సాక్షి, సిటీబ్యూరో: హరిత భవనాలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒకడుగు ముందుకేసింది. సాధారణ గృహ రుణ గ్రహీతలతో పోలిస్తే హరిత గృహ కొనుగోలుదారులు 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందుకోవచ్చని ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ జీఎం, బ్రాంచ్ హెడ్ రాజేష్ కుమార్ తెలిపారు. అంటే ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉండగా.. హరిత గృహ రుణాలకు వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వడ్డీ రేటు 8.45 శాతంగా పడుతుంది.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 527 ప్రాజెక్ట్ డెవలపర్లతో ఎస్‌బీఐ గృహ రుణ ఒప్పందం చేసుకుందని.. ఇందులో 75 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్ట్‌లేనని తెలిపారు. అపర్ణా, రాజపుష్ప, మైహోం, గిరిధారి, వాసవి, పౌలోమి, ప్రణవ వంటి నిర్మాణ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్
దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో హైదరాబాద్ వాటా రూ.55 వేల కోట్లని చెప్పారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.12 వేల కోట్ల గృహ రుణాలు అందించామని.. ప్రస్తుతం నెలకు రూ.1,500 కోట్ల రుణాల చొప్పున రూ.16–18 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment