Are You Looking Instant Personal Loan Without Documents, in Telugu - Sakshi
Sakshi News home page

అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే (స్పాన్సర్డ్‌)

Published Mon, Oct 19 2020 2:55 PM | Last Updated on Mon, Dec 21 2020 11:45 AM

Need Money Urgently An Instant Personal Loan Can Help - Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రాణాంతక కోవిడ్‌-19 ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతమైన కారణంగా ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడింది. నిరుద్యోగ పరిస్థితులు, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థికపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆదాయం తగ్గడం, అవసరాలు పెరిగిన సందర్భాల్లో పొదుపు మొత్తాలు లేదా పెట్టుబడుల కోసం జమ చేసిన డబ్బును ఖర్చు పెట్టేందుకు చాలా మంది సిద్ధపడతారు. అయితే అన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు. ఇలాంటి ఆపత్కర సమయాల్లో నమ్మకమైన రుణదాత ఇచ్చే వ్యక్తిగత రుణం(పర్సనల్‌ లోన్‌) ఎంతగానో దోహపడుతుంది. ఈ లోన్లు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునే ముందు అసలు వ్యక్తిగత రుణాలు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణాలు- ఒక సులభమైన పరిష్కారం
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు, మీరు తీసుకునే రుణానికి హామీగా, ఏదీ తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండానే వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తాయి. అందుకే చాలా మంది పర్సనల్‌ లోన్‌ తీసుకునేందుకే మొగ్గుచూపుతారు. ఇతరత్రా సెక్యూర్డ్‌ ఫైనాన్సింగ్‌తో పోల్చితే ఈ లోన్‌ పొందడం ఎంతో సులభం. రుణం కోసం దరఖాస్తు మొదలు లోన్‌ మంజూరై డబ్బు పంపిణీ జరిగే వరకు అంతా అతి తక్కువ వ్యవధిలోనే జరిగిపోతుంది కూడా. ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ కూడా చాలా స్పష్టంగా ఉన్న కారణంగా లోన్‌ ప్రాసెసింగ్‌ కూడా తొందరగా పూర్తవుతుంది. కాబట్టి అత్యవసర సమయాల్లో వ్యక్తిగత రుణం తీసుకోవడం ఒక తెలివైన నిర్ణయంగా చెప్పవచ్చు. నిమిషాల వ్యవధిలోనే లోన్‌ అప్రూవ్ అవడమే గాక, అంతేవేగంగా పంపిణి కూడా జరిగిపోతుంది. డబ్బు నేరుగా మన చేతికి అందుతుంది.

వ్యక్తిగత రుణాలు- ప్రయోజనాలు

  • రుణానికి హామీగా రుణదాత దగ్గర ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు.
  • పేపర్‌ వర్క్‌ తక్కువ
  • దరఖాస్తు ఆమోదంలో కూడా ఎలాంటి జాప్యానికి అవకాశం ఉండదు
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇప్పుడు చాలా వరకు పేపర్‌లెస్‌(భౌతికంగా ఎటువంటి పేపర్లు నింపాల్సిన అవసరం ఉండదు) అంటే సాఫ్ట్‌కాపీలు సబ్‌మిట్‌ చేస్తే సరిపోతుంది.

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో మరింత సులభంగా..

  • ఒకవేళ మీరు గనుక బజాజ్‌ ఫిన్‌సర్వ్‌‌ వంటి ప్రఖ్యాత రుణసంస్థలకు చెందిన ఖాతాదారులు అయితే ఎలాంటి పేపర్‌వర్క్‌ కూడా అవసరం లేదు. మీరు, మీ ముందస్తు ఆమోదిత ఆఫర్‌ను నిమిషాల్లో చెక్‌చేసుకుని అత్యంత సులభంగా, అంతే వేగంగా మీకు అవసరమైన డబ్బును పొందవచ్చు.
  • ఇక మీ రిక్వెస్టు ఆమోదం పొందిన వెంటనే బజాజ్‌ ఫిన్‌సర్వ్ పర్సనల్‌ లోన్ డబ్బు అతివేగంగా పంపిణీ చేయబడుతుంది. ముందస్తు ఆమోదిత ఆఫర్‌ పొందిన అర్హులకు కేవలం 20 నిమిషాల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ అవుతుంది.
  • అయితే మీరు గనుక కొత్త ఖాతాదారులు అయితే 24  గంటల్లోపు వ్యక్తిగత రుణం మొత్తం బదిలీ అవుతుంది. ఇక ఈ ప్రక్రియ అంతా కూడా మీ ఇల్లు లేదా ఆఫీసులో మీ పనులు చక్కదిద్దుకుంటూనే పూర్తి చేయవచ్చు.

చెల్లింపు ప్రక్రియలో కూడా లాభదాయకమైన సౌకర్యం
పర్సనల్‌ లోన్స్‌ వల్ల అత్యవసర సమయంలో తక్షణమే డబ్బు చేతికి రావడమే గాకుండా, రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించిన విషయంలో కూడా అనేక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ విషయాన్ని తీసుకుంటే, రుణాల తిరిగి చెల్లింపు వ్యవధి 60 నెలల వరకు ఉంటుంది. అంతేకాదు ఫ్లెక్సీ హైబ్రిడ్‌ సదుపాయం ద్వారా ఈఎంఐ భారాన్ని 45 శాతం వరకు తగ్గించుకోవచ్చు. రుణం తీసుకున్న ప్రారంభ దశలో కేవలం వడ్డీ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవడం కేవలం వడ్డీ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇక మీకు మంజూరైన మొత్తంపైగాకుండా మీరు వాడుకున్న మొత్తంపై మాత్రమే వడ్డీ విధించడం అనేది మరింత ప్రయోజనకరమైన అంశం. డబ్బు అవసరమైనపుడు తగిన మొత్తం తీసుకోవడం సహా మీ దగ్గర డబ్బు ఉన్నపుడు పాక్షిక చెల్లింపు జరిపే అవకాశం ఉంటుంది.

అంతేకాదు లోన్‌ అప్లై చేయడానికి ముందే మీ నెలవారీ చెల్లింపు ఎంత ఉంటుందనేది ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్‌ కాలిక్యులేటర్‌ ద్వారా మీ వ్యక్తిగత లోన్‌ ఈఎంఐ లెక్కించుకోవచ్చు. తద్వారా మీరు కోరుకునే రుణమొత్తానికి, అదే విధంగా తిరిగి చెల్లించగలిగే ఈఎంఐని ప్లాన్‌ చేసుకుని, మీకు అనుకూలమైన బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. 

రూ. 25 లక్షల వరకు రుణం పొందవచ్చు
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌.. దేశంలోని అత్యంత వైవిధ్యభరితమైన బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీల్లో ఒకటి. సులువైన, ఇబ్బందుల్లేని లోన్‌ ప్రాసెస్‌తో కూడిన అనేక ఆకర్షణీయమైన అంశాలతో తక్షణ వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. దీని ద్వారా రూ. 25 లక్షల వరకు రుణం పొందండి. 60 నెలల వరకు మీకు సౌకర్యవంతమైన వ్యవధిని ఎంచుకుని రుణాన్ని తిరిగి చెల్లించండి. అర్హులైన ఖాతాదారులు 100% డిజిటల్‌ ప్రాసెస్‌ ప్రయోజనాన్ని అందిపుచ్చుకుని బ్రాంచీకి వచ్చే అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే రుణాన్ని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం! నేడే మీ ప్రీ- అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ చెక్‌ చేసుకోండి. నిమిషాల వ్యవధిలోనే తక్షణ వ్యక్తిగత రుణాన్ని పొందండి. (Advertorial)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement