కొనుగోలు దారులు ఏదైనా ప్రాంతంలో ఇళ్లు, లేదా ఇతర స్థిరాస్థులు కొనుగోలు చేయాలంటే రియల్ ఎస్టేట్ ఏంజెంట్ల (రియల్ ఎస్టేట్ బ్రోకర్లు)ను ఆశ్రయిస్తుంటారు. ఇలా దేశంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వ్యవస్థను ఒకేతాటి మీదకు తీసుకొచ్చి కొనుగోలు దారులకు కావాల్సిన స్ధిరాస్థుల వివరాలు, క్రయ - విక్రయాలు, లోన్లు మంజూరు చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది ‘బ్రోకర్ నెట్‌వర్క్’. ఇప్పుడు ఆ సంస్థ ఫౌండర్ రాహుల్ యాదవ్ కష్టాల్లో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ముంబై కేంద్రంగా రియల్ ఎస్టేట్ సర్వీసులు అందించే బ్రోకర్ నెట్‌వర్క్‌లో మొత్తం 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, గత ఏడాది నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వ లేదని సమాచారం. కానీ, ఆ సంస్థ ముంబై లగ్జరీ హోటల్ తాజ్ ల్యాండ్స్ నిర్వహించే ఒక రోజు బోర్డ్ మీటింగ్ పెట్టే ఖర్చు అక్షరాల రూ.81,000. రాహుల్ తన ఇంట్లో వినియోగించే ఫర్నీచర్, గృహోపకరణాలు, ఖరీదైన లగ్జరీ కార్లును కొనుగోలు చేశారు.
ఇక, ఉద్యోగులకు జీతాల చెల్లింపులోనూ బ్రోకర్ నెట్‌వర్క్ ఫౌండర్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సిబ్బందికి చెల్లించే వేతనాలను సైతం వారి పేర్లమీద పర్సనల్ లోన్లు తీసుకొని జీతాలు ఇచ్చేవారు. ఉద్యోగుల నుంచి లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారని, అలా అప్పు చెల్లించకపోవడంతో ఓ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఆ సంస్థ ఫౌండర్ 18 నెలల్లో రూ.280 కోట్లకు ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఇప్పుడీ అంశం రియల్ ఎస్టేట్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment