వ్యక్తిగత రుణం అనేది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే అసురక్షిత రుణం. అందుకే, వ్యక్తిగత రుణాల మీద వడ్డీ రేట్లు అనేవి సాదారణంగా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
ఎక్కువ శాతం అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 8.15% నుంచి ప్రారంభమై 14% వరకు ఉంటాయి. ఇవి 12-60 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వ్యక్తిగత రుణాల రేట్లు 9.6% నుంచి ప్రారంభమై 15.65% వరకు ఉంటాయి. ఇవి 6-72 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.20 లక్షల మధ్య అప్పు ఇవ్వవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం.
తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..!
వ్యక్తిగత రుణంపై గరిష్ట మరియు కనీస పరిమితి ఎంత?
అప్పు తీసుకోగల కనీస, గరిష్ట పరిమితి మొత్తం అనేది ప్రతి బ్యాంకుకు మారుతుంది. ఉదాహరణకు, వేతన జీవులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చని ఎస్‌బీఐ తన వెబ్ సైట్లో పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయని తన వెబ్ సైట్లో తెలిపింది. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ ప్రకారం.. మీ క్రెడిట్ విలువను బట్టి మీరు రూ.75,000 మరియు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.
(చదవండి: జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..)
వ్యక్తిగత రుణానికి ఎవరు అర్హులు?
వ్యక్తిగత రుణ అర్హత ఆవశ్యకతలు ఒక బ్యాంకుతో పోలిస్తే మరో బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ఎస్‌బీఐ వెబ్ సైట్ ప్రకారం.. వ్యక్తిగత రుణానికి అర్హత పొందడానికి కనీసం నెలవారీ ఆదాయం రూ.15,000 ఉండాలి. వ్యక్తిగత రుణం కొరకు మీ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. వ్యక్తులు కనీసం 2 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తూ.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంది. నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.25,000 ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.
వ్యక్తిగత రుణాల కాలపరిమితి ఎంత?
వ్యక్తిగత రుణాల కాలపరిమితి అనేది ప్రతి బ్యాంకును మారుతుంటాయి. బ్యాంకులు వంటి రుణ సంస్థలు తరచుగా గరిష్టంగా ఐదు సంవత్సరాలకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి.
వ్యక్తిగత రుణంలో ఇమిడి ఉన్న ఛార్జీలు ఏమిటి?
ఒక బ్యాంకు లేదా ఎన్‌బిఎఫ్‌సి సంస్థలు వ్యక్తిగత రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర రెగ్యులేటరీ ఫీజులను వసూలు చేస్తాయి. అదేవిధంగా, రుణదాతపై ఆధారపడి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఫీజు కూడా విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment