ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే... | SBI ATM card expired but bank not reissue automatically why | Sakshi
Sakshi News home page

SBI Debit Card: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...

Published Sun, Aug 27 2023 8:10 PM | Last Updated on Sun, Aug 27 2023 8:15 PM

SBI ATM card expired but bank not reissue automatically why - Sakshi

ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. 

సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్‌బీఐ కస్టమర్‌కు విభిన్న అనుభవం ఎదురైంది.  దీనిపై ఆ కస్టమర్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

(ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌! ఇకపై మరింత..)

ఆ కస్టమర్‌కు ఎస్‌బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్‌ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్‌గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్‌ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్‌ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..

దీంతో ఎక్స్‌ (ట్విటర్‌)లో ఎస్‌బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్‌బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. 

కొత్త కార్డు ఆటోమేటిక్‌గా రావాలంటే.. 

  • ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అకౌంట్‌ అయి ఉండకూడదు.
  • డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి.
  • అకౌంట్‌కు కస్టమర్‌ పాన్‌ నంబర్‌ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement