ఏ కలలకు ఆస్కారం లేని కరుకు జీవితాన్ని చిన్న వయసులోనే అనుభవించిన సజ్దా పఠాన్ పేరు ఆస్కార్ విశేషాల్లో భాగంగా తరచు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా గునీత్ మోంగా షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ 97వ ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా నామినేట్ అయిన ‘అనూజ’పై బజ్ వేడెక్కడంతో అందరి దృష్టి ఆ చిత్రంలో నటించిన తొమ్మిదేళ్ల లీడ్‌స్టార్ సజ్దా పఠాన్‌పై పడింది.
ఢిల్లీ మురికివాడల్లోని బాల కార్మికురాలైన సజ్దాను ‘సలాం బాలక్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ కాపాడింది. సజ్దాకు సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ సినిమాలకు బొత్తిగా కొత్త కాదు. ఇంతకుముందు లాటిటియా కొలోంబానీ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ చిత్రం ‘ది బ్రైడ్’లో సజ్దా నటించింది.
ఆ సినిమాలో మియా మేల్జర్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. మీరా నాయర్ ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘సలాం బాంబే’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏర్పాటైన ‘సలాం బాలక్ ట్రస్ట్ కృష్ణన్ నాయక్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో ‘ది బ్రైడ్’ను నిర్మించింది. ఊహించని నాటకీయ పరిణామాలు వెండితెరకే పరిమితం కాదు అని నిజజీవితంలో కూడా ఉంటాయని మరోసారి బలంగా చెప్పడానికి సజ్దా పఠాన్ బలమైన ఉదాహరణ.
(చదవండి: ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడు..!)
Comments
Please login to add a commentAdd a comment