నర్వ(మహబూబ్‌నగర్): తాగే నీళ్లు అనుకుని క్రిమిసంహారక మందు కలిసిన ద్రావణాన్ని తాగడంతో 16 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని గాజులయ్య తండాకు చెందిన 16 మంది కూలీలు, ధన్వాడ మండలం ఇబ్రహీంపట్టణంలో కూలీ పనులకు వెళ్లారు. అక్కడ పురుగులు మందు కలిపిన నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.