న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30 వరకూ 6.50 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇది 6.75 శాతంగా ఉంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫరు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్ మేనేజర్ (మార్ట్‌గేజెస్, ఇతర రిటైల్ అసెట్స్) హెచ్‌టీ సోలంకి తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కి కూడా కొత్త రేటు అందుబాటులో ఉంటుంది. సిబిల్ స్కోరు 771కి పైగా ఉన్న వారికి దీన్ని వర్తింపచేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ 6.5 శాతమే వడ్డీ రేటు ఆఫర్ చేసిన బీవోబీ .. ఏప్రిల్ 1 నుంచి దాన్ని 6.75%కి పెంచింది. మళ్లీ వెంటనే తిరిగి పూర్వ స్థాయికి తగ్గించడం గమనార్హం.
చదవండి👉🏼: నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు
Comments
Please login to add a commentAdd a comment