ప్రస్తుతం చాలీ చాలని ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే లోన్స్ తీసుకుని భారీ వడ్డీలను కడుతూ చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అలంటి టాప్ 10 బ్యాంకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
- బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.90% నుంచి 14.75% వడ్డీతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 10 శాతం లేదా అంత కంటే తక్కువ వడ్డీ రేటుతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్: 10.26% నుంచి 32.53% వడ్డీతో కనిష్టంగా రూ. 30వేల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు 12 నెలల నుంచి 60 నెలల కాల వ్యవధితో అందిస్తుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: 10.40% నుంచి 16.95% వడ్డీ రేటుతో సుమారు 5 సంవత్సరాలు లేదా 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
- యాక్సిస్ బ్యాంక్: 10.49% నుంచి 22.00% వడ్డీ రేటుతో 60 నెలలు / 5 సంవత్సరాల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
- IDFC ఫస్ట్ బ్యాంక్: 10.49% లేదా అంతకంటే తక్కువ వడ్డీతో 6 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. కోటి వరకు లోన్ అందిస్తుంది.
- HDFC బ్యాంక్: 10.50% నుంచి 24.00% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
- ఐసిఐసిఐ బ్యాంక్: 10.75% నుంచి 19.00% వడ్డీతో 12 నుంచి 72 నెలల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
- ఐడిబిఐ బ్యాంక్: 10.50% నుంచి 15.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 25వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
- కరూర్ వైశ్యా బ్యాంక్: 10.50% నుంచి 13.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment