేద్దామని తుపాకీ కొన్నాడు.. కానీ
సాక్షి, హైదరాబాద్: దినసరి కూలీతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తుపాకీ కొనుగోలు చేశాడు. దాంతో దారినపోయే వారిని బెదిరించి దోపిడీలు చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. అయితే అతడి ప్లాన్‌ను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పటాపంచలు చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న మహ్మద్ హుస్సేన్‌ను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చార్మినార్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఇటీవలే రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్ కాలనీకి మకాం మార్చాడు. రోజు వారి కూలీ డబ్బులు చాలకపోవడంతో దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 9 ఎంఎం తుపాకీ, మేగజైన్, ఆరు బుల్లెట్లను కొనుగోలు చేశాడు. అయితే దోపిడీలకు పాల్పడక ముందే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు అతడిపై సమాచారం అందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట చెక్‌పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆయుధం ఎవరి నుంచి కొనుగోలు చేశాడు? హుస్సేన్ ప్రణాళికలేంటి తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని.. -
Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. కాగా, జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి. గత కొన్ని రోజులుగా టెర్రరిస్ట్‌లు అమాయక వలసకూలీలను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులలో ఇప్పటికే అమాయక కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భయపడిపోయిన కూలీలు ఇప్పటికే జమ్మూ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
జమ్మూకశ్మీర్: కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చిచంపారు. ముష్కరుల కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడ్డాడు. ఇది గత 24 గంటల వ్యవధిలో స్థానికేతరులపై జరిగిన మూడో దాడి కావడం గమనార్హం. బిహార్ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులను పొట్టనపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ముష్కరుల దాడులతో పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను తక్షణమే సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించాలంటూ ఆదేశాలిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటిదాకా 11 మంది బలయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యలపై నిరసన జ్వాలలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకుంటుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఆదివారం పలు ప్రజా సంఘాలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శన చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద శక్తులకు పాక్ సర్కారు మద్దతునిస్తోందని ధ్వజమెత్తారు. పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇటీవల ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి ప్రజలు నివాళులర్పించారు. శివసేన డోంగ్రా ఫ్రంట్, ఆల్ జమ్మూకశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్, రాష్ట్రీయ భజరంగ్ దళ్, జమ్మూ వెస్టు అసెంబ్లీ మూమెంట్, రాజ్‌పుత్ కర్ణీ సేన, భారతీయ జనతా యువమోర్చా నిరసనల్లో పాల్గొన్నాయి. ఉగ్రవాదులను ఏరిపారేస్తాం: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి రక్తం బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిన బూనారు. ఆదివారం రేడియో కార్యక్రమం ‘ఆవామ్ కీ ఆవాజ్’లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణ ప్రజలను, స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతుండడంపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని హెచ్చరించారు. -
‘పార్లమెంట్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలకు చరిత్రలో చోటుండాలి’
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్ ఆర్కైవ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ భవన నిర్మాణ పనుల పురోగతిని సోమవారం ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది డిజిటల్ ఆర్కైవ్‌లో ఒక్కొక్కరి పేరు, ఊరు, ఫొటో, నిర్మాణ పనుల్లో వారి సహకారం వంటి వ్యక్తిగత వివరాలను పొందుపరచాలన్నారు. చదవండి: బాధితులను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి: మెదడుపై ఎఫెక్ట్! నిర్మాణంలో వారి పాత్ర, భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వాలన్నారు. వారందరికీ కోవిడ్ టీకా తప్పనిసరిగా వేయాలనీ, నెలకోసారి హెల్త్ చెకప్ చేపట్టాలని అధికారులను మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ప్రధాని పార్లమెంట్ భవన నిర్మాణపనులను సుమారు గంటపాటు స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.. నాలుక కోసుకున్నాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): మనోవేదనతో ఓ కార్మికుడు నాలుక కోసుకున్నాడు. ఈఘటన హోసూరులో చోటు చేసుకుంది. వసంతనగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగేషన్(58)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగేషన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మురుగేషన్ కత్తి తీసుకొని నాలుకను కోసుకున్నాడు. గమనించిన పిల్లలు నాలుకను ప్లాస్టిక్ కవర్లో భద్రపరచి తండ్రిని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుకను అతికించడం సాధ్యం కాదని, అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఉండదని చెప్పి వైద్యం చేస్తున్నారు. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
చావునోట్లోంచి బయటపడ్డాడు..
సాక్షి, కాజీపేట (వరంగల్): కాజీపేట జంక్షన్లో ఆదివారం రాత్రి ఓ రైల్వే ఉద్యోగి రైలు కిందపడి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై అశోక్‌కుమార్, రైల్వే కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే రైల్వే కార్మికుడు ఎలక్ట్రిక్ లోకోషెడ్ సమీపంలో రైలు పట్టాలు దాడుతుండగా హైదరాబాద్–విశాఖపట్నం వెళ్లే ప్రత్యేక రైలు కింద పడడంతో ఇంజన్ ముందు భాగం క్యాటిల్ గార్డు పట్టాల మధ్య కంకర రాళ్లపై కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది. దీంతో రైలు డ్రైవర్ బ్రేక్ వేసి రైలును ఆపడంతో అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు గమనించి రైలు చక్రాలు, పట్టాల మధ్య చిక్కుకున్న రైల్వే కార్మికుడిని బయటికి తీశారు. అనంతరం రైలు వెళ్లింది. కాగా ఈ ఘటనలో కార్మికుడు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
దారుణం: కూలీ పని ఉందని మహిళను తీసుకెళ్లి..
సాక్షి, జిన్నారం (మహబూబ్‌నగర్): పని కోసం తీసుకువచ్చిన ఓ మహిళపై ఉన్న నగలు తీసుకొని, అత్యాచారం, హత్య చేసిన సంఘటన జిన్నారం మండలం మాదారం పంచాయతీ మంత్రికుంట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. దుండిగల్, బొల్లారం పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాకు చెందిన భామిని(39) కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లా మల్లంపేటలో ఉంటూ, అడ్డా కూలీగా పని చేస్తోంది. ఈనెల 25న కూలీ పని ఉందని ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండాపోయింది. భర్త దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బుధవారం మంత్రికుంట శివారు అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ డీఎస్పీ లింగారెడ్డి, దుండిగల్ సీఐ రమణారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలు భామినిగా గుర్తించారు. ఆమెను తీసుకెళ్లిన స్వామి, నర్సమ్మను విచారిస్తున్నామని సీఐ రమణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
Adilabad: వరదల్లో చిక్కుకున్న పెయింటర్లు
సాక్షి, సారంగాపూర్(ఆదిలాబాద్): మండలంలోని వంజర్ మహాలక్ష్మి ఆలయానికి రంగులు వేయడానికి వెళ్లిన నాగేంద్ర, నవీన్, రవి అనే ముగ్గురు యువకులు గురువారం వరదనీటితో ఆలయంలో చిక్కుకుపోయారు. బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆలయానికి పక్కనే ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించి వరద నీరు ఆలయానికి చుట్టుపక్కలకు చేరుకుంది. దీంతోపాటు స్వర్ణ ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో వరద నీరు కూడా ఆలయం సమీపంలోకి వచ్చి చేరింది. ఈ విషయాన్ని సదరు యువకులు గ్రామస్తులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు స్పందించారు. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సుంకరి, లక్ష్మన్న, గోనె రమేష్, మర్రి రాజేశ్వర్‌లు వరద నీటిని దాటి ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ చిక్కుకున్న ముగ్గురిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు రక్షించారు నెల రోజులుగా ఆలయంలో పనులు చేస్తున్నాం. బుధవారం నుంచి కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో ఆలయం గర్భగుడిలో తలదాచుకున్నం. వరద క్రమేణా తగ్గుతుంది అనుకుంటే పెరగడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలతో బయటపడతామా అనుకున్నాం. చివరకు గ్రామస్తులు మమ్మల్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – నాగేంద్ర, బాధితుడు -
భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. బాలికను బెదిరించి..
సాక్షి, కెలమంగలం (కర్ణాటక): అంచెట్టి తాలూకా వన్నాతిపట్టి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాదప్పన్(26). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు ఓ నిర్మాణ పనులకోసం వెళ్లి 16 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు బాలిక రెండు నెలల గర్భవతిగా తేల్చారు. దీంతో తల్లిదండ్రులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాదప్పపై పోక్సో కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. వివాహిత ఆత్మహత్య హోసూరు: దంపతుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాలు... ఊత్తంగేరి సమీపంలోని పెరుమాళ్‌కుప్పం గ్రామానికి చెందిన గుణశేఖరన్, విజయలక్ష్మి (24)కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా రగడ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన విజయలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : ముగ్గురి దుర్మరణం..
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భవంతి, నిన్న రాత్రి(ఆదివారం) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు భవనంలో 8 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక పీబీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ క్రమంలో ముగ్గురు కూలీలు అప్పటికే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భవంతి కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రించడం వంటి సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నాలుగు రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే.. -
పెరిగిన వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణం..!
న్యూఢిల్లీ: వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు సంబంధించి ద్రవ్యోల్బణం మే నెల్లో స్వల్పంగా పెరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఏఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మేలో 2.94 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు 2.66 శాతం. ఇక గ్రామీణ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఆర్ఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం తాజా సమీక్షా నెల్లో 3.12 శాతం. ఏప్రిల్‌లో ఈ ధరల వేగం 2.94 శాతం. మేలో ఒక్క ఫుడ్ ఇన్ఫ్లెషన్ తీసుకుంటే, సీపీఐ–ఏఎల్ 1.54 శాతంగా ఉంటే, పీపీఐ–ఆర్ఎల్ విషయంలో ఈ రేటు 1.73 శాతం. చదవండి: stockmarket: ఫెడ్ ఎఫెక్ట్, కరెక్షన్ -
హైదరాబాద్‌లో అడ్డా కూలీల తీరని వెతలివి!
ఉదయం కాగానే తాజాగా బతుకు మొదలవుతుంది.. చకచకా అడ్డామీదకు చేరుకుంటారు.. పనికోసం ఎదురు చూస్తుంటారు.. పని దొరికినోళ్లు సంతోషంగా వెళ్తారు.. మిగిలిపోయినోళ్లకు ఎదురుచూపులు తప్పవు. ఒక్కో రోజు మధ్యాహ్నం దాటిపోతుంది.. ఆకలి చంపేస్తుంది.. పనిపై ఆశ మాత్రం చావదు. ఇక ఆ రోజు పనిలేక గడపాల్సిందేననుకుంటూ ఆకలి తీర్చుకునేందుకు స్థానికంగా ఉండే రూ.5 భోజన కేంద్రం వద్ద కడుపు నింపుకొని, కేంద్రం లేనిచోట కడుపు మాడ్చుకొని సాయంత్రం ఇంటిబాట పడతారు. ఇదీ నగరవ్యాప్తంగా ఉన్న అడ్డా కూలీల దుస్థితి. కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఎన్నో కష్టాలు పడుతున్న వలస కూలీల పరిస్థితులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి కథనం.. – సాక్షి, సిటీబ్యూరో ‘ఉప్పల్ గాంధీ బొమ్మ వలస కూలీల అడ్డా.. ఏడాది క్రితం వరకు వందలాది మంది కూలీలతో సందడిగా ఉండేది. ఉదయం 10 గంటల వరకు అంతా పనుల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు కూడా సందడిగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల దాటినా పనుల కోసం పడిగాపులు కాసే కూలీలు కనిపిస్తారు. ఒకప్పుడు అక్కడ కనీసం350 మందికి పైగా వలస కూలీలు పనికోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 250కి పడిపోయింది. సగం మందికి పని దొరికితే.. మరో సగం మంది ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. యూసుఫ్‌గూడ లేబర్ అడ్డాలో గతేడాది ప్రతిరోజూ సుమారు 500 మంది కూలీలు పనికి వచ్చేవారు. ప్రస్తుతం 300 మంది వరకు వస్తున్నారు. అందరికీ పనులు దొరకడం లేదు. ఉప్పల్, యూసుఫ్‌గూడ వంటి అడ్డాలే కాదు. గ్రేటర్‌లోని వందలాది వలస కూలీల అడ్డాలు ప్రస్తుతం పనుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కోవిడ్‌కు ముందు నెలలో కనీసం 25 రోజులు పని లభించగా.. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా 15 రోజులు పనుల్లేక కష్టంగా ఉంటోంది. కొన్నిచోట్ల ఐదు రూపాయల భోజనం ఆదుకుంటోంది. కానీ అడ్డా కూలీలు ఉన్న అన్నిచోట్లా భోజన కేంద్రాలు లేవు. ఎదురు చూపులే... గ్రేటర్ హైదరాబాద్‌లో మేడ్చల్, మేడిపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. కోవిడ్‌కు ముందు గ్రేటర్లో సుమారు 10 లక్షల మంది వలస కూలీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గింది. లాక్డౌన్ రోజుల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో మూడొంతుల మంది తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుమారు 3 లక్షల మంది మాత్రం ఊళ్లలోనే ఉంటున్నారు. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, యూసుఫ్‌గూడ, మల్కాజిగిరి, రామంతాపూర్, ఉప్పల్, గౌలిగూడ, అంబర్పేట్, బాలానగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, ఎల్బీనగర్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్ తదితర సుమారు 2,500 కూడళ్లు వలస కూలీల అడ్డాలు. ప్రస్తుతం ఈ అడ్డాల్లో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది పనికోసం ఎదురు చూస్తున్నారు. కానీ 3.5 లక్షల మందికే పనులు లభిస్తున్నట్లు కారి్మక సంఘాల సర్వేలో వెల్లడైంది. సగం మంది పనికోసం ఎదురు చూడాల్సి వస్తోందని సీఐటీయూ నాయకులు ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల చదువులు ఆగినై.. ఒకరోజు పని ఉంటే మరో రోజు ఉంట లేదు. ఇంతకు ముందు లెక్క లేదు. బతుకు కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా కష్టమైతుంది. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేదు. చదువులు బంద్ అయినై. మా కష్టాలు ఎవరు తీరుస్తరు సార్? – సుజాత, విజయపురి కాలనీ, ఉప్పల్ పెరిగిన ధరలు–పెరగని కూలీ రేట్లు.. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇంధనం ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి. రవాణా చార్జీలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగా లేబర్ రేట్లు మాత్రం పెరగలేదు. పురుషులకు రోజుకు రూ.700, మహిళలకు రూ.600, మేస్త్రీలకు రూ.800 చొప్పున కూలీ లభిస్తోంది. నెలలో కేవలం 15 రోజులే పని దొరుకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది నెలల తరబడి పచ్చడి మెతుకులతోనే గడుపుతున్నారు. కొన్ని చోట్ల రూ.5 భోజనంఆదుకుంటోంది. ఏ పనైనా మంచిదే.. పెయింటింగ్ పని చేస్తాను. కానీ ఇప్పుడు పనుల్లేక ఏది దొరికితే దానికి వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆర్డర్లు తీసుకొని ఇళ్లకు రంగులు వేశాను. ఇప్పుడు అడ్డామీదకు వచ్చి పనికోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు దొరుకుతోంది.. మరోరోజు నిరాశతో వెళ్లిపోతున్నాను. తప్పడం లేదు. – లక్ష్మణ్, సూరారం రూ.5 భోజనం ఆదుకుంటోంది పొద్దున్నే తిన్నా తినకపోయినా.. అడ్డా మీదకు వస్తున్నాను. ఏమాత్రం ఆలస్యమైనా పని దొరకడం లేదు. పని దొరకని రోజు రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నాను. దొరకని రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూసి వెళ్లిపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. – కృష్ణ, చింతల్ పని దొరికితేనే తిండి రోజూ అడ్డా మీదకు వస్తున్నా.. పని దొరికిన రోజు సంతోషం. ఆ రోజు ఇంటిళ్లిపాదికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. పనిలేని రోజు పచ్చడితో బువ్వ తినాల్సిందే.. ఇంటి కిరాయిలు బాగా పెంచిండ్రు. గతంలో నెలకు రూ.5 వేలు ఉండె. ఇప్పుడు రూ.6,500 అయ్యింది. చాలా కష్టంగా ఉంది. – సత్తయ్య, ఉప్పల్ పోటీ పెరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల వల్ల బాగా పోటీ పెరిగింది. రోజుకు రూ.450 నుంచి రూ.500లకే ఒప్పుకుంటున్నారు. వాళ్లకు అపార్టుమెంట్లలోనే ఆశ్రయం ఇచ్చి పనులు అప్పగిస్తున్నారు. అడ్డా కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో కుటుంబమంతా తిప్పలు పడుతున్నారు. – చందు, ఉప్పల్ బిహార్ నుంచి మళ్లీ వచ్చా.. పనికోసం బిహార్ నుంచి ఇక్కడికి వచ్చాను. లాక్డౌన్ రోజుల్లో కష్టంగా ఉండడంతో తిరిగి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాం. పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. రోజుకు రూ.600 మాత్రమే కూలీ లభిస్తోంది. ఇప్పుడేమో సెకెండ్ వేవ్ అంటున్నారు. లాక్డౌన్ పెడితే ఏం చేయాలో అర్ధం కాట్లే. – రౌతమ్, మల్లాపూర్ -
పాపం: 175 ఎకరాల ఆసామి నేడు కూలీగా..
భువనేశ్వర్ : ఒకప్పుడు ఆకలి చావులు, పిల్లల ఆమ్మకాలకు పేరుగాంచి పత్రికల పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేది రాష్ట్రంలోని కలహండి జిల్లా. కరువు రక్కసి కబంధహస్తాల్లో నలిగిపోతున్న కలహండి జిల్లాను పచ్చగా మార్చేందుకు, సాగునీటి వనరుల కోసం బృహత్తర ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అప్పటికి ఆ ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి 175 ఎకరాలకు పైగా భూస్వామి. ఆ గ్రామమంతా ఆయన ఆధీనంలో ఉండేది. ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన యావదాస్తి (భూమి) కోల్పోయాడు. అందుకు తగిన పరిహారం కూడా లభించలేదు. ఇంద్రావతి ప్రాజెక్టు వల్ల కలహండి జిల్లా నేడు కళకళ లాడుతుండగా ఆ ప్రాజెక్టు కోసం ఆస్తులు పోగొట్టుకున్న బ్రజ సుదర బిశాయి జీవితం సున్నం వెలిసిపోయిన గోడలా తయారైంది. ఆయన నేడు ఇంద్రావతి ప్రాజెక్టు బాధితుడు. ఆయన కొడుకు పొట్ట నింపుకొనేందుకు పరాయి రాష్ట్రానికి వలస పోయాడు. ఒకనాటి జమీందారు బిశాయి నేడు కూలీగా మారి పార చేత పట్టి జీవనం గడుపుతున్నాడు. 70 యేళ్లు పైబడిన ఆయన ఒక గడ్డి ఇంటిలో భార్యతో ఉంటున్నాడు. గతంలో ఇంటిలో అనేకమంది పనివారుండేవారు. పనివారిని అజమాయిషీ చేసే ఆయన భార్య నేడు కర్రల పొయ్యిపై వంటచేస్తూ గత జ్ఞాపకాలతో కన్నీరు కారుస్తోంది. కొన్ని సమయాల్లో భర్తతో పాటు పనులకు వెళ్తోంది. కూలి పనులకు వెళ్తున్న బిశాయి దంపతులు కొండంత భూమి..గోరంత పరిహారం ఆయన పూర్వీకుల భూమి తెంతులికుంఠి సమితి ముండిగుడ గ్రామంలో 5.52 ఎకరాలు, ముడిగుమ్మ గ్రామంలో 90 ఎకరాలు, కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి అంబాగుడ గ్రామంలో 80 ఎకరాలు ఉండేవి. ఆ నాడు వందలాది మంది పనివారితో ఆయన ఇల్లు సందడిగా ఉండేది. పాడి పంటలతో లక్ష్మి తాండవించేది. ఆ భూములన్నీ ఇంద్రావతి ప్రాజెక్టులో విలీనమయ్యాయి. ఆనాడు తెంతులికుంఠి సమితిలో ఆయన భూమికి రూ.1,42,387, దశమంతపూర్ సమితిలో భూమికి రూ.64, 861 పరిహారంగా అందింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారం సముద్రంలో నీటిబొట్టు అని, హారతి కర్పూరంలా ఖర్చయిపోయిందని బ్రజ సుందర బిశాయి వాపోయాడు. ఇంద్రావతి ప్రాజెక్టుకు వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయానని, ప్రాజెక్టు తనకు పేదరికం మిగిలి్చందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాజెక్టు నిర్వాసితులకు తగిన పరిహారంతో పాటు, పునరావాసం కల్పిస్తామని పాలకులు ఎన్నో హామీలు ఇచ్చి, చివరికి మొండి చెయ్యి చూపారని కళ్లనీళ్లు కార్చాడు. ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశాక ఒక రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు ప్రభుత్వం సమకూర్చిందని వెల్లడించాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమ్మి యావదాస్తిని ధారబోసి నిరుపేదల్లా మిగిలామని బ్రజసుందర బిశాయి భోరుమన్నాడు. ఆయన మాట గ్రామస్తులకు వేదవాక్కు. గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆయనను జమీందారు అనే పిలిచేవారు. ఆయన వద్ద వందలాదిమంది పనిచేసేవారు. ఒకప్పుడు పదిమందికి దాతగా ఉన్న ఆయన నేడు పిడికెడు బియ్యం కోసం చేతులు చాచే పరిస్థితిలో ఉన్నాడు. రూపాయి కేజీ బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకు కారణం ఇం«ద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇంద్రావతి ప్రాజెక్టు పూర్తయింది. కలహండి జిల్లా సస్యశ్యామలమైంది. పేదరికం కొంత దూరమైంది. అయితే ఆనాటి భూస్వామి నేడు నిరుపేద అయిపోయాడు. అంతే కాదు వృద్ధాప్యంలో కూలిగా మారాడు. నవరంగపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి దీనగాథ ఇది. -
ఇక వారానికి నాలుగే పనిరోజులు!
న్యూఢిల్లీ: ఇక మీదట వీకెండ్ అంటే రెండు రోజులు కాదు. మూడు రోజులు.. ఎంచక్కా వారానికి మూడు రోజులు రిలాక్స్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగని పనిగంటలు తగ్గిపోతాయని అనుకోవద్దు. మిగిలిన నాలుగు రోజులు ఊపిరి సలపకుండా పనిచేయాల్సి ఉంటుంది. వారంలో నాలుగు రోజులు పనిదినాలుగా మార్చుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు అనుమతినివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక కోడ్లపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కసరత్తు చేస్తోంది. అయితే వారానికి 48 గంటల పని విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ కంపెనీలు వారానికి మూడు రోజులు వీకెండ్ సెలవులుగా ఇస్తే, నాలుగు రోజులు పనితో ఉద్యోగులకు ఊపిరి కూడా సలపదు. రోజుకి 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ‘‘కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవు ఇస్తే, మిగిలిన నాలుగు రోజులు రోజుకి 12గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అనుమతితోనే ఈ మార్పులు చెయ్యాలి. ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలపై బలవంతం ఉండదు. కేవలం వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పని సంస్కృతిలో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం’’అని కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు వారానికి 48 గంటలు పని చెయ్యాలి. అంతకంటే ఎక్కువగా పని చేయించుకోవడం నిబంధనలకు వ్యతిరేకం. మన దేశంలో సాధారణంగా రోజుకి ఎనిమిది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పని దినాలుగా ఉన్నాయి. సాఫ్ట్ట్వేర్ కంపెనీలు మాత్రమే శని, ఆదివారాలు సెలవు ఇస్తున్నాయి. ఈ కొత్త కార్మికుల కోడ్ అమల్లోకి వస్తే ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల అనుమతితో వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని అమల్లోకి తేవచ్చు. దీంతో పాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా కూడా కార్మిక కోడ్స్‌లో మార్పులు తీసుకురానున్నారు. 40% పెరిగిన ఉత్పాదకత 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ 4రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా తెచ్చింది. 4 రోజులు పని చేయడం వల్ల ఆ కంపెనీ ఉత్పాదకత ఏకంగా 40శాతం పెరిగింది. కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులు గడపడం వల్ల మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేశారు. ఇలా చేయడం వల్ల కంపెనీలకు కూడా డబ్బులు ఆదా అవుతాయి. విద్యుత్ ఇతర ఖర్చులు బాగా కలిసొచ్చి ప్రతీ ఏడాది కంపెనీ టర్నోవర్‌లో 2% మిగులుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అయితే కేవలం నాలుగు రోజులు పని చేస్తే వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా పని జరగదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. మరోవైపు జర్మనీలోని అతి పెద్ద ట్రేడ్ యూనియన్ ఐజీ మెటాల్ ఫోర్ డే వీక్ కోసం గత ఏడాది పిలుపునివ్వడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఈ విధానం అమలు చేయడానికి మరో అయిదేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. -
వలసలపై డేటా భేష్!
దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికెళ్లే వలస కార్మికులు, ఇతరుల డేటా రూపొందించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంకల్పించడం మంచి పరిణామం. ఈ డేటా రూప కల్పన కోసం ఇతర మంత్రిత్వ శాఖల సహాయసహకారాలు తీసుకోవాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. వచ్చే జూన్‌కు డేటా సిద్ధమవుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభుత్వా లకూ, పౌరులకూ చాలా గుణపాఠాలు నేర్పింది. వలస వచ్చేవారి విషయంలో ఖచ్చితమైన డేటా వుండాలని అంతక్రితం ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ లాక్డౌన్ అమలు ప్రారంభించాక ఆ వివరాలు లేకపోవడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. వలస కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో వుంటారు. లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించి, రవాణా సౌకర్యాలు నిలిపేయడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులను, కూలీలను పనిలో పెట్టుకున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాగోగులు పట్టించుకోవాలని కేంద్రం సూచిం చినా కొద్దిమంది మినహా అత్యధికులు పట్టించుకోలేదు. పైగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టిన ఘనులు కూడా వున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సాయమైనా, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయమైనా అందనివారెందరో వున్నారు. ఉన్నచోటే వుంటే ఆకలిదప్పులతో చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికొచ్చినవారు కుటుంబాలతో సహా స్వస్థలాలకు నడక మొదలుపెట్టారు. అలా వెళ్లినవారి సంఖ్య కోటి పైమాటేనని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఉపాధి హామీ, ఒకే దేశం–ఒకే రేషన్‌వంటి పథకాల కోసం... ఈపీఎఫ్, ఈఎస్ఐ తదితర ప్రయోజనాలు వర్తింపజేయడానికి డేటా సేకరిస్తారు. అలాగే ఆధార్ డేటా సరేసరి. ఇలా భిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు సేకరించే డేటాను సమన్వయపరిస్తే అది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరేచోట్లకు వెళ్లేవారు రిజిస్టర్ చేసుకోవడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేయాలి. మన దేశంలో వలస కార్మికులు ఎంతమంది వుంటారన్న విషయంలో స్పష్టమైన గణాంకాలు లేవు. వలస కార్మికుల సంఖ్య 45 కోట్ల వరకూ వుండొచ్చని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. మన దేశంలో ఏటా సగటున 4.5 శాతం మేర అంతర్గత వలసలు పెరుగుతుంటాయని ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచే వేరే రాష్ట్రాలకు వలసలుంటాయి. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్తుంటారని 2017నాటి ఆర్థిక సర్వే తెలిపింది. తాము వున్నచోట ఉపాధి లేకపోవడం, తక్కువ వేతనాలు లభించడం, కరువుకాటకాలు తలెత్తటం, మెరు గైన వైద్య సౌకర్యాలు కొరవడటం, శాంతిభద్రతలు లేకపోవటం వగైరా సమస్యల వల్ల చాలామంది వలసపోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాంతం, భాష కానిచోట మనుగడ సాగించడం కష్టమని తెలిసినా వారికి అంతకన్నా గత్యంతరం వుండదు. కుటుంబాల్లోని పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు లభించాలంటే... కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే ఏదో రకమైన గుర్తింపు కార్డు వుండాలి. చాలా సందర్భాల్లో అది అసాధ్యమవుతుంది. దేశంలోని వలస కార్మికుల్లో 22 శాతంమందికి ఎలాంటి గుర్తింపు కార్డు వుండదని 2011లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భాష రాకపోవటం వల్ల, స్థానికులు కాకపోవటం వల్ల వారికి పనులు చూపించే దళారులు వలస కార్మికులను నిలువుదోపిడీ చేస్తుంటారు. మెరుగైన వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు రాబట్టు కోవటం వలస కార్మికులకు సులభం కాదు. పనిచేసేచోట సమస్యలేర్పడితే వారిని ఆదుకునే వారుండరు. వలస కార్మికులు సృష్టించే సంపద తక్కువేమీ కాదు. మహా నగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణం మొదలుకొని చిన్న చిన్న పారిశుద్ధ్య పనుల వరకూ అన్నింటా వారి ప్రమేయం వుంటుంది. అయినా ఇన్ని దశాబ్దాలుగా వారికి సంబంధించిన సమగ్రమైన డేటా ప్రభుత్వాల దగ్గర లేదు. ఇది వలస కార్మికులకు, కూలీలకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు సైతం సమస్యే. ఏ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎంతవుందో నిర్దిష్టమైన అంచనా కొరవడటంతో మంచినీరు, డ్రయి నేజ్ వంటి సౌకర్యాల అమలు తలకిందులవుతుంది. వారికి సరైన వేతనాలు లభిస్తున్నాయో లేదో, వారి సంక్షేమానికి ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించుకోవడం అసాధ్యమవుతుంది. వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. వాటికింద నిర్దిష్టమైన పనిగంటలు, వేతనం, ఇతర భత్యాలు అందాలి. అలాగే వారికి తగిన ఆవాసం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. అనుకోని ప్రమాదం సంభవించినా, ఉన్నట్టుండి పని నుంచి తొలగించినా, మరెలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేసే హక్కు వారికుంటుంది. వలస కార్మికుల ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ కోసమంటూ 1979లో చట్టం తీసుకొచ్చారు. దానికి మరింత పదును పెడుతూ 2011లో సవరణలు చేశారు. ఆ చట్టంకింద అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఇతర రాష్ట్రాలవారిని పనిలో పెట్టుకునే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్ నిర్వహిస్తూండాలి. కానీ ఈ చట్ట నిబంధనలు ఎలా అమలవుతున్నాయో చూసేవారు కరువయ్యారు. అందుకే లాక్డౌన్ అనంతర పరిస్థితులపై ప్రభుత్వాలకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా సేకరణకు నడుం కట్టింది గనుక అలాంటి సమస్యలు తీరుతాయని ఆశించాలి. వలస కార్మికుల సామాజిక భద్రతకు, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ డేటా తోడ్పడాలి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన నిర్వ చనం అన్ని చట్టాల్లోనూ ఒకేలా లేదు. ఆ లోపాన్ని కూడా సరిచేయాలి. డేటా ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేసి, వలస కార్మికులకు సకల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
చల్లగా... సంస్కరణలు
హడావుడి లేదు. ఆర్భాటం అసలే లేదు. చడీచప్పుడూ లేకుండా దేశంలో నాలుగురోజుల వ్యవధిలో భారీ సంస్కరణలు పట్టాలెక్కాయి. మొన్నటికి మొన్న సాగు రంగ సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులకు మూజువాణి ఓటుతో పార్లమెంటు ఆమోదముద్ర పడింది. కార్మిక చట్టాలను సంస్కరించే మరో మూడు బిల్లులు సైతం పార్లమెంటులో బుధవారం మూడు గంటల చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులూ మూడు కోడ్లుగా వున్నాయి– కార్మికుల వృత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పని పరిస్థితులపైనా... పారిశ్రామిక సంబంధాల పైనా... కార్మికుల సామాజిక భద్రతపైనా వీటిని రూపొందించారు. మిగిలినవాటి మాటెలావున్నా మొదటి రెండు బిల్లులపైనా కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఇవి రాష్ట్రాల పరిధిలోకి జొరబడి, వాటి హక్కుల్ని దెబ్బతీస్తున్నాయని కేరళవంటి రాష్ట్రాలు ఆరోపిస్తుంటే... ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మికులకు వ్యతిరేకంగా వున్నదని ఆరోపిస్తోంది. నిరుడు మే నెలలో రెండోసారి ఘన విజయం సాధించాక జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సంపద సృష్టి, సంపద పునఃపంపిణీలను ప్రస్తావించారు. ఆ రెండింటినీ ప్రస్తావించారంటేనే తన రెండో దశ పాలనలో అందుకు తగ్గ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చాలామంది జోస్యం చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది. సాధారణంగా అయితే అమల్లో వున్న విధానాలను సమూలంగా మార్చే ఈ మాదిరి సంస్కర ణలు తీసుకురావడం అంత సులభం కాదు. పార్లమెంటులో వాగ్యుద్ధాలు, సభల వాయిదాలు, సమ్మె పిలుపులు, ఆందోళనలు రివాజు. కానీ కరోనా అనంతర పరిస్థితులు దాన్నంతటినీ మార్చేశాయి. అనేకానేక పరిమితుల మధ్య పార్లమెంటు సమావేశంకాగా... ఉద్యోగ భయం, జీతాల కోత వగైరాలతో భవిష్యత్తుపై బెంగతో కార్మికులు, బడుగు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో పాటు, కరోనా అంటేవున్న భయాందోళనల వల్ల సమీకరణ కూడా అసాధ్యం. వీటి అవసరం లేకుం డానే ఇంత ముఖ్యమైన సంస్కరణలపై లోతైన చర్చలు జరిగితే అవి మనం అనుసరిస్తూ వస్తున్న ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిబింబించేవి. సాగు రంగ సంస్కరణల బిల్లుల విషయంలో సభలో విపక్షాలు వున్నా చర్చలు సరిగా సాగలేదు. ఇప్పుడు కార్మిక రంగ సంస్కరణల బిల్లులకైతే దాదాపుగా విపక్షాలే సభలో లేవు. కార్మిక చట్టాల ప్రధానోద్దేశం కార్మికుల హక్కుల్ని పరిరక్షించడం, అదే సమయంలో యాజ మాన్యాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం. ఇప్పుడు అమల్లోవున్న చట్టాలు కార్మిక హక్కుల పరిరక్షణపై అతిగా శ్రద్ధ చూపుతున్నాయని పరిశ్రమల యజమానులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇవి కార్మికులకు ఉపయోగపడటం మాటెలావున్నా అధికారుల అవినీతికి దారితీస్తున్నాయి. చూసీ చూడనట్టు పోవడం కోసం భారీగా సొమ్ము చేతులు మారుతోంది. చాలా పరిశ్రమల్లో రిజిస్టర్లో వుండే కార్మికులకూ, వాస్తవంగా పనిచేసే కార్మికుల సంఖ్యకూ పొంతన వుండదు. అందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మరణించినా, శాశ్వతంగా వికలాంగులైనా వారిపై ఆధారపడే వారికి ఏ అండా లేకుండా పోతోంది. కనుక పారదర్శకమైన, అందరికీ ప్రయోజనకరమైన చట్టాలు వుంటే మంచిదే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలకు అందుకు దోహదపడతాయా? మన దేశంలో వాస్తవంగా కార్మిక చట్టాలెలా వున్నాయో చెప్పడానికి దేశం నలుమూలలా లాక్డౌన్ సమ యంలో స్వస్థలాలకు నిత్యం నడుచుకుంటూ పోయిన వేలాదిమంది వలసజీవులే సాక్ష్యం. సంవత్స రాల తరబడి వారు చేసే చిన్నా చితకా ఉద్యోగాలు, పనులు ఏ చట్టం కిందికీ రాకపోవడం వల్ల హఠా త్తుగా వారు రోడ్డున పడ్డారు. సాయం చేయడం మాట అటుంచి, అత్యధికశాతం యజమానులు వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా ఎగ్గొట్టి వెళ్లగొట్టారు. కార్మిక చట్టాలు పటిష్టంగావుంటే అది అసాధ్యమ య్యేది. చిత్రమేమంటే లాక్డౌన్ సమయంలో యూపీ, ఎంపీ రాష్ట్రాలు కార్మికుల పనిగంటలు పెంచుతూ ఆర్డినెన్సులు తీసుకొచ్చాయి. పెద్దయెత్తున నిరసనలు రావడంతో అవి నిలిచిపోయాయి. ఇప్పుడు ఆమోదం పొందిన మూడు బిల్లులూ 350 పేజీల్లో, 411 క్లాజులతో, 13 షెడ్యూళ్లతో వున్నాయి. ఇంత విస్తృతమైన బిల్లులపై మూడు గంటల వ్యవధిలో చర్చ పూర్తయిందంటే వింతగానే వుంటుంది. నియామకాల్లో, తొలగింపులో ఎక్కువ నిబంధనలు యాజమాన్యాలకే అనుకూలంగా వున్నాయని... వివాద పరిష్కార విధానాలు సైతం కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వున్నాయని బీఎంఎస్ ఆరోపిస్తోంది. పైగా తాము, ఇతర కార్మిక సంఘాలు లోగడ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల్ని కూడా సరిగా పట్టించు కోలేదని చెబుతోంది. ఇంతక్రితం వందలోపు కార్మికులున్న పరిశ్రమల్లో ప్రభుత్వాల ముందస్తు అను మతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్మెంట్లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు. ఇప్పుడది 300మంది కార్మికులుండే పరిశ్రమలకు వర్తింపజేస్తూ మార్చారు. అలాగే జాతీయ స్థాయి పారిశ్రామిక ద్విసభ్య ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితోపాటు కార్మిక సంబంధ అంశాల్లో పరిజ్ఞానం, అనుభవం వున్న ఒకరికి చోటు చోటు కల్పించాలని ముసాయిదాలో వుంటే ప్రస్తుత బిల్లులో దాన్ని ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదావున్న వ్యక్తికి కట్టబెట్టారు. గుర్తింపు కార్మిక సంఘాల విషయంలోనూ, సమ్మె నోటీసు విషయంలోనూ తాజా నిబంధనలు కఠినంగా వున్నాయి. మారిన ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు సంస్కరణలు తీసుకురావడం ఎంత అవసరమో, అవి మెజారిటీ ఆమోదం పొందేలా, ఏకాభి ప్రాయ సాధన దిశగా వుండటమూ అంతే అవసరం. అప్పుడే వాటి ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరతాయి. అటు సాగు రంగ సంస్కరణల్లోనూ, ఇటు కార్మిక రంగ సంస్కరణల్లోనూ ఆ భావన లేకపోవడం విచారకరం. -
అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే
భోపాల్ : అదృష్టం ఎప్పుడు, ఎలా, ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదనడానికి ఇదో తాజా ఉదాహరణ. రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడన్న వార్తలు ఇప్పటికే మీరు చాలా చదివి ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని కోటీశ్వరున్ని చేయలేదుగాని లక్షాధికారిగా మారే అవకాశం వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఓ గనిలో పనిచేస్తున్న కార్మికుడికి ఒకటి, రెండు కాదు... ఏకంగా మూడు విలువైన వజ్రాలు దొరికాయి. వీటి విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకూ ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సుబాల్ అనే కార్మికుడు పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా.. అతనికి 7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి వాటిని తనతో పాటు తీసుకెళ్లకుండా నిజాయితీగా జిల్లా వజ్రాల కేంద్రానికి అప్పగించాడని, ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని వేలం వేస్తామని తెలిపారు. వేలం తరువాత 12 శాతం పన్నును మినహాయించుకుని, మిగిలిన 88 శాతం మొత్తాన్ని సుబాల్ కు అందిస్తామని తెలియజేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం బుందేల్ ఖండ్ రీజియన్ లోని గనుల్లో ఓ కార్మికుడికి 10 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు లభించాయి. దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న పన్నా, వజ్రాల గనులకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గనుల్లో నిత్యం వందలాది మంది వజ్రాల కోసం అన్వేషణలు సాగిస్తుంటారు. -
దారుణం.. రూ.4వేల కోసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం నాలుగు వేల రూపాయల బిల్లు కోసం ఆస్పత్రి యాజమాన్యం ఓ రోజు కూలీని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన సుల్తాన్ ఖాన్(44) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో అతడి బంధువు చమన్, సుల్తాన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని చమన్ డాక్టర్లును అడిగాడు. అయితే వారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాక చెప్తాం ముందు రూ.5 వేలు కట్టమని చెప్పారు. చమన్ అలానే చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి వర్గాలు మరో నాలుగు వేలు చెల్లించాలని చెప్పారు. అప్పుడు చమన్ ముందే ఐదువేలు కట్టామని చెప్పడంతో అవి బెడ్ చార్జెస్ అన్నారు. దాంతో చమన్ తాము అంత డబ్బు చెల్లించలేమని.. డిశ్చార్జ్ చేయమని కోరాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మిగతా నాలుగువేలు చెల్లిస్తేనే సుల్తాన్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. దాంతో చమన్‌కి, ఆస్పత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో హస్పటల్ స్టాఫ్ సుల్తాన్‌పై కర్రలతో అమానుషంగా దాడిచేశారు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ కెమరాలో రికార్డయ్యాయి. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశాం.. దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన సర్కార్
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్మికుల పనిగంటలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. సాధారణంగా కార్మికులు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీనిని సవరిస్తూ యోగి సర్కార్..రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందిగా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. (లాక్డౌన్: సీఎం యోగి కీలక నిర్ణయం ) కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నాలుగు కార్మిక చట్టాలను మినహాయించి అన్నింటినీ సవరించాలని ఇటీవలె యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాపార రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుంచి వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగానే కార్మికుల పని గంటలు పెంచింది. కాగా, తాజా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పనిగంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. (గృహ రుణాలపై వడ్డీ తీసుకోకూడదు: ప్రియాంక ) -
గుండెలు పిండేసే దృశ్యం..
ఇండోర్: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం హడావుడిగా లాక్డౌన్ ప్రకటించడంతో వలసజీవులు అష్టకష్టాలు పడుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండి దొరక్క, ఉండటానికి గూడుకరువై లక్షలాది మంది బడుగు జీవులు నగరాల నుంచి కాలినడన గ్రామాల బాట పడుతున్నారు. మూటముల్లె సద్దుకుని పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడుస్తూ నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలసజీవుల వెతలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వలస కార్మికులకు చెందిన హృదయ విదారక ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో వెలుగు చూసింది. నగరం నుంచి తన కుటుంబాన్ని సొంత ఊరికి చేర్చేందుకు వలస కార్మికుడు కాడెద్దులా మారి బండి లాగుతున్న దృశ్యం చూపరులను విస్మయానికి గురిచేసింది. రాహుల్ అనే వ్యక్తి ఇండోర్ జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడంతో తన రెండెడ్ల బండిపై 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు మండ్ల నయాత గ్రామానికి వెళ్లిపోవాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక అయిన కాడికి ఒక ఎద్దును అమ్మేశాడు. భార్యను, తమ్ముడిని బండిపై కూర్చొబెట్టి మరో ఎద్దుకు జతగా తానే కాడిని ఎత్తుకుని పయనం మొదలుపెట్టాడు. (అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం) ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై బండిని లాగుతూ మీడియా కంటపడ్డాడు. ప్రతినిధులు అతడిని పలకరించగా తన కష్టాలను కలబోసుకున్నాడు. ‘సొంతూరికి వెళ్లాలని నా ఎద్దును చాలా తక్కువ ధరకు అమ్మేశాను. మామూలు రోజుల్లో అమ్మితే రూ. 15 వేలు వచ్చేవి. కానీ నేను 5 వేలకే నా ఎద్దును విక్రయించాన’ని రాహుల్ తెలిపాడు. తన తండ్రి, సోదరి కాలినడకన ముందే వెళ్లిపోయారని చెప్పాడు. రాహుల్ బండి లాగుతున్న వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి తులసీ సిలావత్ స్పందించారు. రాహుల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇండోర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) -
వలస కార్మికుల కష్టాలకు చెక్.. సొంతూళ్లకు
భోపాల్ : లాక్డౌన్ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా వలస కూలీల బాధలు వర్ణణాతీతం. సొంతూళ్లకు వెళ్లలేక, తినడానికి తిండి లేక నానా అవస్తలు పడుతున్నారు. ఊరికి చేరుకుంటూమో లేదో తెలియని పరిస్థితుల్లోనూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణిస్తూ అలసి సొలసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వారికి తీపి కబురు అందించాయి. వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న తమ రాష్ర్ట వలస కార్మికులను తీసుకురావడానికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇతర రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వారిని బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ప్రకటించాయి. దీనికి సంబందించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆయా రాష్ర్ట సీఎంలతో మాట్లాడినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న తమ ప్రాంత వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తామంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ శివరాజ్ సింగ్ చౌహన్ కు సహకారమందించేందుకు హామీ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఇండోర్ జిల్లాలో చిక్కుకున్న చిక్కుకున్న కార్మికులకు ఉపశమనం లభించదు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ఎక్కడివాళ్లు అక్కడే ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మధ్యప్రదేశ్ కార్మికులను కూడా వెనక్కి పంపేది లేదని తేల్చి చెప్పింది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున ఇతర రాష్ర్టా నుంచి వచ్చేవారిని సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తారు. -
ఆపత్కాలానికి జర్మనీ ‘రిజర్వ్’ నిధులు
కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా అన్ని పరిశ్రమలూ మూతపడిన నేపథ్యంలో జర్మనీ భారీ స్థాయి లేఆఫ్‌లను నిరోధించడానికి ఒక సుపరిచిత ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. దీంతో కార్మికులు పనిచేయనప్పటికీ వారికి వచ్చే వేతనంలో మూడింట రెండొంతులకంటే ఎక్కువ వేతనాన్నే పొందగలరు. అదేసమయంలో కంపెనీలకు కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి సమయాల్లో ఉద్యోగులపై పెడుతున్న ఖర్చుల భారం కాస్త తగ్గుతుంది. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి కాలంలో సుశిక్షితులైన తమ సిబ్బందిని తమతో అట్టిపెట్టుకునేందుకు లుఫ్తాన్సా, బీఎమ్‌డబ్ల్యూ, వోక్స్‌వేగన్, డైమ్లర్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ప్రత్యేకమైన లేబర్ మార్కెట్ సాధనాన్ని ఉపయోగించుకున్నాయి. విషయానికి వస్తే, జర్మనీలో దాదాపు 5 లక్షల కంపెనీలు తమ సిబ్బందిని తాత్కాలిక పని పథకాలకు పంపించివేశాయి. జర్మనీలో ఈ పథకాలను కుర్జార్‌బియట్ అని పిలుస్తారు. ఉద్యోగుల వేతనాల భారాన్ని తగ్గించుకోవడానికి జర్మనీ కంపెనీలు తక్షణమే ఈ పథకాన్ని అమలులో పెట్టేశాయి. జర్మనీ ఇటీవలి చరిత్రలో చివరకు 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇంత అధిక స్థాయిలో తాత్కాలిక పని పథకాలకు అప్లికేషన్లు రాలేదు. ఈ తాత్కాలిక పని పథకం చాలా బాగా పనిచేసింది. గత సంక్షోభ కాలంలో భారీ స్థాయిలో లేఆఫ్‌లను నిరోధించే సాధనంగా ఇది తన పాత్ర నిర్వహించింది. ఈ పథకం ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసింది లేక వారి పని గంటల్ని తగ్గించింది. అదే సమయంలో ఉద్యోగుల వేతనాల్లో మూడింట రెండొంతుల దాకా ప్రభుత్వమే చెల్లించడంతో ఉద్యోగులు అధికారికంగా కంపెనీ ఉద్యోగులుగా ఉంటూ వచ్చారు. ఈ సందర్భంగా కుర్జార్‌బియట్ అటు ఉద్యోగులకు, ఇటు యజమానులకూ ఉపయోగపడే గొప్ప సాధనమైంది. అది ఏకకాలంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించింది. ఇటు యజమానులకు రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ డిమాండుకు తగినట్లుగా ప్లాన్ చేసుకునే విషయంలో వారికి మరింత భద్రతను కల్పించింది అని డాయిష్ బ్యాంకుకు చెందిన చీఫ్ జర్మన్ ఆర్థికవేత్త స్టీఫెన్ షెనిడర్ చెప్పారు. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ తాత్కాలిక పని విధానం నిరూపిత సాధనంగా నిలిచింది. 2009లో జర్మనీ ఆర్థిక ఫలితం 5 శాతం మేరకు కుదించుకుపోయినప్పుడు సంవత్సర కాలంలోనే సగటున 11 లక్షలమంది కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో బెర్లిన్ పది బిలియన్ యూరోల (10.9 బిలియన్ డాలర్లు)ను నష్టపోయింది. కానీ సంవత్సరాంతానికి, ఉపాధి రేటు 7.6 శాతం వద్ద నిలిచింది. ఇది 2008 కంటే తక్కువ. కరోనా నేపథ్యంలో ఈసారి దాదాపు 23.5 లక్షలమంది ఉద్యోగులు ఈ ‘కుర్జార్బియటెర్గెల్డ్’ (తాత్కాలిక అలవెన్స్)లో చేరనున్నారని అంచనా. దీనివల్ల ఫెడరల్ లేబర్ ఆఫీసుకు 10 బిలియన్ యూరోల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జర్మనీ సాంప్రదాయికంగా తక్కువ ఖర్చు చేసి పొదుపుకు ప్రాధాన్యం ఇచ్చే దేశం కనుక, అలా ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిన కాలంలో పొదుపు చేసిన నిధులను ప్రస్తుత సంక్షోభ సమయంలో వెచ్చించింది. చివరకు లేబర్ ఆఫీసు కూడా 26 బిలియన్ యూరోల నిల్వలను సిద్ధం చేసి ఉంచుకుంది. ఈ భారీ మొత్తం ఇప్పుడు కంపెనీలకు, ఉద్యోగులకు దన్నుగా నిలిచేందుకు ఉపయోగపడింది. గత సంక్షోభంలో వలే కాకుండా, ఇప్పుడు రెస్టారెంట్లు, కన్సల్టెంట్లు వంటి చిన్నచిన్న సర్వీస్ సంస్థలు ఈ తాత్కాలిక పని పథకాన్ని చక్కగా ఉపయోగించుకున్నాయి. జర్మన్ కార్పొరేట్ ప్రపంచం మొత్తంగా తమ సిబ్బందిని తాత్కాలిక పని పథకాలకు పంపిం చారు. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి విజృంభిస్తున్న కాలంలో అత్యుత్తమ శిక్షణ పొందిన తమ కార్మికులను పోగొట్టుకోకుండా ఉండటానికి లుఫ్తాన్సా, బీఎమ్‌డబ్ల్యూ, వోక్స్‌వేగన్, డైమ్లర్ వంటి దిగ్గజ సంస్థలు కుర్జార్‌బియట్ అని పిలుస్తున్న ఈ లేబర్ మార్కెట్ సాధనాన్ని ఈసారి చక్కగా వినియోగించుకున్నాయి. ఆహ్వానించాయి కూడా. అయితే ఈ వినూత్న పథకాన్ని ఇతర దేశాలు కూడా ఉపయోగించుకోబోతున్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లియెన్ ఇతర దేశాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను పంచుకున్నారు. దీని కోసం ఈయూ 100 బిలియన్ల యూరోలను సేకరించాల్సి ఉంటుంది. అయితే ఇంత భారీ మొత్తాలను పెంచాలంటే ఈయూ సభ్య దేశాలన్నీ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నిధిలో 25 శాతంకంటే ఎక్కువ మొత్తాన్ని జర్మనీయే భరించాల్సి ఉంటుంది కూడా. యూరో జోన్ పొడవునా కరోనా బాండ్స్ పేరిట సంయుక్త రుణ సాధనం ప్రాధాన్యాన్ని తగ్గించడానికి బదులుగా, ఇప్పటికే వైరస్ బారిన పడి భారీగా నష్టపోతున్న స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగాల కోతను నిరోధించడానికి తాత్కాలిక ఉపాధి పథకం పట్ల సంఘీభావం ప్రకటించాల్సి ఉంది. భారత వలస కార్మికుల దుస్థితి! కరోనా వైరస్ విజృంభణతో మనం బెంబేలెత్తిపోతున్నాం కానీ, ఆపత్కాలంలో ఎదురీడానికి జర్మనీ రిజర్వ్ నిధులను ముందే సిద్ధం చేసుకుంది. దీని దన్నుతో ఉద్యోగుల వేతనాలకు చిల్లుపడకుండా జర్మనీలో అమలు చేస్తున్న తాత్కాలిక ఉపాధి పథకం యూరప్ ఖండానికి ఆదర్శప్రాయంగా మారబోతోంది. భారత అసంఘటిత కార్మికుల్లో 18 శాతంమందికి మాత్రమే కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అందుతున్నాయని తాజా సర్వే ప్రకటించింది. రేషన్ కార్డు కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక కార్డులు కానీ మన దేశంలో కోట్లాది మంది వలస కార్మికులకు లేని కారణంగా లాక్డౌన్ పొడిగింపు దశలో వీరు తీవ్రంగా దెబ్బతిననున్నారు. జర్మనీ కార్మికుల సంక్షేమానికి 26 బిలియన్ యూరోలను నిల్వచేసి వాడుతుంటే.. భారత కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో అతిస్వల్ప మొత్తాన్ని మాత్రమే వేసి ఊరుకుంది. కానీ, కోట్లాది వలస కార్మికులకు నెలవారీ ఆదాయం లభించే ఏర్పాటు చేయకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయన్నది వాస్తవం. అన్నెట్టీ వెయిష్బాహ్ వ్యాసకర్త సీనియర్ రిపోర్టర్, సీఎన్‌బీసీ -
లేబర్ సెస్‌ను వాడుకోండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థలు చెల్లించే లేబర్ సెస్‌ను కార్మికుల సంక్షేమానికి వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక, అనుబంధ ప్రయోజనాలను కల్పించడానికి లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖలో 3.5 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారు. ఈ బోర్డులో సుమారు రూ.52 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2 వేల కోట్ల లేబర్ సెస్.. గతేడాది మార్చి నాటికి తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డులో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు. ఇందులో 10 శాతం మంది ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కార్మికులుంటారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డులో రూ.1,800–2,000 కోట్ల లేబర్ సెస్ నిల్వ ఉందని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డ్ సభ్యుడు గంధం ఆంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే లేబర్ సెస్ ప్రయోజనం వర్తిస్తుందని.. ఆయా కార్మికుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించే ప్రయోజన సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికీ ప్రయోజనం.. భవన, నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవల చట్టం కింద కార్మిక సంక్షేమ బోర్డులు లేబర్ సెస్‌ను సమీకరిస్తుంటాయి. డెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ బోర్డు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాజెక్ట్ వ్యయంలో 1 శాతం సెస్ రూపంలో డెవలపర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలోని కార్మికుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్లకు మాత్రమే కాకుండా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈ నిధుల ప్రయోజనం అందేలా చూడాలని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి కోరారు. శాశ్వత కార్మికులను మాత్రమే డెవలపర్లు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేస్తుంటారు. రోజూ వారీ వేతనం కింద కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లను వినియోగించుకుంటారు. కరోనా ‘కేర్’ నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే.. ► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి. ► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి. ► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ► ప్రాజెక్ట్ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్ చేయాలి. ► ప్రాజెక్ట్‌లు, లేబర్ క్యాంప్లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు. ► లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి. ► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. -
దినసరి కూలీకి ఐటీశాఖ నోటీసులు
భువనేశ్వర్: ఒక్కనాడు పనికి వెళ్లకపోయినా పూట గడవని కూలీకి రూ.2.59 లక్షలు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపింది. దీంతో షాక్ తిన్న కూలీ అంత డబ్బు తానెక్కడి నుంచి కట్టేదంటూ లబోదిబోమంటున్నాడు. దినసరి కూలీకి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపిన ఉదంతం ఒడిశాలో చోటు చేసుకుంది. నాబారంగ్‌పూర్‌లోని పుర్జరిభరంది గ్రామానికి చెందిన సనధర్ గంద్ ఓ దినసరి కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. 2014-15 వార్షిక సంవత్సరంలో బ్యాంకులో రూ.1.74 కోట్ల లావాదేపీలు జరిపినందుకు గానూ ఐటీ శాఖ ఆదారులు పన్ను నోటీసులు పంపారు. దీనిపై సనధర గంద్ మాట్లాడుతూ.. ‘నాకంతా అయోమయంగా ఉంది. రూ. 2.59 లక్షలు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. కానీ ఇంత డబ్బు ఎక్కడినుంచి తేవాల’ని ప్రశ్నించాడు. సనధర్ గంద్ ఇక అదే గ్రామానికి చెందిన ‘పప్పు అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఆ సమయంలో నా భూమి పట్టా అడిగితే ఇచ్చాను. నా ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు కాపీలు అడిగితే ఇచ్చాను. వాటితో ఆయన ఏం చేశాడో నాకు తెలీదు. ఖాళీ పేపర్, భూమి పట్టాలపై నా సంతకం తీసుకుని మోసం చేశాడు’ అంటూ సనధర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కూలీ గుర్తింపు కార్డుల ఆధారంగా వ్యాపారి బ్యాంకు ఖాతాను తెరిచి, దాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించారన్నది తమకు అనవరసరమని పేర్కొనటం గమనార్హం. చదవండి: ఆదాయపు పన్నులు నాలుగు శ్లాబ్‌లలో ఉండాలి -
ఆమెపై పొగలు కక్కే వేడినీళ్లు గుమ్మరించాడు
సాక్షి, నార్సింగ్‌పూర్: ఓ వ్యక్తి తన ప్రేయసిపై వేడినీళ్లు గుమ్మరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నార్సింగ్‌పూర్‌లోని కెడియా గ్రామానికి చెందిన సూరజ్ ప్రభుదయాల్ యాదవ్, అతని ప్రేయసి ఇద్దరూ భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. వీరిద్దరూ మంకాపూర్‌లో ఓ గది తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇక ఈ మధ్య ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సూరజ్ గురువారం ఆమెతో గొడవకు దిగాడు. వీరి తగవు తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు ఆమెపై పొగలు కక్కుతున్న వేడినీళ్లు పోశాడు. దీంతో కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చదవండి: భార్య తలతో 1.5 కిలోమీటర్లు.. -
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఉపకారవేతనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా కోర్సు పూర్తి చేసిన కార్మికుల పిల్లలు సంబంధిత కార్మిక కమిషనర్ కార్యాలయం నుంచి దరఖాస్తును పొందాలని, వాటిని పూర్తి వివరాలతో పూరించి 2020 ఫిబ్రవరి 15వ తేదీలోగా కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని, రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉపకారవేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. -
డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు
నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తను చేసిన పనికి కూలి అడిగిన ఓ 60 ఏళ్ల వృద్ధున్ని ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా హింసించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన చమ్రూ పహరియాకు పని కల్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నాగ్‌పూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ఏడాది జూలైలో బాండెడ్ లేబర్‌గా చమ్రూను పనిలో చేర్చుకున్నారు. అయితే కొంతకాలం తరువాత చమ్రూ తనకు రావాల్సిన డబ్బులు అడగడంతో డోలాల్ సట్నామి, బిడేసి సునామి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. చమ్రూను దారుణంగా కొట్టడమే కాకుండా.. కుడి చేతి మూడు వేళ్లను, కుడి కాలి ఐదు వేళ్లను పదునైన ఆయుధంతో కత్తిరించారు. ఈ దాడి అనంతరం చమ్రూకు ఏం చేయాలో తోచలేదు. భయంతో తన సొంతూరు వెళ్లేందుకు నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే గాయాలతో ఉన్న చమ్రూను గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత చమ్రూ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతన్ని తిరిగి వారి ఊరికి తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్ అనే ఉద్యమకారుడు చమ్రూకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. అలాగే చమ్రూ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరాడు. ఈ ఘటనపై చమ్రూ కుమారుడు తులరామ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వారు తీవ్ర అన్యాయం చేశారు. మా నాన్న తన పనులు కూడా తాను చేసుకోలేపోతున్నాడు. కనీసం చేతులతో ఏ వస్తువును కూడా పట్టుకోలేకపోతున్నాడ’ని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు చమ్రూ మాత్రం భయపడుతున్నాడు. మరోవైపు చమ్రూపై దాడికి దిగిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
బలైపోతున్న కార్మికులు
సాక్షి, కొత్తూరు: కార్మికుల భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేమి నిర్వాహకులకు వరంగా మారింది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని పరిశ్రమల్లో ఏమాత్రం అనుభవం లేని కార్మికులతో పనులు చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరగడం, కార్మికులు మృత్యుఒడికి చేరడం సాధారణ విషయంగా మారిపోయింది. తమ ప్రాంతంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కొత్తూరు పారిశ్రామిక వాడలో పనిచేసేందుకు వస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తున్న వారు తరచూ ప్రమాదాలు జరగడంతో ఇక్కడే బలైపోతూ సొంత ప్రాంతాలకు విగతజీవులుగా వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నచందంగా మారింది. పరిశ్రమల్లో తరచూ తనిఖీలు చేసి కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని కొత్తూరు, నందిగామ మండలాల్లో ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమలు పదులసంఖ్యలో ఉన్నాయి. ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. భద్రత ఎండమావే.. ముఖ్యంగా ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమల నిర్వాహకులు కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని కార్మికులను పనలో పెట్టుకోవడంతో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించుకునే జాగ్రత్తలు తెలియక చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినా సంబంధిత కంపెనీల నిర్వాహకులు ఏమాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. ఎంతోకొంత బాధితులకు పరిహారం ముట్టజెప్పి చేతులెత్తేస్తున్నారు. విషయం వెలుగులోకి రాకుండా మిగతా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ప్రతి పరిశ్రమలో భద్రతా అధికారి (సెఫ్టీ ఆఫీసర్) నిత్యం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించాలి. అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే ఎలా వ్యవహరించాలి.. ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై తర చూ ప్రదర్శనలు(మాక్ డ్రిల్) నిర్వహించాలి. అంతేకాకుండా యంత్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి కార్మికుడు తప్పకుండా రక్షణ పరికరాలను వినియోగించే విధం గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అమ లు కావడం లేదు. ఇక్కడి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నా రెండుమూడు పరిశ్రమల్లోనే సెఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు ఐరన్ పరిశ్రమల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అంతగా అవగాహన లేదు. ఇదే అదనుగా భావిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు తమ కంపెనీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే అందులో 40 మందికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. క్వాటర్స్‌లో ఉండే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ అంశాలను పరిశ్రమల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ తనిఖీలు చేస్తున్నా కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోకున్న దాఖలాలు లేవు. పరిహారం అంతంతే నిబంధనల ప్రకారం ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగితే వెంటనే నిర్వాహకులు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాగా ఇక్కడి నిర్వాహకులు మాత్రం ప్రమాదాలు జరిగితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ కార్మికులు ప్రమాదాల బారినపడి మృతిచెందితే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచే వారి బంధువులకు అప్పగించడం.. స్వస్థలాలకు చేరవేయడం హడావిడిగా చేస్తున్నారు. ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతేతప్ప నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వడం లేదు. ఒకవేళ విషయం బయటకు వచ్చి బాధితులు కార్మిక సంఘాలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తే తప్ప వారికి న్యాయం జరగడం లేదు. జరిగిన ప్రమాదాలు ఇవీ.. కొత్తూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఐరన్ పరిశ్రమలో (ఫర్నస్)బాయిలర్ పేలిన ప్రమాదంలో ఐదేళ్ల క్రితం పదిమంది మృతి చెందారు. పారిశ్రామికవాడలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో నాలుగేళ్ల కాలంలో పలు ప్రమాదాలు జరిగాయి. నలుగురు కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు తీగాపూర్ శివారులో పాత టైర్లను కాల్చే పరిశ్రమలో ఆరేళ్ల క్రితం బాయిలర్ఢ్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. నందిగామ మండలంలోని శివశక్తి, జాగృతి పరిశ్రమల్లో బాయిలర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా గురువారం రాత్రి తీగపూర్ శివారులోని మానసరోవర్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు నేను విధులు నిర్వహిస్తున్న ఐరన్ పరిశ్రమలో యాజమాన్యాలు కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేనేలేవు. చివరకు పనికితగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. రేకుల షెడ్డులే క్వాటర్స్గా మార్చారు. అనారోగ్యానికి గురైనా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాల గురించి ప్రశ్నిస్తే యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు వేధిస్తున్నారు. – ఓ కార్మికుడి ఆవేదన తనిఖీ అధికారం మాకు లేదు పరిశ్రమలు కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేసే అధికారం మాకు లేదు. ఒక జిల్లా అధికారులు.. మరో జిల్లాకు వెళ్లి ర్యాండమ్‌గా పరిశీలిస్తారు. ఈమేరకు ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఫిర్యాదులు వస్తేనే మేము క్షేత్రస్థాయి కి వెళ్లి ఆరా తీయాల్సి ఉంటుంది. కొత్తూ రు మండలంలోని మానస సరోవర్ పరి శ్రమలో బాయిలర్ పేలడంతో కార్మికుడి మృతికి కారణమైన కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే ఘటన విషయాన్ని మాకు తెలియజేయకపోవడమూ నేరమే. దీనిపైనా చర్యలు ఉంటాయి. – కె.శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ -
గల్ఫ్‌కు వెళ్లే ముందు..
గల్ఫ్ డెస్క్: ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరబ్ గల్ఫ్ దేశాలు, మలేషియా తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) కార్యాలయంలోని శిక్షణ కేంద్రంలో ఒకరోజు శిక్షణ ఇస్తున్నారు. 18 ఇసీఆర్ (ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ – విదేశీ ఉద్యోగానికి వెళ్లడానికి అనుమతి అవసరమైన) దేశాలకు ఉద్యోగానికి వెళ్లదలచిన వారి కోసం భారత ప్రభుత్వం ఒక రోజు ఉచిత పీడీఓటీ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్) సదుపాయం కల్పిస్తోంది. సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు ఆయా దేశాల సం స్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనల గురించి వలస వెళ్లే కార్మికులకు అవగాహన కల్పించడం ఈ శిక్షణ ఉద్దేశం. రిక్రూట్మెంట్ నుంచి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షకులు కార్మికులకు వివరిస్తారు. గల్ఫ్ దేశాల్లో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అక్కడి శిక్షలను కూడా తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఏ రంగంలో పనిచేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయలను వివరిస్తున్నారు. నాటకం, పాటల ద్వారా శిక్షకులతో బోధన అందిస్తున్నారు. ప్రతీ వారం హైదరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా అవసరాన్ని బట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు. 18 ఇసీఆర్ దేశాలు ఇవీ.. ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం 18 దేశాలను ఈసీఆర్ కేటగిరీ దేశాలుగా గుర్తించారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, యూఏఈ, ఆఫ్గనిస్తాన్, ఇరాక్,జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, నార్త్ సుడాన్,సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్. శిక్షణ ఎంతో అవసరం.. గల్ఫ్ దేశాలకు పని కోసం వెళ్లే వారికి శిక్షణ ఎంతో అవసరం. ముఖ్యంగా దళారుల చేతుల్లో పడి మోసపోకుండా.. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల ద్వారా వెళ్తేనే ప్రయోజనం ఉంటుంది. శిక్షణలో ప్రతి విషయాన్ని వివరిస్తాం. ఎలా వెళ్లాలి, ఆ దేశాల్లో ఎలా మసలుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. – మహ్మద్ బషీర్ అహ్మద్, ట్రైనర్ జిల్లాల్లో శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో పీడీఓటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లోనే శిక్షణ ఇవ్వాలి. ప్రైవేటు స్కిల్ టెస్టింగ్ సెంటర్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. రిక్రూటింగ్ ఏజెన్సీల అసోసియేషన్ లను ఇందులో భాగస్వాములను చేయాలి. పీడీఓటీ శిక్షణను తప్పనిసరి చేస్తే ఈ పథకం ఉద్దేశం నెరవేరుతుంది. అవగాహనే అన్ని సమస్యలకు పరిష్కారం. – చౌటుపల్లి శ్రీను, ఎస్ఎల్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, మెట్పల్లి బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్తున్నా.. నేను ఐదవ తరగతి వరకు చదువుకున్నా. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం బహ్రెయిన్ వెళ్తున్నా. అక్కడ కూలి పని చేయడానికి వీసా లభించింది. జీతం అక్కడి కరెన్సీలో 105 దినార్లు ఇస్తామన్నారు. మూడేళ్లు పనిచేసి మళ్లీ స్వదేశానికి వస్తా.– సుదర్శన్, నిజామాబాద్ విదేశాల్లో ఎలా నడుచుకోవాలో చెప్పారు దేశంకాని దేశం వెళ్తున్నాం. అక్కడి భాష రాదు. ఆ దేశంలో ఎలా నడుచుకోవాలో మాకు శిక్షణలో వివరించారు. గల్ఫ్ దేశాల్లోని నియమ, నిబంధనలను వివరించారు. ఈ శిక్షణ నాకెంతో దోహదపడుతుందని భావిస్తున్నా. – యు.శ్రీనివాస్, జన్నారం జాగ్రత్తలు తెలుసుకున్నాం.. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి విదేశంలో కాలుమోపే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శిక్షణలో తెలుసుకున్నాం. పాస్‌పోర్టు, వీసా వంటి విలువైన ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకుంటే ఎవరిని సంప్రదించాలి. మన దగ్గర ఉంచుకోవాల్సిన ఫోన్ నంబర్లు ఏమిటి.? రాయబార కార్యాలయంచిరునామా వంటి ప్రాథమిక సమాచారం గురించి బాగా విశ్లేషించారు. టామ్‌కామ్ అధికారులు ఇచ్చిన శిక్షణ మాకెంతో మేలు చేస్తుంది. – రవి, సిద్దిపేట ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం.. మే నెల నుంచి ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి శిక్షణ ఇస్తున్నాం. ఏపీ, తెలంగాణతో పాటుగా ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువత శిక్షణకు వచ్చారు. నైపుణ్యంతో పాటు మెళకువలు నేర్పిస్తున్నాం. ఒక్కో బ్యాచ్‌లో కనీసం పది మంది ఉండేలా చూసుకుని శిక్షణ ఇస్తున్నాం.– నాగ భారతి, జనరల్ మేనేజర్, టాంకాం పీడీఓటీ శిక్షణ పొందాలనుకునే వారు‘టాంకాం’ మొబైల్ నం. 7997973358,ఫోన్ నం. 04023342040, ఇ–మెయిల్: tomcom.gmts@gmail.com లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. -
తగ్గుతున్న మహిళా కార్మిక శక్తి
సాక్షి, న్యూఢిల్లీ : గత ఆరు ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో కూలి నాలి చేసి బతికే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది. వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ఉండగా, నేడు వారి సంఖ్య 18 శాతానికి పడిపోయింది. అదే పట్టణ ప్రాంతాల్లో 2011–12 ఆర్థిక సంవత్సరానికి పనిచేసే 15 నుంచి 14కు పడిపోయింది. అయితే పట్టణాల్లో నెలవారిగా వేతనాలు అందుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారి సంఖ్య 2004లో 35.6 శాతం ఉండగా, 2017 నాటికి 52.1 శాతానికి చేరుకుంది. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పురుషులు, మహిళల సంఖ్య తగ్గుతోందని, మహిళల సంఖ్య మాత్రం ఏటేటా క్రమంగా తగ్గుతూ వస్తోందని 2017–18 సంవత్సరానికి దేశంలోని కార్మిక శక్తిపై నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడు లేనంతగా నిరుద్యోగుల శాతం 6.1 శాతానికి పెరిగిందని ఇటీవల విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి రంగంలో పనిచేసే మహిళలు 1993లో 33 శాతం ఉండగా, వారి సంఖ్య 2011–12 ఆర్థిక సంవత్సరం నాటికి 25 శాతానికి పడిపోయింది. మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం పట్ల ఆసక్తి చూపడం, భర్తల ఆదాయం పెరగడం, ఇంట్లో పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సి రావడం, మహిళలకు అనువైన ఉద్యోగాలు తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి తగ్గుతూ వస్తోందని నిపుణులు అంటున్నారు. -
కన్నీళ్ల మూటతో..
సాక్షి, నెట్వర్క్: సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ యాజమాన్యం కారణంగా తీవ్ర అవస్థలు పడిన కార్మికులకు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. వేతనాలను చెల్లించకపోవడం.. ఒప్పందం ప్రకారం పని కల్పించకుండా క్యాంపులకే పరిమితం చేయడంతో కార్మికులు అల్లాడిపోయారు. విదేశాంగ శాఖ సహకారంతో లేబర్ కోర్టులో న్యాయ పోరాటం సాగించి విముక్తి పొందారు. ఇటీవలే 39 మంది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు సౌదీ అరేబియా నుంచి వారి ఇళ్లకు చేరుకున్నారు. అక్కడ వారు అనుభవించిన కష్టాలను ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న వలస కార్మికుల విన్నపాలు వారి మాటల్లోనే... ఉపాధి చూపాలి నందిపేట్: సౌ§దీ అరేబియాలో జేఅండ్‌పీ కంపెనీ మోసం చేయడం వల్ల తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఎందరో నష్టపోయారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇళ్లకు చేరుకున్న మాకు ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలి. చేసిన పనికి వేతనం రాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరుకున్నాం. మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. నేను కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాను. జేఅండ్‌పీ కంపెనీకి 60 ఏళ్ల చరిత్ర ఉంది. కంపెనీ మమ్మల్ని ముంచుతుందని ఊహించలేకపోయాం. ఆరు నెలల పాటు వేతనాలు ఇవ్వకున్నా ఓపిక పట్టాం. ఎనిమిది నెలలు పని చూపకున్నా పడి ఉన్నాం. కనీసం ఇంటికి పంపించడానికి కూడా కంపెనీ మాపై మానవత్వం చూపలేదు. విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇళ్లకు చేరుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించాలి. లేదా ఏదో ఒక ఉద్యోగం చూపితే ఇక్కడే ఉండి కుటుంబాన్ని సాదుకుంటాం. సౌదీ నుంచి తిరిగి వచ్చిన వారిలో అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. – బాపురావు, మారంపల్లి,నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా భార్యా పిల్లలను చూస్తాననుకోలేదు గొల్లపల్లి: మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి రూ.8 లక్షల వరకు అప్పు చేసిన. చేసిన అప్పులు తీర్చడం కోసం సౌదీ వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో రూ.1.50 లక్షలు పెట్టి ముంబై లోని ఏజెంట్ ద్వారా వెళ్లాను. అక్కడ జేఅండ్‌పీ కంపెనీలో 14 నెలలుగా క్యూయూసీ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ డాక్యుమెంట్ కంట్రోలర్‌గా పనిచేశాను. అయితే, కంపెనీ ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు. వేతనాలు ఇవ్వకుండా సకాలంలో అకామా(గుర్తింపు) రెన్యూవల్ చేయకుండా కార్మికుల పట్ల మొండివైఖరి అవలంభించింది. నాలాంటి వందల మంది కార్మికులు కంపెనీ క్యాంపునకే పరిమితమై రోజులు వెల్లదీసారు. అక్టోబర్ నుంచి పనులు చూపలేదు. మాకు గోస మొదలైంది. చీకటి గదుల్లో గడిపాము. తిండి, నీళ్లు కనీసం వసతులు లేక అవస్థలు పడ్డాం. పాస్‌పోర్టులు లాగేసుకుని నిర్బంధించారు. పాసుపోర్టు దగ్గరలేకపోవడంతో పోలీసులు అరెస్టు చేస్తారని భయపడ్డాం. నిత్యం నరకం అనుభవిస్తూ బతికాం. మానసిక వేదనతో నా తోటి కార్మికులు శ్రీలంకకు చెందిన అశోక్, చెన్నైకి చెందిన రత్నం గుండెనొప్పితో చనిపోయారు. ఇంకా ఎంతో మంది కార్మికులు మానసిక వేదనకు గురై అనారోగ్యం పాలయ్యారు. మమ్మల్ని ఎలాగైనా మా దేశానికి తీసుకెళ్లండని అయినవారికి ఫోన్లు చేశాం. పత్రికల వాళ్లకు మా గోస తెలిపాం. వారు మా గోసకు స్పందించి కథనాలు రాసారు. వారి పుణ్యమా అని సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ అధికారులు కార్మికులతో మాట్లాడారు. సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ మన దేశ కార్మికులతో మాట్లాడారు. భారతీయ కార్మికులను క్షేమంగా ఇంటికి పంపిస్తారని మాటిచ్చారు. పనిచేయించుకుని వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో క్షేమంగా ఇంటికి రావడం ఆనందంగా ఉంది. భార్యా పిల్లలను చూస్తానని అనుకోలేదు. మేము పడిన కష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నా. అప్పుల ఊబిలో కూరుకు పోయిన కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పునరావాసం కింద ఆదుకోవాలి. అప్పులే మిగిలాయి.. చందుర్తి (వేములవాడ): నేను గల్ఫ్‌కు వెళ్లేందుకు ముందు గ్రామంలో కూలీ పని చేసేవాడిని. వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకే సరిపోవడం లేదని గల్ఫ్ బాట ఎంచుకున్నా. 1997లో రూ.80వేల అప్పు చేసి సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ అనే నిర్మాణ కంపేనీలో పనిచేసేందుకు వెళ్లాను. అప్పుడు కంపేనీ 12గంటల పనిచేస్తే ఇండియా కరెన్సీలో రూ.4వేలు దొరికేవి. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు కంపెనీ చాలీచాలని వేతనాలిచ్చింది. సౌదీ వెళ్లేందుకు చేసి బాకీ తీర్చేందుకు ఐదేళ్లు పట్టింది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారుల పోషణకు పంపిన డబ్బులు సరిపోక నా భార్య గ్రామంలో అప్పు చేసింది. గ్రామ శివారులో ఎకరం వ్యవసాయ భూమి ఉంటే రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. ప్రభుత్వం అందించిన పరిహారంతో పాటు మరో రూ.3లక్షల అప్పు చేసి రెండేళ్ల క్రితం పెద్ద కూతురు వివాహం చేశాం. కొన్ని రోజుల తర్వాత కంపెనీ యాజమాన్యం వేరే వాళ్లకు విక్రయించింది. రెండు నెలల పాటు వేతనాలు ఇక్కడి కరెన్సీలో రూ.20వేల చొప్పున ఇచ్చి పనిచేయించుకుంది. తరువాత ఆరు నెలల పాటు వేతనాలు చెల్లించకపోవడంతో పనిలేక 8 మాసాల పాటు రూంలోనే ఉండి పోయాం. మా కష్టాలను కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాం. ఇండియన్ ఎంబసీ సహకారంతో సౌదీ లేబర్ కోర్టు ఎగ్జిట్ వీసాలను, టికెట్లను కొనిచ్చి ఇండియాకు పంపించింది. అప్పులను మూటగట్టుకుని స్వగ్రామానికి చేరుకున్నాం. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదు. మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.–మల్యాల, చందుర్తి మండలం,రాజన్నసిరిసిల్ల జిల్లా జీతం ఇవ్వలే.. కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన అలకుంట రవి 2015లో కామారెడ్డిలోని ఓ ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడి నిర్మాణాలకు లేబర్‌ను సప్లయ్ చేసే జేఅండ్‌పీ కంపెనీ పేరుమీద వీసా ఇచ్చారు. రూ.లక్ష చెల్లించి వెళ్లిన రవి ఆ కంపెనీలో యేడాది పాటు పనిచేశాడు. ఆ తరువాత యేడాది పనిచేసినా డబ్బులు సక్రమంగా ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత కంపెనీ మూతపడింది. అప్పటి నుంచి కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కంపెనీ వీసా మీద వచ్చిన కార్మికులు సదరు కంపెనీలో తప్ప మరోచోట పనిచేయడానికి వీలు లేదు. రవి పనిచేసిన కంపెనీ ఎత్తివేయడంతో తోటి వారితో కలిసి క్యాంపులోని గదికే పరిమితం కావాల్సి వచ్చింది. కనీసం తిండికి లేక ఎన్నో రోజులు పస్తులు ఉన్నామని రవి చెప్పాడు. ఒక్కోసారి దొంగచాటుగా బయటకు వెళ్లి పని వెతుక్కుంటూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునేవారమని తెలిపాడు. మరోచోట పనిచేస్తూ పట్టుబడిన వారిని కొంతకాలం జైలులో ఉంచిన తర్వాత పోలీసులు తిరిగి క్యాంపులోకి పంపేవారని చెప్పాడు. బాధితులు తమ సమస్యను సోషల్‌మీడియా ద్వారా ఇండియన్ ఎంబసీ, భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో అధికారులు స్పందించి 39 మందిని స్వదేశానికి పంపాలని అక్కడి లేబర్ కోర్టుకు అప్పీలు చేశారు. ఇండియన్ ఎంబసీ అధికారుల చొరవతో మొత్తం 39 మంది తెలుగు కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు పెరిగి ప్రస్తుతం రూ.4 లక్షలు అయ్యాయని రవి తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. సంవత్సర కాలం నరకం అనుభవించా.. జగిత్యాల క్రైం: ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్తే అక్కడ కంపెనీ దివాళాతీయడంతో సంవత్సర కాలం పని దొరకలేదు. ఆరు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో పాటు 8 సంవత్సరాలు కంపెనీలో చేసినా స్టైఫండ్ ఇవ్వకుండా కంపెనీ మోసం చేసింది. స్వదేశం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే వారి సహాయంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నా.– దర్శనాల మల్లయ్య, నక్కలపేట, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా పనిలేక పస్తులున్నా.. జగిత్యాల క్రైం: ఎనిమిది సంవత్సరాలు సౌదీలో జేఅండ్‌పీ కంపెనీలో లేబర్‌గా పనిచేశాను. గత సంవత్సర కాలం నుంచి కంపెనీ దివాళా తీయడంతో మాకు 14 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో పాటు ఉన్న రూముల్లో కూడా విద్యుత్, నీటి వసతి కల్పించలేదు. అప్పులు చేసి పొట్టగడుపుకున్నాం. కొన్ని రోజులు పస్తులున్నాం. ఇంటికి వచ్చేందుకు కూడా కంపెనీ టికెట్లు ఇవ్వలేదు. సౌదీ లేబర్ కోర్టు టికెట్లు ఇవ్వడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉపాధి చూపాలి.– దీటి మల్లేశం, రేచపల్లి,సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా -
ముగ్గురిని బలిగొంది..
సాక్షి, నాగర్‌కర్నూల్ రూరల్: మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి వెంకట్‌రెడ్డికి చెందిన వేరుశనగ నూర్పిడి యంత్రం మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ చెత్తను నూర్పిడి చేసేందుకు బుధవారం గ్రామానికి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు ఆంజనేయులు పొలంలో వేరుశనగ పంటను నూర్పిడి చేసేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు పనిపూర్తి చేసి యంత్రం వెంబడి వెళ్లిన కూలీలను తీసుకొని వస్తుండగా కేఎల్ఐ సబ్‌కెనాల్ వద్ద చిన్నపాటి గుంత రావడంతో నూర్పిడి యంత్రం ఒక వైపు ఒరిగి అటువైపుగా ఉన్న నలుగురు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో లింగసానిపల్లికి చెందిన గడ్డమీది జయమ్మ(35), పరకాల బాలరాం (50), శాంతమ్మ (35) నూర్పిడి యంత్రం కింద మృతిచెందారు. బోనాసి సత్యమ్మకు కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ సందర్భంలో మరోవైపు వున్న ఆరుగురు కూలీలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. విషయం తెలుసుకున్న నల్లవెల్లి గ్రామస్తులు ప్రమాదసంఘటన స్థలానికి చేరుకుని నూర్పిడి యంత్రం కిందపడి మృతిచెందిన మృతదేహాలను బయటకు తీసి జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకుని ప్రమాద సంఘటనపై విచారణ చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. -
ఐకియా ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా... ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు, పెద్దలకు ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఐకియా స్టోర్లలో పలు చోట్ల ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం
-
ప్రాజెక్ట్ పనుల్లో పేలుడు.. కూలీల మృతి
సాక్షి, కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సొరంగంలో బ్లాస్టింగ్ చేసేందుకు నిర్దేశించిన స్దలంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. అయితే కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో వారంతా గాయపడ్డారు. వారిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఆయితే ప్రమాద స్థలంలో ఉరుములు మెరుపులు రావటంతో దాని ప్రభావం వల్ల బ్లాస్టింగ్ జరిగినట్టు భావిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు బిహార్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కూలీలుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీ అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ : రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న పలాస పవర్‌గ్రిడ్ సంస్థలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పవర్ గ్రిడ్ సంస్థ ప్రహరీ పక్క ఉన్న మృతదేహం చూసిన స్థానికులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం గ్రామానికి చెందిన నీలాపు కనకయ్య(46)గా గుర్తించారు. విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కనకయ్య మృతదేహాన్ని పరిశీలిస్తే ముక్కు నుంచి రక్తం వస్తుండడంతో హత్య, ఆత్మహత్య, లేక విద్యుత్ ప్రమాదమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనపై స్థానికంగా వేరేలా ప్రచారం జరుగుతోంది. ప్రమాదకరమైన పవర్‌గ్రిడ్ సంస్థలో పనిచేస్తున్న కూలీలు మృతి చెందితే రహస్యంగా మృతదేహాలను బయటకు పారవేస్తున్నారని, అందుచేతన స్థానికులను కాకుండా దూర ప్రాంత కూలీలను పనిలో పెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది కూలీలు అదృశ్యమైనట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇంటి సందులోనే... శ్రీకాకుళం సిటీ : నగరంలోని దండివీధిలో నివాసం ఉంటున్న గొర్ల చంద్రశేఖర్(45) సోమవారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో ఇంటిసందులో మృతిచెందాడు. ఇతడు స్వచ్ఛభారత్ ప్రొగ్రాంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో సోమవారం రాత్రి వరకు ఇంట్లో గడిపిన చంద్రశేఖర్ తెల్లవారుజామున ఇంటిసందులో మృతిచెందడంపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చంద్రశేఖర్ తన ఇంటి సందులో పడి ఉండటాన్ని మృతుడి కుటుంబసభ్యులు గమనించారు. సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, ఒకటోపట్టణ సీఐ బి.ప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చంద్రశేఖర్ -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
కశింకోట (అనకాపల్లి): పరవాడపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పరవాడపాలెం గ్రామానికి చెందిన పరవాడ చెల్లయ్య (60) కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనికి అనకాపల్లి వెళ్లి ఇంటికి వస్తూ తమ గ్రామం కూడలి వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా.. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళుతున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో చెల్లయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిళ్లు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడగా, వారిని హైవే పోలీసులు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా.. తాళ్లపాలెం మామిడివాక గెడ్డ వంతెన వద్ద సోమవారం లారీ బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కోళ్ల దాణా లోడు లారీ అదుపు తప్పి ఒకవైపు బోల్తా పడింది. -
విద్యార్థులకు లక్ష్మీకటాక్షం
సత్తెనపల్లి: చదువుకునే కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిచనుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఫ్యాకర్టీలు, దుకాణాలు, క్వారీల్లో పని చేసే కార్మికుల స్థితిగతులను మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశాయి. ఈ మండలి ద్వారా కార్మికుల పిల్లల ఉన్నత విద్యలకు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నిధి ద్వారా కార్మికుల పిల్లలు చదువులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్య ప్రగతిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు కార్మిక సంక్షేమ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాకర్టీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, ట్రస్టులు, సొసైటీలు, మోటార్, రవాణా సంస్థలు నిర్వహిస్తున్న వారు కార్మిక శాఖలో లైసెన్సు పొంది చట్ట బద్ధత కల్పించుకున్న సంస్థలే ఈ సంక్షేమ మండలి పరిధిలోకి వస్తాయి. అర్హతలు ఇవి.... కార్మికులు తాను పని చేస్తున్న సంస్థ లేదా యజమాని నుంచి వేతన ధ్రువీకరణ పత్రం, పిల్లవాడి విద్యార్థి ధ్రువీకరణ పత్రం, గత సంవత్సరం మార్కుల జాబితా, ప్రస్తుతం చదువుతున్న కళాశాల వివరాలతో కూడిన దరఖాస్తును కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, లా, వ్యవసాయ బీఎస్సీ, బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, బీసీఏ, ఎంసీఏ, బీ పార్మశి, ఎం.ఫార్మశి, ఎంబీఏ, బీబీఏ, డిప్లమా ఇన్ మెడికల్ లేబొరేటరి టెక్నిషియన్, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ లేబొరేటరి టెక్నిషియన్ కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు. ఉపకార వేతనాలు వీరికి 564 మంది ఉపకార వేతనం పొందే అవకాశం ఉంది. కోర్సుల వారీగా చూస్తే.... పాలిటెక్నిక్ 90, ఇంజనీరింగ్ 150, మెడిసిన్ 30, లా 12, బీఎస్సీ (అగ్రికల్చర్) 12, బీఎస్సీ (వెటరర్నీ)12, బీఎస్సీ (నర్సింగ్) 12, బీఎస్సీ (ఉద్యాన) 12, బీసీఏ 60, ఎంసీఏ 60, బీఫార్మశి, ఎం.ఫార్మశి 30, బీబీఏ 30, ఎంబీఏ 30, డిప్లమా ఇన్ మెడికల్ లేబోరేటరి టెక్నిషియన్ (డీఎంఎల్టీ) 12, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ లేబోరేటరీ టెక్నిషియన్ 12మందికి ఉపకార వేతనాలను అందించనుంది. దరఖాస్తులు ఇలా.... జిల్లాలో ప్రతిభావంతులైన కార్మికుల కుటుంబాల పిల్లల సంక్షేమ మండలికి నిధి చెల్లించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జిల్లాలో సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయాలు గుంటూరు, తెనాలి, నరసరావుపేట లో ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలోని 57 మండలాలు వస్తాయి. ఆయా మండలాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలోని నరసరావుపేట డివిజన్లో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ సహాయ కార్మిక శాఖాధికారుల కార్యాలయాల్లో, గుంటూరు డివిజన్లో గుంటూరు నగరంలో ఆరు సర్కిళ్లు, అమరావతి సహాయ కార్మిక శాఖ అధికారుల కార్యాలయాల్లో, తెనాలి డివిజన్లో తెనాలి పట్టణంలో రెండు సర్కిళ్లు, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, రేపల్లెలో సహాయ కార్మిక శాఖాధికారుల కార్యాలయాల్లో ఆయా పరిధిలోని మండలాల కార్మికుల పిల్లలు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు అందించడానికి ఈనెల 15 చివరి తేదీగా నిర్ణయించారు. అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రతిభావంతులైన కార్మికుల కుటుంబాల పిల్లలు సంక్షేమ మండలికి నిధి చెల్లించన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాకు మేడే కానుకగా ఉపకార వేతన జమ చేస్తారు.– వడ్డెం హనుమత్ సాయి, సహాయ కార్మిక శాఖాధికారి, సత్తెనపల్లి -
శరాఘాతం
అనకాపల్లి: అంతన్నారింతన్నారు.. చివరకు ఉద్యోగాలు ఊడగొట్టారు.. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులను ఇక నుంచి విధులకు హాజరు కాకుండా నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించడంతో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. కర్మాగారంలో ప్రస్తుతం 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 40 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. వీరితోపాటు రెగ్యులర్ కార్మికులు 31 మంది పనిచేస్తుండగా వారికి ఒన్‌టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని సుగర్కేన్ రాష్ట్ర అధికారుల నుంచి గతంలో ప్రతిపాదనలు వచ్చినా ఆ లెక్క తేలడంలేదు. తాజాగా ఎన్ఎంఆర్ కార్మికులను తొలగించాలని సంబంధిత శాఖ నిర్ణయించడంతో వారందరికీ భవితవ్యం అయోమయంగా మారింది. అంతేకాకుండా కర్మాగారం పరిధిలో పని చేసిన రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించే విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కర్మాగారంలో ఉన్న ఉద్యోగులందరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత స్పష్టత రెండు రోజుల్లో తేలనుంది. బకాయిలన్నీ త్వరలో సెటిల్ చేస్తామని జేసీ సృజన సహా పలు సందర్భాంల్లో అధికారులు, నేతలు హామీ ఇవ్వడంతో మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్న కార్మికులు తాజా పరిణామంతో ఖిన్నులయ్యారు. జేసీ అనుమతితో ఉత్తర్వులు కర్మాగార పర్సన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జేసీ అనుమతి మేరకు ఎన్ఎంఆర్ ఉద్యోగులను రేపటి నుంచి విధుల్లోకి రావద్దని కర్మాగార ఎండీ సన్యాసినాయుడు పేరున నోటీసులు విడుదలయ్యాయి. 2014 ఎన్నికల ముందు బాబు వస్తే ఉద్యోగాలొస్తాయని తెలుగుదేశం పార్టీ ప్రధాన మేనిఫెస్టోగా చేరుస్తూ ప్రచారం చేసుకొని అధికారం చేపట్టాక జాబుల మాట దేవుడెరుగు కాని ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడింది. ఇటీవల ఐసీడీఎస్‌లో పలు సేవలందిస్తున్న లింకువర్కర్లకు మంగళం పాడగా ఇప్పుడేమో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలో విధుల్లో ఉన్న 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులకు నీళ్లొదిలింది. దీంతో దేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడల్లా సుగర్ ఫ్యాక్టరీపై నీలినీడలు అలుముకుంటూ వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఫ్యాక్టరీ మూతపడడంతో ఆకలికేకలతో పదిమంది కార్మికులు మృత్యువాత పడ్డారు. -
పేదరికం వెక్కిరిస్తున్నా.. దృష్టిలోపం వేధిస్తున్నా..
సాక్షి, గుంటూరు: ఆ యువకుడికి చదువు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. కంటి చూపు కూడా అంతంత మాత్రమే.. ఆదరించేవారు.. ప్రోత్సహించేవారు లేరు. కానీ అపార ప్రతిభ, పట్టుదలతో చదరంగం (చెస్)లో అసమాన విజయాలు సాధిస్తున్నాడు. అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడే శాగం వెంకటరెడ్డి. 75 శాతం దృష్టి లోపంతో జన్మించినా.. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పేద కూలీ శాగం నారాయణరెడ్డి కుమారుడైన వెంకటరెడ్డి 80 శాతం దృష్టి లోపంతో జన్మించాడు. వెంకటరెడ్డి ఓ ముఠా కూలీ. అతడు రాష్ట్రస్థాయి చదరంగం క్రీడాకారుడంటే ఎవరూ నమ్మలేరు. చిన్నతనంలోనే చదరంగంపై మక్కువ పెంచుకున్న వెంకటరెడ్డి ఆడేవారి వద్ద నిలబడి ఆటను చూస్తూ ఉండిపోయేవాడు. అలా క్రమేణా ఆట నేర్చుకున్నాడు. పేద కుటుంబం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడు. రాత్రి పూట గురజాలలోని వీఎంఏఎస్ క్లబ్లో చదరంగం సాధన చేస్తున్నాడు. గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి.. గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో 2005, నవంబర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి నిర్వాహకులను అబ్బురపరిచాడు. చదరంగంలో ప్రావీణ్యం ఉన్నవారిని సైతం ఓడించి పలువురి మన్ననలు పొందాడు. 2012లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో, 2013 జూలైలో చెన్నైలో జరిగిన జాతీయస్థాయి చెస్ టోర్నమెంట్లో 12వ స్థానంలో నిలిచాడు. 2014 నవంబర్‌లో కన్యాకుమారిలో జరిగిన సౌత్‌జోన్ అంధ చదరంగ క్రీడాకారుల సెలక్షన్స్‌లో రెండో బహుమతి సాధించి నేషనల్ –బి జట్టుకు ఎంపికయ్యాడు. 2017 నవంబర్‌లో జరిగిన సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. 2017 డిసెంబర్లో హరియాణాలో జరిగిన నేషనల్–బి చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్) పోటీల్లో 7వ స్థానంలో నిలిచాడు. త్వరలో బల్గేరియాలో జరిగే వరల్డ్ బ్లైండ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. కాగా, సౌత్‌జోన్ పరిధిలోని ఐదు రాష్ట్రాల్లో వెంకటరెడ్డి టాప్ ర్యాంక్‌లో ఉండడం విశేషం. మట్టిలో మాణిక్యం గ్రామీణ నిరుపేద కుటుంబంలో జన్మించి చదరంగంలో అసమాన ప్రతిభాపాటవాలు చూపుతున్న వెంకటరెడ్డి మట్టిలో మాణిక్యమని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కనీసం కోచ్ కూడా లేకుండా, దృష్టి లోపాన్ని సైతం అధిగమించి విజయాలు సాధిస్తుండటం చూసి చదరంగ శిక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చెస్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశానికి మంచి పేరు తీసుకొస్తానని వెంకటరెడ్డి చెబుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చెస్ పోటీలకు ఆహ్వానం అందుతున్నా పేదరికం కారణంగా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర చెస్ అకాడమీ, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రభుత్వం వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి ప్రోత్సాహాన్నందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని క్రీడా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో మొదటి స్థానంలో నిలిచి మొమెంటో అందుకుంటున్న వెంకటరెడ్డి -
టెక్నికల్ లేబర్ కే భవిష్యత్
గల్ఫ్ దేశాలకు టెక్నికల్ లేబర్‌గా వస్తేనే బాగుంటుందని, మంచి జీతంతో పాటు రక్షణ ఉంటుందని దుబాయ్‌లోని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్ చెప్పారు. కామన్ లేబర్‌గా వస్తే జీతం తక్కువగా వస్తుందని, కష్టాలు కూడా ఎక్కువేనని అన్నారు. గల్ఫ్‌లో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షిఇంటర్వ్యూ పెద్దపల్లి: : మన దగ్గర యువత పదో తరగతి, ఇంటర్ వరకు మాత్రమే చదువుకుని గల్ఫ్ బాట పడుతున్నారు. పాస్‌పోర్టు తీసి ఏజెంటుకు ఇస్తారు. కొంత అడ్వాన్స్ కూడా ఇస్తారు. అప్పటి నుంచి వారికి టెన్షన్ మొదలవుతుంది. రోజూ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంటారు. పని వెతికే పనిలో ఏజెంటు ఉండగానే.. రోజులు గడుస్తున్నాయంటూ ఒత్తిడి చేస్తుంటారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్లు మూడు నెలల విజిట్ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా తీసి పుషింగ్ (అక్రమంగా దేశం దాటించడం)లో పంపిస్తున్నారు. అందులో ప్రొఫెషన్ మార్చి పంపుతున్నారు. గల్ఫ్‌కు తీసుకువచ్చి గదిలో వేసి మీరే పని చేసుకోవాలని ఏజెంట్లు చెప్తున్నారు. మూడు నెలల్లో ఏదో ఒక పనిచేసుకుంటారు. ఇంత ఖర్చు చేసి వచ్చాను.. ఉత్త చేతులతో తిరిగి ఎలా వెళ్లేదంటూ అక్కడే ఉంటారు. అతనికి ఆ దేశ ‘గుర్తింపు’ ఉండదు కాబట్టి అక్రమ నివాసి అవుతాడు. దీంతో అతను పోలీసులకు దొరికినప్పుడు జైళ్లలో వేస్తారు. గల్ఫ్‌పై ఎన్నో ఆశలతో వచ్చిన వారు.. ఇక్కడి చట్టాలు తెలియక కష్టాలపాలవుతున్నారు. రిక్రూటింగ్ ఏజెంట్ అతను ఏ దేశం వెళ్తున్నాడో.. అక్కడి కంపెనీకి చెందిన అన్ని వివరాలు చెప్పాలి. జీతం, అక్కడ ఉండాల్సిన కాలం అన్నీ అగ్రిమెంట్లో ఉండేవిధంగా గల్ఫ్‌కు వచ్చే వారు చూసుకోవాలి. రిజిష్టర్డ్ ఏజెన్సీల నుంచి వెళితే ఏదైనా జరిగినప్పుడు కంపెనీని అడుగవచ్చు. కామన్ లేబర్‌గా గల్ఫ్ దేశాలకు రావడం దండగ. దుబాయ్‌లో అయితే కామన్ లేబర్‌కు 1000 దరమ్లే వస్తాయి. అందులో 300 దరమ్‌లు ఖర్చులకు పోతాయి. ఇక్కడికి రావడానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖర్చవుతాయి. వీసా అప్పు తీరడానికి ఒక సంవత్సరానికి పైగా పడుతుంది. టెక్నికల్ లేబర్‌గా వస్తే జీతం కూడా బాగుంటుంది. అవగాహన కల్పించాలి.. గల్ఫ్‌కు వెళ్లే వారికి అవగాహన శిబిరాలు నిర్వహించాలి. గల్ఫ్‌లో ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన చేసి యువతకు తెలియజేయాలి. గల్ఫ్‌లో అనుభవమున్న వారితో శిక్షణ ఇప్పించాలి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, ఏపీ, తెలంగాణ నుంచి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కేరళలో ఇలాంటి శిక్షణలు నిర్వహిస్తారు. గల్ఫ్‌లో చిన్నచిన్న వ్యాపారాల్లో ఎక్కువగా కేరళ వారే ఉన్నారు. – గల్ఫ్ డెస్క్ -
ఇసుక తవ్వుతుండగా ముగ్గురు మృతి
చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెదళ్లచెరువు గ్రామంలోని ఇసుక క్వారీలో ప్రమాదం జరిగింది. ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉన్నత చదువులు చదివి కూలీలుగా మారారు
-
కార్మికుల కడుపు కొట్టొద్దు
– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి – ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు భారీగా తరలివచ్చిన కార్మికులు కర్నూలు (న్యూసిటీ) : ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికులు కడుపుకొట్టొద్దని సీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాలకు సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఆయూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు జిల్లాలోని అసంఘటిత రంగ, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులు సరైన వేతనం అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు కట్టబెడితే సహించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి హౌసింగ్డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులును తీసి వేస్తున్నారని మండిపడ్డారు. బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పి వీధికో మందు దుకాణం పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లపై దాడులను ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ అధికారుల దాడులను ఆపాలని మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత డీఆర్ఓ గంగాధర్‌గౌడ్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు గౌస్‌దేశాయ్, పుల్లారెడ్డి, సుబ్బయ్య, రాముడు, గోపాల్, రాజశేఖర్, అంజిబాబు, అంగన్వాడీ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా, ఆశా వర్కర్ల యూనియన్ నాయకుడు చంద్రుడు, సుధాకరప్ప, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వాల చర్యలు తిప్పికొడదాం’
ఘనంగా మేడే కోటగుమ్మం(రాజమహేంద్రవరం సిటీ) : నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్ యూనియన్, కూరగాయల మార్కెట్, పార్టీ శాఖల్లో పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య ఎగుర వేశారు. ప్రజా నాట్య మండలి కళాకారులు నృత్య, విప్లవ గీతాలతో మంగళవార పేట నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాడితోట మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తిప్పికొట్టాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మతోన్మాద విధానాలతో మోడీ ముందుకు వెళుతున్నారని, దేశాన్ని మత విభజనగా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చిట్టూరి ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు.