personal loans
-
పర్సనల్ లోన్లు ఇక కష్టమే.. అమల్లోకి ఆర్బీఐ కొత్త రూల్
ఎడాపెడా పర్సనల్ లోన్లు (personal loans) పొందడం ఇకపై కష్టతరం కానుంది. బ్యాంకులు (Banks), రుణ వితరణ సంస్థలు ప్రతి 15 రోజులకూ క్రెడిట్ బ్యూరో రికార్డ్లను అప్డేట్ చేయాలనే కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది. ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్డేట్ చేయనుండటంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది.రిపోర్టింగ్ విరామాన్ని 15 రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు గత ఆగస్టులోనే ఆర్బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవస్థలను రూపొందించుకునేందుకు జనవరి 1 వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్‌ను అంచనా వేయవచ్చని ఆర్బీఐ పేర్కొంది."ఈఎంఐలు (EMI) నెల అంతటా వివిధ తేదీలలో షెడ్యూల్ అయిఉంటాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్‌లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు. ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు ముగిసిన డేటా వస్తుంది. 15-రోజుకోసారి రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది" అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఆర్ఐఎఫ్ హై మార్క్ ఛైర్మన్ సచిన్ సేథ్ అన్నారు.తరచుగా చేసే డేటా అప్డేట్లు "ఎవర్‌గ్రీనింగ్"(పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేయడం) వంటి పద్ధతులను కూడా నిరోధిస్తాయని రుణదాతలు చెబుతున్నారు. రిపోర్టింగ్ సైకిల్‌ను సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరింత విశ్వసనీయమైన డేటాను పొందుతారు. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. -
ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ దూసుకెళ్లడం ఖాయం!
మీరు ఏదైన లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలియాల్సిందే. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరించేందుకు వీలుంటుంది.సిబిల్ స్కోరు అంటే ఏమిటి?ప్రభుత్వం ఆధీనంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) సంస్థ మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు వంటివి రికార్డు చేస్తుంది. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు ఈ సిబిల్ స్కోర్‌ను తప్పకుండా పరిశీలిస్తుంది.ఈ స్కోర్ 300-900 వరకు ఉంటుంది. అధిక స్కోర్(750 కంటే ఎక్కువ) ఉంటే మీకు రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం తదుపరి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..వడ్డీ రేటుపర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరికి లోన్ ఇస్తారులోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.ఆదాయాన్ని మించకుండా..పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.లోన్ ఎప్పుడు తీసుకోవాలి?లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. -
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆర్బీఐ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్రెడిట్‌కార్డ్‌సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై నిబందనలను కఠినతరం చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం బ్యాంకులు, నాన్–బ్యాంకు ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)ల రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ‘‘ముందస్తు’’ చర్యని బుధవారం గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిస్క్ కేటాయింపులను 25 శాతం పెంచుతూ ఆర్బీఐ కీలక నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నాటికి వార్షికంగా ఈ రుణ విభాగం 30 శాతం పెరుగుదల దీనికి నేపథ్యం. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. -
క్రెడిట్ కార్డు.. కొంచెం కష్టమే!
ముంబై: క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయమై బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్ మరింత ఖరీదైనదిగా మారడంతో ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరుగుతుంది. కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. -
తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...
బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్ సెక్టార్‌కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..) ఇండస్ట్రీయల్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్ రంగ నిపుణులు వి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్‌మార్కెట్ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
హౌసింగ్ డాట్ కామ్ ద్వారా వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ ‘హౌసింగ్ డాట్ కామ్’ ఫిన్‌బాక్స్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రూ.10 లక్షల వరకు రుణాలను తక్షణమే జారీ చేయనున్నట్టు తెలిపింది. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇంటి నవీకరణ, ఫరి్నచర్ కొనుగోలు అవసరాలను తీర్చేందుకు గాను కస్టమర్లకు రుణ సాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరింత సౌకర్యవంతంగా డిజిటల్ రూపంలో రుణాల మంజూరుకు గాను ఈ సేవను తన యాప్, వెబ్‌సైట్‌తో అనుసంధానించనున్నట్టు ప్రకటించింది. హౌసింగ్ ఎడ్జ్ ద్వారా కస్టమర్లు ఈ సేవను పొందొచ్చని తెలిపింది. సంక్లిష్టమైన రుణ దరఖాస్తులకు కాలం చెల్లిపోయిందని, మొత్తం రుణ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లోనే 3 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టు హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోనే రుణాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లకు సంబంధించి అన్ని అవసరాలను అందించే ఏకీకృత వేదికగా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు. -
అన్ సెక్యూర్డ్ రుణాలకే ఎక్కువ డిమాండ్
ముంబై: క్రెడిట్ కార్డులపై వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి మార్చి నాటికి 2.94 శాతానికి చేరాయి. క్రెడిట్‌కార్డ్, వ్యక్తిగత రుణాల వాటా వేగంగా పెరుగుతున్నట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్ సిబిల్’ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రక్షణలేని రుణాలు పెరిగిపోతుండడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిల్ నివేదిక విడుదల కావడం గమనార్హం. మూడు నెలలకు మించి చెల్లింపులు లేని రుణాలను ఎన్పీఏలుగా పరిగణిస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డులపై మూడు నెలలకు పైగా చెల్లింపులు చేయని రుణాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 0.66 శాతం పెరిగినట్టు, వ్యక్తిగత రుణాల్లో ఎన్పీఏలు 0.04 శాతం పెరిగి 0.94 శాతంగా ఉన్నట్టు సిబిల్ తెలిపింది. ఇక క్రెడిట్ కార్డ్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణాలు సైతం 29 శాతం వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు (ఎల్ఏపీ) 38 శాతం పెరిగి అత్యంత వేగంగా వృద్ధి చెందిన రిటైల్ రుణ విభాగంగా ఉన్నట్టు వివరించింది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ప్రాపర్టీపై రుణాలను తీసుకుంటూ ఉంటాయి. గృహ రుణాలపై రేట్ల ప్రభావం గృహ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతమే వృద్ధి చెందాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఈ విభాగంలో రుణాల వృద్ధి తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–మార్చి మూడు నెలల కాలాన్ని పరిశీలించినట్టయితే విలువ పరంగా ఫ్లాట్‌గా ఉంటే, సంఖ్యా పరంగా 11 శాతం తగ్గినట్టు సిబిల్ నివేదిక స్పష్టం చేసింది. ప్రాపర్టీ రేట్లతోపాటు, గృహ రుణాలపైనా రేట్లు పెరగడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది. ఆస్తుల నాణ్యతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కస్టమర్లకు (అప్పటి వరకు రుణం తీసుకోని వారు) రుణాల విషయంలో రుణదాతలు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో అలాంటి కొత్త కస్టమర్లకు జారీ చేసిన రుణాల వాటా 16 శాతంగానే ఉందని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 19 శాతంగా ఉన్నట్టు వివరించింది. -
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 30 సెకన్లలో రూ.5 లక్షల లోన్!
ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. కస్టమర్లకు లోన్స్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఇందులో బజాజ్, టాటా క్యాపిటల్ మొదలైన సంస్థలు అతి తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) ప్రవేశించింది. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వల్ల సుమారు 450 మిలియన్ కస్టమర్లు అదనపు సౌలభ్యం పొందే అవకాశం ఉంది. కేవలం 30 సెకన్లలోపు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందవచ్చని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి 6 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కావున ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రముఖ బ్యాంకుల సహకారంతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 'బై నౌ పే లేటర్' (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు (EMI) అండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు వంటివి అందిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. కాగా ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంక్ సహకారంతో పర్సనల్ లోన్ విభాగంలో కూడా అడుగుపెట్టడం చాలా సంతోషముగా ఉందన్నారు. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి ప్రాథమిక వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించిన తరువాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఎంత లోన్ అందించాలి, ఎంత లోన్ తీసుకోవడానికి అర్హులు అని నిర్ధారిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి చెల్లించే అర్హతను బట్టి లోన్ మొత్తంతో పాటు.. రీపేమెంట్ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా కోకొల్లలుగా అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు వాటిని గురించి కూడా ఆరా తీయవచ్చు. -
వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు
సాక్షి, అమలాపురం/కొత్తపేట: వైద్యులు.. ఇంజి నీర్లు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారులు.. ప్రైవేట్ ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులు కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేరారు. ఇతర వృత్తి నిపుణులకు ఇస్తున్న మాదిరిగానే ఇకపై కౌలుదారులను కూడా అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ (వ్యవసాయ నిపుణులు)గా గుర్తిస్తూ ఇకపై వీరికి కూడా వ్యక్తిగత రుణాలు అందించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంట భూమి లేకపోయినా.. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ‘అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్’గా గుర్తించి జిల్లా యంత్రాంగం రుణాలు మంజూరుకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ అధికారుల సిఫార్సులతో.. కౌలు కార్డులు (సీసీఆర్సీ) ఉన్నా రుణాలు అందుకోలేక ఇబ్బంది పడుతున్న కౌలుదారుల దుస్థితిని గుర్తించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం రైతుల పేరిట సెంటు భూమి లేకున్నా.. సంబంధిత వీఆర్వో, వీఏవోలు, తహసీల్దార్ సిఫార్సు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) రుణాలు మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో తొలివిడతగా 10 మండలాల్లోని 10 గ్రామాలను ఎంపిక చేసి.. ఆయా గ్రామాల్లో 540 మంది అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్‌కు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 323 మందికి మంగళవారం రుణాలు అందజేశారు. కొత్తపేట మండలం అవిడిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసిన రైతులకు రూ.1,40,58,100 చెక్కు రూపంలో అందజేశారు. విజయవంతమైతే అన్ని గ్రామాలకు విస్తరణ కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ.. తొలి దశలో 10 మండలాల్లోను, రెండవ దశలో మిగిలిన 22 మండలాల్లోని 25 గ్రామాల్లోని ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. వ్యక్తిగత రుణాలతోపాటు ఐదు మండలాల పరిధిలో 38 గ్రూపులకు చెందిన 526 మంది రైతులకు సైతం రుణాలు అందించనున్నారు. 6 నెలల్లో ఫలితాలు చూసి జిల్లాలోని అన్ని గ్రామాలకూ విస్తరిస్తామన్నారు. ఇందుకోసం డీసీసీబీతోపాటు యూనియన్ బ్యాంక్ సైతం ముందుకు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీనిని అమలు చేయడం అభినందనీయమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి కౌలు రైతులకు మేలు చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బ్యాంక్ రుణం ఇదే తొలిసారి నేను 30 ఏళ్లుగా వ్యవ సాయం చేస్తున్నా. నాకు సొంత భూమి లేదు. ఏటా పరిస్థితిని బట్టి 10 నుంచి 20 ఎకరాల వరకు సాగు చేస్తాను. ఎప్పుడూ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయడం తప్ప ప్రభుత్వం నుంచి లేదా బ్యాంకుల నుంచి రుణం పొందలేదు. జగన్ హయాంలో తొలిసారిగా బ్యాంక్ రుణం వచ్చింది. రైతు భరోసా పేరుతో రైతుల అకౌంట్లలో సొమ్ములు వేస్తున్నట్టుగా ఇప్పుడు మా అకౌంట్లో రుణం సొమ్ములు వేశారు. చాలా సంతోషంగా ఉంది. – టి.వీరన్న, అవిడి, కొత్తపేట మండలం వడ్డీకి అప్పు తెచ్చేవాళ్లం ఇప్పటివరకు వ్యాపారుల వద్ద అప్పులు చేయడం.. నూటికి రూ.3 నుంచి రూ.5 చొప్పున ప్రతినెలా వడ్డీ చెల్లించే వాళ్లం. పైగా ధాన్యం వారు కట్టిన ధరకే అమ్మాల్సి వచ్చేది. సాగు మధ్యలో కాని అప్పులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రూ.1.20 వడ్డీ. సాగుకు ముందే రుణం ఇచ్చారు. తిరిగి చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందుతాం. – డి.పెంటయ్య, అవిడి, కొత్తపేట మండలం -
వందల కోట్ల కుంభకోణం.. వివాదంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫౌండర్!
కొనుగోలు దారులు ఏదైనా ప్రాంతంలో ఇళ్లు, లేదా ఇతర స్థిరాస్థులు కొనుగోలు చేయాలంటే రియల్ ఎస్టేట్ ఏంజెంట్ల (రియల్ ఎస్టేట్ బ్రోకర్లు)ను ఆశ్రయిస్తుంటారు. ఇలా దేశంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వ్యవస్థను ఒకేతాటి మీదకు తీసుకొచ్చి కొనుగోలు దారులకు కావాల్సిన స్ధిరాస్థుల వివరాలు, క్రయ - విక్రయాలు, లోన్లు మంజూరు చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది ‘బ్రోకర్ నెట్వర్క్’. ఇప్పుడు ఆ సంస్థ ఫౌండర్ రాహుల్ యాదవ్ కష్టాల్లో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ముంబై కేంద్రంగా రియల్ ఎస్టేట్ సర్వీసులు అందించే బ్రోకర్ నెట్‌వర్క్‌లో మొత్తం 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, గత ఏడాది నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వ లేదని సమాచారం. కానీ, ఆ సంస్థ ముంబై లగ్జరీ హోటల్ తాజ్ ల్యాండ్స్ నిర్వహించే ఒక రోజు బోర్డ్ మీటింగ్ పెట్టే ఖర్చు అక్షరాల రూ.81,000. రాహుల్ తన ఇంట్లో వినియోగించే ఫర్నీచర్, గృహోపకరణాలు, ఖరీదైన లగ్జరీ కార్లును కొనుగోలు చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాల చెల్లింపులోనూ బ్రోకర్ నెట్వర్క్ ఫౌండర్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సిబ్బందికి చెల్లించే వేతనాలను సైతం వారి పేర్లమీద పర్సనల్ లోన్లు తీసుకొని జీతాలు ఇచ్చేవారు. ఉద్యోగుల నుంచి లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారని, అలా అప్పు చెల్లించకపోవడంతో ఓ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఆ సంస్థ ఫౌండర్ 18 నెలల్లో రూ.280 కోట్లకు ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఇప్పుడీ అంశం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. -
34 లక్షల మందికి ఇంటి రుణాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి ఇంటి రుణాలను మంజూరు చేశాయి. వీటి విలువ రూ.9 లక్షల కోట్లు. రిటైల్ రుణాలపై ఈక్విఫ్యాక్స్, ఆండ్రోమీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రూ.25 లక్షల లోపు ఇంటి లోన్ అందుకున్నవారి సంఖ్య గతేడాది ఏకంగా 67 శాతం ఉండడం గమనార్హం. రూ.75 లక్షలు–రూ.1 కోటి వరకు తీసుకున్న లోన్లు 36 శాతం అధికం అయ్యాయి. 2021తో పోలిస్తే హోమ్ లోన్స్ 2022లో 18 శాతం ఎగశాయి. అలాగే ఈ రుణాలు అందుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం గృహ రుణాలు 16 శాతం అధికం అయ్యాయి. వ్యక్తిగత రుణాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ రుణ మార్కెట్ విలువ 2022 డిసెంబర్ నాటికి రూ.100 లక్షల కోట్లకు చేరింది. 54 కోట్ల యాక్టివ్ లోన్లు ఉన్నాయి. గతేడాది చివరినాటికి గృహోపకరణాల కోసం రుణాలు అందుకున్న యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 6.5 కోట్లు. 2021తో పోలిస్తే ఇది 48 శాతం అధికం. హోమ్ లోన్స్ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. వినియోగం పెరగడం, సులువుగా లభ్యత, రుణదాతల మధ్య పోటీ వ్యక్తిగత రుణ విభాగం డిమాండ్‌కు కారణం. ఇటీవల ఆర్బీఐ పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ గృహ రుణ రేట్ల మాదిరిగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పెరుగుదలను చూడలేదు. -
తక్కువ వడ్డీతో లోన్ కావాలా? ఇదిగో టాప్ 10 బెస్ట్ బ్యాంకులు!
ప్రస్తుతం చాలీ చాలని ఉద్యోగాలతో జీవితం నెట్టుకొస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే లోన్స్ తీసుకుని భారీ వడ్డీలను కడుతూ చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అలంటి టాప్ 10 బ్యాంకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.90% నుంచి 14.75% వడ్డీతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 10 శాతం లేదా అంత కంటే తక్కువ వడ్డీ రేటుతో రూ. 20 లక్షల వరకు 84 నెలలు లేదా 7 సంవత్సరాల కాల వ్యవధితో అందిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్: 10.26% నుంచి 32.53% వడ్డీతో కనిష్టంగా రూ. 30వేల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు 12 నెలల నుంచి 60 నెలల కాల వ్యవధితో అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 10.40% నుంచి 16.95% వడ్డీ రేటుతో సుమారు 5 సంవత్సరాలు లేదా 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్: 10.49% నుంచి 22.00% వడ్డీ రేటుతో 60 నెలలు / 5 సంవత్సరాల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్: 10.49% లేదా అంతకంటే తక్కువ వడ్డీతో 6 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. కోటి వరకు లోన్ అందిస్తుంది. HDFC బ్యాంక్: 10.50% నుంచి 24.00% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో సుమారు రూ. 40 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్: 10.75% నుంచి 19.00% వడ్డీతో 12 నుంచి 72 నెలల కాల వ్యవధితో రూ. 50వేలు నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఐడిబిఐ బ్యాంక్: 10.50% నుంచి 15.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 25వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అందిస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్: 10.50% నుంచి 13.50% వడ్డీ రేటుతో 12 నుంచి 60 నెలల కాల వ్యవధితో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. -
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!
ఈ రోజు మనిషి ఎంత సంపాదించినా ఏదో తక్కువైనట్లు, ఏమీ మిగలటం లేదని భావిస్తూనే ఉంటాడు, దీనికి ప్రధాన కారణం పెరిగిన నిత్యావసరాల ధరలు కావచ్చు లేదా అధికమైన కుటుంబ ఖర్చులు కావచ్చు. దీనికోసం చాలీ చాలని సంపాదనతో ముందుకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటాడు. ఒక వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకున్న తరువాత ప్రతి నెలా ఈఎమ్ఐ రూపంలో డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. లోన్ అనేది ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది, అదే సమయంలో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడనికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు తీసుకునే లోన్ ఒకే రకమైన వడ్డీ రేటుతో లభించే అవకాశం ఉండదు. వడ్డీ బ్యాంక్, ఇతర ఫైనాన్స్ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకునే వారు తప్పకుండా బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను తెలుసుకోవాలి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు సిబిల్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, ప్రిన్సిపల్ అమౌంట్, టెన్యూర్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా వడ్డీ అనేది పర్సనల్ లోన్ మొత్తంపై లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 16 శాతం వడ్డీ రేటుపైన ఐదు లక్షలు, 60 నెలలు/5 సంవత్సరాల సమయానికి (తిరిగి చెల్లించే కాల వ్యవధి) తీసుకున్నప్పుడు అతడు మొత్తం రూ. 7.29 లక్షలు చెల్లించాలి. అంటే ఆ వ్యక్తి అదనంగా రూ. 2.29 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేటుపైన ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు తప్పకుండా గమనించాలి. వివిధ బ్యాంకులలో వివిధ రకాల వడ్డీ రేట్లు: పర్సనల్ లోన్ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించే కాల వ్యవధి 7 సంవత్సరాలు/84 నెలలు ఉంటె వడ్డీ రేటు 9.10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్ తీసుకుంటే 12 నుంచి 60 నెలల కాలవ్యవధికి గానూ 10.20% నుంచి 13.20% వడ్డీ రేటు లభిస్తుంది. ఇండియన్ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వ్యక్తిగత రుణానికి 12 నుంచి 36 నెలల కాలవ్యవధికి 10.65% నుంచి 12.15% వడ్డీ రేటు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల లోపు పర్సనల్ లోన్ కోసం 12 నుంచి 72 నెలల కాలవ్యవధికి 10.75% నుంచి 19% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు బాగున్నప్పుడు ఎక్కువ లోన్, కొంత తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళా లోన్ లభించినా తక్కువ మొత్తంలో, ఎక్కువ వడ్డీ రేటుకి లభిస్తుంది. వడ్డీ రేట్లను గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్స్ గానీ, సమీపంలోని బ్యాంకు ద్వారా తెలుసుకోవచ్చు. -
RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!
ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది. కోవిడ్–19 కన్నా పావుశాతం అధికం... తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. ► రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5%కి ఇది దిగివస్తుంది. ► భారత్ వద్ద ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే, అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ కరెన్సీ పటిష్టంగానే ఉంది. ► భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్ఆర్ఐలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది. ► 2021 ఏప్రిల్–జూన్ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది. డిపాజిట్లను సమీకరించుకోండి! రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఐసీఐసీఐ, పీఎన్బీ వడ్డింపు.. న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 9.10%కి పెంచింది. పీఎన్బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది. -
మీకు లోన్ కావాలా.. అది కూడా గంటలోపు.. ఇలా అప్లై చేస్తే చాలు..
ఇటీవల కాలంలో యువత చేస్తున్న ఉద్యోగాలలో వాళ్లకిచ్చే జీతం వారి జీవన విధానానికి సరిపోవడం లేదు. అందుకు కొంత మంది రెగుల్యర్ జాబ్‌తో పాటు ఫ్రీలాన్సర్‌గా చేస్తూ ఆర్జిస్తుంటే, మరి కొంతమంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. అయితే అధిక శాతం మాత్రం వారి అవసరాల కోసం ముందుస్తుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందేకు మొగ్గు చూపుతున్నారు. గతంలో లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంక్ చూట్లూ తిరిగి, డ్యాంకుమెంట్లు సమర్పించి, ఆపై వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి చేతికి డబ్బులు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ రోజులు పోయాయి. మీ వద్ద కావాల్సిన డ్యాకుమెంట్లు అన్నీ ఉంటే ఒక్క రోజులోనే మీ లోన్లు మంజూరవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్‌ఫామ్ కూడా రూపొందించింది. మొదట్లో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు అందిస్తోంది. అసలేంటి పీఎస్బీ(PSB).... ఏం పని చేస్తుంది! పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్( psbloansin59minutes.com) ప్లాట్‌ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఇది బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరై, రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరు కాగా, రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్‌టిఐఎన్, జీఎస్టీ యూజర్ నేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా రిజిష్టర్ చేసుకోండి: 1: PSB అధికారిక వెబ్సైట్ psbloansin59minutes.comకి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేయండి 2: రిజిష్టర్ ప్రక్రియలో పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ నింపి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి 3: మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఆ ఎంటర్ చేయండి 4: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి అంగీకరించండి 5: అక్కడ ఉన్న కాలమ్స్ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి 6: మీరు రిజిష్టర్ అయినా అకౌంట్‌కు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇలా చేస్తే లోన్ వచ్చేస్తుంది.. 1: మీరు క్రియేట్ చేసిన అకౌంట్లోకి లాగిన్ అవ్వండి 2: వ్యాపారం లేదా ఎంఎస్ఎంఈ(MSME) లోన్ పొందడానికి మీ ప్రొఫైల్‌ను ‘బిజినెస్’గా ఎంచుకోండి, లేదా (పర్సనల్ లోన్ కోసం రీటైల్ ఎంచుకోండి) తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి 3: ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆపై మీ వ్యాపార పాన్ వివరాలను నమోదు చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి 4: గత 6 నెలలకు సంబంధించిన మీ GST వివరాలు, పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లను నింపండి 5: మీ ITRని అప్లోడ్ చేయండి, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి 6: మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి 7: మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. అలాగే ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 8: మీకు OTP వస్తుంది దీని ద్వారా మీ ఈమెయిల్ వెరిఫై చేయబడుతుంది. 9: ఆ తర్వాత ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో కనిపిస్తుంది. అందులో మీరు అప్లై చేయాలనుకున్న బ్యాంక్‌తో పాటు ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు బ్యాంకు నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. చదవండి: పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ అంటే ఎంసీఎల్ఆర్ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్ఆర్ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్ఆర్పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇంట్రస్ట్ రేట్లు ఎస్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్ఆర్ రేట్లు టెన్యూర్‌ను బట్టి మారాయి. ఆ వడ్డీ రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసుకుందాం. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. 6నెలల టెన్యూర్ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి వన్ ఇయర్ టెన్యూర్ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. అదనపు భారం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. చదవండి: తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్! -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!
కరోనా మహమ్మరి తర్వాత దేశంలో దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ విలువ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. గూగుల్ పే వాడుతున్న యూజర్లకు ఆన్లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ఉపయోగించే యూజర్లకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, దీని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రూ.లక్ష వరకు లోన్ పొందడానికి అర్హులు. గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ పర్సనల్ లోన్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అర్హత కలిగిన వినియోగదారులకు కేవలం నిమిషాల వ్యవదిలోనే డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ రూ.1 లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు అందజేయనున్నట్లు పేర్కొంది. అయితే, తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో(3 ఏళ్ల లోపు) తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరికీ లోన్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న యూజర్లకు రుణం లభించే అవకాశం ఉంటుంది. DMI Finance partners with @GooglePayIndia to offer an innovative digital personal loan product to make credit accessible to users of Google Pay.#InstantLoan #PersonalLoan pic.twitter.com/TCQ0YdVqCr — DMI Finance (@DMIFinance) February 14, 2022 "లక్షలాది మంది గూగుల్ పే వినియోగదారులకు పారదర్శకంగా, త్వరితగతిన రుణాలు అందించేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి చేరుకోవడానికి కృషి చేస్తామని" డీఎమ్ఐ ఫైనాన్స్ సహ వ్యవస్థాపకుడు & జాయింట్ ఎండి శివశిష్ ఛటర్జీ అన్నారు. (చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా ఓటీటీ సేవలు..!) -
తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..!
వ్యక్తిగత రుణం అనేది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే అసురక్షిత రుణం. అందుకే, వ్యక్తిగత రుణాల మీద వడ్డీ రేట్లు అనేవి సాదారణంగా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎక్కువ శాతం అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 8.15% నుంచి ప్రారంభమై 14% వరకు ఉంటాయి. ఇవి 12-60 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వ్యక్తిగత రుణాల రేట్లు 9.6% నుంచి ప్రారంభమై 15.65% వరకు ఉంటాయి. ఇవి 6-72 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.20 లక్షల మధ్య అప్పు ఇవ్వవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..! వ్యక్తిగత రుణంపై గరిష్ట మరియు కనీస పరిమితి ఎంత? అప్పు తీసుకోగల కనీస, గరిష్ట పరిమితి మొత్తం అనేది ప్రతి బ్యాంకుకు మారుతుంది. ఉదాహరణకు, వేతన జీవులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ తన వెబ్ సైట్లో పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయని తన వెబ్ సైట్లో తెలిపింది. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ ప్రకారం.. మీ క్రెడిట్ విలువను బట్టి మీరు రూ.75,000 మరియు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. (చదవండి: జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..) వ్యక్తిగత రుణానికి ఎవరు అర్హులు? వ్యక్తిగత రుణ అర్హత ఆవశ్యకతలు ఒక బ్యాంకుతో పోలిస్తే మరో బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం.. వ్యక్తిగత రుణానికి అర్హత పొందడానికి కనీసం నెలవారీ ఆదాయం రూ.15,000 ఉండాలి. వ్యక్తిగత రుణం కొరకు మీ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. వ్యక్తులు కనీసం 2 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తూ.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంది. నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.25,000 ఉంటే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాల కాలపరిమితి ఎంత? వ్యక్తిగత రుణాల కాలపరిమితి అనేది ప్రతి బ్యాంకును మారుతుంటాయి. బ్యాంకులు వంటి రుణ సంస్థలు తరచుగా గరిష్టంగా ఐదు సంవత్సరాలకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. వ్యక్తిగత రుణంలో ఇమిడి ఉన్న ఛార్జీలు ఏమిటి? ఒక బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి సంస్థలు వ్యక్తిగత రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర రెగ్యులేటరీ ఫీజులను వసూలు చేస్తాయి. అదేవిధంగా, రుణదాతపై ఆధారపడి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఫీజు కూడా విధిస్తారు. (చదవండి: టెస్లాలో కీచక పర్వం! అసభ్యంగా తాకుతూ వేధింపులు) -
తీరు మారింది, లోన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మానేశారు
న్యూఢిల్లీ: రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడం, పేపర్లకు పేపర్లు నింపి సంతకాలు చేయడం వంటి సాంప్రదాయక ‘ఆఫ్‌లైన్’ విధానాలకు రుణ గ్రహీతలు క్రమంగా దూరం అవుతున్నారు. రుణం పొందేందుకు ఆఫ్‌లైన్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి మిలీనియల్స్ (1977 నుంచి 1995 మధ్య జన్మించిన వారు) ఈ విషయంలో ముందు ఉంటున్నారు. పలు సంవత్సరాల నుంచీ మొదలైన ఈ వైఖరి కోవిడ్–19 సవాళ్లతో మరింత వేగం పుంజుకుంది. డిజిటల్ సేవలు విస్తరించడం కూడా ఈ విషయంలో కలిసి వస్తున్న ఒక అంశం. ఆయా అంశాలపై ఆర్థిక సంస్థ– హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక సర్వే ’హౌ ఇండియా బారోస్’ (హెచ్ఐబీ) తెలిపిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ►దాదాపు 40 శాతం మంది రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై సుముఖత వ్యక్తం చేశారు. ఇటీవల వరకూ ఇది కేవలం 15 శాతంగా ఉండేది. ►హైదరాబాద్‌సహా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, భోపాల్, ముంబై, కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో ఈ అధ్యయనం జరిగింది. 21–45 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సువారు 1,200 మంది (హోమ్ క్రెడిట్ కస్టమర్లు) సర్వేలో పాల్గొన్నారు. వీరందరూ నెలకు రూ. 30,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. ►గత సంవత్సరంతో పోల్చితే 2021లో గృహ వ్యయాల కోసం తీసుకునే రుణాలు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దీనికి కారణం. రుణ గ్రహీత అవసరాల ఆధారిత రుణం నుండి కోరిక ఆధారిత రుణాల వైపు మొగ్గుచూపడం పెరుగుతుండడం కనిపిస్తోంది. ►మొత్తం రుణ గ్రహీతల్లో 28 శాతం మంది వ్యాపారం ఏర్పాటు లేదా విస్తరణకు సంబంధించి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న రుణాలు తీసుకునే వారు 26 శాతం మంది ఉన్నారు. వీటిలో అధికంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, కండీషనర్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో గృహ పునరుద్ధరణ, కొత్త నిర్మాణం (13 శాతం), వైద్య అత్యవసర పరిస్థితి (2 శాతం), వాహన రుణం (9 శాతం), వివాహం (3 శాతం), విద్యా రుణం (2 శాతం), పెట్టుబడులు, మునుపటి రుణం చెల్లింపుల (1 శాతం) వంటివి ఉన్నాయి. ►ప్రాంతీయంగా చూస్తే, బెంగుళూరు, హైదరాబాద్ కరోనా మహమ్మారి సవాళ్ల నుండి వేగంగా కోలుకుంటున్నాయి. హైదరాబాద్‌లో 41 శాతం (సర్వేలో పాల్గొన్న వారిలో) మంది వ్యాపార పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకున్నారు. బెంగళూరు విషయానికి వస్తే, కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు 42 శాతం మంది ఉన్నారు. ►ఇంటర్నెట్ సౌలభ్యం అందుతున్న ప్రజల విషయానికి వస్తే, బిహార్, జార్ఖండ్‌లు వరుసగా 24 శాతం, 29 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి. కాగా పాట్నా, రాంచీలలో మొబైల్ ఫోన్ల వినియోగం పరంగా డిజిటల్ అక్షరాస్యత వరుసగా 64 శాతం మరియు 65 శాతంగా నమోదైంది. చదవండి: దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం! -
దీపావళి జాతర.. బ్యాంకుల్లో ఆఫర్లే ఆఫర్లు..
బ్యాంకుల్లో దీపావళి సందడి మొదలైంది. దీపావళి సందర్భంగా ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా బ్యాంకులు సైతం హోంలోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దీపావళి సందర్భంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులపై నోకాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ను హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే కష్టమర్లకు 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో పాటు కారు లోన్‌ను 7.50శాతం, పర్సనల్ లోన్ 10.25శాతం, టూవీలర్ పై 4 శాతం కన్నా తక్కువ వడ్డీకి అందిస్తుంది. ఎస్బీఐ ఈ దివాళీకి ఎస్బీఐ సైతం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే హోం లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 6.7 శాతం వడ్డికే అందిస్తుంది. దీంతో పాటు కారు లోన్ పై పడే ఇంట్రస్ట్‌లో 0.5 శాతం వరకు రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ప్రొడక్ట్‌ల కొనుగోలుపై రూ.2500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ దివాళీ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ లోకల్ కస్టమర్లను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా 50నగరాల్లో 2500పైగా లోకల్ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. లోకల్ స్టోర్లలో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కష్టమర్లకు 20 డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈకామర్స్ సైట్లలో ప్రొడక్ట్‌ల కొనుగోలుపై మరో 10శాతం డిస్కౌంట్ లభించనుంది. హోంలోన్లపై యాక్సిస్ బ్యాంకు 12 ఈఎంఐలను రద్దు చేసింది. టూవీలర్ల కొనుగోలు పై ప్రాసెసింగ్ ఫీజును తీసేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్లు ఇవ్వడంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతో పోటీ పడుతుంది.గతంలో హోం లోన్‌పై వడ్డీ 6.85, వాహనాల రుణాలపై 7.35శాతం ఇంట్రస్ట్ ఉండేది. కానీ దివాళీని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. గృహరుణాలపై వడ్డీ 6.50శాతం, వాహన రుణాలపై 6.85 శాతంకే అందిస్తుంది. ఐసీఐసీఐ ఐసీఐసీఐ బ్యాంక్ సైతం దివాళీ సందర్భంగా 'ఫెస్టివ్ బొనాంజా' ఆఫర్లను ప్రటించింది. ఈ కామర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్‌ఫాంలలో ప్రతి ప్రొడక్ట్ కొనుగోలుపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు డిస్కౌంట్‌ను పొందవచ్చు. హోంలోన్, ఫోర్ వీలర్ వంటి లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా బ్యాంకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. ఇంతకు ముందు 7శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.5 శాతానికి తగ్గించింది. ఇంటి,వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. -
వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?
కరోనా మహమ్మారి లాంటి విపత్కర కాలంలో చాలా మంది ప్రజలు అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం వడ్డీరేట్లు తగ్గాయని చెప్పుకోవాలి. అయితే, ప్రజలకు అందించే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇతర రుణాల వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్, కారు లోన్, గోల్డ్ లోన్ లతో పోలిస్తే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ రుణాల కోసం ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి ప్రాసెసింగ్ ఫీజ్, జీఎస్ టీ ఫీజ్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటే మంచిది. ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లక్ష రూపాయలకు 5 ఏళ్ల కాలానికి ఎంత అనేది ఈ క్రింద తెలుసుకోండి. -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ ?!
సాక్షి,వెబ్‌డెస్క్: బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. ఒకే ఒక్క పద్ధతి : అయితే వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 700లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి.