Low interest rates
-
అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్
సాక్షి, సిటీబ్యూరో: హరిత భవనాలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒకడుగు ముందుకేసింది. సాధారణ గృహ రుణ గ్రహీతలతో పోలిస్తే హరిత గృహ కొనుగోలుదారులు 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందుకోవచ్చని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జీఎం, బ్రాంచ్ హెడ్ రాజేష్ కుమార్ తెలిపారు. అంటే ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉండగా.. హరిత గృహ రుణాలకు వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వడ్డీ రేటు 8.45 శాతంగా పడుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 527 ప్రాజెక్ట్ డెవలపర్లతో ఎస్బీఐ గృహ రుణ ఒప్పందం చేసుకుందని.. ఇందులో 75 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్ట్లేనని తెలిపారు. అపర్ణా, రాజపుష్ప, మైహోం, గిరిధారి, వాసవి, పౌలోమి, ప్రణవ వంటి నిర్మాణ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ దేశవ్యాప్తంగా ఎస్బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో హైదరాబాద్ వాటా రూ.55 వేల కోట్లని చెప్పారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.12 వేల కోట్ల గృహ రుణాలు అందించామని.. ప్రస్తుతం నెలకు రూ.1,500 కోట్ల రుణాల చొప్పున రూ.16–18 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
తక్కువ వడ్డీతో లోన్ కావాలా? ఇదిగో టాప్ 10 బెస్ట్ బ్యాంకులు!
ప్రస్తుతం చాలీ చాలని ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే లోన్స్ తీసుకుని భారీ వడ్డీలను కడుతూ చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అలంటి టాప్ 10 బ్యాంకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.90% నుంచి 14.75% వడ్డీతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 10 శాతం లేదా అంత కంటే తక్కువ వడ్డీ రేటుతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్: 10.26% నుంచి 32.53% వడ్డీతో కనిష్టంగా రూ. 30వేల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు 12 నెలల నుంచి 60 నెలల కాల వ్యవధితో అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 10.40% నుంచి 16.95% వడ్డీ రేటుతో సుమారు 5 సంవత్సరాలు లేదా 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్: 10.49% నుంచి 22.00% వడ్డీ రేటుతో 60 నెలలు / 5 సంవత్సరాల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్: 10.49% లేదా అంతకంటే తక్కువ వడ్డీతో 6 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. కోటి వరకు లోన్ అందిస్తుంది. HDFC బ్యాంక్: 10.50% నుంచి 24.00% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్: 10.75% నుంచి 19.00% వడ్డీతో 12 నుంచి 72 నెలల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐడిబిఐ బ్యాంక్: 10.50% నుంచి 15.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 25వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అందిస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్: 10.50% నుంచి 13.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. -
గుడ్‌న్యూస్! గృహ రుణ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30 వరకూ 6.50 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇది 6.75 శాతంగా ఉంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫరు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్ మేనేజర్ (మార్ట్గేజెస్, ఇతర రిటైల్ అసెట్స్) హెచ్‌టీ సోలంకి తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి కూడా కొత్త రేటు అందుబాటులో ఉంటుంది. సిబిల్ స్కోరు 771కి పైగా ఉన్న వారికి దీన్ని వర్తింపచేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ 6.5 శాతమే వడ్డీ రేటు ఆఫర్ చేసిన బీవోబీ .. ఏప్రిల్ 1 నుంచి దాన్ని 6.75%కి పెంచింది. మళ్లీ వెంటనే తిరిగి పూర్వ స్థాయికి తగ్గించడం గమనార్హం. చదవండి👉🏼: నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు -
రూ. 2 కోట్ల గృహ రుణానికీ 6.66% వడ్డీ
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) ఇకపై రూ.2 కోట్ల వరకూ గృహ రుణంపై కూడా అతి తక్కువ వడ్డీరేటు 6.66 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకూ రూ.50 లక్షల రుణం వరకూ ఉన్న ఈ అతితక్కువ వడ్డీరేటు ఆఫర్‌ను రూ.2 కోట్ల వరకూ రుణానికి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకూ 6.66 శాతం వద్ద అతితక్కువ రుణ రేటు నిర్ణయాన్ని ఈ యేడాది జూలైలో సంస్థ ప్రకటించింది. అయితే 6.66 శాతం వడ్డీరేటు కోరుకునే వారికి సిబిల్ స్కోర్ 700, ఆపైన ఉండాలి. 2021 సెపె్టంబర్ 22 నుంచి నవంబర్ 30 మధ్య రుణ మంజూరు జరిగి, మొదటి దఫా రుణ పంపిణీ 2021 డిసెంబర్‌లోపు జరిగి ఉండాలి. వేతనం పొందుతున్న వారితోపాటు స్వయం సంపాదనా పరులకూ తాజా నిర్ణయం వర్తిస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్ గౌడ్ తెలిపారు. రూ.2 కోట్ల వరకూ రుణం తీసుకున్న సందర్భంలో రుణ మొత్తంపై 0.25% లేదా గరిష్టంగా రూ.10,000కానీ ఏది తక్కువైతే అంతమొత్తం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ లభిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గృహ రుణానికి ఆన్లైన్ దరఖాస్తు, ఆమోదానికి ఉద్దేశించి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఇటీవలే ‘హోమై యాప్’ను ఆవిష్కరించింది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) , పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హెచ్డీఎఫ్సీ గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. -
తక్కువ వడ్డీకే అప్పు కావాలా? మార్గాలివిగో..
Debt At Low Interest: కరోనా ఆంక్షలు ముగిసిన తర్వాత ఒకేసారి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు, శుభకార్యాలకు హాజరవడం వంటివి మీద పడుతున్నాయి. మరోవైపు పెట్రోలు సహా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా చాలామందికి తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వడ్డీ తిప్పలు బయట అప్పు తీసుకుంటే వడ్డీ రేట్లు అధికం. ప్రతీ నెల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామంటే అక్కడా వడ్డీ పోటు తప్పడం లేదు. బంగారం తాకట్టులోనూ ఇదే పరిస్థితి. చిన్న ఆర్థిక అవసరం కోసం తాకట్టు పెడితే వడ్డీల లెక్కలతో బంగారం దూరమయ్యే అవకాశమే ఎక్కువ. అతి తక్కువ వడ్డీతో సాధారణ ఆర్థిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంది. తక్కువ వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే మార్గాలు మీ కోసం. శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ ప్రతీ నెల జీతం తీసుకునే ఉద్యోగులు బయట అప్పులు చేయకుండా తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న అవకాశాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ ఒకటి. ప్రతీ నెల తీసుకునే జీతానికి మూడింతల సొమ్మును బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ద్వారా పొందవచ్చు. సాధారణంగా ఓడీలో తీసుకున్న సొమ్మును 12 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈఎంఐ తరహాలో వడ్డీ విధించరు. ఎంతకాలానికి, ఎంత సొమ్ము ఉపయోగించామనే దాన్ని బట్టే బ్యాంకు వడ్డీ విధిస్తుంది. ఎలాంటి పెనాల్టీ ఛార్జెస్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఓడీని క్లోజ్ చేయోచ్చు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఓడీ ద్వారా త్వరగా సులువుగా అవసరానికి డబ్బును సర్థుబాటు చేసుకోవచ్చు. పేడే లోన్స్ రాబోయే నెల జీతం నుంచి ముందుగానే డబ్బులు తీసుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని పేడే లోన్ అంటారు. తక్కువ కాలానికి తక్కువ మొత్తంలో డబ్బును తీసుకునేందుకు పేడే లోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ లోన్‌ను ఒకేసారి చెల్లిస్తారు. సాధారణంగా నెల జీతంలో ఈ లోన్ కట్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లోన్ మనకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ మీద తక్కువ వడ్డీకే లోను పొందే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కి సంబంధించిన మొత్తంలో 85 నుంచి 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు. కోవిడ్ లోన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీతో కోవిడ్ లోన్‌ను ప్రవేశపెట్టింది. 2021 ఏప్రిల్ తర్వాత కోవిడ్ సోకిన వారు మెడికల్, ఇతర ఖర్చుల నిమిత్తం ఈ లోనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన శాలరీ, నాన్ శాలరీ ఎంప్లాయిస్‌తో పాటు పెన్షనర్లు కూడా ఈ లోను తీసుకునేందుకు అర్హులు. మ్యూచువల్ ఫండ్ లోన్ అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై తక్కువ వడ్డీతో లోను తీసుకొవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మ్యూచువల్‌ఫండ్‌లో కొంత మొత్తాన్ని అమ్మకానికి పెట్టి లోను లేదా ఓడీని పొందవచ్చు. ఉపయోగించిన సొమ్ముకే వడ్డీని విధిస్తారు. లోను మొత్తానికి వడ్డీని లెక్కించరు. -
ఇంటి రుణంపై ‘టాపప్’
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అయినా లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారన్న విషయమై స్పష్టత లేదు. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను తెరిచే పరిస్థితి లేదు. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నదీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. వేతనాల్లో కోతలను కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదురయ్యే కష్టాల నుండి గట్టెక్కేందుకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి మూడు నెలల వేతనాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మొత్తం చాలని వారు, ఈపీఎఫ్ అవకాశం లేని వారు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌ను పరిశీలించొచ్చు. పర్సనల్ లోన్ కంటే ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడాన్ని పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటుకే లభిస్తున్న టాపప్ హోమ్ రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణానికి అనుబంధంగా ఇచ్చే రుణమే టాపప్ హోమ్ లోన్. గరిష్టంగా మంజూరు చేసే రుణం, కాల వ్యవధి అనేవి బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. ప్రస్తుతం తాము ఇంటి రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాపప్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే ప్రస్తుత బ్యాంకు నుంచి ఇంటి రుణాన్ని బదలాయించుకున్న తర్వాతే అందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండడం ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ టాపప్ హోమ్‌లోన్‌పై తక్కువ రేటును వసూలు చేస్తోంది. ఎస్బీఐలో టాపప్ హోమ్ లోన్‌పై రేటు 7.6 శాతంగా ఉంటే, ఇతర బ్యాంకుల్లో ఇది 7.85 శాతం నుంచి ప్రారంభమవుతోంది. రుణాన్ని వినియోగించుకునే విషయంలో షరతుల్లేకపోవడం మరో అనుకూల అంశం. ఈ మొత్తాన్ని పిల్లల విద్యావసరాలు, రోజువారీ అవసరాలు, ఇంటి నవీకరణ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం వినియోగించుకోవచ్చు. కనుక కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ఈ టాపప్ లోన్ అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే, ‘‘లాక్డౌన్ సమయంలో ఇంటి రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకోసం న్యాయ, సాంకేతిక మదింపు అవసరం అవుతుంది’’ అని రిటైల్ లెండింగ్ డాట్ కామ్ డైరెక్టర్ సుకన్యకుమార్ తెలియజేశారు. లాక్డౌన్ కాలంలోనే రుణం కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చని సూచించారు. అర్హతలు... ప్రస్తుత ఇంటి రుణ గ్రహీతలు టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అర్హులు. ఇంటి మార్కెట్ విలువ, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అప్పటికే కనీసం 9 నెలల నుంచి ఏడాది కాలానికి క్రమం తప్పకుండా రుణ చెల్లింపులు చేసిన చరిత్ర ఉండాలి. కొన్ని బ్యాంకులు నిర్మాణంలో ఉన్న వాటికి కాకుండా.. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలపైనే టాపప్ హోమ్ లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటి మార్కెట్ విలువలో అప్పటికే తీసుకున్న రుణ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన విలువలో 80% వరకు బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. అయితే, కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఆస్తుల ధరలు పడిపోయాయి. దీంతో ఇంటి మార్కెట్ విలువ తగ్గి ఉంటుంది కనుక అది రుణ అర్హతలను ప్రభావితం చేయగలదు. అన్నీ చూసిన తర్వాతే... టాపప్ హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు.. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీజు, రుణ కాల వ్యవధి ఈ అంశాలన్నింటినీ చూడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం మీ ఇంటి రుణం ఏ బ్యాంకులో తీసుకుని ఉంటే ఆ బ్యాంకు నుంచే తీసుకోవడం సౌకర్యం. లేదంటే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదలాయించుకున్న తర్వాత రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకోసం సమయం తీసుకుంటుంది. ఇది లాక్డౌన్ కాలం కనుక బయటకు వెళ్లి అన్ని పనులు చేసుకునే అవకాశం లేదు. కనుక ఇంటి రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించడమే సౌలభ్యం. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు టాపప్ హోమ్ లోన్‌ను ఆస్తిపై ఇస్తున్న రుణంగా పరిగణిస్తూ అధిక రేటును వసూలు చేస్తున్నాయి. ఈ జాబితాలో మీ బ్యాంకు కూడా ఉందేమో పరిశీలించుకోవాలి. ఒక వేళ రేటు గరిష్ట స్థాయిలో ఉంటే అప్పుడు వేరే మార్గాన్ని పరిశీలించాలి. బ్యాంకు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌లో లాకిన్ పీరియడ్ ఉందేమో కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే లాకిన్ పీరియడ్ ఉందనుకుంటే.. ఆ కాలంలో ముందుగానే రుణాన్ని తీర్చివేయాలనుకుంటే మిగిలిన రుణ బ్యాలన్స్ మొత్తంపై బ్యాంకులు 2 శాతం చార్జీని వసూలు చేయవచ్చు. అన్ని అంశాలు తెలుసుకోవాలి రుణం ఏదైనా కానీయండి.. అది మీ చివరి ఎంపికగానే ఉండాలి. ముఖ్యంగా వేతనాల్లో కోతలు, ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న తర్వాత నుంచి ఈఎంఐలు మొదలవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ముందుగా అత్యవసర నిధి ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. అది లేని సందర్భాల్లో ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని విక్రయించుకోవాలి. లేదా బంగారం ఉన్నా కానీ విక్రయించి ఈ సంక్షోభ సమయాన్ని గట్టెక్కడం మంచిది. ఇవేవీ లేని సందర్భాల్లో ఈపీఎఫ్ నుంచి మూడు నెలల వేతనాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్ హోమ్‌లోన్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటుంది. అయితే, ఓ ఏడాది రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఏర్పడితే.. అందుకు బ్యాంకు అవకాశం ఇస్తుందా.. జరిమానాలు, పెనాల్టీలు ఏవైనా ఉన్నాయేమో విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. -
అక్కడ అందరికీ అప్పులే..
లండన్ : సంపన్న దేశం అనగానే అందరికీ కళ్లుచెదిరే భవంతులు, ఖరీదైన కార్లు గుర్తొస్తుంటాయి. అయితే ఇవన్నీ ఉన్నా బ్రిటన్‌లో ప్రజలందరూ నిండా అప్పుల్లో మునిగారు. పదేళ్ల పాటు అతితక్కువ వడ్డీరేట్లు కొనసాగిన క్రమంలో ప్రజల్లో పొదుపు రేట్లు పడిపోయి రుణాలు పెరిగిపోయాయి. ప్రజలు పొదుపు చేసిన మొత్తం కన్నా తీసుకున్న రుణాలు పెరిగిపోవడంతో 1987 తర్వాత తొలిసారిగా బ్రిటన్ ప్రజలు 2017లో నికర రుణగ్రహీతలుగా మారారు. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన డేటాతో ఈ దిగ్భ్రాంతికర సమాచారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల కోసం ప్రజలు పొదుపు చేసే మొత్తాలు 1963 తర్వాత అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయాయని నివేదిక వెల్లడించింది. గత ఏడాది బ్రిటన్ పౌరులు తాము సంపాదించిన మొత్తం కంటే 1440 కోట్ల యూరోలు అధికంగా ఖర్చు చేశారు. బ్రిటన్ కుటుంబాలు తాము పొదుపు చేసిన మొత్తం కంటే 460 కోట్ల యూరోలు అధికంగా అప్పు చేశారని నివేదిక తెలిపింది. 1963లో పొదుపు వివరాలు మదింపు చేస్తున్నప్పటి నుంచి అతితక్కువగా 2017లో బ్రిటన్ పౌరుల సంపాదనలో కేవలం 4.9 శాతమే పొదుపు చేశారని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభానికి ముందు వడ్డీరేట్లు 5 శాతం ఉండగా, అనంతరం వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బేస్ రేట్ కేవలం 0.5 శాతమే. కారుచౌకగా రుణాలు లభిస్తుండటంతో బ్రిటన్ పౌరులు విపరీతంగా రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీటిని తిరిగి చెల్లించే క్రమంలో కుటుంబ ఖర్చులను అధిగమించి పొదుపు చేయడం బ్రిటన్ పౌరులకు సంక్లిష్టంగా మారింది. మారుతున్న పరిస్థితుల్లో బ్రిటన్ పౌరులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదుపు దేశంగా వర్థిల్లిన బ్రిటన్ ఇప్పుడు రుణ గ్రహీతల దేశంగా మారిందని ప్రజలు తిరిగి పొదుపును అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. -
తక్కువ వడ్డీ రేట్లు ముఖ్యమే, కానీ..
డిమాండే అత్యంత కీలకం: రాజన్ న్యూయార్క్: ద్రవ్యపరపతి విధానాలను సడలించాలంటూ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు పెరుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ స్థాయి వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ముఖ్యమే అయినప్పటికీ.. ఆర్థిక వృద్ధి సాధించాలంటే వినియోగపరమైన డిమాండ్ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. న్యూయార్క్‌లోని ఎకనామిక్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్య విధానంలో ప్రస్తుతం ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు నిలకడైన వృద్ధికి అవకాశం లేకుండా పోయిందని, అటు ఆర్థిక రంగానికి గణనీయమైన ముప్పు ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రయోజనాలిచ్చే పెట్టుబడులు, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, రుణాల భారం వల్ల సుదీర్ఘకాలం పాటు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పుడు .. కొత్త పెట్టుబడులపై రాబడులు అంతగా ఉండబోవని రాజన్ తెలిపారు. పాలసీ రేట్లను సున్నా స్థాయి కన్నా కూడా తక్కువకి తగ్గించడం సాధ్యం కాదని, చాలా మటుకు యూరోపియన్ దేశాలు ఈ విషయంలో పరిమితికి మించి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు.