![4 Killed, 5 Injured As Speeding Bus Rams Into Roadside Shanties](/styles/webp/s3/article_images/2024/05/26/accident.jpg.webp?itok=u4u_2m7x)
పనాజీ: గోవాలో బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న గుడారాల్లోకి దూసుకెళ్లింది. శనివారం(మే25) రాత్రి పనాజీకి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గుడారాల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు నలుగురు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగినపుడు మొత్తం మూడు గుడారాల్లో తొమ్మిది మంది ఉన్నారు. రోడ్డు పనులు చేయడం కోసం కూలీలు బీహార్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒక కంపెనీ ఉద్యోగులకు చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం కారణంగా బస్సులో ఉన్నవారెవరికీ ఏమీ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment