ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ ఉపాధ్యక్షుడు, బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు.
దశాబ్దం క్రితం భారత్ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్లబింగ్, మెకానిక్, ఆతిథ్యం, సేల్స్ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..?
భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూఎస్‌ఏ, జపాన్, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment