![SBI Reduced Home Loan Interest Rates By Revising EBLR And RLLR By 25 Basis Points](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/home-loan.jpg.webp?itok=lCNm5oNy)
భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) లోన్ తీసుకున్నవారికి శుభవార్త చెప్పింది. గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లోన్ రేటు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ను తగ్గిస్తున్న ఇటీవల ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు ఫిబ్రవరి 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించిన తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR), బేస్ రేటు & బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR)లలో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకులు వినియోగదారులకు అందించే వడ్డీ రేట్లను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) ఆధారంగా నిర్ణయిస్తాయి.
గృహ రుణాలకు రేపో రేటును అనుసంధానం చేసేందుకు.. ఈబీఎల్ఆర్ విధానాన్ని ఎస్‌బీఐ 2019 అక్టోబర్ 1 నుంచి అనుసరిస్తోంది. ఈ కారణంగానే ఆర్బీఐ రేపు రేటును మార్చిన ప్రతిసారీ.. ఎస్‌బీఐ రేటు కూడా మారుతూ ఉంటుంది. ఈబీఎల్‌ఆర్‌ను 9.15 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి.. 8.90 శాతానికి చేర్చింది. దీంతో ఈబీఎల్‌ఆర్‌తో అనుసంధానం అయిన పర్సనల్ లోన్స్, హోమ్‌లోన్స్ వంటి వాటితో పాటు రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
రుణ రేట్లను సవరిస్తున్న బ్యాంకులు
ఎస్‌బీఐ మాత్రమే కాకుండా కెనరా బ్యాంక్ (9.25% నుంచి 9% శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (9.35% నుంచి 9.10%కి తగ్గించింది), బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది)లు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి.
ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment